
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది.
థాయ్‌లాండ్, మయన్మార్‌లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది.
సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్‌లు, వీల్‌చైర్‌లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు.
ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు.
Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf
— Miia 🩵 (@i30199) March 28, 2025
(చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..)