ఒంటరిగా ఉంటే సింహం అయినా సైలెంట్ అయిపోవాల్సిందే. లేదంటే అంతే సంగతి. ఒక్కొసారి స్థాన బలం, సముహం బలం చూసుకునే దాడికి దిగాలి. లేదంటూ కింగ్‌లాంటి జంతవైనా పిల్లిలా తోకముడవాల్సిందే. అచ్చం అలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.
దక్షిణాఫ్రికాలో రద్దీగా ఉండే రహదారిపైకి కొన్నొ కొండముచ్చులు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చొన్నాయి. మరోవైపు వాహనాలు వాటినిదాటుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంతలో సరిగ్గా అదే టైంలో ఓ చిరుత అటువైపుగా వస్తుంది. కొండముచ్చులే కదా అని తేలిగ్గా తీసుకుందో ఏమో వాటివైపుకే దూసుకొచ్చింది. ఇంతలో ఒకవైపు ఉన్న ఓ కొండముచ్చుపైకి దాడి చేసేందుకు రెడీ అయ్యి ఒక ఊదుటన దూకింది.
అంతే ఒక్కసారిగా మేమంతా ఉన్నాం అంటూ కొండముచ్చుల గ్యాంగ్ అంతా ఒకేసారి చిరతపై దాడి చేశాయి. దెబ్బకి హడలిపోయిన చిరుత అక్కడ నుంచి జారుకునేందుకు యత్నించింది. అయినా ఆ కొండముచ్చులు విడువకుండా దాన్ని తరుముకొడుతూ వెళ్లడం విశేం. కలిసి ఉంటే ఎంతపెద్ద కష్టన్నైనా జయించొచ్చు అని నిరూపించాయి ఆ కొండముచ్చులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: బీచ్‌లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ! ఆమెని చూస్తే కార్పోరేటర్లకు దడ!)
Comments
Please login to add a commentAdd a comment