ఇజ్రాయెల్‌ను వణికిస్తున్న ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’, లక్షణాలు, జాగ్రత్తలు | Israel Faces West Nile Fever Outbreak 31 Deaths Reported, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ను వణికిస్తున్న ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’, లక్షణాలు, జాగ్రత్తలు

Published Mon, Jul 15 2024 3:54 PM | Last Updated on Mon, Jul 15 2024 5:41 PM

Israel Faces West Nile Fever Outbreak 31 Deaths Reported

ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్‌ ఆందోళన రేపుతోంది. మే ప్రారంభంలో దేశంలో వ్యాప్తి చెందినప్పటినుంచీ ఇప్పటిదాకా  ‘వెస్ట్ నైల్‌ ఫీవర్‌’ తో దేశంలో31 మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్‌లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.

జిన్హువా వార్తా సంస్థ రిపోర్ట్‌ ప్రకారం అక్కడ కొత్తగా 49 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 405కి చేరుకుంది.  2000 నాటి వార్షిక రికార్డు గరిష్ట స్థాయి 425 కేసులకు చేరువలో ఉంది. దీంతో అప్రమత్తమైన, ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. 

దోమలు పెచ్చరిల్లే వాతావరణం కారణంగా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.70  అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులతోపాటు  పిల్లలు కూడా వైరస్‌తో బాధపడుతున్నారని పేర్కొంది.

గత రెండు నెలల్లో 159 పక్షులు వైరస్ బారిన పడ్డాయని, మొత్తం 2023లో పక్షులలో కేవలం మూడు ఇన్ఫెక్షన్లు మాత్రమే సంభవించాయని ఇజ్రాయెల్ యొక్క చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, తమీర్ గోషెన్ మీడియాకు తెలిపారు.


వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? 

వెస్ట్ నైల్ ఫీవర్ వెస్ట్ నైల్ వైరస్ వల్ల వస్తుంది. ఇది దోమకాటు ద్వారా జంతువలనుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ మనుషులు, పక్షులు, దోమలు, గుర్రాలు , కొన్ని ఇతర క్షీరదాలకు సోకుతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ చెబుతోంది.

వెస్ట్ నైల్  ఫీవర్‌లో  సాధారణంగా, తేలికపాటి ఫ్లూ వంటి  లక్షణాలుంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు, మెదడు  వాపు (ఎన్సెఫాలిటిస్), మెదడు , వెన్నుపాము  లైనింగ్ (మెనింజైటిస్), మెదడు దాని చుట్టుపక్కల పొర (మెనింగోఎన్సెఫాలిటిస్) వాపునకు కారణమవుతుంది.

ఒక్కోసారి ఇవి  ప్రాణాంతకంగా మారవచ్చు. వెస్ట్ నైలు జ్వరం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోఇన్వాసివ్ వ్యాధికి దారితీస్తుంది.  గందరగోళం, మూర్ఛ, కండరాల బలహీనత , అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం పోలియో  కూడా సంభవించవచ్చు.

వెస్ట్ నైల్ వైరస్ కోరియోరెటినిటిస్ , ఆప్టిక్ న్యూరిటిస్  (రెటీనా వాపు, నరాల) కంటి సమస్యలను కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపును శాశ్వతంగా కోల్పోవచ్చు..

మయోకార్డిటిస్‌కు దారితీసే గుండెపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. గుండె కండరాల వాపు, గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. కిడ్నీ వాపు నెఫ్రైటిస్‌కు కారణం కావచ్చు.

నివారణ చర్యలు
చుట్టుపక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడటం చాలా అవసరం.  పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం  పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిపెరిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. తాగు నీరు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి.  ఏ కొద్ది అనుమానం వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని  నిపుణులు సూచిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement