Interesting stories
-
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‌వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
అనిల్ అంబానీ పిల్లలు ఆ బిజినెస్‌లో.. ఒకప్పుడు లగ్జరీ కార్లలో!
ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన అందరికీ.. దాదాపు అనిల్ అంబానీ కుటుంబం గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే.. అనిల్ అంబానీ పిల్లలు ఇద్దరూ మీడియాకు కొంత దూరంగా ఉంటారు. ఈ కథనంలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ, కొన్ని సొంత నిర్ణయాల వల్ల భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, టీనాలకు ఇద్దరు కుమారులు. వారే 'జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ'. వీరిరువురు చాలావరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు.జై అన్మోల్ అంబానీ.. అనిల్ అంబానీ, టీనాల పెద్ద కొడుకు. 1991 డిసెంబర్ 12న జన్మించిన ఈయన ముంబైలోని ప్రసిద్ధ కేథడ్రల్, జాన్స్ కాన్వెంట్ స్కూల్ నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆ తరువాత యూకేలో సెవెన్ ఓక్స్ స్కూల్లో చేరారు. 18 ఏళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇంటర్న్‌షిప్ ప్రారంభించారు.చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లోనే పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవి చేపట్టారు. ఆ తరువాత వివిధ పదవులను చేపట్టారు.ఇక అనిల్ అంబానీ రెండో కుమారుడు జై అన్షుల్ అంబానీ విషయానికి వస్తే.. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్‌లో కూడా పనిచేశారు. ఆ తరువాత 2019లో జై అన్మోల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు.జై అన్మోల్, జై అన్షుల్ ఇద్దరికీ లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వీరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌కే350, లంబోర్ఘిని గల్లార్డో, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. కార్లు మాత్రమే కాకుండా వీరి వద్ద హెలికాఫ్టర్లు కూడా ఉండేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సిన విషయం. -
ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి!
ముఖేష్ అంబానీ గురించి తెలిసిన చాలా మందికి 'అనిల్ అంబానీ' గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ముకేశ్ అంబానీ ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ముఖేష్ అంబానీ మాదిరిగానే.. అనిల్ అంబానీ కూడా ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉండేవారు. ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు.. ముందుచూపు లేని వ్యాపారాలు చేయడం వల్ల సంపన్నుల జాబితా నుంచి లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయిన స్థితికి చేరారు. సరైన ప్రణాళిక, విజన్ లేకుండా ఏకకాలంలో అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికామ్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాలలో గొప్ప సక్సెస్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేక పోయాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం వంటివి కుబేరుడైన అనిల్ అంబానీని అప్పుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది. అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, తిరిగి చెల్లించలేకపోయారు. మూడు బ్యాంకులకు సుమారు రూ.5446 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన లండన్ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో చెప్పుకున్నారు. ఈయన మొత్తం అప్పు దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలు కూలిపోతాయి అనటానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ. ఇదీ చదవండి: వెయ్యి రూపాయలకు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చాడు.. నువ్వు దేవుడు సామీ! లాయర్ల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల.. అతను తన భార్య బంగారు నగలను అనిల్ అంబానీ విక్రయించినట్లు సమాచారం. తనకు కారు తప్ప మరేమీ లేదని, సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని ఆయన చెప్పుకున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి అతని మొత్తం సంపద దాదాపు రూ. 250 కోట్లు, ముంబైలో 17 అంతస్తుల ఇంటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ క్రెడిట్ అంతా ఆమెదే! జియో ఆలోచనకు బీజం పడిందిలా..
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ ఏది అంటే రిలయన్స్ జియో అని టక్కున చెప్పేస్తాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 2023 డిసెంబర్లో 3.99 మిలియన్ల మంది యాజర్లను సంపాదించి అతిపెద్ద విజేతగా నిలిచింది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ బేస్ 459.81 మిలియన్లకు పెరిగింది. అయితే ఈ జియో ఏర్పాటుకు బీజం ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. దేశంలో అత్యంత సంపన్నుడు, దేశ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన టెలికాం దిగ్గజం జియో వెనుక ఉన్న ముఖేష్ అంబానీ.. 2018లో లండన్‌లో జరిగిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్‌లో తన అంగీకార ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ క్రెడిట్ ఇషాదే.. 2011లో జియోను ప్రారంభించడం వెనుక తన కుమార్తె ఇషా అంబానీ ఉన్నారని, ఆ క్రెడిట్ అంతా ఆమెదే అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అప్పుడు యేల్లో చదువుతున్న ఇషా అంబానీ సెలవులకు ఇంటికి వచ్చింది. వారి నివాసంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం ఆమెను అసహనానికి గురి చేసింది. అదే కోట్లాది మంది భారతీయులకు సరసమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే సంచలనాత్మక ఆలోచనకు దారితీసింది. ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఇలా పంచుకున్నారు. "2011లో నా కుమార్తె ఇషా ద్వారా జియో ఆలోచనకు బీజం పడింది. ఆమె యేల్లో చదువుకుంటున్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చింది. కోర్స్‌వర్క్ చేసుకుంటుండగా ఇంట్లో ఇంటర్నెట్ సక్రమంగా రాలేదు. దీంతో 'నాన్న , మన ఇంట్లో ఇంటర్నెట్ పోయింది' అని చెప్పింది" అని అంబానీ చెప్పుకొచ్చారు. తన పిల్లలు ఇషా, ఆకాష్‌లు.. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రపంచ స్థాయిలో రాణించడానికి పోటీ పడుతున తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకొచ్చిన ముఖేష్ అంబానీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అనేది దేశానికి అత్యంత ఆవశ్యకరమైన అంశమని తనను వారే ఒప్పించారని వివరించారు. -
TS: చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే..
తెలంగాణ ఎన్నికల చరిత్ర.. ఆసక్తికర సమాచారం ఈ రోజుల్లో ఏకగ్రీవ ఎన్నికలు అంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఒకప్పుడు కొందరు నేతలు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నది అతిశయోక్తి కాదు. తెలంగాణకు సంబందించినంతవరకు చివరి ఏకగ్రీవ ఎన్నిక 2002 సంవత్సరంలో జరిగింది. దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత ధీరావత్ రాగ్యానాయక్ నక్సల్స్ కాల్పులలో మరణించారు. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. మరణించిన రాగ్యానాయక్ గౌరవార్దం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశంతో పాటు, ఇతర రాజకీయ పార్టీలు ఈ మేరకు నిర్ణయించాయి. అంతకుముందు కూడా పలు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో సుమారు ఇరవై మంది ఇంతవరకు ఇలా ఎన్నిక కాగలిగారు. ఈ ఏకగ్రీవ ఎన్నికలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరగడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కూడా ఒకసారి ఉప ఎన్నికలో పోటీ లేకుండా శాసనసభకు నెగ్గారు. 1972 లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో ఎక్కువ మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో యునానిమస్‌గా ఎన్నికైనవారిలో కోదాటి రాజమల్లు(చెన్నూరు), పి.నర్సారెడ్డి(నిర్మల్), జి.గడ్డెన్న(ముధోల్), ఎస్.భూపాల్(అమరచింత), ఎన్.రామచంద్రారెడ్డి(డోర్నకల్ ))కళ్యాణి రామచంద్రరావు(మక్తల్) ఎమ్.మాణిక్యరావు(తాండూరు) ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మరికొందరు ప్రముఖులు ఉన్నారు. టి.రంగారెడ్డి(ఆర్మూరు-1962), జి.రాజారామ్(బాల్కొండ-1967), సీతాకుమారి(బాన్స్ వాడ-1957),కె.లక్ష్మినరసింహారావు(జగిత్యాల-1967),టి.అంజయ్య(రామాయంపేట-1981),వీరాస్వామి(కొడంగల్-1952), పద్మనాభరెడ్డి (వనపర్తి-1957) ఆర్.సురేంద్రరెడ్డి(డోర్నకల్ -1974), కె.రాంభూపాల్ (గద్వాల- 1962),పి.మహేంద్రనాద్ (నాగర్ కర్నూల్ -1957), ఎన్.యతిరాజారావు(చెన్నూరు-1975), కె.రామయ్య(బూర్గంపాడు-1968) మొదలైనవారు ఉన్నారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైవారంతా కాంగ్రెస్‌కు చెందినవారే కావడం విశేషం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఏకగ్రీవ ఎన్నిక కూడా జరగలేదు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రతన్ టాటా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఎవరీ నవాజ్‌బాయి టాటా!
దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్ 1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా 'నవాజ్‌బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది. ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది. నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్‌బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ టాటా సంస్థ పురోగతికి నవాజ్‌బాయి ఎంతో కృషి చేసింది. జమ్సెట్జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు. -
కరోడ్‌పతి చాయ్‌వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. -
వెరీ గుడ్ డూడులర్స్
రోజూ గూగుల్‌లో ఆకట్టుకునే డూడుల్స్ చూస్తుంటాం. అయితే యూత్‌కు అవి ‘ఆహా’లు మాత్రమే కాదు అనేక రకాలుగా ఇన్స్పిరేషన్లు. డూడులింగ్లో తమదైన శైలిని సృష్టించుకుంటున్నారు. విశేషం ఏమిటంటే డూడులింగ్ అనేది వారి దృష్టిలో కళాప్రక్రియ మాత్రమే కాదు. ధ్యానం కూడా! ఏదో ఒక అవసరానికి యూత్ వేళ్లు గూగుల్‌పైన ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వారిని ‘డూడుల్స్’ కట్టిపారేసాయి. క్రియేటివిటీని తట్టి లేపాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయ కుందు రోజువారి జీవితానికి సంబంధించిన సంఘటనల్లో నుంచి డూడుల్స్ రూపొందిస్తుంటుంది. ‘శ్రేయాడూడుల్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు శ్రేయాకు వందల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ‘ఊహించని ఆదరణ ఇది’ అంటుంది శ్రేయ. ఫన్నీ బ్లాగ్స్, పుస్తకాలు చదవడం, సిట్కామ్లు వీక్షించడం అంటే ఇష్టపడే శ్రేయ భవిష్యత్ లక్ష్యం... డూడులర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం. భోపాల్‌కు చెందిన తేజస్విని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఎప్పటికప్పుడు గూగుల్ డూడుల్స్ ఫాలో కావడం అంటే ఎంత ఇష్టమో, తనదైన శైలిలో గీయడం అంటే కూడా అంతే ఇష్టం. ‘సరదాగా పరిచయం అయిన డూడుల్ ఇప్పుడు నన్ను నేను సరిచేసుకోవడానికి ఉపకరిస్తుంది. టెన్షన్‌గా అనిపించినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, పరీక్షల సమయంలో ఒత్తిడిగా అనిపించినప్పుడు డూడుల్స్ గీస్తుంటాను. ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది’ అంటుంది తేజస్విని. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన కొందరు డూడులర్స్ గురించి... సాధ్య తన డూడులింగ్ స్కిల్స్‌తో నెటిజనులను ఆకట్టుకుంది. వాటర్ కలర్స్, కాలిగ్రఫీ తన ప్రత్యేకత. ‘కాలిగ్రఫీలో డూడుల్స్‌ను చూడడం కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. భావోద్వేగాలు, ఇన్స్పైరింగ్ పాయింట్స్‌ను ఆధారంగా చేసుకొని డూడుల్స్ గీస్తుంటుంది సాధ్య. ఆహా అనిపించడానికే కాదు ఆలోచింపజేయడానికి కూడా డూడుల్ ఉపయోగపడాలి అనేది ఆమె అభిప్రాయం. ‘వెన్ లైన్స్ మెట్ సర్కిల్స్’ అంటున్న సంజమ్ బగ్గా డూడుల్స్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన ప్యాషన్‌ను బిజినెస్ వెంచర్‌గా మార్చి విజయం సాధిస్తుంది సంజమ్. అనఘ దండేకర్ డూడుల్స్కు ప్రత్యేక ఆకర్షణ ఫ్యాన్సీ ఫాంట్స్, కలర్స్. ‘సబ్జెక్ట్‌తో పాటు ఫామ్ కూడా బాగుండాలి’ అనేది ఆమె థియరీ. అబ్స్ట్రాక్ట్ ఫామ్‌ను, డూడుల్‌కు జోడించి ‘డూడుల్ డబ్బా’ పేరుతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఖుష్బు. ఫైన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన టాంజిల సామాజిక సందేశానికి డూడుల్ ను వాహికగా చేసుకుంది. తన దృష్టిలో డూడులింగ్ అనేది ఆర్ట్ ఫామ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. డూడులింగ్ తనకు ధ్యానం లాంటిది. చిత్ర అయ్యర్‌కు బాల్యం నుంచి చిత్రకళతో అనుబంధం ఉంది. కాస్త ఆలస్యంగానే ‘డూడుల్ మేకింగ్’లోకి వచ్చింది. ‘గడ్డు కాలంలో నాకు డూడులింగ్ ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక దశలో డిప్రెషన్ బారినపడ్డప్పుడు అందులో నుంచి బయటికి రావడానికి బలమైన శక్తిని ఇచ్చింది’ అంటుంది చిత్ర. ఆసక్తి నుంచి సరదాగా మొదలైన డూడులింగ్ ఇప్పుడు అనేక రూపాల్లో యూత్‌కు దర్శనమవుతుంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ మరింత దగ్గరవుతుంది. ఆత్మీయనేస్తం అవుతుంది. -
ఈ రోజుల్లో ట్రెండ్ ఇదే.. ప్రణయం@ పార్క్
‘ఇంట్లోవాళ్లకి ఏం చెప్పి వచ్చావు?’ ‘చెప్పడానికి బోలెడు అబద్ధాలుంటాయి. స్నేహితురాలికి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. నమ్మేసి ఉత్త చేతులతో వెళ్లకూడదని, పళ్లు పట్టుకెళ్లమని డబ్బులు కూడా ఇచ్చింది మా అమ్మ’ పర్సులో ఉన్న డబ్బుల్ని చూపిస్తూ చెప్పి మళ్ళీ అతని వైపు తిరిగి ‘ఇంతకీ నువ్వేమని చెప్పావు?’ అడిగింది చంచల నవ్వుతూ. ‘ఫ్రెండుకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను. నాకూ డబ్బులిచ్చారు’ అంటూ పకపకా నవ్వాడు విశాల్. అతని వైపు ఆరాధనగా చూసింది చంచల. అతని నవ్వు ప్రవాహపు ఒరవడిలా పెద్దగా చప్పుడు చేస్తూ సాగుతుంది. మధ్య మధ్యలో ఆగుతూ శరీరాన్ని మొత్తంగా కదిలిస్తూ అతను నవ్వుతుంటే ఆమెకి ఎంతో ఇష్టం. అతను నవ్వుతున్నప్పుడల్లా చంచల మనసు చంచలమవుతుంది. దేహాన్ని ఎవరో ఈడ్చుకుని కొత్తదారుల వెంట లాక్కుపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. పరిచయం కొద్దికాలానిదే అయినా పరవశం జీవితకాలపు పరిమళంలా అనిపిస్తుంటుంది. ‘ఇలా కలవడానికి ఇంకెంతమందిని చంపాలో? ఎంతమందికి యాక్సిడెంట్లు జరగాలో?’అంది చంచల అతని వైపు చూస్తూ. ‘అబద్ధాలు చెప్పకపోతే ఇంటరు ఆఖరులో ఉన్న నువ్వు, డిగ్రీ మొదట్లో ఉన్న నేను కలవడాన్ని ఎవరు ఒప్పుకుంటారు? అందరితో పోలిస్తే మనం చాలా బెటర్. కనీసం కాలేజీ మెట్లయినా ఎక్కాం. లోకమంతా ఏడు, ఎనిమిది తరగతుల్లోనే కళ్లుతెరుస్తోంది. అవసరాలు తీర్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పడంలో తప్పులేదని పెద్దలు ఏనాడో చెప్పారు. అయినా ఇలా అబద్ధాలు చెప్పి దొంగచాటుగా కలవడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను. ఇప్పటికే మా క్లాస్మేట్స్ అందరూ మనిద్దరినీ చూసి కుళ్లుకుని చచ్చిపోతున్నారు’ అన్నాడు విశాల్. ‘ఏమంటున్నారో మన గురించి నీ క్లాస్మేట్స్?’ అడిగింది. ‘ఇంత అందగత్తెని ఎలా పడగొట్టావో టిప్స్ చెప్పమంటున్నారు’ అన్నాడు ఆమె కళ్లల్లోకి చూస్తూ. చంచల పెద్దగా నవ్వింది. తుఫానుగాలికి తెరచాప ఊగినట్లుగా కదిలిపోయాడు విశాల్. ఆ నవ్వుని ఆపుకుంటూ ‘వాళ్ల కేం చెప్పావు?’ అడిగింది. ‘నీకు తెలియదా? నేను ఎంత కష్టపడితే నువ్వు నా పక్కనున్నావో!’ చిలిపిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. కొద్దిరోజుల కిందట జరిగిన సంఘటనలన్నీ ఆమె మనసులో మెదిలాయి. కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎదురుపడే విశాల్‌ని చూసి తల దించుకునేది. కావాలని ఎదురుగా వచ్చి ‘తలెత్తి చూస్తే మాలాంటి ప్రాణాలు కొన్ని నిలబడ తాయిగా’ అన్నాడొకరోజు. ఎంతాపుకుందామన్నా నవ్వాగలేదు చంచలకు. ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అది మొదలు చంచల కనబడినప్పుడల్లా ఆమె నవ్వు మీదో, కళ్లమీదో, పలువరుస మీదో ఏదో ఒకటి మాట్లాడి నవ్వించేవాడు. అలా మొదలైన పరిచయం ఏ పేరు పెట్టుకోవాలో తెలియకుండానే చంచలను విశాల్‌కి దగ్గర చేసింది. చేతివేళ్ళతో చిటికె వేస్తూ ‘ఎక్కడికెళ్దాం ఇప్పుడు?’ అడిగాడు. ఆలోచనలో నుంచి బయటికి వచ్చి ‘నీకెలా తోస్తే అలానే! నాదేముంది?’ అంది చంచల. ‘సరే అయితే... పార్కుకెళ్దాం’ అన్నాడు విశాల్. అతని వంక కంగారుగానూ, భయంగానూ చూస్తూ ‘అమ్మో... పార్కుకా? నేను రాను’ అంది. ‘ఇష్టమైనవాణ్ణి చూడడానికి ఇన్ని అబద్ధాలు చెప్పిన నీకు పార్కంటే భయమెందుకు?’ అడిగాడు విశాల్. ‘నాలుగ్గోడల మధ్య అబద్ధం చెప్తున్నామని, నలుగురిలోనూ అలాగే తిరుగుతామా? తెలిసినవాళ్ల కంట్లో పడితే అంతే సంగతులు. రేపటినుంచి కాలేజీకీ కష్టమే..’ అంది. ‘ఓ అదా నీ భయం! కంగారుపడకు. లోకం గుడ్డిది. కళ్ల ముందు కలసి తిరుగుతున్నా పట్టించుకోదు. లోకానికి కళ్ళుంటాయిగానీ చూపుండదు. అందుకే వాళ్లముందు పడీపడీ నవ్వినా, కిందపడి దొర్లినా వాళ్లకు పట్టదు’ అన్నాడు. ‘నువ్వెన్ని చెప్పినా నా భయాలు నాకుంటాయి కదా’ అంది. ‘పేరంటానికొచ్చి ముఖం దాచుకుంటే ఎలా? పలకరించకపోయినా పదిమంది వస్తారు. నడిచేదారిలో నలుగురూ ఎదురౌతారు. అలాగని నడక ఆపుకుంటామా?’ అన్నాడు విశాల్ భుజాలెగరేస్తూ. చంచల తెరలు తెరలుగా నవ్వింది. కళ్లల్లో నీళ్ళు చిప్పిల్లేలా నవ్వింది. విశాల్ ఎప్పుడూ అంతే! మాటల్లో తెలియని మాధుర్యం ఉంటుంది. చెప్పే విషయంలో ఏదో అర్థంగాని లాజిక్ ఉంటుంది. ఆ ఇష్టమే అతనితో పరిచయాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చింది. ఇంట్లోవాళ్లకు భయపడకుండా అబద్ధాలు చెప్పడానికి, సంఘంలో విశాల్‌తో కలసి భయంలేకుండా తిరగడానికి అడుగులు నేర్పింది. ∙∙ ‘పార్క్ మనకోసమే తెరచినట్లున్నారు’ అంది చంచల. ‘మనలాంటి వాళ్లు చాలామంది ఉంటారులే’ అన్నాడు విశాల్. ‘బైక్ ఉంటే బాగుండేది. ఆటోలో వచ్చేసరికి ఒళ్లంతా హూనమైపోయింది’ అంది చంచల. ‘అబద్ధాలన్నీ ఆయిల్‌కే ఖర్చు చేస్తే నిజానికి నీడెక్కడ దొరుకుతుంది? అయినా ఇక్కడికొచ్చాం కదా ... సర్దుకుని కూర్చుంటే అన్నీ పోతాయిలే కంగారుపడకు’ అన్నాడు విశాల్.పార్కంతా కలయజూసిన చంచలకు విశాల్ ఆ మాట ఎందుకన్నాడో అర్థమైంది. సిమెంట్ బెంచీలనిండా చీమలబారుల్లా సేదదీరుతున్న ప్రేమికులు కనిపించారు. చెట్టు మొదళ్లలోనూ, క్రోటన్ మొక్కల గుబుర్లలోనూ, గోడల చాటునా, పార్కులో సగం నిర్మాణంలో ఉన్న కట్టడాల మధ్యలోనూ చున్నీలను గొడుగులా మార్చుకుని పరవశంలో ఉన్న జంటలు కనిపించాయి. ఎవర్ని ఎవరూ పట్టించుకుంటున్న ఆనవాళ్ళు లేవు. ఎవరితో ఎవరూ మాట్లాడుకుంటున్న దాఖలాలు లేవు. ఒకరి వేలు ఎటువైపు చూపిస్తే రెండోవాళ్లు అటు చూస్తున్నారు. చేతిలో చేయి వేసుకుని, ఆ చేతిని గట్టిగా పట్టుకుని, ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ మైమరచిపోతున్నారు. అవకాశమేదో వెంటబడి తరుముతున్నట్లు, విడిచిపెడితే ఇక దొరకదన్నట్లుగా ఉన్నారందరూ. ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు పిల్లల్ని ఆడిస్తున్న పెద్దవాళ్ళు పిల్లలు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ ఆయాస పడుతున్నారు. చేతికర్రలతో ఉన్న ముసలివాళ్ళు కాసేపు నడుస్తూ, మధ్యమధ్యలో కూర్చుంటూ నడుస్తున్నారు. ఆకాశం నిండా గుంపులు గుంపులుగా ఎక్కడికో తరలిపోతున్న పక్షులు కనిపించాయి. ‘తొందరగా నడువు. ఎవరైనా చూస్తారు’ అంది చంచల. ‘నేను చెప్పానుగా లోకం గుడ్డిదని. ఇక్కడ నిన్నెవరూ పట్టించుకోరు. పట్టించుకున్నా పలకరించరు. నోళ్ళకు తాళాలు బిగించి కళ్లకు వాకిళ్లు తెరిచేది ఇక్కడే’ అన్నాడు విశాల్. ఇద్దరూ నవ్వుకుంటూ పార్కులో ఎక్కడైనా ఖాళీ ఉందేమోనని చుట్టూ చూశారు. బట్టలకంటిన ఆకుల్ని, మట్టినీ దులుపుకుంటూ వెళ్లడానికి సిద్ధమైన జంట కనిపించేసరికి ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. విడవలేకుండా పట్టుకున్న రెండు చేతుల్నీ, నడుస్తున్న నాలుగు కాళ్లనూ చూస్తూ వాళ్ళు ఖాళీచేసిన ప్రదేశంలో కూర్చున్నారిద్దరూ. అప్పటివరకూ అణిగిపోయిన పచ్చగడ్డి మళ్ళీ పైకిలేచి ఇద్దర్నీ ఆహ్వానించింది. ‘మాట్లాడు ఏదైనా... నిశ్శబ్దంగా ఉండడానికి ఇదేమీ క్లాసు రూము కాదు’ అన్నాడు విశాల్. ‘ఏం చెప్పమంటావు? పదిహేడులో నేను, పద్దెనిమిదిలో నువ్వు...’ ‘ఆపాపు ఇక. నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. ఇరవైల్లో చేయాల్సిన పనులు ఇరవైల్లోనే చెయ్యాలి. అరవై వచ్చాక బట్టబుర్ర, పడకుండా నడవడానికి చేతిలో కర్రా ఎలాగూ తప్పవు కదా!’ అన్నాడు నవ్వుతూ. చంచల మళ్ళీ నవ్వింది. చెట్టు నుంచి ఆకులేవో రాలిపడుతున్నట్లుగా, రబ్బరు ట్యూబులో నుంచి నీళ్ళు వేగంగా కదులుతున్నట్లుగా అనిపించింది. ఆమె వంక అబ్బురంగా చూస్తూ ‘పార్కుకొచ్చేముందే అబద్ధాలు చెప్పి అందర్నీ హత్య చేయాలిగానీ ఇక్కడికొచ్చి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక్కడి కబుర్లన్నీ మనకు చెందినవే ఉండాలి. లోకమంతా మన అరచేతిలో ఉండాలి. గాలికూడా చొరబడనంత దగ్గరగా జరగాలి. నా ఊపిరి నీకూ, నీ ఊపిరి నాకూ మాత్రమే వినిపించాలి. ఏవో కొత్త కబుర్లతో ఒకరి చెవుల్ని ఒకరు మృదువుగా స్పృశించాలి. ఇదిగో ఇలా దగ్గరగా వచ్చి బుగ్గల్ని సున్నితంగా ముద్దు...’ ‘ఆపాపు.. నలుగురిలో ఇలా...’ దగ్గరకు వస్తున్న విశాల్‌ని వెనక్కి తోసి ‘వదిలితే ఇక్కడున్న వాళ్లందరి మాటలూ నువ్వే మాట్లాడేటట్లున్నావు’ అంది చంచల. ‘ఇన్నాళ్ళూ ఈ మాటలు ఎక్కడికెళ్లాయో! నిన్ను చూడగానే బయటికి తన్నుకొస్తున్నాయి’ అన్నాడు విశాల్. ‘ఏదో ఇవన్నీ మొదట నాకే చెప్తున్నట్లు అంటున్నావే’ అంది చంచల. ఆమె అనాలోచితంగానే అంది. అయినా ఆ మాటలు విని గతుక్కుమన్నాడు విశాల్. చెట్టుకి జారబడిన వాడు సర్దుకుని కూర్చున్నాడు. ఒకప్పుడు చందనతో కలసి ఆ పార్కుకి వచ్చిన ఙ్ఞాపకాలు మనసులో మెదిలాయి. ఇంత కన్నా ఎక్కువ కబుర్లు వాగులా ప్రవహించాయి. ఇప్పుడు ఆ ఙ్ఞాపకాలన్నీ కాగితం పడవల్లా అదే వాగులో కొట్టుకు పోయాయి. పార్కుకెప్పుడొచ్చినా కొత్తగానే ఉండాలి, కొత్తవాళ్లతోనే రావాలి. పరిచయాలు చద్ది వాసన వేయకూడదు. ‘ఏంటీ.. ఏం మాట్లాడవు?’ అంది చంచల. ‘నువ్వు మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది. నాకు మాటలేం వస్తాయి?’ నమ్మించడానికి ఒక రాయి వేశాడు. ఆ రాయి సూటిగా మనసుకి తాకింది. అతని వంక ఆరాధనగా చూసింది చంచల. ‘ఇలా ఎన్నాళ్ళు?’ అడిగింది. ‘నీకూ నాకూ పెళ్లయ్యేవరకు’ అన్నాడు. ‘ఏంటి?’ అన్నట్లు అతని వైపు చూసింది. ‘అదే అదే మనిద్దరికీ పెళ్ళయ్యేవరకూ’ అన్నాడు వాక్యాన్ని సరిచేస్తూ. ‘పార్కులన్నీ ఇలాగే ఉంటాయా? ఇక్కడే ఇలా ఉంటుందా?’ అడిగింది. ‘ఏం అలా అడిగావు?’ అన్నాడు. ‘నాలుగ్గోడల మధ్య జరిగే పనులన్నీ నలుగురిలో చేసేస్తున్నారుగా?’ అంది తలను చుట్టూ తిప్పి చూస్తూ చంచల. ‘నువ్వెక్కడ పార్కుకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. పచ్చగడ్డి మీద కూర్చున్న వాళ్లందరూ పరవశంలో ఉంటారు. పరిగెత్తేవాళ్లు, నడిచేవాళ్లు మాత్రం కళ్లు మూసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడినుంచో ఆయాసపడుతూ వచ్చిన జంటలన్నీ ఇక్కడికి రాగానే తీగల్ని చుట్టుకుంటూ, ఆకుల్ని కప్పుకుంటూ ఆదిమానవుల్లా మారిపోతారు. పార్కులంటే ఒకప్పుడు నడకకి... ఇప్పుడు ఇలా’ అన్నాడు మెరిసే కళ్లతో చంచల వైపు చూస్తూ. ‘ఏంటీ?’ రెట్టించింది చంచల. నవ్వాడు విశాల్. ఆమె సిగ్గుపడింది. ఆ సిగ్గులో ఏదో అమాయకత్వం తొంగిచూసింది. ‘బాబూ... బాగున్నావా?’ ఓ అపరిచిత కంఠం వినిపించడంతో అటువైపు తిరిగి ‘ఎవరూ?’ అన్నాడు విశాల్. వచ్చినతను కళ్లజోడు సవరించుకుంటూ ‘ఒకటి రెండుసార్లు నిన్ను ఇక్కడే చూసినట్లు గుర్తు బాబూ. ఈ అమ్మాయి ఇంతకుముందు వచ్చిన అమ్మాయిలా లేదే?’ అన్నాడు చంచల వైపు సూటిగా చూస్తూ. విశాల్ కంగారును కప్పిపెట్టుకుంటూ ‘లేదు తాతగారూ... నేనిదే ఇక్కడికి రావడం. మీరు ఎవర్ని చూసి ఎవరనకుంటున్నారో! అయినా వేరే పనేమీ లేనట్లు ఎవరెవరొస్తున్నారో చూడ్డమేనా మీ పని?’ అన్నాడు కొంచెం కోపంగా. ‘అయ్యో... మరోలా అనుకోకు బాబూ! ఎన్నాళ్లనుంచో ఈ పార్కులో నడవడానికి వస్తున్నాను. మొదటిసారి చూస్తే ఏమోగానీ ఒకటిరెండుసార్లు చూస్తే మాత్రం బాగానే గుర్తుంటుంది నాకు. ఏమోలే బాబూ... నేనే పొరబడి ఉంటాను. ఏమీ అనుకోకు బాబూ’ తనలో తానే గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు పెద్దాయన. చంచల మనసునిండా ఆలోచనలు కమ్ముకున్నాయి. అర్థం తెలియని భయమేదో నిలువునా ఆవరించింది. కూర్చున్నచోట నుంచి దిగ్గున లేచి గేటువైపు నడవసాగింది. గేటుదాటి ముందుకు వెళ్తున్న పెద్దాయనను చూసి ‘తాతగారూ మీరు చెప్పింది నిజమేనా?’ అడిగింది చంచల. చంచలను చూస్తూ చిన్నగా నవ్వుతూ ‘నువ్వు పార్కుకి కొత్తేమో గానీ నేను పాతవాణ్ణేనమ్మా. చిన్నవాళ్ళు పెద్దవాళ్లను అనుకరించడం మంచిదే. కానీ ఎదిగిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఇంత చిన్న వయసులోనే చేయాలని ఆరాటపడడం మంచిది కాదమ్మా. అన్నీ సమకూర్చే తల్లిదండ్రుల మాట వినకుండా, అన్నీ దోచుకునే పోరంబోకుల వెంట తిరిగితే బతుకు చీకటవుతుంది’ చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు పెద్దాయన.వెనక్కి తిరిగి పార్కు లోపలికి చూసిన చంచలకు ఆయాసపడుతూ తనవైపే వస్తున్న విశాల్ కనిపించాడు. గబగబా నడిచి ఎదురుగా వచ్చిన ఆటోలో ఎక్కింది చంచల. -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
అక్కడ అంతా మనమే చెప్పాలి!
అమాయకమైన కళ్లు, ఆకట్టుకునే అభినయంతో పక్కా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తారు గుజరాతీ భామ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’ విజయాలతో మంచి జోష్ మీద ఉన్న అవిక తాజాగా ‘తను - నేను’ చిత్రం ద్వారా తెరపై మెరవనున్నారు. నిర్మాత పి. రామ్మోహన్ తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విశేషాలు అవిక మాటల్లోనే... ‘ఉయ్యాల -జంపాల’ సినిమా చేస్తున్నప్పుడే నిర్మాత రామ్మోహన్ నాకీ కథ చెప్పారు. కథ నచ్చినప్పటికీ ఇందులో ఉన్న కీర్తి పాత్రకు సెట్ అవుతానా? అనే సందేహం వచ్చింది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే అమ్మాయి కీర్తి. అంత పరిణతి కనబరుస్తానా? అనిపించింది. ఆ తర్వాత నాకు నమ్మకం కలగడానికి కారణం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. ఆ సినిమా చేశాక మాత్రం కీర్తి పాత్రకు సెట్ అవుతాననే నమ్మకం కుదిరింది. అందుకే ఒప్పుకున్నా. ఇది నా కెరీర్లో స్పెషల్ మూవీ. ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే...ఓ అబ్బాయి, అమ్మాయి, ఆమె తండ్రి చుట్టూ తిరిగే కథ. తన తండ్రి ఇష్టానుసారం హీరోయినేమో ఎప్పటికైనా అమెరికాలో సెటిల్ కావాలని కలలు కంటుంది. కానీ ఆమెను ప్రేమించే అబ్బాయికి మాత్రం అది ఇష్టం ఉండదు. తర్వాత ఏమైందనేది మిగతా కథ. కీర్తికీ, అవికా గోర్‌కు ఏ మాత్రం పోలికలు లేవు. కీర్తి అంత మెచ్యూర్డ్‌గా, స్వతంత్రంగా నేనైతే ఆలోచించను. మళ్లీ ‘ఉయ్యాల జంపాల’ టీమ్‌తోనే పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్మోహన్ గారు డెరైక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. ‘ఉయ్యాల జంపాల’ టైంలో ఓ నిర్మాతగా సెట్లో గంభీరంగా ఉండే వారు. కానీ డెరైక్టర్‌గా అందుకు పూర్తి భిన్నంగా సరదాగా నవ్వించేవారు. షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది. సీరియల్స్ చిత్రీకరణకూ, సినిమాలకూ చాలా తేడా ఉంటుంది. అక్కడ ప్రాప్టింగ్ ఇవ్వరు. అంతా మనమే చెప్పాలి. సినిమాలు చేస్తున్నా నేను సీరియల్స్ మానలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. తెలుగులో నాకు మరో మంచి ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను.