
అమెరికాలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలకల రేపింది. పాతికేళ్లలో లేని విధంగా అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్ - యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొందరలో పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాల్సిన పైలట దుర్మరణం పాలయ్యాడు. ఒక్కొక్క మృతదేహాన్ని గుర్తిస్తున్న కొద్దీ అనేక హృదయ విదారక కథనాలు పలువురి మనసుల్ని కకావికలం చేస్తున్నాయి.
ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్
భారతీయ కుటుంబానికి చెందినయువతితో పాటు తన వివాహం కోసం ఎదురుచూస్తున్నఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ మరణం వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం సురక్షితమైన ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాలముందు, ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు , విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ వర్జీనియాలోని పోటోమాక్ నదిలో పడిపోయారు. వీరిలో విమాన సిబ్బంది ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ (28) ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్ కూడా ఉన్నారు. దీంతొ సామ్ తండ్రి ఆవేదన వర్ణనాతీంగా ఉంది.
లిల్లీ తండ్రి తిమోతి లిల్లీ గురువారం ఫేస్‌బుక్ పోస్ట్
‘‘సామ్ పైలట్ అయినప్పుడు నేను చాలా గర్వపడ్డాను..ఇప్పుసలు నిద్ర పట్టడంలేదు. చాలా బాధగా ఉంది, ఏడ్చే శక్తి కూడాలేదు. నేను వాడిన ఇక చూడలేనని తెలుసు నా గుండె బద్దలైపోతోంది." అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో గొప్పగా రాణిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసు కోబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. తన జీవితంలో ఇంతకంటే బాధకరమైన రోజు మరొకటి ఉండదు అంటూ విలపించారు. ఆర్మీ పైలట్ ఘోరమైన తప్పు చేశాడంటూ 20 ఏళ్ల పాటు ఆర్మీలో హెలికాప్టర్ పైలట్‌గా పనిసిన తిమోతి వాపోయారు.
అటు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్ జోనాథన్ కాంపోస్ మరణంపై తోటి పైలట్లు సంతాపం ప్రకటించారు. కాంపోస్ 2022లో ఎయిర్‌లైన్‌కు కెప్టెన్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు. కాంపోస్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, విమాన ప్రయాణాలంటే చాలా ఇష్టపడేవాడని, కుటుంబం అంటే ఎనలేని ప్రేమ అని కుటుంబం సభ్యుడొకరు కంట తడిపెట్టారు.
ఇయాన్ ఎప్‌స్టీన్
53 ఏళ్ల ఇయాన్ ఎప్‌స్టీన్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విమాన సహాయకుడిగా ఉన్నాడు, ఈ ఘోర ప్రమాదంలో చనిపోవడంపై అతని సోదరి రాబీ బ్లూమ్ విచారాన్ని ప్రకటించారు. "నా సోదరుడు చాలా అద్భుతమైన వ్యక్తి. జీవితాన్ని ప్రేమించాడు. ప్రయాణాలంటే ఇష్టం. అందుకే తన ఉద్యోగాన్ని కూడా ప్రేమించాడు. అతను వెళ్ళిన ప్రతిచోటా స్నేహితులను తయారు చేసుకునేవాడు. ఇలా అర్థాంతరంగా కుటుంబానికి దూరం కావడం విషాదం అంటూ బ్లూమ్ చెప్పారు.
ట్రిప్‌కు వెళ్లిన ఏడుగురు స్నేహితుల విషాదాంతం
మైఖేల్ “మైకీ” స్టోవాల్ ,జెస్సీ పిచర్, ఇతర స్నేహితులతో కలిసి, కాన్సాస్‌కు విహారానికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల గడిపి తిరిగి ఇంటికి తిరిగి వస్తూ, తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.మైకీకి అజాత శత్రువు. అందర్నీ ప్రేమిస్తాడు. చాలా హ్యాపీగా జీవనం సాగించే మనషి, కొడుకుగా, తండ్రిగా చాలా మంచివాడు స్టోవాల్ తల్లి క్రిస్టినా స్టోవాల్ కన్నీరుమున్నీరైంది. పిచర్‌కు పెళ్లి అయ్యి ఏడాది మాత్రమే. కొత్త ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. తనలాంటి కష్టం మరే తండ్రికి రాకూడదంటూ పిచర్ తండ్రి జేమ్సన్ పిచర్ చెప్పారు.
ఇదీ చదవండి: US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
ముగ్గురు యువ స్కేటర్లు , ఒక కోచ్
డెలావేర్‌కు చెందిన యూత్ స్కేటర్లు సీన్ కే, ఏంజెలా యాంగ్, కోచ్ అలెగ్జాండర్ “సాషా” కిర్సనోవ్ ఈ ప్రమాదంలో మరణించారని రాష్ట్ర సెనెటర్ క్రిస్ కూన్స్ ధృవీకరించారు.
పుట్టిన రోజునే మరణించినఎలిజబెత్ కీస్ : ఎలిజబెత్ కీస్ ఒక న్యాయవాది,34వ పుట్టినరోజున ప్రమాదంలో తనకు దూరమైందని ఆమె భర్త డేవిడ్ సీడ్మాన్ చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment