భారత్‌లో బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్
ఎక్స్‌షోరూం ధర రూ.41–53 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్‌ప్లే వంటి హంగులు ఉన్నాయి.
ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్‌లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్‌లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment