ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చేస్తున్న బిసి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేయాలని బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చేస్తున్న బిసి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేయాలని బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన పేద బి.సి. విద్యార్థులు ఈ సౌకర్యం లేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సీట్లు వదులుకుంటున్నారని అన్నారు.
జాతీయ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2010లోనే సూచించిందని గుర్తుచేశారు.