BYD
-
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత మార్కెట్లో ఈ–మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రవేశపెట్టింది. ధర రూ.26.9 లక్షల నుంచి ప్రారంభం. మూడు వరుసల సీటింగ్‌తో 2021లో ఎంట్రీ ఇచి్చన ఈ6కు ఆధునిక హంగులు జోడించి ఈ–మ్యాక్స్7కు రూపకల్పన చేశారు. ఒకసారి చార్జింగ్‌తో ప్రీమియం వేరియంట్ 420 కిలోమీటర్లు, సుపీరియర్ వేరియంట్ 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 12.7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12.8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
అందమైన సింగర్.. అదిరేటి కార్!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీకి చెందిన కొత్త బీవైడీ అట్టో3 (BYD Atto 3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సింగర్ జస్లీన్ రాయల్ అందుకున్నారు. బీవైడీ ఇండియా తాజాగా ఆమెకు ఈ ఎస్‌యూవీని డెలివరీ చేసింది. దీంతో బీవైడీ అట్టో3 కారును కలిగిన తొలి సెలబ్రిటీగా ఆమె మారారు.సింగర్ జస్లీన్ రాయల్ గురించి చాలా మంది వినే ఉంటారు. అనేక అవార్డులు గెలుచుకున్న ఈమె సింగర్ మాత్రమే కాదు.. సాంగ్ రైటర్, కంపోజర్ కూడా. వివిధ భాషలలో బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెంచారు. ఆమె సొంతంగా మ్యూజిక్ నేర్చుకుని వన్-వుమన్ బ్యాండ్ ప్రదర్శనతో కీర్తిని పొందారు. ఆమె రూపొందించిన హీరియే ఆల్బమ్ అత్యంత ఆదరణ పొందింది.బీవైడీ అట్టో 3 ప్రత్యేకతలుబీవైడీ అట్టో 3లో ఇటీవల పరిచయం చేసిన డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు ఈ ఎస్‌యూవీకి ఆదరణను మరింత పెంచాయి. ఈ ఎస్‌యూవీకి ఇప్పటివరకూ 600 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇక ధర విషయానికి వస్తే డైనమిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షలు ఉంది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ సామర్థ్యంతో 521 కి.మీ.(ARAI), 480 కి.మీ. (NEDC) రేంజ్ అందిస్తాయి. డైనమిక్ మోడల్ 49.92 kWh బ్యాటరీ సామర్థ్యంతో 468 కి.మీ. (ARAI), 410 కి.మీ. (NEDC) రేంజ్‌ని అందిస్తుంది. -
ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?
ప్రముఖ ఎలక్ట్రిక్‌కార్ల తయారీసంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ఏడాది వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మనలో చాలామంది వేతనం ఏటా రూ.లక్షల్లో ఉంటుంది కదా. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారి జీతం రూ.కోట్లల్లో ఉంటుందని తెలుసు కదా. మరి, మస్క్ వేతనం ఎంతో తెలుసా.. ఏకంగా రూ.4.67లక్షల కోట్లు(56 బిలియన్ డాలర్లు). ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయనకు ఇంత వేతనం ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు కూడా అనుమతించారు. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో మస్క్ నం.1గా కొనసాగుతున్నారు.టెక్సాస్‌లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన వార్షిక వేతనం ఏకంగా 56 బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.4,67,880 కోట్లు)గా నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ప్యాకేజీలో వాటాదారులు సవరణలు చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేతనంలో సింహభాగం నగదు రూపంలో కాకుండా ‘ఆల్-స్టాక్ కంపెన్జేషన్’(ఏడాదిలో స్టాక్ విలువ పెంపు ఆధారంగా షేర్ల కేటాయింపు)గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. తాజాగా నిర్ణయించిన ప్యాకేజీలోని స్టాక్లను ఐదేళ్లపాటు విక్రయించనని మస్క్ హామీ ఇచ్చారు.టెస్లా కంపెనీలోని ఏఐ పురోగతిని వేరేచోటుకి తీసుకెళ్లకుండా నిరోధించడానికి కంపెనీలో 25% వాటాను కోరుతున్నట్లు గతంలో మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన కోరుకున్న వేతన ప్యాకేజీని ఇవ్వడంలో వాటాదారులు విఫలమైతే కంపెనీ తయారుచేస్తున్న ఏఐ, రోబోటిక్స్ ఉత్పత్తులను బయట తయారుచేస్తానని జనవరిలోనే చెప్పారు. తాను కంపెనీతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు మస్క్ ఏజీఎంలో తెలిపారు. ఇప్పటికే వేతనానికి సంబంధించి ఇలాన్‌మస్క్ డెలావేర్ ఛాన్సరీ కోర్టులో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌కు తేదీ ఖరారు..?ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బీవైడీ, షావోమీ వంటి చైనా కంపెనీలు రంగప్రవేశం చేయడంతో టెస్లాకార్లకు డిమాండ్ మందగించిందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇటీవల విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు క్షీణించాయి. లాభాల మార్జిన్లు తగ్గినట్లు కంపెనీ నివేదించింది. -
హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సింగిల్ చార్జితో ఏకంగా 2000 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీవైడీ కంపెనీ ఆవిష్కరించిన కొత్త హైబ్రిడ్ కారును ఒక ఫుల్ ఛార్జ్ చేసి.. ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపిన తరువాత, ప్రయాణం ప్రారంభిస్తే.. 2000 కిమీ ప్రయాణించే వరకు మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్‌లో ఇంధనం నింపాల్సిన అవసరం కూడా లేదు.కంపెనీ ఆవిష్కరించిన కారు పేరు తెలియాల్సి ఉంది. అయితే దీని ధర 100000 యువాన్లు (13800 అమెరికన్ డాలర్లు) వరకు ఉంటుందని సమాచారం. లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరలను వెల్లడిస్తుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. లాంచ్ డేట్ వంటి వివరాలు కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో
భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి. View this post on Instagram A post shared by The Viral Cinema - Sajal Jain (@theviralcinema) -
బ్రెజిల్లో దూసుకెళ్తున్న బీవైడీ.. 5000 మందికి ఉద్యోగాలు!
చైనా కార్ల తయారీ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రెజిల్లో తన 100వ డీలర్షిప్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 250కి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బ్రెజిల్లో బీవైడీ 100వ డీలర్‌షిప్‌ను ఫ్లోరియానోపోలిస్ డౌన్టౌన్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బ్రెజిల్లో బీవైడీ సేల్స్ నెట్వర్క్ కింద 39 డీలర్ గ్రూపులను కలిగి ఉంది. అంతే కాకుండా 100 స్టోర్లను, 135 అవుట్లెట్ల కలిగి ఉన్నట్లు సమాచారం.రాబోయే రోజుల్లో కంపెనీ బ్రెజిల్లో మరో 150 కొత్త స్టోర్లను నిర్మించనుంది. 2024 చివరి నాటికి 250 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలంటే.. నెలకు కనీసం 19 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్లో తన ఉనికిని విస్తరిస్తూ.. విక్రయాల నెట్వర్క్ పెంచడానికి కంపెనీ యోచిస్తోంది.బీవైడీ కంపెనీ బ్రెజిల్లో అతి పెద్ద తయారీ సైట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ చాసిస్, కొత్త ఎనర్జీ ప్యాసింజర్ కార్ ప్రొడక్షన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ వంటి వాటిని తయారు చేస్తుంది. ఇక్కడ ఏడాదికి 1,50,000 యూనిట్ల కార్లను (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) తయారు చేయనున్నట్లు, స్థానికంగా 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు సమాచారం.బీవైడీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి ఈ ఏడాది చివరి నుంచి లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బీవైడీ డాల్ఫిన్, సాంగ్ ప్లస్, యువాన్ ప్లస్, డాల్ఫిన్ మినీ వంటి కార్లను తయారు చేయనుంది. -
షావోమి కారు విడుదల ఎప్పుడంటే..
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్ 2025 నాటికి తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించనుంది. కంపెనీ తన మొదటి మోడల్ ఎస్‌యూ7ను టెస్లా ఇంక్ మోడల్‌వై తరహాలో విపణిలోకి తీసుకురానుంది.కంపెనీ వచ్చే ఏడాది లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో డిమాండ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్‌ని పెంచడానికి పని చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ వినియోగదారులను ఆకర్షించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..చైనాలో ఎస్యూవీ వాహనాలకు జనాదరణ ఉంది. అయితే షావోమి తయారుచేస్తున్న కారు స్పెసిఫికేషన్లు, ధరలు ఏమేరకు ఉంటాయో ఇంకా స్పష్టతరాలేదు. బీజింగ్‌లోని షావోమి అసెంబుల్ ఫ్యాక్టరీ రెండోదశ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు 2025 నాటికి కార్ల ఉత్పత్తి జరగుతుందని ఊహించలేదని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి పనులు వేగంగా జరిగాయని చెప్పింది. కంపెనీ తయారీప్లాంట్ నెలకు 10,000 యూనిట్లనే సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. దాంతో ముందుగా లక్ష యూనిట్లు సిద్ధంగా ఉంచుకుని 2025 నాటికి కారును విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్‌కు తగిన సరఫరా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
భారత్ లో BYD Seal మూడు కొత్త వెర్షన్...!
-
ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్‌లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్‌లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు ఇదే - టెస్లాకు గట్టి పోటీ!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్‌ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి. బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టైల్లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
TS: రాష్ట్రంలో టెస్లా, బీవైడీ తయారీ ప్లాంట్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్‌ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..! ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి. -
చైనా కంపెనీ విషయంలో భారత్ కీలక నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'బివైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) హైదరాబాద్‌కి చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం చైనా సంస్థ మన దేశంలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రతి పాదనను కేంద్రం నిరాకరించింది. భద్రత పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇప్పటికే బివైడీ కంపెనీ ఈ6, ఆటో వంటి కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సమయంలో కేంద్రం ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర కూడా దీనికి అనుమతిస్తుంది. -
రూ. 8,200 కోట్లతో మేఘా ఈవీ ప్లాంటు! బీవైడీతో కలిసి ఏర్పాటు యోచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి. ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం -
సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్!
సాక్షి, బిజినెస్ డెస్క్: బిల్డ్ యువర్ డ్రీమ్స్.. మీ కలలను సాకారం చేసుకోండి. ఇదేదో ట్యాగ్‌లైన్ కాదు. ఓ చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పేరు. సంక్షిప్త రూపం బీవైడీ. ఈ బీవైడీనే ఇప్పుడు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాను కలవరపెడుతోంది. అంతటి పెద్ద కంపెనీని కూడా డిస్కౌంట్ల బాట పట్టించింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిల్చింది. ఇప్పుడు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ మరింతగా విస్తరిస్తోంది. రెండు దశాబ్దాలుగా.. ప్రాథమికంగా రీచార్జబుల్ బ్యాటరీల ఫ్యాక్టరీగా బీవైడీ కంపెనీని వాంగ్ చౌన్ఫు 1995లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్స్ పరికరాల విభాగాల్లోకి విస్తరించారు. ఆ క్రమంలోనే కార్ల తయారీ లైసెన్సు ఉన్న క్విన్చువాన్ ఆటోమొబైల్ కంపెనీని 2002లో కొనుగోలు చేసి దాన్ని 2003లో బీవైడీ ఆటో కంపెనీగా బీవైడీ మార్చింది. ప్రస్తుతం బీవైడీ కంపెనీలో బీవైడీ ఆటోమొబైల్, బీవైడీ ఎలక్ట్రానిక్ అని రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. బీవైడీ ఆటోమొబైల్.. ప్యాసింజర్ కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ సైకిళ్లు వంటి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను (పీహెచ్ఈవీ) తయారు చేస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టేందుకు గతేడాది మార్చి నుంచి పెట్రోల్ వాహనాలను నిలిపివేసింది. 2021 ఆఖరు నాటికి పీహెచ్ఈవీ, బీఈవీ విభాగంలో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కంపెనీగా ఎదిగింది. 2022లో దాదాపు 19 లక్షల పైగా విద్యుత్ వాహనాలు (హైబ్రిడ్ కూడా కలిపి) విక్రయించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా నిల్చింది. బఫెట్ పెట్టుబడులు.. మార్కెట్ క్యాప్‌పరంగా టెస్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీగా ఉండగా.. అమ్మకాలపరంగా మాత్రం బీవైడీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టెస్లా మార్కెట్ వేల్యుయేషన్ 386 బిలియన్ డాలర్లుగా ఉండగా బీవైడీది సుమారు 100 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. లాభాలు, ఆదాయాలపరంగా టెస్లా ఇంకా గ్లోబల్ లీడర్‌గానే ఉన్నప్పటికీ బీవైడీ వేగంగా దూసుకొస్తోంది. యూరప్, ఆస్ట్రేలియా మొదలైన మార్కెట్లలోకి కూడా ఎగుమతులు మొదలుపెడుతోంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ .. టెస్లాలో కాకుండా చైనా కంపెనీ బీవైడీలో పెట్టుబడులు పెట్టారు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలతో పోలిస్తే బీవైడీకి ఓ ప్రత్యేకత ఉంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ కంట్రోల్ అనే మూడు రకాల ఎన్ఈవీలకు సంబంధించిన టెక్నాలజీల్లోనూ నైపుణ్యం ఉంది. ఇలా వినూత్న టెక్నాలజీల్లోనే కాకుండా ధరపరంగా కూడా టెస్లాకు బీవైడీ గట్టి పోటీ ఇస్తోంది. బీవైడీ కార్ల ధరలు చైనా మార్కెట్లో 30,000 డాలర్ల లోపే ఉంటుండగా, టెస్లా చౌకైన కారు మోడల్ 3 ప్రారంభ ధరే 37,800 డాలర్ల పైచిలుకు ఉంటోంది. 25,000 డాలర్ల రేంజిలో కారును కూడా తెస్తామంటూ టెస్లా ప్రకటించింది. భారత్‌లోనూ బీవైడీ జోరు.. 2030 కల్లా భారత్‌లో అమ్ముడయ్యే ప్రతి మూడు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్‌దే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మన మార్కెట్‌పై బీవైడీకి భారీ లక్ష్యాలే ఉన్నాయి. 2030 నాటికల్లా దేశీ ఈవీ మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. 2007లోనే బీవైడీ ఇండియా విభాగం ఏర్పాటైంది. గతేడాది భారత్‌లో అటో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీలను ప్రవేశపెట్టింది. సీల్ పేరిట మరో కారును ఈ ఏడాది ప్రవేశపెడుతోంది. ఇప్పుడు విక్రయిస్తున్న కార్ల రేట్లు రూ. 29 లక్షల నుంచి ఉంటుండగా 700 కి.మీ. వరకు రేంజి ఉండే సీల్ రేటు దాదాపు రూ. 70 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. దిగుమతి సుంకాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రస్తుతం చెన్నైలోని ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాలను సెమీ నాక్డ్–డౌన్ కిట్స్ (ఎస్కేడీ)లాగా అసెంబుల్ చేస్తోంది. రెండో దశలో డిమాండ్‌ను బట్టి పూర్తి స్థాయిలో ఇక్కడే అసెంబుల్ చేసే అవకాశాలనూ పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 20 డీలర్లు ఉండగా ఈ ఏడాది ఆఖరు నాటికి భారత్‌లో తమ డీలర్‌షిప్‌ల సంఖ్యను 53కి పెంచుకునే యోచనలో ఉంది. గతేడాది సుమారు 700 వాహనాలు విక్రయించగా ఈ ఏడాది ఏకంగా 15,000 పైచిలుకు అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు కనెక్షన్.. తెలుగు రాష్ట్రాల కంపెనీతో కూడా బీవైడీకి అనుబంధం ఉంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌తో బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ సాంకేతికత సహకారంతో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇక భారత్‌లో సొంత ఉత్పత్తుల విస్తరణలో భాగంగా కంపెనీ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ స్టోర్స్ ఏర్పాటు చేసింది. చదవండి: ShareChat Layoffs: ‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్ చాట్! -
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. భారీ లక్ష్యంతో.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కార్లను భారత్‌లో పరిచయం చేస్తాం. బీవైడీ ఎలక్ట్రిక్ కారు ఈ6ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టాం. 450 యూనిట్లు విక్రయించాం. ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ కారు 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీపావళికి ప్రీమియం ఈ–ఎస్‌యూవీని ప్రకటించనున్నాం. జనవరి నుంచి డెలివరీలు ఉంటాయి. 2030 నాటికి ఈ–ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో దేశంలో 30 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటాం. బీవైడీ భారత్‌లో ఇప్పటివరకు సుమారు రూ.1,185 కోట్లు వెచ్చించింది. -
హైదరాబాద్ కోసం 500 ఏసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న మినీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సుల మోడల్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన బీవైడీ బస్సు కంపెనీ జీఎం లియో జూలింగ్, ఈడీ జాంగ్ జీ, ఇతర ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. బస్సుల పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు గంటలపాటు చార్జింగ్ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం బీవైడీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ ప్రగతి భవన్ ఆవరణలో కాసేపు బస్సులో చక్కెర్లు కొట్టారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రికల్ బస్సులతో వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని, తక్కువ ఖర్చుతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటి విడతగా హైదరాబాద్‌లో 500 బస్సులు ప్రవేశ పెట్టేందుకు వీలుగా సీఎం కంపెనీ ప్రతినిధులను వివరాలు ఆరా తీశారు. దీనిపై స్పందించిన బీవైడీ ప్రతినిధులు అవసరం అయితే ప్లాంట్ పెట్టడానికి సిద్దమని వెల్లడించినట్లు సమాచారం. చైనా బయట తొలిసారి తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్‌ల అసెంబ్లింగ్!
⇒ గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఏర్పాటు ⇒ చైనా దిగ్గజం బీవైడీ ఆటో భాగస్వామ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్‌ల అసెంబ్లింగ్‌కు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్‌లో మరో కంపెనీ జతపడుతోంది. సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్ తయారీలో ఉన్న భాగ్యనగరికి చెందిన గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు కంపెనీలు సాధారణ బస్‌లను మాత్రమే అసెంబ్లింగ్ చేస్తున్నాయి. గోల్డ్‌స్టోన్ మాత్రం పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్‌లను రూపొందించనుంది. ఇందుకోసం చైనా దిగ్గజం బీవైడీ ఆటోతో చేతులు కలిపింది. ప్లాంటుకు 100 ఎకరాలు అవసరమవుతాయని సంస్థ ఈ–బస్ విభాగం హెడ్ పి.కె.శ్రీవాస్తవ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. బస్‌ల కోసం ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాదిలోగా కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తొలుత రూ.20 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. తొలి దశలో 300 బస్‌ల అసెంబ్లింగ్ సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్లాంటు సాకారమైతే 500 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పెరుగుతున్న ఆర్డర్లు.. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 25 ఎలక్ట్రిక్ బస్‌లకు గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఆర్డరు సాధించింది. 110 కిలోమీటర్ల కొండ ప్రాంతమైన మనాలి–రోహ్తంగ్–మనాలి మార్గంలో 13,000 అడుగుల వరకు ఎత్తులో ఇవి ప్రయాణిస్తాయి. సమతల మార్గం పరంగా చూస్తే ఈ దూరం 150–160 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ సోమవారం బీఎస్ఈకి తెలిపింది. ఒకసారి చార్జ్ చేస్తే చాలని, ప్రయాణం పూర్తి అవుతుందని వివరించింది. ఆర్డరు విలువ రూ.47.75 కోట్లు అని కంపెనీ ఎండీ ఎల్.పి.శశికుమార్ తెలిపారు. వార్షిక నిర్వహణ ఖర్చులు దీనికి అదనం. బీవైడీ ఆటో సహకారంతో ఈ బస్‌లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. భారత్‌లోనే బస్ డిజైన్ కూడా చేపడుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి 6 బస్‌లకు ఇప్పటికే కంపెనీ ఆర్డరు పొందింది.