outbreak feared
-
సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు
కేప్ టౌన్: సముద్రపు క్షీరదం సీల్‌కు రేబిస్ సోకడాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సీల్స్ ఎక్కువగా అంటార్కిటిక్ జలాల్లో కనిపిస్తాయి. ఇవి చల్లని ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రభుత్వ పశువైద్యుడు డాక్టర్ లెస్లీ వాన్ హెల్డెన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పశ్చిమ, దక్షిణ తీరాలలోని వివిధ ప్రదేశాలలో 24 కేప్ సీల్స్ రేబిస్‌తో బాధపడుతూ మృతిచెందాయని తెలిపారు.క్షీరదాలను రేబిస్ అమితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి వైరస్ మనుషులకు సోకుతుంది. రేబిస్ సోకితే అది ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ అనేది లాలాజలం ద్వారా లేదా జంతువులు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను రకూన్లు, కొయెట్లు, నక్కలు, పెంపుడు కుక్కలలో చాలా కాలం క్రితమే కనున్నారు. అయితే సముద్రపు క్షీరదాలలో రేబిస్ వైరస్ కేసు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.1980ల ప్రారంభంలో నార్వేలోని స్వాల్బార్డ్ దీవుల్లోని సముద్రపు క్షీరదాల్లో రేబిస్‌కు సంబంధించిన ఒక కేసును గుర్తించారు. అయితే సీల్స్‌లో రేబిస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు తొలిసారిగా కేప్ టౌన్ బీచ్‌లో ఒక కుక్కను సీల్ కరిచినప్పుడు ఆ సీల్లో రేబిస్‌ను గుర్తించారు. ఆ కుక్కకు రేబిస్ సోకింది. అనంతరం పరిశోధకులు 135 సీల్ మృతదేహాల మెదడు నమూనాలలో రేబిస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో 20 కొత్త నమూనాలను కూడా సేకరించారు. తదుపరి పరీక్షలో మరిన్ని రేబిస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు సీల్స్కు రేబిస్ ఎలా సోకుతుంది? వాటిలో వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందా? దీనిని అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాండాలకు బదులు.. -
ఇజ్రాయెల్‌ను వణికిస్తున్న ‘వెస్ట్ నైల్ ఫీవర్’, లక్షణాలు, జాగ్రత్తలు
ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ ఆందోళన రేపుతోంది. మే ప్రారంభంలో దేశంలో వ్యాప్తి చెందినప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెస్ట్ నైల్ ఫీవర్’ తో దేశంలో31 మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్‌లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.జిన్హువా వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం అక్కడ కొత్తగా 49 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 405కి చేరుకుంది. 2000 నాటి వార్షిక రికార్డు గరిష్ట స్థాయి 425 కేసులకు చేరువలో ఉంది. దీంతో అప్రమత్తమైన, ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. దోమలు పెచ్చరిల్లే వాతావరణం కారణంగా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.70 అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులతోపాటు పిల్లలు కూడా వైరస్‌తో బాధపడుతున్నారని పేర్కొంది.గత రెండు నెలల్లో 159 పక్షులు వైరస్ బారిన పడ్డాయని, మొత్తం 2023లో పక్షులలో కేవలం మూడు ఇన్ఫెక్షన్లు మాత్రమే సంభవించాయని ఇజ్రాయెల్ యొక్క చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, తమీర్ గోషెన్ మీడియాకు తెలిపారు.వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? వెస్ట్ నైల్ ఫీవర్ వెస్ట్ నైల్ వైరస్ వల్ల వస్తుంది. ఇది దోమకాటు ద్వారా జంతువలనుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ మనుషులు, పక్షులు, దోమలు, గుర్రాలు , కొన్ని ఇతర క్షీరదాలకు సోకుతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ చెబుతోంది.వెస్ట్ నైల్ ఫీవర్‌లో సాధారణంగా, తేలికపాటి ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), మెదడు , వెన్నుపాము లైనింగ్ (మెనింజైటిస్), మెదడు దాని చుట్టుపక్కల పొర (మెనింగోఎన్సెఫాలిటిస్) వాపునకు కారణమవుతుంది.ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా మారవచ్చు. వెస్ట్ నైలు జ్వరం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోఇన్వాసివ్ వ్యాధికి దారితీస్తుంది. గందరగోళం, మూర్ఛ, కండరాల బలహీనత , అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం పోలియో కూడా సంభవించవచ్చు.వెస్ట్ నైల్ వైరస్ కోరియోరెటినిటిస్ , ఆప్టిక్ న్యూరిటిస్ (రెటీనా వాపు, నరాల) కంటి సమస్యలను కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపును శాశ్వతంగా కోల్పోవచ్చు..మయోకార్డిటిస్‌కు దారితీసే గుండెపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. గుండె కండరాల వాపు, గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. కిడ్నీ వాపు నెఫ్రైటిస్కు కారణం కావచ్చు.నివారణ చర్యలుచుట్టుపక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడటం చాలా అవసరం. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిపెరిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. తాగు నీరు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఏ కొద్ది అనుమానం వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
చైనాను వణికిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా.. కరోనా తరహా లాక్డౌన్లు..
బీజింగ్: ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా చైనా హడలెత్తిపోతోంది. దీంతో నివారణ చర్యగా జియాన్ నగరంలో కరోనా లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. గత వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 25.1 శాతం నుంచి 41.6 శాతానికి పెరిగినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనాకు తీసుకున్న చర్యలే తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్కూళ్లు, వ్యాపార కార్యకాలాపాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారుల లాక్డౌన్ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. లాక్డౌన్ విధించడం కంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఉత్తమమని జియాంగ్ నగరవాసులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చదవండి: లైవ్ మ్యూజిక్ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే.. -
చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్! విస్తుపోయిన బీజింగ్
చైనాలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు సడలించాకే కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో చైనాకు ఆపన్నహస్తం అందించి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం భారీగా పెరుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో చైనాకు అవసరమైన సాయాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ కొత్త ఏడాదిలో మావనతా దృక్పథంతో మహమ్మారీ నుంచి ఎక్కువ మంది చైనా ప్రజలు బయటపడి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా అవసరమైన సాయం అందించేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఇంగ్ వెన్ చెప్పారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి యుద్ధం ఒక ఎంపిక కాదంటూ చైనాతో చర్చలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్వీప సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నయని, శాంతి స్థిరత్వానికి భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ.. ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ నూతన సంవత్సరం ప్రసంగంలో తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారు అంటూ ప్రసంగించారు. ఐతే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో గతంలో తైవాన్, చైనా దేశాలు తమ చర్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మహమ్మారి విషయంలో తైవాన్ సమర్థవంతంగా పనిచేయలేదంటూ చైనా విమర్శించగా,.. మరోవైపు తైవాన్ చైనాలో పారదర్శకత లోపించిందని, తమ దేశానికి సరఫరా చేసే వ్యాక్సిన్లలో జోక్యం చేసుకుందంటూ మండిపడింది. ఐతే బీజింగ్ తైవాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. (చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు) -
కేరళలో ‘మీజిల్స్’ పంజా.. 160 మంది చిన్నారులకు వైరస్
తిరువనంతపురం: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు కాగా.. తాజాగా కేరళలోనూ భారీగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోందని తెలిపింది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. మరోవైపు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్. అయితే, తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ‘మలప్పురమ్‌లో మీజిల్స్ వైరస్‌ను గుర్తించిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో జయపురపైనా సమీక్షించాం. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాం.’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇదీ చదవండి: మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి -
Marburg virus: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్!
అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్' వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 'సెనెగల్‌లోని ఇన్స్టిట్యూట్ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం.. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్ వైరస్ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్ వైరస్ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్ అశాంతి నగర్‌కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం -
Monkeypox: మంకీపాక్స్ కరోనాలాగా విజృంభిస్తుందా?
ఊహించినదానికంటే వేగంగానే.. మంకీపాక్స్ వైరస్ మరికొన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ శాంపిల్‌లో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించినట్లు యూఏఈ వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కావడంతో ఆమె నుంచి వివరాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడతాం అని అధికారులు వెల్లడించారు. అలాగే బెల్జియం నుంచి తిరిగి స్వదేశానికి(చెక్ రిపబ్లిక్) చేరుకున్న ఓ మహిళలోనూ వైరస్ జాడ గుర్తించారు. వీటితో పాటు మరో మూడు అనుమానిత కేసుల ఫలితాలు రావాల్సి ఉందని చెక్ రిపబ్లిక్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వైరస్ కేసులు పెరుగుతున్న వేళ.. వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. మంకీపాక్స్‌కు చికిత్స ఉందని, పైగా ప్రమాదం తక్కువగా పొంచి ఉందని, SARS-COV-2 లాగా వైరస్ అంత తేలికగా వ్యాప్తి చెందే అవకాశమే లేదని భరోసా ఇస్తున్నారు. ఇక మంకీపాక్స్ వైరస్‌లోనూ వేరియెంట్లు గుర్తించిన సైంటిస్టులు.. ప్రస్తుత విజృంభణ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచిస్తున్నారు. ఇప్పటివరకు 19 దేశాల్లో.. 237 మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలో మంకీపాక్స్ విజృంభణ వెలుగు చూశాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుదేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: అసాధారణ శృంగారం వల్లే మంకీపాక్స్! చదవండి: మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. -
యూపీలోని కాన్పూర్‌లో విజృంభిస్తోన్న జికా వైరస్
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా, గత వారం రోజులుగా కాన్పూర్‌లో పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ కేసుల సంఖ్య సోమవారంనాటికి 89కి చేరింది. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. మొదటి జికా కేసు అక్టోబర్ 23న గుర్తించగా, గత వారంలో కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వ్యాపిస్తుంది. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తికి కారకాలు కూడా. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్ర బారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాన్పూర్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌తోపాటు, వైరస్‌ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. -
Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్‌లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. ఏమిటీ సాల్మొనెల్లా..? సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమౌతాయి కూడా. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
కరోనా ఆరంభం మాత్రమే: ‘బ్యాట్ ఉమెన్’
బీజింగ్: ప్రంపచ దేశాలన్ని కరోనా ధాటికి విలవిల్లాడున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల వ్యవధిలో ప్రపంచాన్ని అరవై ఏళ్ల వెనక్కు తీసుకెళ్లింది ఈ మహమ్మారి. ఈ నేపథ్యంలో కరోనా కేవలం ఆరంభం మాత్రమే అని.. వైరస్ల గురించి ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా పొరాటం చేయకపోతే.. ముందు ముందు మరింత భయంకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ‘బ్యాట్ ఉమెన్’గా ప్రసిద్ధి చెందిన షి జెంగ్లీ. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న షి జెంగ్లీ గబ్బిలాల్లో కరోనా వ్యాప్తి గురించి పరిశోధన చేస్తున్నారు. దాంతో ఆమె బ్యాట్ ఉమెన్‌గా ప్రసిద్ధి చెందారు. (వూహాన్ జనాభా మొత్తానికి కరోనా టెస్టులు) ఈ క్రమంలో షి జెంగ్లీ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు వైరస్ల గురించి మన దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రపంచ దేశాలన్ని ఈ విషయంలో కలసి కట్టుగా పని చేయకపోతే రానున్న రోజుల్లో కరోనాను మించిన అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మరింత ఎక్కువగా ఉంది’ అని హెచ్చరిస్తున్నారు షి జెంగ్లీ. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే.. అడవి జంతువుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ల గురించి పరిశోధనలు జరిపి.. వాటి గురించి ముందుగానే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వాలన్నారు షి జెంగ్లీ. లేదంటే రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక వైరస్‌లపై పరిశోధనల్లో ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పారదర్శకంగా ఉండి ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. సైన్స్‌ను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు షి జెంగ్లీ.(కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం) -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
డెంగీ జ్వరాలపై అప్రమత్తం
క్షేత్రస్థాయికి వెళ్లాలని కమిషనర్‌కు వైద్య శాఖ మంత్రి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: డెంగీ జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. బాధితులను ఆస్పత్రుల్లో చేర్పించాలని ఆయన వైద్య సిబ్బందికి చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీలో పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయా జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు గ్రామాలే డెంగీ బారిన పడినట్లు వారలొచ్చాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏరియా ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, కిట్లు, ఇతరత్రా నిర్వహణ కోసం ఒక్కో ఆసుపత్రికి రూ. 30 లక్షల చొప్పున రూ. 10.20 కోట్లు గురువారం విడుదల చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా త్వరలో 12 ప్లేట్లెట్లను లెక్కించే యంత్రాలను కూడా సరఫరా చేయనున్నారు. వీటి సరఫరాకు సంబంధించి ఇప్పటివరకు నెలకొన్న వివాదం పరిష్కారమైనందున అవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. జ్వరాలతో బాధపడే ప్రజలను ఆగమేఘాల మీద ఏరియా ఆసుపత్రులకు తీసుకొచ్చి అందుబాటులో ఉన్న నిర్ధారణ పరీక్షలతో ప్రజలను ఆదుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. డెంగీ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.