అనిల్ అంబానీ పిల్ల‌లు ఆ బిజినెస్‌లో.. ఒక‌ప్పుడు ల‌గ్జ‌రీ కార్ల‌లో! | Interesting Details of Anil Ambani Sons Jai Anmol and Jai Anshul | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీ పిల్ల‌లు ఆ బిజినెస్‌లో.. ఒక‌ప్పుడు ల‌గ్జ‌రీ కార్ల‌లో!

Published Sun, May 5 2024 9:03 AM | Last Updated on Sun, May 5 2024 12:10 PM

Interesting Details of Anil Ambani Sons Jai Anmol and Jai Anshul

ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన అందరికీ.. దాదాపు అనిల్ అంబానీ కుటుంబం గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే.. అనిల్ అంబానీ పిల్లలు ఇద్దరూ మీడియాకు కొంత దూరంగా ఉంటారు. ఈ కథనంలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ, కొన్ని సొంత నిర్ణయాల వల్ల భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, టీనాలకు ఇద్దరు కుమారులు. వారే 'జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ'. వీరిరువురు చాలావరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు.

జై అన్మోల్ అంబానీ.. అనిల్ అంబానీ, టీనాల పెద్ద కొడుకు. 1991 డిసెంబర్ 12న జన్మించిన ఈయన ముంబైలోని ప్రసిద్ధ కేథడ్రల్, జాన్స్ కాన్వెంట్ స్కూల్ నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆ తరువాత యూకేలో సెవెన్ ఓక్స్ స్కూల్‌లో చేరారు. 18 ఏళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇంటర్న్‌షిప్ ప్రారంభించారు.

చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లోనే పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవి చేపట్టారు. ఆ తరువాత వివిధ పదవులను చేపట్టారు.

ఇక అనిల్ అంబానీ రెండో కుమారుడు జై అన్షుల్ అంబానీ విషయానికి వస్తే.. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత ఎన్వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్‌లో కూడా పనిచేశారు. ఆ తరువాత 2019లో జై అన్మోల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇన్‌ఫ్రా డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు.

జై అన్మోల్, జై అన్షుల్ ఇద్దరికీ లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వీరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌కే350, లంబోర్ఘిని గల్లార్డో, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. కార్లు మాత్రమే కాకుండా వీరి వద్ద హెలికాఫ్టర్లు కూడా ఉండేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సిన విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement