![PM Modis Gifts For US Veep JD Vance's Children And French President](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/modi.jpg.webp?itok=fFGuQMUL)
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.
టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు.
ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు.
ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది.
అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం.
(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!)
Comments
Please login to add a commentAdd a comment