
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్‌ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.
ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?
ఇన్‌స్టా పోస్ట్‌లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్‌లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్‌గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను.
మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు.
కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్‌కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది.
(చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)
Comments
Please login to add a commentAdd a comment