సగం సీట్లు ఇవ్వకుంటే ఓటమే: ఆర్‌.కృష్ణయ్య | R krishnaiah on elections | Sakshi
Sakshi News home page

సగం సీట్లు ఇవ్వకుంటే ఓటమే: ఆర్‌.కృష్ణయ్య

Published Sat, Oct 27 2018 3:26 AM | Last Updated on Sat, Oct 27 2018 3:26 AM

R krishnaiah on elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించకుంటే ఆయా రాజకీయ పార్టీలను కచ్చితంగా ఓడించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు తప్పనిసరిగా 60 సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం 20 సీట్లు కేటాయించకుండా తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాలోనూ బీసీలకు ప్రాధాన్యత లభించలేదని మండిపడ్డారు. ఒకవేళ మహా కూటమిలోనూ బీసీలకు అన్యాయం జరిగితే ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీసీల కోసం పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement