దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్‌సెట్‌జీ నుస్సర్వాన్‌జీ టాటా' (జంషెడ్‌జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్
1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా 'నవాజ్‌బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్‌జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది.
ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్‌స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది.
నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్‌బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు.
ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్
టాటా సంస్థ పురోగతికి నవాజ్‌బాయి ఎంతో కృషి చేసింది. జమ్‌సెట్‌జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment