R. Krishnaiah
-
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్న వించారు. గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజు ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, దాసు సురేశ్ తదితరులు సమావేశమయ్యారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి.. ఈ నెల 16 నుండి 28 తేదీల మధ్య అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు: కృష్ణయ్యఈ నెల 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి గురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. -
బేరసారాలకు ఆర్ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం:కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని జగన్ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి బాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. .. బీసీలను కృష్ణయ్య మోసం చేశారు. ఈ ద్రోహంతో ఆర్ కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య.. చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయం అని కారుమూరి అన్నారు. సీబీఐ అంటే ఎందుకు భయం?జగన్‌కు ఉన్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసమే ఇదంతా. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు. -
కులగణన ఆరంభమయ్యేది ఎప్పుడు?
గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందనీ నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. కానీ, రేవంత్ ప్రభుత్వం తన జీ.ఓ.ల ద్వారా ప్రజల్లోగందరగోళం సృష్టిస్తోంది. జీ.ఓ. 199లో బీసీ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగా పేర్కొంది. కాని జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి?దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ జనాభా వెనుకబడిన తరగతుల వారిదే. రాష్ట్రంలో ఈ వర్గాల జనాభా 56 శాతం. బీసీ జాబితాలోని ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులలో 130 కులాలు ఉన్నాయి. బీసీలు భిన్నమైన సంప్రదా యాలు, ఆచారాలు, కళారూపాలు, కులదైవాలు కలిగి ఉండి తమవైన ప్రత్యేకతలు సంతరించుకుని ఉన్నారు. ఇప్పటికీ అనేక సామాజిక కులాలు, జాతులు ఆధునిక అభివృద్ధికి నోచుకోలేక పోయాయి. వీరిని వర్తమాన ప్రగతిలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సంకల్పశుద్ధితో, నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం కృషిచేయాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలలోని సంచార, అర్ధసంచార, విముక్త జాతులు, కులాలు ఏ అభివృద్ధికీ నోచుకోకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో వీరిని ప్రగతి పథంలోకి తీసుకు రావడానికి చేసిన కృషి శూన్యమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గడిచిన పదేళ్లలో కొంతమేరకు గురుకుల పాఠశాలల ద్వారా చదువుకోవడానికి ఈ వర్గాలకు అవకాశం లభించింది. అయితే గత ప్రభుత్వం ఆశించిన మేరకు అండదండలు ఇవ్వలేదనే కారణంగా, ఈసారి బీసీలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారు. అయితే రేవంత్ ప్రభుత్వం కూడా గత పాలకులకన్నా మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం పట్ల బీసీలు ఆందోళన చెందుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితు లయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలులోకి వస్తాయనీ సంపూర్ణంగా నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసికాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. అనుకున్నట్లు గానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తమకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరతాయని బీసీలు కొంతకాలం వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. కాగా ప్రభుత్వం ఎంతకీ ఉదాసీన వైఖరిని వీడక పోవడంతో ఉద్యమబాట పట్టక తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కుల సర్వే (కులగణన)కు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తదను గుణంగా మార్చి 15న జీఓఎంఎస్ నం. 26ను విడుదల చేసింది.కాగా గడిచిన 6 నెలలుగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం తన వైపు నుండి ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. తిరిగి బీసీసంఘాలు తీవ్రంగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. ఆమరణ నిరా హార దీక్షల స్థాయికి ఉద్యమాల తీవ్రత పెరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఉలుకూ, పలుకు లేకపోవడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అనే విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మిక్కిలి అనుభవంతో, క్రియాశీలంగా పని చేస్తున్న డా‘‘ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలోని బీసీ కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. సర్వత్రా ఈ కమిషన్ గడువును పెంపుదల చేస్తారని భావించారు. అలాగే కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించడం లాంటి కీలక అంశాలను త్వరితగతిన చేయడానికి సహకరిస్తుందని అనుకున్నారు. కాగాఅందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురితో బీసీ కమి షన్‌కు కొత్త పాలకమండలిని నియమించింది ప్రభుత్వం. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చినట్టయ్యింది. 6 నెలలు పొడిగిస్తే సులభంగా అయ్యే పనిని, కొత్త పాలకమండలిని వేసి మళ్లీ కొత్తగా పని మొదలు పెట్టడం అనేది కేవలం సమయాన్ని వృధా చేయడమే. బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడానికే కుట్ర జరుగుతున్నదని బీసీలు చేస్తున్న ఆరోపణలు నిజమని భావించడం తప్పేమీ కాదు.బలహీన వర్గాలు చాలా కాలంగా తాము చేస్తున్న డిమాండ్ కులగణన నిర్వహించాలన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందుకే, ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. అయితే కేవలం జీ.ఓ. ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ కార్యక్రమాన్ని అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తిచేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ అలా రావడంలేదు. దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో లేదనే రీతిలో వ్యవహరిస్తోందన్న సామాజిక వేత్తల అభిప్రాయాలు నిజమే అని నమ్మాల్సి వస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక నెలరోజుల పాటు పూర్తి సమ యాన్ని కేటాయిస్తే, కులగణనను సమర్థమంతంగా పూర్తిచేయవచ్చు. కానీ అలాంటి చర్యల దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఇటీవల బీసీ కమిషన్‌కు కొత్త పాలకమండలిని నియమిస్తూ జారీచేసిన జీ.ఓ. 199లో... ఈ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగాపేర్కొంది. ఇది మరొక వివాదానికి దారి తీస్తోంది. జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి? ఈ కారణంగా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటివి, ప్రత్యేకంగా న్యాయ నిపుణుల సలహాలతో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వం ఆదరాబదరాగా ఇచ్చిన జీ.ఓ. మరింత గందరగోళానికి దారి తీస్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. బీసీ గణన, కులగణన అనేవి పూర్తిగా వేరు వేరు ప్రక్రియలు అనే స్పష్టత ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతోంది. బీసీల గణన అంటే... కేవలం బీసీ కులాలకు సంబంధించినటువంటి వివరాలను, గణాంకాలను సేకరించడం. కులగణన అనగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల, వర్గాల సమాచారాన్ని సేకరించడం. కులగణన చేయడం వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశంఉంటుంది. కేవలం బీసీ గణన చేయడం ద్వారా బీసీలలో ఉన్న తారతమ్యాల వివరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. దాని వలన పెద్దగా ఉపయోగం లేదు.అందువలన కులగణన లేదా కుల సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన అనివార్యతను ప్రభుత్వం గమనించి ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. బీసీ గణన, కులగణన అంటూ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో ప్రభుత్వం యావత్ కులగణనకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. న్యాయపరంగా పరిశీలించినప్పుడు కులగణన లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సామాజిక, ఆర్థిక కుల సర్వే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వాటాను నిర్ణయించడానికి అత్యంత ఆవశ్యకమైనది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ క్రింద ప్రత్యేకంగా నిపుణులతో కూడిన ‘డెడికేటెడ్ కమిషన్’లను నియమించాలి. సమగ్రంగా అధ్యయనం చేయించాలి. ఆ కమిషన్లు ఇచ్చే సిఫారసులు, నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి డా‘‘ కె. కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి లాంటి కీలక కేసులలో గౌరవ సుప్రీంకోర్టురాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా మార్గదర్శకాలను సూచించాయి. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉత్తర్వులను జారీచేయడం, సముచితం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.- వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు,జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు- ఆర్. కృష్ణయ్య -
నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
ఏర్పేడు/రేణిగుంట (తిరుపతి జిల్లా): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్రగాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైఎస్సార్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని ఆయన చొక్కాను పైకి లేపి వీపుపైన గాయాన్ని గుర్తించారు. తలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని అయితే రాయి వీపునకు తగిలిందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాస్పందనను తట్టుకోలేకే టీడీపీ నేతలే దాడికి పురికొల్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి జరిగినా కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడ నుంచి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ శ్రీరామ శ్రీనివాసులుకు ఫిర్యాదు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది కృష్ణయ్య గాయానికి బ్యాండేజ్ వేసి కట్టు కట్టారు. ఆయనకు నీరసంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు సెలైన్ ఎక్కించారు.చంద్రబాబే దాడి చేయించారు.. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం తనపై దాడి కాదని.. యావత్ బీసీలందరిపై జరిగిన దాడని ధ్వజమెత్తారు. తనను రాయితో కొట్టారని.. బీసీలు, బడుగులు, పేదలు ఓటు అనే ఆయుధంతో టీడీపీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయడం ఖాయమని తెలిపారు. బీసీల బాగోగుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైపే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలంతా ఉన్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఖచ్చితంగా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు.బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది జగన్ఒంగోలు: బీసీ ప్రధానిగా ఉన్నంత మాత్రాన బీసీలంతా అభివృద్ధి చెందరని, పరిపాలించే నేతలకు బీసీలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష అవసరమని కృష్ణయ్య చెప్పారు. ఆయన గురువారం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే ఓటర్లు మాత్రమే అని, సీఎం జగన్‌కు మాత్రం బీసీలంటే బ్యాక్‌బోన్ అని తెలిపారు. అందుకే బీసీల ఆత్మగౌరవాన్ని జగన్ పెంపొందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పనిముట్లు ఇచ్చి.. పదవులు మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెట్టేవారని గుర్తు చేశారు. జగన్ పాలనలో బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చట్టసభల్లో అనేక పదవులిచ్చారన్నారు. ఇటీవల 18 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తే అందులో 11 సీట్లు బీసీలకే ఇచ్చారని తెలిపారు. 23 మంది మంత్రులుంటే వారిలో నలుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు మరో ఏడుగురు మంత్రులుగా బీసీలే ఉన్నారన్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో అయితే 60 శాతం నుంచి 70 శాతం పదవులు బీసీలకే జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కావాలంటూ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు సైతం ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్సీపీదన్నారు. కాగా దాన్ని అడ్డుకున్న చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆ రాష్ట్రాల కన్నా ఏపీలోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇది కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఓట్ల రూపంలో కూటమిపై ప్రజాదాడి
జగ్గయ్యపేట: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గెలవలేకపోతున్నామనే అక్కసుతో హత్యాయత్నానికి పాల్పడ్డారని, మే 13న జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఓట్ల రూపంలో కూటమి నేతలపై ప్రజాదాడి జరగనుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సోమవారం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ వస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు రాజకీయంగా, ఆరి్థకంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారని, గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు సముచిత స్థానం కలి్పంచిన ఘనత సీఎ వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కూడా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కావాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పుతో ప్రతిపక్షాలు చతికిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీఎం జగన్ వెంటనే బీసీలు ఉన్నారని స్పష్టంచేశారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ‘మేమంతా సిద్ధం’ సభలకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుట్టి హత్యాయత్నాలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నాన్ని ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవహేళన చేసేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేబిరాణి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
సాటి లేని సామాజిక న్యాయం
తాజాగా వైఎస్సార్సీపీ ప్రకటించిన లోక్‌సభ స్థానాల్లో 11 బీసీలకు కేటాయించారు; అలాగే 59 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 100 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంతటి ప్రాతినిధ్యం వారికి లభించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో, బడ్జెటులో, సంపదలో, గౌరవంలో, విద్యా, ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా యిచ్చి సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర పురుషుడు జగన్. అంతేగాకుండా, వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. ఇది జగన్‌కు జనం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 71 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోలేదు. ఆ కులాల అభివృద్ధిలో జగన్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైసీపీ రెండేళ్ల క్రితమే రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వే షన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టి, దీనికి 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడింది. విశేషం ఏమిటంటే, గత 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణి అవుతున్న డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, అప్నా దళ్, జనతాదళ్ కూడా ఈ బిల్లు పెట్ట లేదు. చారిత్రక ఘట్టం ఇటీవల 18 ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, అందులో 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం)... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మెనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యుటీ సీఎం పద వులు ఇస్తే... నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం ఇదే ప్రథమం. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పను లలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో మొత్తం 100 శాతం పోస్టులు బీసీలకు కేటాయించారు. 193 కార్పొరేషన్లలో బీసీలకు 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. నామినే టెడ్ పదవులలో 50 శాతానికి చట్టం చేయడమే కాదు; అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. దీని మూలంగా ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగాయి. తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం పోయి, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. వేష భాషలు, నడవడి, సంస్కృతి మూలంగా సమగ్రంగా మారి ఆధునీకరణ చెందుతారు. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులుంటే... అందులో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకూ, మండలి డిప్యుటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి సుప్రీంకోర్టు తగ్గిస్తే, పార్టీ పరంగా అదనంగా 20 శాతం కలిపి, మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా, అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో, వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే, అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు కేటాయించారు(67 శాతం). 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 92 శాతం మేయర్ పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 60 శాతం వీరికే కేటాయించారు. గ్రామ – వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఈ వర్గాలవారే. ఈ 57 నెలల్లోనే మరో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకొని 6.03 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ 75 శాతం వాటా ఈ వర్గాలదే. దీర్ఘ దృష్టి విద్య ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనీ, వారికి గౌరవం పెరుగుతుందనీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నారు జగన్. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి వరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీని వలన ప్రతి ఒక్కరు చదువుకుంటు న్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర ఉన్నత చదువులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ఇచ్చేటట్లు జీవోలు జారీ చేశారు. పాలకులు ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. దీర్ఘకాలంలో సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుందని ఆలోచించరు. కానీ జగన్ వివిద విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందు చూపుతో, విజన్‌తో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. ఇది జగన్‌కు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఉన్నత విద్య వలన జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో ప్రతి పౌరుడు సభ్యతతో, సంస్కారంతో, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తాడు. దీని మూలంగా వైద్యం, ఆరోగ్యంపై పెట్టే బడ్జెట్ తగ్గుతుంది. శాంతిభద్రతలు కూడా చక్కగా ఉండటంతో పోలీసు శాఖపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఒక తరపు పెట్టుబడి ఇంజినీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్ చదివేవారు విదేశా లకు వెళ్లి, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఆఫ్రికా, యూరోపియన్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, రాష్ట్రానికి విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది. చదువు ద్వారా పొందిన జ్ఞానంతో ఆధునిక వ్యవసాయం చేస్తే అధిక ఉత్పత్తి సాధించడానికి వీలు కలుగుతుంది. దీనిమూలంగా ఆ యా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సమాజ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఆ కుటుంబం ప్రభుత్వ రాయి తీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. పదేళ్లలో 40 శాతం, మరో పదేళ్లలో మరో 50 శాతం, మొత్తంగా 20 ఏళ్లలో 90 శాతం మంది సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి చేరిపోతారు. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరానికి ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. పేదరికం ఉండదు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ); జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ‘ 90000 09164 -
జగన్‌ను గెలిపించాలి.. జనం గెలవాలి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ గెలిపించడం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు మళ్లీ గెలవాలని బీసీ కులాల ఆత్మీయ సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడ గాందీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు చెందిన సంఘాల ముఖ్య నేతల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ 58 నెలల పాలనలో బీసీలకు జరిగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలపై పలువురు వక్తలు మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. జనాభాలో 52 శాతంపైగా ఉన్న బీసీలకు కనీసం 50 శాతం పదవులు ఇవ్వాలని ఇంతకాలం కొట్లాడామని, అయితే సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఏకంగా 70 శాతం పదవులు ఇచ్చి సంఘ సంస్కర్తగా నిలిచారని అన్నారు. ఇటీవల తాను కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను కలిసినప్పుడు.. బీసీలైన మీరు బీసీలకు 50 శాతం పదవులు ఎందుకివ్వలేకపోతున్నారు? అని అడిగితే వాళ్లు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మేము 40 శాతం పదవులు ఇవ్వడానికే ఇబ్బందులు పడ్డామని, మీ ముఖ్యమంత్రిలాగా మేము బీసీలకు పదవులు ఇస్తే మా రాష్ట్రాల్లో సంపన్న వర్గాలు మమ్మల్ని సీఎం సీటులో కూర్చోనీయవని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎంతో ధైర్యం, సాహసం ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని దేశం మొత్తం కీర్తిస్తోందన్నారు. ఏపీలో కలుస్తామంటున్నారు.. ఏపీలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలు పట్ల పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమాలు చూసి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, కర్ణాటకలోని బళ్లారి ప్రాంత వాసులు తమను ఆంధ్రాలో కలపాలని దీక్షలు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తే.. సీఎం జగన్ మాత్రం తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ మరో 20 ఏళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగితే పేద వర్గాలు ధనవంతులుగా మారడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరిగిన మంచిని ప్రతి ఇంటికి తిరిగి వివరించాలన్నారు. ఇది సీఎం జగన్ ఒక్కడి గెలుపుకోసం మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గెలుపు కోసమే అని కృష్ణయ్య చెప్పారు. మానవ వనరుల అభివృద్ధే అసలైన అభివృద్ధి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ.. మానవ వనరుల అభివృద్ధే అసలైన అభివృద్ధి అని నమ్మి దానిని రాష్ట్రంలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ రాష్ట్రంలో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో కూడిన నాణ్యమైన విద్య, ప్రజలకు ఆరోగ్యం, పేదలకు సంక్షేమం అందిస్తున్న తీరు భారతదేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం అన్నారు. చంద్రబాబు పోకడలతో విసిగిపోయిన తాను సీఎం జగన్ విధానాలు నచ్చి ఆయన వెంట నడుస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ సామాజిక న్యాయ విధాతగా పేరొందారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనే విమర్శల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో తాను కూడా మొదట ఆపోహ పడ్డానని, సీఎం జగన్ పాలనలో అభివృద్ధి బాగా జరిగిందనే విషయం తాను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని చెప్పారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటించినపుడు గ్రామాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపించాయన్నారు. వాటి కోసం రూ.30 వేల కోట్లుపైగా ఖర్చు చేసినట్టు గణాంకాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, ఇది కాదా అభివృద్ధి? అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయం కడితే.. అదే సీఎం వైఎస్ జగన్ ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు ఓసీలకు ఇచ్చే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇచ్చి గెలిపించిన దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ మాత్రం ఓసీలకే పరిమితం అనుకున్న సీట్లు సైతం బీసీలకు కేటాయించి సోషల్ ఇంజనీరింగ్‌లో సరికొత్త భాష్యం చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ఇన్చార్జిలు షేక్ ఆసీఫ్, సర్నాల తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్, ప్రధాన కార్యదర్శి రావులకొల్లు వెంకట మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ జక్కా శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితుడైన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ ను ఈ సందర్భంగా సన్మానించారు. -
సంక్షేమం కొనసాగింపు జగన్‌కే సాధ్యం
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయననే సీఎంగా గెలిపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించలేవని కుండబద్ధలుగొట్టారు. మరే పాకి సంక్షేమ ఫలాలు అందించే సత్తా లేదన్నారు. సంఘ సంస్కర్త జగన్‌ను గెలిపించుకోవల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. ఆయన ఆదివారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు బీసీలను ప్రలోభపెడుతున్నాయని, అటువంటి వాటిని తిప్పికొట్టాలన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అమలుకావడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ నాయకుడు ప్రవేశపెట్టని, అమలుచేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టి దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కృష్ణయ్య చెప్పారు. శాసనసభ స్పీకర్ పదవి బీసీ, శాసనమండలి చైర్మన్ ఎస్సీ వర్గానికి ఇవ్వడమే గాక 18 మంది ఎమ్మెల్సీల్లో 11 సీట్లు బీసీలకు కేటాయించడం చూసి దేశంలోని బీసీలంతా ఆశ్చర్యం వ్యక్తంచేశారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ చరిత్రను జగన్మోహన్రెడ్డి తిరగరాశారన్నారు. అందుకు వైఎస్సార్ సీపీ రెండేళ్ల కిందట బీసీ బిల్లు పెట్టిందని, మద్దతుగా 14 రాజకీయ పాల మద్దతు కూడగట్టిందన్నారు. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. చివరకు పార్లమెంట్లో బీసీ పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాద్ పార్టీ, బీఎస్పీ, ఆప్నాదళ్, జనతాదళ్ వంటి పాలు కూడా బీసీ బిల్లు పెట్టలేదన్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులు బీసీలకే.. ఏపీలో 50 శాతం నామినేటెడ్ పోస్టులు వెనుకబడిన వర్గాలకు ఇవ్వడమే గాక, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు జగన్ సవాల్ విసిరారని కృష్ణయ్య చెప్పారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. 193 కార్పొరేషన్లకు సంబంధించి 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగిందన్నారు. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం ఆవిష్కరించారని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే..నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాలకే అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్ సీపీ సభ్యులుంటే..అందులో ఐదుగురు బీసీలేనని పేర్కొన్నారు. కాగా, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈ నెల 29, 30 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
బీసీల బతుకులు మారాయి
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడిన తరగతుల వారికి ఈ ప్రభుత్వంలోనే సరైన న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. డబ్బు, నోరు, శక్తి, గుర్తింపు లేనివాళ్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రపీఠం వేసిన ఏకైక వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. జగన్ పాలనలో బడుగుల బతుకులు మారాయని, ఆయన గెలుపుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో 139 బీసీ కులాల ప్రతినిధులతో గురువారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తన 45 ఏళ్ల బీసీ ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులను చూశాననీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల మేలు కోరే జగన్ వంటి నాయకుడిని చూడలేదనీ పేర్కొన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘ సంస్కర్తగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, సామాజిక న్యాయం అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల ఆయన పాలనలోనే వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగిందని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమ సమాజం నెలకొల్పే దిశగా జగన్ పాలన కొనసాగుతున్నందున బీసీలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలు బాగుంటే చంద్రబాబుకు కడుపుమంట సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదవర్గాల కడుపునిండుతుంటే చంద్రబాబు వంటి పెత్తందార్ల కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఖబడ్దార్ ప్రతిపక్షాలు.. మీ మోసాలు మాకు తెలిశాయి’ అంటూ కృష్ణయ్య హెచ్చరించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి అనేక పథకాలు పెట్టి బీసీల బిడ్డలను సీఎం జగన్ చదివిస్తున్నారనీ, విదేశీ విద్య వంటి ప్రోత్సాహంతో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారనీ, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి బీసీలు ఇప్పుడు కార్లు, విమానాల్లో తిరుగుతున్నారని చెప్పారు. పొరుగున ఉన్న ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి బీసీ బతుకులు ఎలా ఉన్నాయో చూస్తే ఏపీలో బీసీల అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి, తమిళనాడులోని తెలుగు వారుండే ప్రాంతంలో ఓ సమావేశానికి తాను వెళ్లినపుడు అమ్మ ఒడి, పింఛన్, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ వంటి పథకాల కోసం తమను కూడా ఏపీలో కలిపితే బాగున్ను అని అక్కడివారు తనతో అన్నట్టు ఉదహరించారు. రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మోసపు మాటలు ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. -
మంచి శాఖలు కేటాయించారు, ప్రజలకు సేవచేస్తా..
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలను తనకు కేటాయించడంపట్ల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతూ.. తనకు మంచి శాఖలను కేటాయించారని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. సర్పంచ్ల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. తండాలను పంచాయతీలుగా చేసినా వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అడవి బిడ్డగా గిరిజన, ఆదివాసీ తెగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, మంత్రి సీతక్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నీరడి భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, నిఖిల్ పాల్గొన్నారు. -
కుల గణనపై సీఎం జగన్ సంకల్పానికి సలాం
సాక్షి, అమరావతి: ‘కుల గణన’ ఒక చరిత్రాత్మక కార్యక్రమమని, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ఎవరైనా సలాం చెప్పక తప్పదని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాలకు మేలు కలిగించడంలో కులగణన కీలకమని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శవంతమైన కార్యక్రమమని అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల లెక్కలు తీసేందుకు సాహసం చేయలేదన్నారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికే చెందినా బీసీ లెక్కలు తీయించే ఆలోచన చేయలేదని అన్నారు. ఆ ధైర్యం ఒక్క సీఎం జగన్‌కే ఉందన్నారు. కులాల లెక్కలు తీసి, బలహీన వర్గాలకు విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా మెరుగైన సంక్షేమం అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సీఎం జగన్ బాటలు వేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన బీసీలకే కాకుండా మిగతా కులాల వారికీ మేలు చేస్తుందని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని బీసీ సంఘాలు, ఇతర ఉప కుల సంఘాల వారంతా సీఎం జగన్ ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారని, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగనే బలం, బలగం అని తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అందరూ సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. కుల గణన గిట్టని కొందరు విపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. మంత్రివర్గంలో ఆ వర్గాలకు బొటా»ొటీ పదవులిచ్చేదన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యుల్లో అసలు బీసీలే లేరని చెప్పారు. జడ్జిలుగా బీసీలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తానని అహంకారంతో హుంకరించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. సామాజిక సాధికార యాత్రలకు విశేష స్పందన పేద కుటుంబాలు సొంత ఇంట్లో ఉండాలని సీఎం జగన్ 32 లక్షల ఇళ్ళ స్థలాలు ఇస్తే, అందులో మెజార్టీ బీసీలకే వచ్చాయని తెలిపారు. పదవులు, ఉద్యోగాల్లో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకే ఇచ్చారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలివ్వగా, అందులో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారేనన్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్, 139 బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. అందుకే సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల పక్షపాతి అని స్పష్టంగా చెప్పగలుగుతున్నామని తెలిపారు. అందువల్లే సీఎం జగన్ ఈ వర్గాలకు చేసిన మేలును వివరిస్తూ చేస్తున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని వివరించారు. -
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
కుల గణన నిర్ణయం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: ఏపీలో కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేసే విషయంలో సీఎం జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కుల గణనను పూర్తి పారదర్శకంగా జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఏ కుల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. తద్వారా వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయన్నారు. సీఎం జగన్ గత నాలుగేళ్ల పాలనలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అలాగే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ మాట్లాడుతూ.. సర్పంచ్ నుంచి రాజ్యసభ స్థానాల వరకు బీసీలకు రాజ్యాధికారంలో 65 శాతానికి పైగా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ఇప్పుడు కుల గణన చేపట్టడం బీసీల జీవితాల్లోనే మర్చిపోలేని అంశమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు రాజేందర్, వెంకట సుబ్బారావు, జనార్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల హక్కుల కోసం ఎందాకైనా..
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్‌లో కవితతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎంపీలు మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్‌లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్‌లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు. రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్ విజ్ఞప్తి చేశారు. లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్. కృష్ణయ్య చర్చలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్‌కోటా పెట్టాలని కోరారు. సబ్‌కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
ప్రధానితో ఆర్.కృష్ణయ్య, బీసీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం జరు గుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మారేష్, డా.పద్మలత, రమేశ్ ప్రధానమంత్రితో కలిసి చర్చలు జరిపారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించి ఒక వినతిపత్రాన్ని అందించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. బీసీలకు ఏ రంగంలో కూడా ఇంతవరకు జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ప్రధానికి వివరించారు. అందుకోసం బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అదేవిధంగా జనాభా గణనలో కులాల వారీగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ నేతల బృందం ప్రధానిని కోరింది. బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారని సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు పెద్దపీట
పాత గుంటూరు/నరసరావుపేట: రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. మాటలు చెప్పే నాయకుడిలా కాకుండా ఎన్నికలకు ముందుఅన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయారన్నారు. రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారన్నారు. పార్లమెంట్లో మొదటిసారి బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఉనికి కోసమే సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారిని అక్కున చేర్చుకుంటారని, ఆ స్థానం సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తే బీసీల అభివృద్ధి బాగుంటుందని అన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆ పథకాలను సద్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు నాని అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వెంగళరావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్ పాల్గొన్నారు. -
దమ్మున్న నాయకుడు సీఎం జగన్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బీసీ ఉద్యమ నేత, వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే అని వైఎస్ఆర్సీపీ జయహో మహాసభలో ఉద్ఘాటించారాయన. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్.. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దే. బీసీ బిల్లు వస్తే.. మన(బీసీలను ఉద్దేశించి..) తల రాతలు మారిపోతాయి. ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు. ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు. సీఎం జగన్ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నారు. మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడదని, చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి(సీఎం జగన్) మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య.. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
మాయ మాటలు చెప్పడానికి చాలామంది వస్తారు
సాక్షి, విజయవాడ: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా.. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గురువారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి. మనకి మాయమాటలు చెప్పడానికి చాలా మంది వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుమని పదిమందికి మంత్రి పదవులు రాలేదు. అలాంటిది సీఎం జగన్ కేబినెట్లోనూ, ఇతర చోట్లా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెట్ పోస్టులలో బీసీలకి 50 శాతం కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.రాజ్యసభ సీటు కోసం కోట్ల రూపాయల ఫండ్ తీసుకుంటున్న రోజులివి. అలాంటిది అలాంటిది.. బీసీ ఉద్యమ నేత అయిన నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. బీసీ బిల్లు పెట్టాలని 40 ఏళ్లగా పోరాటం చేశా. కొందరు ప్రధానులను, ప్రముఖ పార్టీలను కలిశా. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, ఒకేసారి సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అడిగా. వెంటనే ఆయన స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలను పిలిపించి బీసీ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోమన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఏకైకపార్టీగా వైఎస్సార్ సీపీ నిలిచిపోతుంది. ఇంతలా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్‌కి అండగా నిలబడాల్సిన అవసరం బీసీలకు ఉంది అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో.. ఇక ఈ ఆత్మగౌరవ సభలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎంపీలకు సన్మానం చేశారు. మంత్రులు జోగి రమేష్ , విడదల రజినీ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
‘బీసీలకు ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయం’
ఢిల్లీ: బీసీలకు అమలవుతున్న పథకాలకు ప్రత్యేక శాఖ అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామన్నారు. ఇటీవల కొత్తగా రెండు మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశారని, ఈ క్రమంలోనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ‘75 సంవత్సరాలు గడిచినా బీసీలకు ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయం. బీసీ లకు అమలవుతున్న పథకాల అమలుకు ప్రత్యేక శాఖ అవసరం.అనేక కమిషన్లు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రికమెండ్ చేశాయి. దీనికోసం కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది.దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు.చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే బీసీ బిల్లును ఆమోదింప చేయాలి.జడ్జీల నియామకంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. సామాజిక న్యాయానికి మా సీఎం వైఎస్ జగన్ ప్రతిబింబం. మంత్రి వర్గంలో సింహ భాగం బీసీలకు ఇచ్చారు. సామాజిక న్యాయం ఆచరణలో చూపిన సీఎం వైఎస్ జగన్’ అని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. -
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఆర్ కృష్ణయ్య
సాక్షి, తాడేపల్లి: బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య స్పందించారు. మొదట్నుంచీ సీఎం జగన్.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్ కృష్ణయ్య.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. తన సేవలను వైస్సార్సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు.. నేపథ్యాలు ఇవే!
సాక్షి, అమరావతి: జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తూ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది వైఎస్సార్సీపీ. పైగా గత మూడేళ్లలో అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది కూడా. తాజాగా పెద్దల సభకు పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే.. ఆర్ కృష్ణయ్య ► ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. ► సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ► ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. ► విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ► నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. ► 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్‌రావు ► ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు. ► జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జననం. ► విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ► బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. ► బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. ► రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విజయసాయి రెడ్డి ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. ► 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. ► చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ► రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. ► రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. ► జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ► ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ► రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘బీసీ బిల్లు’ పెట్టి బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీలకు గొర్రెలు–బర్రెలు కాదు, రాజ్యాధికారం కావాలంటూ నినాదాలు చేశారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్, గుజ్జ కృష్ణ, లాకా వెంగళ్ రావు, లాల్ కృష్ణ, గుజ్జ సత్యం తదితరులు ప్రసంగించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టేందుకు వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే సహా 18 పార్టీలు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయన్నారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణన డిమాండ్‌తో ఓబీసీ సెమినార్.. దేశంలో వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలిండియా ఓబీసీ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, తలారి రంగయ్య, డా.సంజీవ్, రెడ్డెప్ప, అనురాధ, అయోధ్య రామిరెడ్డి, వంగా గీత హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..సామాజిక న్యాయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సువర్ణాధ్యాయమన్నారు. బీసీల కోసం అనేక పథకాలు రూపొందించారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎస్సీ–ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న తరహాలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 10 సీట్లు బీసీలకు ఇచ్చి పూర్తి ప్రాధాన్యత కల్పించారని వివరించారు. -
సీఎం జగన్ చర్యలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
సాక్షి, అమరావతి: కేంద్రం త్వరలో నిర్వహించబోయే జనగణన–2021లో కులగణన కూడా చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని నిర్ణయించటంపై జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చరిత్ర స్పష్టించారని, 74 ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదని పేర్కొన్నారు. దేశంలో బీసీ పార్టీలుగా ముద్రపడినవి కూడా బీసీ బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదని తెలిపారు. జగన్ తమ పార్టీ పరంగా బీసీ బిల్లు పెట్టి తాము బీసీల పక్షమని నిరూపించుకున్నారన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 56 బీసీ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50% బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పేద కులాల్లో ఒక మౌలికమైన మార్పునకు పునాదులు ఏర్పడ్డాయన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల తాను సీఎం జగన్‌ను కలిసినప్పుడు లోకసభలో బీసీ బిల్లు పెట్టాలని కోరగా సుముఖంగా స్పందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. -
బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల రద్దు వద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని నిపుణుల కమిటీ సూచించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మంది నిపుణుల కమిటీ సిఫార్సు చేయడం సరికాదని, వాటిని కేంద్రం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల సమాఖ్య తరఫున ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమంటే దళిత, గిరిజన, బీసీ కులాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. -
కార్పొరేషన్లతో... బీసీల్లో ప్రతి కులానికీ గుర్తింపు
సాక్షి, అమరావతి: బీసీ కులాల్లోని నాయకుల గుర్తింపునకు ప్రత్యేకంగా రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని పలువురు బీసీ సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన రాజకీయ నాయకులు తప్ప ఆచరణలో చూపినవారు లేరని ఆయా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యారని, ఇప్పటికే ఎమ్మెల్యేలు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు ఇవ్వడంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. అణగారిన కులాల్లో ఆత్మ విశ్వాసం దేశంలోనే బీసీలను ఈ స్థాయిలో గౌరవించిన రాజకీయ నాయకులు ఎవరూ ఇంతవరకు లేరు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అణగారిన బీసీ కులాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. సీఎం నిర్ణయంతో భిక్షాటన, సంచార జాతుల వారూ పాలనలో భాగస్వాములు అయ్యారు. చైర్మన్లకు ప్రొటోకాల్ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా వారి విన్నపాలు మన్నిస్తారు. బీసీల్లో ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి వెళతాయి. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచి వ్యవస్థకు శ్రీకారం బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష కాదని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బీసీల్లోని దాదాపు అన్ని కులాల నాయకులకు గుర్తింపు వచ్చింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు గ్రామ స్థాయిలో బీసీల వృత్తులపై అధ్యయనం చేయాలి. – పి.హనుమంతరావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుభ పరిణామం కార్పొరేషన్ల ఏర్పాటు శుభ పరిణామం బీసీ కులాలకు తగిన గుర్తింపు ఇలాంటి పదవుల ద్వారానే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం కాకూడదు. – కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వృత్తులను ప్రోత్సహించాలి బీసీల్లో కుల వృత్తులకు జీవం పోసేందుకు ఇది దోహద పడుతుంది. కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించడం ద్వారా ఆయా కులాలను ఆర్థికంగా ఆదుకోవచ్చు. జిల్లా స్థాయిలోనూ ఈ కార్పొరేషన్లకు ఒక కమిటీ ఉంటే బాగుంటుంది. – టి. వేణుగోపాల్ యాదవ్, జాతీయ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ అద్భుతాల్లో ఇది ఒకటి సీఎం వైఎస్ జగన్ చేసిన అద్భుతాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ బడుల్లో నాడు–నేడుతోపాటు బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు ఒకటి.ఎన్టీఆర్ ఒక స్థాయిలో బీసీల్లో రాజకీయ నాయకత్వ పెంపునకు పునాది వేశారు. వైఎస్ జగన్ అన్ని స్థాయిల్లో పునాదులు వేశారు. – కిర్ల కృష్ణారావు, సామాజిక సేవకుడు, కార్మిక నాయకుడు 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం చంద్రబాబు కేవలం 11 బీసీ కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి తక్కిన కులాలకు తీరని అన్యాయం చేశారు. వైఎస్ జగన్ బీసీల్లోని అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేస్తూనే అందులో 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం. అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న వారికి అధికారంతో కూడిన హక్కులు కల్పించారు. – డాక్టర్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, అఖిలభారత బీసీ ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అనైతికం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్‌రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాములు, తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు ఎం.నర్సయ్యలతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ...గత 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించడం అనైతికమని, ఏ కారణం చేత వారిని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే 7,500 మంది ఉద్యోగులలో 7,450 మంది అంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమ తొలగింపుపై జాతీయ బీసీ,ఎస్సీ, ఎస్టీ కమిషన్లు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. దీక్షకు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణతో పాటు ఇతర బీసీ నాయకులు మద్దతు తెలిపారు. బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్.కృష్ణయ్య. పక్కన చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు -
ఈ ‘దీవెనలు’ బడుగుల వెలుగుదివ్వెలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఉన్నతి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా తీసుకొస్తున్న అమ్మ ఒడి, పూర్తి ఫీజులు–విద్యాదీవెన–జగనన్న వసతి దీవెన వంటి పథకాలు తాడిత, పీడిత, అణగారిన కులాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతాయి. అనుభవజ్ఞులు, తలలు పండిన మేధావులకు, రాజకీయవేత్తలకు, సిద్ధాంతకర్తలకు, సంఘసంస్కర్తలకు, ఉద్యమకారులకు, ప్రజాసంఘాలకు రాని ఈ ఆలోచన చిన్న వయసులోనే వైఎస్ జగన్‌కు రావడం విశేషం. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ స్కీములను ప్రవేశపెట్టారు. భావితరాలకు దుఃఖానికి తావులేని, ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు తావులేని సమాజాన్ని నిర్మించే పథకాలివి. ప్రజలను శాశ్వతంగా అభివృద్ధి చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందుచూపుతో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మొన్న ప్రారంభించిన జగనన్న వసతి దీవెన–విద్యాదీవెన, అంతకు ముందు ప్రకటించిన అమ్మ ఒడి పథకం బలహీన వర్గాల ప్రజల జీవితాలకు కాంతి రేఖలు–వెలుగు దివ్వెలు. చదువుల విప్లవం. ఈ పథకాల ద్వారా దశాబ్దకాలంలో అణగారిన కులాల్లో సమూలమైన మార్పు జరుగుతుంది. సమగ్రమైన అభివృద్ధి జరుగుతుంది. తాడిత, పీడిత, అణగారిన కులాల్లో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుంది. పదేళ్ల తర్వాత ఏపీలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో గుణాత్మకమైన మార్పులు జరుగుతాయి. ఈ స్కీమ్ పెట్టడంతో ప్రతి పేదవారు పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యను చదువుకునే ప్రోత్సాహం లభించింది. కూలీ–నాలీ చేసుకునే కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చది వించే అవకాశం కలిగింది. చదువు విలువ తెలియని కుటుంబాల వారు కూడా ఈ డబ్బు వస్తుందనే ఆశతో తమ పిల్లలను తప్పనిసరిగా చదివించడానికి ముందుకు వస్తారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేని పథకాలు ఇవి. ఎవరి ఆలోచనలకు అందని పథకాలు ఇవి. రాజకీయాలకతీతంగా ఈ పథకాల అమలును ప్రతిపక్షాలు కూడా ప్రశంసించాలి. ఈ స్కీములు పెట్టడం సీఎం వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్య. ఈ స్కీము వలన డాక్టర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలుగన్న జ్ఞాన సమాజం వస్తుంది. ఈ స్కీము పెట్టి ముఖ్యమంత్రి జీవితం చరితార్థం అయ్యింది. తండ్రిని మించిన తనయుడుగా చరిత్రలో నిలిచిపోతారు. అనుభవజ్ఞులు, తలలు పండిన మేధావులకు, రాజకీయవేత్తలకు, సిద్ధాంతకర్తలకు, సంఘసంస్కర్తలకు, ఉద్యమకారులకు, ప్రజాసంఘాలకు రాని ఈ ఆలోచన చిన్న వయసులోనే వైఎస్ జగన్‌కు రావడం విశేషం. ఈ పథకాలు పెట్టాలని ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయలేదు, ఏ ప్రజాసంఘం ఉద్యమాలు చేయలేదు. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ స్కీమును ప్రవేశపెట్టారు. భావితరాలకు దుఃఖానికి తావులేని, ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు తావులేని సమాజాన్ని నిర్మిస్తుంది. ఈ జగనన్న విద్యా వసతి దీవెన పథకం కింద 11 లక్షల 87 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల నుండి 20 వేల వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది. ఈ పథకం కింద రూ. 2300 కోట్ల వ్యయం అవుతుంది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరుచేసే పథకం కింద రూ.3,700 కోట్లు ఖర్చవుతాయి. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి ఫీజుల స్కీము పెడితే 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అనేక షరతులతో నీరుగార్చారు. ఇప్పుడు ఆ పథకాన్ని పునరుద్ధరించడంతో బలహీన వర్గాల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సులు చదివే అవకాశం కలిగింది. అలాగే అమ్మ ఒడి పథకం కింద 42 లక్షల మంది తల్లుల ఖాతాలలో 82 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున రూ. 6,400 కోట్లు ఇప్పటికే జమ కావడం ప్రారంభమయ్యింది. మొత్తం ఈ పథకాలకు రూ.12,400 కోట్లు ఖర్చవుతాయి. ఇంత భారీ మొత్తంతో దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ ఈ పథకాలను ప్రవేశపెట్ట లేదు. చివరగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి స్కీములు లేవు. ప్రత్యేకంగా ఈ స్కీము వలన లబ్ధి పొందేది 95% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఈ పథకాల వ్యయాన్ని ఖర్చు కోణంలో చూడరాదు. ఇవి పెట్టుబడి పథకాలు. ఈ పథకాల వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాభివృద్ధిలో పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా విప్లవాత్మకమైన మార్పులుంటాయి. ఒకసారి ఒక కుటుంబంలో ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, తదితర కాలేజీ కోర్సులు చదివితే ఆ కుటుంబం శాశ్వతంగా, సమగ్రంగా, అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, లేదా ఐటీ కంపెనీలో ఉద్యోగం వస్తుంది లేదా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది లేదా స్వయం ఉపాధి పథకాలు, పరిశ్రమలు, కంపెనీలు పెట్టుకొని, అలాగే కాంట్రాక్టులు చేపట్టి అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంజనీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్ చదివేవారు, విదేశాలకు వెళ్లి ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది. ఇక ప్రభుత్వ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకంపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది. పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పదేళ్ల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 ఏళ్ల కాలంలో 90% సబ్సిడీ పథకం కింద లబ్ధి పొందేవారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందేవారు అభివృద్ధి చెంది పెన్షన్ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగిపోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం బడ్జెట్ తగ్గిపోతుంది. అంతేకాదు ఈ విద్యా పథకాల భారం కూడా 20 ఏళ్ల తర్వాత ఉండదు. దీనిపై పెట్టే బడ్జెట్ భారం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరంకు ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. చదువు మూలంగా అనేక కుటుంబాలు అభివృద్ధి చెంది, అధిక ఆదా యం పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ సబ్సిడీ స్కీములు, ఇతర విద్యాస్కీములు పొందేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కాబట్టి పేదరికం అనే అర్హత ఉండదు. ఇక రెండవ తరం నుంచి సబ్సిడీ పథకాలు, విద్యా పథకాల అవసరముండదు. వీటిపై పెట్టే వేల కోట్ల బడ్జెట్ ఇతర పథకాలకు మళ్ళించవచ్చు. పాలకులు ప్రతి ఒక్కరూ ఏ పథకం పెడితే ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. అంతేకాని దీర్ఘకాలంలో సమాజాభివృద్ధి ఎలా జరుగుతుంది అని ఆలోచించరు. పెన్షన్లు, సబ్సిడీ రుణాలు, కలర్ టీవీలు, ఇతర పథకాలు పెట్టి ఎప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడే యాచకులను చేస్తారు. కానీ జగన్ పథకాల ద్వారా ప్రజలను శాశ్వతంగా అభివృద్ధి చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందుచూపు–విజన్‌లో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ వర్క్‌లలో 50 శాతం కోటా ఇచ్చి, పారిశ్రామిక పాలసీలలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఈ స్కీములతో ఈ వర్గాలు కాంట్రాక్టర్లుగా, పరిశ్రమ అధిపతులుగా ఎదుగుతారు.. ఇంతవరకూ ఈ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండు శాతం ప్రాతి నిధ్యం కూడా లేదు. ఇప్పుడు 50 శాతం ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇదొక గొప్ప మలుపు. దివంగత వైఎస్సార్ పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్, కాలేజీ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు పెడితే, కుమారుడు జగన్మోహన్రెడ్డి అంతకుమించి ఎవరి అంచనాలకు అందనంతగా అమ్మ ఒడి, పూర్తి ఫీజులు–విద్యాదీవెన– జగనన్న వసతి దీవెన పథకాలతో చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో ఇలాంటి పథకాలను ఏ రాష్ట్రం పెట్టినా, దేశం పెట్టినా జగన్ వారికి మార్గదర్శకుడుగా ఉంటారు. ఇవే కాక అనేక స్కీములు పెట్టారు. అన్నిరకాల పెన్షన్లు భారీగా పెంచారు, సబ్సిడీ పథకం కింద సన్న బియ్యం ఇస్తామన్నారు, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారు, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ 20 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కట్టుబట్టలతో వెళ్ళింది. కేంద్ర సహాయం కూడా అంతంతే. పైగా బాగా ఆదాయాన్నిచ్చే ఎక్సైజ్ శాఖలో పాక్షికంగా మద్యపాన నిషేధం విధించడంతో వేల కోట్ల ఆదాయం తగ్గింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఇన్ని విప్లవాత్మకమైన రూ. వేల కోట్ల ఖర్చు అయ్యే స్కీములు అమలు చేయడం ఒక్క జగన్‌కే సాధ్యం. విద్య ఒక్కటే మానవ వికాసానికి మార్గం. విద్య ద్వారానే బడుగు వర్గాలకు సాంఘిక సమానత్వం–సామాజిక న్యాయం దక్కుతుంది 10 నుంచి 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా రూపొందుతుంది. అజ్ఞానం, అంధకారం, అమాయకత్వం నుంచి ప్రజలను విముక్తి చేసి ఒక విజ్ఞానవంతమైన, శాస్త్రీయ జ్ఞానంతో కూడిన సమాజాన్ని నిర్మాణం చేయగలం. వ్యాసకర్త: ఆర్.కృష్ణయ్య, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు, మొబైల్ : 90000 09164 -
బీసీలను కులాల వారీగా లెక్కించాలి
కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణన 2020లో కులాల వారీగా బీసీలను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈమేరకు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణలు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం బీసీ కులాల వారీగా లెక్కలు సేకరించాలని హోంశాఖ మంత్రివర్గ కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించిందని, ఆ తర్వా త సర్క్యులర్ కూడా జారీ చేసిందన్నారు. ఇటీవల కేంద్రం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర మతాల కాలమ్స్ వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారని తెలి పారు. కానీ ఈ జనాభా లెక్కల బీసీ కులాల వివరాలకు సంబంధించినవి పెట్టలేదని వివరించారు. -
సుప్రీంకోర్టులో ఒక్క బీసీ జడ్జీ లేరు
హైదరాబాద్: దేశ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా లేకపోవడం న్యాయవ్యవస్థకే మాయని మచ్చని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సమర్థులైన న్యాయవాదులు ఉన్నప్పటికీ హైకోర్టు జడ్జీలుగా అవకాశం కల్పించలేని దీనస్థితిలో ప్రభుత్వాలు, కోర్టులు ఉన్నాయని ఆరోపించారు. 71 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఉన్నత న్యాయవ్యవస్థలో ఈ వర్గాలకు ప్రాతినిధ్యంపై ఇటీవల పార్లమెంట్లో సమర్పించిన నివేదికలో 5 శాతం ప్రాతినిధ్యం మించలేదని చెప్పడం శోచనీయమని అన్నారు. ‘లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్’ఆధ్వర్యంలో శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో ‘రాజ్యాం గం–న్యాయవ్యవస్థ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఫోరం అధ్యక్షుడు జి.శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి రవీందర్ సయన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యా యమూర్తులు లేకపోవడంతో సామాజిక న్యా యం దెబ్బతింటుందని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘దమ్మున్న మగాడు వైఎస్ జగన్’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన దరిద్రం పోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకులా చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీసీలను చదువుకునేలా చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. అదే బీసీలను తలెత్తుకోనేలా చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్ దమ్మున్న మగాడు మాట ఇస్తే తప్పడు అని ప్రశంసించారు. ‘ఆంధ్రకి దరిద్రం చంద్రబాబు. ఈ దరిద్రం పారిపోవాలి అంటే సీలింగ్ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. బీసీల మద్దతు వైఎస్సార్సీపీకే. చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించాల’ని కృష్ణయ్య పిలుపునిచ్చారు. చేపలు కూడా తిట్టుకుంటాయి చంద్రబాబు కరువును తోడు తెచ్చుకొంటారని, ఆయన వస్తే వానలు రావని ఎద్దేవా చేశారు. చెరువులో చేపలు కూడా చంద్రబాబును తిట్టుకుంటాయని వ్యంగ్యంగా అన్నారు. ‘బీసీలను అణగతొక్కడమే చంద్రబాబు పని. బీసీల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలను వెళ్ళొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు. బీసీ జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తిలు కాకుండా అడ్డుకున్నారు. నన్ను బలవంతంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చి మోసంచేసారు. చంద్రబాబు పచ్చి బీసీల వ్యతిరేకి’ అని త్రీవస్థాయిలో కృష్ణయ్య మండిపడ్డారు. -
పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా, బీసీలకు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆయన నివాసంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారని, దీనిమూలంగా 1,600 సర్పంచ్ పదవులు, 20 వేల వార్డు మెంబర్లు బీసీలకు దక్కకుండా పోయాయని వాపోయారు. రాష్ట్రంలో బీసీలు సమగ్ర సర్వే ప్రకారం 52% ఉంటే 34% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం పట్ల బీసీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగ సవరణకు సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరపాలని మంత్రికి విన్నవించారు. పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించవచ్చునన్నారు. దీనికి మంత్రి సానూకులంగా స్పందిస్తూ.. కేసీఆర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా తుది ఫలితాలు ప్రకటించాలి
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడి చినా ఇప్పటివరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వారం రోజుల్లోగా టీచర్ పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తా మని హెచ్చరించారు. టీఆర్టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతున్న జాప్యా న్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి తదితరు లు మద్దతు ప్రకటించారు. కృష్ణయ్య మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ 8,786 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయ గా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రక్రియ 18 నెలలైనా పూర్తి కావడంలేదన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, టీచ ర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జెట్టి మల్లికార్జున గౌడ్, భూపేష్సాగర్ పాల్గొన్నారు. -
టీఆర్టీ తుది ఫలితాలను ప్రకటించాలి
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ భవంతిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీఆర్టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతోన్న జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రక్రియ 18 నెలలు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. కేవలం 8,792 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. వీటికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టు కేసుల సాకుతో ఫైనల్ లిస్టు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫైనల్ సెలక్షన్ జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ కృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం బీసీ భవన్లో జరిగిన సమావేశానికి సంఘం బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. క్లాస్–వన్ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగుల శాతం ఎనిమిది దాటలేదని, కేంద్ర స్థాయి ఉద్యోగుల్లో 16% దాటలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత కూడా 56%జనాభా గల బీసీలకు ఇంత తక్కువ ప్రాధాన్యం ఉండటం చూస్తే ఈ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టం అవుతోందన్నారు. అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. అగ్రకులాల్లోని పేదలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలలో 80 % పదవులు అగ్రకులాల వారే అనుభవిస్తున్నారని ఆరోపించారు. 15% జనాభా ఉండి 80% పదవులు పొందుతున్న అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడంలో శాస్త్రీయత లేదన్నారు. ఈబీసీలకు రిజర్వేషన్లు సిద్ధాంత వ్యతిరేకమని, అధికారం కోసం పాలకులు అడ్డదారులు తొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. ఈ సమావేశంలో గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్,ఎం. వెంకటేశ్,జి.రామకృష్ణ,్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. -
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి
హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు శనివారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారమన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు 36 జాతీయ పార్టీల అధ్యక్షులకు వేరువేరుగా లేఖలు రాశారు. బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నెల11 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినప్పటికీ కోర్టు తీర్పులను సాకుగా చూపుతూ అమలు చేయడం లేదన్నారు. దీంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాజకీయ కోణంలొనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని భావించి ఈమేరకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రాజేందర్, నర్సింహాగౌడ్, టీఆర్ చందర్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘17న బీసీలకు జరిగిన అన్యాయంపై గళమెత్తుదాం’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అతి తక్కువ సీట్లిచ్చి అవమానపర్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా బీసీ నాయకులంతా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాలేజీ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలని, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 12 సంఘాల మద్దతు.. ఈ బంద్‌కు 12 బీసీ సంఘాలు మద్దతిచ్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ బీసీలకు టికెట్లివ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. బీసీ ఫ్రంట్, రాష్ట్ర బీసీ సంఘం, బీసీ యువజన సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ, రాష్ట్ర బీసీ సేన, రాష్ట్ర బీసీ ప్రజా సమితి, రాష్ట్ర బీసీ జన సమితి, రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మొదలైన సంఘాలన్ని మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో భిక్షపతి, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ గౌడ్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. -
సగం సీట్లు ఇవ్వకుంటే ఓటమే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించకుంటే ఆయా రాజకీయ పార్టీలను కచ్చితంగా ఓడించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు తప్పనిసరిగా 60 సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం 20 సీట్లు కేటాయించకుండా తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాలోనూ బీసీలకు ప్రాధాన్యత లభించలేదని మండిపడ్డారు. ఒకవేళ మహా కూటమిలోనూ బీసీలకు అన్యాయం జరిగితే ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీసీల కోసం పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ పాల్గొన్నారు. -
సీట్లు.. నిధులు.. సగమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను తన వైపు మళ్లించుకునే వ్యూహాలకు పదును పెట్టింది. జనాభాలో సగభాగమున్న బీసీల ఓట్లను అనుకూలంగా మార్చుకునే క్రమంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పలు బీసీ సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపి బీసీల ప్రధాన డిమాండ్లను తెలుసుకున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు సగం సీట్లివ్వాలని, నిధుల కేటాయింపులో సమాన వాటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య ప్రతిపాదించారు. అరాచక పాలనను అంతం చేద్దాం: జానా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక, అప్రజాస్వామిక పాలనను అంతం చేసేందుకు అందరూ కలసి రావాలని జానారెడ్డి కోరారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం వారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాలకు న్యాయం చేయడంలో అగ్రభాగాన ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై స్పందిస్తూ గత ఆర్నెల్లుగా కాంగ్రెస్ చెబుతున్న అంశాలనే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు అవే హామీలను ఎలా కాపీ కొట్టారని ప్రశ్నించారు. టీఆర్ఎస్పై ప్రజల్లో విశ్వసనీయత లేదని.. అందుకే అందరిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ ఈ పనిచేశారని ఆరోపించారు. ప్రజలను భ్రమపెట్టి, మభ్యపెట్టే విధానం కాంగ్రెస్‌కు లేదని జానా వెల్లడించారు. ప్రధాన డిమాండ్లివే.. 217 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటన, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు వచ్చిన దరఖాస్తులన్నీంటి పరిష్కారం, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, క్రీమీలేయర్ ఎత్తివేత.. లాంటి ప్రధాన డిమాండ్లను కృష్ణయ్య జానారెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పంది స్తూ టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లిచ్చేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. డిమాండ్లపై మేనిఫెస్టో కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీ సంఘాల ప్రతినిధులకు చెప్పారు. బీసీలకు సగం సీట్లు ఇవ్వండి: జాజుల సాక్షి, హైదరాబాద్: ఆరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌర వించి తెలంగాణ ఇచ్చినట్లు.. ఈ ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీని బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరా రు. మేనిఫెస్టో, రాయితీలు, సబ్సిడీలను చూసి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని, అప్పుడే బీసీ యువత ఓట్లు వేసేందుకు ముం దుకు వస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో బీసీ వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఉన్నారని జాజుల తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో వాపోయారు. -
బీసీల ప్రస్తావనేదీ..
హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో బీసీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీసే విధంగా ఉం దని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నా రు. బీసీలకు ఒక్క పథకం కూడా అందులో ప్రకటిం చలేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో బీసీలకు ఎలాంటి హామీలివ్వకుండా బీసీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలంటే కేసీఆర్‌కు లెక్కలేదని, ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అనేక బీసీ వ్యతిరేకచర్యలకు పాల్పడ్డారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను విద్యకు దూరం చేశారని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంతో పోరాడుతానని చెప్పి ఒక్కసారి కూడా ప్రధానితో మాట్లాడలేదని ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు మాత్రం తొక్కి పెట్టా రని విమర్శించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక్క కొత్త భవనం కూడా నిర్మించలేదన్నారు. జనాభా ప్రకారం పంచా యతీ రాజ్ రిజర్వేషన్లు పెం చుతామని హామీ ఇచ్చి అనంతరం తగ్గించేందుకు ప్రయత్నించారన్నారు. బీసీలంటే కేసీఆర్‌కు ఓట్లేసే యంత్రాలుగా కనబడుతున్నారన్నారు. కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకిచ్చే హామీలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం లో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, శారదగౌడ్, చెరకు కౌశిక్‌యాదవ్, జంగయ్య యాదవ్, సుమన్‌బాయి పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టండి
హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం బీసీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే కోట్ల రూపాయలు వెదజల్లడం, మద్యం ప్రలోభా లను చూపడం ప్రారంభించా యని ఆరోపించారు. డిసెం బర్ 7 వరకు బీరు షాపులు, బార్లు మూసివేయాలని, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, డబ్బులు ఇవ్వడానికి యత్నించే నాయకులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జి. కృష్ణ, వెంకటేశ్, సత్యనారాయణ, బర్కకృష్ణ పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షలో 30 గ్రేస్ మార్కులు కలపాలి
హైదరాబాద్: ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 30 గ్రేస్ మార్కులు కలపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఔటాఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని , కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల సం«ఘం గురువారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రశ్నలు తప్పుగా రావటం వల్ల పరీక్షకు హాజరైన అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఎక్కువ మార్కులు సాధించలేక మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డా్డరని తెలిపారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ రాత పరీక్ష మరింత భారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామలింగం, ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తాం: శివసేన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తామని తెలం గాణ శివసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శివసేన రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కార్యదర్శి దొరిషి వీరేంద్ర శేఖర్, గౌటే గణేశ్ శనివారం బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి చర్చలు జరిపారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కృష్ణయ్య పోరాటానికి శివసేన మద్దతు ఉంటుందని తెలిపారు. తమ పార్టీ జరిపిన సర్వేలో బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రజలు కోరుతున్నట్లు తేలిందని, అందుకే కృష్ణయ్య సీఎం అభ్యర్థిత్వానికి మద్ద తు ప్రకటిస్తున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా అందడం లేదని, బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు అయినా బీసీలకు సీఎం పదవి దక్కక పోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు కేటాయిస్తు న్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలో ఉద్ధవ్ థాక్రేతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
పల్లకీ మోసే కూలీలు కావొద్దు: కృష్ణయ్య
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని, ఇష్టం వచ్చినట్లు ఓటు వేసి పల్లకీ మోసే కూలీలు కావొద్దని విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ బీసీ సంఘం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా ఏకమై ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లల్లో అమలవుతున్న బీసీ క్రీమీలేయర్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50శాతం కోటాతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బున్న కులాలకే ప్రధాన పార్టీల టికెట్లు: కృష్ణయ్య
సాక్షి,హైదరాబాద్: డబ్బున్న కులాలు, అభ్యర్థులకే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత దక్కలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు సైతం బీసీల్లో బాగా వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వృద్ధి చెందాలంటే బీసీ రిజర్వేషన్లే ఏకైక మార్గమన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈమేరకు బీసీ కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో బీసీ మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, భూపేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
30న కలెక్టరేట్ల ముట్టడి’
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆగస్టు 30న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు సకాలంలో విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లకు సంబంధించి రూ.2,200 కోట్ల ఫీజు, స్కాలర్షిప్ బకాయిలున్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు త్రైమాసికాల నిధులను కూడా విడుదల చేయాలన్నారు. 119 కొత్త గురుకులాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా కన్వీనర్ కోటాలో సీటు సాధించిన వారందరికీ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదు’
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ స్టేట్ 108 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని కృష్ణయ్య తెలిపారు. అనంతరం జంటనగరాల సం యుక్త కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్ హామీతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఆందోళనలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె అశోక్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలేది? కాళోజీ హెల్త్ వర్సిటీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు సక్రమంగా అమ లు చేయటం లేదని కృష్ణయ్య ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరారు. -
ఉద్యోగాల భర్తీకి పోరాడండి: కృష్ణయ్య
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హాల్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు, ఏపీలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. ఖాళీల భర్తీలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 లక్షల ఉద్యోగాలు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. రిటైర్ అయిన వారిని వోఎస్‌డీలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగులుగా ఇప్పటివరకు 2 వేల మందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రోడ్డు మీద తిరుగుతుంటే.. రిటైర్ అయిన వారిని కొనసాగించడం న్యాయం కాదన్నారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, అంజి, రామలింగం, రామకృష్ణ, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఉద్యమమే: కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగ గర్జనలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించారు. నిరుద్యోగ జాక్ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లా డుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 14 లక్షల మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్–1లో 1,200, గ్రూప్–3లో 8 వేలు, గ్రూప్–4లో 36 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధం కావాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయ సంస్కరణలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్రపతిని కోరారు. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతితో వారు 35 నిమిషాలపాటు చర్చించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కలేదని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు రాజకీయ రంగంలో 14 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం, వ్యాపార రంగంలో కేవలం ఒక శాతం వాటా మాత్రమే బీసీలకు ఉందని, రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం మౌళికమైన మార్పులకోసం చర్యలు తీసుకోవాలని నేతలు రాష్ట్రపతిని కోరారు. పార్లమెంటు, శాసనసభలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని, పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50 శాతం వాటా కల్పించాలనే తదితర 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిం చారు. 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై తన వంతు ప్రయత్నం చేస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య మీడియాకు తెలిపారు. రాష్ట్రపతిని కలిసినవారిలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ జేఏసీ నేత నౌడు వెంకటరమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయకార్యదర్శి గుజ్జ కృష్ణ, భూపేశ్కుమార్, హరికిషన్ ఉన్నారు. -
‘జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల ప్రతినిధులు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిని కలిశారు. బీసీల సమస్య లపై గంటన్నరపాటు చర్చించారు. బీసీలకు చట్టసభలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లతో పాటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌పై జాతీయ స్థాయిలో ఉద్యమం మొదలు పెట్టామని, ఇందులో భాగంగా పుదుచ్చేరి సీఎంని కలిశా మని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన ప్రతిపాదనలపై సీఎం నారాయణ స్వామి సానుకూలంగా స్పందించారని, వచ్చే వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
‘రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. పేద విద్యార్థులు అప్పులుచేసి ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం జనాభా ఉన్న మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలు, 15శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 268 రెసిడెన్షియల్ పాఠశాలలు, 6శాతం జనాభా ఉన్న ఎస్టీలకు 169 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, 52శాతం ఉన్న బీసీలకు 142 మాత్రమే ఉన్నా యన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 890 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలన్నారు. -
బీసీ బిల్లును పార్లమెంట్లో లేవనెత్తుతాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు అంశాన్ని తప్పకుండా లేవనెత్తుతామని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బృందం అఖిలేశ్‌ను కలిశారు. చట్టసభలు, ఉద్యోగ పదోన్నతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలేశ్‌ను కోరారు. బీసీల వాదన సరైందని, వచ్చే సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. -
ఇంత జరుగుతున్నా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సినీ మహిళా ఆర్టిస్టుల డిమాండ్లకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలుగు వారికే 90శాతం అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాస్టింగ్ కౌచ్, కోఆర్డినేటర్ల విధానాన్ని రద్దు చేసి తమకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్ ఆర్టిస్టులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఫ్యూడల్ వ్యవస్థను గుర్తుకు తెస్తోందన్నారు. ‘సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శంగా నిలవాలి. సినీ పరిశ్రమ పట్ల సమాజంలో గౌరవం పోతుంది. మొన్న మాదకద్రవ్యాల ముద్ర, ఇప్పుడు లైంగిక వేధింపుల ముద్ర సినిమా ఇండస్ట్రీపై పడింది. చిత్ర పరిశ్రమ నాగరిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేయాల’ని కోదండరాం అన్నారు. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇవ్వకుంటే వాటిని బలవంతంగా లాక్కుమంటామని బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. సినీ పరిశ్రమ తిరోగమన దిశగా వెళ్తోందని విమర్శించారు. సినీ పరిశ్రమలో తమకు రక్షణ కరువైందని మహిళా ఆర్టిస్టులు వాపోయారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, వేషాలు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు చెందిన అపూర్వ, శ్రీరెడ్డితో పాటు పలువురు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి’
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లును ప్రభుత్వం పాస్ చేసిందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేని ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 12 యూనివర్సిటీలు ఉండగా కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రైవేట్ వర్సిటీల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ చేసే అవకాశం లేదన్నారు. -
బ్యాంకింగ్ అక్రమాలపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో వెలుగు చూసిన బ్యాంకింగ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులో బ్యాంకు సిబ్బంది కూడా కుమ్మక్కైనట్లుందని ఆయన ఆరోపించారు. బ్యాంకుకు రూ.3,695 కోట్లు ఎగ్గొట్టిన రొటోమ్యాక్ కంపెనీ ప్రమోటర్ విక్రమ్ కొఠారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు రూ.లక్ష రుణం కావాలంటే అనేక కొర్రీలు పెట్టే బ్యాంకులు వ్యాపారులకు వేల కోట్ల అప్పు ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వీటిపై విచారణ జరిపించాలని లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘బీసీ బిల్లును’ పార్లమెంట్లో ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర సామాజిక న్యాయసాధికార శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జి.రమేష్ తదితరులు కలిసి డిమాండ్ చేశారు. 16 డిమాండ్లతో వినతిపత్రం పార్లమెంట్లో బీసీ బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. లక్ష కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, కేంద్రంలో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో సాచురేషన్ పద్ధతిలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ స్కీం ప్రవేశపెట్టాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. మొత్తం 16 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు. ఫిబ్రవరిలో బిల్లు పెడతాం: గెహ్లాట్ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే విధంగా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చే బిల్లును సైతం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేయాలని కోరారు. -
ఆర్. కృష్ణయ్య తొలగింపు
సీతమ్మధార (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను పదవి నుంచి తొలగించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తిని నియమించాలని తీర్మానించింది. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు అధ్యక్షతన విశాఖలోని ఇంజనీరింగ్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆర్.కృష్ణయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఎబీ నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
ఫీజులు చెల్లించకపోతే కలెక్టరేట్ల ముట్టడి
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తరగతి గదులను బహిష్కరించి ఈ నెల 16న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదని, కొత్తగా వివిధ కోర్సుల్లో చేరాలంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1,600 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. 40 వేలకుపైగా పోస్టులు ఖాళీలుండగా విద్యాశాఖ మంత్రి 16 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.రమేశ్, నీలం వెంకటేశ్, జి.కృష్ణ, చందర్, రామకృష్ణ పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్లకు నిధులివ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు గత ఏడాదికి సంబంధించిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరారు. సచివాల యంలో మంగళవారం కృష్ణయ్య బృందం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసింది. కృష్ణయ్య మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో బీసీలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర ఫెడరేషన్లకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేస్తామని ఈటల హామీ ఇచ్చారని కృష్ణయ్య చెప్పారు. గుజ్జ కృష్ణ, గోరిగే మల్లేశ్, సీఎం యాదవ్, జి.కృష్ణయాదవ్ పాల్గొన్నారు. -
‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హన్మకొండ: ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే బీసీ హక్కులను సాధించుకుందామని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ఎల్ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని, ఉద్యోగాల నియామకం చేపట్టాలని, క్రిమిలేయర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఇటీవల ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మేధావులు మౌనంగా ఉండడం వల్లే∙జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు చట్టసభల్లోకి వెళ్లలేక పోతున్నామని, తద్వారా కాంట్రాక్టర్లు, రౌడీలు, గూండాలు, పారిశ్రామిక వేత్తలు చట్టసభల్లో అడుగుపెడుతున్నారన్నారు. ఎల్ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యా య నియామకాలను ఇకపై కొత్త జిల్లాల యూనిట్ ప్రకారమే చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. విద్యాశాఖ 8,972 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చెబుతోందని, వాస్తవానికి 40 వేల టీచర్లు అవసరమని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని, నియామకాల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధ్యాయ నియామకాలే చేపట్టలేదని, ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
సీపీఎస్ రద్దును కోరుతూ 20న ర్యాలీ: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే తరహాలో సాధారణ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈమేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దును కోరుతూ ఈ నెల 20న మహార్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం చలో శంషాబాద్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దీనికి ఉపాధ్యాయ సంఘాలన్నీ మద్దతిచ్చి పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రూపొందించిన వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. -
కాపులను బీసీలో కలిపితే ఒప్పుకోం
-
పవన్.. తెలుసుకొని మాట్లాడు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్.కృష్ణయ్య.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. కాపులను బీసీలో కలుపుతామని 1994లో ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టుకు వెళ్లామని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. అదేవిధంగా 1998, 2000 సంవత్సరంలో జాతీయ కమిషన్ వచ్చినప్పుడూ అడ్డుకున్నామని గుర్తుచేశారు. కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఒక ఎద్దుతో నాగలి కట్టడమేనన్నారు. కాపులను బీసీ జాబితాలో కలపాలంటే కొన్ని అర్హతలుండాలని వివరించారు. -
పులి, ఎద్దుతో నాగలి కడతారా?
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తాను వ్యతిరేకించలేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీసీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య స్పందించారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కాపులను బీసీలో కలుపుతామని 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టు వెళ్లాయమని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. అదే విధంగా 1998, 2000 సంవత్సరంలో జాతీయ కమిషన్ వచ్చినప్పుడూ అడ్డుకున్నామన్నారు. కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఎద్దుతో నాగలి కట్టడమేనని వ్యాఖ్యానించారు. బీసీ జాబితాలో కలుపాలంటే కొన్ని అర్హతలుండాలని వివరించారు. బీసీ జాబితాలో కాపులను కలపడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ ఏమైనా ధర్మ సత్రమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాపు కులస్తుల్లోనే పేదవాళ్లు లేరని.. భారతదేశమే పేద దేశమని, అదే విధంగా అన్ని కులాల్లో పేదవాళ్లు ఉన్నారన్నారు. కాపులకు కోసం ఏదైనా ఎకనామిక్ స్కీమ్ పెడితే ఎలాంటి అభ్యంతరంలేదని తేల్చి చెప్పారు. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మాట్లాడని కృష్ణయ్య ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కళ్యాణ్ నిన్న అన్నారు. -
బీసీ కార్పొరేషన్‌కు నిధులివ్వండి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించ డం లేదని ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తో పాటు ఫెడరేషన్లకు నిధుల కేటాయింపు నిలిచిపో యిందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు ఈ వార్షిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లు, ఫెడరేషన్లకు కూడా ప్రత్యేక నిధులు కేటా యించి విడుదల చేయాలన్నారు. ఈ నిధులు విడుదలయితేనే స్వయం ఉపాధి పథకాలు ముందుకు సాగుతాయని ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గతేడాది వరకు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. నిధులు విడుదల కాలేదన్నారు. కార్పొ రేషన్లు, ఫెడరేషన్ల ఖాతాల్లోని మిగులు నిధులను సైతం ప్రభుత్వం ఇతర కార్యక్ర మాలకు వినియోగించిందన్నారు. ఫలితం గా సంస్థలు నిర్వీర్యమయ్యే దుస్థితికి వచ్చాయన్నారు. -
రిటైర్ అయినా కొనసాగిస్తారా..!
సీఎం కేసీఆర్‌కు ఆర్.కృష్ణయ్య లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్ అయిన వారిని ఇంకా కొనసాగించడం ఏంటని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. పది జిల్లాలకే సరిపోని ఉద్యోగులు, కొత్తగా నియామకాలు చేపట్టకుండా 31 జిల్లాలను ఎలా పరిపాలిస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల వరకు ఖాళీలున్నాయి. ఉద్యోగులు లేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రిటైర్ అయిన వారిని ఓఎస్డీలు, ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు 2 వేల మందిని నియమించుకున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక రోడ్ల మీద తిరుగుతున్నారని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారిని కొనసాగిస్తే బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బలహీనపడుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయకపోతే పరిపాలన అస్తవ్యస్తమై రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని, రిటైర్ అయిన వారిని వెంటనే తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. -
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి. హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థలో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 50 శాతానికి పెంచాలని సూచించారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలన్నారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని ఈ నెల 21న హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. -
బీసీ బిల్లుపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
సీఎం కేసీఆర్‌కు ఆర్.కృష్ణయ్య వినతి సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలన్న ప్రధాన డిమాండ్ సాధనకు అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ను ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో డా.ర్యాగ అరుణ్, గుజ్జకృష్ణ, ఎర్రసత్యనారాయణ, నీల వెంకటేష్, కృష్ణుడు, నర్సింహాగౌడ్, భార్గవ్, తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మెస్ చార్జీలు, స్కాలర్షిప్లను పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీ ఫెడరేషన్లు రద్దు చేశారా?
ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని 9 బీసీ ఫెడ రేషన్లతోపాటు బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. ఫెడరేషన్లు ఉన్నట్టా, రద్దయినట్లా’ అని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో మాట్లాడారు. భారీగా రాను న్న ఉద్యోగ ప్రకటనలను దృష్టిలో పెట్టు కుని బీసీ స్టడీ సర్కిల్‌కు కేటాయింపులను రూ.14 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరారు. మార్క్సిస్టులు అంటే సమానత్వాన్ని కోరేవారని, తాము గులాబీ మార్క్సిస్టులమని టీఆర్ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఎస్టీల్లో కొత్త కులాలు చేర్చవద్దని, ఇప్పటికే కోయ, లం బాడీలు తన్నుకుచస్తున్నారని సీపీఎం సభ్యు డు సున్నం రాజయ్య పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. గిరి జనులకు ఒక్క అంగుళం కూడా భూ పంపి ణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ భూము లు దురాక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ ఆరోపించారు. -
సైన్యం లేని సైన్యాధిపతిలా విద్యామంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిస్థితి సైన్యంలేని సైన్యాధిపతి మాదిరిగా తయా రైందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో 70 శాతం టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికే 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మూడేళ్లలో నియామక ప్రక్రియను చేపట్టక పోవడంతో టీచర్‌పోస్టుల ఖాళీలు 40 వేలకు చేరాయన్నారు. బోధనా సిబ్బందితో పాటు బోధ నేతర పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. సర్కారు బడుల్లోనూ అడ్మిషన్ వయసును తగ్గించండి: గాదరి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్‌కు వయసు ఒకే విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు మూడవ ఏటనే అడ్మిషన్ కల్పిస్తుండటం వలన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌కు ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల వయసును మూడేళ్లకు తగ్గించాలన్నారు. ఇంగ్లిష్ మీడియం ఓరియెంటేషన్ పెరగాలి: జలగం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఓరియెంటేషన్ పెరగాలని ఎమ్మెల్యే జలగం వెంకటరావు సూచించారు. కేజీబీవీల్లో బెంచీలు, మంచాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని, ఇన్‌చార్జ్‌ల స్థానంలో రెగ్యులర్ ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
పదివేలకోట్లు కేటాయించండి
ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య, ర్యాగ అరుణ, జె. శ్రీనివాస్‌గౌడ్, వై సత్యనారాయణ, గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్ లతో కూడిన బృందం మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నిల మేనిఫెస్టోలో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌ను రూ. 150 కోట్లకు పెంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా కృషి చేయాలన్నారు. కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకొనే వారి పారితోషికంతో పాటు కల్యాణలక్ష్మి పథకం మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలని వివరించారు. దీనిపై సీఎంతో చర్చించి బడ్జెట్లో నిధులు పెంచుతామని ఆర్థిక మంత్రి ఈటల హామీ ఇచ్చారని బీసీ నేతలు పేర్కొన్నారు. -
దేవెగౌడతో ఆర్.కృష్ణయ్య భేటీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడతో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీలను నామినేటెడ్ సభ్యులుగా నియమించేందుకు రాజ్యాంగ సవరణ చేసి 20 శాతం అదనపు సీట్లను సృష్టించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో కృష్ణయ్య సుదీర్ఘంగా చర్చించారు. -
పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం బీసీ ఉద్యో గులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలపునిచ్చారు. బీసీ సంక్షేమ భవన్లో బుధవారం జరిగిన బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యోగులు ఐదు లక్షలకు పైగా ఉన్నారని, వారందరూ ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యపర్చాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, నిరంజన్, లక్ష్మినారాయణ, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'నయీమ్ కేసులో సాక్షిగానే పిలిచారు'
-
ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించిన సిట్
► నయీమ్ కేసులో దాదాపు గంటపాటు విచారించిన అధికారులు ► సాక్షిగానే పిలిచారన్న ఆర్.కృష్ణయ్య ► ఈ కేసులో ఓ రాజకీయ నేతను విచారణకు పిలవడం ఇదే తొలిసారి సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించి కేసులో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను సిట్ విచారించింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ కు కృష్ణయ్యను పిలిపించిన అధికారులు.. దాదాపు 55 నిమిషాల పాటు ఆయనను ప్రశ్నించారు. నయీమ్‌తో సంబంధాలపై ఆరా తీశారు. అయితే నయీమ్ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ సహా ఎంతో మంది రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినా.. పోలీసులు ఎవరినీ పిలిపించిన దాఖలాలు లేవు. ఈ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేతను పిలిచి ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తు వేగవంతం: నయీమ్ కేసు చార్జిషీట్ దాఖలుకు సమయం సమీపిస్తుండటంతో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. నిబంధనల ప్రకారం ఈ నెల ఎనిమిదిన చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో నయీమ్‌తో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న వారిని నేరుగా పిలిచి, విచారించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే బుధవారం ఆర్.కృష్ణయ్యను నార్సింగి పోలీస్‌స్టేషన్ కు పిలిపించింది. అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఏసీపీ జయ్పాల్లతో కూడిన సిట్ బృందం దాదాపు 55 నిమిషాల పాటు ప్రశ్నించింది. అయితే కృష్ణయ్య కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. నయీమ్ తనకు తెలుసని, తనను గురువుగా భావించేవాడని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను ప్రజా నాయకుడినని, వివిధ పనుల కోసం తన వద్దకు ఎంతో మంది వస్తుంటారని.. అలాగే నయీమ్ కూడా వచ్చాడని కృష్ణయ్య చెప్పినట్లు తెలిసింది. నయీమ్‌తో దందాలు చేసినట్టు ఆధారాలేమైనా ఉంటే తనకు నోటీసులిచ్చి, ప్రశ్నించాలని పేర్కొన్నట్లు తెలిసింది. సాక్షిగానే పిలిచారు: ఆర్.కృష్ణయ్య నయీమ్ కేసు విషయంలో తనను పోలీసులు సాక్షిగానే పిలిచారని విచారణ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాకు చెప్పారు. పోలీసులు తనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, కేవలం ఫోన్ సమాచారంతోనే వచ్చానని తెలిపారు. తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు అడిగారని, తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పానని పేర్కొన్నారు. పోలీసులు తనను అడిగిన ప్రశ్నల కంటే... తానే పోలీసులను ఎక్కువ ప్రశ్నలు అడిగానన్నారు. నయీమ్ ఎదురులేకుండా అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్న సమయంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ ఏం చేసిందని నిలదీశానని చెప్పారు. -
'ప్రచారం కోసమే కేసులోకి లాగారు'
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం నేర కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వం ప్రచారం కోసమే తనను ఈ కేసులోకి లాగిందన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పత్రికల్లో తాను మాట్లాడిన అంశాలపైనే తనను పోలీసులు పశ్నించినట్టు చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, మౌఖికంగా రమ్మంటే వచ్చానని వెల్లడించారు. నయీం తన శిష్యుడని చేసిన వ్యాఖ్యల గురించి అడిగారని తెలిపారు. తాను ప్రజాసమస్యలపైనే పోరాడుడుతున్నానని, రోజూ వందలాది మంది కలుస్తుంటానని చెప్పారు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రశ్నించవచ్చని అన్నారు. తదుపరి విచారణకు రావాల్సిందిగా తనకేమీ చెప్పలేదని కృష్ణయ్య తెలిపారు. -
'ప్రచారం కోసమే కేసులోకి లాగారు'
-
ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించిన పోలీసులు
-
ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించిన పోలీసులు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను పోలీసులు బుధవారం విచారించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి ప్రశ్నించారు. గంటపాటు విచారణ కొనసాగింది. మాదాపూర్ భూమి వివాదం సెటిల్ మెంట్ పై ప్రశ్నించినట్టు సమాచారం. నయీం తనకు తెలుసునని గతంలో కృష్ణయ్య చెప్పారు. తనను నయీం గురువుగా భావించేవాడని, అతడి దందాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నయీమ్‌తో సంబంధాలున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణయ్య అప్పట్లో స్పందించారు. ‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని ఆర్.కృష్ణయ్య అన్నారు. -
రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు
కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తాం: ఆర్. కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబాటుకు గురైన వర్గాలే రిజర్వేషన్లకు అర్హులని తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఈ విషయాన్ని జాతీయ కమిషన్లు కూడా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ అర్థరహితమని, వారిని చేరిస్తే స్వాతంత్య్రానికి పూర్వం నుంచి వెనుకబాటుకు గురైన కులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ఈ ఆందోళనలకు భారీఎత్తున బీసీలు తరలివస్తున్నట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
మంత్రి ఈటలకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరింది. శనివారం సచివాల యంలో సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, తెలంగాణ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంత్రిని కలసి పలు అంశాలపై చర్చించారు. 2015-16 సంవత్సరం వరకు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 3,100 కోట్లకు గానూ, రూ.900 కోట్లనే విడుదల చేశారని కృష్ణయ్య తెలిపారు. బీసీ కార్పొరేషన్, 11 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా రుణాల కోసం 39వేల మంది ఎంపికైనప్పటికీ, ప్రభుత్వం పైసా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో 500 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు గానూ, 50 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఒక్కటీ మంజూరు కాలేదని అన్నారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రుణాలకు నిధుల విడుదలకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ కింద ఈ విడత 2 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో బీసీ నాయకులు బోర సుభాష్, శ్రీనివాస్, గూడూరు భాస్కర్ పాల్గొన్నారు. -
ప్రైవేటు సంస్థల్లో బీసీలకు శిక్షణ ఇప్పించాలి
సివిల్స్‌పై మంత్రి జోగు రామన్నకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య వినతి సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వెయ్యిమంది బీసీ అభ్యర్థులకు పేరు పొందిన ప్రైవేట్ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సచివాలయంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే రాష్ర్టంలోని 12 బీసీ కులాల ఫెడరేషన్లు గ్రూపు రుణాలు కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. కాగా, బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలని బీసీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. -
‘పదివేలు కాదు..1.90 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1.90 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే కేవలం పది వేల పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ‘అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన తర్వాత కూడా ఇంత తక్కువ పోస్టులను భర్తీ చేయడం సరికాదు. ఖాళీలున్న మొత్తం లక్షా 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేస్తూ ఆర్. కృష్ణయ్య మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. గడిచిన 25 నెలల్లో ప్రభుత్వ పరంగా ఒక గ్రూప్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడాన్ని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న కారణంగా సిబ్బంది కొరతతో ఫైళ్లు కదలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలలో ఒక్కొక్క వార్డెన్ మూడు నాలుగు హాస్టళ్లకు ఇంచార్జీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక వార్డెన్ ఒక హాస్టల్‌ను నిర్వహించడమే కష్టమని, అలాంటిది నాలుగు హాస్టళ్లను ఎలా పర్యవేక్షించగలరని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భతి చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. శాఖల వారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను లెక్కగట్టేందుకు డెరైక్టు ఐఏఎస్ అధికారితో ఒక కమిటీ ఏర్పాటు చేసి, లోతుగా పరిశీలించి ఖాళీలను గుర్తించడంతో పాటు వాటిని త్వరితగతిన భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి సూచించారు. -
ఐక్యతతో రాజ్యాధికారం సాధిద్దాం
బీసీలకు ఆర్.కృష్ణయ్య పిలుపు ఆదోని: ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకుందామని బీసీలకు ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో బీసీ యువగర్జన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతలో ముస్లింలను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీల్లోని ప్రతి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి కనీసం ఒక నాయకుడైనా ఎదగాలని కోరారు. ఎన్నికల ముందు తాను కేసీఆర్‌ను, చంద్రబాబు నాయుడును బీసీలకు కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరగా ఇందుకు తాము సమ్మతమేనని, అయితే బీసీలు ఓట్లేస్తారా అని ఎదురు ప్రశ్న వేశారని అన్నారు. బీసీల బలహీనత ఏమిటో నాయకులకు తెలియడం వల్లే రాజ్యాధికారంలో భాగస్వాములు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ మంజూరు చేయాలి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు.. ఆ సదుపాయాలను బీసీలకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. బీసీలకు సబ్‌ప్లాన్ మంజూరు చేసి 80శాతం సబ్సిడీతో రుణ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన కోసం వెంటనే ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం వద్ద జనాభా లెక్కలు లేకపోవడంతో కొన్ని వర్గాలు బాగా నష్టపోతున్నాయని విశ్లేషించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ, ఏపీ సీఎంలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అంతకు ముందు గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కృష్ణమ్మ, ఎలిగే పాండురంగారావు, కర్రి వేణుమాధవ్, పద్మజనాయుడు, దేవేంద్రప్ప, రామాంజనేయులు, ఉమామహేశ్వర్ తదితరులు ప్రసంగించారు. ఆదోని డివిజన్ బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దస్తగిరి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయాచారి, కునిగిరి నీలకంఠ, కునిగిరి నాగరాజు, గుడిసె శ్రీరాములు, చెన్నబసప్ప, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి కాలం చెల్లిందని, అందుకే దళితుల మధ్య అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇక్కడి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 66 ఏళ్లుగా దేశంలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలవుతోందని, దాని వల్ల దళితుల మధ్య ఐక్యత లోపించి అంతరాలు పెరిగాయని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలు మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తూ వెనకబడిన కులాలను, ఉపకులాలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనక్కి నెట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంతరం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోందన్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలకే మేలు జరుగుతోందని, మిగిలిన కులాలు వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని 1965లో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన లోకుర్ కమిషన్ పేర్కొందని చెప్పారు. 1996లో ఏపీలో నియమించిన రామచంద్రరావ్ కమిషన్, 2001లో యూపీ ప్రభుత్వం నియమించిన హుకుంసింగ్ కమిషన్, 2007లో కేంద్రం నియమించిన ఉషా మెహ్రా కమిషన్లు ఇచ్చిన నివేదికలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. అసమానతలు తొలగి, ఘర్షణ వాతావరణం పోవాలంటే నూతన రిజర్వేషన్ విధానం రావాల్సిందేనని, దళితుల్లోని ప్రతి కులానికీ రిజర్వేషన్ ఫలాలు అందేలా వర్గీకరణ ఉండాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదు: కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన హాజరై మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రులు ఏమాత్రం సమయం దొరికినా కాంట్రాక్టర్లను కలుస్తున్నారని, కానీ ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ముందుగా జంతర్ మంతర్ వచ్చేవారన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైనదని, బీసీల్లో ఉన్నట్టుగా ఎస్సీల్లో ఏబీసీడీ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీక్షలో మందకృష్ణ మాదిగతో పాటు మహిళా సంఘం నేతలు జెరిపోతుల లత, చవటపల్లి విజయ, సత్తెక్క, వినోద, శ్రీరాంరాజమ్మ, నక్షత్ర, గంగమ్మ, రేణుకాదేవి, మాదురి, శోభ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు బీసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేతలు లక్ష్మణ్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా చట్టం చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు. జనాభాలో 50%కి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేస్తామని లక్ష్మణ్ వారికి హామీనిచ్చారు. లక్ష్మణ్‌ను కలసిన వారిలో ఆర్.కృష్ణయ్యతోపాటు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్, కుందారపు గణేశాచారి ఉన్నారు. -
'చంద్రబాబుకు గోరీ కడతాం'
హైదరాబాద్: కాపులను బీసీల్లో కలిపితే చూస్తూ ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే చంద్రబాబుకు గోరీ కడతామన్నారు. -
‘పునర్వ్యవస్థీకరణలో అవమానించారు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణలో సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారని 12 బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. తలసాని వద్దనున్న వాణిజ్య పన్నుల శాఖను ఎందుకు తొలగించారని ప్రశ్నించా యి. బీసీలకు పశుసంవర్థక, చేపలు, వల లు నేసే శాఖలిచ్చి అవమానిస్తారా అని నిలదీశాయి. ఈ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమించాల్సి వస్తుందని ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సం ఘం), గుజ్జకృష్ణ(బీసీ ప్రజా సమితి), ఎస్.దుర్గాగౌడ్ (బీసీ సమాఖ్య), నీల వెంకటేశ్ (బీసీ కులాల ఐక్యవేదిక), చంద్రమౌళి (బీసీ సంఘర్షణ సమితి), జి.మల్లేశ్ యాదవ్(బీసీ ఫ్రంట్), శారద బీసీ మహి ళా సంఘం), కె.నిరంజన్(బీసీ ఉద్యోగుల సంఘం), ఎ.పాండు (బీసీ సేన), సి.రాజేందర్ (బీసీ హక్కుల పోరాట సమితి), కె.నటరాజ్ (న్యాయవాదుల సంఘం) ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
'విశ్వనగరానికి నిర్దిష్ట ప్రణాళిక ఏదీ?'
- బడ్జెట్ పై పెదవి విరిచిన టీడీపీ నేత ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రశేఖర్‌రావు బడ్జెట్లో సరియైన కేటాయింపులు చేయలేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ బడ్జెట్‌పై సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మిస్తామని చెప్పడం కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. 125గజాల స్థలాల్లోనే డబుల్బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అపార్టుమెంట్లు నిర్మించడం వల్ల డ్రైనేజీ, మంచినీటి, సామాజిక సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. మెట్రోరైల్‌ను శివారు ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని అన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ కేవలం ముఖ్యమంత్రి కమిషన్ల బడ్జెట్‌గానే ఉందని వ్యాఖ్యానించారు. -
లక్ష మందితో చలో అసెంబ్లీ: ఆర్ కృష్ణయ్య
త్వరలో లక్షమంది నిరుద్యోగులతో ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొత్త బంగళాలు నిర్మించుకోవడం కాకుండా ముందు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిరుద్యోగ బహిరంగ సభలో కృష్ణయ్య పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, అధికారం చేపట్టి 21నెలలు గడచినా హామీల జాడ లేదన్నారు. 43వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలకు లబ్థి చేకూర్చే వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.42వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ను దారాధత్తం చేశారని మండిపడ్డారు. 14లక్షల విద్యార్థుల ఫీజులు, స్కాలర్ షిప్పులకు రూ.1,600 కోట్లు బడ్జెట్ లేదంటున్నారని... కానీ, ముగ్గురు కాంట్రాక్టర్లకు రూ.42వేల కోట్లు ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
కాసీంపై రాజద్రోహ నేరాన్ని వెంటనే ఎత్తేయ్యాలి
తెలంగాణ ఏర్పడ్డాక కూడా బడుగులపైనే రాజ్యద్రోహం కేసులు పెడతారా అని బీసీసంక్షేమసంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ ప్రశ్నించారు.. ప్రజాస్వామ్య పరిధిలో యూనివర్శిటీలో ఆచార్యుడిగా ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సామాజిక అసమానతలపై రచనలు చేస్తూ 'నడుస్తున్న తెలంగాణ' పత్రికను నడుపుతున్న కాసీంపై ప్రభుత్వం పెట్టిన రాజ్యద్రోహం కేసును వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురైన బడుగులు, బలహీనవర్గాల వారిని ఆదుకోవాల్సింది పోయి.. నక్సలైట్లతో సంబంధాలున్నాయని రాజద్రోహం కేసును పెట్టడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలుచేస్తామన్న సీఎం కేసీఆర్, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. కాసీం అడవుల్లో అజ్ఞాతంగా ఉండడం లేదని, తుపాకి పట్టలేదని అటువంటి వారిపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ అక్రమకేసును వెంటనే ఎత్తేయక పోతే తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
'ఎంపీలను రాళ్లతో కొడతాం'
మహబూబ్ నగర్: బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో మాట్లాడని ఎంపీలపై మిలిటెంట్ దాడులకు సైతం వెనకాడబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. బీసీల సమస్యలపై పని చేసేందుకు త్వరలో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 'పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్‌పై మాట్లాడని ఇరు రాష్ట్రాల ఎంపీలను రాళ్లతో కొడతాం. 1993 నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు బీసీ క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించి, వెనుకడుగు వేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం నిరంకుశంగా క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలోని బీసీలకు వాటర్‌గ్రిడ్ వద్దని, ఉద్యోగాలు కావాలని, జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. -
‘ఎస్సీ’ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తాం: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టకుంటే తామే ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. మాదిగల న్యాయమైన డిమాండ్‌కు సీపీఐ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు. బీసీల్లో గ్రూపులు ఉన్నట్లుగానే ఎస్సీలో కూడా ఏ, బీ, సీ, డీ గ్రూపులను విభజించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
జనవరి-2015 జాబితాతోనే ఎన్నికలు
ఈసీకి బీజేపీ, టీడీపీ ప్రతినిధుల వినతి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించి జనవరి-2015లో ప్రచురించిన ఓటర్ల జాబితానే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వినియోగించాలని బీజేపీ, టీడీపీ ప్రతినిధి బృందం కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నదీం జైదీకి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. అనంతరం బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడారు. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా టీఆర్ఎస్ చేస్తున్న అవకతవకలను కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించాం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం తయారు చేసిన జాబితానే స్థానిక సంస్థల ఎన్నికలకు వినియోగించాలి. కానీ ‘గ్రేటర్’లో 6,90,000 ఓట్లు తీసేశారు. 19 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారు. వరంగల్లు ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాలనే జీహెచ్ఎంసీకి వినియోగించాలి. జనవరి-2015లో ప్రచురించిన తుది జాబితా, సెప్టెంబరు వరకు ఉన్న మార్పులు, చేర్పులతో కలిపి ఉన్న జాబితాను వినియోగించాలని కోరాం. పటాన్చెరువు నియోజకవర్గం ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు రెండున్నరేళ్లు శిక్ష విధించినందున ఆయన ఎమ్మెల్యే పదవికి అర్హత కోల్పోతారు. అందువల్ల ఆయనను త్వరగా అనర్హుడిని చేసి నారాయణఖేడ్‌తో పాటు దీనికి ఎన్నికలు నిర్వహించాలని కోరాం’ అని పేర్కొన్నారు. కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టారు: ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశాం. బీసీ ఓటర్ల లెక్కల్లో అవకతవకలకు పాల్పడ్డారు. ఏ డివిజన్లో ఎక్కువగా బీసీలు ఉంటే ఆ డివిజన్లో బీసీ రిజర్వేషన్ కేటాయించాలి. అందువల్ల తమకు అనుకూలం గా ఉండేలా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరాం’ అని వివరించారు. ఈ ప్రతినిధి బృందంలో టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, గోపీనాథ్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లుపై అఖిలపక్షం
ఏర్పాటు చేయాలి: కృష్ణయ్య సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36రాజకీయ పార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ బిల్లుపై చర్చించాలని జాతీ య బీసీసంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లపై సోమవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటు, అసెంబ్లీలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 15 శాతం దాటకపోవడం బీసీ వ్యతిరేకచర్యలకు నిదర్శనమన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు అఖిలపక్షంతో ఢిల్లీకి రావాలని డిమాండ్ చేశారు. బీసీ ఎంపీలు బీసీల పక్షాన పోరాటాలు చేయాలని కోరారు. ధర్నాకు వివిధ రాష్ట్రాల నుంచి బీసీ కార్యకర్తలు తరలివచ్చారు. -
ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేదు
♦ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి ♦ 7న చలో అసెంబ్లీకి అన్ని పార్టీల మద్దతు ♦ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్, బీసీలకు బడ్జెట్ కేటాయింపుల పెంపు తదితర అంశాలపై ఈనెల 7న ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారితో బీసీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమానికి తమ వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య(కాంగ్రెస్), వన్నాల శ్రీరాములు(బీజేపీ) మాట్లాడుతూ తమ పార్టీలు 7న చేపట్టే ‘చలో అసెంబ్లీ’కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఇతర నేతలు వకుళాభరణం కృష్ణమోహన్ రావు(కాంగ్రెస్), బొల్లం మల్ల య్య యాదవ్(టీడీపీ), పి. వెంకట్రాములు(సీపీఐ) పాల్గొన్నారు. ఫీజు బకాయిలు సత్వరమే విడుదల చేయాలి... ఫీజు బకాయిలు గత ఏడాది రూ.1800 కోట్లు, ఈ ఏడాదికి రూ.25 వేల కోట్లను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లక్ష మంది విద్యార్థులతో సీఎం ఇంటి ముట్టడి చేపడుతామని హెచ్చరించారు. బీసీలకు సబ్‌ప్లాన్ పెట్టాలని, కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. -
'ఈ నెల 7న అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్: బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 7న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు కేంద్రంపై రాష్ట్రప్రభుత్వాలు ఒత్తిడి తేవాలని ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీలకు 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. బీసీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని విమర్శించారు. అందుకే అక్టోబర్ 7న అసెంబ్లీని ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య చెప్పారు. -
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
నిరుద్యోగ గర్జన సభలో ఆర్. కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బి.సి.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బి.సి.యువజన సంఘాలు, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో జరిగిన రాష్ట్రస్థాయి నిరుద్యోగ గర్జనసభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మొక్కుబడిగా 1,055 ఇంజనీరింగ్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు లేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగులు లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఖాళీలను వెంటనే భర్తీచేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాగాయకురాలు విమలక్క మాట్లాడుతూ సమర్థులైన యువ అధికారులు పాలనాయంత్రాంగంలో పాలు పంచుకున్నప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిరుద్యోగులు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా తాను ముందుంటానన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బి.సి.సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు నర్రి స్వామి, రమేష్, శ్రీనివాస్, జి.రాంబాబు, అశోక్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి
పది జిల్లాల పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: జనాభాలో 52శాతం ఉన్న వెనుకబడిన తరగతులవారు పారిశ్రామికరంగంలో 5 శాతం కూడా లేకపోవడం విచారకరమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆవేద న వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని కోరారు. యాంత్రికత రాకముందు మానవజాతికి ఉపయోగపడే అన్ని పరిశ్రమలు బీసీ కులాల చేతుల్లోనే ఉండేవని, ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ కార్పొరేట్‌శక్తులు, ఉన్నతకులాల చేతుల్లోకి వెళ్లాయన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రెండు వేల ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఇండస్ట్రియల్ సమాఖ్య చైర్మన్ మర్రి ప్రభాకర్‌రావు, సమన్వయకర్త, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, కో-కన్వీనర్లు మన్యం సునీల్‌కుమార్ ముదిరాజ్, కె.గణేశ్‌బాబు, ఎం.లక్ష్మి, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థ్ధుల తడాఖా చూపిస్తాం
నల్లగొండ రూరల్ : విద్యార్థుల తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో బీసీ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన ధర్నాకు హాజరై మాట్లాడారు. వారం, పది రోజుల్లో ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాల ర్షిప్ల బకాయిలు విడుదల చేయకపోతే జిల్లాలో మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లను ఒకేసారి విడుదల చేయాలని, విడతల వారీగా మంజూరు కావడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పేద విద్యార్ధులను విద్యకు దూరంలో చేయాలని ఉద్దేశ్యంతో బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఫీజులు విడుదల అయ్యేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ధనికరాష్ట్రమని అంటున్న సీఎం రూ. 1900 కోట్లను విడుదల చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దొర పొకడను మానుకోవాలని హితవు పలికారు. ఇంటర్ విద్యార్ధులకు కూడా కాస్మోటిక్ బిల్లులు కూడ ఇవ్వాలని అన్నారు. సొంత హాస్టల్ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అందరం కలిసి పోరాటాల వలనే చీప్ లిక్కర్ అమలును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అన్నారు. లేకుంటే కలెక్టరేట్ లాంటి ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఓయు విద్యార్థులు ఉద్యోగాలు అడిగితే సీఎం హేళనగా మాట్లాడరని, విద్యార్ధులంతా ఐక్యంగా వుంటే ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతు దొరల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జింజే సింహంలా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విమానాల్లో తిరిగేందుకు కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న సీఎం పేద విద్యార్ధుల విద్యకు అవసరమయ్యే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడం అణగారిన వర్గాల విద్యార్ధుల పట్ల సీఎంకు వున్న ప్రేమ స్పష్టమైందన్నారు. విద్యార్ధులు ఎవ్వరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏదైనా ఇబ్బంది వుంటే పోలీసుల టోల్ఫ్రీం నెంబర్‌కు ఫోన్‌చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు ఆశయాలు, నెరవెర్చేందుకు బ్రతికి వుండి పోరాడాలని కోరారు. ఇంటర్ విద్యార్ధి భవాని మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అంతకు ముందు బీసీ కళామండలి కన్వీనర్ రామలింగం ఆధ్వర్యంలో ఆటపాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గండిచెరువు వెంకన్న, నీలం వెంకటేశ్వర్లు, వైద్యుల సత్యనారాయణ, దుడుకు లక్ష్మినారాయణ, చంద్రశేఖర్‌గౌడ్ ,బాబ్జీ, రూక్నగౌడ్, రమేష్, మల్లిఖార్జున్, సంజీవ, శ్రవణ్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
బీసీల వెలుగురేఖ ‘బీపీ మండల్’
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం, వెనుకబాటుతనం నుంచి సమాజంలో వారిని భాగస్వాములను చేసే ప్రయత్నంలో బి.పి. మండల్ ( బిందేశ్వరిప్రసాద్ మండల్) చేసిన కృషి మరవలేనిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. మండల్ కమిషన్‌లోని 40 సిఫారసులను పూర్తిగా అమలులోకి తెచ్చి బీసీల సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బి.పి. మండల్ 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టులోని కేవలం రెండు సిఫార్సులు మాత్రమే ప్రభుత్వం అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లయినా మిగిలిన సిఫార్సులు అమల్లోకి రాకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అన్నారు. బీసీలకు చట్ట సభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ తన సిఫార్సులలో వీటిని ప్రధానంగా సూచించినా.. అవి ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కులాల వారీగా బీసీల లెక్కలను తీసి, శాస్త్రీయంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ, కులాలవారీ లెక్కలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడం దురదృష్టకరమన్నారు. వెంటనే కులాల వారీగా లెక్కలను ప్రకటించి, బీసీల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన ప్రభుత్వాలన్నీ బీసీలకు రిజర్వేషన్లు నిరాకరిస్తూ వచ్చాయని, జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్ల కోసం కృషి జరిగిందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే బి.పి. మండల్‌తో మండల్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం బీసీల సమస్యలపై పోరాడేందుకు బీసీ ఉద్యమ వేదిక పేరు తో మరో సంస్థ ఆవిర్భవించింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బీపీ మండల్ జయంతి వేడుకల్లో వేదికను ప్రారంభించారు. బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వీజీఆర్ నారగోని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నాయకులు డాక్టర్ వినయ్‌కుమార్, జైహింద్ గౌడ్, బీసీ సంక్షేమసంఘం మహిళా అధ్యక్షురాలు డా.శారదగౌడ్, ప్రొ.అఖిలేశ్వరి, మేకపోతుల నరేశ్ తదితరులు ప్రసంగించారు. బీసీల రాజ్యాధికారం కోసం మండల్ స్ఫూర్తితో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. -
తెలంగాణ ఉద్యమంలా.. బీసీ ఉద్యమం సాగాలి
గ్రామ స్థాయి నుంచి ఉప్పెనగా ఎగిసి పడాలి రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హన్మకొండ : ప్రత్యేక తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఉద్యమం చేశామో.. అదే విధంగా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుదవారం హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీలో జరిగిన బీసీల సమరభేరి మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీల్లో ఆలోచన విధానం మారితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్యాధికారం రావాలంటే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నారు. ఈ దిశగా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు బయటకు వచ్చి సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషనులున్నాయి. బీసీ ప్రధాన మంత్రి ఉన్నారని.. ఇప్పుడు పోరాడితేనే చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. తెలంగాణలో 119 ఎమ్మెల్లే స్థానాల్లో కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఒక్కరూ కూడాలేరన్నారు. 28 రాష్ట్రాలుంటే 15 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేరన్నారు. అమెరికాలాంటి అగ్రదేశంలో బరాక్ ఓబామా అధ్యక్షుడయ్యారని, స్వాతంత్య్రం వచ్చిన 69 ఏళ్లలో ఒక్కరు కూడా సీఎం కాలేదన్నారు. బీసీ కులాల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. బీసీ ఉద్యోగాలు పదోన్నతులు కల్పించాలని కోరారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.50 కోట్లు కేటాయించాలన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను జాతీయ స్థాయిలో అమ లు చేయాలని, బీసీ ఎస్సీ,ఎస్టీలకు ప్రైవేటు రంగం లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వకులాభరం కృష్ణమోహన్, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శులు తాళ్ళ సంపత్‌కుమార్, బొమ్మగాని వినోద్‌కుమార్, ప్రజా సంఘాల నాయకులు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య, మొలుగూరు బిక్షపతి, సంజీవరావు, పెద్ది వెంకటనారాయణ, శారదదాదేవి, దాంపల్లి శ్రీనివాస్ నగపమురి పవన్ మామిడి శెడ్డి నాగరాజు, కిశోర్ సందీప్, రామకృష్ణ, చంద్రమౌళి, యాదగిరి, గిరిబోయిన రాజయ్య యాదవ్ పాల్గొన్నారు. తీర్మానాలు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి , చట్ట సభలలో బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. పంచాయతీరాజ్ సంస్ధలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి.ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.కేంద్ర విద్యా , ఉద్యోగ రిజర్వేషన్లనపు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.ఏటా రూ.50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పించాలి. ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలి. కేంద్రంలో బీసీలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ ఫీజుల రీయింబర్సమెంట్ యంబర్స్మెంటు స్కీమ్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్ధలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం కోర్సులు చదివే బీసీ విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు భరించాలి.కేంద్ర స్థాయిలో లక్ష కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులు ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ బడ్జెట్ ఏటారూ. 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు.కులాల,వర్గాల ప్రమేయం లేకుండా రహస్య పద్దతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఇవీ డిమాండ్లు తెలంగాణ బడ్జెటులో బీసీల సంక్షేమానికి రూ. 20 వేల కోట్లు కేటాయించాలి. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలి.{పతి బీసీ కులాల ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్‌కు రూ.వేయి కోట్లు కేటాయించాలి. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత సంవత్సరం మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలి. కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింప చేయాలి -
రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య
నల్లగొండ టౌన్: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా బీసీ కులాలన్నీ ఐక్యం గా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీలను జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుంటే మనమే ఒక పార్టీని పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని కోరారు. పార్లమెంట్లో బీసీ బిల్లును పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలకు బీసీలు కేవలం 12 మంది మాత్రమే ఉండడం దారుణమన్నారు. 107 కులాలు నేటికీ అసెంబ్లీ గేటును దాటకపోవడం శోచనీయన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ కృష్ణమోహన్, నీలం వెంకటేశ్ మాట్లాడారు. -
'బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ'
హైదరాబాద్: వెనుకబడిన తరగతి (బీసీ)కి చెందిన కులాలను రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అవసరాల కోసం ఉపయోగించుకుని, ఆ తరువాత మొండి చేయి చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్ బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'టీఆర్ఎస్ నేతలు ముదురు బేబీస్'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటయిందని, తాము అధికారంలోకి వచ్చి ఏడాదే అవుతోందని చెబుతున్న అధికార టీఆర్ఎస్ నేతలు "వన్ ఇయర్ బేబీస్ కాదని.. ముదురు బేబీస్" అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పార్టీల్లో పనిచేసి పలు పదవులు అనుభవించిన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు పసిగుడ్డులా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వరంలో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ నిరుద్యోగులకు, తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ కోసం కొట్లాడిన యువకులకు ఉద్యోగాలివ్వరా అని ప్రశ్నించారు. మాట తప్పడంలో, మోసం చేయడంలో కేసీఆర్ మించిన మొనగాడు లేడని, సీఎం అయిన తర్వాత కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్న ఆయన గురించి మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డువస్తోందని అన్నారు. 'ఖబడ్డార్.. రాష్ట్రం నీ జాగీరా.. వెంటనే డీఎస్సీ ప్రకటించి తెలంగాణలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పే చర్యలు చేపట్టకపోతే మిమ్మల్ని తిరగనీయం.. ' అని ఆర్,కృష్ణయ్య హెచ్చరించారు. -
రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభివృద్ధి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: రాజకీయ రిజర్వేషన్లు లేకుండా బీసీలు ఎదగలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణలో సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం 10 శాతానికి మించి లేకపోవడం వల్లే ఐక్యం కాలేకపోతున్నామన్నారు. రాజకీయ రిజర్వేష్లతోనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందగలరన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీ, దళిత, మైనారిటీలపై ప్రేమ లేదని కేవలం వారి ఓటు బ్యాంకు పట్ల మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణలోనే బహుజనులు ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం సాధించకపోవడం బాధకరమన్నారు. సదస్సులో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ఎమ్మా ర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్లు వచ్చే వరకు ఉద్యమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అలాగే టీచర్ పోస్టులు 25 వేలు, గ్రూప్-1 ఉద్యోగాలు 1,200, గ్రూప్-2 కొలువు లు 2,500, గ్రూప్-4 36 వేలు, ఎస్ఐ పోస్టులు 1,600, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14వేలు ఖాళీగా ఉన్నాయని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏ లెక్కన 25 వేల ఉద్యోగాలు భర్తీచేస్తారని ప్రశ్నించారు. -
ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఆర్. కృష్ణయ్య దూరం!?
హైదరాబాద్: ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పార్టీ విప్ ధిక్కరించారా? ఎమ్మెల్సీ పోలింగ్‌కు దూరంగా ఉండబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయిన టీడీపీకి మరో శరాఘాతమే అవుతుంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీలో కమిటీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతితో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. అయితే బీసీ ఉద్యమనాయకుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన ఓటింగ్‌లో కూడా పాల్గొనబోరనే వార్తలు వినవస్తున్నాయి. ఎమ్మెల్యే కృష్ణయ్య మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునే క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ టీడీపీ విప్ జారీచేసిన సంగతి తెలిసిందే. -
హే కృష్ణయ్యా...
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యే సీఎం!... ఏడాది కిందట ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన ఈ మాటలతో 40 ఏళ్ల బీసీ ఉద్యమాన్ని పక్కనబెట్టి తెలుగుదేశంలో చేరిండు కృష్ణయ్య. ఎల్.బి.నగర్ నుంచి పోటీ కూడా చేసి గెలిచిన ఆయనకు ఎన్నికల తరువాత జ్ఞానం బోధపడింది. ‘సీఎం క్యాండిడేట్‌ను కదా! 15 సీట్లు గెలుచుకున్న పార్టీకి టీడీఎల్పీ లీడర్‌ను నేనే అవుతా’ అనుకున్నాడాయన. అయితే సీను మారిపోయింది. కృష్ణయ్య అసెంబ్లీకి కొత్త. తెలంగాణలో పార్టీ బలపడాలంటే సీనియర్ ఎర్రబెల్లి దయాకర్ రావు బెస్ట్ అనుకున్నడు బాబు. సీఎం క్యాండెట్‌కు లేని అనుభవం శాసనసభలో లీడర్ కావాలంటే అవసరమా అని మధనపడ్డాడు కృష్ణయ్య. పక్కనబెట్టిన బీసీ ఉద్యమ కాడిని మళ్లీ భుజాన వేసుకున్నాడు. పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాంరాం చెప్పాలనుకున్నాడు. కానీ హోదా, గన్మెన్లు, అలవెన్సులు... వదులుకోవడం ఎందుక నుకున్నాడో లేక చంద్రబాబు వద్దన్నాడో తెలియదు గానీ... పార్టీలనే ఉన్నడు. అయితే పార్టీ మీటింగ్‌లకు రానని తెగేసి చెప్పిండు. నేను ఎమ్మెల్యేగా ఉంట. పార్టీ కార్యక్రమాల కోసం ఇన్చార్జిని పెట్టుకోమని బాబుకు చెప్పిండు. ఎల్బీ నగర్‌కు పార్టీ ఇన్చార్జిగా వేరే నాయకుని పేరు కృష్ణయ్యే చెప్పిండు. మొన్న ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, బాబు బీసీలను మోసం చేస్తున్నారు’ అని ప్రకటించిండు. స్వచ్ఛ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అంటే ... హైదరాబాద్ కోసం సీఎం బాగా పనిచేస్తున్నడు అని కూడా అనౌన్స్ చేసిండు. టీడీపీ ఎమ్మెల్యేవు కదా... అని అంటే... బీసీలే నాకు ముఖ్యం. పార్టీ, ఎమ్మెల్యే పదవులు కాదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నడు. అసలే గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్ఎస్ల చేరుతుంటే ఈ కృష్ణయ్య గొడవేంది ‘బాబూ’ అని తెలంగాణ టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నరు. -
'బీసీలపై బాబు, కేసీఆర్ నిర్లక్ష్యం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పటివరకు 29 సార్లు ఢిల్లీ వచ్చిన ఇరువురు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో మూడు సార్లు భేటీ అయినప్పటికీ బీసీ బిల్లుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. అఖిలపక్షాలతో ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాకుంటే బాబు, కేసీఆర్‌లకు బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసినా కేంద్రంపై తగిన ఒత్తిడి తేలేకపోతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 542 మంది ఎంపీల్లో బీసీ ఎంపీలు 270 మందికిగాను 115 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఏపీలోని 25 మంది ఎంపీలకుగాను ముగ్గురు, తెలంగాణలో 17 మంది ఎంపీలకుగాను ఇద్దరు బీసీ ఎంపీలే ఉన్నారని వివరించారు. అస్సాంలోని బోడో, రాజస్థాన్‌లోని గుజ్జర్, శ్రీలంకలోని తమిళ ఈలం పోరాటాలను చూసి నేర్చుకోవాలని బీసీలకు పిలుపునిచ్చారు. నేను 25 ఏళ్ల యువకుడినైతే ఏకే 47 పట్టుకుని బీసీల కోసం పోరాడేవాడినని కృష్ణయ్య అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, రూ.50 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర పభుత్వాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్ రాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కెసన శంకర్రావు, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావుతోపాటు కర్ణాటక, తమిళనాడు, యూపీ నుంచి బీసీ కార్యకర్తలు తరలివచ్చారు. -
‘సర్పంచులది ఆత్మగౌరవ పోరాటం’
హైదరాబాద్: సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ర్ట పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రభాకర్, కృష్ణయ్యలు మాట్లాడుతూ సర్పంచులకు కనీస గౌరవ వేతనం రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలని, ఆదాయంలో 42 శాతం పంచాయతీలకు కేటాయించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ చెక్‌పవ ర్ను తీసివేసి, నిధుల వినియోగంలో సర్పంచులకు స్వేచ్చ కల్పించాలని వారు కోరారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
పదిరోజుల్లోగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం: కృష్ణయ్య హైదరాబాద్: రూ.850 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర బంద్, కళాశాలల బహిష్కరణ, తదితర రూపాల్లో ఆందోళన తీవ్రతర ం చేస్తామని హెచ్చరించాయి. ఫీజు బకాయిలు చె ల్లించాలని, ఈ ఏడాది దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, రమ్య, సీపీఐ నేత రాంనర్సింహారావు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉదయం ఆర్.కృష్ణయ్యకు బీసీ హాస్టల్ విద్యార్థి వెంకటేష్ పూలమాల వేసి దీక్షను ప్రారంభించగా, సాయంత్రం పొన్నాల లక్ష్మయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రావాలి: పొన్నాల రాజకీయాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రె డ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరి దీక్షకైనా మద్దతిస్తాం: వైఎస్సార్సీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం ఎవరు దీక్ష చేసినా పార్టీలకతీతంగా తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. -
కలిసి రాకపోతే.. టీడీపీనీ వదిలేది లేదు!
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
-
రిజర్వేషన్‌పై తీర్మానాలు వస్తే పరిశీలిస్తాం
* బీసీ సంఘ నేతలతో కేంద్ర మంత్రులు సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీల నుంచి తీర్మానాలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజికన్యాయ, సాధికారిత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానాలు అందలేదని వారు స్పష్టీకరించారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీల నుంచి కూడా తీర్మానాలు వస్తే రాజకీయంగా బీసీలకు బలం పెరుగుతుందని, ఈ విషయంలో బీసీ సంఘాలే చొరవ తీసుకోవాలని ఆ నేతల బృందానికి మంత్రులు సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, అనంతకుమార్‌లతో సమావేశమయ్యారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం సహా బీసీలకు సంబంధించిన 15 డిమాండ్లను మంత్రులకు కృష్ణయ్య వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారం చేపట్టి ఆరునెలలే అయ్యిందని, దశలవారీగా బీసీల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మిన్‌రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ అనుబంధ సంఘాల నేతలు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వివక్ష మానకపోతే.. బీసీల సత్తా చూపుతాం
బీసీ సంఘం నేత , ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా.. ప్రభుత్వం వివక్ష చూపుతూ ఇబ్బందుల పాలుచేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం ఫీజు బకాయిలు రూ. 1200 కోట్లు ఇంకా చెల్లించలేదని, మరో నాలుగు నెలల్లో ముగిసే ఈ విద్యా సంవత్సరానికి కూడా ఇంకా దరఖాస్తులు తీసుకోలేదని, రెన్యూవల్స్ కూడా ఇవ్వడంలేదని వాపోయారు. బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తే దొరల ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రభుత్వం వారంలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే బీసీల సత్తా ఏమిటో చూపుతామన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, విక్రమ్‌గౌడ్, బీసీ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పాండు, కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఫీజులు చెల్లించకుంటే పరీక్షలు జరగనివ్వం ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ జనవరిలోగా రీయింబర్స్మెంట్ చెల్లింపులు పూర్తిచేయాలని, లేదంటే పరీక్షలు జరగనివ్వబోమని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణ లో మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి, ఆ కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పోస్టులో పంపించారని ఆయన విమర్శించారు. బీసీలంటే అంత అలు సా అని ప్రశ్నించారు. దీనిపై ఇరు ప్రభుత్వాలూ అఖిలపక్షం వేసి, ఢిల్లీకి తీసుకువెళ్లాలని, నేరుగా ప్రధానికి తీర్మాన కాపీలివ్వాలని కోరారు. -
కేంద్రంలో బీసీల గొంతుకనవుతా !
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టీకరణ చట్టసభల్లో,ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధానితో చర్చిస్తా తెలంగాణలో బీసీలకు అన్యాయం ఆర్ కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: దేశంలో వెనుకబడిన తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి షరిష్కారానికి కృషిచేస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శనివారం నిర్వహిం చిన ‘బీసీ ఉద్యోగుల శంఖారావం’లో ఆయన పాల్గొన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లను వర్తింపజేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీకోటపై దండయాత్రకు సిద్ధంగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రద్దుచేసిన పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లను లబ్ధిదారులందరికీ మళ్లీ మంజూరు చేసే వరకు సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని కృష్ణయ్య హెచ్చరించారు. మాజీమంత్రి జె. చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయను ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకూ 3 ఎకరాల భూమి
* బీసీ సంఘాల విస్తృత సమావేశం డిమాండ్ * రూ. 20 వేలకోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చెయ్యాలి * కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి * డిమాండ్ల సాధనకోసం పార్టీలకు అతీతంగా ఒక్కటవ్వాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, రూ.20 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని బీసీ సంక్షేమ, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల విస్తృత భేటీ డిమాండ్ చేసింది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఈ సమావేశం తీర్మానాలను ఆమోదించింది. శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ హోటల్లో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన బీసీ సంఘాల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, రూ.20వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని, బడ్జెట్ కేటాయింపులను రూ.2వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయపార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఏకమై డిమాండ్ల సాధనకు పోరాడాలని, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తిచేశారు. దేశంలోని బీసీలను పాలకపార్టీలు అణచివేస్తున్నాయన్నారు. దేశజనాభాలో 56 శాతమున్న బీసీలకు వారి జనాభాప్రాతిపదికన ఉద్యోగాలు, ప్రమోషన్లు, చట్టసభల్లో ప్రవేశంలో న్యాయం జరగడం లేదన్నారు. ప్రస్తుతం భర్తీచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 14 లక్షల ఉద్యోగాలు, తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 1.5లక్షల ఉద్యోగాల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌చేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, వికలాంగుల రిజర్వేషన్లకు లేని క్రీమీలేయర్‌ను రాజ్యంగ లక్ష్యాలకు భిన్నంగా బీసీలకు మాత్రమే అమలుచేయడం సరికాదన్నారు. క్రీమీలేయర్ నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు. పార్లమెంట్లో బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించాలని, కేంద్రంలో రూ.50 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని, కులవృత్తుల్లో సాంకేతికను పెంచుకుని ఆధునికంగా ఎదిగేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి: జాజుల చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. అసెంబ్లీలో చెప్పిన మేరకు సీఎం కేసీఆర్ వెంటనే బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 10న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్రీమీలేయర్‌ను తొలగించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు విన తిపత్రాలు సమర్పించడం, 14న అన్ని కులసంఘాలతో సమావేశం, 18న కళ్యాణలక్ష్మిని వర్తింపజేయాలన్న డిమాండ్‌పై హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద, అలాగే జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు. జనవరి మొదటివారంలో సభ్యత్వనమోదు, ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీలను చైతన్యపరిచేందుకు ‘మేలుకొలుపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నిరంజన్ (ఆర్టీసీ ఉద్యోగులసంఘం), బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా దారుట్ల కృష్ణుడు (ఆదిలాబాద్), బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సాయికిరణ్‌లను ఎన్నుకున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు. -
అండగా ఉంటాం
విఐపి రిపోర్టర్ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘సాక్షి’ వినూత్నంగా చేపట్టిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమంలో బుధవారం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాల్గొన్నారు. తమ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో పర్యటించి, ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కడ్తాల: బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తిం పజేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ యాక్ట్లాగే బీసీలకు యాక్ట్ ను అమలుచేయాలన్నారు. నిరుపేద బీసీలకు మూడెకరాల భూమిని కేటాయిం చాలన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలోని ఏంబీఏ గార్డెన్లో నిర్వహించిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో బీసీలుగా పుట్టడమే పాపమైం దని, వారిని ఏ రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో 115 మంది బీసీ సభ్యులున్నా మాట్లాడలేని పరిస్థితి నెలకొం దన్నారు. రాజ్యాధికా రం లేని కులాలు బానిసలతో సమానమని, స్వయంపాలన కోసం బీసీలు ఉద్యమించాలని, అవసరమైతే బోడోలు, గుజ్జర్ల తరహా లో ఆందోళనలు కొనసాగించాలని పిలుపుని చ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ లు పారి శ్రామికవేత్త లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లతో నిండిపోయాయని, దీం తో ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పాటుచేసి బడ్జెట్లో రూ.50వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏ ర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ పథకాన్ని అమలుచేయాలన్నారు. ఈ సందర్భం గా మంగల్‌పల్లి గ్రామంలో లైంగికదాడికి గురైన బాలికను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బీసీలంతా సంఘటితంగా ఉద్యమించాలి అంతకుముందు మాజీమంత్రి జే.చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా హక్కులసాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలో ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఆమనగల్లు ఎంపీపీ లలితమ్మ, బీసీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శారద, నా యకులు రామకృష్ణ, ఆంజనేయులు, నర్సింహా, చందోజీ పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు పెరగాల్సిందిపోయి తగ్గడం ఎంతవరకు సమంజసమన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా మారిందన్నారు. బడ్జెట్లో కొత్త పథకం ఒక్కటికూడా లేదన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, శారదా గౌడ్, విక్రంగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ దోమలగూడ : నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. చిక్కడపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కష్ణయ్య, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టరు లక్ష్మణ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరుణోదయ విమలక్క, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు డీవీ నరేందర్‌రావు నాయీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మంగళి వృత్తిని ఆధునీకరించడానికి ఒక్కో షాపునకు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించాలని, గ్రూపు రుణాలుగా కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. బీజేపీ బీసీల అభివద్దికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణ సాధనలో నాయీ బ్రాహ్మణులు తమవంతు పోరాటం చేశారన్నారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ అధ్యక్షులు సతీష్నాయీ, ప్రధానకార్యదర్శి రాం బాబు నాయీ, నాయకులు మనోహర్నాయీ, ఓంప్రకాష్నాయీ, కె హరినాధ్, బీసీ నాయకులు కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం చీకటే
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం అంధకారంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రా క్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని, ఆ మేరకు కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిం చారు. కొన్ని శాఖల్లో క్రమబద్ధీకరించి విద్యుత్ శాఖలో పర్మినెంట్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమాజానికి వెలుగులను అందించే కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయన్నారు. సమావేశంలో కాం ట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, ఎం.పృథ్వీరాజ్ గౌడ్, రాజేందర్ పాల్గొన్నారు. -
టీడీపీకి దూరంగా కృష్ణయ్య
తనను వాడుకొని వదిలేశారంటూ అసంతృప్తి టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కకపోవడంపై నిరసన పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు దూరం ఎమ్మెల్యే పేరు వాడుకునేందుకు సైతం విముఖత పార్టీతో నాకు అవసరం ఏమిటని వ్యాఖ్యలు హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు ఎలా ఉంటాయో.. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు తెలిసొచ్చినట్టుంది. అధికారంలోకి వస్తే నువ్వే సీఎం అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించి ఎల్.బీ.నగర్ సీటిచ్చిన చంద్రబాబు తీరా గెలిచి, పార్టీ ఓడిపోయాక కరివేపాకులా తీసేశారని ఆయన భావిస్తున్నారు. దీంతో పార్టీ కార్యాలయానికి, పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. అదే సమయంలో తనకు గుర్తింపు తెచ్చిన బీసీ ఉద్యమాలను జాతీయస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణయ్య పక్కన టీడీపీ ద్వారా తనకు సంక్రమించిన ఎమ్మెల్యే అనే హోదాను వాడుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. టీడీపీ నాయకత్వం కూడా కృష్ణయ్యను పార్టీ నేతగా చూడడం మానేసింది. సీఎం అభ్యర్థి ఫ్లోర్ లీడర్ కాలేదు..! గెలిస్తే కృష్ణయ్య ముఖ్యమంత్రి అంటూ చెప్పిన బాబు కనీసం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించి తెలంగాణ అధ్యక్ష పదవి అయినా ఇస్తారని భావించిన కృష్ణయ్యకు అక్కడా నిరాశే! దీంతో బాబు తీరేంటో... తనను ఎన్నికల కోసం ఎలా ఉపయోగించుకొని వదిలేశారో తెలుసుకున్న తానే పక్కకు తప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమై, బీసీ కార్డునే నమ్ముకుంటున్నారు. చివరికి ఎమ్మెల్యే హోదాను గానీ వినియోగించుకోకుండా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ డిమాండ్లను నివేదించారు. ఆదివారం నగరంలో భారీ ఎత్తున బీసీ సదస్సు ఏర్పాటు చేసి, పార్టీతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతలు కృష్ణయ్యకు దూరంగా... గత శాసనసభ సమావేశాల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు చంద్రబాబుతో సమావేశాలకు గానీ, గవర్నర్‌ను కలిసినప్పుడు గానీ కృష్ణయ్యను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన కూడా టీ.టీడీపీ నేతలకు దూరంగా తన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. బీసీ ఉద్యమాలే నాకు ముఖ్యం: కృష్ణయ్య 40 ఏళ్లుగా బీసీ ఉద్యమనేతగానే ప్రజల్లో ఉన్నా. ఎన్నో పోరాటాలు చేశా. అది తెలిసే చంద్రబాబు సీఎం అభ్యర్థిగా పెడతానని చెప్పి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి, నాతో ప్రచారం చేయించారు. ఎల్బీ నగర్ నుంచి నేను గెలిచా, తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. నా అవసరం ఇప్పుడు పార్టీకి లేదు. పార్టీ అవసరం నాకెప్పుడూ రాలేదు. నేను పార్టీ జెండా కూడా పట్టలేదు. -
దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి
హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల అత్యవసర సమావేశం ముగిసింది. మెదక్ ఎంపీ స్థానానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ను పోటీ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి దేవీప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీఎన్జీవో సంఘం నేతలు కోరనున్నారు. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో మెదక్ స్థానం ఖాళీ అయింది. కాగా, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. -
రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకునేందుకు ఐఏఎస్‌ల కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందకుండా ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్‌లు కుట్ర పన్నుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని ప్రభుత్వం చెల్లించని కారణంగా పీజీ మెడికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఇప్పట్లో డీఎస్సీ వేయబోమని ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రకటనను కృష్ణయ్య తప్పుపట్టారు. పంతుళ్లు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతుంటే డీఎస్సీ ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు. -
మెడికల్ సీట్లపై డిప్యూటీ సీఎంను కలిసిన కృష్ణయ్య
హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అంగట్లో సరుకుల్లా అమ్ముకుంటున్నాయని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖమంత్రి టి.రాజయ్యను పలు బీసీ సంఘాల ప్రతినిధులతో కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కోటాను తగ్గించాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు సొంత ప్రవేశ పరీక్ష పెట్టుకునే అధికారం ఇవ్వరాదని కోరారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులను పెంచరాదని, మూడు కేటగిరీలను, రెండు కేటగిరీలకు కుదించాలని, యాజమాన్య కోటాను 60నుంచి 20శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌ను ప్రభుత్వమే జరుపుతుందని, మేనేజ్మెంట్ కోటాను తగ్గించడానికి త్వరలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. -
‘గ్రేటర్’ ఆకర్ష్!
* దానం, ముఖేష్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు టీఆర్ఎస్ గాలం * ఆయా నేతలతో హరీశ్‌రావు రహస్య మంతనాలు * కాంగ్రెస్‌లోనే ఉంటామన్న దానం, సుధీర్! సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ‘గ్రేట్’ ఆకర్ష్‌ను ప్రారంభించింది. శాసనమండలిలో ఆధిపత్యం కోసం ప్రయోగించిన అస్త్రం పూర్తిగా విజయవంతం కావడంతో.. ఇప్పుడు కీలకమైన రాజధానిపై కన్నేసింది. మరో ఆరు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఇక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే యోచనతో పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఆయా నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజధానిలో పార్టీ కొంత బలహీనంగా ఉండటం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే నేపథ్యంలో.. ఇక్కడ సంస్థాగతంగా పట్టున్న ఇతర పార్టీల నేతలపై ‘ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగించే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా బలహీనపర్చడమనే ద్వి ముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇందులో భాగంగా హరీశ్‌రావు కొద్దిరోజులుగా మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డిలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని, టీఆర్ఎస్లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఆయా నేతలకు రకరకాల తాయిలాలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్.కృష్ణయ్య టీఆర్ఎస్లో చేరితే మెదక్ ఎంపీ సీటిచ్చి గెలిపించుకుంటామని.. ఒకవేళ ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య పార్టీలోకి వస్తే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని దింపి గెలిపించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. సుధీర్‌రెడ్డితో చర్చల సందర్భంగా హరీశ్‌రావు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో హుడా చైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డిపై గతంలో ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేతలు కొందరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగితే టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశముందని, అదేదో గులాబీ జెండా కప్పుకుంటే మేలని సుధీర్‌రెడ్డిపై ఆయన సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి దానం నాగేందర్‌పై కూడా ఇదే తరహాలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. దానంపై అనేక భూఅక్రమణ ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దాంతో టీఆర్ఎస్లో చేరితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, పైగా గ్రేటర్‌పై తన ముద్ర వేయవచ్చని దానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్‌తో చర్చల సందర్భంగా దానం పలు ప్యాకేజీలను డిమాండ్ చేయడంతో వాటిపై టీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. మాజీమంత్రి ముఖేష్గౌడ్తోనూ టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. తన కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలని భావిస్తున్న ముఖేష్ గత ఎన్నికల్లో తన కుమారుడికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టీఆర్ఎస్లో చేరితే గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్‌గౌడ్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయా నేతల తో ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం: దానం, సుధీర్‌రెడ్డి దానం, సుధీర్‌రెడ్డి సహా పలువురు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ కొన్నిచానళ్లలో వార్తలు రావడంతో.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయా నేతలతో గాంధీభవన్‌లో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం దానం, సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీఆర్ఎస్లోకి రమ్మని ఆ పార్టీ నేత లు మీతో మాట్లాడారా? లేదా? అని విలేకరులు ప్రశ్నిం చినా.. వారు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆర్.కృష్ణయ్య సైతం తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని పేర్కొన్నారు. నాయకత్వ లోపంవల్లే: జానారెడ్డి, జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజల ముందుంచలేకపోయామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సైతం జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిం చారు. హైకమాండ్ హడావుడి నిర్ణయంతో లోపం జరిగిందని, అదే ఇప్పుడు గుణపాఠమైందన్నారు. త్వరలో హైకమాండ్‌తో సమీక్షించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. -
'ఐఐటి విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంటు'
హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చేస్తున్న బిసి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేయాలని బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన పేద బి.సి. విద్యార్థులు ఈ సౌకర్యం లేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సీట్లు వదులుకుంటున్నారని అన్నారు. జాతీయ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2010లోనే సూచించిందని గుర్తుచేశారు. -
బీసీలను టీడీపీకి తాకట్టుపెట్టిన కృష్ణయ్య
అనంతపురం: బీసీ సంక్షేమ సంఘాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆర్.క్రిష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ క్రిష్ణయ్య నిర్ణయంతో అన్ని పార్టీలలోని బీసీ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నూతన కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ (అనంతపురం), గౌరవాధ్యక్షులుగా వీరాంజనేయులు (కృష్ణా), ఉపాధ్యాక్షులుగా కామాచార్యులు (తూర్పుగోదావరి), సనూరి నాగేశ్వరి (గుంటూరు), రామంచంద్ర (అనంతపురం), కార్యదర్శులుగా ఉప్పల కొండయ్య (ప్రకాశం), కొరడా నాగభద్రం (తూర్పుగోదావరి), సూర్యనారాయణ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్ (కర్నూలు), శ్రీనివాసులు (కడప), శ్రీనివాసులు (అనంతపురం), ట్రెజరర్లుగా బాలాంజనేయులు (అనంతపురం), జమీల్, ఎక్జిక్యూటివ్ మెంబర్లుగా గోవిందరాజులు, విష్ణువర ్ధన్, మీనుగ శ్రీనివాసులు, చంద్రశేఖర్, లక్ష్మి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన లక్ష్మిదేవమ్మ ఎన్నికయ్యారు. -
ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ విభాగంలో 1,457 పోస్టులు, 1,042 ఐపీఎస్ పోస్టులు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. -
బీసీల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కృష్ణయ్య
హైదరాబాద్: బీసీల సంక్షేం, అభివృద్ధి కోసం చట్టసభలలో పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గౌడ యువజన సంఘర్షణ సమితి నాయకులు దూసరి వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి అభినంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం చేసే పోరాటంలో బీసీలందరూ సంఘటితంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్‌గౌడ్, తండు లాలయ్యగౌడ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, సతీష్చంద్రగౌడ్, లోడ పరమేష్‌గౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ నేతకు ఘనవిజయం
ఎల్బీనగర్లో కృష్ణయ్యకు 12,761 ఓట్ల మెజారిటీ రెండోస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాంమోహన్‌గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మూడోస్థానం ఎల్బీనగర్/హస్తినాపురం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన పోరులో బీసీ నేత, టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. రాంమోహన్గౌడ్పై 12,761 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఆర్.కృష్ణయ్య ఆధిక్యతను కొనసాగించారు. మొత్తం 35 రౌండ్లలో 10 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ ఆధిక్యతను ప్రదర్శించినప్పటికి చివరి వరకు నిలవలేకపోయారు. టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మొత్తం 84,124 ఓట్లు సాధించగా.. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. రాంమోహన్‌గౌడ్ 71,363 ఓట్లు సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 56,156 ఓట్లతో మూడవస్థానంలో నిలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డికి 19,329 ఓట్లు రాగా, లోక్‌సత్తా అభ్యర్థి దోసపాటి రాముకు 8,861 ఓట్లు లభించాయి. కొత్తపేట, హయత్‌నగర్, వనస్థలిపురం, చంపాపేట, పీఅండ్‌టీ కాలనీ, గడ్డిఅన్నారం డివిజన్లలో టీడీపీ సత్తా చాటింది. మరికొన్ని డివిజన్లలో టీఆర్ఎస్, టీడీపీ హోరాహోరీగా పోటీపడ్డాయి. కర్మన్‌ఘాట్ డివిజన్లో టీఆర్ఎస్కు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఆర్.కృష్ణయ్యను తెలంగాణకు సీఎం అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించడం.. బీసీ అభ్యర్థి కావడం.. మోడీ ప్రభంజనం తోడు కావడం ఆయనకు కలిసొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, రాష్ట్రం వీడిపోయిన నేపథ్యంలో సెటిలర్ల ఓట్లు టీడీపీకి బలం చేకూర్చాయి. ఆర్.కృష్ణయ్యకు ఉద్యోగులు, మేధావులు, బడుగు బలహీనవర్గాలు, యువ ఓటర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాలు ఆయన విజయానికి కృషి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి స్థానికంగా వ్యతిరేక పవనాలు వీయడం కృష్ణయ్యకు దోహదపడింది. -
బీసీ డిక్లరేషన్ వంచనపై నోరు విప్పని టీడీపీ నేతలు
* బ్రహ్మాండంగా చేశామని ఆర్.కృష్ణయ్యతో చెప్పించిన వైనం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రధాన అంశాలను అమలు చేయకుండా సదరు వర్గాలను వంచించడంపై ఏదో చెప్పబోయి మరేదో చెబుతూ ఆ పార్టీ నాయకత్వం నీళ్లు నమిలింది. ఈ అంశంలో ఎదురైన విమర్శలపై పెదవి విప్పి వివరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా పార్టీలో చేరిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్..కృష్ణయ్యతో బీసీల ప్రయోజనాల కోసం టీడీపీ బ్రహ్మాండంగా పని చేసిందని చెప్పించి మమ అనిపించారు. శుక్రవారం సాక్షి పత్రికలో ‘బీసీలకు బురిడీ’ శీర్షికతో ప్రచురితమైన వార్తపై టీడీపీ నేతలు భుజాలు తడుముకున్నారు. ఆర్.కృష్ణయ్య మినహా మరెవరూ దీనిపై నోరు విప్పలేదు. 2012 జూలై 9న చంద్రబాబు పార్టీ పరంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఆ హామీని చంద్రబాబు నిలుపుకోలేదు. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 40, తెలంగాణలో 18 సీట్లను మాత్రమే వారికి కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని తెలంగాణలో సీఎం చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన గెలుపునకు చంద్రబాబు సహా పార్టీ నేత లెవరూ మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. దీనిపై పార్టీలో, ఇంటా, బైటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉలిక్కిపడ్డ పార్టీ నేతలు తాము స్పందిస్తే ప్రతికూలత వ్యక్తం అవుతుందని వెనుకంజ వేశారు. పార్టీలో ఆర్. కృష్ణయ్యకు జరిగిన అన్యాయంపై బీసీ సంఘాలు కూడా రుసరుసలాడుతుండటం, బీసీలకు వంద సీట్లు కేటాయించకపోవటంపై ఆగ్రహంగా ఉండటంతో ఈ అంశాన్ని సమర్ధించే ప్రయత్నం చే యలేకపోయారు. కృష్ణయ్యతోనే సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు కృష్ణయ్యకు కేటాయించిన ఎల్బీనగర్ నియోజకర్గం పరిధిలోని ఎనిమిది కార్పొరేటర్ పదవుల్లో ఏడింటిని టీడీపీ గెలుచుకుంది. అయితే వారందరూ కృష్ణయ్య గెలుపునకు ఎం దుకు కృషి చేయలేకపోయారు?, ఆయనకు సీటు కేటాయించిన తరువాత పలువురు ముఖ్య నేతలు ఎందుకు పార్టీని వీడిపోయారో వివరించలేకపోయారు. ఇలావుండగా బీసీలకు ఎన్నికల్లో సీట్లు ముఖ్యం కాదని కృష్ణయ్య అన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు ఒక్కసారి లభిస్తే బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. -
బీసీలకు బాబు బురిడీ
-
బీసీలకు బాబు బురిడీ
* తెలంగాణలో బీసీని సీఎం చేస్తానంటూ హైడ్రామా * ఆర్.కృష్ణయ్యను బరిలోకి దించి.. పట్టించుకోని వైనం * ఆయన ఓటమికి పరోక్షంగా ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు హామీలివ్వడం, ఎన్నికలయ్యాక వాటిని తుంగలో తొక్కడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి వెనుకబడిన తరగతుల వారికి టోపీ పెట్టేశారు. బీసీ వర్గాల వారికి వంద సీట్లు కేటాయిస్తానని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపారు. ఈసారి బీజేపీతో పొత్తు కట్టడంతో మైనార్టీఓట్లు దూరమవుతాయని భావించి మరోసారి బీసీ ఓట్లపై కన్నేశారు. తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా దశాబ్దాలుగా బీసీల హక్కులకోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య పేరును వెల్లడించారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఆయన ఫొటో కూడా ప్రచురించారు. కానీ ఆయన విజయం సాధించకుండా ఉండటానికి చేయాల్సిన పనులన్నీ తెరవెనుక చేశారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కృష్ణయ్య గెలుపుకోసం కాకుండా పలువురు నేతలు ఆయన ఓటమి కోసం పనిచేయడంపై బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న బీసీ వర్గాల్లో అనుమానాలు తలెత్తాయి. ఒక పథకం ప్రకారం పార్టీ నాయకత్వమే ఇదంతా చేయించిందని గ్రహించిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న కృష్ణయ్య సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబును నమ్ముకుని నిండా మునిగామని బీసీ సంఘాలకు చెందిన ఒక నాయకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. * తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే సమయంలో సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును వెల్లడించారు. దీంతో తెలంగాణతోపాటు సీమాంధ్ర ప్రాంతంలో బీసీ సామాజికవర్గాలన్నీ ఏకపక్షంగా తమకే ఓటేస్తాయని చంద్రబాబు భావించారు. * తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఎన్టీ రామారావు, చంద్రబాబు, కృష్ణయ్య ఫొటోలను ముద్రించారు. సొంత సామాజికవర్గంతోపాటు సెటిలర్ల ఓట్లు అధికంగా ఉంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో కృష్ణయ్యను పోటీకి పెట్టారు. తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని పలు సభల్లో బల్లగుద్ది చెప్పి కృష్ణయ్యను బరిలోకి దింపిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన గురించి పట్టించుకోవటం మానేశారు. ఆయన గెలుపుకోసం ముఖ్య నేతలెవ్వరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. * ఎల్బీనగర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎస్వీ కృష్ణప్రసాద్ అనుచరులు కృష్ణయ్య నామినేషన్ దాఖలు సమయంలోనే ఆయన వాహనశ్రేణితో పాటు అనుచరులపై దాడి చేశారు. అయినప్పటికీ కృష్ణప్రసాద్‌పై చంద్రబాబు చర్య తీసుకోలేదు. పలు చోట్ల టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు కృష్ణ ప్రసాద్ తో కనీసం మాట్లాడలేదు. దీంతో కృష్ణప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులందరూ కాంగ్రెస్‌లో చేరారు. * సినీ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు కృష్ణ ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. బాలకృష్ణ లేదా చంద్రబాబు ఒకసారి పిలిచి మాట్లాడితే కృష్ణప్రసాద్ ఎన్నికల విజయానికి సహకరించేవారని, అలా పిలిచి మాట్లాడకపోవడంలోనే మతలబు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. కాాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన చంద్రబాబు, బాలకృష్ణలకు సమాచారం కూడా ఇచ్చారని కూడా సమాచారం. * కృష్ణయ్య 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఆయనను బీసీ సీఎంగా తెరమీదకు తేవటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధిపొందేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలోని బీసీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటంలో అందె వేసిన చెయ్యి చంద్రబాబుదని, తమ నేతను కూడా ఆ కోవలోనే ఉపయోగించుకున్నారనే వాదన బీసీ వర్గాల నుంచి వస్తోంది. వందసీట్ల వాగ్దానమూ డొల్లే * ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తగా బీసీలకు వంద సీట్లు ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చిన బాబు తీరా ఎన్నికల సమయానికి అందులో సగం కూడా ఇవ్వకపోవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. * తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 45 సీట్లు కేటాయించారు. మిగిలిన 74 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. బీజేపీకి కేటాయించగా మిగిలిన తొమ్మిది లోక్‌సభ సీట్లల్లో ఒక్కటి మాత్రమే బీసీకి కేటాయించారు. * సీమాంధ్ర లో 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. మిగిలిన 162 సీట్లలో 40 సీట్లు చంద్రబాబు బీసీ సామాజికవర్గాలకు కేటాయించారు. టీడీపీ 21 ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇలా బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించటం ద్వారా తన వంద సీట్ల హామీకి బాబు తిలోదకాలిచ్చారు. కేవలం బీసీ ఓటర్లను ఆక ర్షించేందుకే వంద సీట్లు ఇస్తామని తొలి నుంచి చెప్తున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు బీసీ సీఎం మంత్రం జపించారనే వాదన ఆ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. -
మరోసారి ఆర్.కృష్ణయ్యపై దాడి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై మరోసారి దాడి జరిగింది. ఎల్బీనగర్లోని చైతన్యపురి పోలింగ్ కేంద్రం వద్ద ఆయనపై బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణయ్య వాహనం ధ్వంసం అయ్యింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు సుధీర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. కాగా గతంలో కృష్ణయ్య నామినేషన్ వేసేందుకు వెళుతుండగా స్థానిక టీడీపీ నాయకుడు సామ రంగారెడ్డి అనుచరులు .. కృష్ణయ్య గో బ్యాక్ అంటూ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో కారుపై దాడిచేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కృష్ణయ్య సురక్షితంగా బయటపడ్డారు. -
మాకు పొత్తులు కలిసొస్తాయి
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఎన్నికల్లో టీడీపీ భావసారూప్యత గల పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో తలబడుతుంది. 1983 ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌తో కలిసి పోటీచేశాం. 1984లో ఎన్టీఆర్‌ను గద్దెదించిన తర్వాత జరిగిన ఉద్యమంలో బీజేపీ కలసి వచ్చిం ది. 1985,1989,1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోరాడి విజయాలు అందుకున్నాం. ఇప్పుడు కూడా బీజేపీతో కలసి తెలంగాణలో అధికారంలోకి వస్తాం’ అని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం వల్ల దేశానికి మంచి జరుగుతుందని, ఎన్డీఏ ప్రభుత్వంలో సెక్యులరిజం పరిరక్షణకు టీడీపీ వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ శనివారం మీట్ ది మీడియా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎల్.రమణతో పాటు ఇటీవల టీడీపీలో చేరిన బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మోడీ ఆహ్వానం మేరకే టీడీపీ పొత్తులకు తెరలేపిందని రమణ చెప్పారు. 2002లో గోద్రా సంఘటనను దేశమంతా ఖండించిందని, చంద్రబాబు కూడా అదే రీతిన స్పందించారని తెలిపారు. -
బీసీ ముఖ్యమంత్రికే ఓటేయాలి: ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబం ధం లేకుండా బీసీ ముఖ్యమంత్రికే ఓటేయాలన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీడీపీకి అన్ని కుల సంఘాలు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సవూవేశంలో ఆయన వూట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఇక కావలసింది పేదల ముఖ్యమంత్రేనని, సీఎం అభ్యర్థిని చూసే ఓటేయాలని కోరనున్నట్లు చెప్పారు. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 28మంది ముఖ్యమంత్రులు మారినా ఒక్కబీసీ కూడా సీఎం కాలేకపోయారని, బీసీ కులాల్లో పుట్టడమే ఆ పదవికి అనర్హతగా మారిందన్నారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి బీసీ నాయకుడైతే, తరువాత కాలంలో ఎస్సీ, ఎస్టీ వంటి అణగారిన కులాలకు కూడా అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో మళ్లీ దొరల రాజ్యం తేవాలని జరుగుతున్న ప్రయత్నాలను బీసీలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. -
బీసీ సీఎం కృష్ణయ్యే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేస్తేనే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నేతలు కోరారు. బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు, కుల సంఘాల నేతల విస్తృతస్థాయి సమావేశం గురువారం నగరంలోని ఓ హోట ల్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ కె. ఆల్మెన్ రాజు అధ్యక్షతన ఈ సమావేశంలో, టీడీపీ పరిస్థితి దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రంలో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 60 నుంచి 80 శాతం బీసీల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేతలు వ్యాఖ్యానించారు. అలాగే బీసీ సంఘాల నాయకులను అసెంబ్లీకి పంపాలని సూచించారు. ఆర్.కృష్ణయ్య సీఎం అయితే సామాజిక తెలంగాణ సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. సీమాంధ్రలో కూడా చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవిని బీసీలకే ఇవ్వాలని ఆ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు డిమాండ్ చేశారు. మిగతా పార్టీలు కూడా బీసీలకే సీఎం పదవి ఇస్తామని ప్రకటన చేస్తే వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీలకు రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే టీడీపీకి బహిరంగంగా మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. టీడీపీ ఓడిపోయే పార్టీ ఎలా అవుతుంది? : కృష్ణయ్య బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగానే, ఓడిపోయే పార్టీ టీడీపీ.. బీసీని సీఎం చేస్తానంటోందని విమర్శలు చేయడం వారిని కించపరచడమేనని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో 60 నుంచి 80 శాతం మంది ఉన్న బీసీలు ఓడిపోతారా అని ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలు ఇక ముందు సాగవని అన్నారు. తెలంగాణ దొరలు బీసీలు సీఎం కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఈ వాదన తెస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో ఎంపీగా గెలవడానికి అవసరమైన బలం లేకపోయినా టీఆర్ఎస్ బీసీ అభ్యర్థి కేశవరావును నిలబెడితే గెలవలేదా అని సోదాహరణంగా చెప్పుకొచ్చారు. కాగా మీ డిమాండ్ బీసీ వ్యక్తి సీఎం కావాలనా..? లేక కృష్ణయ్య సీఎం కావాలనా? అని విలేకరులు ప్రశ్నించగా, సమావేశానికి వచ్చిన వారంతా కృష్ణయ్య సీఎం అని నినాదాలు చేయగా, కృష్ణయ్య మాత్రం బీసీ అభ్యర్థి సీఎం కావాలని చెప్పారు. టీడీపీలో ఎప్పుడు చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది అందరితో సంప్రదించిన తరువాత వెల్లడిస్తానని ప్రకటించారు. రెండు రోజుల్లో రాజకీయరంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జు కృష్ణ, హన్మంతరావు, టీడీపీ కార్పొరేటర్ చంద్రమౌళి, చక్రదారి యాదవ్, నరేందర్ రావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 50 శాతం టిక్కెట్లు బీసీలకే ఇవ్వాలని ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య డిమాండ్లను హైకమాండ్ పరిశీలిస్తుందని దిగ్విజయ్ సింగ్ హామీయిచ్చారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు. -
నవసమాజమే బీసీ ఉద్యమ లక్ష్యం: కృష్ణయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి నవసమాజాన్ని నిర్మించడమే బీసీ ఉద్య మ లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు నేతృత్వంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. ‘‘దొరల ఆహంకారం అణచాలంటే బీసీలంతా ఐక్యతతో రాజ్యాధికారం దక్కించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, లేకుంటే ఆయా పార్టీలను రాను న్న ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ‘బీసీ సీఎం’పై వైఖరి చెప్పాలి రాష్ట్రం లోని 4.5 కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్ష అయిన ‘బీసీ ముఖ్యమంత్రి’ పదవి అగ్రకుల పార్టీల అణచివేత కారణంగా వారికి ఇంతవరకు దక్కకుండా పోయిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘బీసీ సీఎం’ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు వారం రోజుల్లోగా విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ భవన్లో జరిగిన 26 కుల సంఘాలు, 15 బీసీ సంఘాల రాజకీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
'బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదు'
హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య టీడీపీని సమర్థించటాన్ని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బీసీలను కేవలం ఓట్లుగానే చూసిన చంద్రబాబు వద్ద బీసీల గౌరవాన్ని ఆర్. కృష్ణయ్య తాకట్టు పెట్టడం సరికాదని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. కాగా రంగారెడ్డి జిల్ల చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.