
'బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ'
ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ అవసం ఉందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడ, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు.
హైదరాబాద్: వెనుకబడిన తరగతి (బీసీ)కి చెందిన కులాలను రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అవసరాల కోసం ఉపయోగించుకుని, ఆ తరువాత మొండి చేయి చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్ బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు.
శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.