సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించ డం లేదని ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తో పాటు ఫెడరేషన్లకు నిధుల కేటాయింపు నిలిచిపో యిందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు ఈ వార్షిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లు, ఫెడరేషన్లకు కూడా ప్రత్యేక నిధులు కేటా యించి విడుదల చేయాలన్నారు.
ఈ నిధులు విడుదలయితేనే స్వయం ఉపాధి పథకాలు ముందుకు సాగుతాయని ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గతేడాది వరకు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. నిధులు విడుదల కాలేదన్నారు. కార్పొ రేషన్లు, ఫెడరేషన్ల ఖాతాల్లోని మిగులు నిధులను సైతం ప్రభుత్వం ఇతర కార్యక్ర మాలకు వినియోగించిందన్నారు. ఫలితం గా సంస్థలు నిర్వీర్యమయ్యే దుస్థితికి వచ్చాయన్నారు.