
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‍వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరీ నందిని పిరమల్?
నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.

నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.

2010లో నందిని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.

కుటుంబ వ్యాపారంలోకి అడుగు
నందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.

ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‍వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది.
Comments
Please login to add a commentAdd a comment