IIM
-
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ
కనుచూపు లేక ముసిరిన చీకటిలో పట్టుదల కాంతిపుంజమై దారి చూపింది. రెప్పల మాటున దాగున్న కలలను చదువుతో సాకారం చేసుకుంది.అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ.ఐ.ఎం. (ఇండియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోని 21 ఐ.ఐ.ఎం. కళాశాలల్లోని 19 కళాశాలల్లో అర్హత సాధించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న సోపానాలను ఇలా మన ముందుంచింది.‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కొత్తకాపు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డిలకు రెండోసంతానాన్ని. మా అక్క కీర్తన గ్రూప్ 4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. మా చెల్లి భవానికి 80 శాతం చూపులేదు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంబీఏ సీటును సాధించింది. నాకు పుట్టుకతోనే చూపు లేదు. అయినా, చదువంటే మాకెంతో ఆసక్తి. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని మా నమ్మకం. జహీరాబాద్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిరంలో నా ప్రైమరీ చదువు ఆరంభమైంది. కానీ, చూపు లేక΄ోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నలు హైదరాబాద్‌లోని బేగంపేటలో గల దేవనార్ పబ్లిక్ స్కూల్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అదే బడిలో చదువుకున్నాను. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్‌ను జహీరాబాద్‌లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్‌తో పూర్తి చేశాను. కాలేజీలో క్లాసులను విని, సహాయకులతో పరీక్షలు రాశాను. ఆ రెండేళ్లూ కాలేజీ టాపర్‌గా నిలిచాను.ఉన్నతస్థాయి ఉద్యోగమే లక్ష్యంచెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీబీఏ కోర్సు పూర్తి చేశాను. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆ¯Œ ౖలñ న్లో కోచింగ్ తీసుకున్నాను. 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి 93.51 శాతం మార్కులతో దేశంలోని 21 ఐఐఎం కళాశాలల్లోని 19 కళాశాలల్లో ప్రవేశార్హత సాధించాను. వాటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకున్నాను. కిందటి నెల 23న కళాశాలలో చేరాను.శక్తినిచ్చే గీతోపదేశం చూపు లేక΄ోవడంతో చదువు కష్టంగా ఉండేది. బ్రెయిలీ లిపి నేర్చుకునేంతవరకు చదువు పట్ల నాకున్న తపనను ఎలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. అంధుల పాఠశాలలో చేరాక నాకు పెద్ద అండ దొరికినట్టుగా అనిపించింది. కార్పొరేట్ కంపెనీలలో టాప్ లెవల్ ఉద్యోగం చేయాలని ఉంది. అందుకు తగిన అర్హతలు సం΄ాదించుకోవడానికి స్పెషలైజేషన్ కూడా చేస్తాను. శ్రీకృష్ణుడి గీతోపదేశం వింటూ ఉంటాను. జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో గీత ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నదే నా ఆకాంక్ష’’ అని చెప్పింది శివాని. – యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్ఎంతో గర్వంగా ఉందిమా అమ్మాయి శివానీ జాతీయ స్థాయిలో ఐఎంఎ సీటును సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఆమె పుట్టుగుడ్డిగా పుట్టినప్పుడు కొంత బాధపడ్డాం. కొందరు మనసు నొప్పించే మాటలు అనేవారు. కానీ, వాటిని పట్టించుకోకుండా అమ్మాయిలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో కష్టపడి చదివించాం. ఇప్పుడు శివానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, గో΄ాల్రెడ్డి -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్ వచ్చిందా? రాలేదా?
అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసినా టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. ఐఐఎంల్లోనూ అదే తీరు.. ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్మెంట్ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..! భారత్‌లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
తిరుపతి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం
రేణిగుంట/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ తిరుపతిసిటీ/ఆనందపురం(విశాఖ)/ పెద్దారవీడు/కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ప్రముఖ జాతీయ విద్యాసంస్థలైన తిరుç³తి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం శాశ్వత ప్రాంగణాలు, కర్నూలు ఐఐఐటీ డీఎమ్ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొని తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటుచేసుకున్న ఐజర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)ను ప్రధాని మోదీ జమ్ము నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఐజర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, జిల్లా కలెక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా తిరుపతి తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా పేరుపొందిందని ఎంపీ ఎం.గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభించిన పీఎం–యూఎస్‌హెచ్‌ఏ నిధుల మంజూరు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం మహిళా వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. ఐఐఎం శాశ్వత క్యాంపస్ ప్రారంభం విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద 241 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనాలను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో జమ్మూ నుంచి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. 2016లో ఐఐఎం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఏయూలో తాత్కాలిక క్యాంపస్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా మొదట దశ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యాలయాన్ని శాశ్వత ప్రాంగణానికి మార్చారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభించిన ప్రధాని.. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి గ్రామం సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్నేహలత మాట్లాడుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహకారంతో 8 ఏళ్ల కిందట తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించడంతో ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా కేంద్రీయ విద్యాలయ భవనాల సముదాయాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
ప్రఖ్యాత విద్యాసంస్థల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారాయన. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. జమ్ము కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు.. వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారు. జమ్ముకశ్మీర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వికసిత్ కశ్మీర్కల సాకారం అవుతుంది. మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుంది అని అన్నారాయన. వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ గవర్నర్, సీఎం జగన్ విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. విశాఖ ఐఐఎంకు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాలను పూర్తి చేశారు. -
నేడు ఐఐఎం విశాఖ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రేణిగుంట (తిరుపతి జిల్లా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)– విశాఖపట్నం శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాని అభివృద్ధి చేశారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. అడుగడుగునా అద్భుతమనేలా హరిత భవనం (గ్రీన్ బిల్డింగ్), స్మార్ట్ భవనంగా దీన్ని తీర్చిదిద్దారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటును నిరి్మంచారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ శాశ్వత క్యాంపస్‌లు కూడా.. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) శాశ్వత క్యాంపస్‌లను కూడా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని రెండు క్యాంపస్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో రెండు విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జాతికి అంకితం చేసే కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య పాల్గొంటారు. -
రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఏ రంగంలో తెలుసా..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు. ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెప్పింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు. -
ఉద్యోగాల కోసం పూర్వ విద్యార్థుల సమ్మేళనమా?
మాములుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఎప్పుడో చిన్నప్పడూ కలిసి చదువుకున్న స్నేహితులంతా చాలా ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకుని భావోద్వేగం చెందుతారు. ఇది సహజం. పైగా చిన్ననాటి స్నేహితులు కావడంతో ఎవ్వరీ ముఖాలు ఎవ్వరూ గుర్తు పట్టాలేనంతగా మార్పు చెందుతాయి. పైగా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి పెద్ద పొజిషన్లో ఉండేవారు కొందరైతే, చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్లు మరికొందరూ. అదీగాక మన బ్యాచ్‌లో ఇంత గొప్పగా సెటిల్ అయినవాళ్లు కూడా ఉన్నారా? అని గొప్పగా ఫీలైపోతుంటాం కూడా. అలాంటి ఆత్మీయ సమ్మేళనం లక్నోలో ఎందుకోసం జరిగిందో వింటే షాకవ్వుతారు. వివరాల్లోకెళ్తే..ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో (ఐఐఎం-ఎల్)లో 2011 బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల పూర్వ సమ్మేళన సందేశం చాలా వింతంగా ఉంది. వారంతా కలుసుకుందామంటూ వాట్సాప్‌కి పంపించిన ఓ సందేశాన్ని లక్నోకి చెందిన పూర్వ విద్యార్థి రవి హండా నెట్టింట షేర్ చేశారు. నిజానికి ఐఐఎం లాంటి సంస్థల్లో కచ్చితంగా నూటికి నూరుశాతం ప్లేస్మెంట్ సంపాదించుకోగలరు విద్యార్థులు. కనీసం బయట ఎక్కడైనా కూడా ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది వానికి. ఎందుకంటే అవి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు, పైగా అందులో చదివారంటే చాలు వెంటనే కంపెనీలు కళ్లకు అద్దుకుని మరీ తీసేసుకుంటాయనేది అందరి నమ్మకం. అలాంటిది లక్నో ఐఏఎంకి చెందిన 2011 బ్యాచ్‌లో దాదాపు 72 మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థులంతా ప్లేస్మెంట్లు కనుగొనేందుకైనా ఒక్కసారి కలుద్దాం అంటూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకున్నారు. పైగా 2024 బ్యాచ్‌మేట్స్‌కు తెలిసిన నెట్వర్క్ పరిధిలో ఏదైనా రిక్రూట్మెంట్స్ ఉంటే కనక్కుందామని కూడా ఆ సందేశంలో ఉంది. 2011 బ్యాచ్‌లోని 72 మంది ప్లేస్మెంట్లు కనుగునడం కోసం అంతా ఒకచోట చేరాలనేది ఆ సందేశం సారాంశం. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. పైగా ఈ సందేశం ఒక్కసారిగా అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కో తీరులో స్పందించారు. ప్రస్తుతం బీ స్కూళ్ల పరిస్థితి ఇలా ఉందని ఒకరు కామెంట్ చేయగా, మరొకరూ మన అభివృద్ధి ఇలా ఉందంటూ ఆర్థిక వ్యవస్థను నిందించారు. అంతేగాదు నిరుద్యోగం ఎలా ఉందనేందుకు అద్దం పడుతుందంటూ కామెంట్ చేశారు. ఏదీఏమైనా ఉన్నత ఉద్యోగాల కోసం అయినా పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం అవ్వుదామనడం అందర్నీ ఒక్కసారిగా కలవరిపర్చిందన చెప్పాలి. ఎందుకంటే బయట మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఇదే నిదర్శనం. ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీలో ప్రతీ క్షణం పోటీ పడుతూ అప్డేట్ కాకపోతే త్వరగా సెటిల్ అవ్వడం అన్నది కష్టమని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన. IIM Lucknow is reaching out to alumni to help them with placements. It is “crucial to maintain the legacy of IIM Lucknow’s 100% placement record”. It isn’t about 5-10 people but 72 candidates at IIM-L do not have a job. Imagine the status at other B-schools. pic.twitter.com/uYaTCmY3h7 — Ravi Handa (@ravihanda) January 31, 2024 (చదవండి: చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..! రెండేళ్లుగా కనిపించని..) -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు.. దివ్యాంగుడికి ఐఐఎం సీటు
సాక్షి, అనకాపల్లి జిల్లా: విధి వక్రించినా పట్టుదలతో నిలబడ్డాడు. ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేశాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌తోపాటు న్యాయవిద్యను సైతం పూర్తి చేసి అమెజాన్ సంస్థలో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా క్యాట్‌లో ఉత్తీర్ణుడై ఐఐఎం సీటు సాధించాడు. ఈ నెల 21న అహ్మదాబాద్ ఐఐఎంలో చేరనున్నాడు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఈ విజేత పేరు ద్వారపురెడ్డి చంద్రమౌళి. తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేట్ స్కూల్ టీచర్. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో బీటెక్ చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. 2018 మే 26న మేడపై ఉండగా ప్రమాదవశాత్తూ జారిపోయిన ఉంగరాన్ని తీసేందుకు యత్నించగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై కాళ్లు, చేతులు కోల్పోవడంతో డీలా పడిపోయాడు. కొత్త శక్తిని కూడదీసుకుని.. కొన్ని నెలలు గడిచాక చంద్రమౌళి నిరాశను వదిలిపెట్టాడు. శక్తిని కూడదీసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అంతలోనే కరోనా చంద్రమౌళికి మరో పరీక్ష పెట్టింది. తండ్రి వెంకటరమణ కుమారుడి పక్కనే రక్షణ సూట్ ధరించి నెల రోజుల పాటు సేవలందించారు. వారి మొండి ధైర్యానికి విధి తలవంచింది. నెల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రమౌళి తేరుకుని తన గమ్యం వైపు అడుగులు వేశాడు. ఆప్తుడైన న్యాయవాది ప్రభాకర్, స్నేహితుడు ప్రసాద్ అండగా నిలిచి మానసిక స్థైర్యం అందించారు. దీంతో చంద్రమౌళి మొండి చేతులతోనే పనులు చేయడం ప్రారంభించాడు. ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేయడం సాధన చేశాడు. విశాఖలో కృత్రిమ కాళ్లు తీసుకుని నడవడం కూడా కొద్దికొద్దిగా అలవాటు చేసుకున్నాడు. మూడు నెలల్లో అన్ని పనులూ చేయడం ప్రారంభించాడు. కరోనా తర్వాత ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలు కష్టతరమవుతున్నాయని భావించి అనకాపల్లిలో బీఎల్ పూర్తి చేశాడు. జీవనోపాధికి అమెజాన్‌లో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ల నుంచి ఇంటినుంచే ఆ ఉద్యోగం చేస్తున్నాడు. పట్టుదలతో చదివి కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్క్రైబ్ సహాయంతో రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్‌గా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించాడు. ఈ నెల 21న జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. ఎంత కష్టం ఎదురైనా కలత చెందవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రమౌళి సూచిస్తున్నాడు. చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. -
హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా
న్యూఢిల్లీ: ఐఐఎం సంబల్పూర్ విద్యార్థులు ప్లేస్మెంట్లు, వేతనాల విషయంలో సరికొత్త రికార్డ్ సాధించారు. గత 7 సంవత్సరాల మాదిరిగానే, ఈ సారి 2021-2023 ఏడాదికి గాను 100శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది. 2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా, వీరిలో 80మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్ ప్లేస్ కొట్టేసింది. హయ్యస్ట్ ప్యాకేజీ అందుకున్న వరుసలో తమిళనాడు, రాజస్థాన్ విద్యార్థులు నిలిచారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) అవని మల్హోత్రా ఎవరు? జైపూర్‌కు చెందిన అవనిమల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 64.61 లక్షల వార్షిక జీతాన్ని అందుకోనుంది. పట్టుదల, కృషి ఉంటే విజయం వచ్చి వరిస్తుందనే మాటకు నిదర్శనంగా తన డ్రీమ్ జాబ్‌ను కొట్టేసింది అవని. ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధించి జాక్‌పాట్ కొట్టేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్ చదవడం ప్రత్యేకంగా నిల బెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను ఛేదించడంలో సాయం చేసిన ప్రొఫెసర్లకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. (ఇదీ చదవండి: అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్మెంట్ సాధించారని ఐఐఎం సంబల్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు. తమ సంస్థలో సంవత్సరానికి అత్యధిక జీతం రూ. 64.61 లక్షలుండగా, సగటు జీతం రూ. 16 లక్షలుగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారం, అమూల్, అదానీ, ఈవై, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల్లో తమ విద్యార్థులు ప్లేస్ అవుతున్నారన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) -
అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్’ను మించేలా..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 241.50 ఎకరాల్లో అడుగడుగునా అద్భుతమనేలా.. గ్రీన్బిల్డింగ్ రూపంలో, స్మార్ట్ భవనంగా ఐఐఎం రూపుదిద్దుకుంటోంది. క్యాంపస్ పరిధిలో 7,200 రకాల పూలు, పండ్ల మొక్కలు, వివిధ వృక్షజాతులు పెంచుతున్నారు. సౌరవిద్యుత్ వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించేలా భవన నిర్మాణం సాగింది. పరిపాలన భవనం మినహా దాదాపు అన్ని బిల్డింగ్లు పూర్తి కావడంతో ఇప్పటికే తరగతుల నిర్వహణను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 100 సీట్లు అదనంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మొదటి దశలో నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. విభిన్న ప్రత్యేకతల సమాహారం ► ఇప్పటికే హాస్టళ్లు, తరగతి గదులు, 4 స్టార్ కిచెన్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఇది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ► 2022 ఆగస్ట్ నుంచి ఏయూ క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌కు తరగతులను తరలించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో భవనాల్ని అద్దెకు తీసుకుని హాస్టళ్లు నిర్వహించేవారు. వాటిని కూడా ఖాళీ చేసి.. కొత్త క్యాంపస్‌లో నిర్మించిన వసతి గృహాల్లోనే విద్యార్థులకు గదులు కేటాయించారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో గదిని పూర్తిస్థాయిలో కేటాయించడం విశేషం. హాస్టళ్లను కూడా తరలించడం వల్ల అద్దెల రూపంలో నెలకు రూ.5 లక్షల వరకూ ఆదా చేస్తున్నారు. ► ఓవైపు హరిత భవనంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కర్బన ఉద్గారాల వినియోగాన్ని తగ్గించేలా క్యాంపస్ నిర్మాణం జరిగింది. ► క్యాంపస్ మొత్తానికి సౌర విద్యుత్ వినియోగించుకునేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ► కోవిడ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్యాంపస్‌కు అదనపు హంగులు సమకూరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పరికరాలను వినియోగించడానికి చేతులతో స్విచ్‌లు నొక్కే అవసరం లేకుండా.. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► హార్వర్డ్ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. ► వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. ► ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. ► ప్రతి ప్రొఫెసర్ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్సైట్లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు. ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ► విద్యార్థుల హాస్టళ్లలో ప్రతి గదిలో ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. ► దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఐఐఎం క్యాంపస్‌కు హరితహారంగా క్యాంపస్ భవనం చుట్టూ 7,200 రకాల చెట్లు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే కొంతమేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సీట్లు పెంచే ఆలోచన దిశగా.. ఈ విద్యా సంవత్సరం మరో 100 సీట్లు పెంచే దిశగా ఐఐఎంవీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు 300 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 187 మంది ఉన్నారు. మొత్తం 487 సీట్లున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం సీట్లను మరో 100కి పెంచి 400 అడ్మిషన్లు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 100 సీట్లు పెంచుతూ మొత్తం 1170 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు. (క్లిక్ చేయండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ) ఫైవ్ స్టార్ రేటింగ్‌కు అనుగుణంగా.. గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకునేలా విశాఖపట్నంలో కొత్త ఐఐఎం క్యాంపస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇతర చిన్న చిన్న పనులు మినహా దాదాపు క్యాంపస్ పూర్తయింది. ఇందుకోసం మొత్తం రూ.807.69 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 1,170 మంది విద్యార్థులకు సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 600 మందికి వీలుగా నిర్మాణాలు చేపట్టాం. 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. శాశ్వత భవనంలో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్ -
చేసింది ఐఐటీ.. ‘యోగా’లక్ష్యం కోటి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యోగాకు ప్రాచుర్యం బాగా పెరగడంతో అనేక మంది యోగాతో లాభాలు పొందుతూనే ఉన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన సౌరభ్ బోత్రా మరికొంతమంది ఐఐటీ, ఐఐఎమ్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తో ‘హాబిల్డ్’ పేరిట ఓ టీమ్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా ఎంతో మందికి యోగా చాలా సులువుగా నేర్పడంతో పాటు... దాని ప్రయోజనాలనూ పంచుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆయన 21 రోజులపాటు దేశవ్యాప్తంగా ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మీరు కూడా హాయిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఈ సందర్భంగా హాబిల్డ్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘నిజానికి యోగా మాస్టర్నైన నేను కూడా చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడ్డవాణ్ణే. నా బాల్యమంతా దగ్గుతూ సాగింది. వాతావరణం మారినప్పుడల్లా జలుబు, ఫ్లూ జ్వరాలతో బాధపడేవాణ్ణి. ఒకసారి నేను ఐఐటీ బీహెచ్‌యూలో ఉండగా అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం జరిగినప్పుడు నాకు యోగా, ధ్యానం గురించి తెలిసింది. నా సమస్యకు అదే పరిష్కారం అని అర్థమైంది. అంతే... ఆనాటి నుంచి ఈనాటివరకు... అంటే దాదాపు పదేళ్లకు పైగా నేనెప్పుడూ ఇన్హేలర్ ఉపయోగించలేదు’’ అని చెప్పారు. 21 రోజుల ఉచిత యోగా శిక్షణ గురించి వివరిస్తూ.. ‘‘నేను యోగా నుంచి ఎంతో ప్రయోజనం పొందాను. నేను పొందిన ప్రయోజనాలనే అంతర్జాతీయంగా కనీసం కోటి మందికి అందించాలన్నదే నా లక్ష్యం. మీరు మీ ఇళ్లలోనే ఉంటూ ‘ఆన్లైన్’లో ఉచితంగా యోగా నేర్చుకోవచ్చు. ఈ నెల 19 వరకు ఎంతమందైనా, ఏ సమయంలోనైనా ఉచితంగా చేరవచ్చు. ఈ 21 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజూ ఆన్లైన్ ద్వారా లైవ్ కార్యక్రమాల రూపంలో క్లాసులు నిర్వహిస్తాం. ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున ప్రతిరోజూ నాలుగు బ్యాచ్‌లు నిర్వహిస్తాం. ప్రతి బ్యాచ్ 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ టైమింగ్స్ ఏమిటంటే... 6.30 నుంచి 7.15, 7.30 నుంచి 8.15 వరకు ఉదయం బ్యాచ్.. 6.00 నుంచి 6.45 వరకు, 7.00 నుంచి 7.45 వరకు సాయంత్రం బ్యాచ్ నిర్వహిస్తాం’’ అని వివరించారు. habuild. in or https:// habit. yoga ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని.. 86000 39726 నెంబరుకు హాయ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా ఇందులో చేరవచ్చని తెలిపారు. -
CAT 2021: ఐఐఎంలకు దారిచూపే.. క్యాట్!
ఐఐఎంలు.. మేనేజ్మెంట్ కోర్సులకు ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్స్! వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)!! ఐఐఎం అహ్మదాబాద్.. క్యాట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐఎంలతోపాటు దేశంలోని పలు ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశానికి క్యాట్ స్కోర్ కీలకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. క్యాట్ పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్ మెంట్ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎంల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్ కంపెనీలకు హాట్‌కేకే!! అందుకే పేరున్న ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. క్యాట్‌లో స్కోర్ తోపాటు మలిదశలో ప్రతిభ చూపితేనే వీటిల్లో అడ్మిషన్ ఖాయం అవుతుంది. అర్హత కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లు్యడీ అభ్య ర్థులకు డిగ్రీలో కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తు న్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► ప్రతి ఏటా క్యాట్‌కు 2 లక్షల మందికి పైగా అభ్య ర్థులు హాజరవుతుంటారు. గతేడాది దాదాపు 2.27 లక్షల మంది పరీక్ష రాసారు. క్యాట్‌కు హాజరవడం అనేది ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో ఎంతో కీలకమైన మొదటి దశ. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ స్కోర్ సాధించిన అభ్యర్థులను మలిదశకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ► మలి దశలో..గ్రూప్ డిస్కషన్(జీడీ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్(వాట్), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ► పలు ఐఐఎంలు గత అకడెమిక్ రికార్డ్, సంబంధిత పని అనుభవం, జెండర్ అండ్ అకడెమిక్ డైవర్సిటీ వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. 76 ప్రశ్నలు–మూడు విభాగాలు ► క్యాట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. ► పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 76 ప్రశ్నలు ఉంటాయి. ► వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ) నుంచి 26 ప్రశ్నలు వస్తాయి. ► డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్) నుంచి 24 ప్రశ్నలు ఉంటాయి. ► క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యూఏ) విభాగం నుంచి 26 ప్రశ్నలు అడుగుతారు. ► మొత్తం 76 ప్రశ్నలు–228 మార్కులకు క్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ► ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్, నాన్ మల్టిపుల్ ఛాయిస్(టైప్ ఇన్ ది ఆన్సర్) విధానంలో ఉంటాయి. నాన్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండవు. పరీక్ష సమయం రెండుగంటలు ఈ ఏడాది క్యాట్ పరీక్ష సమయం రెండు గంటలు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండు గంటల్లో మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు ఆన్లైన్ స్లాట్స్ ఉంటాయి. టైమ్ మేనేజ్మెంట్ గతేడాది నుంచి ‘క్యాట్’ సమయం తగ్గింది. అందువల్ల అభ్యర్థులు ‘గోల్ సెట్టింగ్ థియరీ’ ప్రకారం చదివితే విజయం సాధించగలరు అంటున్నారు నిపుణులు. అంటే.. పరీక్షలో మూడు సెక్షన్లతోపాటు ‘టైమ్ మేనేజ్మెంట్’ను నాలుగో విభాగంగా పరిగణించాలి. అభ్యర్థులు ఏదైనా విభాగాన్ని పరిష్కరించడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు. ఈ సమయంలోనే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు టైప్ చేసే ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. బలాబలాలు క్యాట్ విభిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం చాలా అవసరం. పరిమిత కాలంలో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యా లను అంచనా వేసుకోవాలి. ఏ విభాగం ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించగలుగుతున్నారు.. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసు కోవాలి. వెనుకబడిన విభాగంలో ఇప్పటికే ప్రాక్టీస్ చేసిన నమూనా ప్రశ్నలను మరోసారి సాధించాలి. మాక్ టెస్టులు ► క్యాట్–2021 పరీక్ష నవంబర్ 28న నిర్వహిం చనున్నారు. అంటే.. దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారం భించినా.. టాప్ స్కోరు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ► ముఖ్యంగా పరీక్షలోని మూడు విభాగాల్లో ఒక్కో దానికి నెలరోజుల చొప్పున సమయం కేటాయిం చి చదవడం మంచిది. చివర్లో మిగతా నెలరోజు ల పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిని పరిశీలించాలి. ఏ టాపిక్‌లో ఎలాం టి మార్పులతో ప్రశ్నలు వస్తున్నాయో గుర్తిం చాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగి స్తూ.. మాక్ టెస్టులు సైతం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.1100, ఇతరులకు రూ.2200. ► హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: అక్టోబర్ 27–నవంబర్ 28 ► ఆన్లైన్ క్యాట్–2021 పరీక్ష తేది: నవంబర్ 28, 2021 ► ఫలితాల వెల్లడి: జనవరి రెండో వారం 2022 ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు వెబ్సైట్: https://iimcat.ac.in -
రంజిత్ స్ఫూర్తిగాథ.. నైట్‌వాచ్‌మెన్ నుంచి ఐఐఎం..
కాసర్గడ్: ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న రంజిత్ రామచంద్రన్‌ది స్ఫూర్తిదాయక చరిత్ర. నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి చేరారు. ఈ వివరాలను ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన వివరించారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్బుక్లో 37 వేల లైక్స్ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు. కాసర్గడ్లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్ నైట్ వాచ్‌మన్‌గా పనిచేశారు. అలా చేస్తూనే పీఎస్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశానని, తన తండ్రి టైలర్ కాగా, తల్లి ఉపాధి కూలీ అని ఆ పోస్ట్‌లో రంజిత్ తెలిపారు. -
ఉండనివ్వరేల ఘనాఘనులు
అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్ ఆమె. అంజూ సేథ్ వెళ్లిపోతుంటే చైర్మన్ ముఖం చాటేశారు. బోర్డ్ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్మెంట్ రంగంలో అంజూ సేథ్ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్ రెస్పెక్ట్ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్ సీలింగ్ ని బ్రేక్ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?! అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్’లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి. అంజు సేథ్ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. 2008లో వర్జీనియా టెక్ (పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు. -
ఐఐఎంల్లో ఈ–కామర్స్, స్టార్టప్స్ ఆఫర్స్!
ఈ–కామర్స్, స్టార్టప్స్.. గత కొంత కాలంగా నియామకాల్లో ముందంజలో నిలుస్తున్న రంగాలు. ముఖ్యంగా ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో ఇది మరింతగా స్పష్టమైంది. ఐఐఎంల్లో 2021లో పీజీపీఎం కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. వీరికి ఈ–కామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది ఈ రంగాల్లోని సంస్థల ఆఫర్లు తగ్గాయి. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్లు పుంజుకోవడంతో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అన్ని ఐఐఎంల్లోనూ అదే ట్రెండ్ ► తొలి తరం ఐఐఎంలు మొదలు నూతన ఐఐఎంల వరకూ.. దాదాపు అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఆయా ఐఐఎంల్లో కనిష్టంగా పది శాతం.. గరిష్టంగా 80 శాతం మేరకు ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగాయి. ► ఐఐఎం–ఇండోర్‌లో.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో గరిష్టంగా 80 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఐఐఎం–బెంగళూరులో 53 శాతం; ఐఐఎం–లక్నోలో 24.5 శాతం; ఐఐఎం–కోజికోడ్‌లో 25 శాతం; ఐఐఎం–అహ్మదాబాద్‌లో 10 శాతం వృద్ధి నమోదైంది. ► తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం–విశాఖపట్నంలోనూ ఈ–కామర్స్ ఆఫర్లు గతేడాది కంటే పది శాతం మేరకు పెరిగి.. మొత్తం 120 మంది విద్యార్థుల్లో.. దాదాపు 30 మందికి ఈ–కామర్స్ సంస్థల్లో ఆఫర్లు లభించాయి. (ఇక్కడ చదవండి: కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!) ఈ–కామర్స్ దిగ్గజాల హవా ఈ–కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే, రేజర్‌పే సంస్థలు ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. ఈ రంగంలో లభించిన మొత్తం ఆఫర్లలో యాభై శాతం ఈ సంస్థల నుంచే ఉండటం విశేషం. అంతేకాకుండా వేతనాలు కూడా సగటున రూ.12లక్షల నుంచి రూ.30లక్షల వరకు అందించాయి. గతేడాది కంటే 30శాతం అదనంగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. అందుకు తగినట్లుగానే క్యాంపస్ డ్రైవ్స్‌లో భారీగా నియామకాలు చేపట్టింది. అదే విధంగా అమెజాన్, పేటీఎం కూడా ఈ ఏడాది టెక్, మేనేజ్మెంట్ ప్రొఫైల్స్‌లో భారీగా నియామకాలు చేపడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్టార్టప్స్ హవా గత రెండేళ్లుగా వెనుకంజలో ఉన్న స్టార్టప్ కంపెనీల ఆఫర్లు ఈసారి భారీగా పెరిగాయి. ప్రధానంగా ఎడ్టెక్, ఫిన్‌టెక్ సంస్థలు ముందంజలో నిలిచాయి. బ్లాక్‌బర్గ్, ఇంటర్వ్యూబిట్, టర్టిల్‌మింట్ వంటి సంస్థలు స్టార్టప్ ఆఫర్స్ భారీగా ఇచ్చాయి. ఐఐఎంల విద్యార్థులు కూడా ఈ స్టార్టప్ ఆఫర్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. దీనికి స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ కెరీర్ ప్రగతికి పునాదులు వేసుకోవచ్చనే భావనే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను నేరుగా వ్యక్తీకరించి, ఆచరణలో పెట్టే అవకాశం స్టార్టప్ సంస్థల్లోనే ఎక్కువగా ఉంటుందనే అభి ప్రాయంతోనే విద్యార్థులు ఈ ఆఫర్స్‌కు అంగీకరించారని ఆయా ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫండింగ్ పెరగడమే కారణమా! స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడానికి వాటికి గతేడాది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ రావడం మరో కారణం అనే వాదన వినిపిస్తోంది. హెక్స్జన్ సంస్థ సర్వే ప్రకారం–గతేడాది భారత్‌లోని స్టార్టప్ సంస్థలు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో యాభై శాతానికి పైగా టెక్ స్టార్టప్స్, ఎడ్టెక్ స్టార్టప్స్ ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో నివేదిక ప్రకారం–2020లో జాతీయ స్థాయిలో ఏడు వేలకు పైగా స్టార్టప్ సంస్థలకు పది బిలియన్ డాలర్ల నిధులను వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సమకూర్చారు. వీటిలో మూడొంతులు.. ఫిన్‌టెక్, ఈ–కామర్స్ అనుబంధ టెక్ స్టార్టప్‌లే ఉన్నాయి. ఇలా భారీగా నిధులు సమకూర్చు కున్న స్టార్టప్‌లు.. వ్యాపార ఉన్నతికి, విస్తరణకు అవసరమైన మానవ వనరుల కోసం క్యాంపస్ డ్రైవ్స్ బాట పట్టాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కీలకమైన ప్రొఫైల్స్ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు కీలక విభాగాల్లో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు పలు ముఖ్య విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే హోదాల్లో ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుత డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాల్లో పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంతేకాకుండా వ్యాపార విస్తరణ వ్యూహాలు సమర్థవంతంగా రూపొందించే నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం ఈ–కామర్స్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారాలను మరింత వ్యూహాత్మకంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అను గుణంగా సేవలందించడం, కస్టమర్స్ మెచ్చే ప్రొడక్ట్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం మార్కెటింగ్, డేటాఅనలిటిక్స్ విభాగాల్లో నియా మకాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. స్టార్టప్ సంస్థల్లో.. ఈ ప్రొఫైల్స్ స్టార్టప్ సంస్థలు ప్రధానంగా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లో ఎక్కువగా నియామకాలు చేపట్టాయి. దీనికి కారణం.. సదరు స్టార్టప్ సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌లు రూపొందించి.. వాటికి మార్కెట్లో ఆదరణ లభించేలా వ్యవహరిస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ నైపుణ్యాలుంటాయనే ఉద్దేశంతో బి–స్కూల్స్‌లో ప్లేస్‌మెంట్స్ చేపట్టాయి. ఈ స్కిల్స్ ఉంటేనే ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. అభ్యర్థుల్లోని కోర్ నైపుణ్యాలే కాకుండా.. వ్యాపా రాభివృద్ధికి దోహదపడే స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, ఇన్నోవేషన్ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చాయి. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించి.. వ్యాపార కార్యకలాపాలకు అవరోధం కలగకుండా వ్యవహరించొచ్చనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. మిగతా సెక్టార్స్ సంగతి ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్‌లో టెక్ ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఈ టెక్ స్టార్టప్‌లే నిధుల సమీకరణలో ముందంజలో నిలిచాయి. దాంతో ఫిన్‌టెక్, ఎడ్టెక్ వంటి టెక్ స్టార్టప్స్‌లో ఆఫర్లు పెరిగాయి. మరోవైపు ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడంలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి. సానుకూల సంకేతాలు ► ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈకామర్స్, స్టార్టప్ సంస్థలు.. టైర్–2,టైర్–3ల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్స్టిట్యూట్లలో ఈ రిక్రూట్మెంట్స్ ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, సీఆర్ఎం, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్–2, టైర్–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశాలు న్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► మొత్తంగా చూస్తే గతేడాది కోవిడ్ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్ ప్లేస్‌మెంట్స్.. తిరిగి పుంజుకోవడంతో మేనేజ్మెంట్ విద్యార్థులకు భవిష్యత్తు ఆశాజనకం అనే భావన ఏర్పడుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రానున్న రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐఎం ప్లేస్‌మెంట్స్ ముఖ్యాంశాలు ► 2021లో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో భారీగా పెరుగుదల. ► సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తున్న వైనం. ► మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సీఆర్ఎం విభాగాల్లో నియామకాలు. ► స్టార్టప్ ఆఫర్స్‌లో టెక్ స్టార్టప్స్ హవా. ► రానున్న రోజుల్లో ఇతర బి–స్కూల్స్‌లోనూ నియామకాలు ఆశాజనకంగా ఉంటాయంటున్న నిపుణులు. డిజిటలైజేషనే ప్రధాన కారణం ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టడానికి ప్రధాన కారణం డిజిటలైజేషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ–కామర్స్ మార్కెట్ విస్తృతమవుతోంది. దానికి అనుగుణంగా సంస్థలు నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. – ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, చైర్ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు -
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్లైన్ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆన్లైన్ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్‌లకు దీటుగా యాప్స్‌ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఐఐటీలను కోరారు. చదవండి : ఇంట్లోనే కరోనా టెస్టులు -
తపనకు తోబుట్టువులు
పంకజ విజయ రాఘవన్ వయసు 70 ఏళ్లు. విజయ శ్రీనివాసన్ వయసు 67. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. తమిళ కుటుంబాలకు చెందినవారు. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఉద్యోగాల రీత్యా ముంబయ్, చెన్నై, పుణే అంటూ వెళ్లినా ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పంకజ సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో, విజయ మారేడుపల్లిలో ఉంటారు. పంకజ తెలుగు, తమిళం, ఇంగ్లిషు, హిందీ అనువాదాలు చేస్తూ, టీవీ కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ బిజీగా ఉంటే.. చెల్లెలు విజయ ‘రెడీ టు ఈట్’ పొడుల తయారీ, అమ్మకాలు చేపట్టి.. మలి వయసులో నిస్పృహతో గడిపే ఎందరికో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. (‘ఫస్ట్ లేడీస్’లో బెస్ట్ లేడీ మార్తమ్మ) వాయిస్ ఇంత పంచి ‘‘పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా ముంబయ్, చెన్నైలో ఉన్నాను. కొన్నాళ్లు ఐటీ ఇండస్ట్రీలో పని చేశాను. ఇద్దరు అబ్బాయిలు. వాళ్లు సెటిల్ అయ్యారు. రిటైర్ అయిన తొలి రోజుల్లో.. ఏం చేస్తే బాగుంటుందా అని నా వయసు వారితో కూర్చుని ప్లాన్ చేసేదాన్ని’’ అంటారు పంకజ. ‘‘అప్పటికే ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఉండటం వల్ల నాకు తెలిసినవాళ్లు వీడియో డైలాగ్‌కు ట్రాన్స్క్రిప్షన్ వర్క్ చేసివ్వమని అడిగారు. ఆ సమయంలోనే ‘మీ గొంతు బాగుంది, వాయిస్ ఓవర్ ఇవ్వండి’ అని అడిగారు. ఇప్పుడు ఆ వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇంటి నుంచే బెంగుళూరు ఐఐఎంకి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) వీడియో అనువాదాలు చేసి ఇస్తున్నారు. తమిళ్ టీవీ ఛానెల్లోని కుకరీ షోకి వాయిస్ ఓవర్ చెబుతున్నారు. ఇప్పటికి 500 ఎపిసోడ్స్ వరకు ఆమె తన వాయిస్ ఇచ్చారు. ‘‘సంపాదించాలనే ఆలోచన కాదు. ఏదైనా పనిలో ఉండాలి. ఆ పనే మనల్ని చురుగ్గా ఉంచుతుంది. అందుకే మా చెల్లెలు విజయతో కలిసి ఆమె చేస్తున్న పొడుల తయారీలోనూ భాగస్వామిని అయ్యాను’’ అని చెప్పారు పంకజ. కిచెన్లలోకి ‘కంచి’ విజయ వారాంతాల్లో హైదరాబాద్‌లో జరిగే చిన్న చిన్న ఎగ్జిబిషన్లు, చేనేత సంత వంటి వాటిల్లో రుచికరమైన పొడులను వినియోగదారులకు పరిచయం చేస్తూ కనిపిస్తారు. కార్పోరేట్ ఆఫీసులోని అడ్మిన్ విభాగంలో ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు విజయ. భర్త బ్యాంకు ఉద్యోగి. ఓ కూతురు కొడుకు. పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. భర్త దూరమై, తను రిటైర్ అయ్యాక కూడా ఓ ఎమ్మెన్సీలో ఏడేళ్లపాటు పనిచేశారు. ఇప్పుడు ‘కంచి కిచెన్స్’ పేరుతో సాంబార్‌పొడి, దోస పొడి, మిర్చి పొడి, పులిహోర మిక్స్.. ఇలా సంప్రదాయ రుచులను మార్కెట్ చేస్తున్నారు ‘‘రిటైర్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నా. చిన్న చిన్న కథలంటే చాలా ఇష్టం. అవి రాస్తూ ఉంటాను. వంట అంటే ఇంకా ఇష్టం. మా అమ్మ తన 87 ఏళ్ల వయసు వరకు మాతోనే ఉన్నారు. ఆవిడ నేర్పించిన వంటలు, బామ్మల వంటల రుచులను ఈ తరం వారికి పరిచయం చేయాలనుకున్నాం. ఇలా తయారుచేసిన ఉత్పత్తులను పెద్ద ఎగ్జిబిషన్స్‌లో, మాల్స్‌లో పెట్టాలనేది నా కల. ఈ ఫుడ్ ఐటమ్స్‌ని ఎనిమిది నెలలుగా చేస్తున్నాం. డబ్బుకు లోటు లేదు. కానీ, ఏదో చేయాలన్న తపన’’ అంటారు విజయ. తాము పనిచేస్తూనే ఆ పనిలో తమ కుటుంబసభ్యులనూ కలుపుకుంటూ మలి వయసునూ ఆహ్లాదకరంగా మార్చుకున్న ఈ అక్కాచెల్లెళ్లు చుట్టుపక్కల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – నిర్మలారెడ్డి -
‘శాంతి, సామరస్యాల సమాహారం భారత్’
న్యూఢిల్లీ: విశ్వవ్యాప్తమైన హింస, ద్వేషం, ఉగ్రవాదం, ఘర్షణల నుంచి విముక్తి కోరుకునే ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఒక ఆశారేఖ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. శాంతి, సామరస్యపూర్వక జీవన విధానం కారణంగానే భారతీయ నాగరికత వర్ధిల్లిందన్నారు. బల ప్రదర్శన ద్వారా కాకుండా, శాంతి చర్చల ద్వారానే ఘర్షణలను నిరోధించగలమన్నది భారతీయుల విధానమన్నారు. కేరళలోని కోజికోడ్–ఐఐఎంలో గురువారం ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ పేరుతో జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఆంక్షలు లేనిచోటే సృజనాత్మకత, భిన్నాభిప్రాయం సహజంగా వస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మన విధానాలు సులభంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయని తెలిపారు. ‘భారత్ అభివృద్ధి సాధిస్తే ప్రపంచం పురోగమిస్తుంది. ప్రపంచం అభివృద్ధి చెందితే భారత్‌కు లబ్ధి చేకూరుతుంది. ఇదే మన విశ్వాసం’ అన్నారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. -
అవినీతిపై యుద్ధంలో మరో అడుగు
సాక్షి, అమరావతి: అవినీతిపై యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఫిబ్రవరి మూడోవారం నాటికి ఈ సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అహ్మదాబాద్ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్ విశ్వజిత్ సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. అంతిమంగా సామాన్యులకు మేలు: ముఖ్యమంత్రి జగన్ అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలు, సామాన్యులకు మేలు జరుగుతుందని అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వివక్ష, అవినీతికి తావులేకుండా పారదర్శక విధానంలో అందరికీ అందుతాయన్నారు. ఈ దిశగా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. గతంలో ఏది కావాలన్నా ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లేవారని అక్కడ పనులు కాని పరిస్థితులు నెలకొనడంతో అవినీతి, పక్షపాతం, వివక్షకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అందుకనే అధికార వికేంద్రీకరణ, గ్రామాలకు అందుబాటులో పాలన, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చామని సీఎం వివరించారు. అవే పనులు ఇప్పుడు సచివాలయాల్లో... గతంలో ఏ పనుల కోసం మండల కార్యాలయాలకు వెళ్లేవారో అవే ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వీటితో ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టరేట్, రాష్ట్రస్థాయి సెక్రటేరియట్లు ఒక్క బటన్‌తో అనుసంధానం అవుతాయన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న ఐటీ నెట్‌వర్క్‌ను కూడా పరిశీలించాలని అహ్మదాబాద్ ఐఐఎం ప్రతినిధులను సీఎం కోరారు. వలంటీర్లు, సచివాలయాల పనితీరుపై సమర్థంగా పర్యవేక్షణ ఉంటుందని, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం అవుతాయని, కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ పేదలు, సామాన్యులకు మంచి చేయడానికేనని పునరుద్ఘాటించారు. అవినీతి, పక్షపాతం లేకుండా అర్హులందరికీ మంచి జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, అధికారులు పాల్గొన్నారు. ఇదీ ఒప్పందం ►మండల రెవిన్యూ కార్యాలయాలు, మండల అభివృద్ధి కార్యాలయాలు, పట్టణ, మున్సిపాల్టీ ప్లానింగ్ డిపార్టుమెంట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ ప్రభుత్వ శాఖలను అహ్మదాబాద్ ఐఐఎం సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ►అవినీతికి ఆస్కారమిస్తున్న అంశాలను గుర్తించి నిర్మూలన చర్యలను సూచిస్తుంది. ►ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులను సూచించడమే కాకుండా అవినీతి నిర్మూలన వ్యూహాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. ►గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అవినీతికి దూరంగా నిర్వహించడంపై సూచనలు చేస్తుంది. ►నిర్దేశించిన ప్రభుత్వ శాఖల ఉద్దేశాలు, విధానాలను అమలు చేస్తున్న తీరు, విభాగాల పాత్ర, పరిపాలనాపరమైన పదవులు, వనరులు, ఆదాయాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుంది. ►పరిపాలనలో ఇప్పుడున్న లోపాలను గుర్తించి సరిదిద్దడంపై సూచనలు చేస్తుంది. ►వనరులను సమర్థంగా వాడుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, మెరుగైన ఫలితాలను రాబట్టడంపై సూచనలను నివేదికలో పొందుపరుస్తుంది. ►అవినీతి నిర్మూలనకు విభాగాల పరిపాలనలో మార్పులను సూచిస్తుంది. -
‘ట్రిలియన్ డాలర్ ఎకానమీయే లక్ష్యం’
లక్నో : ఐఐఎం లక్నో సహకారంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ముందుకెళతామని సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో మంధన్ పేరిట జరిగిన నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో సీఎం యోగితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకెళితే మంచి ఫలితాలు అందివస్తాయని యోగి ఆదిత్యానాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బృందంలా కలిసిపనిచేయడం కోసం ఈ శిక్షణ తమకు ఉపకరిస్తుందని చెప్పారు. లక్ష్యాలను అధిగమించి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు దోహదపడుతుందని అన్నారు. మూడు దశల్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఇది రెండవది కాగా, ఈ కార్యక్రమానికి 50 మంది మంత్రులు, అధికారులు హాజరై మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల నుంచి నేర్చుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సుపరిపాలనకు ఈ శిక్షణ నేపథ్యంలో ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. -
ఐఐటీ, ఐఐఎంలకు నిధుల కోత
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లతోపాటు నియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపులను 2018–19తో పోలిస్తే కేంద్రం తగ్గించింది. 2019 విద్యాసంవత్సరం నుంచి జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం కోటా కల్పించి, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పెంచిన నేపథ్యంలో ఆయా సంస్థలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఐఐఎంలకు గత ఏడాది రూ.1,036 కోట్లు కేటాయించగా ఈసారి 59.9 శాతం కోతపెడుతూ 415.41 కోట్లు కేటాయించారు. ఐఐటీలకు గత ఏడాది రూ.6,326 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్లో రూ.6,223.02 కోట్లు కేటాయించారు. 2017–18లో ఐఐటీలకు రూ.8,337.21 కోట్లు ఇచ్చారు. యూజీసీకి గత ఏడాది 4,722.75 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దాన్ని రూ.4,600.66 కోట్లకు తగ్గించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి గత ఏడాది 485 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 466 కోట్లకు తగ్గించారు. మొత్తమ్మీద చట్టబద్ద నియంత్రణ సంస్థలకు గతఏడాదితో పోలిస్తే 2.70 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ సంస్థలకు రూ.5,066.66 కోట్లు ప్రతిపాదించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,207.75 కోట్లు కేటాయించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లకు ఈ బడ్జెట్లో రూ.660 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత ఏడాది రూ.689 కోట్లుగా ఉంది. -
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే నేడు ఇంద్రా నూయి....
సాక్షి, న్యూఢిల్లీ : ‘విదేశానికి వెళ్లేందుకు నాకు ఉపకార వేతనం రాదని నా తల్లిదండ్రులు అప్పట్లో గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే నిన్ను మేమెందుకు ఆపుతాం! అంటూ నన్ను అనునయిస్తూ వచ్చారు. తీరా ఉపకార వేతనం మంజూరవడంతో వారు ఊగిసలాటలో పడ్డారు. పెళ్లికాని అమ్మాయిని విదేశానికి ఎలా పంపించాలి? పంపిస్తే ఒంటరిగా విదేశానికి వెళ్లిందన్న కారణంగా జీవితంలో పెళ్లి కాదుగదా! అన్నది వారి సంశయం. కుటుంబ సభ్యులందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టారు. పంపించాలా, వద్దా ! అంటూ చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. నేను మాత్రం ఏది ఏమైనా వెళతానని శపథం చేశాను. చివరకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారు. అది అంత త్వరగా సాధ్యం కాదని గ్రహించారు. చివరకు పంపించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. అలా నేను 1978లో ఐదు వందల డాలర్లను జేబులో పెట్టుకొని అమెరికా బయల్దేరాను’ అని అమెరికాలోని ప్రముఖ బహూళార్థక కంపెనీ ‘పెప్సికో’ కంపెనీకి 2006 నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఇంద్రానూయి ఈ ఏడాది జరిగిన ‘ఫోర్బ్స్ మహిళల సమ్మేళనం’లో తన గురించి చెప్పుకొచ్చారు. అమెరికా దిగ్గజ కంపెనీకి పనిచేస్తున్న తొలి విదేశీ సంతతి వ్యక్తిగా, కంపెనీ తొలి మహిళా సీఈవోగా చరిత్ర సృష్టించిన ఇంద్రా నూయి, అక్టోబర్ 3వ తేదీ నాడు కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఎన్నో కంపెనీల్లో పనిచేసి అంచెలంచెలుగా అందరికి అందని ఎత్తుకు ఎదిగిన ఇంద్రా నూయి పెళ్లికి ముందు పేరు ఇంద్రా కృష్ణమూర్తి. తమిళ సంప్రదాయక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె చైన్నైలో అక్టోబర్ 28, 1955లో జన్నించారు. ‘మా అక్కయ్య చంద్రికైనా, నేనయినా జీవితంలో రాణించడానికి కారణం మా అమ్మ. రోజు భోజనాల దగ్గర మా ఇద్దరికి ఓ పోటీ పెట్టేది. ప్రధాన మంత్రి అయితే ఎలా మాట్లాడతావు ? ముఖ్యమంత్రయితే ఎలా మాట్లాడతావు ? ఒక్క భారత దేశానికే పరిమితం కాకుండా బ్రిటీష్ ప్రధాని అయితే ఎలా, అమెరికా అధ్యక్షులయితే ఎలా? అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఎలా, కశ్మీర్ ముఖ్యమంత్రి అయితే ఎలా? అని ప్రశ్నించేది. తింటున్నంత సేపు ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉండేవాళ్లం. భోజనం ముగిశాక పరకాయ ప్రవేశంలా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నాయకుల్లా చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చేసే వాళ్లం. వాటిని శ్రద్ధగా ఆలకించే మా అమ్మ వాటికి మార్కులను కూడా కేటాయించేది’ అని ఓ సందర్భంలో పదేళ్ల క్రితం తన గురించి ఇంద్రా చెప్పుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివిన ఇంద్రా కృష్ణమూర్తి ఓ బ్యాండ్ తరఫున గిటార్ వాయించే వారు. క్రికెట్లో కూడా మంచి ప్రావీణ్యం చూపించారు. అయినా చదువును నిర్లక్ష్యం చేయకుండా 1974లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకోవాలనుకున్నారు. అప్పట్లో మహిళలు బిజినెస్ చదువుల పట్ల అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘ఐఐఎంకు అప్పట్లో కూడా కొన్ని వేల మంది పరీక్ష రాశారు. వారిలో కొందరికే అడ్మిషన్లు లభించాయి. 150 మంది అహ్మదాబాద్ బ్రాంచ్‌కు వెళ్లారు. మరో వంద మంది కలకత్తాకు వెళ్లారు. వారిలో అతి తక్కువ మంది మహిళలు. వారిలో నేను ఒకరిని. అడ్డుగోడను బద్దలు కొట్టాలన్న తపన కారణంగానే నాడు బిజినెస్ చదవ గలిగాను’ అని గతేడాది ‘పోయెట్స్ అండ్ క్వాంట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రా చెప్పుకున్నారు. బిజినెస్‌లో పట్టా పుచ్చుకున్నాక ఇంద్రా మెట్టూర్ బియర్డ్సెల్లో, ఆ తర్వాత ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్లో పనిచేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ తరఫున ‘స్టే ఫ్రీ’ శానిటరీ నాప్కిన్స్ను తీసుకరావడంలో ఆమె ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్షిప్ కూడా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ఇచ్చి చేర్చుకోవడానికి యేల్ యూనివర్శిటీ ముందుకు వచ్చింది. అలా అమె 1980లో ‘యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’ నుంచి పబ్లిక్, ప్రైవేట్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే రాజ్ నూయిని పెళ్లి చేసుకొని ఇంద్రా నూయిగా మారిపోయారు. రాజ్ నూయి ప్రస్తుతం ‘ఏఎం సాఫ్ట్ సిస్టమ్స్’కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తర్వాత నూయి ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’లో చేరి ఆరేళ్లు పనిచేశారు. 1986లో ‘మోటరోలా’ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అక్కడి నుంచి 1990లో స్విస్ పారిశ్రామిక ఉత్పత్తుల కంపెనీ ‘ఆసియా బ్రౌన్ బోవరి’లో యాజమాన్య బృందంలో ఒకరిగా చేరారు. 1994లో పెప్సికో కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆమె చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా మారి కంపెనీ తరఫున చర్చలు జరిపి పలు కంపెనీలను కొనుగోలు చేయించారు. అలా ఎదుగుతూ వచ్చి 2006లో సీఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా గుడ్‌బై చెప్పాక ఆమె ఎక్కడికెళతారో, ఏ బాధ్యతలు స్వీకరిస్తారో ఇంకా వెల్లడించలేదు. -
నవంబర్ 25న క్యాట్ పరీక్ష
కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే క్యాట్–2018 పరీక్షను నవంబర్ 25న నిర్వహిస్తామని ఐఐఎం కోల్‌కతా తెలిపింది. అభ్యర్థులు వచ్చే నెల 8 నుంచి సెప్టెంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెండు దశల్లో జరగనున్న ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 147 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు క్యాట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుమంతా బసు చెప్పారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో 4 పట్టణాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 24 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్ష ఫార్మట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 17 నుంచి అధికారిక వెబ్సైట్లో మోడల్ పేపర్లను అందుబాటులోకి ఉంచనున్నట్లు తెలిపారు. -
మంత్రి గంటా ఐఐఎంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
-
అధిక వేతన ప్యాకేజ్‌లు వారికే..
సాక్షి, న్యూఢిల్లీ : ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంలే అధిక వేతన ప్యాకేజీలను ఆకర్షిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మెటిల్ ఆన్లైన్ టాలెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ నిర్వహించిన అథ్యయనంలో అగ్రశ్రేణి ఐఐఎం విద్యార్ధులే సగటు ఎంబీఏ గ్రాడ్యుయేట్‌తో పోలిస్తే 121 శాతం అధిక వేతన ప్యాకేజ్ పొందుతున్నారని తేలింది. ఇక టాప్ ఐఐటీల గ్రాడ్యుయేట్లు సగటు ఇంజనీర్, సీఎస్ , ఐటీ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే137 శాతం అధిక ప్రారంభవేతనాలను పొందుతున్నారని వెల్లడించింది. ఇక వేతన ప్యాకేజ్‌ల్లో ఎన్ఐటీలను కొత్తగా ఏర్పాటైన ఐఐటీలు అధిగమిస్తున్నాయని, ఇక మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడంతో టాప్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 114 ఇంజనీరింగ్ కాలేజీలు, 80 మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో సర్వే చేపట్టారు. ఇక టెక్నాలజీ విభాగంలో అత్యధిక సగటు వార్షిక వేతనం రూ 14.8 లక్షలుగా నమోదైంది. జనరల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో దాదాపు 31 శాతం హైరింగ్ జరిగింది. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కంటే 118 శాతం అధికంగా వేతనాన్ని ఆఫర్ చేశారు. -
రాష్ట్రానికి కేంద్ర విద్యా సంస్థలు కలేనా?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఏవియేషన్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పట్లో రాష్ట్రానికి రాకపోతే కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు నెలల్లో వాటి ఏర్పాటుకు స్పష్టమైన ఉత్తర్వులతోపాటు నిధులు మంజూ రు కాకపోతే మరో మూడేళ్ల వరకు అవి వచ్చే అవకా శమే లేదు. ముందస్తు ఎన్నికల సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కేంద్రం నుంచి రావాల్సిన ఆమోదాలు, నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్ర ఎంపీల సహకారంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా వాటిని సాధించాలని ఆలోచన చేస్తున్నా.. ఎంత మేరకు ఆచరణ సాధ్యం అవుతుందన్నది వేచి చూడాల్సిందే. విభజన చట్టంలోనే హామీ ఇచ్చినా.. ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీ, కరీంనగర్లో మౌలానా అబుల్‌కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ క్యాంపస్ కోసం రాష్ట్ర ఎంపీలతోపాటు ముఖ్యంగా ఐటీ మంత్రి కె.తారకరామారావు, ఎంపీ వినోద్‌కుమార్ పలుమార్లు ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం అయితే రాష్ట్ర విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. నాలుగేళ్లలో స్థల పరిశీలన, నిధుల కేటాయింపు, తనిఖీలతోనే సరిపోయింది. వరంగల్ జిల్లా ములుగులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని, నిబంధనల ప్రకారం లేదంటూ కేంద్రం కొర్రీ వేసినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం మెలిక కారణంగా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వరంగల్ ప్రాంతంలోనే ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగానే స్పందించినా ఒక్క అడుగు కూడా ముందు కు పడలేదు. మరోవైపు ఏవియేషన్ యూనివర్సిటీ, కరీంనగర్లో ఉర్దూ యూనివర్సిటీ పరిస్థితి అలాగే ఉండిపోయింది. ఈ ఐదారు నెలల్లో కనుక వాటిని సాధించుకోకపోతే వచ్చే మూడేళ్ల దాకా అవి వచ్చే అవకాశమే ఉండదని, తరువాత ఏ ప్రభుత్వం వస్తుం దో.. వచ్చినా అదెలా స్పందిస్తుందో తెలియని స్థితి ఉంటుందని అధికారులు భావిస్తు న్నారు. అందుకే వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. -
బిజినెస్ స్కూళ్లలో నీరవ్, మాల్యా కేస్ స్టడీలు
సాక్షి, న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశంలోని టాప్ ఐఐఎం సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం, రుణ ఎగవేదారులు మోసగాళ్లు, ఉబెర్ వ్యవహారం తదితర కేస్ స్టడీస్‌ను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా కార్పొరేట్ నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్, కీలక సమయాల్లో నిర్ణయాత్మక నిర్ణయాలు వంటి అంశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించనున్నాయి. వేలకోట్ల రూపాయలమేర భారతీయ బ్యాంకులకు అతి సులువుగా, అక్రమంగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, డైమండ్ కింగ్ నీరవ్ మోదీ సహా ఇతర భారీ మోసగాళ్లపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్మేనేజ్మెంట్(ఐఐఎంలు), ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్‌సహా, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్(ఎక్స్ఎల్ఆర్ఐ)జెమ్షెడ్పూర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు వీటిని బోధించనున్నాయి. తద్వారా నైతిక విలువలు, కార్పోరేట్ గవర్నెన్స్, కార్పోరేట్ సామాజిక బాధ్యత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తాయి. ఇందుకోసం నిపుణుల సమాచారం, సహాయంతో కోర్సులను రీడిజైన్ చేయనున్నాయి. కార్పొరేట్ పాలన, నీతి వంటి వివిధ కోర్సులద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం నైపుణ్యం-నిర్మాణాత్మక లక్ష్యాలను అధిగమించటంతోపాటు, సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలవని తాము భావిస్తున్నామని ఐఐఎం బెంగళూరు చైర్పర్సన్ పద్మిని శ్రీనివాసన్ తెలిపారు. మేనేజర్స్ తమ కెరీయర్ ఎదురయ్యే ఎథికల్ డైలమా, సంఘర్షణల సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా తర్ఫీదు నిచ్చేందుకు ఈ కోర్సులను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి నిపుణులైన బోధకుల అవసరం చాలా ఉందనీ, అలాంటి అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించాల్సి ఉందన్నారు. అలాగే విధాన రూపకర్తలు, విశ్లేషణలతో తమకున్న సంబంధాలు గత దశాబ్దాలుగా క్షీణిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
చెప్పుల డాక్టర్ : ఐఐఎమ్ ప్రొఫెసర్..?
ముంబై : వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రతిభను ప్రోత్సహించడాన్ని బాగా ఆస్వాదిస్తారు. సృజనాత్మకత ఎక్కడ ఉన్నా స్వాగతిస్తారు ఈ బిజినెస్ టైకూన్. ప్రస్తుతం ఆనంద్ మహీంద్ర తన ట్విటర్లో పోస్టు చేసిన ఒక ఫోటో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సారి ఈ వ్యాపార వేత్త ఒక ‘చెప్పుల డాక్టర్’ ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టుకు తెగ పొగడ్తలు లభిస్తున్నాయి. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 8,200లైకులను, 1,900 రీట్విట్లను అందుకుంది. ఈ ఫోటో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి షాపుకు సంబంధించినది. నర్సిరాం అనే వ్యక్తి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దుకాణం ముందు ఒక ప్రకటన ఫ్లెక్సిని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకటనలో ‘దెబ్బతిన్న చెప్పుల ఆస్పత్రి, డా. నర్సిరాం, రోగులకు అందుబాటులో ఉండు సమయం’ వంటి వివరాలు ఉన్నాయి. ఈ ప్రకటన ఆనంద్ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక్కడ రోగులు అంటే దెబ్బతిన్న చెప్పులు, డాక్టర్ అంటే చెప్పులు కుట్టే నర్సిరాం, దుకాణం తెరిచి ఉంచే సమయమే రోగులను అనుమతించే సమయం అని అర్థం. ఈ ఫోటోతో పాటు ఆనంద్ మహీంద్ర ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మంచి మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. అవకాశం వస్తే ఇతను ఐఐఎమ్‌లో మార్కెటింగ్ పాఠాలు చెప్పేస్థాయిలో ఉండేవాడని మెసేజ్ చేశాడు.తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇతను ఇంత మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడని అభినందించడమే కాక ఈ ‘చెప్పుల డాక్టర్’ పూర్తి వివరాలు ఇస్తే తాను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఓర్పు, చిరునవ్వుతో చేసే పని ఎంత చిన్నదయినా దానికి మంచి ఫలితం లభిస్తుందని అన్నారు. -
అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ద్వారా దేశంలోని వివిధ విద్యా సంస్థలకు ఇచ్చిన ర్యాంకులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాసంస్థలకు మొత్తం 9 విభాగాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు కేటాయించింది. సమగ్ర (ఓవరాల్) ఉత్తమ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, కళాశాలలు అనే 9 విభాగాల వారీగా ర్యాంకులు విడుదలయ్యాయి. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని జవదేకర్ చెప్పారు. ఓవరాల్ కేటగిరీలో టాప్–5 1.ఐఐఎస్సీ–బెంగళూరు, 2.ఐఐటీ–మద్రాస్, 3.ఐఐటీ–బాంబే, 4.ఐఐటీ–ఢిల్లీ, 5.ఐఐటీ–ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్ విద్యలో టాప్–5 1.ఐఐటీ–మద్రాస్, 2.ఐఐటీ–బాంబే, 3.ఐఐటీ–ఢిల్లీ, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఐఐటీ–కాన్పూర్ వైద్యవిద్యలో టాప్–5 1.ఎయిమ్స్–ఢిల్లీ, 2.పీజీఐఎంఈఆర్–చండీగఢ్, 3.సీఎంసీ–వేలూరు, 4.కేఎంసీ–మణిపాల్, 5.కేజేఎంయూ–లక్నో మేనేజ్మెంట్ విద్యలో టాప్–5 1.ఐఐఎం–అహ్మదాబాద్, 2.ఐఐఎం–బెంగళూరు, 3.ఐఐఎం–కలకత్తా, 4.ఐఐఎం–లక్నో, 5.ఐఐటీ–బాంబే న్యాయ విద్యలో టాప్–5 1.ఎన్ఎల్ఎస్ఐయూ–బెంగళూరు, 2.ఎన్ఎల్యూ–ఢిల్లీ, 3.నల్సార్ యూనివర్సిటీ–హైదరాబాద్, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఎన్ఎల్యూ–జోధ్‌పూర్ ఫార్మసీ విద్యలో టాప్–5 1.ఎన్ఐపీఈఆర్–మొహాలీ, 2.జామియా హందర్ద్–ఢిల్లీ,3.పంజాబ్ యూనివర్సిటీ–చండీగఢ్, 4.ఐసీటీ–ముంబై, 5.బిట్స్–పిలానీ టాప్–5 విశ్వవిద్యాలయాలు: 1.ఐఐఎస్సీ–బెంగళూరు, 2.జేఎన్‌యూ–ఢిల్లీ, 3.బీహెచ్‌యూ–వారణాసి, 4.అన్నా యూనివర్సిటీ–చెన్నై, 5.హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ. -
వృద్ధి రేటులో దేశాన్ని మించిపోయాం: సీఎం
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటులో దేశాన్నే మించి పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలోని నోవాటల్లో గురువారం జరిగిన ఐఐఎం విశాఖ రెండో స్నాతకోత్సవంలో ఐఐఎం చైర్మన్ హరి ఎస్.భార్టియాతో కలిసి ఎంబీఏ విద్యార్థులకు పట్టాలు, గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా భారతదేశం రెండంకెల వృద్ధి రేటు కోసం తీవ్రంగా కృషి చేస్తుంటే ఏపీ మాత్రం డబుల్ డిజిట్ గ్రోత్ రేటు సాధించగలిగిందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లు, మరెన్నో అవరోధాలను అధిగమించి 10.25 శాతం వృద్ధి రేటు సాధించగలిగామన్నారు. విశాఖ సాగరతీరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన యాటింగ్ ఫెస్టివల్‌ను జెండాఊపి సీఎం ప్రారంభించారు. కాగా, ఏసుక్రీస్తు శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ఆయన త్యాగానికి ప్రతీకని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. -
కేజీబీవీల్లో 12వ తరగతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఈ ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బాలికా విద్యపై పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు, పాఠశాలల్లో బాలికల చేరిక సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానమైన కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యను అందించడానికి కేంద్రం అంగీకరించింది. బాలికా విద్యపై సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఢిల్లీలో కలసి సిఫార్సుల అమలుపై చర్చించారు. కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు కడియం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది నుంచే కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కేజీబీవీల్లో 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 9, 10వ తరగతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 8వ తరగతి వరకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని 12వ తరగతి వరకు కల్పించాలని కోరామని, యూనిఫాంలను అందించాల ని విజ్ఞప్తి చేశామని కడియం తెలిపారు. ప్రస్తుతం 12వ తరగతి వరకు విద్యనందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, మధ్యాహ్న భోజనం, యూనిఫాం సౌకర్యాల కల్పనను పరిశీలిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్‌కు ఐఐఎం! వచ్చే విద్యా సంవత్సరం హైదరాబాద్‌లో ఐఐఎం ప్రారంభానికి జవదేకర్ సానుకూలంగా స్పందించినట్టు కడియం తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఐఐఎం మంజూరు చేయాలని కోరామని, ఈ ఏడాది ప్రకటించే ఐఐఎంల్లో తప్పుకుండా ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు. బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణలో మహిళా వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, తెలంగాణకు ఒక ట్రిపుల్ ఐటీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. -
ఐఐఎంల్లో ఇకపై డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఐఐఎం బిల్లు–2017కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఈ చట్టం కింద ఐఐఎంలు ఇకపై విద్యార్థులకు డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు ప్రదానం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ బిల్లును గతేడాది జూలైలో లోక్‌సభ, డిసెంబర్లో రాజ్యసభ ఆమోదించాయని వెల్లడించారు. తాజా చట్టం కింద ఐఐఎంల నిర్వహణ, బోధనా సిబ్బందితో పాటు డైరెక్టర్ల నియామకంలో సదరు సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించినట్లు స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఐఐఎంకు 19 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. -
రాష్ట్రంలో ఐఐఎం ప్రారంభించండి
- కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన మంత్రులు కడియం, కేటీఆర్ - హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి.. - నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని వినతి - చట్ట ప్రకారం అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తాం: జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రులు కడియం శ్రీహరి, కె.తారకరామారావు కోరారు. సోమవారం జవదేకర్‌ను ఆయన కార్యాలయంలో కలసిన కడియం, కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్.. హైదరాబాద్ కేంద్రంగా ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 21 జిల్లాల్లో నవోదయ, 14 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, వరంగల్ కేంద్రంగా ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం 525 గురుకుల పాఠశాలల కోసం ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్య అందించాలన్నారు. సాను కూలంగా స్పందించిన జవదేకర్.. చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు కడియం తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన కడియం శ్రీహరి.. విమానాశ్రయం నుంచి మెట్రో రైలులో శివాజీ స్టేడియం స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లారు. సిరిసిల్లలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి సిరిసిల్ల నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ విషయమై దత్తాత్రేయను ఆయన కార్యాలయంలో కేటీఆర్ కలుసుకుని చర్చించారు. సిరిసిల్లలో ఎంత మంది కార్మికులు బీమా పరిధిలోకి వస్తారో నివేదిక పంపాలని స్థానిక కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్టు దత్తాత్రేయ తెలిపారు. బీడీ, నిర్మాణ రంగ కార్మికులు, అసంఘటిత కార్మికులు బీమా పరిధిలోకి వచ్చేలా చూడాలని సూచించినట్లు తెలిపారు. నివేదిక అందిన వెంటనే ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీడీ కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ తరఫున ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ.. మొదటి దశలో ఐదు వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాటాను విడుదల చేస్తే 2018–19 నాటికి పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హైదరాబాద్‌లో అవసరమైన 45 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేయాలని దత్తాత్రేయను కేటీఆర్ కోరారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణాల పథకం అమలు వేగంగా జరుగుతుండడంపై కేటీఆర్‌ను దత్తాత్రేయ అభినందించి సత్కరించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో బయ్యా రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సోమవారం బీరేంద్రతో ఢిల్లీలో సమావేశమై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తు న ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లోని బైలడైల ఐరన్‌ఓర్ మైన్స్‌కు లింక్ చేస్తూ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్ కమిటీ నివేదిక ఇచ్చిందని బీరేంద్ర తెలి పారు. తాను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశానన్నారు. కమిటీ తుది నివేదిక అందాక హైదరాబాద్‌లో సమావే శమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
తెలంగాణలో ఐఐఎంను ప్రారంభించండి
♦ కేంద్ర మంత్రిని కోరిన మంత్రులు కడియం, కేటీఆర్ ♦ చట్ట ప్రకారం అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తాం: జవదేకర్ న్యూఢిల్లీ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రులు కడియం శ్రీహరి, కె. తారకరామారావు కోరారు. సోమవారం కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలుసుకున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీ వినోద్‌కుమార్.. హైదరాబాద్ కేంద్రంగా ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాల్లో నవోదయ, 14 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, వరంగల్ కేంద్రంగా ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 525 గురుకుల పాఠశాలల కోసం ఏటా రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల చేరిక సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందించాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు కడియం శ్రీహరి తెలిపారు. కేంద్ర మంత్రితో సమాశమవ్వడానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన మంత్రి కడియం విమానాశ్రయం నుంచి మెట్రో రైలులో శివాజీ స్టేడియం స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లారు. -
దుమ్మురేపిన కోలకతా ఐఐఎం
కోల్‌కతా : దేశంలోని అతిపెద్ద కోలకతా ఐఐఎం విద్యార్థులు అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీలతో మరోసారి దుమ్ము రేపారు. మూడు రోజుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో మొత్తం 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో బీ స్కూల్ రికార్డు సృష్టించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరి రెండవ వారంలో మొత్తం 474 టాప్ జాబ్ లను సాధించినట్టు ఐఐఎం కలకత్తా ఒక ప్రకటనలో తెలిపింది . అలాగే 2017 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ ఏడాదికి అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీని అందుకున్నామన్నారు. రూ. 63 లక్షలు (90,000యూరోల) భారీ వేతన ఆఫర్ తమ విద్యార్థి సాధించినట్టు చెప్పారు. అలాగే దేశీయంగా అత్యధిక ప్యాకేజీ రూ.70లక్షల(సంవత్సరానికి)ని తెలిపారు. ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో అత్యధికంగా 29 శాతం ఆఫర్లు వచ్చాయి. అవెందూస్, ఎడెల్వీస్, గోల్డ్‌మ్యాన్ సాచీ, హెఎస్ బీసీ టాప్ రిక్రూటర్లుగా నిలిచాయి. కన్సల్టింగ్ సెక్టార్ లో 22 శాతంతో రెండవస్థానంలో నిలచింది. ఈ రంగం లో యాక్సెంచర్, ఏటీ కీర్నే, బైన్, బీసీజీ అండ్ మెకిన్సే ఉన్నాయి. బీజీ, సికె బిర్లా, టీఏఎస్ లాంటి టాప్ జనరల్ మేనేజ్మెంట్ సంస్థలు 15శాతం నియమించుకున్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ 12శాతం హెచ్ యూఎల్, ఐటిసి, ప్రోక్టర్ అండ్గ్యాంబుల్, రెక్కిట్ బెంకైజెర్ వంటి సంస్థల ఉన్నాయి. వీటితోపాటుగా, అమెజాన్, విప్రో లాంటి ఇతర కామర్స్, ఐటి సంస్థలు కూడా 14శాతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు బీ స్కూల్ వెల్లడించింది. -
IIM లకు స్వతంత్ర ప్రతిపత్తి!
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు).. దేశంలో మేనేజ్మెంట్ విద్యలో అత్యున్నత సంస్థలు. ఎందరో కార్పొరేట్ లీడర్లను తీర్చిదిద్దిన ఘనత వీటికే దక్కుతుంది. కానీ, కొన్ని పరిమితుల కారణంగా ఐఐఎంలు పూర్తిస్థాయి సామర్థ్యాలను ప్రదర్శించలేక పోతున్నాయనే అభిప్రాయం ఉంది. ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే దిశగా ఐఐఎంల బిల్లు–2015ను పార్లమెంట్ వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్లు ముఖ్యాంశాలు, దాని అమలుతో కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ.. బోధన, నిర్వహణ, ఇతర అంశాల్లో ఐఐఎంలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కొత్త కార్యాచరణకు సంబంధించిన బిల్లు 2015లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖకు చేరింది. అందులోని కొన్ని అంశాలపై హెచ్ఆర్డీ వర్గాలు ప్రతికూల వైఖరిని అవలంబించాయి. దీంతో ఏడాదిన్నరగా బిల్లులో మార్పులు జరిగాయి. చివరకు తాజాగా హెచ్ఆర్డీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. ఐఐఎం వర్గాలు పేర్కొన్న స్వతంత్ర ప్రతిపత్తిపై సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ బిల్లును పార్లమెంటు వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టి, కార్యరూపం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘విజిటర్’ హోదాకు స్వస్తి: బిల్లులో అత్యంత ప్రధాన అంశం..‘విజిటర్ హోదా’ అనే పదానికి స్వస్తి పలకాలని ఐఐఎంలు కోరడం, దానికి హెచ్ఆర్డీ అంగీకరించడం. ప్రస్తుతం ఐఐఎంల్లో అమలవుతున్న విధానం ప్రకారం రాష్ట్రపతికి విజిటర్ హోదా ఉంటోంది. ఈ హోదాలో ఒక ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఐఐఎం వర్గాలను సంప్రదించకుండా నేరుగా ఎవరినైనా నియమించొచ్చు. దీనిపై ఐఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇప్పుడు ‘విజిటర్ హోదా’కు స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఐఐఎం ఫోరం: తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇకపై అన్ని ఐఐఎంలు కలిసి ఒక ఫోరంగా ఏర్పడనున్నాయి. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఫోరం ఏర్పాటు వల్ల ఐఐఎంల మధ్య నిరంతరం సంప్రదింపులు, ఎక్సే్ఛంజ్ కార్యకలాపాలకు వీలవుతుంది. తద్వారా అకడమిక్‌గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా సమర్థ నిర్వహణకు అవకాశం ఉంటుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఐఐఎం ప్రత్యేకంగా ఉండాలని, ఇతర ఐఐఎంలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఫోరం వల్ల ఆశించిన ఉద్దేశం నెరవేరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో స్వేచ్ఛ: ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి కూడా కొత్త బిల్లు ద్వారా ఐఐఎంలకు స్వతంత్రత లభించనుంది. నిర్దిష్టంగా ఒక ఐఐఎంకు గవర్నింగ్ బోర్డ్ డైరెక్టర్ నేతృత్వంలో ఫ్యాకల్టీని నియమించే అవకాశం ఉంది. అయితే వీరికి వేతనాలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో సెంటర్లు: కొత్త బిల్లు ప్రకారం నిబంధనల మేరకు ఐఐఎంలు విదేశాల్లో తమ సెంటర్ల ఏర్పాటుకు అవకాశముంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ సెంటర్ల వల్ల కొలాబరేటివ్ పరిశోధన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. స్వదేశంలోనూ వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు. ఎంబీఏ పట్టాలు: ఐఐఎంలు ప్రస్తుతం రెండేళ్ల వ్యవధిలో పీజీ డిప్లొమా పేరుతో అందిస్తున్న కోర్సులకు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంబీఏ పేరుతో పట్టాలు ఇవ్వనున్నాయి. రెండేళ్లపాటు చదివినా పీజీ డిప్లొమా టైటిల్ వల్ల అంతర్జాతీయంగా సరైన గుర్తింపు రావడం లేదని, అందువల్ల ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలని పలువురు పూర్వ విద్యార్థులు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రీసెర్చ్ కార్యకలాపాలకు ప్రాధాన్యం: బిల్లులో మరో ప్రధానాంశం ఒక ఐఐఎం స్వయంగా రీసెర్చ్ యాక్టివిటీస్ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ క్రమంలో రీసెర్చ్‌కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు వంటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్ కౌన్సిల్‌కే పూర్తి నిర్ణయాధికారాలు లభిస్తాయి. డైవర్సిటీకి ప్రాధాన్యం: ఐఐఎంల్లో సిబ్బంది నియామకాలు, కోర్సుల ప్రవేశాల విషయంలో డైవర్సిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. మహిళలు, దివ్యాంగులతోపాటు అన్ని సామాజిక వర్గాలు, నేపథ్యాలకు చెందిన వారికి అవకాశం లభించేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు. త్వరితగతిన డైరెక్టర్ల నియామకం: సాధారణంగా ఒక డైరెక్టర్ పదవీ కాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందుగానే కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియ ప్రారంభించాలి. పదవీ కాలంలో డైరెక్టర్ వైదొలగితే నెల వ్యవధిలో కొత్త డైరెక్టర్ నియామకానికి గవర్నింగ్ బోర్డ్ చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం వివిధ ఐఐఎంల్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయితే ఏళ్ల తరబడి భర్తీ కాని పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి తాజా బిల్లులో సిఫార్సులు చేశారు. త్వరితగతిన డైరెక్టర్ల నియామకాలు చేపట్టాలని బిల్లులో స్పష్టం చేశారు. దీనివల్ల సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. బిల్లు ముఖ్యాంశాలు విజిటర్ హోదాకు స్వస్తి డైరెక్టర్ల నియామకానికి గవర్నింగ్ కౌన్సిల్‌కు అధికారం రీసెర్చ్ యాక్టివిటీస్ పరంగా స్వయంప్రతిపత్తి పీజీ డిప్లొమా స్థానంలో ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్ల ప్రదానం దేశ, విదేశాల్లో సెంటర్ల ఏర్పాటుకు అవకాశం ఐఐఎం కామన్ ఫోరం ఏర్పాటు డైవర్సిటీకి తప్పనిసరిగా ప్రాధాన్యం -
క్యాట్‌కు ప్రత్యామ్నాయాలు..
దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు)లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష క్యాట్. దీనికి పోటీ లక్షల్లో ఉంటే అందుబాటులో ఉన్న సీట్లు 5 వేల లోపే. ఇందులోఅర్హత సాధించకుంటే నిరుత్సాహపడనవసరం లేదు. క్యాట్‌కు ప్రత్యామ్నాయంగా మరెన్నో మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. సీమ్యాట్ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ).. మేనేజ్మెంట్ కోర్సుల ఔత్సాహికుల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలల్లో మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశించొచ్చు. పరీక్ష నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి.. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్నెస్. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు 400 మార్కులకు ఉంటాయి. వెబ్సైట్: aicte-cmat.in మ్యాట్ ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ ఆధారంగా దేశంలో దాదాపు 500కు పైగా ప్రముఖ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థల్లో ప్రవేశించొచ్చు. దీన్ని ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తారు. పరీక్ష ఐదు విభాగాల్లో ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. మ్యాట్ 2017 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27, 2017. వెబ్సైట్: www.aima.in ఏటీఎంఏ ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ (ఏటీఎంఏ) పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా జాతీయ స్థాయిలో 200కు పైగా ప్రముఖ బి–స్కూల్స్‌లో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. అనలిటికల్ రీజనింగ్, వెర్బల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్‌లో పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు విభాగాలుగా 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏటా మూడుసార్లు పరీక్ష ఉంటుంది. ∙ఏటీఎంఏ – 2017 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2017. http://www.atmaaims.com/ ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్).. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించే పరీక్ష. ఇందులో ర్యాంకు ద్వారా యూనివర్సిటీ క్యాంపస్ మేనేజ్మెంట్ కళాశాలలు, రాష్ట్ర స్థాయిలో ఇతర ప్రముఖ బి–స్కూల్స్‌లో ప్రవేశించొచ్చు. 200 మార్కులకు, రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షకు ఏటా ఫిబ్రవరి/మార్చి నెలలో ప్రకటన వెలువడుతుంది. ఎన్‌మ్యాట్ నర్సీమొంజీ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎన్‌మ్యాట్)లో బెస్ట్ స్కోర్/ ర్యాంకు ఆధారంగా నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు దేశంలోని మరో 150 వరకు బి–స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విభాగాల్లో (లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్), రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.nmat.org.in వీటితోపాటు సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ – పుణె.. జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఎక్స్ఎల్ఆర్ఐ నిర్వహించే జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ) అందుబాటులో ఉన్నాయి. -
జమ్మూలో ఐఐఎం...
కశ్మీర్లో ఔట్-క్యాంపస్ ► ఈ ఏడాదే ప్రారంభం ► కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: భారతదేశపు 20వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను జమ్మూలో నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత కశ్మీర్లో కూడా ఐఐఎం ఔట్-క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రతిపాదనకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే 54 మంది విద్యార్థుల సామర్థ్యంతో జమ్మూలోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐఎం తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 61.90 కోట్లు వ్యయం కానుంది. అలాగే.. ఎన్ఐటి - శ్రీనగర్ క్యాంపస్‌లో మౌలికవసతుల ఆధునీకరణకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించినట్లు హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఎయిమ్స్ కాలనీల పునరభివృద్ధి... ఢిల్లీలోని ఎయిమ్స్ కాంప్లెక్స్‌లో భాగంగా 60 ఏళ్ల కిందట నిర్మించిన నివాస కాలనీలను పునరభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ పునరభివృద్ధితో పాటు 30 ఏళ్ల పాటు నిర్వహణ, పర్యవేక్షణకు రూ. 4,441 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇథనాల్ ధర సవరణకు ఆమోదం స్వేచ్ఛా మార్కెట్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ.. పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ధరలను సవరించే కొత్త వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఫలితంగా ఇథనాల్ ధర లీటరకు రూ. 3 తగ్గి రూ. 39 కి దిగింది. చెరకు నుంచి తీసే ఇథనాల్ ధరను ఇకపై చెరకు మార్కెట్ ధర, డిమాండ్ - సరఫరా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. జార్ఖండ్‌లోని సాహిబ్గంజ్ను బిహార్‌లోని మణిహారితో అనుసంధానిస్తూ రూ. 1,955 కోట్లతో హైవే ప్రాజెక్టును చేపట్టేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
వరంగల్‌లోనే ఐఐఎం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ వరంగల్‌లోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హన్మకొండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఐఎంను వరంగల్‌లోనే ఏర్పాటు చేయాలని తాము సీఎం కేసీఆర్‌ను కోరామని, సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐఎం రానుందన్నారు. జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖకు చెందిన కెప్టెన్ రాంబాబు స్థల పరిశీలన చేశారన్నారు. దీనిపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఇంగ్లిష్ మీడియంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో గురుకులానికి రూ.20 కోట్లతో భవనాలు నిర్మించి, వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ కలుపుకుని ఒక్కో గురుకులంలో 35 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. -
షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఇంజనీరింగ్‌కు ఐఐటీలు ఫేమస్.. మేనేజ్మెంట్ అంటే ఐఐఎంలే గుర్తొస్తాయి.. సాధారణ వృత్తి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన ఫుట్‌వేర్ రంగంలో రాణించాలంటే.. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో చేరాల్సిందే. ప్రస్తుతం ఇందులో వివిధ కోర్సులకు ప్రకటన విడుదలైంది. వివరాలు.. ఎఫ్‌డీడీఐ.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్‌డీడీఐని 1986లో ఏర్పాటు చేశారు. ఫుట్‌వేర్, లెదర్ ఇండస్ట్రీలో పరిశోధనలు, అభివృద్ధితో పాటు ఈ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చాలనే లక్ష్యంతో ఎఫ్‌డీడీఐని నెలకొల్పారు. ఎఫ్‌డీడీఐ ప్రధాన క్యాంపస్ నోయిడాలో ఉంది. హైదరాబాద్‌తోపాటు మరో పది నగరాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డులు, గుర్తింపులు పొందిన ఈ సంస్థ నుంచి ఏటా 1800 మంది సుశిక్షుతులు ఎంఎన్సీ స్థాయి కంపెనీలకు ఎంపిక అవుతున్నారు. బీఎస్సీ కోర్సులు.. ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్ స్థాయిలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ కోర్సు; బీఎస్సీ రిటైల్ - ఫ్యాషన్ మర్చండైస్; బీఎస్సీ ఫ్యాషన్ లెదర్ యాక్సెసరీ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విజయవంతంగా పూర్తిచేస్తే ఉపాధి పరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. అర్హత బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, పీజీ కోర్సులకు బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చేరండిలా.. ప్రవేశానికి అర్హత గల అభ్యర్థులు ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ) రాయాలి. ఆన్లైన్ పరీక్షలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా సుమారు 36 కేంద్రాల్లో టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో ఉంటుంది. ఏఐఎస్టీలో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సిలబస్.. ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. యూజీ కోర్సుల్లో మ్యాథమెటి క్స్ 45, జనరల్ సైన్స్ 30, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు రీజనింగ్ అండ్ క్యూఏ 45, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ 30, బిజినెస్ ఆప్టిట్యూడ్‌లపై 30 ప్రశ్నలుంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయాలి. ఒకే దర ఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు కోడ్లను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.www.fddiindia.com పరీక్ష నుంచి మినహాయింపు పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు క్యాట్, గ్జాట్, మ్యాట్, ఏఐఎంఏ, ఎన్‌మ్యాట్, ఏఎంసీఏటీ, స్నాప్, జీమ్యాట్, ఏఐఎం-క్యాట్ల్లో ప్రతిభ ఆధారంగా ఏఐఎస్టీతో సంబంధం లేకుండా చేరొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కోసం బిట్‌శాట్, ఐఐటీ జేఈఈ, జీజీఎస్‌ఐపీయూ, విట్, ఎస్ఆర్ఎం, బీసీఈసీఈ, యూపీఎస్ఈఈ, ఎంపీసీఈటీ, జీయూజేసీటీ, ఎంసెట్, సీఓఎంఈడీకే తదితర పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించినవారు కూడా ప్రవేశపరీక్షతో సంబంధం లేకుండా నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ముఖ్య తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ: మే 20 ప్రవేశ పరీక్ష: జూన్ 10, 11, 12 ఫలితాల వెల్లడి: జూన్ 24 యూజీ కోర్సుల కౌన్సెలింగ్ తేదీలు: జూలై 13, 14, 15 పీజీ కోర్సులు: జూలై 11, 12 -
న్యూ కోర్సు
ఐఐఎం-రోహ్తక్లో ఈపీజీడీఎం ఐఐఎంలలో నాన్-రెసిడెన్షియల్ విధానంలోనూ వినూత్న ప్రోగ్రామ్‌లు రూపొందుతున్నాయనడానికి నిదర్శనం.. ఐఐఎం-రోహ్తక్ ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ పీజీడీఎం(ఈపీజీడీఎం). ఇంటరాక్టివ్ ఆన్లైన్ లెర్నింగ్ విధానంలో బోధన ఉండే ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఫ్యాకల్టీ బోధనలను ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ సహకారంతో వినే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మరింత ఉపయోగపడే ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి క్యాట్/జీమ్యాట్/ జీఆర్ఈ స్కోర్లు తప్పనిసరి. వెబ్సైట్: http://www.iimrohtak.ac.in/ -
బిజినెస్ స్కూళ్లలో ఫీజుల మోత
ముంబై : మొన్న ఐఐటీ...తాజాగా ఆ జాబితాలో ఐఐఎంలు చేరాయి. టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూళ్లలో ఇకనుంచి ఫీజుల మోత మోగనుంది. దాదాపు తొమ్మిది బిజినెస్ స్కూళ్లు ఈ ఏడాది కోర్సు ఫీజులను 7 నుంచి 30 శాతం పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇన్ స్టిట్యూట్ లు బట్టి ఫీజుల పెరుగుదల లో వ్యత్యాసాలు ఉంటాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లక్నో 30 శాతం ఫీజును పెంచుతుండగా, ఐఐఎమ్ కోజికోడ్ 23 శాతం పెంచేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీతాలు పెరుగుదల, ఇన్ స్టిట్యూట్ లో మౌలిక సదుపాయాల సమకూర్చడం ఇలా ప్రతీ ఖర్చు పెరుగుతుండటంతో, ఐఐఎమ్ లో ఫీజులు పెంచుతున్నామని రాంచీ క్యాంపస్ డైరెక్టర్ అనింద్య సేస్ తెలిపారు. రాంచీ ఇన్ స్టిట్యూట్ కోర్సు ఫీజును 19 శాతం పెంచడంతో, ఈ ఏడాది విద్యార్థులు రూ.12.5 లక్షల చెల్లించాల్సిఉంది. భారత్ లో అత్యంత ఖరీదైన మేనేజ్ మెంట్ ప్రొగ్రామ్ అందిస్తున్న ఐఐఎమ్ అహ్మదాబాద్, 5.4 శాతం ఫీజును పెంచి, 19.5 లక్షలుగా నిర్ణయించింది. అదేవిధంగా ఐఐఎమ్ కోల్ కత్తా సైతం 16.5 శాతం పెంచడంతో, ఈ ఏడాది 19 లక్షల ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి ఉంది. ప్రైవేట్ బిజినెస్ స్కూలు సైతం ఫీజులను పెంచాయి. కానీ వీటికి పరిమితికి మించి ఫీజులు పెంచే వీలులేకపోవడంతో,ఆ స్కూళ్లు ఆదాయాలను ఇతర వనరుల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. టాప్ బిజినెస్ స్కూలు తీసుకున్న ఈ నిర్ణయంతో, గడిచిన తొమ్మిదేళ్లలో నాలుగు నుంచి ఐదు సార్లు ఫీజులు పెరిగినట్టైంది. తొమ్మిదేళ్ల క్రితం ఐఐఎమ్ అహ్మదాబాద్ ఫీజు 4 లక్షలు కాగా, ఇప్పుడు 19.5 లక్షలకు చేరింది. బిజినెస్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజులు ద్రవ్యోల్బణం కంటే చాలా వేగంగా పెరుగుతున్నాయని ఈటీఐజీ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. ఈ ఫీజుల మోతతో, విద్యార్థులు మంచి జీతాలు పొందినప్పటికీ, స్టడీ లోన్ లు చెల్లించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డెలాయిట్ డైరెక్టర్ రోహిన్ కపూర్ చెప్పారు. బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు ప్లేస్ మెంట్ లో ఉద్యోగం సంపాదిస్తే, తొలి ఏడాదే 13 నుంచి 18 లక్షల జీతం పొందుతారన్నారు. -
తొలి అడుగు..
♦ ఏయూలో ఐఐఎం ప్రారంభం ♦ తొలిరోజే తరగతులు బోధన ♦ 60మంది విద్యార్థులు చేరిక ♦ కొత్తకేంపస్లో నవ్యోత్సాహం ఏయూక్యాంపస్ : చిరకాల స్వప్నం సాకారం అయ్యింది. విశాఖ వేదికగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రారంభమైంది. సో మవారం ఏయూలోని చారిత్రక ఎంబిఏ విభాగం ఎదురుగా ఐఐఐఎం(వి) తొలి అడుగును వేసింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేలకావడంవల్లనో, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన విశాఖ ప్రత్యేకతో విద్యార్థులను, తల్లిదండ్రులను మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది. నిర్ధారిత సమయంలో పూర్తిచేసి, చక్కని వసతులతో దర్శనమిచ్చింది. సోమవారం ఉదయం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. నగరం నడిపించింది: విశాఖ నగర ఖ్యాతికి ఐఐఎంవి అదనపు సంపదగా నిలచింది. ఐఐఎం బెంగళూరుతో సమానంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు మన విశాఖ ఐఐఎంను ఎంపిక చేసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయంగా ఇది నిలవనుంది. అరవై మంది విద్యార్థులకు అవకాశం ఉండగా 54 మంది చేరారు. వీరిలో నలుగురు విద్యార్థినులున్నారు. భౌగోళికంగా నగరానికి ఉన్న ప్రాధాన్యత, ఏయూలో ఏర్పాటవుతుండటం కలసివచ్చాయని ఐఐఎం బెంగళూరు ఆచార్యులు స్వయంగా చెప్పారు. నూతనంగా ఏర్పాటవుతున్న సంస్థలో వసతులు, బోధన ఏర్పాట్లపై అనేక సందేహాలు ఉంటాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ విద్యార్థులో తెగువతో ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రా రంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏయూ ఇన్‌గేట్ వద్ద నున్న ఐఐఎంవి క్యాంపస్‌కు విద్యార్థులు చేరుకున్నారు. తొలిరోజు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు వెంట వచ్చారు. దీనితో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రాంగణం నిండిపోయింది. {పారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు తరగతులు నిర్వహించారు. శాశ్వత అధ్యాపకులు నియమితులయ్యే వరకు ఐఐఎం బెంగళూరు నుంచి అధ్యాపక బృందం బోధనకు వస్తుంటారు. సౌరవ్ ముఖర్జీ(డీన్) విశాఖ కేంద్రానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఐఐఎం బి నుంచి పలువురు ఆచార్యులు ఇక్కడకు చేరుకున్నారు. ఐఐఎం బెంగళూరుకు చెందిన సీనియర్ విద్యార్థుల బృందం సైతం ఇక్కడకు చేరుకుంది. విద్యార్థులకు విభిన్న అంశాలపై వీరు అవగాహన కల్పిస్తున్నారు. అల్యూమినీ విద్యార్థులు సైతం సమన్వయం చేస్తున్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనకు సైతం చర్యలు ప్రారంభించినట్లు ఐఐఎం బి సంచాలకులు సుశీల్ వచాని తెలిపారు. ప్రతిభే కొలమానం.... ఐఐఎంలలో ప్రతిభే కొలమానంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ఎంటర్‌ప్యూనర్, స్టార్టప్‌లపై ప్రాధాన్యం కల్పించడం జరుగుతుంది. సుశిక్షితులైన బోధన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వైజాగ్ ఐఐఎం భవిష్యత్తులో అత్యుత్తమ సంస్థల సరసన నిలుస్తుంది. విదేశాలలో స్థిరపడాలనే వారు ఇతర దేశాలలో ఎంబిఏకు వెళుతున్నారు. -సుశీల్ వచాని, సంచాలకులు ఐఐఎం బెంగళూరు వసతులు బాగున్నాయి... కొత్త క్యాంపస్ అయినప్పటికీ వసతులు బాగున్నాయి. ఐఐఎంబి మెంటార్‌గా వ్యవహరించడం మంచి పరిణామం. అకడమిక్ హాల్స్, సెమినార్ హాల్స్ చాలా బాగున్నాయి. సీనియర్స్, అల్యూమిని అందిస్తున్న గెడైన్స్ ఎంతో సహకరిస్తోంది. ప్రస్తుతం సిఆర్‌గా వ్యవహరిస్తున్నాను. -అంకిత్గుప్తా, మధ్యప్రదేశ్ ఆలోచనలకు మించి పోయింది.. నేను ఇప్పటికే దేశంలోని పలు ఐఐఎంల ఫోటోలను చూశాను. వీటన్నింటికంటే విశాఖ ఐఐఎం బాగుంది. మా ఆలోచనలు, ఆకాంక్షలను మించే విధంగా దీనిని తయారుచేశారు. ఐఐఎం బెంగళూరు నిపుణులు పడిన కష్టం కనిపిస్తోంది. ఇటువంటి సంస్థలో ప్రవేశం రావడం ఆనందంగాా ఉంది. -మనీష్, చెన్నై -
విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని అధికారికంగా ప్రారంభించారు. విభజన చట్టంలో హామీ మేరకు ఇక్కడ ఐఐఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఐఐఎం డెరైక్టర్ సుశీల్ వశాని తదితరులు పాల్గొన్నారు. -
21న విశాఖలో ఐఐఎం తరగతులు ప్రారంభం
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐఐఎం తరగతులు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. తరగతులకు 120 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు నేతృత్వం లో బెంగుళూరు ఐఐఎంకు చెందిన ప్రాజెక్ట్ డీన్ ఆచార్య సౌరవ్ ముఖర్జీ, పోగ్రామ్ డీన్ ఆచార్య సుధారావు, కార్యాలయం డెరైక్టర్ పునీత్‌కౌర్, విశాఖ ఐఐఎం అధికారి చంద్రశేఖర్‌రావు తదితరులు మంగళవారం విశాఖలో ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఐఐఎం తరగతులపై చర్చించారు. తరగతులు ప్రారంభైమైన తరువాత వారం రోజులు పాటు ఓరియెం -
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: విశాఖపట్నం సహా ఆరు ప్రాంతాల్లో కొత్తగా ఆరు ఐఐఎంల ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ స్మారకార్థం బీహార్ లో స్థూపం నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.81,459 కోట్లతో చేపట్టనున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ కు ఆమోద్రముద్ర వేసింది. ఈ ఏడాది నుంచి జపాన్, దక్షిణ కొరియా దేశాలకు మేలు రకం ముడిఇనుము ఎగుమతి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఐఐఎంలు వచ్చేది ఇక్కడే 1. విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్) 2. బుద్ధగయా(బీహార్) 3. సిర్మౌర్(హిమచలప్రదేశ్) 4. నాగపూర్(మహారాష్ట్ర) 5. సంబల్పూర్(ఒడాశా) 6. అమృతసర్(పంజాబ్) -
గంభీరంలో రేడియేషన్ రీసెర్చ్ ల్యాబ్
♦ ఐఐఎం స్థలానికి సమీపంలోనే స్థలం కేటాయింపు ♦ రూ.80 కోట్లు కేటాయించిన కేంద్రం ♦ దేశంలో ఇది నాల్గవది ♦ నేవీ, ఆర్మీలకు ఉపయోగకరం ♦ ముఖ్యమంత్రిచే శంకుస్థాపనకు ఏర్పాట్లు ఆనందపురం : మండలంలోని గంభీరంలో సమీర్ (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్) అనే మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు కానుంది. దీంతో విశాఖ ప్రాంతానికి మరింత గుర్తింపు రానుంది. ఇప్పటికే ఇక్కడ ఐఐఎంతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఇక్కడ సమీర సంస్థ ఏర్పాటుకు ఏపీఐఐసీ 13 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, కేంద్రం రూ.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుచే శంకుస్థాపన చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సంస్థలు దేశంలో చెన్నై, ముంబై, కలకత్తాలో ఉండగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది నాల్గవది. ఇక్కడ ఏర్పాటు కానున్న రేడియేషన్ నిర్ధారణ కేంద్రం వల్ల నేవీ, ఆర్మీ వంటి సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రంగాల్లో వినియోగించే వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్స్ వంటి వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ పరిశీలన చేసి నిర్ధారిస్తారు. వాటితో పాటు వివిధ ప్రైవేటు సంస్థలకు సేవలను అందిస్తారు. ఈ విషయమై ప్రోగ్రామ్ డెరైక్టర్ సురేష్ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేయబోయే ల్యాబ్‌లో వివిధ పరికరాల వల్ల వెలువడే రేడియేషన్‌ను కచ్చితంగా అంచనా వేసి నివేదికను అందజేస్తామన్నారు. దీనివల్ల ఆయా సంస్థల రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. -
ఈ కేటాయింపులు ఏ మూలకు
ఐఐఎంకు రూ.40 కోట్లు ఉన్నత విద్యాసంస్థ నిర్వహణకు సరిపడని నిధులు మెట్రోరైలుకు రూ.5.3కోట్లు వేతన జీవులకు నిరాశ ఏయూక్యాంపస్: కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో విశాఖ నగరంలో ఐఐఎం ఏర్పాటుకు, మెట్రోరైల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు కేవలం కంటితుడుపుగా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటుచేయడానికి ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో గంభీరంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ఐఐఎంకు 40 కోట్లు కేటాయించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విశాఖలో ప్రవేశాలు కల్పించాలని, తాత్కాలికంగా ఏయూలో దీనిని ఏర్పాటుచేయాలని గతంలో నిర్ణయించారు. గంభీరంలో నూతన క్యాంపస్‌కు కేంద్ర మావన వనరుల శాఖమంత్రి స్మృతి ఇరాని ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐఎం రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలంటే తక్షణం కొన్ని మౌలిక వసతులు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి కోట్ల రూపాయలు వెచ్చించాలి. ప్రస్తుతం కేంద్రం విదిల్చిన 40 కోట్లు తాత్కాలిక ఐఐఎం నిర్వహణకు, శాశ్వత భవనాలు, క్యాంపస్ అభివృద్దికి సమానంగా వెచ్చించాల్సిన అవసరం ఉంది. మొత్తంమీద విశాఖలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అనుకున్న విధంగా ఐఐఎం ప్రారంభించడానికి ఈ నిధులు కొంత వరకు ఉపకరించే అంశం. గంభీరంలో శాస్వత క్యాంపస్ ఏర్పాటు వేగవంతం చేయడానికి మాత్రం ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయానికి కేంద్రం కదలిక మాత్రమే తెచ్చింది. ఈ బడ్జెట్లో కేటాయించిన 5.3 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును డిల్లీ మెట్రో కార్పొరేషన్‌కు అందించింది. శ్రీధరన్ తొలి దశలో విశాఖలో గతలో పర్యటించి ప్రాధమికంగా ఒక అవగాహనకువచ్చారు. అందరూ ఆశించిన స్థాయిలో ఈ రెండు ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉంటాయని భావించినప్పటికీ కేంద్రం కరుణ చూపలేదు. వేతన జీవులకు నిరాశే: విశాఖ నగరం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధిస్తోంది. నగరంలో అధికశాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు. వీరు ఆదాయపన్ను పరిమితి పెంపుదల జరుగుతుదని ఆశించారు. వీరి ఆశలను నిరాశ పరిచే విధంగా ఈ బడ్జెట్ సాగడంతో ఉద్యోగులంతా తీవ్రంగా నిరాశ చెందారు. వేతన జీవులకు ఎంతమాత్రం ఈ బడ్జెట్ దయ చూపలేదు. పాత శ్లాబులే కొనసాగింపుపై ఈ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎం కేటాయింపు
-
ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
పీఎస్బీల్లో నియామకాలపై ఎస్బీఐ అరుంధతీ భట్టాచార్య ముంబై: ఐఐటీ, ఐఐఎంల నుంచి అభ్యర్థులను ఉద్యోగులుగా ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు కూడా ఇవ్వాలని ఎస్బీఐ కోరింది. ఐఐటీ, ఐఐఎంల వంటి ఉన్నత స్థాయి సంస్థల ఏర్పాటుకు ప్రజాధనం వినియోగమవుతోందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దేశంలోని ఉన్నత స్థాయి ప్రతిభావంతులు ఈ సంస్థల్లో ఉంటారని, కానీ వీరిని నియమించుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వీలు లేదని వివరించారు. ఇతర ప్రైవేట్ సంస్థల మాదిరే ఐఐటీ, ఐఐఎంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లను నిర్వహించి మంచి ప్రతిభ గల అభ్యర్థులను ఉద్యోగులుగా తీసుకునే వెసులుబాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులతో పీఎస్ బ్యాంకులు పోటీపడలేకపోతున్నాయని వాపోయారు. ఇలాంటి సంస్థల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించరాదని సుప్రీం కోర్టు పేర్కొందని వివరించారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ఏర్పడే ప్రతి ఖాళీని ప్రకటించాలని, అర్హత గల ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయమని పేర్కొన్నారు. -
విజ్ఞాన గనులుగా మారాలి
గెస్ట్ కాలమ్ ‘భారత్‌లో ఐఐఎం, ఐఐటీలు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే దేశంలో విద్యా సంస్థలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా మారాలి. ఇవి డిగ్రీల ముద్రణ కేంద్రాలుగా కాకుండా.. భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి’ అని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ సుందర్. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన భారతీయ రైల్వేలో ఇంజనీర్‌గా పని చేసి ఆసక్తితో అకౌంటింగ్ రంగంలో ప్రవేశించారు. తర్వాత అకౌంటింగ్ థియరిస్ట్, ఎక్స్పరిమెంటల్ ఎకనామిస్ట్‌గా పేరు గడించి.. పలు అవార్డులు, ఫెలోషిప్‌లు పొందినప్రొఫెసర్ శ్యామ్ సుందర్‌తో ఇంటర్వ్యూ.. నాణ్యమైన విద్య ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కోవడానికి గట్టి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువ ప్రతిభావంతులను బోధన రంగంవైపు ఆకర్షించాలి. ఉన్నత విద్యాసంస్థలను లాభాలు ఆర్జించేవిగా పరిగణించకూడదు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు భారీస్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు పటిష్టమైన విధానాలను అమలు చేయాలి. లేకుంటేవిద్యార్థులకు సరైన విద్య అందక దేశ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది. బోధనపై ఆసక్తి పెంచాలి ప్రస్తుతం సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే.. నాణ్యమైన ఉన్నత విద్యనందించేందుకు అధ్యాపకుల సంఖ్యను భారీగా పెంచాలి. మన దేశంలో ఏటా దాదాపు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని అంచనా. అలాగే కోటిన్నర మంది కొత్తగా వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ అంచనాల ఆధారంగా స్టూడెంట్-టీచర్ నిష్పత్తిని 1:50గా చూసినా.. మనకు యూనివర్సిటీ/ కాలేజీ స్థాయిలో 30 లక్షల మంది అధ్యాపకులు అవసరం. ఒకసారి విధుల్లో చేరిన టీచర్లు 35ఏళ్లు పనిచేస్తారని భావించినా.. ప్రతి ఏటా కొత్తగా లక్ష మంది అధ్యాపకులు కావాలి. కాబట్టి ఈ కొరతను పూడ్చేందుకు దేశంలోని యంగ్ టాలెంట్‌ను ఆకర్షించేలా బోధన కు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా సంస్థలు బోధ నపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, ప్రోత్సహించాలి. మేధో సంపత్తి ఉన్నత విద్య వ్యాప్తి దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. నాణ్యమైన విద్య అంటే మేధో సంపత్తిని పెంచడమని గుర్తించాలి. ఇన్స్టిట్యూట్ల విస్తరణ, భవంతుల నిర్మాణంతో లక్ష్యం పూర్తయిందని భావించకూడదు. కేవలం మౌలిక సదుపాయాలతో మెరుగైన విద్య లభించదు. నాణ్యమైన ఫ్యాకల్టీ కావాలి. బోధనలో నాణ్యతను మెరుగుపర్చాలి. ఐఐటీలు, ఐఐఎంలలో ఎంతో తెలివైన విద్యార్థులు అడుగుపెడుతున్నారు. కానీ బోధన, పరిశోధన, ఆవిష్కరణల పరంగా వారికి సరైన గెడైన్స్ లేని కారణంగా ఆశించిన స్థాయి ఫలితాలు ఉండటం లేదు. అందుకే స్మార్ట్ ఫోన్స్ అంటే యాపిల్, జియోమీ; విమానాల కోసం బోయింగ్; ఆయుధాలు, అణుశక్తి కేంద్రాల కోసం రష్యావైపు చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా ఇటీవల ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. రహదారులు, ఇంటర్నెట్, ఇంధనంతోపాటు నాణ్యమైన మానవ వనరులూ అవసరం. అందుకోసం మన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఇలాంటి చర్యలతోనే కొన్ని దశాబ్దాల క్రితం మనకంటే వెనుకంజలో ఉన్న చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు నేడు మనల్ని అధిగమించే స్థాయికి చేరుకున్నాయి. ఆసక్తితో బహుళ రంగాల్లో నైపుణ్యం ప్రస్తుతం మనదేశంలో యువతలో ఎక్కువమంది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, అకౌంటింగ్, మెడిసిన్.. ఇలా ఏదో ఒక రంగానికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. మరికొందరు అరకొర అవకాశాలతో సరిపుచ్చుకుంటున్నారు. కారణం వారిలోని ఆసక్తుల్లో వ్యత్యాసాలే. ఆసక్తి, పట్టుదల ఉంటే బహుళ రంగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఇష్టం లేకున్నా ఇంజనీరింగ్‌లో లేదా మరే ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థి తర్వాత దశలో తనకు నచ్చిన కోర్సులో చేరొచ్చు. తద్వారా భవిష్యత్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు. విభిన్న రంగాల్లో ప్రపంచ గమనాన్ని మార్చిన ప్రముఖుల స్ఫూర్తితో అడుగులు వేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు!! -
ఎట్టకేలకు ఓకే
ఐఐఎంకు శంకుస్థాపన నేడు కొలిక్కి వచ్చిన చర్చలు, సమసిన భూవివాదం కేంద్రమంత్రులు స్మృతి ఇరాని, వెంకయ్య, సీఎం చంద్రబాబు హాజరు విద్యా సంస్థల వ్యతిరేకతతో రద్దయిన ‘విద్యా సదస్సు’ సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెం ట్(ఐఐఎం)కు శంకుస్థాపన జరగనుంది. తొలుత ఈ నెల 5వ తేదీనే ఈ కార్యక్రమం తలపెట్టినప్పటికీ బాధిత రై తుల ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడింది. గత నెల రోజులుగా రోజు కోరీతిలో సాగిన బాధిత రైతుల ఆందోళన ఉత్కంఠ, ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించా యి. దీంతో శనివారం తలపెట్టిన శంకుస్థాపన జరుగుతుందో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. మరో పక్క శనివారం తలపెట్టిన విద్యాసదస్సు మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతతో రద్దు చేయకతప్పలేదు. జాతీయ విద్యాసంస్థ కోసం గుర్తించిన భూములకు పరిహారం చెల్లించే ఆక్రమిత రైతులను పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమస్య పరిష్కారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదాశీనంగా వ్యవహరించడంతో పరిస్థితి మరింత జఠిలమైం ది. పట్టాదారులకు మాత్రమే ఎకరాకు రూ.20లక్షల పరిహారం ఇస్తామని, మిగిలిన ఆక్రమిత రైతులకు చిల్లిగవ్వ ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేయడంతో రెవెన్యూ అధికారులు తీవ్ర ప్రతిఘటనకు ఎదుర్కొక తప్పలేదు. పట్టాదారులు జత కట్టడంతో ఆక్రమిత రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. చివరకు సాక్షి వరుస కథనాలతో మౌనం వీడిన మంత్రి గంటా శ్రీనివాసరావు రైతులతో చర్చలు జరపడం మొదలు పెట్టారు. ఆక్రమిత రైతులకు తొలుత ఎకరాకు రూ.2.5 లక్షలిస్తామని నచ్చజెప్పిన మంత్రి చివరకు మరో అడుగు కిందకు దిగి ఎకరాకు రూ.6 లక్షలు ఇప్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. దీంతో శంకుస్థాపన సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా జరిగే అవకాశాలు ఏర్పడడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంభీరంలో ఐఐఎం శంకుస్థాపనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఐఎం శంకుస్థాపనతో పాటు నిర్వహించతలపెట్టిన విద్యాసదస్సు రద్దు చేయకతప్పలేదు. తొలుత ఈ నెల 5వ తేదీన ఐఐఎం శంకుస్థాపనతో పాటు ఈ సదస్సు నిర్వహించాలని భావించినప్పటికీ అప్పట్లో సదస్సుకు ఇబ్బందిలేకున్నా ఐఐఎం భూవివాదం నేపథ్యంలో సదస్సు నిర్వహణకు బ్రేకుపడింది. -
వచ్చే సంవత్సరం నుంచే ఏపీలో ఐఐఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీతో పాటు ఒడిషా, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్తగా ఐఐఎంలను కేటాయించారు. ఈ అన్నిచోట్లా కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఐఐఎంలు ప్రారంభం కానున్నాయి. -
ఐఐఎం-ఇండోర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్..
ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపండి? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)-బెంగళూరు ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? -జనార్ధన్, మెదక్.ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు చేసిన వారికి జాబ్ మార్కె ట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో చాలా యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ పవేశం: ఎంట్రె న్స్ ఆధారంగా వివరాలకు: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్/స్టాటిస్టిక్స్). పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా వేంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి అర్హత: బీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్). పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా వివరాలకు: www.svuniversity.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు అర్హత: బీఎస్సీ మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్ వివరాలకు: www.nagarjunauniversity.ac.in ఐఎస్ఐ(ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్)-బెంగళూరు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎస్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్/రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్, పార్ట్-టైమ్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ (ఎస్‌క్యూసీ) కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సుల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.isibang.ac.in ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ వివరాలను తెలపండి? -ప్రవీణ్, కరీంనగర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ ఆఫర్ చేస్తున్న వినూత్న కోర్సు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం). 60 శాతం మార్కులతో 10వ తరగతి/తత్సమానంతోపాటు +2/12వ తరగతి/తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం). లేదా సాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడెమిక్ రికార్డ్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటికి రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ఐదేళ్ల ఈ కోర్సులో మొదటి మూడేళ్లకు ట్యూషన్ ఫీజు సంవత్సరానికి రూ. 3 లక్షలు. తర్వాతి రెండేళ్లకు రూ. 5 లక్షలు. సోషల్ సెన్సైస్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంశాల సమ్మిళితంగా కోర్సు కూర్పు ఉండడం విశేషం. కోర్సులో.. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయోలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్ (ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు.. 40 శాతం మేర ఉంటాయి. తర్వాతి 50 శాతంలో మేనేజ్మెంట్ అంశాలైన.. అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్,మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, డెసిషన్ సైన్స్, లీగల్ ఆస్పెక్ట్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరహా అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వివరాలకు: www.iimidr.ac.in ఎంటెక్‌లో నానో టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -కిరణ్, విజయవాడ. పరిశోధనల పరంగా విస్తృత పరిధి కలిగి ఉన్న రంగాల్లో నానోటెక్నాలజీ ఒకటి. అణువు, పరమాణువుల సమ్మేళనమే నానోటెక్నాలజీ. ఈ శాస్త్ర అనువర్తనాలను మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, తదితర పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. నానోటెక్నాలజీకి సంబంధించి దశాబ్ద కాలంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తుండడంతోపాటు ఈ రంగానికి భారీగా నిధులను కేటాయిస్తోంది. దీంతో ఈ కోర్సు ఉపాధి అవకాశాలకు వేదికగా మారుతోంది. ఆఫర్ చేస్తున్న వర్సిటీలు: జేఎన్టీయూ-హైదరాబాద్ కోర్సు: ఎంటెక్ (నానో టెక్నాలజీ) వివరాలకు: www.jntuh.ac.in సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) -పుట్టపర్తి కోర్సు: ఎంఎస్సీ (నానో సైన్స్) వివరాలకు: www.sssihl.edu.in వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -తమిళనాడు కోర్సు: ఎంటెక్ (నానో టెక్నాలజీ) వివరాలకు: www.vit.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సులు: ఎంఎస్సీ, ఎంటెక్ (నానో టెక్నాలజీ) వివరాలకు: www.amity.edu ఐబీపీఎస్ పీవో ఆన్లైన్ మోడల్ టెస్ట్స్ హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(ఎస్బీఐ తప్ప) ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి 2014 అక్టోబర్ 11, 12, 18, 19, నవంబర్ 1, 2 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందకు వీలుగా సాక్షి దేశవ్యాప్తంగా అక్టోబర్ 7, 15, 28 తేదీల్లో లైవ్ మోడల్ టెస్ట్స్ నిర్వహిస్తోంది. మోడల్ టెస్ట్స్ విశేషాలు: 24 గంటల పాటు ఎప్పుడైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం నెట్వర్క్, పవర్ ఫెయిల్యూర్ అయితే పరీక్ష నిలిచిపోయిన దగ్గర నుంచే తిరిగి రాసే వెసులుబాటు పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ ఫర్ఫార్మెన్స్ రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా నాలసిస్ ఈమెయిల్‌కు ఫలితాలు, ర్యాంకులు వెబ్సైట్: http://onlinetests.sakshieducation.com/ http://www.sakshieducation.com/Banks/ Index.html -
కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
సింగపూర్: ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధించేందుకు 30 వేల మంది వాలంటీర్లను రంగంలోకి దించామని ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఢిల్లీలో తాము తిరోగమనం చెందిన మాట వాస్తవమేనని అన్నారు. అది తీవ్రమైన ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ముందుగా కోలుకోవాలన్నది తమ ప్రణాళిక అని యాదవ్ చెప్పారు. సింగపూర్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన ఐఐఎంప్యాక్ట్2014లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన యోగేంద్ర యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని పునర్వ్యవస్థీకరించామని, 30వేల మంది వాలంటీర్లను భర్తీ చేసుకున్నామని పార్టీ ప్రధాన ప్రతినిధి కూడా అయిన యాదవ్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు 36కన్నా అధికంగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిత్యం ప్రజలమధ్యే ఉంటున్నారని, మొహల్లా సభల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల అభివృద్ధి పథకాల ద్వారా ఫ్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 20 శాతం మేరకు ఓట్లను అధికంగా పొందినట్లు ఓ రాజకీయ పరిశీలకుడు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ఐదేళ్లలో జాతీయ పార్టీగా ఎదిగేందుకు కిందిస్థాయి నుంచి కృషి చేస్తామని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కోసం తామొక స్పష్టమైన మార్గదర్శక ప్రణాళికను రూపొందించుకున్నామని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు అదనంగా మరో నాలుగైదు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటామని, ప్రత్యామ్నాయంగా రూపొందుతామని యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి దేశవ్యాప్తంగా లక్ష మంది వాలంటీర్ల మద్దతు ఉందని చెప్పారు. -
ఉద్యోగాలు,ప్రవేశాలు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్, నాసిక్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ ఖాళీల సంఖ్య: 56 విభాగాలు: ఎయిర్‌ఫ్రేమ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్, రేడియో, రాడార్, అర్మామెంట్, మెటీరియాలజీ. అర్హతలు: ఐఏఎఫ్ డిప్లొమా/ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి.మెటీరియాలజీ విభా గానికి ఇంటర్, పీసీ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఉండాలి.సంబంధిత విభా గంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చివరి తేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.halin-dia.com క్యాట్ -2014 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2014 నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం క్యాంపస్‌ల్లో మేనేజ్మెంట్ పీజీ, ఫెలో ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. పరీక్ష తేదీలు: నవంబరు 16, 22 ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 30 వరకు వెబ్సైట్: www.iimcat.ac.in నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా-బెంగళూరు చాప్టర్ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటెన్సివ్ కోర్స్ ఇన్ యాక్టింగ్ సీట్ల సంఖ్య: 20 కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా డిగ్రీ. థియేటర్ ఆర్ట్స్‌లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. కనీసం నాలుగు స్టేజి ప్రొడక్షన్స్‌లో పాల్గొని ఉండాలి. వయసు: 20నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 13 వెబ్సైట్:http://nsd.gov.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, బడౌహి (ఉత్తర ప్రదేశ్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్స్: బీటెక్ (కార్పెట్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ) విభాగాలు: అడ్వాన్సెస్ ఇన్ కార్పెట్ టెక్నాలజీ, హోమ్ టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ డిజైన్ టెక్నాలజీ. ఎంపిక: జేఈఈ మెయిన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: http://iict.ac.in -
కొత్తగా 5 ఐఐటీలు, 5 ఐఐఎంలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఐదు ఐఐటీలు, మరో ఐదు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు తాజా బడ్జెట్లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్‌గఢ్, కేరళ, జమ్మూ, గోవా రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ )లను... అలాగే మహారాష్ర్ట, పంజాబ్, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ప్రపంచస్థాయి ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మధ్యప్రదేశ్‌లో జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హ్యుమానిటీస్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక విద్యా రంగానికి ఊతమిచ్చేలా ఈసారి రూ. 68,728 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11 శాతం అధికం. ఇందులో పాఠశాల విద్యకే అత్యధికంగా 51,828 కోట్లను వ్యయం చేయనుంది. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దేశంలోని అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. మొత్తంగా లక్ష మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల స్థితిగతులపై అధ్యయనానికి రూ. 30 కోట్లతో పాటు సర్వశిక్షా అభియాన్‌కు రూ. 28,635 కోట్లు, మాధ్యమిక్ శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్కూళ్లలో కొత్త శిక్షణా పద్ధతులను అమలు చేసేందుకు, ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ కోర్సుల కోసం వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుకు రూ.వంద కోట్లు వెచ్చించనున్నట్లు జైట్లీ తెలిపారు. కాగా, ఉన్నత విద్య కోసం సులువుగా రుణాలు తీసుకునేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేస్తామని కూడా చెప్పారు. -
ఏపీ, తెలంగాణకు దక్కని ఐఐఎం
న్యూఢిల్లీ: దేశంలో 5 కొత్త ఐఐఎం, 5 కొత్త ఐఐటీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఐఎం దక్కలేదు. ఏపీలో ఐఐటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ, రాజస్థాన్ లో వ్యవసాయ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. హర్యానా, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. వీటన్నింటి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రూ.100 కోట్లతో వ్యవసాయ౦ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. జార్కండ్, అసోం రాష్ట్రాల్లో వ్యవసాయ పరిశోధనా సంస్థలను నెలకొల్పుతామని జైట్లీ హామీయిచ్చారు. మదర్సాల ఆధునీకరణకు రూ. 100 కోట్లు కేటాయించారు. -
'ఐఐటి విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంటు'
హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చేస్తున్న బిసి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేయాలని బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన పేద బి.సి. విద్యార్థులు ఈ సౌకర్యం లేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సీట్లు వదులుకుంటున్నారని అన్నారు. జాతీయ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2010లోనే సూచించిందని గుర్తుచేశారు. -
విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐటీ
హైదరాబాద్: జాతీయస్థాయి విద్యాసంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ - గుంటూరు మధ్య ఎయిమ్స్, నిట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్డీఎంఏ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తిరుపతిలో సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జాతీయ విద్యా సంస్థల కోసం ఒక్కో జిల్లాలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్టు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ, కామినేని శ్రీనివాసరావు తెలిపారు. -
ఐఐఎం లక్నోలో 100 శాతం ప్లేస్మెంట్
లక్నో: కేవలం ఐదున్నర రోజుల్లో 475 మందికి క్యాంపస్‌లోనే ఉద్యోగాలు దొరికాయని లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్(ఐఐఎం) ప్రకటించింది. దీంతో నూరుశాతం విద్యార్థులకు ప్లేస్మెంట్ దొరికినట్లయిందని ఫ్యాకల్టీ సభ్యుడొకర చెప్పారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ మేళాలో మొత్తం 159 కంపెనీలు పాల్గొన్నాయి. సేల్స్-మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ రంగాలు ప్రధాన రంగాలుగా నిలిచినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన కంపెనీల్లో ప్రధానంగా ఆదిత్య బిర్లా, యాక్సెం చర్, అమెజాన్, హెచ్ఎస్బీసీ, హెచ్‌యూఎల్, మెకిన్సే, పీఅండ్‌జీ, ఎయిర్టెల్, డాబర్, ఐటీసీ, వొడాఫోన్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. -
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం, మూడు సెంట్రల్ యూనివర్సిటీలు
రాష్ట్ర విభజన నిర్ణయంతో రగిలిపోతున్న సీమాంధ్ర ప్రాంత వాసులను బుజ్జగించేందుకు ఒక ఐఐటీ, ఒక ఐఐఎంతో పాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. అయితే, తెలంగాణపై కేంద్రం నియమించిన మంత్రుల బృందం ముందు ఈ నిర్ణయాన్ని ఉంచి, దాని ఆమోదం తీసుకోవాల్సి ఉందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలను కూడా సీమాంధ్రకు కేటాయించాలని హెచ్ఆర్డీ శాఖ నిర్ణయించింది. కీలకమైన విద్యా సంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్న వాదన వస్తుండటంతో, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ సంస్థలను ఆ ప్రాంతానికి కేటాయించినట్లు మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటివల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుందంటున్నాయి. ఈ సంస్థలన్నింటినీ నెలకొల్పేందుకు సుమారు రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొల్పే కేంద్ర విద్యా సంస్థలన్నింటికీ బిల్లు రూపంలో రక్షణ ఉండాలని, జాతీయ పార్టీలన్నీ దానిపై సంతకాలు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం!
సానుకూలంగా ఉన్న కేంద్రం! త్వరలోనే హోంశాఖకు సమ్మతి తెలియజేయనున్న హెచ్ఆర్డీ న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో వెల్లువెత్తిన ఆందోళనల సెగల్ని చల్లార్చడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐటీ లాంటి కేంద్ర విద్యా సంస్థల్ని సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర విద్యాలయాల ఏర్పాటు విషయంలో జీవోఎంకు వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. కేంద్ర మానవ వనరుల శాఖకు పంపింది. వాటిపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఆర్డీ సిద్ధంగా ఉందని, తమ సమ్మతిని కూడా త్వరలోనే హోం మంత్రిత్వ శాఖకు తెలపనుందని సమాచారం. కాగా, విశాఖపట్నంలో ఐఐటీ, ఆంధ్రా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్పు, విజయవాడలో ఐఐఎం ఏర్పాటు చేయాలని జీవోఎంకు వచ్చిన ప్రతిపాదనల్లో ఎక్కువ మంది కోరారని సమాచారం. వీటి ఏర్పాటు విషయం బిల్లులో కూడా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే వాటిని ఏర్పాటు చేసి సంవత్సరంలోపు అవి పని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కూడా జీవోఎంకు విన్నవించారు. విభజన వల్ల సీమాంధ్రలో ఒక్క కేంద్ర విద్యాసంస్థ లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు జీవోఎంకు సూచనలు పంపడానికి ఈ నెల 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చిన సూచనలను క్రోడీకరించి రూపొందించే నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు కేంద్ర కేబినెట్‌కు జీవోఎం సమర్పించనుంది. -
సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకోవచ్చు
* ఐఐటీ, ఐఐఎం అభ్యర్థులకు తప్పనున్న తిప్పలు న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కాపీల ధ్రువీకరణకోసం గెజిటెట్ అధికారుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయి. సర్టిఫికెట్ల కాపీలకు ఆ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, వాటిని వారే సొంతంగా ధ్రువీకరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థులు సొంతంగా అటెస్ట్ చేసుకు న్న సర్టిఫికెట్లను స్వీకరించాలని ఆయా విద్యాసంస్థల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరిం ది. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరంనుంచే అమల్లోకి వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అడ్మిషన్ల సమయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని కోరనున్నామన్నారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ వివిధ మంత్రిత్వ శాఖలను కోరిన నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ పై నిర్ణయం తీసుకుంది. మార్కుల జాబితాలు వంటి కొన్ని సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకునే విధానాన్ని పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి. -
ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో..
సమున్నత భవిష్యత్ దిశగా ఐఐఎంలలో ప్రవేశానికి మార్గం సుగమమం చేసే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. మరో రెండు వారాల్లో క్యాట్-2013 ఆన్లైన్ పరీక్షలు మొదలు కానున్నాయి.. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై నవంబర్ 11 వరకు కొనసాగనున్నాయి.. వేలల్లో ఉండే సీట్ల కోసం లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో గమ్యాన్ని చేరే క్రమంలో ఇప్పటి నుంచి వేసే అడుగులు కీలక పాత్రను పోషిస్తాయి.. ఒత్తిడికి లోనుకాకుండా నేర్చుకున్న ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేసినప్పుడే విజయం సాధ్యం. కాబట్టి క్యాట్ పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్. క్యాట్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి సెక్షన్‌కు కౌంట్‌డౌన్ టైమర్ నిబంధన ఉంటుంది. నిర్దిష్ట సెక్షన్‌కు కేటాయించిన సమయం పూర్తయితే సమాధానాలివ్వడం పూర్తి కాకున్నా మరో సెక్షన్‌కు వెళ్లాలి. స్పీడ్ బ్రేకర్లు: ప్రతి క్యాట్ పరీక్షలో కొన్ని ప్రశ్నలను స్పీడ్ బ్రేకర్లుగా వ్యవహరిస్తారు. వీటిని సాధించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మొదట గుర్తించాలి. ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో కనిపిస్తాయి. ఈ తరహా ప్రశ్నల సాధనలో పెద్ద అంకెలను గుణకారం లేదా భాగహారం చేయాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలిక్యులేషన్స్ అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో జవాబు ఒక్కోసారి పాయింట్ (డెసిమల్ పాయింట్) రూపంలో కూడా రావచ్చు. ఇచ్చిన ఆప్షన్లన్నీ పాయింట్ తర్వాత ఉండే సంఖ్య మినహా ఒకే రకంగా ఉంటాయి. ఈనేపథ్యంలో సమాధానాన్ని గుర్తించే తొందరలో తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మార్క్ చేసుకొని తర్వాత ప్రయత్నించడం మంచిది. గెస్ వర్క్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి సమస్యకు కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఉదాహరణకు గ్రాఫ్ తరహా ప్రశ్నను తీసుకుంటే.. గ్రాఫ్‌ను ఒక్కసారి పరిశీలించడం ద్వారా సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సుదీర్ఘ కాలిక్యులేషన్ అవసరమా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి గెస్ వర్క్ కూడా పనికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. దీని ద్వారా సమయం కూడా కలిసొస్తుంది. మొదటి దశ ఇలా: క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో మెరుగైన స్కోర్ చేయాలంటే వేగం, కచ్చితత్వమే కీలక సాధనాలు. ఈ విభాగాన్ని ముందుగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే స్కోరింగ్‌కు అవకాశం ఉన్న విభాగం. కాబట్టి దీన్ని సాధించడానికి చివరి వరకు వేచి చూడడం సహేతుకం కాదు. ఈ విభాగాన్ని సాధించడానికి 20-25 నిమిషాల సమయం సరిపోతుంది. తర్వాత క్వాంటిటేటీవ్ ఎబిలిటీ విభాగంపై దృష్టి సారించండి. ఈ విభాగంలో ముందుగా ఒకే తరహాలో ఉండే ప్రశ్నలను (కేస్‌లెట్స్)ను మొదట సాధించడానికి ప్రయత్నించాలి. ఒక కేస్లెట్ను అవగాహన చేసుకోవడానికి నాలుగు నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించవద్దు. నాలుగు నిమిషాల్లో ఎటువంటి అవగాహన రాకుంటే ఆ ప్రశ్నను వదిలి వేయడం ఉత్తమం. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఈ విభాగానికి సంబంధించి గెస్ వర్క్‌కు దూరంగా ఉండడమే మంచిది. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో కొన్ని ప్రశ్నలను వాటికి ఇచ్చి ఆప్షన్ల ఆధారంగా సాధించాల్సి వస్తుంది. సమయ స్ఫూర్తి, తార్కిక వివేచనతో మిగిలిన ఆప్షన్లను స్కిప్ చేస్తూ సమాధానాన్ని కనుక్కోవాలి. ఈ విభాగం కోసం కేటాయించిన 70 నిమిషాల సమయాన్ని 35, 30 నిమిషాలుగా విభజించుకోవాలి. మొదటి 35 నిమిషాలను సులువైన ప్రశ్నలను సాధించేందుకు కేటాయించాలి. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పట్టే ప్రశ్నలు. ఈ దశలో సమాధానం కోసం ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. ప్రశ్నను చదవడానికి 30 సెకన్ల సమయం వెచ్చించాలి. రెండో దశ 30 నిమిషాల్లో క్లిష్టంగా భావించి వదిలివేసిన ప్రశ్నలు సాధించండి. ఈ సందర్భంలో ప్రతి ప్రశ్నకు రెండు నుంచి రెండున్నర నిమిషాల సమయం కేటాయించవచ్చు. ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఎనిమిది ప్రశ్నలను 90 శాతం కచ్చితత్వంతో సాధించడానికి ప్రయత్నించాలి. లాజికల్తో: వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. లాజికల్ రీజనింగ్‌తో ఈ విభాగాన్ని ప్రారంభించడం మంచిది. ఇందులో ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం గుర్తించడం మంచిది. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ప్రశ్నల అవగాహనకు ఐదు నిమిషాలు వెచ్చించాలి. లాజికల్ రీజనింగ్‌లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించాలి. ప్రశ్నను అవగాహన చేసుకోవడంలో ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సమయం పడితే దాన్ని విడిచి వేరే ప్రశ్నపై దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ లేదా డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలోని ప్రశ్నలకు ఎనిమిది నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకపోవడం మంచిది. ఈ విభాగానికి కేటాయించిన 70 నిమిషాల సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ క్రమంలో వెర్బ ల్ ఎబిలిటీకి 20 నిమిషాలు, రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు 30 నిమిషాలు, లాజికల్ రీజనింగ్‌కు 15 నిమిషాల సమయం కేటాయించాలి. ఈ విభాగానికి సంబంధించి ముఖ్యంగా గ్రామర్ అంశాల్లో ఎటువంటి గెస్ వర్క్‌ను ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఏడు సరైనవిగా ఉండే విధంగా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్: ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మధ్యలో 15 నిమిషాలు ట్యుటోరియల్ ఉంటుంది. ప్రతి విభాగంలో సమాధానాలను గుర్తించడానికి 60 నిమిషాలు కేటాయించాలి. 10 నిమిషాలు సమయాన్ని బాఫర్గా వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో ప్రశ్నలను చదవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. రివ్యూ సిస్టమ్ ద్వారా సెక్షనల్ కటాఫ్ సాధించేందుకు అవసరమైన ప్రశ్నలను సాధించామా? లేదా? అనే అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని ప్రశ్నలు సాధించాం? ఎన్ని మిగిలి ఉన్నాయి? అనే అంశంపై కూడా అవగాహన పొందొచ్చు. మార్కింగ్ ఆప్షన్ ఉపయోగించి తర్వాత సాధించాలనుకున్న ప్రశ్నలను మార్క్ చేసుకోవచ్చు. సిట్టర్స్: ప్రతి విభాగంలో కొన్ని సులువైన ప్రశ్నలు, నేరుగా (డెరైక్ట్) ఇచ్చిన ప్రశ్నలు ఉంటాయి (వీటిని సిట్టర్స్‌గా వ్యవహరిస్తారు). ముందుగా సిట్టర్స్ను గుర్తించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ప్రశ్నలను ఇచ్చిన క్రమంలోనే సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. తక్కువ సమయం ద్వారా సాధించే సిట్టర్స్ తరహా ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక దానితో ఒకటి ముడిపడి ఉండే లింక్డ్ ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి తర్వాతి ప్రాధాన్యం ఇవ్వాలి. కీలకం: క్యాట్ విజయంలో ప్రిపరేషన్తోపాటు రెండు అంశాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. అవి.. ప్రశ్నల ఎంపిక, కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం. ప్రశ్నల ఎంపికలో.. మొదట ప్రతి విభాగంలోని సులభమైన ప్రశ్నలను సాధించాలి. తర్వాత సమయాన్ని పరిగణనలోకి తీసుకుని క్లిష్టమైన ప్రశ్నలను ఎంచుకోవాలి. ‘సులభమైన ఏ ప్రశ్నను వదిలి వేయకూడదు, అన్ని ప్రశ్నలను క్షుణ్నంగా చదవాలి’ అనే మౌలిక సూత్రాన్ని క్యాట్‌లో విధిగా పాటించాలి. ప్రశ్నల ఎంపికలో మరో కీల కాంశం.. ప్రశ్నలను చదివేటప్పుడే.. వాటిపై ఒక అంచనాకు రావడం. ఎందుకంటే ఒకే ప్రశ్నను ఒకసారి చదివి తిరిగి మరోసారి చదవడం వల్ల.. పునరుక్తితోపాటు సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా మొదటిసారి చదివినప్పుడు సదరు ప్రశ్నపై ఉండే స్పష్టత రెండోసారి ఉండకపోవచ్చు. ప్రశ్నల ఎంపిక విషయంలో డేటాఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగంలో ఎటువంటి తార్కికత ఉండదు. వాటిని చదివి సాల్వ్ చేసుకుంటూ పోవాల్సిందే. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీలలో మాత్రం ప్రశ్నల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిలో ప్రశ్నలను చదువుతున్నప్పుడే వాటిపై ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రశ్నను చదివినప్పుడే సమాధానం గుర్తించగలమా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. సమాధానం తెలియని ప్రశ్నలు వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే జేఈఈ ఇతర పరీక్షల కంటే భిన్నమైన నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని క్యాట్‌లో అనుసరిస్తారు. దాంతో మీరు నష్టపోవడమే కాకుండా ఇతరులు లాభం పొందుతారు. ట్యుటోరియల్: పరీక్ష ప్రారంభానికి ముందు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూచనలు, సలహాలతో కూడిన 15 నిమిషాల ట్యుటోరియల్ అందుబాటులో ఉంటుంది. ఈ విభాగాన్ని త్వరితగతిన ముగించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎన్ని మాక్ టెస్ట్‌లు రాసినప్పటికీ.. రియల్ టైమ్‌లో పరీక్ష నిర్వహణ విధానంపై అవగాహన ఏర్పర్చుకోవడానికి ఈ ఒక్క అంశమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మొదటిసారి క్యాట్‌కు హాజరవుతున్న వారు ఈ అంశాన్ని గమనించాలి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి. ఒత్తిడికి దూరంగా పరీక్షకు ముందు రోజు మంచి ఆహారం తీసుకుంటూ, చక్క ని నిద్రతో ప్రశాంతంగా గడపండి. చదవడం, మాక్ టెస్ట్‌లు రాయడం వంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బాగా నేర్చుకున్న అంశాలనే కొన్ని సూచనలు పాటిస్తూ పరీక్షలో సాధించాలి. పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు గుర్తించడంపై దృష్టి సారించాలి. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే పరిగణించాలి. ఓపెన్ మైండ్: పరీక్షకు ఓపెన్ మైండ్‌తో హాజరు కావాలి. ప్రశ్నలను వేగంగా చదివి అవగాహన చేసుకోవాలి. అన్నీ తెలిసిన అంశాలు వస్తాయనేకాకుండా తెలియని అంశాలు కూడా రావచ్చు అనే ఆలోచనా విధానంతో ఉండడం మంచిది. ముందుగా పరీక్షలో బాగా తెలిసిన విభాగం నుంచే సమాధానాలను గుర్తించడం ప్రారంభించాలి. క్లిష్టంగా భావించే విభాగానికి మధ్యలో సమయం కేటాయించాలి. అంతేకాకుండా పరీక్ష హాల్లో మీ చుట్టు పక్కల చూసే ప్రయత్నం చేయకండి. తద్వారా సమయం వృథాతోపాటు ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పరీక్ష చాలా రోజులపాటు పలు సెషన్లుగా జరుగుతుంది. కాబట్టి ఒక సెషన్లో సులభమైన ప్రశ్నలు వస్తే మరో సెషన్లో కష్టమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉండొచ్చు అనే వాదనలను పట్టించుకోవద్దు. మాక్ టెస్ట్‌గానే నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తదితర అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. పరీక్షకు ముందు ఒక సమస్యను సాధించడం లేదా కొత్త కాన్సెప్ట్‌ను నేర్చుకోవడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే భావించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పలు మాక్ టెస్ట్‌లు రాయడం ప్రశ్నల సాధనలో ఒక రకమైన పద్ధతి అలవడుతుంది. కాబట్టి దీనికి భిన్నంగా పరీక్షలో ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించకండి. ప్రతి ప్రశ్నను చదవడానికి ప్రయత్నించాలి. మెరుగైన స్కోర్ సాధనలో వేగం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేగం, కచ్చితత్వం ఆధారంగా సమాధానాలను గుర్తించే అంశంపై దృష్టి సారించండి. ప్రశ్నను పూర్తిగా చదవకుండా, ఆప్షన్లను చూడకుండా సమాధానాలను గుర్తించడం సరైన వ్యూహం కాదు. మానిటర్‌కు దగ్గరగా కాకుండా కొద్ది దూరంలో కూర్చోండి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి. మొదటి విభాగంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, రెండో విభాగంలో లాజికల్ రీజనింగ్ పార్ట్‌తో ప్రారంభించడం మంచిది. చాలా మంది అభ్యర్థులు కేటాయించిన సమయం కంటే ముందే పరీక్షను పూర్తి చేస్తారు. అందరూ రాసిన తర్వాతే బయటికి పంపిస్తారు. కాబట్టి పూర్తి సమయాన్ని వినియోగించుకోవడం మంచిది. -పల్లా రవితేజ, ఐఐఎం-కోల్‌కతా.. తప్పనిసరి క్యాట్-2013 అడ్మిట్ కార్డు ఫోటో గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లెసైన్స్/ పాస్‌పోర్ట్/ పాన్‌కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ కాలేజీ ఐడీ కార్డు-దీన్ని నిరూపించే విధంగా పేరున్న ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఆధార్ కార్డు/ ఎంప్లాయి ఐడెంటిఫికేషన్ కార్డు/ నోటరైజ్డ్ ఆఫిడవిట్) అడ్మిట్ కార్డు, ఫోటో గుర్తింపు కార్డు లేకుంటే పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఏవైనా కారణాలతో పేరు మార్పు చెందితే దాన్ని నిరూపించే పత్రాలను కూడా చూపించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు డీఏ అభ్యర్థులకు స్క్రైబ్ కోసం ప్రొమెట్రిక్ సెంటర్ నుంచి ఆథరైజ్డ్ లెటర్, స్క్రైబ్ ఫోటో గుర్తింపు కార్డు నిర్దేశించిన సమయం కంటే గంటన్నర ముందు పరీక్ష హాలుకు చేరుకోవడం ఉత్తమం. తద్వారా సెక్యూరిటీ చెక్, గుర్తింపు పత్రాల తనిఖీ వంటి అంశాల్లో సమయం కలిసొస్తుంది. వివరాలకు: http://cat2013.iimidr.ac.in -
ప్రవేశాలు
ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)... ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: ఏదైనా డిగ్రీ, కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. క్యాట్-2013/జీమ్యాట్/జీఆర్ఈలో అర్హత సాధించాలి. ఎంపిక: బృంద చర్చలు, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 1 చివరి తేది: జనవరి 20 వెబ్సైట్: www.iimb.ernet.in ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీజీ కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)... ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు వివరాలు: ఎగ్జిక్యూటివ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ {పోగ్రామ్ కాలపరిమితి: రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ జనరల్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా డిగ్రీ, కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. క్యాట్/జీమ్యాట్/ మ్యాట్‌లో అర్హత సాధించాలి. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేది: ఆగస్టు 25 వెబ్సైట్: www.iimk.ac.in