
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..
పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు.
ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్‌ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా.
మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్.
ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి.
Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy
— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025
(చదవండి: ఆన్‌లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment