కేప్ టౌన్: సముద్రపు క్షీరదం సీల్‌కు రేబిస్ సోకడాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సీల్స్ ఎక్కువగా అంటార్కిటిక్ జలాల్లో కనిపిస్తాయి. ఇవి చల్లని ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రభుత్వ పశువైద్యుడు డాక్టర్ లెస్లీ వాన్ హెల్డెన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పశ్చిమ, దక్షిణ తీరాలలోని వివిధ ప్రదేశాలలో 24 కేప్ సీల్స్ రేబిస్‌తో బాధపడుతూ మృతిచెందాయని తెలిపారు.
క్షీరదాలను రేబిస్ అమితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి వైరస్ మనుషులకు సోకుతుంది. రేబిస్ సోకితే అది ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ అనేది లాలాజలం ద్వారా లేదా జంతువులు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను రకూన్లు, కొయెట్‌లు, నక్కలు, పెంపుడు కుక్కలలో చాలా కాలం క్రితమే కనున్నారు. అయితే సముద్రపు క్షీరదాలలో రేబిస్ వైరస్ కేసు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.
1980ల ప్రారంభంలో నార్వేలోని స్వాల్‌బార్డ్ దీవుల్లోని సముద్రపు క్షీరదాల్లో రేబిస్‌కు సంబంధించిన ఒక కేసును గుర్తించారు. అయితే సీల్స్‌లో రేబిస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు తొలిసారిగా కేప్ టౌన్ బీచ్‌లో ఒక కుక్కను సీల్ కరిచినప్పుడు ఆ సీల్‌లో రేబిస్‌ను గుర్తించారు. ఆ కుక్కకు రేబిస్ సోకింది. అనంతరం పరిశోధకులు 135 సీల్ మృతదేహాల మెదడు నమూనాలలో రేబిస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో 20 కొత్త నమూనాలను కూడా సేకరించారు. తదుపరి పరీక్షలో మరిన్ని రేబిస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు సీల్స్‌కు రేబిస్ ఎలా సోకుతుంది? వాటిలో వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందా? దీనిని అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాండాలకు బదులు..
Comments
Please login to add a commentAdd a comment