భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్‌ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.
బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment