annual celebrations
-
స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్‌ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025 (చదవండి: ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..) -
కొల్లేరమ్మ జాతర చూసొద్దాం రండి!
కైకలూరు: చుట్టూనీరు.. మధ్యన ద్వీపకల్పం.. పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన క్షేత్రంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొల్లేటి గ్రామాల ఆరాధ్య దేవత పెద్దింట్లమ్మ క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చరిత్రలో కొల్లేటికోట ‘దండకారణ్య మధ్యమున మహా సరస్సొకటి కలదు. అది జల విహంగములతో అత్యంత రమణీయమైనది’ అని అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్టు రామాయణంలోని అరణ్య కాండంలో పేర్కొనబడింది. చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ కొల్లేరు సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దండి మహాకవి ‘దశకుమార చరిత్ర’లో కొల్లేరు సరస్సుతోపాటు బహు సాహసిగా పేరు గడించిన తెలుగు భీముడు (భుజబలపట్నం ఆ«దీశుడు) గురించి రాశారు. విజయాదిత్య చక్రవర్తి పార్వతీదేవి రూపంలో కొలువైన అమ్మవారిని మొదటిసారిగా పెద్దమ్మగా సంబోధించారు. కమలాకరపుర వల్లభుల శాసనాల ప్రకారం వేంగి–చాళుక్య రాజులకు వైవాహిక బాంధవ్యాలు ఉండేవి. వీరికి ప్రధాన పురాలుగా కమలాకరపురం (ఏలూరు), పద్మినీపురం (గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)ను వ్యవహరించారు. కోస్తా జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల విరాళం రూ.4.50 కోట్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిర్మించారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ క్షేత్రానికి చేరుకోవడానికి సర్కారు కాలువపై ఇనుప వంతెన మాత్రమే ఆధారంగా ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.14.70 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు పూర్తి పెద్దింట్లమ్మ జాతర మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తాం. కల్యాణం రోజునే ప్రభ బండి, బోనాలు, కలువమ్మల గ్రామోత్సవం జరుగుతుంది. చివరి రోజున కోనేరులో తెప్పోత్సవం ఉంటుంది. కొల్లేరు వారధి పూర్తికావడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. – కందుల వేణుగోపాలరావు, ఈవో -
సీఎం జగన్‌కు శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
శ్రీ విద్యానికేతన్ 31వ వార్షికోత్సవ వేడుకలు.. హాజరైన మంచు ఫ్యామిలీ
-
విశాఖ: శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
-
తిరుమలలో 3రోజులపాటు వార్షిక వసంతోత్సవాలు
-
వైరల్ : చీరలు కట్టుకుని కాలేజీకి అబ్బాయిలు
పుణే : పుణేలోని పెర్గూసన్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వారి కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో చీరలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లింగ సమానత్వం గురించి ఒక సందేశాన్ని చెప్పడానికే ఈ వేషధారణను ఎంచుకొన్నామని ఆ విద్యార్థులు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే.. పెర్గూసన్ కాలేజీలో ప్రతీ సంవత్సరం నిర్వహించే వార్షిక వేడుకల్లో ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని విద్యార్థులు ఆ వస్త్రధారణలో వస్తుంటారు. అయితే ఈ ఏడాది 'టై అండ్ శారీ డే' పేరుతో థీమ్‌ను ఎంచుకొని కాలేజీ యాజమాన్యం వేడుకలను నిర్వహించింది. కాలేజీలోని విద్యార్థులందరు వారికి నచ్చిన వస్త్రధారణలో వచ్చారు. అయితే అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్లు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి చీరలు ధరించి ఆడవాళ్లలాగా తయారై కాలేజీకి వచ్చారు. అయితే వారి వేషధారణను చూసి మొదట అందరూ నవ్వుకున్న అసలు విషయం తెలిసిన తర్వాత వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడడం విశేషం. ఇదే విషయమై వారి ముగ్గురిని కదిలించగా.. ఆకాశ్ పవార్ స్పందిస్తూ.. 'ఆడవారు చీరలు, సల్వార్, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్, ప్యాంట్ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వెళ్లాం. అంతేకాదు లింగ సమానత్వం గురించి చెప్పాలని అనుకున్నామని' పేర్కొన్నాడు. (ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్..!) 'నేను చీరను ధరించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చీర కట్టుకునే సమయంలో ప్రతీసారి అది జారిపడుతుండడంతో ఇక లాభం లేదనుకొని మా స్నేహితురాలు శ్రద్దా సాయం తీసుకున్నాం. ఆమె మాకు చీర ఎలా కట్టుకోవాలో చూపించినప్పుడు అది ఎంత కష్టమైనదో తెలిసింది. అంతేకాదు ఆడవాళ్లు మేకప్‌కు ఎందుకంత సమయం తీసుకుంటారో నాకు ఇప్పుడర్థమయింది' అంటూ సుమిత్ చెప్పుకొచ్చాడు. 'చీరను ధరించి నడిచేటప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించింది. మా ఫ్రెండ్ శ్రద్దాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆమె మాకు సహాయం చేయకుంటే ఇలా రెడీ అయ్యేవాళ్లం కాదని' రుషికేష్ వెల్లడించాడు. అయితే వీరు చేసిన సాహసానికి కాలేజీ యాజమాన్యం వీరిని ప్రశంసించింది. లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని వీరిచ్చిన సందేశానికి కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థులు, చూసిన ప్రతీ ఒక్కరు వారిని మెచ్చుకుంటున్నారు. (వైరల్: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన) -
పద్మావతీదేవీ పాహిమాం
కలియుగదైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటోంది. స్వామి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ... నిత్యకల్యాణం... పచ్చనితోరణంలా ఆలయం భాసిల్లుతోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధిలో అప్పట్లో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పురవీధుల్లో నిర్వహించేవారట. శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోనూ ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఒకప్పుడు తిరుమలగిరులు అరణ్యంతో నిండి ఉండేవి. క్రూరమృగాలు అధికంగా ఉండేవి. దీనికితోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారని పెద్దలు చెబుతున్నారు. అయితే వెయ్యేళ్లకిందట భగవద్రామానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటినుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం (తమిళ) కార్తిక మాసంలో పంచమి తీర్థం నిర్వహిస్తారు. స్వామివారి నుంచి పసుపు, కుంకుమ, గాజులు త దితర మంగళకర ద్రవ్యాలతో అమ్మవారికి స్వా మివారు సారె పంపడం ఆనవాయితీ. తొమ్మిదవ రోజు పంచమితీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. సింహాల మోహన, సాక్షి, తిరుచానూరు బ్రహ్మోత్సవ సేవలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమై, రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనంగా చిన్నశేష వాహనంపై శ్రీ పద్మావతిదేవి విహారం జరిగింది. ►24, ఆదివారం ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంసవాహనం ►25, సోమవారం ఉదయం ముత్యపుపందిరి, రాత్రి సింహవాహనం ►26, మంగళవారం ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంత వాహనం ►27, బుధవారం ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం ►28, గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథోత్సవం, రాత్రి గరుడసేవ ►29, శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ ►30, శనివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం ►డిసెంబరు 1 ఆదివారం పంచమి తీర్థం (చక్రస్నానం), సాయంత్రం ధ్వజావరోహణం -
‘నవ’ వసంతంలోకి.. వైఎస్ఆర్సీపీ
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఆనాడు తెలుగు ప్రజ ల ఆత్మగౌరవం కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ పెద్దలను ఎదురించి పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలే ఊపిరిగా పోరాటాలు చేస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ ప్రయాణంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనే ధ్యేయంగా పార్టీ దూసుకెళ్తోంది. 2011 మార్చి 12న ఆవిర్భావించిన పార్టీ నేటితో ఎనిమిదేళ్లు పూర్తి అయి తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఆదేశించింది. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. జిల్లాలో తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ.. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది. 2012లో జరిగిన ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తాచాటింది. నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తెలిపారు. భారీ కేకు కటింగ్‌తో పాటు జెండావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారు ఆదేశించారు. క్లీన్‌స్వీపే లక్ష్యంగా.. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా జిల్లాలో మరోసారి తన సత్తా చాటేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుక ఇవ్వాలని పార్టీ నాయకులు ఉవ్విళ్లురుతున్నారు. అభ్యర్థి ఎవరైనా మట్టికరిపించాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. జిల్లాలో పార్టీకి వైఎస్ఆర్ అభిమానులు, బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అధికార టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి నాయకులను లాక్కోవాలని చూసింది. అందులో భాగంగా గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిని, ఇద్దరు ఎంపీలను కొనుగోలు చేసింది. అయినా, ఎక్కడా పార్టీ క్యా డర్ చేజారలేదు. వారంతా పార్టీ నవ వసంతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తుండడం విశేషం. -
అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు: కర్నూలు అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రారంభించారు. సప్తగిరి నగర్లో అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన దేశంలోని అగ్ని మాపక సిబ్బందికి నివాళులు అర్పించారు. ప్రజ లకు అవగాహన కల్పించడం కోసం అగ్నిమాపక సిబ్బందిచే జారీ చేసిన కరపత్రాలు, ఫ్లెక్సీలు, గోడ పత్రికలను విడుదల చేసి వారోత్సవాలను ఎస్పీ ప్రారంభించారు. కర్నూలు అగ్నిమాపక స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫైర్ ఎగ్జిబిషన్ స్టాల్‌ను ప్రారంభించారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే (రెస్క్యూ) పరికరాలను పరిశీలించారు. వారోత్సవాల సందర్భంగా నగరంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అగ్నిమాపక కేంద్రం స్టేషన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈనెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ మేనేజర్ రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి బాలరాజు, అగ్నిమాపక కేంద్రాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, అసిస్టెంట్ రిజిస్టర్లు గోపీకృష్ణ, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు వెలుగులు