చైనాలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు సడలించాకే కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో చైనాకు ఆపన్నహస్తం అందించి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం భారీగా పెరుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో చైనాకు అవసరమైన సాయాన్ని అందిస్తానని ప్రకటించారు.
ఈ కొత్త ఏడాదిలో మావనతా దృక్పథంతో మహమ్మారీ నుంచి ఎక్కువ మంది చైనా ప్రజలు బయటపడి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా అవసరమైన సాయం అందించేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఇంగ్ వెన్ చెప్పారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి యుద్ధం ఒక ఎంపిక కాదంటూ చైనాతో చర్చలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్వీప సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నయని, శాంతి స్థిరత్వానికి భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ.. ఆవేదన చెందారు.
ఇదిలా ఉండగా, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ నూతన సంవత్సరం ప్రసంగంలో తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారు అంటూ ప్రసంగించారు. ఐతే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో గతంలో తైవాన్, చైనా దేశాలు తమ చర్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మహమ్మారి విషయంలో తైవాన్ సమర్థవంతంగా పనిచేయలేదంటూ చైనా విమర్శించగా,.. మరోవైపు తైవాన్ చైనాలో పారదర్శకత లోపించిందని, తమ దేశానికి సరఫరా చేసే వ్యాక్సిన్‌లలో జోక్యం చేసుకుందంటూ మండిపడింది. ఐతే బీజింగ్ తైవాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
(చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు)
Comments
Please login to add a commentAdd a comment