సాక్షి, హైదరాబాద్: ఇటీవల యోగాకు ప్రాచుర్యం బాగా పెరగడంతో అనేక మంది యోగాతో లాభాలు పొందుతూనే ఉన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన సౌరభ్ బోత్రా మరికొంతమంది ఐఐటీ, ఐఐఎమ్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తో ‘హాబిల్డ్’ పేరిట ఓ టీమ్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా ఎంతో మందికి యోగా చాలా సులువుగా నేర్పడంతో పాటు... దాని ప్రయోజనాలనూ పంచుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆయన 21 రోజులపాటు దేశవ్యాప్తంగా ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మీరు కూడా హాయిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఈ సందర్భంగా హాబిల్డ్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘నిజానికి యోగా మాస్టర్‌నైన నేను కూడా చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడ్డవాణ్ణే. నా బాల్యమంతా దగ్గుతూ సాగింది.
వాతావరణం మారినప్పుడల్లా జలుబు, ఫ్లూ జ్వరాలతో బాధపడేవాణ్ణి. ఒకసారి నేను ఐఐటీ బీహెచ్‌యూలో ఉండగా అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం జరిగినప్పుడు నాకు యోగా, ధ్యానం గురించి తెలిసింది. నా సమస్యకు అదే పరిష్కారం అని అర్థమైంది. అంతే... ఆనాటి నుంచి ఈనాటివరకు... అంటే దాదాపు పదేళ్లకు పైగా నేనెప్పుడూ ఇన్‌హేలర్ ఉపయోగించలేదు’’ అని చెప్పారు.
21 రోజుల ఉచిత యోగా శిక్షణ గురించి వివరిస్తూ.. ‘‘నేను యోగా నుంచి ఎంతో ప్రయోజనం పొందాను. నేను పొందిన ప్రయోజనాలనే అంతర్జాతీయంగా కనీసం కోటి మందికి అందించాలన్నదే నా లక్ష్యం. మీరు మీ ఇళ్లలోనే ఉంటూ ‘ఆన్‌లైన్’లో ఉచితంగా యోగా నేర్చుకోవచ్చు. ఈ నెల 19 వరకు ఎంతమందైనా, ఏ సమయంలోనైనా ఉచితంగా చేరవచ్చు.
ఈ 21 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా లైవ్ కార్యక్రమాల రూపంలో క్లాసులు నిర్వహిస్తాం. ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున ప్రతిరోజూ నాలుగు బ్యాచ్‌లు నిర్వహిస్తాం. ప్రతి బ్యాచ్ 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ టైమింగ్స్ ఏమిటంటే... 6.30 నుంచి 7.15, 7.30 నుంచి 8.15 వరకు ఉదయం బ్యాచ్.. 6.00 నుంచి 6.45 వరకు, 7.00 నుంచి 7.45 వరకు సాయంత్రం బ్యాచ్ నిర్వహిస్తాం’’ అని వివరించారు. habuild. in or https:// habit. yoga ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని.. 86000 39726 నెంబరుకు హాయ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా ఇందులో చేరవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment