ప్రంపచంలోనే అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుంది. దీన్ని నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం.. ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ఈ అవినీతి (పీపీఐ) ర్యాంకులు ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి అనేది అతిపెద్ద ప్రమాదకరమైన సమస్యగా మారిందని పేర్కొంది. ఈ జాబితాలో డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా తొలి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత స్థానంలో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అయితే భారత్ 96వ స్థానంలో ఉంది. ఈ అవినీతి సూచిక దాదాపు 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ అవినీతిని సున్నా నుంచి వంద మార్కుల స్కోరు ఆధారంగా నిర్థారిస్తుంది. సున్నాని అత్యంత అవినీతిని సూచించగా, వంద అనేది అవినీతి రహితం నిర్ణయించి ర్యాంకులు ఇవ్వడం జరగుతుంది.
అయితే ఈ ఏడాది అవినీతి అవగాహన సూచిక (CPI) ప్రకారం..చాలా దేశల్లో ఈ విషయంలో మంచి మార్పు కనిపించిందని పేర్కొంది. ఇక ఆ జాబితా ప్రకారం 2024లో భారతదేశం మొత్తం స్కోరు 38 కాగా, 2023లో 39, 2022లో 40. అయితే గతేడాది 39 స్కోరుతో 93 స్థానంలో నిలివగా ఈ ఏడాది మరో మూడు స్థానాలకు పడిపోయింది.
అలాగే భారత్‌కి పొరుగున్న ఉన్న దేశాలు పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149వ స్థానాలతో త్యంత అవినీతి గల దేశాలుగా నలిచాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కంటే తక్కువ అవినీతి గల దేశంగా 76వ స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 69 పాయింట్ల నుంచి 65కి పడిపోయింది. ఇదే క్షీణతలో ఉన్న ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లుతో 67 మార్కులతో ఐదు స్థానాలకి పడిపోయి 25వ స్థానంలో నిలిచింది. ఇక జర్మని మూడు పాయింట్లు తగ్గి 75 స్కోరుతో 15వ స్థానంలో నిలిచింది. అలాగే దశాబ్దానికి పైగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనిజులా వంటి దేశాలు అవినీతి సూచికలో అత్యంత చెత్త ప్రదర్శనను కనిబర్చినట్లు వెల్లడించింది.
అలాగే ప్రధాన అవినీతి కేసుల్లో న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో కూడా ఐదు పాయింట్లు తగ్గి 26కి స్కౌర్ చేసిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. చివరిగా అత్యంత అవినీతి దేశాలుగా దక్షిణ సూడాన్ కేవలం ఎనిమిది పాయింట్లతో ఇండెక్స్‌లో అట్టడుగుకు పడిపోగా, సోమాలియా స్కోరు తొమ్మిదికి పడిపోయింది. గతంలో అత్యంత అవినీతి దేశంగా తొలి స్థానంలో ఉన్న సోమాలియా స్థానాన్ని దక్షిణ సూడాన్ ఆక్రమించింది
వాటి తర్వాత స్థానాల్లో వెనిజులా 10, సిరియా 12 మార్కులతో అత్యంత అవినీతి దేశాల జాబితాలో నిలిచాయి. కాగా, 2024లో "ప్రపంచ అవినీతి స్థాయిలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నప్పటికీ, 148 దేశాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల మంచి పురోగతి సాధించేలా మరింతగా ఆయా దేశాలు కృషి చేయాల్సి ఉందని పేర్కొంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ .
(చదవండి: అరవై రోజుల అద్భుతం 'నవార'!)
Comments
Please login to add a commentAdd a comment