ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్ 2025 నాటికి తన ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించనుంది. కంపెనీ తన మొదటి మోడల్ ఎస్‌యూ7ను టెస్లా ఇంక్ మోడల్‌వై తరహాలో విపణిలోకి తీసుకురానుంది.
కంపెనీ వచ్చే ఏడాది లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో డిమాండ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్‌ని పెంచడానికి పని చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ వినియోగదారులను ఆకర్షించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
చైనాలో ఎస్‌యూవీ వాహనాలకు జనాదరణ ఉంది. అయితే షావోమి తయారుచేస్తున్న కారు స్పెసిఫికేషన్‌లు, ధరలు ఏమేరకు ఉంటాయో ఇంకా స్పష్టతరాలేదు. బీజింగ్‌లోని షావోమి అసెంబుల్ ఫ్యాక్టరీ రెండోదశ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు 2025 నాటికి కార్ల ఉత్పత్తి జరగుతుందని ఊహించలేదని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి పనులు వేగంగా జరిగాయని చెప్పింది. కంపెనీ తయారీప్లాంట్ నెలకు 10,000 యూనిట్లనే సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. దాంతో ముందుగా లక్ష యూనిట్లు సిద్ధంగా ఉంచుకుని 2025 నాటికి కారును విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్‌కు తగిన సరఫరా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment