seal
-
సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు
కేప్ టౌన్: సముద్రపు క్షీరదం సీల్‌కు రేబిస్ సోకడాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సీల్స్ ఎక్కువగా అంటార్కిటిక్ జలాల్లో కనిపిస్తాయి. ఇవి చల్లని ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రభుత్వ పశువైద్యుడు డాక్టర్ లెస్లీ వాన్ హెల్డెన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పశ్చిమ, దక్షిణ తీరాలలోని వివిధ ప్రదేశాలలో 24 కేప్ సీల్స్ రేబిస్‌తో బాధపడుతూ మృతిచెందాయని తెలిపారు.క్షీరదాలను రేబిస్ అమితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి వైరస్ మనుషులకు సోకుతుంది. రేబిస్ సోకితే అది ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ అనేది లాలాజలం ద్వారా లేదా జంతువులు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను రకూన్లు, కొయెట్లు, నక్కలు, పెంపుడు కుక్కలలో చాలా కాలం క్రితమే కనున్నారు. అయితే సముద్రపు క్షీరదాలలో రేబిస్ వైరస్ కేసు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.1980ల ప్రారంభంలో నార్వేలోని స్వాల్బార్డ్ దీవుల్లోని సముద్రపు క్షీరదాల్లో రేబిస్‌కు సంబంధించిన ఒక కేసును గుర్తించారు. అయితే సీల్స్‌లో రేబిస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు తొలిసారిగా కేప్ టౌన్ బీచ్‌లో ఒక కుక్కను సీల్ కరిచినప్పుడు ఆ సీల్లో రేబిస్‌ను గుర్తించారు. ఆ కుక్కకు రేబిస్ సోకింది. అనంతరం పరిశోధకులు 135 సీల్ మృతదేహాల మెదడు నమూనాలలో రేబిస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో 20 కొత్త నమూనాలను కూడా సేకరించారు. తదుపరి పరీక్షలో మరిన్ని రేబిస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు సీల్స్కు రేబిస్ ఎలా సోకుతుంది? వాటిలో వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందా? దీనిని అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాండాలకు బదులు.. -
ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్‌లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్‌లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. -
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
సోనియా, రాహుల్‌కు భారీ షాక్.. ఆ ఆఫీస్‌కు ఈడీ సీల్
సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్‌లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్‌కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. ఇక హెరాల్డ్ హౌజ్ సీల్‌కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. Delhi | The Enforcement Directorate seals the National Herald office, instructing that the premises not be opened without prior permission from the agency. pic.twitter.com/Tp5PF5cnCD — ANI (@ANI) August 3, 2022 #CLARIFICATION | ED seals Young Indian office at the Herald House building in Delhi as no one was available in the office during the search & thus they were not able to complete the search The order reads that the "premises not be opened without prior permission" from the agency https://t.co/WgiCNwxqVm pic.twitter.com/UvX9iScyIH — ANI (@ANI) August 3, 2022 తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 10 జన్‌ఫథ్‌లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఆఫీస్‌కు ఈడీ సీల్ వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. -
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో శివలింగం!
వారణాసి/న్యూఢిల్లీ: ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మందిరం–మసీదు వివాదం మరింత రాజేసే పరిణామాలు జరిగాయి. సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. దానికి రక్షణ కల్పించాలంటూ సోమవారం వారణాసి కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవి కుమార్ దివాకర్ ను ఆశ్రయించారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. ఎవరూ అందులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కమిటీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే సంతృప్తికరం: మేజిస్ట్రేట్ శర్మ సర్వేపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మీడియాతో అన్నారు. సర్వే నివేదిక అందాక తదుపరి చర్యలను మంగళవారం కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వే సమయంలో మసీదులో ఏం దొరికిందనేది అప్పటిదాకా ఎవరూ వెల్లడించరాదన్నారు. అది ఫౌంటేన్ భాగం: మసీదు కమిటీ సర్వే బృందానికి కనిపించినది ఫౌంటెయిన్‌కు చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదని మసీదు కమిటీ పేర్కొంది. తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది. మరో మసీదును కోల్పోలేం తాజా పరిణామాలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘బాబ్రీ’ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు. అటువంటి యత్నాలను తిప్పికొట్టాని పిలుపునిచ్చారు. ‘‘బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతినబూనాలి’ అంటూ ట్వీట్ చేశారు. దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని ఆరోపించారు. నిజం తేలాల్సిందే: యూపీ డిప్యూటీ సీఎం సర్వే ఫలితంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య సంతృప్తి వ్యక్తం చేశారు. నిజం ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాకతప్పదన్నారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదన్న వాదన తాజా ఘటనతో రుజువైందని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆధారాలను దేశ ప్రజలంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాలకు నిత్య పూజలకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు.. సీఎం ఫైర్ -
బాలీవుడ్ హీరోకి కరోనా సెగ : బిల్డింగ్‌కు సీల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఊహించని పరిణామం ఎదురైంది. ముంబైలో ఆయన నివాసం ఉంటున్న భవనాన్ని ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు సోమవారం ప్రకటించారు. దక్షిణ ముంబై, ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్మెంట్స్లోని 18వ అంతస్తులో సునీల్ శెట్టి నివసిస్తున్నారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఆ భవనానికి అధికారులు శనివారం సీల్ చేశారు. ఈ విషయాన్ని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ (డీవార్డ్) ధృవీకరించారు. కేసుల విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇక్కడ రాక పోకలపై ఆంక్షలున్నాయని తెలిపారు. అలాగే భవనం వెలుపల పోలీసులను మోహరిస్తామని కూడా వెల్లడించారు. అయితే సునీల్ శెట్టి, ఆయన కుటుంబం మొత్తం ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నారు. కాగా బీఎంసీ నిబంధనల ప్రకారం ఏదైనా బిల్డింగ్‌లో 5 లేదా అంతకుమించి కోవిడ్ కేసులు నమోదైతే, ఆ బిల్డింగ్‌ను కంటోన్మెంట్ ఏరియాగా పరిగణిస్తారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. -
కరోనా : రాజస్థాన్ కీలక నిర్ణయం
జైపూర్ : కరోనా కేసులు అధికమవుతున్ననేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను వారం రోజుల పాటు మూసి వేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అదికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఎవరూ వేరే ప్రాంతాలకి వెళ్లకుండా, బయటి వ్యక్తులెవరూ రాష్ర్టంలోకి రాకుండా నియంత్రణ విధిస్తారు. నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసి) ఇతరులెవరినీ రాష్ర్టంలోకి ఎవరినీ అనుమతించమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఎల్ లాథర్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (వందేభారత్ మిషన్ ఫేజ్-3 ప్రారంభం ) గడిచిన 24 గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11,300 మంది మరణించారు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దులు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,985 మంది కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 2,76,583 కు చేరుకుంది. (ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్ ) -
శాస్త్రి భవన్‌కు పాకిన కరోనా ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రకంపనలు దేశ రాజధానిలోని శాస్త్రి భవన్‌కు పాకాయి. శాస్త్రి భవన్‌లోని న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ రావడం కలంకలం రేపింది. దీంతో ఈ భవనంలోని నాల్గవ ఫ్లోర్ ను అధికారులు మూసివేశారు. గేట్ నంబర్ 1 నుండి గేట్ నంబర్ 3 వరకు నాల్గవ అంతస్తు 'ఎ' వింగ్ సీజ్ చేశామని, లిఫ్ట్ లు కూడా పనిచేయవని అధికారులు మంగళవారం ప్రకటించారు. పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత దీన్ని తిరిగి తెరుస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కోవిడ్-19 సోకిన అధికారితో సంబంధమున్న వారిని క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల అధికారుల నివాసముదాయం శాస్త్రి భవన్. కరోనా వైరస్ కారణంగా లుటియన్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయడం ఇది రెండవసారి. ఏప్రిల్ 28 న నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో, 48 గంటల గంటల పాటు నీతి ఆయోగ్ కార్యాలయాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కూడా కోవిడ్-19 కు పాజిటివ్ రావడంతో రాజీవ్ గాంధీ భవన్ లోని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏడు రోజుల పాటు మూసివేశారు. (ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై) కాగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కరోనా వైరస్ కేసులు 4898 గా ఉన్నాయి. 1437 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. 64 మరణాలు నమోదైనాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్త మరణాలు సంభవించలేదు. -
ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!
లండన్ : ‘మనిషన్న జంతువు ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ కోర్టులు మొట్టికాయలు వేసినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేస్తూ భూగ్రహం మీద ఉన్న ఇతర జీవజాతులను ప్రమాదంలోకి నెడుతున్నారు. యునైటెడ్ కింగ్డంలోని డోనా నూక్ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్ పప్(సముద్ర జీవి సీల్ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో ఇందుకు తార్కాణంగా నిలిచింది. పర్యావరణాన్ని మానవుడు కలుషితం చేస్తున్న తీరును మరోసారి కళ్లకు కట్టింది. నేచర్ ఫొటోగ్రాఫర్ డాన్ థర్లింగ్ రెండు వారాల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన సీల్ పప్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ మనుషులు ఇలా ఎందుకు చేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ భూగ్రహానికి మనం విలువ ఇవ్వనక్కర్లేదా?’అంటూ డాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అలాంటి బాటిళ్లు ఇంకా అక్కడే ఉంటే సీల్ పప్ వంటి అద్భుతమైన, అరుదైన జంతువుల మనుగడ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించాడు. కాగా ఈ ఫొటోలో సీల్ పప్.. గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ బాటిల్‌తో కనిపించడంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. తమ సంస్థ బాటిల్ కారణంగా సీల్ పిల్లకు ఎలాంటి హాని జరగలేదనే ఆశిస్తున్నామంది. ఈ మేరకు స్టార్‌బక్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ...’ఈ ఫొటో మమ్మల్ని ఎంతగానో కలచివేసింది’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టును సంప్రదించి చెత్త నిర్వహణ దిశగా చేపట్టే చర్యలకు తమవంతు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు బదులుగా లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టు స్టార్‌బక్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. ట్రస్టు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ సముద్ర జలాల్లో చెత్త పేరుకుపోవడం జాతీయ సమస్యగా పరిణమించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఇటువంటి ఫొటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన పిల్ల తాబేలు కడుపులో నుంచి సుమారు 104 ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. పిల్లలకు జన్మనివ్వడానికే బయటికి.. ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి. మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి. సీల్స్ జీవితంలో చాలాభాగం నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి. ఆక్సిజన్ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి. నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది. వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవ లేదా ఓడ వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట. ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయట. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు. సీల్స్ చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు. ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట. సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా ఇవి పసిగట్టేస్తాయి. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి. సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికి చాలా డిమాండ్ ఉంటుంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం సముద్రం కలుషితమవుతుండటంతో వాటి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువవుతున్నాయంటూ జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కల్తీ మద్యం... బతుకు ఛిద్రం
సంగారెడ్డి క్రైం: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్ని కల్తీ చేస్తున్న అక్రమార్కులు మందుబాబుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై సీల్ ఉన్నప్పటికీ కల్తీకి చేసేస్తున్నారు. బాటిల్లోని మద్యాన్ని సిరంజితో తీయడం అందులో నీటిని గానీ స్పిరిట్‌తో తయారు చేసిన మద్యాన్ని కానీ కలిపేస్తున్నారు. ఈ తరహా మోసాలను అరికట్టడం ఎక్సైజ్ శాఖకు సవాల్‌గా మారింది. జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో మద్యం ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉంటోందని మందుబాబులు అంటున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం కల్తీ అవుతోందని, ఆ మద్యం తాగిన వారికి కాళ్లు, చేతులు లాగడం, శరీరం నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. పేరుకే ఎంఆర్పీ జిల్లాలోని చాలా దుకాణాల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతోపాటు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు మద్యం బాటిళ్లకు రూ.5 నుంచి రూ.40 వరకు ఎంఆర్ పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టముంటే కొనండి లేదంటే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లకు ఉచితంగా ఇవ్వాల్సిన కవర్‌కు సైతం రూ.3 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఉదయం 10.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకే మద్యం విక్రయాలు కొనసాగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, జిల్లా ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు. దీంతో అర్ధరాత్రి దాకా పీకలదాకా తాగుతున్న మందుబాబులు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా 162 మద్యం దుకాణాలు కొనసాగుతుండగా, మొత్తం 11 సర్కిళ్లు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 6 సర్కిళ్ల (సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్)లో 87 మద్యం దుకాణాలున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలోని ఐదు సర్కిళ్ల (మెదక్, సిద్దిపేట, గజ్వేల్, మిర్దొడ్డి, రామాయంపేట)లో 75 మద్యం దుకాణాలున్నాయి. మద్యం కల్తీ కాకుండా, అధిక ధరకు విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. కానీ వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో ఎక్సైజ్ అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని సైతం తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహించినా అవన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు ఆడింది ఆటా, పాడింది పాటగా తయారైంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించడం, మద్యాన్ని కల్తీ చేసేయడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది. దీంతో మందుబాబులు జేబుతో పాటు శరీరాన్నీ గుల్ల చేసుకుంటున్నారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేయడంతో మందుబాబులంతా అక్కడ తాగేసి రోడ్లపై చిందులు వేస్తున్నారు. దీంతో ఆ దారి వెంట వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సీల్
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ ఎన్నికలు గురువారం ముగియడంతో శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎంలను భద్రపరిచిన అధికారులు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించారు. గుమ్మిడిపూండి, తిరువళ్లూరు, పూందమల్లి, ఆవడి, మాదవ రం పొన్నేరి నియోజక వర్గాల ఈవీఎంలను పోలీసు బందోబస్తు నడుమ శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అనంతరం అభ్యర్థుల చేత ఈవీఎంలను భద్రపరిచి స్క్రూటినింగ్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పోలైన ఓట్లను సరి చూసుకున్న తరువాత వాటికి సీల్ వేశారు. అనంతరం కలెక్టర్ వీరరాఘవరావుమాట్లాడుతూ ఆరంబాక్కం ప్రాంతంలోని నాలుగు మత్స్యకార గ్రామాలలో 10 శాతం ఓటింగ్ కూడా పోల్ కాలేదన్నారు. అక్కడ రీపోలింగ్‌కు అవకాశం లేదని వివరించారు. ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను చేపట్టినట్టు వివరించారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నట్టయితే అక్కడే తమ ఎజెంట్లను ఉంచుకోవచ్చని ఆయన వివరించారు. -
సీల్ పిల్లని ఏమంటారు?
అరణ్యం ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి! జీవితంలో చాలాభాగం ఇవి నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి! ఆక్సిజన్ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి! నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది! మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి సీల్స్! వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవో, ఓడో వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట! ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయి. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు! వీటి చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు! ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట! సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా వీటికి తెలిసిపోతుంది. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి! సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికయితే ఎంతో డిమాండ్ ఉంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది! రంగులు మార్చే పిట్ట! స్కార్లెట్ ఇబిస్... ఈ ఎర్రటి విహంగం పేరు! ఇబిస్ పక్షులు అమెరికాలో ఉంటాయి. వీటిలో రెండే రెండు రకాలు ఉంటాయి. మొదటిది క్రెస్టెడ్ ఇబిస్. ఇది తెల్లగా ఉంటుంది. ఎంత తెలుపంటే... పాలు అంత! ఇక రెండోది స్కార్లెట్ ఇబిస్. ఇది ఎర్రగా ఉంటుంది. ఎంత ఎర్రగా అంటే... రక్తమంత! నిజానికి స్కార్లెట్ ఇబిస్లు పుట్టినప్పుడు ముదురు గోధుమరంగులో ఉంటాయట. కానీ ఎదిగేకొద్దీ ఆ రంగు వెలిసిపోయిన ట్టుగా అవుతుంది. తర్వాత వీపుమీద ఎర్రగా చిన్న మచ్చలా వస్తుందట. ఆపైన ఆ రంగు ఒళ్లంతా పాకి, చివరికిలా ఎర్రగా తయారవుతాయి. ఎర్రగా ఉండే పూలు, ఆకులు ఎక్కువగా తింటాయని, అందువల్లే వాటి శరీరం అలా అవుతోందని మొదట్లో అనుకునేవారు. కానీ వాటి జన్యువుల్లో వచ్చే మార్పుల కారణంగానే అలా తయారవుతున్నాయని పరిశోధకులు అన్నారు. అయితే అసలైన కారణం మాత్రం ఇంతవరకూ తెలియలేదు!