seats
-
కాంగ్రెస్‌కు మళ్లీ సున్నా..!
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి. అయితే తమకు ఎగ్జిట్‌పోల్స్ ఎప్పుడూ అనుకూలంగా రాలేదని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల విషయం కాసేపు పక్కనపెడితే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. 2015,2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. ఈసారి కూడా ఆ పార్టీది ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీలో వరుసగా అధికారం చేపట్టిన తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆత్మపరిశీలిన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న రానున్నాయి. -
ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న చట్ట నిబంధన అమలుపై సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.మరోవైపు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. \ఎవరికి ఉచితం? రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్ డెవలప్మెంట్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేసినా ట్యూషన్ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్‌తో నడిచే సీబీఎస్సీ, ఐసీఎస్ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
అగ్రిసెట్ ద్వారా స్పోర్ట్స్ కోటా, మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రిసెట్ 2024 ర్యాంకు ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలకు మిగిలిన సీట్ల భర్తీకి, స్పోర్ట్స్ కోటాలో సీట్ల భర్తీకి ఫైనల్ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ డాక్టర్ రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లాంఫాంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
ఆ 7 వేల సీట్ల పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశంతో పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన 7 వేల సీట్లపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. నిబంధనల మేరకే ఉన్నందున పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని హై కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం అందుకోసం జీవో ఇవ్వకపోవటంతో విద్యార్థులు, సీట్లు పెంచుకొన్న కాలేజీల యాజమాన్యాలు డోలాయమాన స్థితిలో పడ్డాయి. ప్రభుత్వం జీవో ఇస్తేనే పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇస్తామని జేఎన్టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యా సంవత్సరం దాదాపు సగం పూర్తి కావటంతో పెరిగిన సీట్ల భర్తీ ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొన్నది. ఈ సీట్లలో ఇప్పటికే 450 మంది వరకు విద్యార్థులు చేరిపోయారు. ఇప్పుడు ఈ సీట్లకు అనుమతి ఇవ్వకపోతే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎడతెగని పంచాయితీ..: రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బాగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకోగా.. జేఎన్టీయూహెచ్ అధికారులు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్ల పెంపునకు ససేమిరా అనటంతో ఆ కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఆ 7 వేల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయింది. దీంతో కాలేజీలే ఈ సీట్ల భర్తీ చేపట్టి 450 సీట్లు భర్తీ చేశాయి. ఈ సీట్లను ఉన్నత విద్యా మండలి ర్యాటిఫై చేయాలి. దీనికన్నా ముందు పెరిగిన సీట్లకు జేఎన్టీయూహెచ్ అనుమతివ్వాలి. ఈ ప్రక్రియ ఇంత వరకూ పూర్తవ్వలేదు. ప్రభుత్వం జీవో ఇస్తే తప్ప తాము అనుమతివ్వలేమని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పటికే చేరిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి.వచ్చే ఏడాది అయినా పెరిగిన 7 వేల సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అనే సందిగ్ధత నెలకొంది. వీటిలో 4,900 సీట్లు కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థులకు పెరిగిన సీట్లు మేలు చేస్తాయి. యాజమాన్య కోటా సీట్లు కూడా ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెబుతోంది. కాబట్టి పెరిగిన సీట్లపై ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే వచ్చే ఏడాది కౌన్సిలింగ్‌కు సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. -
ఏ కాలేజీలోనూ సీట్లు పొందని వారితో స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీల్లో కన్వీ నర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సెలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి మూడు రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్ష న్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది.ఈ సీట్ల భర్తీ వల్ల ఖాళీ అయ్యే బీడీఎస్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద తిరిగి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పింది. కౌన్సెలింగ్‌లో విశ్వవిద్యాలయం వ్యక్తం చేసిన వాస్తవ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌కు నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతించాలంటూ 25న ఇచ్చిన ఉత్తర్వుల ను కొంత మేర సవరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి పెరిగిన సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, తరువాతి ర్యాంకుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల తాము నష్టపోతా మంటూ నలుగురు విద్యార్థినులు హైకోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నీట్లో అర్హత సాధించిన అందరినీ స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతిస్తే ఎన్ఎంసీ గడువైన డిసెంబర్ 6 లోగా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయడం చాలా కష్టమ ని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, జా యింట్ రిజిస్ట్రార్ (ప్రవేశాలు)తో పాటు యూనివర్సిటీ తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీని వాస్ ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ల తర ఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి -
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
డబ్బు కట్టాం.. సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల మధ్య సీట్ల పంచాయితీ ముదురుతోంది. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకున్న కాలేజీలు వాటి స్థానంలో కొత్త సీట్లు వస్తాయని భావించి యాజమాన్య కోటా కింద విద్యార్థుల నుంచి ముందే డబ్బు దండుకున్నాయి. కానీ కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దీనిపై హైకోర్టుకెక్కినా కాలేజీలకు ఊరట లభించకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. వివిధ కాలేజీల్లో దాదాపు 5 వేల మందికి ఈ తరహాలో సీట్లు ఇస్తామని యాజమాన్యాలు ఆశలు రేపాయి. అందులో టాప్ కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయినందున ఇప్పుడు సీట్లు లేవని చెబుతున్న కాలేజీలు.. కావాలంటే కట్టిన సొమ్మును తిరిగిచ్చేస్తామని అంటున్నాయి. కానీ దీనికి విద్యార్థులు ఒప్పుకోవట్లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలు దాదాపు పూర్తికావడంతో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. ఏదో ఒక బ్రాంచీలో తమకు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మండలి వద్ద గందరగోళంఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద మంగళవారం గందరగోళ పరిస్థితి కనిపించింది. ప్రైవేటు కాలేజీలు మోసం చేశాయని విద్యార్థులు అధికారులకు మొర పెట్టుకున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. కొందరు ఆవేశంతో మాట్లాడుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో అధికారులు అవాక్కయ్యారు. యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశారు. సీట్లు లేనప్పుడు ఎలా ఇవ్వగలమని కాలేజీల నుంచి సమాధానం రావడంతో నిస్సహాయత వ్యక్తం చేశారు. స్పాట్ షురూ స్లైడింగ్ తర్వాత 11 వేల పైచిలుకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. వాటికి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా సాంకేతిక విద్యామండలి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కాలేజీకి వచి్చన వారిలో ర్యాంకు ప్రకారం సీట్లు ఇవ్వాలని సూచించింది. బుధవారం నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. బుధ, గురువారాల్లో కాలేజీలవారీగా ఖాళీగా ఉన్న సీట్లను పత్రికల ద్వారా వెల్లడించాలని, ఈ నెల 30 నుంచి సెపె్టంబర్ 2 వరకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. వచ్చే నెల 3న స్పాట్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను కాలేజీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లను సాంకేతిక విద్య విభాగానికి వచ్చే నెల 4లోగా కాలేజీలు అందజేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే యాజమాన్య కోటా కింద భర్తీ చేసిన సీట్లకు సెపె్టంబర్ 5 నుంచి ర్యాటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. సీట్ల కేటాయింపును అన్ని డాక్యుమెంట్లతో వచ్చే నెల 10లోగా అప్లోడ్ చేయాలని సూచించింది. -
అ‘ధన’పు సీట్లు అంటూ..
సాక్షి, హైదరాబాద్: సీట్లు పెరుగుతాయి..మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ అడ్మిషన్ గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్ చేసి జాయినింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచ్‌ల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. యాజమాన్యాల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బు చెల్లించినవారు 1500 మంది వరకూ ఉన్నారు. వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు... ఇప్పుడు సీట్లెలా ఇస్తారు?’ అంటూ యాజమాన్యాలను నిలదీస్తున్నారు. ‘కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం..ఇప్పుడు మేం ఏం చేయగలం?’ అంటూ కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. డబ్బు వాపస్ ఇస్తారా? లేదా? అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇక ఆ సీట్లు రానట్టే!రాష్ట్రవ్యాప్తంగా 28 ఇంజనీరింగ్ కాలేజీలు బ్రాంచ్‌ల మార్పిడి, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో దాదాపు 10 వేల సీట్లు రద్దు చేసుకున్నాయి. వీటిస్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని అడిగాయి. అయితే, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లలో సీట్ల కుదింపునకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. ఇలా కుదిస్తే ఈ బ్రాంచ్‌లు తెరమరుగయ్యే ప్రమాదముందని అడ్డు చెప్పింది. ఇదే క్రమంలో కొత్తగా సీఎస్ఈ, డేటాసైన్స్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లలో సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ వంటి వాటిల్లో సీట్ల తగ్గింపునకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇలా దాదాపు 5 వేల సీట్లకు అనుమతి లభించలేదు. కోర్టు అనుమతిస్తే మూడో విడత కౌన్సెలింగ్‌లో వీటిని చేర్చాలని భావించారు. ముందే ఖరారుకోర్టు అనుమతిస్తే సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్‌లలో 5 వేల సీట్లు పెరిగేవి. 30 శాతం యాజమాన్య కోటా కింద దాదాపు 1500 సీట్లు అందుబాటులో ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి. ఒక్కో సీటును రూ. 8 నుంచి రూ. 18 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండటంతో మేనేజ్మెంట్ సీట్లకూ గిరాకీ బాగానే పలికింది. ఇలా సీట్లు కొనుగోలు చేసిన వారిలో రాష్ట్ర ఈఏపీసెట్‌లో అతి తక్కువ స్కోర్ వచ్చినవారు, అసలు సెట్ పాసవ్వని వారూ ఉన్నారు. ఇప్పుడు వీరికి ఆఖరిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టడానికి గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేలోగా.. కౌన్సెలింగ్ ఖతంహైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తయింది. మూడో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపడతారు.వెనువెంటనే స్పాట్ అడ్మిషన్లు చేపట్టే వీలుందని అధికారులు అంటున్నారు. ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లి, కేసు తేలేలోగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయి. ఇది ప్రైవేట్ కాలేజీలకు ఇబ్బంది కలిగించే పరిణామమని అధికారులు అంటున్నారు. -
కేకే రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సీట్లు మరో 2,640 పెరిగాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కాగా కొత్త వాటితో కలుపుకొని మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 72,741 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. వాస్తవానికి కొత్తగా 20 వేల సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేశాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు పెంచడాన్ని అధికారులు వ్యతిరేకించారు. అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న 20 కాలేజీల్లో కూడా ప్రతీ బ్రాంచిలో 120 సీట్లకు మించి పెంచడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి తెలిపింది. సీట్ల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన తెలిపారు. ఇప్పటివరకు 95,383 మంది ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు. మరో 4 వేల సీట్లకు చాన్స్..కొత్త కంప్యూటర్ కోర్సులు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి బ్రాంచీలకు ఆదరణ తగ్గింది. దీంతో ఈ కోర్సుల స్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సులకు అనుమతించే అంశాన్ని అధికారులు పరి శీలిస్తున్నారు. ఇదే జరిగితే మరో 4 వేల సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరో విడత కౌన్సెలింగ్‌కు ఈ సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. కాగా ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు రద్దు చేయాలని పలు కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ సీట్లు 3 వేల వరకూ ఉన్నాయి. అయితే యూనివర్సిటీలు గుర్తించిన సీట్లు మాత్రం 1,770 సీట్లు మాత్రమే. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విముఖతతో ఉంది. సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ నాన్ కోర్ గ్రూపులు కలిపి 48 వేల కన్వీనర్ కోటా సీట్లుండగా, మెకానికల్‌లో 2,979, సివిల్‌లో 3,132, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 4,202 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఈ సీట్లలో కూడా ఏటా 40 శాతం మించి ప్రవేశాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న ఆ కొన్ని సీట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. కొత్త సీట్లపై తర్జనభర్జన..వాస్తవానికి కొత్త సీట్ల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడింది. సీట్లు పెంచడం వల్ల పడే ఆర్థిక భారంపై ఆరా తీసింది. కన్వీనర్ కోటా కింద కేటాయించే ప్రతి సీటుకు రూ.35 వేల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. 10 వేల లోపు ర్యాంకు వస్తే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సగటున ఏడాదికి రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. నాలుగేళ్లకు రూ. 100 కోట్ల భారం పడుతుందని లెక్కగట్టారు. -
ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే. ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ గ్రూపుతో పాటు, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్ ఇంటెలిజెన్స్ సహా పలు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్లో 9618, ఎలక్ట్రికల్‌లో 3602, మెకానికల్‌లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్‌లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్‌లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు. ఫ్యాకల్టీ ఎక్కడ...? సీఎస్ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్‌ను ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. ముగిసిన స్లాట్ బుకింగ్... ఆప్షన్లే తరువాయి తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు గురువారంతో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
సీఎస్ఈ సీట్లు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి. సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గత ఏడాది తగ్గిన చేరికలుగత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్‌లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్‌లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.రీయింబర్స్మెంట్ వద్దు..రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు. అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
సీట్లు పెరిగినా.. సీఎస్‌ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్‌లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్‌లో 310 నుంచి 385కు, భిలాయ్‌లో 243 నుంచి 283కు, భువనేశ్వర్‌లో 476 నుంచి 496కు, ఖరగ్‌పూర్‌లో 1,869 నుంచి 1,889కి, జోథ్‌పూర్‌లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
‘సిద్ధూ మూసేవాలా కోడ్ ఏమిటి? కాంగ్రెస్ సీట్లతో లింక్ ఎందుకు?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. మంగళవారం(జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయాన్ని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ పోల్ అని వ్యాఖ్యానించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా పాటను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని అన్నారు.ఇంతకీ రాహుల్ గాంధీ సింగర్ సిద్దూవాలా ‘295’ పాటను ఎందుకు వినమన్నారు? విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కాంగ్రెస్ 295 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని, మరొకటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని కోరారు. మూసేవాలా పాడిన పాట ‘295’లో 295 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ హిందీ పాటలోని అర్థం విషయానికి వస్తే దీనిలో మతం ప్రస్తావన ఉంది. నిజం మాట్లాడే చోట సెక్షన్ 295 విధిస్తారు. ఎవరైనా అభివృద్ధి చెందిన చోట ద్వేషం రగులుతుంది. సెక్షన్ 295 పేరుతో మతానికి సంబంధించిన నిబంధనలు పెట్టారని పాటలో పేర్కొన్నారు.ఈ పాట ప్రారంభంలో ‘అబ్బాయ్.. నువ్వు ఎందుకు నేల చూపులు చూస్తున్నావు? నువ్వు బాగా నవ్వేవాడివి కదా? ఈ రోజు మౌనం వహిస్తున్నావు? ఈ రోజు తలుపుపై ఉన్న నేమ్‌బోర్డును ఎత్తుకుపోయి, తిరుగుతున్న వారెవరో నాకు తెలుసు. వారు ఇక్కడ వారి ప్రతిభను వ్యాపింపజేయాలనుకుంటున్నారు. నువ్వు కిందపడాలని కోరుకుంటున్నారు. వారు కీర్తి కాంక్షతో రగిలిపోతున్నారు. నీ పేరుతో ముందుకు రావాలని అనుకుంటున్నారు’ అని పాటలో వినిపిస్తుంది. రాహుల్ ఈ పాట ద్వారా కాంగ్రెస్ పరిస్థితిపై మీడియాకు సమాధానమిచ్చారు.ఎగ్జిట్ పోల్ గణాంకాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఈ లెక్కలను తప్పుపడుతున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ ప్రభుత్వం కాదని వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాను ఎవరూ అంగీకరించబోరని కాంగ్రెస్ నేత పవన్ ఖేదా పేర్కొన్నారు. మీడియావారు మాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఇండియా కూటమి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నది ఊహాజనిత మార్కెట్ అయిన షేర్ మార్కెట్ కోసం జరిగిందా? లేక బీజేపీ మరో కుట్ర పన్నుతోందా అని పవన్ ఖేదా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ భక్తులు తప్ప ప్రతీ ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఫేక్‌గా పరిగణిస్తున్నారన్నారు. -
మెట్రోలో మహిళలు
రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి.తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
భోపాల్: బీజేపీకి 400 సీట్లు ఎందుకు రావాలనేదానిపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకురాకుండా ఉండాలంటే, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండటానికి బీజేపీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి తమకు 400 సీట్లు కావాలని అడగడం లేదన్నారు.మధ్యప్రదేశ్‌లోని థార్‌లో మంగళవారం(మే7)జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్లో తమకు ఇప్పటికే 400 సీట్లు ఉండటం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండవ దశలో అవి ఏకంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. మూడవ దశలో మిగిలిందేమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
అచ్చోట ముచ్చెమట
లోక్‌సభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రెండు రోజుల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కానీ ఈసారి ఎన్నికలు పరమ బోరింగ్‌గా సాగుతున్నాయన్న అభిప్రాయం గట్టిగా విన్పిస్తోంది. కాకపోతే తొలి, రెండో విడతల్లో పోలింగ్ జరిగే 191 లోక్‌సభ స్థానాల్లో 9 ‘హాట్ సీట్లు’ మాత్రం దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. రసవత్తర పోటీకి వేదికగా మారాయి. ఎందుకంటే వాటిలో కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు బరిలో దిగి ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరికొన్ని చోట్ల అగ్రనేతలకు పెనుసవాలు ఎదురవుతోంది. ఇంకొన్ని చోట్ల సిట్టింగులకు గట్టి ఎదురుగాలి వీస్తోంది. ఆ సీట్లపై ఓ లుక్కేద్దాం...! – సాక్షి, నేషనల్ డెస్క్ మళ్లీ బీజేపీ పరమేనా? చురు (రాజస్తాన్, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: దేవేంద్ర ఝఝారియా (బీజేపీ), రాహుల్ కాస్వాన్ (కాంగ్రెస్) ఉత్తర రాజస్తాన్‌లోని ఈ లోక్‌సభ స్థానం థార్ ఎడారికి ముఖద్వారం. బీజేపీ కంచుకోట. రెండుసార్లు పారాలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన జావెలిన్ క్రీడాకారుడు ఝఝారియా పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కాస్వాన్ బీజేపీ మాజీ కావడం విశేషం! గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లోకి ఫిరాయించి పోటీని ఆసక్తికరంగా మార్చేశారు. ఆయన బలమైన జాట్ నేత కావడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఇక్కడి 22 లక్షల మంది ఓటర్లలో నాలుగో వంతు జాట్లే! మహిళా రెజ్లర్ల నిరసనలు, సాగు బిల్లులు తదితరాలతో జాట్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో, ‘నరేంద్రుని దేవేంద్రుడు’ ప్రచారమే దేవేంద్ర ఝఝారియాను గట్టెక్కిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. తమిళనాట హోరాహోరీకి వేదిక కోయంబత్తూర్ (తమిళనాడు, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: కె.అన్నామలై (బీజేపీ), గణపతి పి.రాజ్‌కుమార్ (డీఎంకే), సింగై జి.రామచంద్రన్ (అన్నాడీఎంకే) తమిళనాట పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి ఈ స్థానం కేంద్రబిందువుగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నామలై బరిలో ఉండటమే అందుకు కారణం. దాంతో పొత్తులో భాగంగా పదేళ్లుగా వామపక్షాలకు కేటాయిస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈసారి డీఎంకే పోటీ చేయడ తప్పలేదు. నగర మేయర్ రాజ్‌కుమార్‌ను పార్టీ బరిలో దింపింది. జౌళి పరిశ్రమకు కేంద్రమైన కోయంబత్తూరు మాంచెస్టర్ ఆఫ్ ద సౌత్‌గా పేరుబడింది. స్థానికేతర జనాభా ఎక్కువగా ఉన్న ఈ స్థానంపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. తమిళనాడులో బీజేపీ నెగ్గిన తొట్టతొలి లోక్‌సభ స్థానాల్లో కోయంబత్తూరు ఒకటి. 1998, 1999ల్లో ఇక్కడ ఆ పార్టీ గెలిచింది! రాహుల్‌కు గట్టి పోటీ వయనాడ్ (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: రాహుల్‌గాంధీ (కాంగ్రెస్), అన్నీ రాజా (సీపీఐ), కె.సురేంద్రన్ (బీజేపీ) కొండ ప్రాంతమైన ఈ లోక్‌సభ సీటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాం«దీకి సురక్షిత స్థానమని చెప్పేముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. 2019లో ఏకంగా 4.3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన రాహుల్ ఈసారి కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు! మైనారిటీ ప్రాబల్య స్థానమైన వయనాడ్‌లో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రైస్తవులున్నారు. ఇండియా కూటమి భాగస్వాములు కాంగ్రెస్, సీపీఐ మధ్య ముఖాముఖి పోరు సాగుతుందని భావించినా బీజేపీ సురేంద్రన్ను బరిలో దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయనకు మద్దతుగా స్మృతీ ఇరానీ వంటి అగ్ర నేతలు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. చతుర్ముఖ పోటీ! నగీనా (యూపీ, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: చంద్రశేఖర్ ఆజాద్ (ఏఎస్పీ–కేఆర్), సురేంద్రపాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్‌కుమార్ (ఎస్పీ), ఓం కుమార్ (బీజేపీ) ఈ లోక్‌సభ ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటాలు జరుగుతున్న అతి తక్కువ స్థానాల్లో నగీనా ఒకటి. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ రంగప్రవేశమే ఇందుకు కారణం. స్థానికంగా తిరుగులేని ఆదరణ భీం ఆర్మీ చీఫ్ అయిన ఈ దళిత నేత సొంతం. ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో వారి జనాభా 20 శాతం దాకా ఉంటుంది. అయితే ముస్లింలు 43 శాతమున్నారు. వారి దన్నుకు తోడు రా్రïÙ్టయ శోషిత్ సమాజ్ అధ్యక్షుడు స్వామిప్రసాద్ మౌర్య మద్దతు కూడా ఆజాద్‌కు కలిసొచ్చే అంశం. 2009 నుంచి ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి గెలవలేదు! తీవ్ర పోటీకి వేదిక తిరువనంతపురం (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: శశి థరూర్ (కాంగ్రెస్), రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ), పన్యన్ రవీంద్రన్ (సీపీఐ) అసలే సంప్రదాయ ప్రత్యర్థి అయిన లెఫ్ట్ ఫ్రంట్. దానికి తోడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ రూపంలో గట్టి ప్రత్యరి్థ. దాంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎంపీగా ఆయన పనితీరుపై స్థానిక జనం పెదవి విరుస్తుండటం మరింత ప్రతికూలంగా మారింది. అర్బన్ సీటు కావడంతో పాటు ఏకంగా 66 శాతం హిందూ జనాభా ఉండటం బీజేపీకి కలిసొచ్చే అవకాశముంది. రాజీవ్ గెలిస్తే కేరళలో కాషాయ పార్టీ నెగ్గిన తొలి స్థానంగా తిరువనంతపురం చరిత్ర సృష్టించనుంది. 2005లో ఇక్కడ గెలిచిన సీపీఐ అగ్ర నేత రవీంద్రన్ ఈసారి ఎవరి ఓట్లను ఏ మేరకు చీలుస్తారన్న దాన్ని బట్టి విజేత ఎవరో తేలవచ్చంటున్నారు. పప్పూ ప్రతీకార పోటీ! పూర్ణియా (బిహార్, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: పప్పూ యాదవ్ (స్వతంత్ర), బీమా భారతి (ఆర్జేడీ), సంతోష్ కుమార్ కుషా్వహా (జేడీ–యూ) సీమాంచల్‌లోని ఈ సాదాసీదా లోక్‌సభ స్థానం కాస్తా రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ రంగప్రవేశంతో సంకుల సమరానికి పోటీకి వేదికగా మారి దేశమంతటినీ ఆకర్షిస్తోంది. 1990ల్లో పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన 20 ఏళ్ల అనంతరం ఎన్నికల బరిలో దిగుతున్నారు! ఆర్జేడీ, కాంగ్రెస్రెండూ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూ సిట్టింగ్ ఎంపీ కుషా్వహాతో పాటు ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతికి చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పప్పూ కంటతడి పెట్టిన తీరు కూడా ఓటర్లను బాగా కదిలించింది. గొగొయ్ వర్సెస్ గొగొయ్ జోర్హాట్ (అసోం, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: గౌరవ్ గొగొయ్ (కాంగ్రెస్), తపన్‌కుమార్ గొగొయ్ (బీజేపీ) ఈ స్థానం కాంగ్రెస్ కంచుకోట. ఒకప్పుడు మాజీ సీఎం తరుణ్ గొగొయ్ ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం బీజేపీ అభ్యర్థి తపన్‌కుమార్ గొగొయ్ గెలుపొందారు. ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం గౌరవ్ గొగొయ్ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. తరుణ్ తనయునిగా కూడా ఆయనకు ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అహోం ప్రతిష్ట ప్రధానాంశంగా ప్రచారం చేస్తోంది. 2019లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సుశాంత బోర్గోహెయిన్ చేరిక బీజేపీకి కలిసొచ్చే అంశం. యువ నేత జోరు బార్మేర్–జైసల్మేర్ (రాజస్తాన్, ఏప్రిల్ 26), కీలక అభ్యర్థులు: కైలాశ్ చౌదరి (బీజేపీ), ఉమేదా రాం బెనీవాల్ (కాంగ్రెస్), రవీంద్రసింగ్ భాటీ (స్వతంత్ర) సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరితో పాటు బెనీవాల్‌కు కూడా స్వతంత్ర అభ్యర్థి రవీంద్రసింగ్ భాటీ చుక్కలు చూపిస్తున్నారు. ఆయన సభలకు జనం భారీగా విరగబడుతున్నారు. ఇటీవలి రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బార్మేర్ లోక్‌సభ పరిధిలోని షెవో స్థానం నుంచి మంచి మెజారిటీతో నెగ్గారాయన. అప్పుడూ ఇండిపెండెంట్‌గానే పోటీ చేశారు. చౌదరి పనితీరుపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటంతో భాటీ ఈసారి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో, ‘నా కారణంగా ప్రధాని మోదీని శిక్షించకండి’ అంటూ ఓటర్లను చౌదరి వేడుకోవాల్సి వస్తోంది! 19 శాతమున్న జాట్లు, 12 శాతముండే రాజ్‌పుత్‌లు ఇక్కడ నిర్ణాయకం కానున్నారు. కమలం వికసించేనా! త్రిసూర్ (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: సురేశ్ గోపీ (బీజేపీ), కె.మురళీధరన్ (కాంగ్రెస్), వి.ఎస్.సునీల్‌కుమార్ (సీపీఐ) 1952 నుంచీ ఒకసారి లెఫ్ట్, మరోసారి కాంగ్రెస్ నెగ్గుతూ వస్తున్న ఈ స్థానంపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ‘ఆపరేషన్ త్రిసూర్’లో భాగంగా ఈ ఆలయ నగరిని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. మలయాళ సినీ స్టార్ సరేశ్ గోపీని బరిలో దించారు. ప్రత్యర్థులిద్దరూ బలమైన నేతలు కావడంతో త్రిముఖ పోరు నెలకొంది. -
తెలంగాణ కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ
-
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 28 సీట్లు, బీహార్‌లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్‌సభ పదవీకాలం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్‌ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్‌గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్‌సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్‌కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్‌కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్‌కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
ఈశాన్యం ఎవరి వశం!
సెవెన్ సిస్టర్స్‌గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... నోట్: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్‌సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం మణిపూర్.. కాంగ్రెస్‌కు షాక్ మణిపూర్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్‌సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్‌లో ఏకైక లోక్‌సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. సర్వేలు ఏమంటున్నాయి... అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. రెండు విడతల్లో పోలింగ్ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్‌సభ స్థానాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్‌లో రెండో దశలో (ఏప్రిల్ 26) పోలింగ్ నిర్వహించనున్నారు. త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్‌సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. అరుణాచల్‌లో బీజేపీ పాగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. రెండు లోక్‌సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్‌కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో లోకల్ హవా ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్ కుమార్ చామ్లింగ్‌కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఓటమి చవిచూసింది. లోక్‌సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీసీలకు బాబు పోటు
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలపై మొసలి కన్నీళ్లు కురిపించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పొత్తులో టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 34 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించారు. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 32 సీట్లు ఇచ్చారు. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం. ఇక మైనారిటీలకు నామమాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు కేవలం 9 సీట్లు మాత్రమే వారికి కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నా సీట్లు మాత్రం ఇవ్వలేదు. ఎంపీ సీట్లలోనూ అదే తీరు.. ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇవ్వగా తన సొంత సామాజిక వర్గానికీ ఆరు సీట్లు ఇచ్చారు. పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీన్నిబట్టి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. తన ప్రసంగాల్లో పేదల గురించి, సామాజిక న్యాయం గురించి డప్పు కొట్టే చంద్రబాబు రాజకీయంగా మాత్రం వారిని అణగదొక్కుతూనే ఉన్నట్లు మరోసారి తేలిపోయింది. -
ఎట్టకేలకు దేశం ఆఖరి జాబితా
సాక్షి, అమరావతి: టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 9 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేశారు. దీంతో 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 94 సీట్లు ప్రకటించినా పి.గన్నవరం అభ్యర్థి రాజేష్‌ని అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఆయనకు సీటు ఉపసంహరించారు. ఈ జాబితాలోనే అనపర్తి, అరకు సీట్లు ఖరారు చేసినా అవి రెండు బీజేపీకి వెళ్లడంతో వాటిని వదులుకున్నారు. రెండో జాబితాలో ఖరారు చేసిన కదిరి స్థానంలో తాజాగా మార్పులు చేశారు. మొదటి జాబితాలో 13 ఎంపీ స్థానాలకు ప్రకటించగా పొత్తులో మిగిలిన నాలుగు సీట్లకు ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో టీడీపీ పోటీ చేసే చోట్ల మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. చీపురుపల్లికి కళా వెంకట్రావు చీపురుపల్లి సీటును చివరికి రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అంటగట్టారు. ఓడిపోయే ఆ స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీ చేయించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. దీంతో కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలని నిర్ణయించారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల సీటు పొత్తులో బీజేపీకి కేటాయించడంతో కళాకు చీపురుపల్లి సీటు ఇచ్చారు. దీనికి ఆయన చాలారోజులు ఒప్పుకోకపోయినా బుజ్జగించి ఖరారు చేశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు కోసం మొదటి నుంచి గట్టిగా పట్టుబడిన గంటా చివరికి దాన్ని దక్కించుకున్నారు. ఒక దశలో ఆ సీటు జనసేనకు వెళ్లే పరిస్థితి ఏర్పడగా గంటా పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతోపాటు భారీగా డబ్బులిచ్చి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల ఆర్థిక బాధ్యతలు కూడా చూసుకునేందుకు ముందుకు రావడంతో ఆయనకే సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అరకు జిల్లా పాడేరు (ఎస్టీ) స్థానాన్ని కిల్లు వెంకట రమేష్‌నాయుడుకి ఇచ్చారు. మొదట ఈ సీటును బీజేపీకి కేటాయించే ఉద్దేశంతో అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీజేపీ అరకు సీటును తీసుకోవడంతో ఆ స్థానంలో ఖరారు చేసిన దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఉపసంహరించుకుంది. దాని బదులు ఇప్పుడు పాడేరు స్థానంలో అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి దొరకని దర్శి స్థానానికి బయట ప్రాంతం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దిగుమతి చేసుకుని సీటు కేటాయించారు. అసంతృప్త నేత సుబ్రహ్మణ్యంకు రాజంపేట రాయచోటి ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీ సీట్లలో ఏదీ దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న భత్యాల చెంగల్రా యుడు, జగన్మోహనరావుకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు స్థానాన్ని వీరభద్రగౌడ్‌కి కేటాయించి కోట్ల సుజాతమ్మకు షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆ లూరు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరామ్‌కి గుంతకల్లు టికెట్ ఇ చ్చారు. అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి ఝలక్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కదిరి స్థానంలోనూ మార్పు చేశారు. ఈ స్థానాన్ని ఆశించిన కందికుంట ప్రసాద్‌పై నకిలీ డీడీల కేసు ఉండడంతో రెండో జాబితాలో ఆయన భార్య యశోదా దేవికి సీటు ఇచ్చారు. అయితే ప్రసాద్‌పై కేసును కోర్టు కొట్టివేయడంతో యశోదాదేవి బదులు ఇప్పుడు ప్రసాద్‌కి సీటు ఖరారు చేశారు. కడపలో ఫలించని బాబు తంత్రం పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చెర్ల సీటు దక్కక అసంతృప్తితో ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీటును కేటాయించారు. ఒంగోలు సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఖరారు చేశారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీ నారాయణకు ఇచ్చి జేసీ కుటుంబానికి షాక్ ఇచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి ఈ సీటు కోసం లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కడప ఎంపీ సీటును జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికి కేటాయించారు. జమ్మలమడుగు సీటు బీజేపీకి వెళ్లడంతో భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ నేత, తన బాబాయి ఆదినారాయణరెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు ఇచ్చారు. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని అడ్డు పెట్టుకుని కడప ఎంపీ సీటుపై రాజకీయం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు చివరికి అభాసుపాలై అసంతృప్త నేతకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. -
బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!
ముంబై: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆరు సీట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి. కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్సీపీ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. -
బీసీలకు చంద్రబాబు ఊచకోత
సాక్షి, విజయవాడ: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ సీఎం జగన్ చేసి చూపించగా, చంద్రబాబు మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వారికి వెన్నుపోటు పొడించారు. లోక్‌సభ సీట్లలో బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. వైఎస్సార్సీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో 11 బీసీలకు కేటాయించగా, టీడీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత వర్గానికి సీట్ల కేటాయించారు. తాజాగా 4 లోక్‌సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించగా, టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కాగా, సీఎం జగన్ 50 శాతం సీట్లు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్ధానాలలో బీజేపీ మార్పులు కోరింది. బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ తాజా ప్రతిపాదనలు, సీట్ల మార్పులపై చర్చించారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఏపీ అభ్యర్ధులపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని స్ధానాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి సీటు పురంధేశ్వరి, సోమువీర్రాజు కోరుతుండగా, వైజాగ్‌లో జీవీఎల్ పోటీ చేస్తానంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి సీటు కావాలంటున్నారు. రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అరకు టికెట్‌ను కొత్తపల్లి గీత ఆశిస్తున్నారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని ఆంజనేయ చౌదరి భావిస్తున్నారు. తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు సాగిస్తుండగా, విజయనగరం సీటు కేటాయించాలని మాధవ్ కోరుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ? -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్‌రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
వాడిపోతున్న 'పొత్తు' తిరుగుడు పూలు
సత్యవేడు(తిరుపతి జిల్లా)/మదనపల్లె/ఉప్పలగుప్తం/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/కపిలేశ్వరపురం(మండపేట)/కందుకూరు/సాక్షి,అమలాపురం: మండుతున్న ఎండలకు తోడు ఎన్డీఏ కూటమిలో సీట్ల చిచ్చు ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలకు నిరసన సెగ తగులుతోంది. కార్యకర్తలు రోడ్డెక్కి మరీ అధిష్టానాల తీరును ఎండగడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆయా పార్టీలు కిందామీదా పడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీస్థానంలో టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను తమపై రుద్దవద్దని తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సత్యవేడులోని బేరిశెట్టి కల్యాణ వేదికలో సమావేశం పెట్టి మరీ అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమను ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన ఆదిమూలంతో కలిసి పనిచేయలేమని తెగేసిచెప్పారు. ► అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఏడాదిక్రితం టీడీపీలో చేరిన వ్యక్తికి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ నాయకత్వంలో అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధాన నాయకులంతా సోమవారం రహస్యంగా సమావేశమయ్యారు. మెజార్టీ వర్గాలను కాదని మైనార్టీకి సీటు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. తమలో ఎవరు ఒకరం పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ ఇన్చార్జ్ దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో–కనీ్వనర్ గంగారపు రాందాస్‌చౌదరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగవాన్ పాల్గొన్నారు. ► విశాఖ దక్షిణం జనసేనలో సీటు చిచ్చురేగింది. పార్టీ ప్రకటించకుండా తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌పై 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాధిక్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న నాయకులకు పార్టీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరారని, స్థానికేతరులను ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు, మత్స్యకార నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్‌లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కోరారు. ► అమలాపురం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లవిల్లి, ఉప్పలగుప్తం ప్రధాన సెంటర్లలో కంచాలపై గరిటెలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీకి కేటాయిస్తే తాము సహకరించబోమని హెచ్చరించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో 43 గ్రామాలు ఉండగా.. దాదాపు 30 గ్రామాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయని జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేటలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇస్తామని పవన్ నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టీడీపీకి సహకరిస్తామని స్పష్టం చేశారు. లీలాకృష్ణకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ► కందుకూరు టికెట్‌ను టీడీపీ ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించడంతో ఆ పార్టీ అసమ్మతి నేత ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆత్మీయ సమావేశం పేరుతో బలప్రదర్శనకు దిగారు. పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచానని, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే తాను అండదండలు అందించి అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి ప్రచారం చేపట్టి తన బలమేమిటో పార్టీ అధిష్టానానికి చూపిస్తానని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, శివరాంల మద్దతూ తనకే ఉందని రాజేష్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. మిత్రపక్షాల్లో అసహనం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎవరనే విషయాన్ని టీడీపీ తేల్చడం లేదు. ఇది తేలితేనే కానీ అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రానుంది. దీంతో మిత్రపక్షాల్లో అసహనం వ్యక్తమవుతోంది. అమలాపురం ఎంపీ స్థానాన్ని జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ఆశిస్తున్నారు. ఆయన స్థితిమంతుడు కాదనే నెపంతో అసెంబ్లీకి పంపించాలని బాబు యోచిస్తున్నారు. దీనికి హరీష్ ఒప్పుకోవడం లేదు. ఎంపీగా కొత్తగా పార్టీలో చేరిన పాము సత్యశ్రీ లేదా గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త రమేష్ ప్రసాద్‌లలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ తలుస్తోంది. హరీష్‌ను పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల్లో ఒకదానికి పంపాలని చూస్తోంది. పి.గన్నవరానికి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను తొలి జాబితాలోనే ప్రకటించినా సర్వత్రా వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సీటు ఆశిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాను దాదాపుగా ఎంపిక చేసింది. అమలాపురం సీటు ఆశిస్తున్న జనసేన శెట్టిబతుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్‌లలో ఒకరిని బరిలో దింపాలని భావిస్తోంది. అయితే టీడీపీ అమలాపురం అసెంబ్లీ నుంచి హరీష్‌ను బరిలో దింపాలని చూస్తుందనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
Bihar: డీల్ కుదిరింది! బీజేపీ 17, జేడీయూ 16..
పాట్నా: బిహార్‌లో అధికార ఎన్డీయే కూటమిలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్‌లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 5 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని బీహార్ ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ రాజు తివారీ తెలిపారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చాతో సహా ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు చెరొక్క సీటును పంచుకున్నాయి. అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కలిసి 39 సీట్లు, 53 శాతానికి పైగా ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాగా ఆర్జేడీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుపొందలేకపోయింది. NDA's seat-sharing in Bihar: BJP to contest 17 Lok Sabha seats, JD(U) 16, LJP(Ram Vilas) five, two other parties one each — Press Trust of India (@PTI_News) March 18, 2024 -
సామాజిక న్యాయానికి పాతర.. ఇదీ బాబు బండారం
సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాల కోసమే టీడీపీ పుట్టిందని, సామాజిక న్యాయమని బాబు పదే పదే ఊదరగొడుతుంటారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఇతర పదవుల పంపకాల్లో ఆయన ఎప్పుడూ అగ్రవర్ణాల పక్షమే ఉంటారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో బాబు సామాజిక బండారం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఈసారీ బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని అభ్యర్థుల ఎంపిక రుజువు చేసింది. రెండు విడతలుగా 128 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు సామాజిక న్యాయానికి పాతరేశారు. తన సొంత సామాజికవర్గానికి, ధన బలం, కండ బలం ఉన్న వారికి సీట్లు కట్టబెట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను చిన్న చూపు చూశారు. ఒకవైపు వైఎస్సార్సీపీ సగం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి తమ ప్రాధాన్యం బడుగు, బలహీన వర్గాలేనని చాటి చెప్పింది. కానీ తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకునే బాబు మాత్రం వారికి వెన్నుపోటు పొడిచారు. ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకు 72 సీట్లు కేటాయించి, బీసీలకు మాత్రం 24 సీట్లతో సరిపెట్టారు. మొదటి జాబితాలో 18, రెండో జాబితాలో 6 సీట్లను బీసీ వర్గాలకు ఇచ్చారు. దీనినిబట్టి ఆయన వారిని పల్లకీ మోసే బోయీలుగానే చూస్తున్నారని మరోసారి తేటతెల్లమైంది. మరోవైపు తన సొంత సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చుకున్నారు. అంటే సొంత సామాజికవర్గానికి ఇచ్చినన్ని సీట్లు కూడా జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు ఇవ్వలేదు. కాపులకు మరీ హీనంగా 8 సీట్లతో సరిపెట్టారు. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చారు. మొత్తంగా సీట్ల కేటాయింపులో బాబు తన సొంత సామాజికవర్గానికి, ఓసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు ఈసారి సగానికి సగం తగ్గించి, పార్టీలో వారి ప్రాధాన్యత ఏమిటో చెప్పేశారు. ఎస్సీలకు 25, ఎస్టీలకు 4 సీట్లను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. మైనారిటీలకు తప్పదన్నట్లు మూడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మహిళలకూ ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదు. మహిళలకు ఇచ్చింది 17 సీట్లు మాత్రమే. బాబు సామాజిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టంగా చెబుతోందని విశ్లేçÙకులు అంటున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని 144 సీట్లలో పోటీ చేస్తున్న బాబు ఇంకా 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదీ చదవండి: నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి -
వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన (ఫొటోలు)
-
రేపు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన తెలిసిందే. బుధవారం నాటి భేటీలో పెండింగ్‌లోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు పూర్తిచేశాయి. ఈ క్రమంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, ఏకాభిప్రాయం కుదిరిన 9 మందితో తొలి జాబితాను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేశారు. పార్టీ పరంగా అంతగా బలమైన నాయకులు లేని వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నేతల చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన మరో సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేయడంతో.. ఆయనను మరోసీటు నుంచి బరిలో దిగాల్సిందిగా బీజేపీ నాయకత్వం కోరినట్టు తెలిసింది. దీనిపై సదరు ఎంపీ పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. అయితే సీట్లపై ప్రాథమిక కసరత్తు ముగిసిన నేపథ్యంలో.. కొన్ని కొత్తపేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపు ఇచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు తన కుటుంబంలో కావాల్సిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూలు పెడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో ముగ్గురికి సీట్లు ప్రకటించుకోగా, ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేశ్‌కు మంగళగిరి, తన బావమరిది–వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించుకున్నారు. మరో సీటును లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కి ఎక్కడో ఒకచోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా నాలుగు సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు. అదేమంటే పొత్తుల్లో సీట్లు తగ్గిపోయాయని వంకలు చెబుతున్నా సొంత కుటుంబానికి నాలుగు సీట్లు ఎలా ఇచ్చుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు. అయ్యన్నకు సీటు..కొడుక్కి మొండిచేయి.. అనకాపల్లి జిల్లాలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్‌కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఒక దశలో తనకు కాకుండా తన కుమారుడికి సీటు ఇవ్వాలని అయ్యన్న గట్టిగా కోరినా ఆయన మాట పెడచెవిన పెట్టారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి కాపుకాసిన తమకు ఈ పరిస్థితి ఏమిటని ఆవేదనతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు నర్సీపట్నం సీటు ఇచ్చినా అయ్యన్న సంతృప్తిగా లేరు. తనకో నిబంధన, చంద్రబాబుకి మరో నిబంధనా అని అంటూ అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసీ బ్రదర్స్‌కి ఝలక్.. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా ఝలక్ ఇచ్చారు. జేసీ సోదరులు గత ఎన్నికల్లోనూ తాము పక్కకు తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపారు. అనంతపురం ఎంపీ స్థానంలో దివాకర్ కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ని పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో అలాగే సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటిచ్చి పవన్‌కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. పనబాక విషయంలోనూ గందరగోళమే.. మరోవైపు.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కుటుంబాన్నీ చంద్రబాబు గాల్లో పెట్టారు. పార్టీలో చేరే ముందు ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్యకు సీటిస్తామని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు ఏ విషయం తేల్చడంలేదు. ఆమెకు మొదట తిరుపతి ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం దానిపైన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు ఉంటే ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పనబాక కుటుంబం చంద్రబాబు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. దీన్నిబట్టి చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక సీటనే రూలును తన రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే తనకు అవసరమైన చోట మాత్రమే ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిటాల కుటుంబానికి చెక్.. ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్‌కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికివ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కనపెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవీ వర్తించవనేలా వ్యవహరిస్తుండడం సీనియర్లకు మింగుడుపడడంలేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిశారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే కేటాయించడం పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటనలు గుప్పించారు. యువతకు 40 శాతం సీట్లు ఎక్కడంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
కాంగ్రెస్‌కు భారీ ఝలక్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తాము సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పునరుద్ఘాటించడంతో ఇండియా కూటిమి ఆనందం ఆవిరయ్యింది. టీఎంసీ ప్రకటనతో కాంగ్రెస్‌కు మరోమారు చుక్కెదురయ్యింది. దీనికిముందు ఇండియా కూటమి, టీఎంసీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై సీట్ల భాగస్వామ్య చర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ వర్గాలు తమ పార్టీకి మూడవ వంతు సీట్లు కూడా దక్కలేదని మీడియాకు తెలిపాయి. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్.. ఢిల్లీ, గుజరాత్, గోవాలలో ‘ఆప్’తో సీట్ల కేటాయింపుపై రాజీ కుదుర్చుకుంది. అయితే పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో ఉంది. కాగా అసోంలో తృణమూల్‌కు రెండు, మేఘాలయలో ఒక సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని, అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేలు లేరని, అయినా వారికి రెండు ఎంపీ సీట్లను ఇచ్చి, గెలిపించేందుకు సిద్ధమయ్యామని, దానికి వారు నిరాకరించారని ఆయన తెలిపారు. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. -
జనసేన-టీడీపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంచాయితీ
-
లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ సమన్వయకర్తల జాబితాను ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆదిలాబాద్ (ఎస్టీ)– సీతక్క, పెద్దపల్లి (ఎస్సీ) –డి.శ్రీధర్‌బాబు, కరీంనగర్– పొ న్నం ప్రభాకర్, నిజామాబాద్– టి.జీవన్‌రెడ్డి, జహీరాబాద్– టి.సుదర్శనరెడ్డి, మెదక్– దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి– తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్– మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్– మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్– రేవంత్‌రెడ్డి, చేవెళ్ల–రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూలు (ఎస్సీ)– జూపల్లి కృష్ణారావు, నల్లగొండ– ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ (ఎస్సీ)– కొండా సురేఖ, మహబూబా బాద్ (ఎస్టీ)– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. -
తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు
న్యూయార్క్: అమెరికా తూర్పు తీరానికి వింత మెటల్ షీట్లు కొట్టుకువచ్చాయి. మెటల్ షీట్లకు ఫైబర్ ఊడిపోయి ఉంది. కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ మెటల్ షీట్లను మొదట యాక్టర్ మాథ్యూ జాకబ్ పెర్రీ గుర్తించాడు. న్యూజెర్సీలోని మార్గేట్లోని బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా కనుగొన్నాడు. వింతగా ఉన్న ఈ ఉనుపషీట్లను వీడియో తీసి టిక్‌టాక్ వీడియోలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మెటల్ షీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''అవి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియలేదు. నేను మొదట చెట్టు కొమ్మ అనుకున్నాను. దగ్గరికొచ్చేసరికి మెటల్ షీట్లని అర్థమైంది. దగ్గరకు వచ్చేసరికి అవి విమానం సీట్లలాగే కనిపించాయి'' అని నటుడు జాకబ్ పీపుల్ మ్యాగజైన్‌తో అన్నారు. జాకబ్ పోస్టు చేసిన వీడియోలో తుప్పు పట్టిన మెటల్ షీట్లు ఇప్పటికీ స్ప్రింగ్‌లను కలిగి ఉన్నాయి. అప్పటికే ఫాబ్రిక్ ఊడిపోయింది. కొన్ని సీట్లు వాటి మధ్య మెటల్ హ్యాండ్‌రైల్‌ను కలిగి ఉన్నాయి. అవి విమానంలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వింత ఆకారాలపై సోషల్ మీడియోలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. జూలై 17, 1996న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన టీడబ్ల్యూఏ విమానం 800 శిథిలాల నుంచి సీట్లు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. TZB 900 విమానం అని మరో నెటిజన్ అన్నారు. అసలు అవి విమానం సీట్లు కానేకావని తాను ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆర్కియాలజిస్టులకు అప్పగించిన ఆర్మీ -
కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్‌లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు 70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు. బిల్లుల విశేషాలు.. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది. ►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు. ►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు. ►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు. ►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు. ►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి. ►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు. ►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. -
సీటు గ్యారంటీ! పేటీఎంలో రైలు టికెట్ బుకింగ్‌పై కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది. కన్ఫర్మ్డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్‌పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది. -
టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..
ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి దాదాపుగా స్వస్తి పలికాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఆఫీల బాట పడుతున్నారు. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో మరో సమస్య ఎదురైంది. పని చేసేందుకు సీట్ల కొరత టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ఓ వైపు ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఆఫీస్‌కు వెళ్తున్న ఉద్యోగులకు మరో కొత్త సమస్య వచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీస్ నుంచి పనిచేసేందుకు రావడంతో వారికి తగినన్ని సీట్లు అందుబాటులో లేవు. దీంతో వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. దీంతో సీట్ల కొరత ఏర్పడింది. కారిడార్లు, లాబీల్లో.. అకేషనల్ ఆక్యుపేషన్ జోన్లు అని పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను కంపెనీ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఉద్యోగులందరికీ తగినన్ని సీట్లు లభించగా కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే రోజంతా ఇలా పనిచేయడానికి చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురించింది. (టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) ఆఫీస్‌కి రావాల్సిందే.. వారంలో ఐదు రోజులూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందేనని టీసీఎస్ ఉద్యోగులను అభ్యర్థిస్తోంది. కొన్ని బృందాలకు వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాలకే రావాలని, తమ ఇళ్లకు దగ్గరగా ఉండే ఆఫీస్‌లు కావాలంటే కుదరదని చెప్పడం గందరగోళానికి తోడైంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులందరికీ సాఫీగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని టీసీఎస్ హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని ఆఫీస్‌లు ఇరుగ్గా ఉండటం, మరికొన్నింటిలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. (TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!) అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని, లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని తమ టీం మేనేజర్లు తెలియజేసినట్లు కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 2,000-3,000 సిటీ అలవెన్స్ లభిస్తుంది. కానీ తమ సౌకర్యం కోసం కొందరు ఉద్యోగులు ఈ అలవెన్స్‌ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
ఆన్‌లైన్‌లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
నాడు నోటుకు ఓటు..నేడు నోట్లకు సీట్లు
సాక్షి, సిద్దిపేట: ‘టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాడు నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి అయితే.. నేడు కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్‌లో మాట్లాడుతున్నారు’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారని ఆరోపించారు. సిద్దిపేటలో మంగళవారం సీఎం సభ జరగనున్న సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, బీఫారాల అందజేత, ప్రచారంలో ముందున్నాం రేపు సీట్లు గెలుపొందడంలో కూడా ముందే ఉంటామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని, ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో వారు ఉన్నారని తెలిపారు. తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీయే తమ పథకాలను కాపీ కొట్టిందని హరీశ్ ఆరోపించారు. రైతు బంధు, పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని గుర్తు చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరని మంత్రి ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్ చదువుతుండటంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవ్వుల పాలవుతున్నారన్నారు. -
పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. పాలేరు నుంచి పొంగులేటి? పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం... సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది. -
కాస్ట్ పాలిటిక్స్‌తో కాంగ్రెస్‌లో కంగారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నేడో రేపో షెడ్యూల్ రానున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. ఓవైపు బీసీ నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి చేస్తున్న వేళ.. తాజాగా తమ కులం తమకు సీట్లు కావాలని, తామూ పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందర తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఐక్య వేదికలు ఒక తాటి మీదకు వచ్చాయి. ఎన్నికల్లో తమకూ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డిమాండ్‌ను లెవనెత్తాయి. దీనికి ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటించేశారు కూడా. తెలంగాణలో తమ బలం బాగానే ఉందని.. అవకాశం ఇస్తే 40 సీట్ల దాకా తెచ్చి చూపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు సదరు కమ్మ నేతలు. తాజాగా.. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని కలిసి లేఖ ఇచ్చింది. తమను గుర్తించి.. టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలంటూ లేఖలో కోరింది. సినీ, రాజకీయ పరిశ్రమల్లో సత్తా చాటుతున్న కమ్మ వాళ్లకు ఓటు అధికారంతో పాటు సీటు అధికారం కూడా ఇవ్వాల్సిందేనంటూ ఈ సందర్భంగా అక్కడ ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు శిష్యుడి ద్వారానే.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి తొలి నుంచి ట్రబుల్ మేకర్‌గా ఉన్నారనే వాదన ఒకటి ఉంది. ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ అయ్యారో.. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. తన ఆధిపత్య ధోరణితో ఆయన తమనూ అణగదొక్కుతున్నారంటూ సీనియర్లు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. రేవంత్ సమర్థత కన్నా చంద్రబాబు శిష్యుడిగా ఆయన మీద పార్టీలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ డిమాండ్‌పైనా రేవంత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక వెనుక రేవంత్ ప్రముఖ పాత్ర పోషించారన్న టాక్ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో.. కమ్మ నేతలు వాళ్ల సీట్ల ప్రయత్నాలు రేవంత్ ద్వారానే నెరవేర్చుకోవాలని భావిస్తున్నారట. తమ పాత పరిచయాలతో రేవంత్‌రెడ్డిని కలుస్తున్న కొందరు.. తమ సీట్లకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను అప్పజెప్పినట్లు భోగట్టా. ఇది మిగతా కులాల నుంచి ఏమేర అభ్యంతరాలకు దారి తీస్తుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!. కాంగ్రెస్ టిక్కెట్లు త్వరలోనే ఖరారు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక మంది ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో పాు ఏఐసీసీ నేతలను కలసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే టికెట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో కులాలు, వర్గాల వారీగా రోజుకో కొత్త డిమాండ్ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. -
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్‌కు 78 సీట్లు ఖాయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పదితో పాటు రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ ఒక వైపు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ ఒక వైపు ఎన్నికల బరిలో ఉన్నాయని ఆయన అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాక తొలిసారిగా సోమవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా.. తుమ్మలకు భట్టితో పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం న్యాయం, ధర్మంతో పాటు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. విజయభేరి సభలో ప్రకటించినట్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీ కార్డులో చెప్పినవన్నీ అమలు చేస్తామని అన్నారు. చేవెళ్ల, వరంగల్ డిక్లరేషన్లు, రుణమాఫీ వంటి హామీలు కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నామని తెలిపారు. ప్రతి మండలంలో 15 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సభలు, సమావేశాలు, పార్టీ గాలి చూసి కల్వ కుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందని ఎద్దేవా చేశారు. మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. పొంగులేటి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. సమావేశంలో తుమ్మలతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఐబీపీఎస్‌లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఆధారిత సేవలను విస్తరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియన్ బిజినెస్ ప్రమోషన్ స్కీమ్ (ఐబీపీఎస్)లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. గ్రామీణ భారతదేశంలో మహిళలకు ఉపాధిని పెంపొందించడంలో ఐబీపీఎస్ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా ఏపీలో మహిళలకు ఉపాధి లభించిందని తెలిపారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నిర్వహించే ఈ పథకంలో కంపెనీలకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నిధులను సమకూరుస్తుంది. ఐబీపీఎస్ ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న పల్సస్ గ్రూపు 5,000 మందికి ఉపాధి కల్పించి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వీరిలో 4,000 మంది మహిళలే. రెండో విడత పథకం కింద రూ.41 కోట్లు పల్సస్ గ్రూపునకు ఎస్టీపీఐ విడుదల చేసింది. ఏపీలో ఐబీపీఎస్ సీట్లు పెంచాలని కోరుతూ పల్సస్ గ్రూప్ సీఈవో గేదెల శ్రీనుబాబు కూడా కేంద్ర మంత్రి చంద్రశేఖర న్కు వినతిపత్రాన్ని అందించారు. ఐబీపీఎస్‌తో ఉ పాధి కల్పన, తద్వారా ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యాన్ని అందించగలగడం తమకు దక్కిన గౌరవమని శ్రీనుబాబు చెప్పారు. దేశవ్యాప్త డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో తమకున్న సాటిలేని నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. పల్సస్ గ్రూప్ పదిహేనేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని, వాటిలో ఎక్కువ భాగం మహిళలకు అందించిందని వివరించారు. -
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
మెడికల్ సీట్ల కేటాయింపు వివాదంపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు వివాదంపై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి. ఈ మేరకు జూలై 3న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. అన్ రిజర్వుడులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీపడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్ రిజర్వుడు అనేది ఉండదు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో నంబర్ 72 చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయడంతో పాటు కౌన్సెలింగ్‌లో పాత విధానాన్నే అనుసరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వర్సిటీ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రా వు వాదనలు వినిపించారు. పునర్వ్యవస్థీకరణ చట్టానికి, రాజ్యాంగానికి ప్రభుత్వ నిర్ణ యం వ్యతిరేకం కాదని చెప్పారు. విభజనకు ముందు ఉన్న కాలేజీల్లో ఏపీ విద్యార్థుల కు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. కొత్త కాలేజీల్లోని సీట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
పీజీ వైద్య సీట్లపై ఎందుకీ ఫీట్లు?
సాక్షి, అమరావతి: ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా దాని కంపు పోదు.. చింతకాయను ఎంత చితక్కొట్టినా దాని పులుపు పోదు.. అలాగే, రామోజీ రాతల రంకు రోజూ బయటపడుతున్నా ఆయన సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన రామోజీ కనుక. ప్రభుత్వంపై బురద జల్లడం, నిందలు ఆపాదించడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆ లక్షణంతోనే ఆయన కళ్లు మూసుకుని నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా ఏదిపడితే అది రాసిపారేస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి వైద్య కళాశాలలకు అదనపు పీజీ సీట్ల మంజూరులో జరిగిన అవకతవకల్లో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు. ‘పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా’ అంటూ ఈనాడు పత్రికలో ఆదివారం కథనం రాసుకొచ్చారు. ఈ సీట్ల పెంపుపై ఎన్ఎంసీ నుంచి నకిలీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ)లు సృష్టించారు. ఈ వ్యవహారంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కళ్లు మూసుకుందని.. రాష్ట్ర ప్రభుత్వంపై మరో మచ్చ పడిందని రామోజీరావు తెగ గగ్గోలు పెట్టారు. ఢిల్లీలో కేంద్రం అజమాయిషీలో పనిచేసే ఎన్ఎంసీ పేరిట నకిలీ ఎల్‌ఓపీలు వస్తే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మచ్చ పడటం ఏమిటి?.. అసలు రామోజీరావుకు ఏమైంది..? మరీ ఇంతలా ఎందుకు దిగజారుతున్నారని మేధావులు సైతం మండిపడుతున్నారు. ఈ విషయంలో రామోజీ రాతల వెనుక వాస్తవాలను పరిశీలిస్తే.. ఎన్‌ఎంసీనే అప్రమత్తం చేసిన ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నంద్యాల జిల్లా శాంతిరాం వైద్య కళాశాల సమర్పించిన ఎల్ఓపీ నకిలీదని ఆగస్టు 29న ఎన్ఎంసీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు అప్పటివరకూ నిర్వహించిన పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. శాంతిరాంలో 25 సీట్లు కాగా, అదనంగా మరో 74 సీట్లకు ఎల్‌ఓపీలు జారీ అయినట్లు గుర్తించారు. వెంటనే రాష్ట్రంలో ఇతర వైద్య కళాశాలలు సమర్పించిన ఎల్ఓపీలను నిశితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జీఎస్ఎల్, విజయనగరం మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కూడా ఇలాంటి తతంగమే చోటుచేసుకుందని గుర్తించారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నకిలీ అనుమతుల వ్యవహారంపై ఎన్ఎంసీకి లేఖ రాయాలని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్ఎంసీని కోరాలని, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందించాలని సూచించారు. దీంతో గత నెల 31న వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ఎంసీకి లేఖ రాశారు. దీన్నిబట్టి చూస్తే.. కాస్త ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రభుత్వమే ఎన్ఎంసీని అప్రమత్తం చేసిందని అర్థమవుతుంది. వాస్తవాలకు పాతరేయడమే రామోజీ లక్ష్యం.. ఇలా నకిలీ పీజీ సీట్ల అనుమతుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, మన విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు చేపడితే ఆ విషయాలను కప్పిపుచ్చి ఏదోకలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా రామోజీ కుట్రచేశారు. మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో లోపంగా చూపించేందుకు వాస్తవాలను వక్రీకరించేందుకు తెగ తాపత్రయపడ్డారు. పైగా రాజకీయాలను ఆపాదిస్తూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. శాంతిరాం కళాశాల యజమాని వైఎస్సార్సీపీలో ఇటీవలే చేరారని, అందుకనే ఇది జరిగిందన్నట్లుగా ఈనాడు ఒక ముద్రవేసే ప్రయత్నం చేసింది. శాంతిరాం కళాశాల యజమాని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన మాట వాస్తవమే. కానీ, కొద్దిరోజుల కిందటి వరకూ ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని రామోజీ ఎందుకు దాచిపెట్టారు?. నాటి లోకేశ్ ట్వీట్ ఊసెత్తని రామోజీ.. 2019లో ఐటీ శాఖ తమ మద్దతుదారుడైన శాంతిరాంపై సోదాలు చేస్తోందని, మోడీ తీరును ఖండిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన ట్వీట్లోని అంశాలను విస్మరించి రాతలు రాయడం రామోజీరావు నిస్సిగ్గుతనానికి నిదర్శనం. నిజానికి.. ఎల్ఓపీల జారీలో గోల్మాల్ జరిగింది ఢిల్లీలోని ఎన్ఎంసీలో.. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ కాదని రాజగురువింద రామోజీకి తెలీదా? దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆపాదించడం ఎంతవరకు సబబని వైద్య వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కాలేజీలో తప్పు జరిగిందని తెలిసిన వెంటనే మిగిలిన కళాశాలలను పరిశీలించి స్వయంగా ప్రభుత్వమే ఎన్ఎంసీని అప్రమత్తం చేస్తే సక్రమంగా పనిచేసినట్లు కాదా రామోజీ? నకిలీల వ్యవహారంపై పూర్తిగా విచారణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీచేస్తే, ఈనాడు మాత్రం ఇక్కడే ఏదో జరిగిపోయినట్లు వక్రీకరణలు చేయడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం. అలాగే, ఏపీతోపాటు తమిళనాడులోనూ ఇదే తరహా వ్యవహారం వెలుగుచూసిన విషయం రామోజీ మరిచినట్లున్నారు? -
శాశ్వత నివాసితులైతే స్థానికులే..హైకోర్టు కీలక తీర్పు!
వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వ త నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. దీనిప్రకారం 2023 –24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదే శించింది. అయితే ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సరి్టఫికెట్‌ను వర్సిటీకి సమరి్పంచా లని పిటిషనర్లకు చెప్పింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి వారం రోజుల్లోగా సరి్టఫికెట్‌ను అందజేయాలని పేర్కొంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆ నిబంధన వర్తించదు. ‘తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు–2017లోని 3(జీజీజీ)(బీ) ప్రకారం విద్యారి్థని స్థానికుడిగా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని చెబుతోందని.. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు కూడా ఇచి్చందని గుర్తుచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయలేమంది. తెలంగాణలోని శాశ్వత నివాసితులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేలి్చచెప్పింది. పిటిషనర్ల కేసు.. రూల్ 3 (జీజీజీ)(బీ) కిందకు రాదని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కూ, ఈ రిట్ పిటిషన్ల వివాదానికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నందున, వారు సర్టిఫికెట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి బదిలీ కావడంతో అతడు అక్కడే ఇంటర్మీడియెట్ చదివారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నారు. అయితే, ఇంటర్ చెన్నైలో చదివినందున ఆ విద్యారి్థని నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇంటరీ్మడియెట్ స్థానికంగా చదవకుంటే నీట్లో లోకల్ కోటా (85 శాతం) కిందికి రారంటూ ప్రభుత్వం తెచ్చిన జీవో 114ను ప్రశంస రాథోడ్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకల్‌గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే తాము పోటీ పడాల్సి ఉంటుందని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఇదే తరహా పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. -
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబి పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల దడ మొదలైంది. కొందిరికి టికెట్లపై పెట్టుకున్న ఆశలు అవిరవుతున్నాయి. జనంలో పలుకుబడి లేమి, అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు బైబై చెబుతోంది గులాబీ దళం. అవినీతి ఆరోపణలే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొంపలు ముంచాయా? లైంగిక వేధింపులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ను దూరం చేసిందా? లాస్ట్ ఛాన్స్ ఇవ్వండని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు కోరుతున్నా కరుణించడం లేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులుపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి . అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు బీఅర్ఎస్ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ఇప్పటికే సిద్దం చేసింది. ఈ జాబితా లో ఉన్న పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. జాబితాలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అసిపాబాద్ అత్రం సక్కు, చెన్నూర్ నుంచి విప్ సుమన్, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి పేర్లున్నట్లు తెలుస్తోంది. కాని జాబితాలో ఎమ్మెల్యే రేఖనాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్లు లేవని సమాచారం. జిల్లాలో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ షాక్ ఇస్తున్నారని సమాచారం. దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య టిక్కెట్ రాదని కలవరపాటుకు గురవుతున్నారు. వీరి స్థానంలో ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ , బోథ్ నుంచి మాజీ ఎంపీ నగేష్ టిక్కెట్ ఖారారైందని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిని సీటుని పోత్తులో సీపీఐకి కేటాయిస్తారని పార్టీలో చర్చజరుగుతోంది. ఒకవేళ పోత్తు లేకుంటే ఎంపీ నేతకాని వెంకటేష్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనుగుంట ప్రవీణ్ పేరు ఖారారు చేస్తుందని సమాచారం. ఎమ్మెల్యే రేఖా నాయక్ పై తీవ్రమైన అవినీతి అరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, దళిత బందు, సర్కార్ పనుల కేటాయింపులలో వాటాలు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై అంతులేని ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దళితబందు, దళిత బస్తీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో వాటాలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి. వీటికితోడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట. ఎమ్మెల్యే రేఖనాయక్ పై కూడా ఇదేవిధమైన వ్యతిరేకత ఉంది. టిక్కెట్ గెలిచే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు , శేజల్ పై లైంగిక వేధింపులతో ప్రజల్లో పరువు కోల్పోయారు. అందుకే టికెట్టు ఇవ్వడంలేదట. ముచ్చట మూడోసారి పోటీ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ద్వారా టిక్కెట్ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఒక్కసారి చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? -
మెడికల్ సీట్ల కేటాయింపుపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 54 మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు, ఫలితాల ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మెడికల్ కాలేజీల్లోని కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. ఈ మేరకు జూలై 3న జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకు ముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్‌గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. పాత కాలేజీల్లో సీట్లు వస్తే సమస్యే లేదు.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను 10 ఏళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.’అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లను 15 శాతం కోటా కింద చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సర్దుబాటు చేయాలని వర్సిటీని ఆదేశించింది. సవరణ తర్వాత సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు పాత 20 మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలిగితే సమస్య ఉండదని.. లేని పక్షంలో వర్సిటీ సమరి్పంచే నివేదికను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ, విచారణ వాయిదా వేసింది. -
10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: ఇకపై 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించి కనీస ప్రామాణిక అవసరాలు (మినిమమ్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్స్)–2023 మార్గదర్శకాలను ఎన్ఎంసీ శుక్రవారం విడుదల చేసింది. అదే విధంగా.. 2024–25 విద్యా సంవత్సరానికి నూతన కళాశాలల ఏర్పాటు, మెడికల్ సీట్ల పెంపునకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. ♦ ఇకపై కొత్త వైద్య కళాశాలల్లో 50, 100, 150 సీట్ల వరకే అనుమతిస్తారు. ♦ ఎంబీబీఎస్ విద్యార్థులు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని అమలుచేస్తారు. ప్రతి ఒక్కరికీ ఏడాదికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. ♦ కళాశాల, బోధనాసుపత్రులకు వేర్వేరు భవనాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరాన్ని గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి. ♦ బోధనాస్పత్రిలో కనీసం 220 పడకలుండాలి. ♦ కళాశాలల్లో కచ్చితంగా 21 విభాగాలు ఉండాల్సిందే. ♦ కొత్తగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ రీసెర్చ్‌ను.. సిబ్బంది పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి. ♦ మూడు మ్యూజియంలు ఉండాలి. అందులో ఒకటి అనాటమీ, రెండు.. పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్.. మూడోది ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిíÜన్కు కేటాయించాలి. వీటితో పాటు లైబ్రరీ, స్కిల్ ల్యాబొరేటరీ సదుపాయాలుండాలి. ♦ కళాశాలకు అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/కమ్యూనిటీ హెల్త్/అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండాలి. ♦ ఒక్కో కేంద్రంలో 15 మంది చొప్పున విద్యార్థులను ఇంటరŠన్స్‌గా పోస్ట్ చేయాలి. -
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
థియేటర్లో సీటు కోసం గొడవ.. వృద్ధునిపై యువకుని పిడిగుద్దులు..
అమెరికాలో దారుణం జరిగింది. సినిమా హాల్లో సీటు కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడ్ని చితకబాదాడో యువకుడు. 63 ఏళ్ల వృద్ధినిపై పిడిగుద్దులు కురిపించాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్లోరిడాలోని పొంపానో బీజ్ ఏఎంసీ సినిమా థియేటర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీచ్ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ థియేటర్లో సినిమా ఆరంభమైంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇంతలో వీఐపీ టికెట్టు కొనుగోలు చేసిన ఓ వృద్ధ జంట తమ సీట్ల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఇద్దరు యువ జంట కూర్చున్నారు. దీంతో మరో సీటులో కూర్చోవలసిందిగా అభ్యర్థించాడు ఆ వృద్ధుడు. Cops in Florida looking for a man who beat up a 63-year-old man because he asked to switch seats in a Pompano Beach AMC movie theater.#TrueCrime pic.twitter.com/jBvs5IDCat — Joseph Morris (@JosephMorrisYT) July 20, 2023 ఈ చిన్న విషయానికి తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. కిందపడిన వృద్ధునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పక్కనే ఉన్న కొందరు అతన్ని అడ్డగించారు. దీంతో వివాదం అప్పటికి సద్ధుమణిగింది. కానీ ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు చెల్లించింది! -
కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో వైద్య విద్యలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముందు, తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ వైద్య కళాశాలలను ప్రైవేటు కాలేజీలకు దీటుగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు బుధవారం జారీ చేశారు. ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని మూడు విభాగాలుగా చేశారు వాటిలో 50 శాతం జనరల్ విభాగం, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ. 20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీ మెర్క్)లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు. రూ.12,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల బలోపేతానికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.12.300 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెచ్చిస్తున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025–26లో ప్రారంభించాలని నిర్ణయించారు. -
కంప్యూటర్ సైన్స్‌లో పెరిగాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం. మొత్తంగా డిమాండ్ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్‌లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి. మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి. ఎంసెట్ షెడ్యూల్లో మార్పు ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. పెంపు మంచి నిర్ణయం.. ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి. – వి.బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
48 ఉచిత బస్ సీట్లు రిజర్వు చేస్తారా !
కర్ణాటక: నగరంలోని బ్యాడరహళ్లికి చెందిన సునంద అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా 48 సీట్లు రిజర్వు చేస్తారా? అని ప్రశ్నించగా సిబ్బంది ఆశ్చర్యపోయారు. వివరాలు.. ఆమె మెజస్టిక్ కేఎస్ ఆర్టీసీ బస్టాండుకు వచ్చి, ఒక బస్సులో 48 సీట్లను రిజర్వు చేసుకోవచ్చా అని అధికారులను విచారించారు. ఉచిత ప్రయాణ వసతి ఉన్నందున 4–5 రోజుల పాటు దైవక్షేత్రాలను చూడాలని తలచింది. కుటుంబసభ్యులు, మహిళా సంఘానికి చెందిన 20 మందిని కలుపుకొని మొత్తం 48 మంది మహిళలు ప్రయాణిస్తామని, సీట్లు రిజర్వు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఉచిత బస్సుల్లో రూ.20 చెల్లించి ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా రిజర్వు చేసుకోవచ్చా అని ఆమె అడిగారు. అధికారులు పలు కారణాలు చెప్పి అన్ని సీట్లు లేవని సమాధానమిచ్చారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు. -
లోక్ సభ సీట్లు పెంపు..దక్షిణాది రాష్ట్రాలకు టోపీ!
-
కారుని ఆపగా..డ్రైవింగ్ సీటులో కుక్క!..కంగుతిన్న ట్రాఫిక్ పోలీసులు
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు రకరకాల ఎత్తుగడలు పన్నడం గురించి విన్నాం. మహా అయితే నేరాన్ని వేరే వారిపై లేదా సాక్ష్యాధారాలు మార్చడం వంటివి చేస్తారు. అంతేగాని జంతువులపై నెపం నెట్టడం చూడటం అరుదు. పట్టుపడకుండా ఉండేలా జంతువుని బుక్ చేసిన వ్యక్తి బహుశా అతడేనేమో. అతన చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన యూఎస్‌లోని కొలరాడోలో చోటే చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని కొలరాడో రోడ్డుపై కారు ఓ మాదిరి స్పీడ్‌తో వస్తుంది. ఇంతతో ఓ రహదారి వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కామన్‌గా పోలీసులు ఆపిన వెంటనే సదరు వ్యక్తులు కారుదిగి రావడం జరుగుతుంది. ఐతే ఇక్కడ కారు ఆపినా ఎవరూ బయటకు రాకుండా అలానే ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది. దీంతో పోలీసులు కారు వద్దకు నేరుగా వచ్చి చూడగా..డ్రైవింగ్ సీటులో కూర్చొన్న కుక్కను చూసి ఒక్కసారిగా పోలీసులకు ఊపిరి ఆగినంత పనిఅయ్యింది. ఈ కారుని కుక్కే డ్రైవ్ చేసుకుని వచ్చిందా అంటూ అయోమయంగా చూస్తుండిపోయారు. కాసేపటికి వారు కారుని పరికించి చూడగా ప్యాసింజర్ సీటులో ఉన్న ఓ వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులు ఆరా తీశారు. ఐతే ఆ వ్యక్తి తాను డ్రైవ్ చేయలేదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసలు తమదైన శైలిలో అడగగా సీట్లు మార్చుకున్నట్లు తెలిపాడు. అతను డ్రింక్ చేశాడేమనన్న అనుమానంతో పరీకించగా తాగిన సంకేతాలు కనబర్చాడు. అంతే అతను అరెస్టు నుంచి తప్పించుకోవాలని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు అతడినికి కేవలం 20 గజాల దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతువుల సంరక్షణాధికారి పర్యవేక్షణలో ఉంచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తాను పట్టుపడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు. (చదవండి: దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత) -
ఇంటర్ సీట్లకు పెరిగిన డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్ ఫలితాలు వెల్లడితో కార్పొరేట్ కళాశాలల సీట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా ప్రదర్శిస్తున్న ఆసక్తి విద్యా సంస్థలకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ ఒకటి, రెండ్లు సీట్లు మాత్రమే ఉన్నాయంటూ ఇష్టానుసారం ఫీజుల మోతను మోగిస్తున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచేసిన విద్యా సంస్థలు తాజాగా సీట్లకు పెరిగిన డిమాండ్‌తో మరింత పెంచి ఎలాంటి తగ్గింపు లేకుండా వసూళ్లు దిగాయి. పేరొందిన కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డే స్కాలర్‌కు కనీసం రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు చెబుతున్నారు. హాస్టల్ సౌకర్యమైతే దీనికి రెండింతలు అధికంగా ఫీజు. ఒకే కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన వివిధ బ్రాంచ్‌లలో ఫీజులు ఒక్కో విధంగా ఉంటున్నాయి. మొన్నటి దాకా అధికారికంగా ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించి కోర్సుల వారీగా.. ముందస్తు అడ్మిషన్లైతే డిస్కౌంట్ (లాక్ ఫీ) ఉంటుందని పేర్కొనగా, తాజాగా సీట్లకు డిమాండ్ పెరగడంతో డిస్కౌంట్ లేకుండా పూర్తి ఫీజు అంగీకరిస్తేనే సీటు అని తెగేసి చెబుతున్నాయి. మరోవైపు సీటు రిజర్వేషన్ కోసం రూ.10,500 చెల్లించక తప్పడం లేదు. పెను భారంగా.. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఫీజుల దోపిడీతో తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. మూడేళ్ల క్రితం కరోనా సమయం 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో చాలా వరకు విద్యా సంస్థలు దానిని అమలు చేశాయి. పైగా ఆన్లైన్ క్లాసులు జరగడం వల్ల మెయింటెనెన్స్ భారం తగ్గడంతో పాత ఫీజులు తీసుకున్నాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడంతో మళ్లీ ఫీజులు పెంచడం ప్రారంభించాయి. గత విద్యా సంవత్సరంలోనే భారీగా ఫీజులు పెంచిన యాజమాన్యాలు ఈసారి మరో 20 శాతం పెంచేశాయి. అమలుకు నోచుకోని నివేదిక.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై నియంత్రణ లేకుండా పోయింది. ఫీజుల నియంత్రణపై 2017 డిసెంబర్లో ఆచార్య తిరుపతి రావు కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది అయిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కమిటీ సిఫారసులు అమలుకు నోచుకోలేకపోయాయి. మరోవైపు ఫీజుల రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురావాలని గతేడాది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా ఈ చట్టం తయారు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రతి విద్యా సంవత్సరం పాత ఫీజులకంటే పది శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదని సూచించింది. విద్యా సంస్థల్ని నియంత్రించేలా ఇతర సూచనలను చేస్తూ సూచనలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫీజులపై నియంత్రణా లేకపోవడంతో విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
జనసేన నాయకుడి మోసానికి కిరాణా వ్యాపారి బలి
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు చేసిన మోసానికి ఓ కిరాణా వ్యాపారి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన బుడ్డెపు రామకృష్ణ (43) తమ గ్రామంలోనే కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన ఇద్దరు పిల్లలకు 2020లో సైనిక్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తానని జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు నమ్మించాడు. ఇందుకోసం అసిరినాయుడుకు రామకృష్ణ రూ.16లక్షలు ఇచ్చాడు. అయితే రామకృష్ణ పిల్లలకు సైనిక్ స్కూల్లో సీట్లు రాలేదు. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో అప్పు చేసి రూ.16లక్షలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగివ్వాలని అనేకసార్లు రామకృష్ణ అడిగినా... అసిరినాయుడు పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 31న మరోసారి అసిరినాయుడు ఇంటికి రామకృష్ణ తన భార్యతో కలిసి వచ్చి అప్పులు పెరిగిపోయాయని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ‘నీకు నచ్చినట్లు చేసుకో...’ అని అసిరినాయుడు రెచ్చిపోయాడు. దీంతో రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మూడు రోజులకే రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు రామకృష్ణను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పొందూరు పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు! జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని కంచరాం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడని, అతనికి ఉద్యోగం రాకపోవడంతో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఇదే తరహాలో కొత్తూరుకు చెందిన వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో దేహశుద్ధి కూడా చేశారని గ్రామస్తులు చెప్పారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కనీ్వనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. చదవండి: అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి -
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అద్దంకి నేతృత్వంలో ఐదు రోజులుగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సహా ఇతర కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తెలంగాణ సామాజిక కాంగ్రెస్ బృందం బీసీ, ఎస్సీ, ఎస్టీల అంశాలు, సమస్యలపై చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయా లని చేసిన విజ్ఞప్తిపై పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేగాక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని అద్దంకి వివరించారు. వీటితో పాటు ఎనిమిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ధరణి కారణంగా దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. (చదవండి: మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!) -
ఎంబీబీఎస్ సీట్లు 87% పెరిగాయ్
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 87%, పీజీ మెడికల్ సీట్లు 105% పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. గురువారం ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం 2014 తర్వాత పలు చర్యలు చేపట్టిందన్నారు. ఫలితంగా, 2014లో 387 మెడికల్ కాలేజీలుండగా, 2022 కల్లా వాటి సంఖ్య 648కి పెరిగిందన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 96%, ప్రైవేట్ కళాశాలల సంఖ్య 42% పెరిగిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 355 ప్రభుత్వ, 293 ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయని తెలిపారు. అదేవిధంగా, 2014లో ఎంబీబీఎస్ కాలేజీల్లో 51,348 సీట్లుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 96,077కు చేరిందన్నారు. 2014లో 31,185 పీజీ మెడికల్ సీట్లుండగా, 2022కు వచ్చే సరికి అవి 63,842కు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచాలనే లక్ష్యంతో 16 రాష్ట్రాల్లోని 58 కాలేజీలకు గాను 3,877 ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఇదే విధంగా, 21 రాష్ట్రాల్లోని 72 మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో 4,058 పీజీ సీట్ల పెంపునకు అనుమతించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) ద్వారా 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు, 75 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. -
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు -
34 ఏళ్ల తర్వాత రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ.. కాషాయ నేతల్లో జోష్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా బీజేపీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో 101 మంది సభ్యులను కలిగి ఉన్న ఘనత సాధించింది. దీంతో పలు విషయాల్లో బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంది. అయితే, గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుని ఈ అరుదైన ఫీట్ సాధించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరకు ఉన్న 97 సీట్లకు గాను సంఖ్య సెంచరీని క్రాస్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడాఇదే మొదటిసారి. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 29కి పడిపోయింది. ఇక, ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మరోసారి తమ సత్తా చాటుతూ రాష్ట్రంలోని మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో ఆప్ సంఖ్యా బలం ఎనిమిదికి పెరిగింది. ఇదిలా ఉండగా.. 1988 తర్వాత ఈ రికార్డు సాధించిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. అంతకు ముందు కాంగ్రెస్ 1962లో అత్యధికంగా 162 సీట్లను కలిగి ఉంది. 1988 వరకూ కాంగ్రెస్ పార్టీకి ఉభయసభల్లో సంపూర్ణ మెజారిటీ ఉండేది. దీంతో వారు సొంతంగా బిల్లులు నెగ్గించుకోవడంలోగానీ లేక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. With 101 seats, BJP hits triple digits in Rajya Sabha for first time in party’s history and becomes the first party to score century in over 3 decades, This graph depicts the rise of the our party and the decline of the Congress. Congratulations @narendramodi @JPNadda @AmitShah pic.twitter.com/huGnRlmlDG — Sanket Parmar🗨️ |🇮🇳 (@SanketParmar567) April 1, 2022 తాజాగా 34 ఏళ్ల తర్వాత బీజేపీ ఈ రికార్డును సాధించింది. దీంతో పెద్దల సభలో ఏ బిల్లు అయినా సొంత మెజారిటీతో ఆమోదింపజేసుకునే అవకాశం బీజేపీకి లభించింది. అంతే కాదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బీజేపీకి చెందిన అభ్యర్ధుల్ని నిలబెట్టి గెలిపించుకునే అవకాశం దక్కబోతోంది. అయితే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ పార్టీకి 55 సీట్లు ఉండగా.. క్రమంగా సీట్లు పెరగడం విశేషం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హవాతో బీజేపీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ విజయాలను అందుకోవడంతో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కాషాయ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. -
అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు పెద్ద సవాల్ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలే‹శ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్ఎల్డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది. లెక్కలు తేల్చడం కత్తిమీద సామే.. ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ఏడు పార్టీలు ముందుకొచ్చాయి. ఇందులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), మహాన్‌దళ్, జన్వాదీ పార్టీ (సోషలిస్టు), కృష్ణ పటేల్ నేతృత్వంలోని ఆప్నాదళ్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ, గంద్వానా గణతంత్ర పార్టీలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆర్ఎల్డీ 1.78 శాతం ఓట్లు సాధించుకోగా, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆర్ఎల్డీకి పశ్చిమ యూపీలో గట్టి పట్టు ఉంది. ఇక్కడ ఉన్న 76 స్థానాలకు గానూ కనీసంగా 35–40 సీట్లలో జాట్ల ప్రాబల్యం బలంగా ఉంది. జాట్–ముస్లింలు కలిస్తే అధిక సీట్లు కొల్లగొట్టొచ్చన్న అంచనాతో ఇక్కడ ఆర్ఎల్డీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీ 277 స్థానాల్లో పోటీ చేయగా, ఈ ఏడాది పొత్తుల కారణంగా కనీసంగా 40–50 స్థానాలకు పోటీ చేయాలని భావిస్తోంది. ఆ స్థాయిలో సీట్ల సర్దుబాటు అఖిలేశ్‌కు అంత సులభం కాదు. ఇక 30–35 స్థానాల్లో ప్రభావం చూపగల సుహెల్‌వేద్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్బర్ అఖిలేశ్ నిర్వహించిన విజయ్ రథ్ యాత్రల్లో ఆయన వెన్నంటే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీ 0.70 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయినా పోటీచేసిన 8 స్థానాల్లో 4 చోట్ల గెలిచింది. ఈ సారి కనీసంగా 20–25 స్థానాలకు పట్టుబడుతోంది. తూర్పు యూపీలో రాజ్బర్లు దాదాపు 18 శాతం మంది ఉన్నారు. ఇక్కడే అధిక సీట్లకు ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. మహాన్‌దళ్ నేత కేశవ్దేవ్ మౌర్య తమకు 12 స్థానాలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ 57 స్థానాల్లో పోటీ చేయగా, 0.12శాతం ఓట్లు సాధించుకుంది. అయితే ఓబీసీకి చెందిన పెద్ద నేతలు పలువురు ఎస్పీలోకి వస్తున్న నేపథ్యంలో ఈ పార్టీకి 3–5 సీట్లకు మించి కేటాయించే అవకాశాలు లేవు. మిగతా మిత్రపక్ష పార్టీలకు పెద్దగా బలం లేనప్పటికీ వారందిరికీ కనీసంగా 2–3 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినా, అవి కొలిక్కిరాలేదు. కొత్తవారితో తలనొప్పులే మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఒక తలనొప్పిగా ఉండగా, మరోపక్క కొత్తగా చేర్చుకుంటున్న నేతలకు టికెట్లు ఇవ్వడం అఖిలేశ్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే ఈ టికెట్‌ను బీజేపీ నుంచి ఆర్ఎల్డీలో చేరిన ఆమ్‌శీష్ రాయ్‌కు ఇస్తామని ఇప్పటికే ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ వాగ్దానం చేశారు. దీంతో ఈ సీటు కేటాయింపు చిక్కుల్లో పడింది. ఇక మౌర్య కుమారుడు ఉత్క్రిష్ట్ మౌర్య 2017లో ఊంచహార్ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి మనోజ్ పాండేపై ఓడిపోయారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మౌర్య పట్టుబడుతుండటంతో మనోజ్‌ను ఒప్పించడం అఖిలేశ్‌కు క్లిష్టంగా మారింది. ఇక మహానదళ్ నేత కేశవ్ మౌర్య కుమారుడు చంద్ర ప్రకాష్ మౌర్య ఇప్పటికే బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే బిల్సీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే శర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. వీరితో పాటే ఎస్పీలోకి వస్తున్న దారాసింగ్ చౌహాన్ (యోగి కేబినెట్ నుంచి బుధవారం రాజీనామా చేశారు) మధుబన్ నియోజకవర్గంతో పాటు మవూ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తన మద్దతుదారులకు కోరుతున్నారు. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీలో చేరిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ సైతం తన మద్దతుదారులకు 6–8 సీట్లు కోరుతున్నారు. టికెట్లు దక్కవనే అంచనాతో బీజేపీ, బీఎస్పీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన బ్రాహ్మణ నేతలు తమకు టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకొని, పొత్తులకు గౌరవమిస్తూ, కొత్తవారికి టికెట్లు కేటాయించడం, సీట్లు సర్దుబాటు చేయడం అఖిలేశ్ ముందున్న అతిపెద్ద సవాల్. -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. శుక్రవారం మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఐదు చోట్ల సొంతంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా ఏడు ఎంపీపీలకే పరిమితమైంది. జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా.. నాలుగు చోట్ల స్వతంత్రులు ఆ పదవులను చేజిక్కించుకున్నారు. కాగా, 639 మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాయిదా పడిన మండలాల్లో తిరిగి నేడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీపీ రెండో ఉపాధ్యక్ష పదవి! మండలాల్లోనూ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. -
గురుకుల సీట్లలో సగం స్థానికులకే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది గురుకుల పాఠశాలల ఐదో తరగతి అడ్మిషన్లలో స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగులు సీట్లను జిల్లాస్థాయిలోని విద్యార్థులతో భర్తీచేస్తారు. ఇంకా మిగిలితే రాష్ట్రస్థాయిలోని విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్ఈఐఎస్) సొసైటీలు ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్) నిర్వహిస్తున్నాయి. అనంతరం విద్యార్థులను కేటగిరీలవారీగా విభజించి ఆయా గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్ మాత్రం సొంతంగా ప్రవేశపరీక్ష, అడ్మిషన్లు చేపడుతోంది. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 50 శాతం సీట్లు నియోజకవర్గంలోని వారికే కేటాయిస్తారు. సీట్లు మిగిలితే జిల్లాను యూనిట్‌గా, ఇంకా మిగిలితే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. పైరవీలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకు ఒకసారి సమీక్ష.. రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యాసంస్థ మూడు నెలలకోసారి తప్పకుండా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యాసంస్థల పనితీరు, ఇతర సమస్యల్ని చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమావేశానికి నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీలతోపాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ... రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి. విమర్శలొస్తాయనే ‘స్పాట్’ నిర్వహించట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్‌కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
కొత్త కోర్సుల్లో 15,690 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వీటితోపాటు కంప్యూటర్ సైన్స్‌లో 23,040 సీట్లు, ఈసీఈలో 18,495 సీట్లకు, ఈఈఈలో 8,430 సీట్లు, ఇతర కోర్సుల్లో మిగతా సీట్లకు అనుమతి ఇచ్చింది. ఈసారి అనుబంధ గుర్తింపు లభించేదెన్నింటికో.. రాష్ట్రంలో ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. చాలా వరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఈసారి కూడా ఏఐసీటీఈ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,873 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు అందులో ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తాయో వేచి చూడాల్సిందే. అయితే ఇందులో కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న సీట్లే 15,690 ఉన్నాయి. ఇపుడు వాటన్నింటికి అనుబంధ గుర్తింపును ఇస్తాయా? కాలేజీల స్థాయిని బట్టి, వసతులను బట్టి కోత పెడతాయా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈసారి చాలా కాలేజీలు తమ కాలేజీల్లో పాత కోర్సులను, బ్రాంచీలను, సీట్లను రద్దు చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా దాదాపు 8 వేల సీట్లను రద్దు చేసుకున్నాయి. అలా రద్దు చేసుకున్న సీట్ల సంఖ్యతో పాటు అదనంగా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లకు అనుమతి ఇస్తాయి? ఎన్నింటికి కోత పెడతాయన్నది ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో తేలనుంది. -
హాట్‌కేకు.. ట్రిపుల్ఐటీ సీటు
జ్యోతినగర్(రామగుండం): ట్రిపుల్ఐటీ అనేది పదోతరగతి పూర్తిచేసిన ప్రతీ విద్యార్థి కల. అందులో సీటు సంపాదిస్తే.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చనే ఉద్దేశం. పదోతరగతిలో ప్రతిభ ఆధారంగా 10 జీపీఏ సాధించిన వారికి ట్రిపుల్‌ఐటీలో చోటు దక్కుతుంది. ఈసారి కరోనా ఎఫెక్ట్... ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీట్లు హాట్‌కేకులు అవబోతున్నాయి. పదో తరగతిలో అందరినీ పాస్ చేయగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 42,456 మంది విద్యార్థులకు 16,739 మంది 10 జీపీఏ సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా బాసర ట్రిపుల్ఐటీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులో 1,500 సీట్లు ఉండగా.. తెలంగాణవ్యాప్తంగా పెద్దమొత్తంలో 10 జీపీఏ సాధించినవారున్నారు. ఈసారి ట్రిపుల్ఐటీ సీటుకు పోటీ ఉండడంతో మూడు దశల్లో ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు.. ప్రతీ ఏడాదికన్నా ఈసారి ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించడం కష్టంగానే మారబోతోంది. ప్రభుత్వం ‘పది’లో అందరినీ పాస్ చేయగా.. 10 జీపీఏ సాధించిన వారుకూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు ప్రమాణాలు నిర్వచించింది. సీట్ల కేటాయింపును వివిధ దశల్లో పరిశీలించి, మెరుగైన ర్యాంకువచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అయినా పోటీ ఉంటే ర్యాండమ్ విధానం అవలంబిస్తారు. ఇంకా ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరనప్పటికీ.. ఇప్పటినుంచే అధికారులు ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. మూడు దశల్లో పరిశీలన... ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందాలంటే వివిధ సామాజిక రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవడంతోపాటు పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రధాన్యత ఇస్తారు. రెండోదశలో వివిధ పాఠ్యాంశాల్లో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. మొదటి ప్రాధాన్యత గణితంకు ఇవ్వగా.. సామాన్యశాస్త్రం, ఇంగ్లిష్, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్కులు పరిశీలిస్తారు. ప్రతీదశలోనూ మార్కులు సమానంగా వస్తే.. మరోదశలో విద్యార్థి పుట్టిన తేదీని ప్రమాణంగా తీసుకుంటారు. దీని ఆధారంగా గరిష్ట వయసున్న వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ మూడు దశల్లోనూ సమానంగా మార్కులు వచ్చి పోటీ నెలకొంటే చివరగా విద్యార్థి పదో తరగతి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ర్యాండమ్‌స్కోర్ ద్వారా సీటు కేటాయిస్తారు. ర్యాండమ్ విధానం ఇలా మూడు దశల్లోనూ సీటు కేటాయింపుపై సందిగ్ధత నెలకొన్న క్రమంలో చివరకు ర్యాండమ్ విధానం అమలు చేస్తారు. విద్యార్థి హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా దీన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియ అంతసులువుకాదని, విద్యావ్యవహారాలు ఇంటర్నెట్లో ఉంచే ఒక వెబ్సైట్ ద్వారా సులభపద్ధతిని అందుబాటులో ఉంచిందని పెద్దపల్లి డీఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. https://www.teachersteam.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొదటి ఆఫ్షన్లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ర్యాండమ్ ర్యాంకు లభిస్తుంది. ప్రవేశాలకు పేర్కొన్న ప్రమాణాలు సంతృప్తి పరిచి టై అయిన సమయంలో చివరగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్జీకేయూటీ సైట్లో వివరించారు. -
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేయడం ద్వారా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి పొందే ప్రక్రియను తెలంగాణ హైకోర్టు నిలిపివేయగా.. సుప్రీంకోర్టు ఆ నిర్ణయంపై స్టే ఇస్తూ ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. పిటిషనర్లు కామినేని వైద్య కళాశాల, ఎం.ఎన్.ఆర్. వైద్య కళాశాల, ప్రతిమా వైద్య కళాశాలల తరపున సీనియ ర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్, న్యాయవాది అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జూలై 12, 2018న భారత వైద్య మండలి ఇచ్చిన అను మతి ఆధారంగా తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 18 పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేసి వాటికి బదులుగా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన పీజీ డిప్లొమా ఆశావహ అభ్యర్థి ఒకరు గత నెల 22 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఈ పీజీ డిప్లొమా సీట్ల మార్పిడిని సవాలు చేశారు. దీని వల్ల పీజీ డిప్లొమా సీటు పొందడంలో తన అవకాశాలు సన్నగిల్లాయని, నిమ్స్‌లోగానీ, బసవతారకం కాలేజీల్లో గానీ తన కు రేడియాలజీలో డిప్లొమా సీటు దక్కాల్సి ఉందని పిటిషన్ వేశారు. ఇం దులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, నిమ్స్, బసవతారకం తదితర వైద్య కాలేజీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నే పథ్యంలో హైకోర్టు ఈ సీట్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే హైకోర్టు విచారించిన పిటిషన్లో తాము భాగస్వాములుగా లేమని, అప్పటికే సీట్ల మార్పిడి పూర్తయిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణ జూన్ 1కి వాయిదాపడింది. -
ఎంటెక్ సీట్లలో భారీగా కోత
సాక్షి, హైదరాబాద్ : పీజీ ఇంజనీరింగ్‌లో (ఎంటెక్) ఈసారి భారీగా సీట్లు తగ్గిపోనున్నా యి. ఇందుకోసం పలు కాలేజీల యాజమాన్యా లు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంటెక్ కోర్సుల నిర్వహణ సమస్యగా మారడం తో ఈ నిర్ణయానికి వచ్చాయి. వర్సిటీల నిబంధనల ప్రకారం ప్రతి ఎంటెక్ కోర్సులో 12 మంది విద్యార్థులకు ఒక పీహెడ్డీ అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. విద్యార్థులు పెద్ద గా కాలేజీలకు రాకపోవడం, చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో వేతన భారం తప్పించుకునేందుకు కాలేజీలు ఎంటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా యి. ఈ నేపథ్యంలో ఈసారి 2 వేల సీట్ల రద్దుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధ్యాపకులను తొలగిస్తున్నట్లు సమాచా రం పంపించడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల నగర పరిసరాల్లోని ఓ కాలేజీ యాజమాన్యం ఓ అధ్యాపకున్ని తొలగిస్తున్నట్లు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించి అదే తొలగింపు ఆర్డర్ గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆందోళనలో పడ్డారు. ఇది ఆయ న ఒక్కరి పరిస్థితే కాదు..రాష్ట్రంలోని అనేక మంది పరిస్థితి ఇదే కావడంతో ఆందోళన నెలకొంది. -
సీటు.. భారీ రేటు
ఎంసెట్ రాత పరీక్ష ముగియడంతో ఇంజినీరింగ్ సీట్ల హడావుడి మొదలైంది. ఏ బ్రాంచ్ బాగుంటుంది...? ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలి...? అనే విషయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో గందరగోళం కనిపిస్తోంది. పేరున్న కళాశాలల్లో చేరిస్తేనే క్యాంపస్ ఉద్యోగాలు..ఇతర అవకాశాలుంటాయనే అభిప్రాయంతో అందరూ ఆ వైపే మొగ్గుచూపుతున్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా నచ్చిన కళాశాలలో చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కళాశాలల నిర్వాహకులు యాజమాన్య కోటా పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచిఅందిన కాడికి దోచేందుకు సిద్ధమయ్యారు. జేఎన్టీయూ: జేఎన్టీయూ(ఏ) పరిధిలో మొత్తం 119 ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. నెల్లూరు జిల్లాలోనూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 30 కళాశాలలకు డిమాండ్ అధికంగా ఉంది. పేరున్న కళాశాలల్లోనే బీటెక్ పూర్తి చేస్తే పిల్లల భవిత బాగుంటుందన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు డొనేషన్ల విషయంలో వెనుకాడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుతో పనిలేకుండా యాజమాన్య కోటా(బీ–కేటగిరి) సీట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని పేరున్న కళాశాలలు కొన్ని తమకు తోచిన విధంగా ఫీజులను డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల భర్తీ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా... ఉన్నత విద్యా మండలి ఖాతరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులు, మధ్య తరగతి వారికి బీ–కేటగిరీ సీట్లు కూడాఅందే పరిస్థితి లేకుండాపోయింది. ముందస్తుగా మాట్లాడుకుంటే ఒక ధర.. చివరకు వెళితే మరో ధరను నిర్ణయిస్తున్నారు. నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటా ఫీజులనే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఇదీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఇక కంప్యూటర్ సైన్స్‌కు డిమాండ్ భారీగా నేపథ్యంలో కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లను తగ్గించుకొని ఈ సీట్లను పెంచుకోవడం చూస్తే కళాశాలల దోపిడీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రూ.35 వేల నుంచి మొదలు.. ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఆయా ఇంజినీరింగ్ కళాశాల్లో ఫీజులను నిర్ధారిస్తుంది. దీని ప్రకారమే ఆయా కళాశాలలు ఫీజులు వసూలు చేసుకోవాలి. మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ ఫీజులను సవరిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి ఇంజినీరింగ్ ఫీజులు రూ.35 వేల నుంచి రూ. 1.08 లక్షల వరకు ఉన్నాయి. కన్వీనర్ కోటా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బీ–కేటగిరి సీట్లకు వసూలు చేస్తున్నారు. సీట్ల కృత్రిమ కొరత బ్రాంచ్ కంటే ముఖ్యంగా ఏ కళాశాల అయితే బాగుంటుందనే విషయంపైనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు, కళాశాల ప్రగతిని మదింపు చేస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఈసీఈ ఉంది. అయితే అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు కూడా సీట్ల కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. అవగాహన తప్పనిసరి ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సు ఇంటర్ డిసిప్లినరీ ప్రధానమైన అంశంగా మారింది. సిలబస్ స్వరూపం మారిపోయింది. అన్ని బ్రాంచ్‌ల్లోనూ అవగాహన తప్పనిసరి అవుతోంది. మెకానికల్ విభాగం చదివే విద్యార్థి కంప్యూటర్ నాలెడ్జ్‌పైనా దృష్టి సారించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంచుకున్న బ్రాంచ్‌తో పాటు మరో బ్రాంచ్‌లో మైనర్ డిగ్రీ చేస్తున్నారు. అందువల్ల ఏ కోర్సు చదువుతున్నామనేది ప్రధానం కాదని.. సరైన శిక్షణ, సదుపాయాలు, మౌలిక వసతులు, అధునాతన ల్యాబ్ కలిగిన కళాశాల ఎంపిక కీలకమనేది నిపుణుల అభిప్రాయం. నిబంధనలు ఇలా.. ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు, తక్కిన 30 శాతం సీట్లు యాజమాన్య కోటాలో భర్తీ చేయాలి. ఈ 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్ఆర్ఐ, ఎన్నారై సంరక్షకుల కోటా కింద కేటాయించాలి. మిగిలిన సీట్లను ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలి. జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్యమివ్వాలి. అయితే ఇవన్నీ లేకుండా పెద్ద మొత్తాన్ని నిర్ణయించి యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. సమాన అవకాశాలు యాజమాన్య కోట్లా సీట్ల భర్తీలో ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే బ్రాంచ్‌పై దృష్టి సారించడం సరికాదు. అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. పట్టుదలతో చదివితే ఏ బ్రాంచ్‌తోనైనా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.– ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూడైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్ -
వరంగల్‌లో.. వీడని సస్పెన్స్..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కెంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. కాగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆశావహ నేతలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు టికెట్ల ఖరారు కోసం తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచనలో నిమగ్నం కాగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. పది స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సైతం అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ పంచాయితీ మంగళవారం ఢిల్లీకి చేరింది. బుధవారం ఓ మారు భేటీ అయినా... శుక్రవారం తేలే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ నుంచి మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్‌కు పిలుపు లేదు. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ డౌటే అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. వరంగల్, మహబూబాబాద్‌ల నుంచి అభ్యర్థులను బరిలో కి దింపనున్నట్లు పేర్కొన్న బీజేపీ సైతం 16వ తేదీ తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు జరిగినా.. అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే ఈ రెండు స్థానాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఇన్చార్జిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7న వరంగల్ ఓ సిటీ మైదానంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గానే కసరత్తు చేస్తోంది. డీసీసీ, టీపీసీసీ నివేదికలను ఢిల్లీకి పంపగా.. ఢిల్లీలో సైతం స్క్రీనింగ్ కమిటీ బుధవారం పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. శుక్రవారం మరోమారు జరిగే మీటింగ్ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల ప్రకటన 15 తర్వాతే.. అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీల్లో కసరత్తు సాగుతున్నా... ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అధికారికంగా 15వ తేదీ తర్వాతే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి æరోజు నుంచే అన్ని పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నా.. మరో రెండు, మూడు రోజులు వేచి చూడక తప్పేటట్లు లేదు. టిక్కెట్లపై టీఆర్ఎస్ నేతలు అధినేతపై భారం వేసుకోగా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. మహబూబాబాద్ ప్రస్తుత ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌కు ఈసారి టికెట్ రాదనే పార్టీ వర్గాలు చెప్తుండగా... వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అభ్యర్థిత్వంపై «అధినేత కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అక్కడ సీతారాంనాయక్‌ను మార్చితే మాజీ ఎమ్మెల్యే, రెడ్యానాయక్ కూతురు మాలోతు కవితకు టికెట్ ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే వరంగల్ నుంచి 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నా... మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, ఇందిరలతో పాటు ఏడెనిమిది మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుంచి సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క, బలరాంనాయక్, బెల్లయ్య నాయక్ తదితరుల పేర్లపై కసరత్తు జరుగుతోంది. ఇదిలా వుంటే బీజేపీలో మాత్రం ఇప్పటికీ ఎన్నికల జోష్ కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ సమాయత్తమవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. టికెట్ల కోసం దరఖాస్తులకే పరిమితమైన నేతలు ప్రచారం మాటెత్తడం లేదు. వరంగల్ నుంచి పరకాల మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, చింతా సాంబమూర్తి, సినీనటుడు బాబూమోహన్ పేర్లు వినిపిస్తుండగా, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, యాప సీతయ్య, సినీ నటి రేష్మా రాథోడ్ తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. -
ముగ్గురికీ ఇవ్వాల్సిందే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో సీట్ల కేటాయింపు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు కోట్ల కుటుంబం రాకతో అటు ఆలూరు, ఇటు డోన్‌లో ఎమ్మెల్యే సీటు విషయంలో చర్చ మొదలుకాగా..ఇప్పుడు కర్నూలు సీటు విషయంలో మరింత రచ్చ జరుగుతోంది. కర్నూలు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబడుతున్నారు. లేనిపక్షంలో తాము ముగ్గురమూ బరిలో ఉండబోమని టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికి సీటు ఇవ్వకపోయినా తామంతా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూలు, నంద్యాల, డోన్‌లో కూడా మొదట్లో సిట్టింగులకే ఇస్తామని చెప్పారు. అయితే, టీజీ వెంకటేష్ చక్రం తిప్పడంతో కర్నూలు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీజీ వెంకటేష్ కుమారుడు భరత్..మంత్రి లోకేష్‌తో భేటీ తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఎస్వీ, భూమా కుటుంబాలు సిద్ధమైనట్టు సమాచారం. ఎస్వీ, భూమా కుటుంబాలు వేర్వేరన్న విషయాన్ని గ్రహించాలని, ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం లేదని, రెండు కుటుంబాలకు కలిపి మూడు సీట్లు అన్న విషయాన్ని గుర్తించాలని అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది. ఇక కోట్ల కుటుంబం చేరికతో డోన్ విషయంలోనూ చర్చ మొదలయ్యింది. లోకేష్‌ను కలవడంతో.. వాస్తవానికి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్ష సందర్భంగా కర్నూలు సీటు ఎస్వీకే అని ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. నంద్యాల సీటు కూడా భూమా బ్రహ్మానందరెడ్డికే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, టీజీ భరత్ మంత్రి లోకేష్‌ను కలిసిన తర్వాత చర్చ మరో విధంగా సాగుతోంది. విజన్‌యాత్రను మరింత దూకుడుగా చేసుకోవాలని, సర్వే ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని భరత్‌తో లోకేష్ అన్నట్టు తెలుస్తోంది. దీంతో భరత్ మరింత దూకుడు పెంచారు. టీజీ కుటుంబానికి సీటివ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలయ్యింది. అయితే, ఎస్వీకి సీటు ఇవ్వకపోయినప్పటికీ ఎటూ పోయే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దీంతో భరత్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురికీ సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే బరి నుంచి తప్పుకుంటామంటూ అల్టిమేటం జారీచేసినట్టు తెలుస్తోంది. -
సంకల్పం మంచిదేగానీ...
ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు? దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్’ జాబితా వెల్లడించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) టాప్–100 జాబితాలో మాత్రం మన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది. ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు. కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి సీ. రంగ రాజన్ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్ కొఠారి కమిషన్ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట! పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి. ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు? దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్’ జాబితా వెల్లడించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) టాప్–100 జాబితాలో మాత్రం మన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది. ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు. కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి సీ. రంగ రాజన్ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్ కొఠారి కమిషన్ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట! పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి. -
ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు... 25 శాతం పెంపు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్ల పెరుగుదల వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2019–20) అమల్లోకి రానుంది. ఈ మేరకు సీట్ల పెంపు విధానంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ (ఎంహెచ్ఆర్డీ) స్పష్టత ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను కల్పించిన నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పెంచుతూ రూపొందించిన విధానాన్ని హెచ్ఆర్డీ శాఖ వెల్లడించింది. దానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా (ఈడబ్ల్యూఎస్) నామకరణం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎంహెచ్ఆర్డీ అడ్మిషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ఎన్ కాశీవిశ్వనాథం నివేదికను ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్‌కు అందజేశారు. ఆ నివేదికను యథాతథంగా అన్ని జాతీయ విద్యాసంస్థలకు ఎంహెచ్ఆర్డీ పంపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 యూనివర్సిటీలు, 40 వేల కాలేజీలు ఉండగా వాటన్నింటిలో 25 శాతం సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి 100 సీట్లకు 25 సీట్లను అదనంగా పెంచి 125 ïసీట్లు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటా ఏమాత్రం తగ్గకుండా అదనపు సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లను కేటాయించాలని çవివరించింది. అంటే ప్రతి 125 సీట్లను 100 శాతంతో సమానంగా పరిగణనలోకి తీసుకొని ఓసీ కేటగిరీలో మాత్రం అదనంగా సీట్లను కేటాయిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉన్న రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా: ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఎంహెచ్ఆర్డీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఓపెన్ కేటగిరీ (ఓసీ) వారికి 50.5 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తోంది. పెంచిన సీట్లను ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా సమాన పెంపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే అదనంగా పెరిగిన 25 శాతం సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలని ఫార్ములాను జారీ చేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లను కేటాయించడంతోపాటు ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా ఓసీ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లు వచ్చేలా ఫార్ములాను ప్రకటించింది. 25 శాతం సీట్లు పెంచిన ప్రకారం.. ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వేషన్ల ప్రకారం ప్రతి వంద సీట్లకుగాను 15 సీట్లు వస్తుండగా ఇకపై 19 సీట్లు లభిస్తాయి. అలాగే ఎస్టీలకు 7.5 సీట్లు వస్తుండగా ఇకపై 9 సీట్లు కేటాయిస్తారు. ఓబీసీలకు 27 సీట్లు ఇస్తుండగా ఇకపై 34 సీట్లను కేటాయిస్తారు. ఓపెన్ కేటగిరీలో 50.5 సీట్లను అన్ని వర్గాల వారికి సమానంగా ఇస్తుండగా దాన్ని యథాతథంగా (నాన్ ఈడబ్లూఎస్ పేరుతో) కొనసాగిస్తారు. ఇందులోనే వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 12 సీట్లను ఇస్తారు. ఇలా మొత్తంగా 125 సీట్లను 100 శాతంగా తీసుకొని భర్తీ చేసేలా మావనవనరుల అభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. లక్షల్లో సీట్లు పెరుగుదల... కేంద్రం నిర్ణయం ప్రకారం దేశంలోని విద్యాసంస్థల్లో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఈ పెంపును జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రాల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లోనూ ఈ పెంపును అమలు చేయాలని ఇప్పటికే ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీట్ల పెంపు విధానం, రిజర్వేషన్ల వర్తింపు విధానంపై స్పష్టత ఇవ్వడంతో ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టే వీలుంది. దీంతో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో సీట్లను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ డిగ్రీలోని 4.32 లక్షల సీట్లలో 2.40 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. వాటిల్లో పెంపును పక్కన పెట్టినా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, డీఎడ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో 2 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. 25 శాతం పెంపు ప్రకారం వాటిల్లో 50 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా జాతీయస్థాయిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా పోటీ పడే ముఖ్యమైన విద్యాసంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో 9,489 సీట్లు అదనంగా పెరుగునున్నాయి. తెలుగు విద్యార్థులకు మరిన్ని సీట్లు.. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎప్టీఐలలో ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 18 శాతం వరకు సీట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఇకపై పెరిగే 9,489 సీట్లలోనూ అదే నిష్పత్తిలో మన విద్యార్థులకు అదనపు సీట్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఆయా విద్యాసంస్థల్లో 37,952 సీట్లు ఉండగా 25 శాతం సీట్ల పెంపుతో అదనంగా 9,489 సీట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిల్లోని సీట్ల సంఖ్య 47,441కి చేరుకోనుంది. దీంతో పోటీలో ముందుండే తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇవి కాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ కింద ఐఐటీల్లో 800, ఎన్ఐటీల్లో 653 సీట్లను, జీఎఫ్టీఐలలోనూ సీట్లను ఎంహెచ్ఆర్డీ పెంచింది. వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు... జాతీయస్థాయి పోటీనే కాకుండా హోంస్టేట్ కోటా 50 శాతం సీట్లను స్థానికులకే కేటాయించే వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు పెరగనున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. అంటే ఇందులో తెలంగాణ విద్యార్థులకే 105 సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా లభించనున్నాయి. ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీలో 840 సీట్లు ఉండగా ప్రతి వందకు 25 సీట్ల చొప్పున పెంపుతో వాటి సంఖ్య 1,050కి చేరనుంది. అలాగే జాతీయస్థాయి పోటీగల హైదరాబాద్ ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ సీట్లు పెరుగుతాయి. మొత్తంగా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 7,23,679 సీట్లు ఉండగా 1,80,918 సీట్ల పెంపుతో అవి 9,04,598 లక్షలకు చేరుకోనున్నాయి. -
నవోదయ స్కూళ్లలో 5వేల సీట్ల పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీట్లను కేంద్రం మరో 5 వేలు పెంచింది. తాజా పెంపుతో నవోదయ విద్యాలయాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య 46,600 నుంచి 51వేలకు పెరిగింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తోంది. దేశంలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించే విద్యా సంస్థలు నవోదయ విద్యాలయాలే. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరుకాగా 2019లో ప్రవేశ పరీక్షకు నమోదు చేయించుకున్న విద్యార్థుల సంఖ్య 31 లక్షలకు చేరుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవడేకర్ తెలిపారు. -
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కుమ్ములాట పరంపర!
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటన అంశాలపై రెండు నెలలుగా అదుగో.. ఇదుగో అంటూ వార్తలు వచ్చి నప్పటికీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు పీటముడి వీడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంటే.. జిల్లాలో మాత్రం మరింత గందరగోళంగా మారింది. పినపాక మినహా మిగిలిన నాలుగు సీట్ల విషయమై ఇప్పటికీ గుంజాటన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు, అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో అసమ్మతులు రగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో అంటకాగడంతో ఇప్పటికే వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కూటమి పార్టీల మధ్య.. ముఖ్యంగా కాంగ్రెస్ – సీపీఐ మధ్య పొత్తులా, కత్తులా అనేలా పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం సీటు విషయంలో నెలకొన్న పీటముడి మరింత బిగుసుకుంది. ఈ క్రమంలో టికెట్ల వ్యవహారం మరింత వెనక్కు వెళుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో.. ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మహాకూటమి శ్రేణుల్లో మహా ఉత్కంఠ నెలకొనగా, ఆశావహులు మాత్రం ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా మారిందంటే నామినేషన్ల చివరి రోజైన ఈనెల 19 వరకు కూడా జిల్లాలోని అభ్యర్థుల ప్రకటనను సశేషంగానే ఉంచుతారేమోననే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ‘అతి’ జాగ్రత్త కాస్తా ‘హస్త’వ్యస్తంగా మారుతుందేమోనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రెండు నెలల క్రితం ఉన్న సానుకూలత.. చివరికి ప్రతికూలంగా మారుతుందని వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇల్లెందు ఎవరికి దక్కేనో? ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు వెళ్లాయి. వీరిలో చీమల వెంకటేశ్వర్లు, హరిప్రియ, డాక్టర్ రామచంద్రనాయక్, దళ్‌సింగ్, ఊకె అబ్బయ్య హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టికెట్‌ను బంజారాలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. తాజాగా రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన హరిప్రియ అనుచరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆమెకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా బరిలోకి దింపుతామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన అబ్బయ్య అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చారు. చీమల వెంకటేశ్వర్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో తనకు టికెట్ ఇవ్వడమే న్యాయమని, కచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోవైపు దళ్‌సింగ్, రామచంద్రనాయక్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభ్యర్థి ప్రకటన తర్వాత ఇక్కడ అసమ్మతి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆవిడేనా? అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీపడుతున్నప్పటికీ.. మొదటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి రేసులో ముందున్నారు. అయితే ఈ సీటు పొత్తుల్లో టీడీపీకి వచ్చే అవకాశం ఉండడంతో నాగమణి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉందని, టీడీపీ కేడర్ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిపోయిందని, కనుక నాగమణికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీకి ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కొత్తగూడెంలో కుమ్ములాట? కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్–సీపీఐ మధ్య చిక్కుముడి ఇంకా సాగుతూనే ఉంది. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్ఛిన్నమయ్యే స్థాయిలో గుంజాటన నడుస్తోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వకపోయినా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూనంనేనికి కొత్తగూడెం టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈ నెల 8న పాల్వంచలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ గృహనిర్భంధం చేసుకున్నాడు.సీపీఐ నాయకులు రంగంలోకి దిగి రాహుల్‌ను బుజ్జగించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ మధ్య గట్టి పోటీ ఉండడంతో పార్టీ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించింది. వనమా పలువురు పార్టీ పెద్దల సహకారంతో టికెట్ రేసులో ముందంజలో ఉండగా, ఎడవల్లి కృష్ణకు టికెట్ ఇప్పించేందుకు రేణుకాచౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమాకే టికెట్ వస్తుందని వార్తలు రాగా, ఇప్పుడు ఎడవల్లికే టికెట్ అనే వార్తలు వస్తున్నాయి. ఎడవల్లికి టికెట్ కోసం రేణుక అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవంత్‌రెడ్డి నడిపించగలడా? భద్రాచలం నుంచి కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న కృష్ణమోహన్, కృష్ణప్రసాద్ ఇద్దరూ కొత్తవారే. అయితే ఇక్కడ నుంచి రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కను దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సీతక్క ములుగు టికెటే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ములుగు మరో మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను ఇక్కడికి పంపించాలనుకోగా, ఆయన కూడా ములుగు కోసమే పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానాన్ని సీపీఐకి ఇచ్చేందుకు సైతం కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో ‘కుంపట్లు’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు భాగ స్వామ్య పార్టీలకు కేటాయించాల్సిన సీట్ల లెక్కలు తేలక సతమతమవుతుండగా.. మరోవైపు సొంత పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపట్లు కల వరం కలిగిస్తున్నాయి. టికెట్ల ప్రకటన వెలువడక ముందే అసమ్మతి గళాలు అంతకంతకూ పెరుగు తున్నాయి. కాంగ్రెస్ నేతలు సాక్షాత్తూ గాంధీభవన్ వేదికగానే నిరసనల కార్యక్రమాలు చేస్తుండగా.. తమకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలియడంతో తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థి నేతలు సైతం హస్తం పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. టికెట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో కీలకంగా భావిస్తున్న ఓ నాయకుడి కుమారుడు డబ్బులు తీసుకున్నాడని కొందరు ఆశావహులు బహిరంగంగానే చెబుతుండగా.. ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాళ్లకెలా ఇస్తారు? కాంగ్రెస్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా ల్లోనూ అసమ్మతులు ఉన్నప్పటికీ.. నల్లగొండ, వరం గల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. సొంత పార్టీలో టికెట్లు దక్కవని భావిస్తున్న ఆశావహులు, పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు వెళ్లే స్థానాలకు చెందిన కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళాన్ని గట్టిగానే వినిపిస్తు న్నారు. పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు.. ముఖ్య ంగా టీజేఎస్‌కు ఇస్తున్న స్థానాలపై కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంటోంది. వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్ పూర్, జనగామ, మల్కాజ్గిరి, వరంగల్ వెస్ట్ స్థానా ల్లో తమకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బహి రంగ ప్రకటనలు చేస్తున్నారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని, టీజేఎస్ అధినేత కోదండరాం జనగామ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. బీసీ సామా జిక వర్గానికి చెందిన పార్టీలోని కీలక నేత పోటీ చేయాల్సిన స్థానాన్ని మరో పార్టీకి కేటాయించి అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థిని ఎలా నిలబెడతారనే చర్చ మొదలైంది. మరోవైపు పొన్నాల కూడా దీనిపై స్పం దిస్తూ.. పార్టీ అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోబోదని వ్యాఖ్యానించారు. ఇక, వరంగల్ వెస్ట్ స్థానంలో నాయిని రాజేందర్‌రెడ్డి దూకుడుగానే వ్యవ హరిస్తున్నారు. ఈ స్థానాన్ని ఇతరులకు ఇస్తే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా లేరని ఆయన ప్రకటించడం పార్టీపై పరోక్షంగా తిరుగు బాటు సంకేతాలను సూచి స్తోంది. స్టేషన్ ఘన్పూర్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చి అక్కడ టికెట్ ఆశిస్తున్న ఇందిరను వర్ధన్నపేట నుంచి పోటీచేయాలని సూచించి నట్టుగా జరుగు తున్న ప్రచారం ఆ రెండు నియోజకవర్గా ల్లోనూ కలకలం రేపు తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఇందిర కూడా నియోజక వర్గం మారేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు మహ బూబ్‌నగర్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చి దేవర కద్ర, మక్తల్ సీట్లను టీడీపీకి ఇస్తు న్నారని జరుగుతున్న ప్రచారం ఆ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలవరం కలిగిస్తోంది. దేవరకద్ర నుంచి కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందని తమకు అధిష్టానం చెప్పిందని, మహ బూబ్‌నగర్ సీటును బీసీ కోటాలో టీడీపీకి ఇస్తున్నారని వారంటున్నారు. ఇక మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్న నందికంటి శ్రీధర్ ఏకంగా గాంధీభవన్‌లో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వాలనే ప్రతి పాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీజేఎస్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న మిర్యాలగూడ విషయంలోనూ ఇంకా స్పష్టత రావడం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందని స్థానిక నేతలు అంటుంటే, టీజేఎస్ మాత్రం ఆ స్థానం తమకే వస్తుందని భావిస్తోంది. నకిరేకల్ ఏమవుతుందో? తెలంగాణ ఇంటి పార్టీకి ఓ సీటు ఇస్తున్నట్టు గురు వారం రాత్రి కుంతియా చేసిన ప్రకటన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను కుదిపేస్తోంది. అక్కడ బలంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టేందుకే ఇలా చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నకిరేకల్‌ను వదు లుకునేది లేదని బ్రదర్స్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. నకిరేకల్ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లిలో రాస్తారోకోకు దిగారు. మరోవైపు బ్రదర్స్ కూడా లింగయ్యకు ఎట్టి పరిస్థితుల్లో నకి రేకల్ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని, లేదంటే తాము కూడా పోటీచేయబోమని అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. ఇక టీడీపీకి కేటా యిస్తున్న శేరిలింగంపల్లి విషయంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోసం హుస్నాబాద్‌ను ఆ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలో చిస్తుండగా, అక్కడ అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి అనుచరులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించాలని భావి స్తున్న సీట్ల విషయంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించని కారణంగానే ఈ అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఓయూ జేఏసీ, ఉద్యమకారులకు చోటేదీ? ఈసారి టికెట్ల కేటాయింపులో పారా చూట్లకు స్థానం ఉండదని, ఓయూ జేఏసీ నేతలు, ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తా మని రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పారు. అయితే, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ప్రచారం జరుగు తోంది. ఇప్పటి వరకు ఖరారైన 74 మంది అభ్య ర్థుల జాబితాలో వీరికి అవకాశం దక్కలేదని అం టున్నారు. ఓయూ జేఏసీ నుంచి మానవతారాయ్‌తో పాటు దాదాపు 10 మందికి పైగా టికెట్లు ఆశించినా, కనీసం ఇద్దరు లేదా ముగ్గురిౖMðనా టికెట్లు వస్తాయని భావించారు. అయితే, ఓయూ జేఏసీ నుంచి కేవలం మేడిపల్లి సత్యం (చొప్ప దండి)కి మాత్రమే టికెట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న ఓయూ జేఏసీ నేతలు ఆందోళన బాట పట్టారు. తమకు టికెట్లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ చెప్పారని, కానీ టీపీసీసీ నాయకత్వం మాత్రం తమ అను యాయులు, అనుచరులకు మాత్రమే టికెట్లు ఇచ్చేలా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తు న్నారు. తమకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవ కాశం కల్పించాలని లేదంటే తమ శవాలే తెలం గాణకు వెళ్తాయి తప్ప టికెట్లు వచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు హెచ్చరించారు. ఇక ఉద్యమకారుల జాబితాలో గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిన అద్దంకి దయాకర్, గజ్జెల కాంతం, కత్తి వెంకటస్వామిలకు ఈ సారి అధి ష్టానం మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. ఇం దులో కత్తి వెంకటస్వామి ఆశిస్తున్న చోట కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా.. దయాకర్, కాంతంలకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ, వారికి కూడా అధిషా నం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇచ్చారు.. ఇక్కడివ్వరా? ఇక అనుబంధ సంఘాల కోటాలో చాలా మంది నేతలు టికెట్లు ఆశించారు. మహిళా, యువజన కాంగ్రెస్, సేవాదళ్, గిరిజన సంఘాలతో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఈసారి టికెట్లు వస్తాయన్న ధీమాలో ఉన్నారు. అయితే వీరిలో కూడా ఎవరికీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో వారంతా టీపీసీసీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులకు అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఇచ్చారని.. తెలంగాణలో తమకెందుకు అవకాశం ఇవ్వడం లేదని ఎన్ఎస్యూఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరికి తోడు పార్టీకి దశాబ్దాలుగా సేవలు చేస్తూ గాంధీభవన్‌లో పనిచేస్తున్న ముగ్గురు, నలుగురు నాయకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తమకు కూడా అవకాశం లేదనే సంకేతాలతో వారంతా ఆందోళనలో ఉన్నారు. గాంధీభవన్‌కు తాళం.. అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు తమ అనుచరులతో కలిసి గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మల్కాజ్గిరి టికెట్‌ను టీజేఎస్‌కు కేటాయించడంపై నందికంటి శ్రీధర్ వర్గ నేతలు అక్కడ ధర్నాకు దిగారు. టీజేఎస్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు. అలాగే ఖానాపూర్‌కు చెందిన నేతలు కూడా గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఒక పక్క గేటును పూర్తిగా మూసివేయగా, రెండో గేటు నుంచి ఐడీ కార్డులు చూపించాకే లోనికి పంపిస్తున్నారు. డబ్బులు ముట్టాయా? అసమ్మతి ప్రకటనలు, నిరసనలు, ధర్నాలు, అల్టిమేటాలు ఒక ఎత్తైతే.. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి కుమారుడు డబ్బులు వసూలు చేశాడని, ఆయనకు కోట్ల రూపాయలు ముట్టాయని ఢిల్లీలోనే మకాం వేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేత ఒకరు ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఆశావహుడు ఒకరు తాను ఓ పెద్ద నాయకుడి బంధువుకు టికెట్ æకోసం డబ్బులిచ్చానని, అందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని చెబుతుండడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు గాంధీభవన్‌లో ధర్నాకు దిగిన ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. రమేశ్ రాథోడ్ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియా రూ.5 కోట్లు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.3 కోట్లు తీసుకున్నారని, ఈ విషయాన్ని రాధోడ్ స్వయంగా నియోజకవర్గంలో చెబుతున్నారని ఖానాపూర్‌కు చెందిన నేతలు ఆరోపించారు. తమకు సమయం ఇస్తే సూట్‌కేస్‌లు ఎక్కడ మారాయో రుజువులతో సహా నిరూపిస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపనున్నాయని తెలుస్తోంది. -
కాంగ్రెస్ తొలి జాబితా రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడింది. 74 మంది అభ్యర్థులతో కూడిన తమ మొదటి జాబితాను మిత్రపక్షాల జాబితాలతో కలిపి శనివారం ఉదయం హైదరాబాద్‌లో కాంగ్రెస్ విడుదల చేయనుంది. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14 స్థానా లు, తెలంగాణ జనసమితికి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. 94 స్థానాలకూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ప్రతిపాదించగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) 74 స్థానాలకు ఆమోదం తెలిపింది. మంగళ, బుధవారాల్లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు చొప్పున పేర్లను ప్రతిపాదించి సీఈసీకి పంపింది. సీఈసీ ఇదివరకే 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా గురువారం 17 స్థానాల్లో అభ్యర్థులను ఎంపి క చేసింది. గురువారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో సీఈసీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యు లు ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, అహ్మద్ పటే ల్, వీరప్ప మొయిలీ, అంబికాసోనీ, అశోక్ గెహ్లాట్‌లతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా, బోసురాజు మీడియాతో మాట్లా డారు. ‘‘పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 74 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మిగిలిన సీట్లపై సీఈసీ ఈనెల 11 లేదా 12న నిర్ణయం తీసుకుంటుంది. తొలి జాబితా ఈ నెల 10న హైదరాబాద్‌లో కూటమి పార్టీలతో కలిసి జాబితా విడుదల చేస్తాం’’అని తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఎక్కడ? తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్, మునుగోడు, మహబూబ్‌నగర్ స్థానాలను కోరుతోంది. నకిరెకల్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయినందున ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్ భార్య చెరుకు లక్ష్మి పోటీ చేయనున్నారు. చెరుకు సుధాకర్‌గౌడ్ మునుగోడు(జనరల్) ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎన్నం శ్రీని వాస్‌రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ, ఆ స్థానంలో కాంగ్రెస్ లేదా టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద సీట్లు పెండింగ్‌లో భక్తచరణ్ దాస్ నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ 94 స్థానాలకూ అభ్యర్థులను ప్రతిపాదించినప్పటికీ సీఈసీ 74 స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికను ఆమోదించింది. మిగిలిన 20 సీట్లను (ఇందులో తెలంగాణ ఇంటి పార్టీకి 1 వెళు తుంది) పెండింగ్‌లో పెట్టింది. వీటిలో కొన్ని స్థానాలను సీపీఐ, మరికొన్ని స్థానాలను టీజేఎస్ ఆశి స్తుండడం.. ఒక్కోస్థానం నుంచి పోటీ తీవ్రంగా ఉండటం కారణంగా ఆయా స్థానాలను రెండో విడతలో వెలువరించనున్నారు. ఇప్పుడే ఆయా స్థానా లను ప్రకటిస్తే అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంటుందని, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు వలస వెళ్లే ప్రమాదం ఉందన్న వ్యూహంతో వీటిని పెండింగ్‌లో పెట్టినట్టు తెలు స్తోంది. మునుగోడు, పటాన్చెరువు, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, రాజేంద్రనగర్, నకిరేకల్, నాగర్‌కర్నూల్, తుంగతుర్తి, మహబూబ్‌నగర్, దేవరకొండ, కంటోన్మెంట్, వరంగల్ ఈస్ట్, ఎల్.బి.నగర్, బోథ్, ఆదిలాబాద్, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌తోపాటు మరో రెండు కీలక స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. రేవంత్ వర్సెస్ ఉత్తమ్ అభ్యర్థుల ఖరారు విషయంలో టీపీసీసీ ముఖ్య నేతల మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ మా త్రం ఆ జాబితాను అసలు పరిగణనలోకే తీసుకోవద్దని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. -
‘లెక్క’తేలినట్టేనా?
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య లెక్కలు తేలినట్టేనా? గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుపుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతల మధ్య అంగీకారం కుదిరినట్టేనా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా గురువారం రాత్రి చేసిన ప్రకటనకు కూటమిలోని పార్టీలు కట్టుబడి ఉంటాయా?– ఇవీ ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే విషయాలను కలసి ప్రకటిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే ముందు రోజూ భాగస్వామ్య పార్టీలతో జరిపిన చర్చలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కుంతియా చేసిన ప్రకటన కూటమి పార్టీల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. పూర్తి అంగీకారం కుదరకముందే, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కసరత్తు కొలిక్కి రాకముందే కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్ల సంఖ్యను ప్రకటిం చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటనకు కూటమిలోని ఇతర పక్షాలు కట్టుబడి ఉంటాయా లేక అందులోనూ మార్పుచేర్పులుంటాయా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. సంఖ్య సరే.. స్థానాలెక్కడ? కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3, తెలంగాణ ఇంటి పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తాయని కుంతియా వెల్లడించారు. అయితే టీడీపీ 18 సీట్లు కావాలని అడుగు తున్నప్పటికీ, 14 స్థానాలకు అంగీకరించే అవకాశాలున్నాయి. టీజేఎస్ 11 సీట్లు కావాలని అడుగుతుండగా, తమకు 4 స్థానాలైనా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. అయితే ఈ రెండు పార్టీల్లో టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 సీట్లు కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ సీట్లు అటో ఇటో అయినా పోటీచేసే స్థానాలేంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేల్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏయే స్థానాలు ఏ పార్టీకి ఇవ్వాలన్న విషయంలో కూడా ఓ అవగాహనకు వచ్చి ఉంటుందని.. తమ అభిప్రాయాలు, వాదనలు వినకుండానే, చర్చలు పూర్తిస్థాయిలో జరగకుండానే సీట్ల సంఖ్యను ప్రకటించి బంతిని తమ కోర్టులోకి నెట్టిందని కూటమిలోని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తాము ప్రతిపాదిస్తున్న స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే జాబితా ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో చర్చిస్తోందని.. ఒకటి రెండు చోట్ల తప్ప కూటమి పక్షాలతో పెద్దగా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కుంతియా చెప్పిన విధంగా అన్నీ సర్దుకుంటాయా... స్వల్ప మార్పులేమైనా ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే! శనివారం కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే అంశంపై అప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోనూ ‘కుతకుత’ కూటమిలో సర్దుబాట్లు పూర్తిస్థాయిలో జరగక ముందే స్థానాల సంఖ్యను ప్రకటించిన కాంగ్రెస్‌లో అంతర్గతంగా సామాజిక సమీకరణలు కుదురుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు కనీసం 34 స్థానాలు ఇవ్వాలని పార్టీలోని బీసీ నేతలు కోరుతుండగా, 32 సీట్లను ఇవ్వచ్చనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ చర్చల అనంతరం ఈ సంఖ్య 25కు పడిపోయిందని కాంగ్రెస్‌లోని బీసీ నేతలంటున్నారు. బీసీలు ఆశిస్తున్న స్థానాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇస్తున్నారని.. శేరిలింగంపల్లి, జనగామ స్థానాలను వదులుకోకుంటే బీసీ నేతలే పోటీచేస్తారని వారంటున్నారు. దీనికి తోడు అగ్రవర్ణాలకు చెందిన నేతలు పోటీచేసే అవకాశమన్న స్థానాలను మాత్రం మిత్రపక్షాలు కోరుతున్నప్పటికీ, ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లోనూ ఒకటి, రెండు సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. అత్యధిక జనాభా ఉన్న యాదవ, ముదిరాజ్ కులస్తులను సీట్ల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ‘‘యాదవులు, ముదిరాజ్‌లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ సామాజికవర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు రెండు సామాజిక వర్గాలకు చెరో రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా సిట్టింగ్‌లందరికీ అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ మాత్రం మాకు 6 నుంచి 7 సీట్లు ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో’’ అని ఢిల్లీలో ఉన్న బీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన సీట్లు ఇవీ.. టీడీపీ : శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్పల్లి, చార్మినార్, మలక్‌పేట, అశ్వారావుపేట, ఖమ్మం, సత్తుపల్లి, మక్తల్, దేవరకద్రలతోపాటు, వరంగల్ ఈస్ట్ లేదా వెస్ట్‌లలో ఒకస్థానం. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పఠాన్‌చెరు, కోదాడల్లో రెండు స్థానాలు. టీజేఎస్ : జనగాం, మెదక్, మల్కాజ్గిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్దన్నపేట, మిర్యాలగూడ స్థానాలు ఖరారు కాగా.. చెన్నూరు, మహబూబ్‌నగర్, వరంగల్ (ఈస్ట్)లలో రెండు కావాలని టీజేఎస్ అడుగుతోంది. సీపీఐ : బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్‌లు ఖరారయ్యాయని సమాచారం. అయితే, బెల్లంపల్లి బదులుగా మంచిర్యాల కావాలని సీపీఐ కోరుతోంది. అదనంగా కొత్తగూడెంతో పాటు నల్లగొండ జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని ఆశిస్తోంది. ఇంటిపార్టీ : నకిరేకల్ లేదా మునుగోడు కాంగ్రెస్ చెప్పిన కూటమి లెక్క ఇదే... పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య కాంగ్రెస్ 93 టీడీపీ 14 టీజేఎస్ 08 సీపీఐ 03 ఇంటిపార్టీ 01 మొత్తం 119 -
సగం సీట్లు ఇవ్వకుంటే ఓటమే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించకుంటే ఆయా రాజకీయ పార్టీలను కచ్చితంగా ఓడించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు తప్పనిసరిగా 60 సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం 20 సీట్లు కేటాయించకుండా తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాలోనూ బీసీలకు ప్రాధాన్యత లభించలేదని మండిపడ్డారు. ఒకవేళ మహా కూటమిలోనూ బీసీలకు అన్యాయం జరిగితే ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీసీల కోసం పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ పాల్గొన్నారు. -
సర్దుబాటు.. 2–3 రోజుల్లో కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. మిత్రపక్షాలు ఆశిస్తున్న సీట్లలో ఎవరికి ఏయే స్థానాలు ఇవ్వాలనే విషయమై టీడీపీ, టీజేఎస్, సీపీఐ ముఖ్య నేతలు ఎల్. రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి తదితరులతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక చర్చలు ప్రారంభించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు, ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నాలుగు పార్టీల నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ చర్చల్లో ఇప్పటివరకు కేవలం 11 సీట్లపై మాత్రమే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఏం చేద్దామన్న దానిపై ఆయా పార్టీల నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇతర పార్టీలు కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపగా కాంగ్రెస్ పార్టీ 95 చోట్ల బరిలో ఉండాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 12.. అనివార్యమైతే 13, టీజేఎస్‌కు 6–7, సీపీఐకి 4–5 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ఈ మేరకు సీట్ల సంఖ్యపై నాలుగు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. శనివారం లేదా ఆదివారం రాత్రికల్లా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన వీడే అవకాశముందని తెలుస్తోంది. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో 70–75 స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలపై ఆయా పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. మిగిలిన స్థానాలపై శుక్రవారం నాటికి ఓ అంచనాకు రానున్నారు. ఆ తర్వాత మరోమారు అన్ని పార్టీల నేతలు సమావేశమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం. వ్యూహాత్మకంగా ముందుకు... సీట్ల సర్దుబాటు తేలాక ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఆయా పార్టీల తరఫున ఎవరు బరిలో ఉంటారనే విషయాలను అధికారికంగా ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కూటమిలోని పక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి తొలుత 50–60 స్థానాలపై 2–3 రోజుల్లో ప్రకటన చేయాలని, ఆ తర్వాత అధికార పార్టీ అనుసరించే వ్యూహాన్ని పరిశీలించి మిగిలిన అభ్యర్థులను తేల్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కూటమిలోని ఓ ముఖ్య నేత మాట్లాడుతూ ‘కూటమిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఏ పార్టీ అభ్యర్థులెవరు అని ప్రకటించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మా ప్రకటన కోసం టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. మేం అక్కడ చెప్పగానే, ఇక్కడ అసంతృప్తులను లాక్కునేందుకు సిద్ధంగా ఉంది. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకొని ముందుకెళ్తున్నాం. ఈసారి కేసీఆరే మా ట్రాప్‌లో పడాలి తప్ప మేం కేసీఆర్ ట్రాప్‌లో పడేది లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని చోట్లా ఇబ్బందే...! విశ్వసనీయ సమాచారం ప్రకారం... పొత్తుల్లో భాగంగా సీపీఐ అడుగుతున్న అన్ని చోట్లా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. తొలు త 12 స్థానాలను ఇవ్వాలని పట్టుపట్టిన సీపీఐ ఆ తర్వాత 9 స్థానాలతో సరిపెట్టుకుంటామని చెప్పింది. కానీ కాంగ్రెస్ మాత్రం 4–5 స్థానాలను ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సీపీఐ ప్రతిపాదించిన హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలన్నింటిలోనూ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే ఉండటంతో సీపీఐ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంలో స్పష్టత వచ్చేందుకు సమయం పట్టనుంది. మూడు ఓకే.. మూడు పెండింగ్... తెలంగాణ జనసమితి విషయానికి వస్తే ఆ పార్టీ పోటీ చేసే సీట్ల విషయంలో మూడు చోట్ల కాంగ్రెస్, టీజేఎస్ ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ అభిప్రాయం ప్రకారం మల్కాజ్గిరి, చెన్నూరు, ముథోల్ స్థానాలు టీజేఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. వరంగల్ (ఈస్ట్), ఎల్లారెడ్డి, తాండూరు స్థానాలనూ టీజేఎస్ అడుగుతున్నా అక్కడ పోటీ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని సమాచారం. వాటితోపాటు కొల్లాపూర్, మేడ్చల్, రామగుండం సీట్లనూ టీజేఎస్ అడుగుతోందని, ఆ స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఏడు క్లియర్.. 14పై పీటముడి.. తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇందులో కూకట్పల్లి, ఉప్పల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, మక్తల్, చార్మినార్, మలక్‌పేట స్థానాల విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య అవగాహన కుదిరినట్లు కనిపిస్తోంది. మిగిలిన 5 చోట్ల.. మరీ అవసరమైతే 6 చోట్ల టీడీపీ పోటీ చేసేందుకుగాను 13 అసెంబ్లీ స్థానాలపై చర్చ జరుగుతోంది. ఇందులో ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, కోదాడ, ఖమ్మం, నిజామాబాద్ రూరల్, పటాన్చెరు, సికింద్రాబాద్, సనత్‌నగర్, ముషీరాబాద్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ స్థానాలున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాల్లో తమకు దీటైన అభ్యర్థులున్నందున ఈ స్థానాలను ఇవ్వలేమని కాంగ్రెస్ అంటోంది. తదుపరి చర్చల్లో ఈ సీట్లపై కాంగ్రెస్, టీడీపీ మధ్య స్పష్టత రావాల్సి ఉంది. -
ఇంజినీరింగ్‌లో 73 శాతం ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్ : ఇంజినీరింగ్ సీట్ల అలాట్మెంట్ను ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. జిల్లాలోని ఆరు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2217 సీట్లకు గాను 1626 సీట్లలో(73.24 శాతం) ప్రవేశాలు జరిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది తొలిసారి ప్రారంభించిన ఇంజినీరింగ్ కాలేజీలో 180కి 169 సీట్లు అలాట్ అయ్యాయి. రెండో కౌన్సెలింగ్ శత శాతం ప్రవేశాలు జరిగాయి. మూడు బ్రాంచ్‌లు ప్రారంభించగా సీఎస్ఈలో 60కి 57, ఈసీఈ, మెకానికల్‌లో 60కి 56 చొప్పున ప్రవేశాలు జరిగాయి. రెండు ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ ఏడాది 7886 మంది ఎంసెట్ రాశారు. గత ఏడాది 1953కి 1496 సీట్లలో ప్రవేశాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది అరు ప్రైవేట్ కళాశాలు ఉండగా, ఒక ప్రైవేట్ కళాశాల మూత పడింది. గత ఏడాది తుదివిడత కౌన్సెలింగ్‌లో ఈ కళాశాల తప్పుకుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సీట్లు కాలేజీల్లో రిజర్వ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రత్యేక కేటగిరీకి చెందిన ఆంగ్లో ఇండియన్ దివ్యాంగులు క్రీడలు క్యాప్, ఎన్సీసీ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించలేదు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఈ ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు ప్రైవేటు కళాశాలల్లో ఈ సీట్లకు ప్రవేశాలు కల్పించకుండా వదిలేశారు. -
10,122 ఇంజనీరింగ్ సీట్ల కోత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 10,122 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత పెట్టింది. 14 కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో కొన్ని స్వచ్ఛందంగా మూసివేత కోసం దరఖాస్తు చేసుకోగా, మరికొన్నింటికి ఏఐసీటీఈ అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. గతేడాది రాష్ట్రంలోని 242 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,24,239 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 228 కాలేజీల్లోని 1,14,117 సీట్లకే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపించింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాలేజీల మూత రాష్ట్రంలో పాత రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 కాలేజీలు మూతపడ్డాయి. గతేడాది ఈ కాలేజీలు కొనసాగినా.. ఈసారి అనుమతులు రాలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది 26 ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఈసారి 21 కాలేజీలకే అనుమతులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కాలేజీల సంఖ్య 119 నుంచి 113కు, ఖమ్మం జిల్లాలో 18 నుంచి 15 కాలేజీలకు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాల్లో అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినా సీట్ల సంఖ్యలో మాత్రం కోత పడింది. జేఎన్టీయూ ‘గుర్తింపు’లో మరింత కోత! ఇంజనీరింగ్ కాలేజీల్లో పది వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించగా... రాష్ట్రంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన జేఎన్టీయూ చర్యలతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతించినా... జేఎన్టీయూ సహా రాష్ట్ర వర్సిటీలు 97,961 సీట్ల భర్తీకే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే కాలేజీల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలకు గుర్తింపు రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవల ప్రకటించింది. దీంతో మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జేఎన్టీయూ ఇప్పటికే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలు చేపట్టి.. నివేదికలను క్రోడీకరించింది. అందులో ఏయే కాలేజీల్లోని, ఏయే బ్రాంచీల్లో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయని పరిశీలిస్తోంది. అలా గుర్తించిన బ్రాంచీలను రద్దు చేయనుంది. మొత్తంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఈనెల 15వ తేదీలోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించనుంది. పాలిటెక్నిక్‌లో 4వేల సీట్ల తగ్గింపు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ నాలుగు వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించింది. పలు కాలేజీలకు అనుమతులు కూడా రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో 201 కాలేజీల్లో 51,625 సీట్లు అందుబాటులో ఉండగా... ఈసారి 187 కాలేజీల్లో 47,264 సీట్లకు అనుమతులు వచ్చాయి. డి.ఫార్మసీలో మాత్రం గతేడాది అనుమతించిన 15 కాలేజీల్లోని 830 సీట్లకు ఈసారి కూడా పూర్తిగా అనుమతి ఇచ్చింది. -
ట్రిపుల్‌ఐటీలో పెరగనున్న సీట్లు!
బాసర(ముథోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2018–19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 500 సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2008లో 2000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల సీట్ల నుంచి వెయ్యి సీట్లకు కుదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పలుసార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో 6వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లు విద్యాభ్యాసం పూర్తి చేసిన వందలాదిమందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం 500 సీట్లు పెరగనుండడంతో గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగనుంది. సీట్ల పెంపు సమాచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
ఎయిరిండియాలో ఆ సీట్లు ఇక కాస్ట్లీనే!
మీ కుటుంబమంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఎయిరిండియా విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా...? అయితే ఇక ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందేనట. సదూర విమానాల్లో ముందు వరుస సీట్లకు ఇప్పటివరకు ఛార్జీలు విధిస్తున్న ఎయిరిండియా.. తాజాగా మధ్య సీట్లకు, విండో సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటికీ ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఎయిరిండియా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజెంట్లకు ఓ సర్క్యూలర్ జారీచేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు ఫీజు రూ.100గా ఎయిరిండియా నిర్ణయించింది. విండో సీటు కోరుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే ఖాఠ్మాండు ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100నే ఛార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజు మరింత అధికంగా ఉండనుందని ఎయిరిండియా పేర్కొంది. అయితే ఇది మార్గాలను బట్టి ఉంటుందని తెలిపింది. సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు విధించడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తున్నట్టు చెప్పింది. ఈ ఛార్జీలు ఎయిర్‌లైన్స్ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయని తెలిపింది. మధ్య, ఇతర సీట్ల ఎంపికపై ఛార్జీల విధింపును ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్ చేసుకునేటప్పుడు లేదా వెబ్ చెక్-ఇన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. -
హస్తంలో.. నూతనోత్సాహం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మూడున్నరేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ... స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతల్లో భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెరిగింది. టీఆర్ఎస్లోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆయా నియోజకవర్గాల్లో పెరిగిన వ్యతిరేకత తమకు లాభిస్తుందన్న అంచనాతో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మెజారిటీ వర్గంగా ఉన్న ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య ఇటీవల చోటు చేసుకున్న విభేదాలు, ఆదివాసీల ఆందోళ నలు కూడా కాంగ్రెస్‌కు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో హుషారు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కించుకునే ప్రయత్నాలు పెరిగాయి. బహు నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అప్పుడే టిక్కెట్ల కోసం కొందరు నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పైరవీలు జరుపుతున్నారు. కలిసి రానున్న ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలు ప్రస్తుతం టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. ఈ పదింట ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇందులో ఓ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సీటుతో పాటు మూడు ఎస్టీ నియోజకవర్గాలు, తూర్పు ప్రాంతంలోని మరో రెండు స్థానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో ముఖ్యమంత్రి రెండు విడతలుగా జరిపిన సర్వేల్లో కూడా వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు తేల్చడం కాంగ్రెస్ నాయకుల్లో సమరోత్సాహానికి కారణమవుతోంది. వీటితో పాటు ఆదివాసీలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు ఇంటలిజెన్స్ రిపోర్టులు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆశావహులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర విజయవంతమైంది. దీంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఢీకొట్టేందుకు మహేశ్వర్‌రెడ్డి ఉర్రూతలూగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతల పర్యటన జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ వీరే కాంగ్రెస్ హీరోలు నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతన్నారు. ఆయనకు ఇక్కడ ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించేవారు కూడా లేరు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమంతో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఆదివాసీ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావుతో పాటు ఆత్రం సక్కు పాత్ర కూడా మరువలేనిది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గత మూడేళ్లుగా తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశిస్తున్నా, ప్రేంసాగర్‌రావే ప్రత్యామ్నాయం అనే రీతిలో నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అరవింద్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళతారనే ప్రచారం నేపథ్యంలో ప్రేంసాగర్‌రావుకు కాంగ్రెస్‌లో ఎదురులేని పరిస్థితి. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్ధన్ పరిస్థితి కూడా అదే. టీడీపీ నుంచి వలస వచ్చిన ఆయనే ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యారు. సిర్పూరులో రావి శ్రీనివాస్ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడే. ఆయన కూడా ఇప్పుడు సిర్పూరు సీటు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ నాయకుడు లేని పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో పోటీ అధికం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి శ్రీరాంచంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్ దేశ్‌పాండేలు టికెట్లు ఆశిస్తున్నారు. సామాజిక కుల పరంగా ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లు కీలకంగా ఉండగా, టీఆర్ఎస్ నుంచి జోగు రామన్న పోటీలో ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన గండ్రత్ సుజాత తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీరాంచంద్రారెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆయన వయసే అడ్డంకిగా మారింది. యువ నాయకుడైన భార్గవ్ దేశ్‌పాండే గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. మరోసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ జాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది వరకు బోథ్ నియోజకవర్గంలో ఆయన పరిస్థితికి డోకా లేకున్న ఇటీవల కాలంలో ఆదివాసీ ఉద్యమంతో జోరు పెంచిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో పోటీ ఏర్పడింది. అధిష్టానం ఆశీస్సులతోనే సోయం కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భరత్ చౌహాన్, హరినాయక్‌లు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి హరినాయక్ పోటీ చేసినప్పటికి ఓటమి చెందాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగెందుకు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి ఆజ్మీరా హరినాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భరత్ చౌహన్లు తమ ప్రయత్నాలు మమ్మురం చేశారు. అయితే రాథోడ్ రమేశ్ టీఆర్ఎస్లో చేరక ముందు కేసీఆర్ సేవాదళ్ అధ్యక్షురాలుగా చారులత ప్రజల ముందుకు వచ్చి టీఆర్ఎస్ నుంచి టికెట్ అశించారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో చారులత కూడా కాంగ్రెస్ టిక్కెట్ అశిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధికారిగా కొనసాగుతున్న రాంకిషన్ నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. బెల్లంపల్లిలో ఆశావహులు ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఇద్దరి ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చిలుముల శంకర్, మున్సిపల్ కౌన్సెలర్ రొడ్డ శారద, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.దుర్గాభవానీ టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. భవిష్యత్తులో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఉంటే ఈసారి కూడా బెల్లంపల్లి స్థానాన్ని వదిలేసే అవకాశాలు లేకపోలేదు. ముథోల్‌లో మూడు ముక్కలాట మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. టికెట్టు విషయంలో ఈయన సోదరుడు బోస్లే మోహన్‌రావుపటేల్ ఈసారి పోటీచేస్తారని అంతా అనుకుంటున్నారు. టికెట్టు ఇద్దరిలో ఎవరికి వస్తుందో తెలియడంలేదు. ఆయనకు వరుసకు సోదరుడైన పవార్ రామారావుపటేల్ సైతం కాంగ్రెస్‌పార్టీలో చురుకైన పాత్రపోషిస్తున్నారు. అనసూయపవార్ ట్రస్ట్‌పేరిట సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. భైంసాలో రాధమ్మ భోజనాలయంలో రూ.10కే భోజనం, ఉచిత ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కిసాన్ సందేశ్యాత్రను కూడా ప్రారంభిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, అనసూయపవార్ ట్రస్ట్ చైర్మన్ పవార్ రామారావుపటేల్‌లు పోటాపోటీగా కాంగ్రెస్ అధిష్టానంలో నాయకులను కలుస్తున్నారు. -
‘కారు’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గర పలుకుబడి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి తమ స్థానాలను బలంగా చేసుకొని పాత గులాబీ నేతలను పక్కన పెట్టడంలో విజయం సాధించారు. ఖానాపూర్ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొన్నటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనతో ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్ నేతల మనోబలం పెరగగా... పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టుకోసం ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒరిజనల్ గులాబీ నేతలకు స్థానం లేనట్టే..! ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేంతా ప్రస్తుతం సాంకేతికంగా టీఆర్ఎస్ చెందిన వారే. బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), కోనేరు కోనప్ప(సిర్పూరు) ఏకంగా పార్టీనే విలీనం చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారారు. ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. మిగతా ఏడుగురు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారే. నిర్మల్, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల్లో 2014లో ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అక్కడ మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సముద్రాల వేణుగోపాలాచారి ముథోల్ నుంచి ఓడిపోయినప్పటికీ, మళ్లీ ఆ నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు. రాజ్యసభకు పంపిస్తే వెళ్లే ఆలోచనలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు సమాచారం. ఇక సిర్పూరు నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ... కోనేరు కోనప్ప పట్లనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సానుకూల ధృక్పథంతో ఉన్నారు. కోనప్ప సైతం ప్రజల మధ్య ఉంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం టీఆర్ఎస్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కూచాడి శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ, మంత్రి ఏలుబడిలో పార్టీకే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురిలో టిక్కెట్టు రాని పక్షంలో వేరే మార్గం చూసుకునే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా వ్యూహాలు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురిలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సదాభిప్రాయంతో లేరనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వచ్చేసారికి అవకాశం ఇస్తా’ అనే హామీ పొందినట్లు కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటూ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ఎదురు లేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసారి కూడా ఆయనకే అవకాశం అనడంలో అతిశయోక్తి లేదు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్ ఈసారి ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆసిఫాబాద్ సర్పంచ్, కోవ లక్ష్మి చెల్లెలు మర్సోకోల సరస్వతి కూడా టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు రమేష్‌రాథోడ్ ప్రకటించడం గమనార్హం. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంపై ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కన్నేయడంతో బాపూరావు పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. మంచిర్యాల జిల్లాలో రసవత్తరం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను బలం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి జి.వినోద్‌కుమార్ నుంచి సీటు గండం పొంచి ఉంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి గులాబీ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోదరులు ఈసారి తమ పూర్వ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తే ఓదెలుకు ఇబ్బందికరమే. అయితే వివేక్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అడపాదడపా కనిపిస్తున్నా... వినోద్‌కుమార్ మాత్రం చెన్నూరుకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో తనకు ఢోకా ఉండదనే ధీమాతో ఓదెలు ఉన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్థానంలో సీటు కోసం సొంత పార్టీలో చాలా మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు ఇటీవలి కాలంలో శుభాకాంక్షలు, అభినందనల ఫ్లెక్సీలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ఎంపీపీ మొదలుకొని మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ పర్యటన సందర్భంగా వేదిక పైనుంచి ఎమ్మెల్యే కోరికల పేరుతో మంచిర్యాలకు వరాలు ప్రకటించడం దివాకర్‌రావు వర్గానికి బలాన్ని పెంచింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి మళ్లీ టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఆయన గత నెల 24నే పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగినా, సీఎం సమక్షంలో కూడా టీఆర్ఎస్లో చేరకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఊపిరి పీల్చుకుంటోంది. -
తెలంగాణలో భారీగా ఇంజనీరింగ్ సీట్ల తగ్గింపు
-
ఫ్లోట్ సీట్.. ఫీల్ గుడ్
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న నగర యువత నూతనఆవిష్కరణలపై ఆసక్తి చూపుతోంది. సామాజిక, ఆరోగ్య స్పృహతో అత్యాధునిక సాధనాలు కనుగొంటోంది. నగర రోడ్లపై ప్రయాణంలో తమకు ఎదురైన సమస్యల పరిష్కారానికి శ్రమించిన సిటీ మిత్రత్రయం... సాఫీ ప్రయాణానికి ఫ్లోట్లు రూపొందించింది. నగరానికి చెందిన మాధవ్ సాయిరామ్ కొల్లి, విశ్వనాథ్ మల్లాది, సంతోష్‌కుమార్ సామల సూరత్‌లోని ఎన్ఐటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. అక్కడ స్నేహితులైన వీరు స్టార్టప్ ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. 2015లో చదువు పూర్తయ్యాక సిటీకి వచ్చి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. అయితే సిటీ రోడ్లపై ప్రయాణం వారిని ఆలోచనలో పడేసింది. చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. 70 శాతం మంది ‘కంఫర్ట్’ జర్నీ చేయలేకపోతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. దీనికి పరిష్కారం కనుగొనాలని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ‘ఫీల్ గుడ్ ఇన్నోవేషన్’ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. అనూహ్య స్పందన.. డ్రైవింగ్ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ‘ఫ్లోట్’లను రూపొందించారు వీరు. వీటిని కార్లు, బైకులలోని సీటుపై అమర్చుకుంటే హాయిగా ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు. ‘నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే గంటలకొద్దీ నిరీక్షించాలి. సుదూర ప్రయాణం చేసే సందర్భాల్లో వెన్నునొప్పి సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ జరగక తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు అతి చౌక ధరకే ఫ్లోట్లు తయారు చేశామ’ని చెప్పారీ మిత్రులు. ‘ఇటీవల గుజరాత్లో జరిగిన ఐక్రియేట్ స్టార్టప్‌ల కార్యక్రమంలో నగరం నుంచి మేం ఒక్కరమే పాల్గొన్నాం. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మా ఐడియాకు మెచ్చుకున్నారు. మా ప్రొడక్ట్స్‌కు నగర వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 1500 ఆర్డర్లు వచ్చాయి. కావాల్సినవారు https://www.fueladream.com/ వెబ్సైట్లో సంప్రదించొచ్చు. పనిచేస్తుందిలా... ‘గాలి ప్రసరణ జరిగి రైడర్‌కు హాయిని కలిగించేంచేలా ప్యూర్ లెదర్‌తో తయారు చేసిన ఫ్లోట్ బ్రీతబుల్ మెషిన్లో ఎయిర్ ప్యాకెట్లు ఉండేలా చూశాం. ఇవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటంతో లోపల ఎయిర్ ప్యాకెట్లలో గాలి కదలాడుతుంటుంది. అవసరాన్ని బట్టి 30–70 శాతం మేర గాలి నింపుకొని బైక్, కార్లకు సీటుగా ఉపయోగించుకోవచ్చు. తొలుత 10వేల కిలోమీటర్లు పరీక్షలు చేశాం. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహకారాన్ని తీసుకున్నాం. సత్ఫలితాలు వచ్చాకే మార్కెట్లోకి వచ్చామ’ని వివరించారు. -
డిగ్రీలో లక్ష సీట్లకు కోత!
► భారీగా మిగిలిపోతుండటంతో ఉన్నత విద్యా మండలి నిర్ణయం ► వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమల్లోకి..! ► 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలకు అనుమతి రద్దు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఏటేటా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండటంతో సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఏకంగా లక్ష వరకు సీట్లను రద్దు చేయాలని... వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 1,092 డిగ్రీ కాలేజీల్లో 4.10 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా అందులో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఈసారి సగం సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో దశ కౌన్సెలింగ్ ముగిసేనాటికి 1,93,198 సీట్లు భర్తీ కాగా.. నాలుగో దశ కౌన్సెలింగ్‌లో మరో 8,789 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వారందరూ కాలేజీల్లో చేరినా భర్తీ అయ్యే సీట్లు 2.01 లక్షలకు మించని పరిస్థితి నెలకొంది. 25 శాతం సీట్లు నిండకుంటే.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండడంతో.. ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కొత్త కాలేజీలకు అనుమతులను నిలిపివేసింది. తాజాగా సీట్ల కోతపై దృష్టి సారించింది. కనీసం 25 శాతమైనా సీట్లు భర్తీ కాని కాలేజీలను కొనసాగించడం కష్టమని, అందువల్ల అలాంటి కాలేజీలను మూసివేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. వాటిల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని యూనివర్సిటీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలా 50కి పైగా కాలేజీల్లో ప్రవేశాలు రద్దు కానున్నాయి. ఇవేగాకుండా వచ్చే ఏడాది ప్రవేశాల సమయం నాటికి మరిన్ని సీట్లను రద్దు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ కాలేజీల్లోనూ నాణ్యతా ప్రమాణాలు, ఫ్యాకల్టీ, ఇతర సదుపాయాలకు సంబంధించిన అంశాలపై తనిఖీలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా లోపాలున్న కాలేజీలను మూసివేయాలని.. మొత్తంగా వచ్చే ఏడాది నాటికి లక్ష సీట్లకు కోత పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారీగా తగ్గిపోతున్న ప్రవేశాలు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు ఏటేటా తగ్గిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా అయితే ఏకంగా 20 వేల చొప్పున విద్యార్థులు తగ్గిపోయారు. 2014–15లో 2.65 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2.01 లక్షలకు పడిపోయింది. మరోవైపు ఏటా డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014–15లో 3.65 లక్షల సీట్లు ఉండగా.. ప్రస్తుతం 4.10 లక్షలకు పెరిగాయి. కానీ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవడం, ఇతర కోర్సుల సీట్లను కన్వర్షన్ చేసుకోవడం వంటివి చేస్తున్నా.. సీట్ల భర్తీ తక్కువే ఉంటోంది. -
నిట్‌కు నూతన బ్యాచ్
నేడు ఓరియంటేషన్ నాలుగు కొత్త లోగోలు తయారీ ఈ ఏడాది 480కు 438 సీట్లు భర్తీ మొత్తం విద్యార్థులు 1,224 తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్)లో కొత్తబ్యాచ్ బుధవారం రానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు రానున్నారు. ఏపీ నిట్ ఇక్కడ ఏర్పాటుచేసిన తర్వాత అధిక శాతంలో విద్యార్థులు ఈ ఏడాది చేరారు. మొత్తం సీట్లు 480కు 438 సీట్లు భర్తీకాగా 42 మిగిలాయి. హోం స్టేట్ కోటా కింద 240 సీట్లు, ఇతర కోటా కింద 240 సీట్లు నిట్‌లో ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు సీటు పొందే విషయంలో ప్రాధాన్యతను ఏపీ నిట్‌కు ఇచ్చారు. నిట్ ఏర్పాటుచేసిన మొదటి రెండేళ్లలో 960 (480+480) సీట్లకు 786 మంది విద్యార్థులు చేరారు. అయితే ఈఏడాది 480 సీట్లకు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల భర్తీకి సీశాబ్ పేరిట ప్రత్యేక రౌండ్ కేటాయించడంతో నిట్‌లో చేరాలనుకున్న విద్యార్థుల ఆశలు నెరవేరాయి. దీంతో మరికొందరు ఇక్కడ చేరడానికి మార్గం సుగమమయ్యింది. మొత్తంగా కొత్త బ్యాచ్‌తో కలుపుకుని నిట్‌లో విద్యార్థుల సంఖ్య 1,224 (786+438)కు చేరింది. బాలికలకు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో, బాలురకు పెదతాడేపల్లి, నల్లజర్ల, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న డీఎడ్ కళాశాలలో వసతి ఏర్పాటుచేశారు. కొత్త విద్యార్థుల కోసం వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతి«థిగా మెంటర్ డైరెక్టర్ జీఆర్పీ రెడ్డి పాల్గొంటారు. నిట్‌లో కోర్సులు, వాటి ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఏర్పాట్లు పూర్తి బాలారిష్టాలను అధిగమిస్తూ ఏపీ నిట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతిలోనే పరిశోధనశాలల, వసతి, తరగతి గదులు అవసరాలను తీర్చుకుంటోంది. కేంద్ర మానవవనరుల శాఖ ఏపీ నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ అంగీకారం తెలిపింది. ఈ నిధుల ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. నిట్‌కు ఇంతవరకు ఎలాంటి లోగో లేదు. నిట్‌ను అధికారికంగా గుర్తిస్తూ ఇటీవల గెజిట్ విడుదలైంది. దీంతో పాటు నిట్‌కు నాలుగు రకాల లోగోలను ఏపీ నిట్ అధికారులు రూపొందించారు. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం, పచ్చని పొలాలు, గోదావరి వంతెన, పూర్ణకలశం వంటివి లోగోలో వచ్చేలా నాలుగు రకాల లోగోలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , దేవాదాయశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు పంపించారు. వీటిలో ఏదో ఒకదానికి అధికారిక ముద్ర పడాల్సి ఉంది. నిట్‌లో డే స్కాలర్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే విద్యార్థులకు ఆటపాటలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్య అందించాలన్నది నిట్ ఉద్దేశం కావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుని రెసిడెన్షియల్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిట్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసు తెలిపారు. -
నర్సింగ్ కళాశాలలో వందకు పెరిగిన సీట్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సీట్ల సంఖ్యను 25 నుంచి 100కు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం జీవో (85) జారీ చేశారు. సీట్ల సంఖ్యను పెంచాలని గతేడాది నవంబర్ 2న కళాశాల ప్రిన్సిపల్ నుంచి వినతులు వెళ్లాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచేందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా 1982లో కర్నూలు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను 25 సీట్లతో ఏర్పాటు చేశారు. పదేళ్ల క్రితం వరకు ఈ మెడికల్ కళాశాలలోనే ఇది కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా నర్సింగ్ కళాశాలకు సొంత భవనం, వసతి గృహం మంజూరైంది. ప్రస్తుతం ఈ కళాశాల వంద మంది విద్యార్థులకు అనుగుణంగా ఉన్నందున సీట్లను పెంచాలని కళాశాల ప్రిన్సిపల్ కోరారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్లినికల్ సేవలను అందిస్తారు. ఈ మేరకు నాలుగేళ్లకు గాను వచ్చే మూడేళ్లలో 300 మంది విద్యార్థులు ఆసుపత్రిలో సేవలందించే అవకాశం ఉంది. -
కేఎంసీలో పీజీ సీట్లు పెంపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్ కాలేజికి 30 పెరిగాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా 30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
-
ఐఐటీల్లో సీట్ల సంఖ్య లక్షకు పెంపు
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో సీట్ల సంఖ్యను 2020 నాటికి ఒక లక్ష వరకూ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఐఐటీల్లోనూ కలిపి 82,604 సీట్లున్నాయని తెలిపారు. ఐఐటీల్లో విద్యా ప్రమాణాలు నానాటికి తగ్గి పోతుండటంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ... విద్యావసరాలకు తగినట్లుగా ప్రతిభ గల అధ్యాపకులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. వీరి ఎంపికకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. ఉత్తమ ప్రతిభగల అధ్యాపకులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడాది పొడవునా ప్రకటనలు ఇస్తున్నామని, అలాగే ప్రతిభ ఉన్న వారిని ఐఐటీలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
కాన్పూర్ ట్రాజెడీ నుంచి తప్పించుకున్న జర్నలిస్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో పెను విషాదాన్ని సృష్టించిన కాన్పూర్ రైలు ప్రమాదంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. పెళ్లి కావల్సిన యువడితో సహా వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంనుంచి ఓజర్నలిస్టు తృటిలో తప్పించుకున్నారు. సీటును మార్చుకోవడంతో తాను మృత్యువు నుంచి తప్పించుకున్నానని జర్నలిస్టు సంతోష ఉపాద్యాయ్ చెప్పారు. లేదంటే అదే తనకు చివరి రోజు అయి వుండేదంటూ తన భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అత్యవసర కిటికీ నుంచి బయటికి వచ్చి చూస్తే చుట్టూ మృతదేహాలు, ప్రయాణీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా భయకరంగా ఉందన్నారు.అయితే భౌతిక గాయాలు నయంకావచ్చు, కానీ తను కళ్లారా చూసిన భయానకమైన విషాదాన్ని మర్చిపోలేక పోతున్నానని ఆయన వాపోయారు. మీందరూ టీవీలలో చూశారు.. కానీ తాను ప్రత్యక్షంగా ఆ ఘోర ప్రమాదాన్ని చూశాననీ, తన కళ్లముందే బోగీలు అలా కుప్పకూలాయంటూ గుర్తు చేసుకున్నారు. ఉజ్జయినిలో ఇండోర్ -పాట్నా రైలెక్కిన సంతోష్ ది ఎస్ 2 లోని బెర్త్ నెం.7 . అయితే తన ప్రెండ్ దగ్గర కూర్చోవడానికి వీలుగా మహిళా ప్రయాణికురాలు ఎస్ 5 కోచ్ కి వెళ్లాల్సిందిగా కో్రడంతో సంతోష్ అక్కడికి తన బెర్త్ ను మార్చుకున్నాడు. ఫోన్లో మేసేజ్ లు చెక్ చేసుకుంటుండగా భారీ శబ్దం వినిపించింది. దీంతో ప్రమాదాన్ని ఊహించిన సంతోష్ ఎమర్జెన్సీ విండో్ ద్వారా బయటపడ్డాడు. దీంతో వెంటనే బీహార్ రైల్వే సీపీఆర్ వో వినయ్ కుమార్ కి సమాచారం అందించి, తోటి ప్రయాణీకులతో కలిసి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నట్టు మీడియాకు వివరించారు. చివరి నిమిషంలో సీటు మార్చుకోవడమే తనను ఈ ప్రమాదంనుంచి రక్షించిందని జర్నలిస్టు సంతోష్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 145కు చేరింది. రెండు బోగీలకుచెందిన సుమారు 200 మందికిగా పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం భారీ విషాదాన్ని మిగిల్చింది. -
ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో అక్రమాలు
– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహ కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ ఆరోపించారు. శనివారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో మెడికల్ సీట్లు రాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఏ మాత్రం పాటించలేదన్నారు. ఓపెన్ కేటగిరిలో వెళ్లాల్సిన విద్యార్థులను రిజర్వేషన్ సీట్లలో భర్తీ చేశారన్నారు. దీంతో 200కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ అగ్రవర్ణాల విద్యార్థులున్నట్లుగా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు 2,283వ ర్యాంకు రాగా, రెండో కౌన్సెలింగ్‌లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు 3,207 ర్యాంకుగా ఉందన్నారు. రెండో కౌన్సెలింగ్ వచ్చే సమయానికి రాష్ట్రంలో 900 సీట్లు పెరిగాయని, కానీ అధికారులు పెరిగిన సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించకుండా మూకుమ్మడిగా చేపట్టారన్నారు. ఇందులో దాదాపు రూ.500కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. గతంలో ఎన్.జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే విధంగా అక్రమాలు జరిగాయన్నారు. బీసీ విద్యార్థులైన బి.తేజస్విని (5,242) శ్రీ లత (6,072), కౌసర్ మొయిద్‌కు (5,154), నిఖిల్‌సాగర్ (5,844) ర్యాంకు వచ్చినా సీట్లు రాలేదన్నారు. గతంలో సీట్లు తక్కువ ఉన్నా ఈ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయని, ఇప్పుడు సీట్లు పెరిగినా రాకపోవడం దారుణమన్నారు. వెంటనే కౌన్సిలింగ్‌ను రద్దు చేసి తిరిగి సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
నర్సింగ్ సీట్లు ఈ ఏడాది లేనట్టే !
సిబ్బంది కొరతే ప్రధాన కారణం కళాశాల నిర్వహణపై ఐఎన్‌సీ అసంతృప్తి సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహణపై ఇండియ¯ŒS నర్సింగ్ కౌన్సిలింగ్(ఐఎన్సీన్) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఏడాది సీట్ల భర్తీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నర్సింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రార్ ఐదు రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేయడంతో సీట్ల ను కాపాడుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఢిల్లీలోని ఐఎన్‌సీ బృందం వద్దకు పయనమయ్యారు. ఇం డియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ సభ్యులు ప్రతి సంవత్సరం కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సరిపడా అధ్యాపక బృందంతో పాటు హాస్టల్ వసతి, లైబ్రరీ వంటి సౌకర్యాలను పరిశీలిస్తారు. వారు సంతృప్తి చెందితేనే అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. 2012లో కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. అంతేకాక ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడి నుంచి విద్యార్థులకు కళాశాలకు నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు మెస్ సౌకర్యం సరిగ్గా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, ఐదుగురు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. కళాశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఐఎన్‌సీ నిబంధనల ప్రకారం పది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఇక్కడ ఐదుగురు మాత్రమే ఉండడంతో ఐఎన్‌సీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి, సీట్ల అనుమతికి నిరాకరించారని అధ్యాపకులు చెపుతున్నారు. ఫ్యాకల్టీ నియామకం గురించి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని నర్సింగ్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు బీఎస్సీ నర్సింగ్ కళాశాలపై దృష్టి పెట్టి సీట్లను కాపాడడడంతో పాటు వెంటనే అధ్యాపకులను నియమించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఐటీఐల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపాల్ నాయకల్లు సోలోమన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. అభ్యర్థులు ఏ కళాశాలలో చేరాలనుకున్నారో అక్కడే పది రూపాయలు చెల్లించి దరఖాస్తు పొందవచ్చని.. ఈ నెల 20వ తేదీలోపు పూరించిన దరఖాస్తులను అందజేయాలన్నారు. 21న ఉదయం 10 గంటలకు ఆయా కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. -
వరించేదెవరినో..!
దసరాలోపు కార్పొరేషన్ పదవులను ప్రకటించేందుకు సీఎం కసరత్తు రేసులో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావు, అక్బర్‌హుస్సేన్, మైఖేల్ శ్రీను ఈద, జీవీకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాయమనే ప్రచారం మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్బర్‌హుస్సేన్ ప్రయత్నాలు కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు మళ్లీ ఊరిస్తున్నాయి. దసరా కానుకగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పదవుల కోసం జిల్లా నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు, అనుబంధ సంఘాల నేతలు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలు తీసుకుని సీఎంను కలిసి నామినేటెడ్ పదవులివ్వాలని కోరారు. ఇప్పటికే మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తున్న కేసీఆర్ దసరాలోపు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈసారి జిల్లాకు రెండు లేదా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్లు అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు... కార్పొరేషన్ పదవుల కోసం వందల కొద్ది దరఖాస్తులు వచ్చిన ప్పటికీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రామకృష్ణారావు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, రజక సంఘం నాయకుడు మైఖేల్ శ్రీను పేర్లు ఖారారైనట్లు తెలిసింది. వీరిలో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావులకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సమాచారం. ఈద శంకర్‌రెడ్డి గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన జీవీ.రామకృష్ణారావు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు బంధువు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర, జిల్లాకు చెందిన పలువురు నేతలు సిఫారసు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరిలో అక్బర్‌హుస్సేన్ జిల్లా మైనారిటీ విభాగం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మైఖేల్ శ్రీను పార్టీలో సుదీర్ఘ కాలంగా క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. జిల్లా రజక సంఘం నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరితోపాటు జిల్లాకు చెందిన మరో నాయకుడికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు దక్కనున్నట్లు సమాచారం. అయితే తనకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని అక్బర్‌హుస్సేన్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్టీకి ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న నేతల పేర్లు జిల్లాల వారీగా ఇప్పటికే తెప్పించుకున్న కేసీఆర్ అందులో ఎవరెవరికి కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులను కట్టబెట్టాలనే అంశంపై ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్లు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాల్లేని వారిని కార్పొరేషన్ పదవులతో సంతృప్తిపర్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పిన తరువాతే జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద దసరా లోపు పేర్లను ప్రకటించనున్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. -
ఎస్టీలకు అన్యాయం
టవర్‌సర్కిల్ : సాంఘిక సంక్షేమశాఖ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల సీట్ల కేటాయింపుల్లో ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఎరుకల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావేటి గోపి అన్నారు. ఆదివారం భగత్‌నగర్‌లో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి కౌన్సిలింగ్లో 240 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం 14 సీట్లకు 12 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కుతాడి శ్రీనివాస్, కట్ట సంపత్, సుల్తాన్ అంజి, కట్ట రవీందర్, కె.అంజి, కట్ట శంకర్, కుర్ర రాజశేఖర్, కుతాడి సంపత్, సార్ల ఆంజనేయులు, లోకిని సంపత్, కుమారస్వామి, బూనాద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు!
వెలవెలబోతున్న,ఇంజనీరింగ్, కళాశాలలు రెండో దశలోనూ పూర్తిస్థాయిలో భర్తీ కాని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్న 38 శాతం సీట్లు కొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మందే.. మరికొన్నింటిలో బోణీ కొట్టని బ్రాంచ్‌లు బాలాజీచెరువు (కాకినాడ) : ఒకప్పుడు ఇంజినీరింగ్ సీటు సంపాదించడం ఎంతో అరుదైన ఘనతగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కళాశాలలు రా...రమ్మని పిలుస్తున్నా.. విద్యార్థులు పో...పొమ్మంటున్నారు. కళాశాలలు ఎక్కువ కావడమే దీనికి కారణం. ఉన్న కళాశాలల్లో మంచివాటిని గుర్తించి అటువైపే విద్యార్థులు అడుగులు వేయడంతో స్థాయి లేని కళాశాలలు వెలవెలబోతున్నాయి. జేఎన్‌టీయూకేకి అనుబంధంగా జిల్లాలో 33 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, వీటిలో 12 వేలకు పైగా సీట్లున్నాయి. ఎంసెట్–2016 ఇంజినీరింగ్ విభాగానికి జిల్లావ్యాప్తంగా 16,535 మంది హాజరవగా వీరిలో 11,067 మంది అర్హత సాధించారు. కానీ ఉన్న సీట్లలో 7,400 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే జిల్లా మొత్తంలో ఉన్న సీట్లలో 62 శాతం మాత్రమే భర్తీ కాగా, మిగిలిన 38 శాతం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఫలితంగా కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. మరికొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మంది చొప్పున చేరడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఆయా యాజమాన్యాల్లో నెలకొంది. ఇక బ్రాంచ్‌కు 30 శాతం చొప్పున నిండిన కళాశాలలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. కేవలం గుర్తింపు పొందిన ఆరు కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరికొన్ని కళాశాలల్లో టాప్ బ్రాంచ్‌గా ఉన్న ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ తప్ప మిగిలిన బ్రాంచ్‌లు బోణీ కొట్టలేదు. దీంతో రెండో దశపై ఆశలు పెట్టుకున్న కళాశాలలకు నిరాశే మిగిలింది. కళాశాలల పెరుగుదలే కారణం జిల్లాలో 1989 వరకూ ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరో రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండేవి. సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1998 నుంచి 2006 వరకూ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. దీంతో జిల్లాలో అదనంగా దాదాపు 20 కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో అప్పటివరకూ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వందల్లో ఉన్న సీట్ల సంఖ్య వేలకు చేరింది. ప్రస్తుతం దాదాపు ప్రతి రెండు మండలాలకు ఒక ఇంజినీరింగ్ కళాశాల చొప్పున ఉన్న పరిస్థితి. వసతుల లేమి ఒకపక్క కళాశాలలు పెరిగినా వాటిలో పూర్తిస్థాయిలో వసతులుండటం లేదు. అయినా సరే విద్యార్థులను తమవైపు తిప్పుకోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతనంతా ఉపయోగించినా ఫలితం లేకపోయింది. డొనేషన్లు తీసుకునే విధానం పోయి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉపకార వేతనాల ఆఫర్లతో అడ్మిషన్లు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన ప్రమాణాలతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులు లేకపోవడమే దీనికి కారణం. కేవలం బీటెక్ అర్హత కలిగినవారితో తరగతులు నిర్వహించేస్తున్నారు. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం 1.15 నిష్పత్తిలో అధ్యాపకులతోపాటు నాన్‌టీచింగ్, నాన్ టెక్నికల్ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉండాలని నిబంధన ఉన్నా అవేమీ పాటించకపోవడం మరో కారణం. మూసివేయాలన్నా ఇబ్బందే.. ఏదైనా కళాశాలను మూసివేయాలి వస్తే ఏఐసీటీఈ బోర్డుకు సంబంధిత యాజమాన్యం రూ.3 లక్షలు చెల్లించాలి. ముందుగా ఆ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. తన విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ, అధ్యాపక, అధ్యేపకేతర సిబ్బంది వివరాలను యూనివర్సిటీకి తెలియజేయాలి. కళాశాల మూసివేతకు తమకేమీ అభ్యంతరం లేదని విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. కొలువుల ఎంపిక మాటేమిటి? ప్రస్తుతం జిల్లాలో ఉన్న 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో కేవలం జేఎన్టీయూకేతోపాటు పేరొందిన ఏడెనిమిది కళాశాలల్లో మాత్రమే ఏటా క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో ఆ ఊసే లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. -
ఈ ఏడాది ప్చ్..!
భర్తీకానీ విదేశీ విద్యార్థుల బీటెక్ అడ్మిషన్లు నాక్ గుర్తింపు లేక ప్రవేశాలకు ఆటంకం బాలాజీచెరువు(కాకినాడ) : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడలో చేరేందుకు విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దాంతో నేషనల్ ఫారన్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండు సంవత్సరాల్లో బీటెక్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) విడుదల చేసిన ర్యాంక్‌లో 69వ ర్యాంక్ సాధించిన వర్సిటీ జేఎన్టీయూకేకు నాక్ గుర్తింపులేకపోవడంతో వీదేశీ విద్యార్థులు చేరడానికి వెనకడుగు వేస్తున్నారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. స్వీడన్, బ్యాంకాక్, అమెరికా వంటిదేశాల విశ్వవిద్యాలయాలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిర్వహిస్తున్న వర్సిటీ ఈ సీట్లను భర్తీ చేయడంతో విఫలమవుతోంది. జేఎన్టీయూకే 2008లో అవిర్భవించింది. ఇక్కడ విద్యార్థులతో పాటు వీదేశీయులకు సీట్లు కేటాయించారు. ప్రధానంగా ఫారన్ నేషనల్స్(విదేశీ)విద్యార్థులు, నాన్ రెసిడెంట్ ఇండియన్ పీపుల్స్, పీపుల్ ఇండియా ఆరిజన్స్కు మొత్తం 300 సీట్లలో 15 శాతం కేటాయించారు. వీరిలో ఫారన్ నేషనల్స్‌కు ఐదు శాతం కేటాయించినా రెండేళ్ల నుంచి సీట్లు భర్తీకావడం లేదు. సాధారణంగా శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాల నుంచి బీటెక్, ఎంటెక్ డిగ్రీలు చదివేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఒక విద్యార్థి సంవత్సరానికి దాదాపు రెండు లక్షల ఫీజు చెల్లిస్తాడు. బీటెక్‌లో 40 సీట్లు, ఎంటెక్, ఎంబీఏలో 25 సీట్లు కేటాయించినా సీట్లు అంతంతమాత్రంగానే భర్తీ అవుతున్నాయి. అధికారుల వైఫల్యం.. విదేశీ విద్యార్థులను అకర్షించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. కేవలం నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్, పీపుల్ ఇంyì యన్ ఆరిజన్(పీఐవో) కేటగీరిల విద్యార్థులు కొంతవరకూ చేరడం గమనార్హం. వీటిలో మాత్రం నామమాత్రంగా సీట్లు నిండుతున్నాయి. ఎవరూ చేర కపోతే ఈ సీట్లు అలాగే ఖాళీగా ఉంచాలి తప్ప వేరేవారికి కేటాయించకూడదు. ఇలా వీదేశీ విద్యార్థులు లేక, మిగత వారికి కేటాయించక సీట్లు ఏళ్లతరబడి ఖాళీగా ఉంటున్నాయి. గత ఐదు సంవత్సరాల ప్రవేశాలు. సంవత్సరం కేటాయించిన సీట్లు భర్తీ అయిన సీట్లు 2010–11 45 30 2011–12 – 42 2012–13 – 10 2013–14 – 1 2014–15 – 0 2015–16 – 04 2016–17 – 0 -
వెలవెలబోతున్న ఇంజనీరింగ్ కళాశాలలు
సగంసీట్లు కూడా భర్తీకాని వైనం మొదటి విడతలో 56 శాతమే... రెండో విడతపైనే ఆశలు..లేకుంటే నిర్వహణ కష్టమే ఫీజుల కుదింపుతో డిగ్రీలో చేరుతున్న విద్యార్థులు ఖమ్మం: ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్ లేకపోవడం ఒక కారణం అయితే ఈ సారి ప్రభుత్వం బీసీ, ఓసీ విద్యార్థులకు ఫీజుల కుదింపుతో అదనపు భారంతో ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. గతంలో తొలి విడత జాబితాలో 80శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈ సారి మాత్రం 56శాతం సీట్లు మా్ర™ృlమే నిండాయి. వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించగా..జిల్లాలో మొత్తం 16 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 4,215 సీట్లు ఉండగా.. మొదటి జాబితాలో 2,369 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో సీట్లు నిండాయి. డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి వాటిల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం కుదించింది. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు లోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో కేవలం ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య భారంగా మారింది. సంవత్సరానికి కళాశాల ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన డబ్బులు విద్యార్థులే కట్టుకోవాలనే నిబంధన ఉంది. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60వేల నుంచి 40వేల లోపు ఉండగా..ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్ఫీజు, ఇతర చార్జీలు భారమవుతాయని భావిస్తున్నారు. అందుకే చాలామంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మొదటి జాబితాలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కోర్సు సీట్లు భర్తీ అయినవి మిగులు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సీఐవి 546 329 217 సీఎస్ఈ 880 671 209 ఈసీఈ 1026 546 480 ఈఈఈ 922 447 475 ఎంఈసీ 756 291 465 ఎంఐఎన్ 25 25 – ఐఎన్ఎఫ్ 60 60 – ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 4,215 2,369 1846 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
వెలవెలబోతున్న ఇంజనీరింగ్ కళాశాలలు
సగంసీట్లు కూడా భర్తీకాని వైనం మొదటి విడతలో 56 శాతమే... రెండో విడతపైనే ఆశలు..లేకుంటే నిర్వహణ కష్టమే ఫీజుల కుదింపుతో డిగ్రీలో చేరుతున్న విద్యార్థులు ఖమ్మం: ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్ లేకపోవడం ఒక కారణం అయితే ఈ సారి ప్రభుత్వం బీసీ, ఓసీ విద్యార్థులకు ఫీజుల కుదింపుతో అదనపు భారంతో ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. గతంలో తొలి విడత జాబితాలో 80శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈ సారి మాత్రం 56శాతం సీట్లు మా్ర™ృlమే నిండాయి. వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించగా..జిల్లాలో మొత్తం 16 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 4,215 సీట్లు ఉండగా.. మొదటి జాబితాలో 2,369 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో సీట్లు నిండాయి. డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి వాటిల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం కుదించింది. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు లోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో కేవలం ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య భారంగా మారింది. సంవత్సరానికి కళాశాల ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన డబ్బులు విద్యార్థులే కట్టుకోవాలనే నిబంధన ఉంది. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60వేల నుంచి 40వేల లోపు ఉండగా..ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్ఫీజు, ఇతర చార్జీలు భారమవుతాయని భావిస్తున్నారు. అందుకే చాలామంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మొదటి జాబితాలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కోర్సు సీట్లు భర్తీ అయినవి మిగులు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సీఐవి 546 329 217 సీఎస్ఈ 880 671 209 ఈసీఈ 1026 546 480 ఈఈఈ 922 447 475 ఎంఈసీ 756 291 465 ఎంఐఎన్ 25 25 – ఐఎన్ఎఫ్ 60 60 – ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 4,215 2,369 1846 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
పీజీ.. సీట్లు ఖాళీ!
ఎస్కేయూ అనుబంధ కళాశాలల్లో భర్తీ కాని సీట్లు 2717 క్యాంపస్ కళాశాలల్లో 198 సీట్లు ఖాళీ ఎస్కేయూ: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎస్కేయూ సెట్- 2016 రెండో దఫా కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది. అనుబంధ పీజీ కళాశాలల్లో 4,683 పీజీ సీట్లు ఉండగా 1,966 మాత్రమే భర్తీ అయ్యాయి. 2,717 సీట్లు మిగిలిపోయాయి. క్యాంపస్ కళాశాలల్లోనూ గతేడాదితో పోలిస్తే మిగులు సీట్ల సంఖ్య పెరిగింది. క్యాంపస్ కళాశాలల్లో 921 సీట్లు అందుబాటులో ఉండగా, రెగ్యులర్ సీట్లు 55, సెల్ఫ్‌ఫైనాన్స్/ పేమెంట్ సీట్లు 143 కలిపి 198 సీట్లు భర్తీ కాలేదు. యాజమాన్యాల్లో నష్ట భయం కొన్ని కళాశాలల్లో 1, 3, 2, 5, 6 , 7, 19 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఇది యాజమాన్యాలకు మరింత భారం కానుంది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి హాజరు నమోదుకు బయోమెట్రిక్ ప్రవేశపెట్టనుండడంతో తరగతులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఫ్యాకల్టీని విధిగా నియమించుకోవాలి. అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడంతో యాజమాన్యాల్లో నష్టభయం నెలకొంది. డిగ్రీలో కొరవడిన విద్యా ప్రమాణాలు : డిగ్రీ కోర్సులో సరైన విద్యా ప్రమాణాలు లేకపోవడంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. డిగ్రీ కళాశాలల స్థితిగతులపై అధ్యయనం చేయాల్సిన యూనివర్సి టీ కళాశాల డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) ఒక్క రోజు కూడా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. డిగ్రీ ఉత్తీర్ణత శాతం పెంచితేనే వర్సిటీలలో విద్యార్థుల నమోదు శాతం పెంచవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
నేడు నీట్, ఐఐటీల్లో రెండో రౌండ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో రెండో దశ సీట్లకేటాయింపు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అధారిటీ (జోసా) చర్యలు తీసుకుంది. గత నెల 30వ తేదీన మొదటి రౌండ్లో సీట్లు కేటాయించారు. బుధవారం రెండోరౌండ్లోసీట్లు పొందిన వారి జాబితాను ప్రకటించనున్నది. సీట్లు పొందినవారు ఈ నెల 7వతేదీ నుంచి 9వ తేదీ మధ్య సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. మొదటి దశ యాక్సెప్టెన్సీ, ప్రవేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. -
'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!
న్యూఢిల్లీః దేశ రాజధాని నగంరంలో విద్యావిధానంలోనే తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకొని, స్థానిక విద్యాలయాలకు దీటుగా ప్రత్యేక గౌరవాన్ని పొందుతున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు తమిళనాడు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. భారతదేశంలోనే కామర్స్ విద్యకు నెలవుగా ప్రఖ్యాతి పొందిన ఎస్ఆర్సీసీ.. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో భాగంగా బీకాం హిస్టరీ, ఎకనామిక్స్ లను విద్యార్థులకు అందిస్తోంది . అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఢిల్లీ యూనివర్శిటీ సారధ్యంలోని ఎస్ఆర్సీసీ కళాశాలలో సీటు పొందాలంటే కటాఫ్ మార్కులు 98 శాతం దాటాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒక్క తమిళనాడుకు చెందిన విద్యార్థులే 75 నుంచి, 80 శాతం సీట్లను కైవసం చేసుకొని కళాశాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇప్పటివరకూ భర్తీ చేసిన సీట్లలో మరి కొందరు కేరళకు చెందినవారు ఉన్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు. స్థానిక విద్యాలయాలకే తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో తమిళనాడు విద్యార్థుల హవా కొనసాగింది. ఈ విద్యాసంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చేందుకు కళాశాల నిర్వహించిన మొదటి రెండురోజుల డ్రైవ్ లో తమిళనాడుతోపాటు అత్యధికంగా కేరళ విద్యార్థులు కూడ ఎన్ రోల్ చేసుకున్నారు. కామర్స్ ఎడ్యుకేషన్ అంటే దేశంలోనే మొదటిగా గుర్తుకొచ్చే శ్రారామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో సీటు సంపాదించడం ఎంతో కష్టం. అటువంటిది ఇప్పుడు 75 నుంచి 80 శాతం సీట్లు కేవలం తమిళనాడు విద్యార్థులే కైవసం చేసుకోవడం కళాశాల సిబ్బందినే ఆశ్చర్యపరుస్తోంది. తమ సర్వీసులో ఇటువంటి అనుభవం ఎప్పుడూ జరగలేదని సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇచ్చిన అడ్మిషన్లలో 80 శాతం వరకూ తమిళనాడునుంచి వచ్చినవారే ఉన్నారని, మిగిలినవారిలో కొందరు కేరళ బోర్డుకు చెందిన విద్యార్థులు కూడ ఉన్నారని ఎస్ఆర్సీసీ కళాశాల అడ్మిషన్ ఇన్ ఛార్జ్ అనిల్ కుమార్ తెలిపారు. ఢిల్లీ యూనివర్శీటీ స్టేట్ బోర్డ్స్ నుంచి వచ్చే విద్యార్థుల మార్కుల విషయంలో ఎటువంటి నిబంధనలు విధించలేదన్నారు. ఇప్పటివరకూ 339 మంది విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, ఫీజు చెల్లించటంకోసం యూనివర్శిటీకి కూడ పంపించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా బికాం హిస్టరీలో అడ్మిషన్లకోసం తమిళనాడునుంచి అత్యధికశాతం విద్యార్థులు వచ్చారని, కేవలం ఒకే రాష్ట్రంనుంచి ఇంతమంది విద్యార్థులు అడ్మిషన్లకు పోటీపడటం కళాశాల చరిత్రలోనే చూడలేదని ఎస్ఆర్సీసీ కాలేజీ అధికారులు కొందరు చెప్తున్నారు. అయితే ఈయేడు ఇప్పటివరకూ తాము అడ్మిషన్లు ఇచ్చినవారిలో అత్యధిక మార్కులున్న విద్యార్థిని కేరళ బోర్డుకు చెందిన ఎలిజబెత్ థామస్ అని తెలిపారు. అడ్మిషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉందని, ఒకవేళ పూర్తిశాతం సీట్లు భర్తీకాని పక్షంలో రెండో లిస్టును తయారు చేయడం గాని, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారికి అవకాశం ఇవ్వడంగాని జరుగుతుందని కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం తమిళనాడు బోర్డు అత్యధికశాతం మార్కులను స్కోర్ చేసిందని, అందుకే ఎస్ఆర్సీసీలో ఇప్పుడు అధికశాతం తమిళనాడు విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయని కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తెలిపారు. తమిళనాడు బోర్డులో 99 శాతం మార్కులు దాటినవారే అధికంగా ఉన్నారని, అటువంటప్పుడు కాంపిటేషన్ లో వారు ముందుండటం సహజమేనన్నారు. దీన్నిబట్టి చూస్తే విద్యాభ్యాసానికి ఢిల్లీ సరైన ప్రాంతం అని మరోసారి రుజువైందని తెలిపారు. -
ఇదేం ‘శిక్ష’
♦ ఆడపిల్లల చదువుకు ఎన్నెన్నో అడ్డంకులు ♦ కేజీబీవీ విద్యార్థినులకు సంక్షేమ కళాశాలల్లో దొరకని సీట్లు ♦ పదోతరగతితోనే ఆగుతున్న చదువులు జిల్లాలోని 26 కేజీబీవీల పరిధిలో గత ఏడాది 915 మంది బాలికలు 10వ తరగతి పరీక్ష రాయగా, ఇందులో 703 మంది ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలు గతంలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘికసంక్షేమశాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నింటిని ఎస్ఎస్ఏ(సర్వశిక్ష అభియూన్) పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కేజీబీవీ విద్యార్థినులకు కష్టాలు మొదలయ్యూరుు. పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించిన 703 విద్యార్థినుల్లో కేవలం 100 మందికి మాత్రమే సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చారుు. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. - ఖమ్మం ఖమ్మం: గత విద్యాసంవత్సరంలో ఖమ్మం రూరల్ మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయ(కేజీబీవీ)లోని పదోతరగతి విద్యార్థినులు 46 మందిలో 37 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ముగ్గురికి మాత్రమే సాం ఘిక సంక్షేమ శాఖ జూనియర్ కళాశాలలో సీటు వచ్చింది. మిగిలిన వారికి రాలే దు. వీరిలో, 9.3 జీపీఏ సాధించిన పి.లక్ష్మి ప్రస న్న కూడా ఉంది. ఇన్ని మార్కులు వచ్చి నా సీటు రాకపోవడంపై ఆమె కుమిలిపోతోంది. కొణిజర్ల కేజీబీవీలోని 49 మంది పదోతరగతి విద్యార్థినుల్లో 31 మంది ఉత్తీర్ణుల య్యారు. వీరిలో ఏ ఒక్కరికీ సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీటు రాలేదు. వీరంతా, ఎక్కడ చదవాలో తెలీక అయోమయంలో ఉన్నారు. కారేపల్లిలోని కేజీబీవీలో పదోతరగతి పరీక్షలు రాసిన 39 మందిలో 25 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎనిమిది మంది మినహా మిగిలిన వారికి సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ కళాశాలల్లో వీరికి (ఆర్డర్ ఆఫ్ మెరిట్లో) సీట్లు రాలేదు. సెకండ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘అప్పటికీ సీటు రాకపోతే..’ అనే భయాందోళన వీరిని వెంటాడుతోంది. కేజీబీవీలన్నిటినీ ‘సర్వశిక్ష అభియాన్’ కిందికి తేవడంతో వారికి సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సీటు పొందలేని కేజీబీవీ బాలికలు.. ‘మాకు ఇదేమి శిక్ష?’ అని, తీవ్ర ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని కేజీబీవీలలో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థినుల్లో అనేకమందిది ఇదే పరిస్థితి. వీరిలో కొందరికి తల్లిదండ్రులు లేరు. ఇంకొందరికి ఎవరో ఒకరు మాత్రమే ఉన్నారు. ఆలనాపాలనా అందక ఇక్కడికి చేరిన వారు మరికొందరు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న వీరందరికీ చదువు చెప్పేందుకు కేజీబీవీలను కేంద్రం ప్రారంభించింది. పదోతరగతి వరకు వీరి చదువు సాఫీగా సాగింది. ఆ తరువాతనే ఇబ్బం దు లు ఎదురవుతున్నాయి. ‘‘ఎక్కడా సీటు రాకపోతే ఎలా? ఇంతటితో చదువు ఆపేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం’’ అని, వారు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కళాశాలల్లో తగ్గిన సీట్లు కేజీబీవీ బాలికలకు మోడల్ స్కూల్స్, డీఆర్డీఏ, సంక్షేమ జూనియర్ కళాశాలల్లోని సీట్లలో గతంలో అత్యధికం కేటాయించేవారు. కేజీబీవీలలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకరావాలనే ఆలోచనతో గత విద్యాసంవత్సరం నుంచి సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) పరిధిలోకి చేర్చారు. దీంతో, గతంలో సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించిన ఆ శాఖ అధికారులు.. తమ పరిధిలో కేజీబీవీలు లేవనే సాకుతో ఆ సంఖ్యను కుదించారు. మొత్తం సీట్లలో 60 శాతం వరకు కేజీబీవీ బాలికలకు కేటాయిస్తామని చెప్పిన అధికారులు.. తీరా ఇప్పుడు ఒక్కో కళాశాలకు కేవలం మూడంటే మూడు సీట్లే కేటాయించినట్టు సమాచారం. ‘‘మా పరిస్థితిపై అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. మా అందరికీ సంక్షేమ కళాశాలల్లోగానీ, మోడల్ స్కూల్స్లోగానీ, గిరిజన సంక్షేమ కళాశాలల్లోగానీ సీట్లు కేటాయించాలి’’ అని, కేజీబీవీ విద్యార్థినులు వేడుకుంటున్నారు. అగమ్యగోచరంలో 600 మంది జిల్లాలోని కేజీబీవీల్లో పదోతరగతి పూర్తయిన వారిలో 600 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. గత ఏడాది 915 మంది పదోతరగతి పరీక్షలు రాశారు. 703 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 100 మందికి మాత్రమే బాలికల సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చినట్టు సమాచారం. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులతో చర్చిస్తా కేజీబీవీల్లో పదోతరగతి పూర్తిచేసిన బాలికలు ఇక్కడే ఇంటర్ చదివించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. వీరి పరిస్థితిపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో చర్చిస్తా. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మన జిల్లాలోని బాలికలకు సీట్లు ఎలా ఇప్పించాలనే విషయంపై అధికారులతో సంప్రదించి న్యాయం చేస్తాం. ఉన్నత చదువులకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. - రవికుమార్, ఎస్ఎస్ఏ పీఓ ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాను పదిలో ఉత్తీర్ణులైన 25 మందితో సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలల్లో, మోడల్ స్కూల్స్‌లో దరఖాస్తు చేయించాం. ఎనిమిది మందికి మాత్రమే సీట్లు వచ్చాయి. మిగిలిన వారి పరిస్థితి ఒకింత దయనీయంగా ఉంది. పదితోనే చదువు ఆపాల్సి వస్తుందేమోనని, కూలీనాలీ పనులకు వెళ్లక తప్పదేమోనని వారు భయపడుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్‌లోనైనా సీట్లు వస్తాయోమోనని అనుకుంటున్నాం. ఈ విషయాలను ఇప్పటికే ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాం. - ఝాన్సీ సౌజన్య, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ,కారేపల్లి -
పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం సీట్లు ఖాళీ
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం వరకు సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. పాలిసెట్‌లో అర్హులైన అభ్యర్ధులకు గురువారం సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అలాట్మెంట్ పూర్తి చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 1,08,989 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఇందులో 48,975 మంది ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చారు. వీరిలో 47,116 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరంతా వివిధ కాలేజీల్లోని కోర్సులకు 8,87,939 ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 85 ప్రభుత్వ, 230 ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం సీట్లలో 83,617 కన్వీనర్ కోటా సీట్లుండగా 44,609 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 16,650 సీట్లలో 14,985 (90.81 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని 66,967 సీట్లలో 29,624 (44.23 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. -
తమిళనాడులోని ఆ రెండు స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అరవ్ కురిచి, తంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు... ఓటర్లకు భారీగా డబ్బును, బహుమతులను పంచుతున్నారన్న ఆరోపణలతో ఎన్నికల కమిషన్ మే 16న జరగాల్సిన ఎన్నికలను 23వ తేదీకి వాయిదా వేసింది. అయితే ప్రలోభాల ఆరోపణల పై ఎన్నికల కమిషన్‌కు అందిన నివేదికలు అధారంగా రెండు నియోజకర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో జూన్ ఒకటికల్లా ఎన్నికలు నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి, జూన్ 13న ఎన్నికలు నిర్వహించనుంది. -
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్
టాప్ స్టోరీ తెలంగాణలో మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20 నుంచి దాదాపు గతేడాది మాదిరిగానే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రత్యేక కథనం.. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లు అర్హులు 1,03,001 ప్రభుత్వ కళాశాలలు 56 ప్రైవేటు కళాశాలలు 169 ప్రభుత్వ సీట్లు 12,000 ప్రైవేటు సీట్లు 46,000 మొదటి దశ రిజిస్ట్రేషన్ విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశిత తేదీల్లో మొత్తం 21 హెల్ప్‌లైన్ సెంటర్లలో ఏదో ఒకదానికి హాజరై ర్యాంకు కార్డ్‌ను సంబంధిత అధికారికి అందజేసి పేరు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలియజేయాలి. (ఈ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ కావచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకువెళ్లాల్సినవి ⇒ టీఎస్‌పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ⇒ టీఎస్‌పాలిసెట్ హాల్‌టికెట్ ⇒ పదో తరగతి మార్కుల మెమో ⇒ నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ⇒ నివాస ధ్రువీకరణ పత్రం ⇒ జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ⇒ ఆధార్ కార్డ్ ⇒ కుల ధ్రువీకరణ పత్రం ⇒ వికలాంగులు/ఎన్సీసీ/స్పోర్ట్స్/చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి. ⇒ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి. రెండో దశ (సర్టిఫికెట్ వెరిఫికేషన్) ఈ దశలో అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సంబంధిత వెరిఫికేషన్ అధికారికి అందజేసి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే. మూడో దశ (ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు) రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. కోర్సులు, కళాశాలలు సీట్ల ఆధారంగా ప్రాథమ్యాలను ఎంపిక చేసుకోవాలి. నాలుగో దశ (ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రక్రియ ప్రారంభం) ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వెబ్సైట్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ప్రాథమ్యాల మేరకు ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్‌నే వినియోగించాలి. తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక లాగ్ అవుట్ అవ్వాలి. తిరిగి హోంపేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలి. లాగిన్ ఐడీ విద్యార్థుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ వివరాలు పూర్తిచేశాక సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (OTP) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు వన్‌టైం పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఓటీపీ బాక్స్‌లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్‌ను చదివి, ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్‌పై క్లిక్ చేయాలి. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఆప్షన్ ఎంట్రీ బటన్‌పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్‌ల పక్కన టిక్ చేసి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్‌పై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్లు, బ్రాంచ్‌లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. దీంట్లో తమకు నచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా కాలేజ్ కోడ్, కళాశాల కోడ్ పక్కన ఉండే బాక్స్‌లలో ప్రిఫరెన్స్ నెంబర్ పొందుపర్చాలి. నాలుగో దశ (లాగ్ అవుట్) ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయ్యాక ఔౌజ ైఠ్ట బటన్‌పై క్లిక్ చేస్తే .. ave and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్‌లు కనిపిస్తాయి. అభ్యర్థులు అవసరాన్ని బట్టి బాక్స్‌లో టిక్ చేయాలి. ఎలాంటి మార్పులు లేవనుకుంటే Confirm Logout బటన్‌పై క్లిక్ చేయాలి. అయిదో దశ (సీట్ అలాట్మెంట్) ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజ్ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆరో దశ (ఫీజు చెల్లింపు) కేటాయించిన కాలేజ్ ఆధారంగా ఏడాదికి రూ.3800 నుంచి రూ.15,500 మధ్యలో ఫీజు చెల్లించాలి. ఫీజు ఆయా కాలేజ్‌లను బట్టి ఉంటుంది. ఈ ఫీజు చెల్లింపును నేరుగా కాలేజ్‌లోనే చెల్లించేలా గత ఏడాది వెసులుబాటు ఇచ్చారు. ఇదే విధానం ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏడో దశ (కాలేజ్‌లో రిపోర్టింగ్) అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఫీజు చెల్లించడం ప్రక్రియ పూర్తయ్యాక వాటి ఆధారంగా తమకు సీటు లభించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో దశ (కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం) తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్‌కు నిర్దేశిత హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. వెబ్సైట్: https://tspolycet.nic.in వెబ్ ఆప్షన్స్ ముఖ్య తేదీలు:- మే23, 24: 1 - 28,000 ర్యాంకు వరకు మే25, 26: 28001- 56000 ర్యాంకు వరకు మే27, 28: 56001-84000 ర్యాంకు వరకు మే29, 30: 84001- చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల మార్పు: మే 31 సీట్ ఎలాట్మెంట్: జూన్ 1 -
ఏయే కాలేజీలో ఏ ర్యాంకుల వరకు సీట్లు..
కాలేజీల వారీగా గతేడాది సీట్లు వచ్చిన ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది ఏయే కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలియట్లేదా.. ఇప్పుడు మీ పిల్లలకు వచ్చే ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో అంచనా వేసుకోవాలనుకుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారా.. ఇకపై ఆ అవసరమే లేదు. తల్లిదండ్రుల్లో ఉన్న ఆ ఆందోళన తొలగించే చర్యలను సాంకేతిక విద్యాశాఖ చేపట్టింది. గతేడాది ఎంసెట్, పాలీసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌లో ఏయే కాలేజీల్లో ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులు, పాలిటెక్నిక్ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కాలేజీల వారీగా ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. కాలేజీ వారీగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు, కోర్సులు, బ్రాంచీల వివరాలతో రూపొందించిన సీడీలను సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంంలో సాంకేతిక విద్యా జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నారాయణరెడ్డి, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు, బ్రాంచీలు, ర్యాంకుల వివరాలను www.sakshieducation.com, http://dte.telangana.gov.in, http://dtets.cgg.gov.in, https://tspolycet.nic.in, http://tsche.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత!
30 వేలకుపైగా తగ్గనున్న సీట్లు మూసివేత కోసం దరఖాస్తు చేసిన కాలేజీలు 21 బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపునకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసినవి 41 అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీలు 58 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఇప్పటికే పలు కాలేజీలు స్వచ్ఛం దంగా మూసివేతకు విజ్ఞప్తిచేసుకోగా.. మరిన్ని కాలేజీలు బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’కి దరఖాస్తు చేసుకున్నాయి. ఇక 58 కాలేజీలైతే అసలు అఫిలియేషన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మొత్తం గా వచ్చే విద్యా సంవత్సరం(2016-17)లో 30 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు రద్దయ్యే అవకాశముంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు మొత్తం భర్తీ అయ్యే అవకాశముంది. గతేడాది కంటే ఈసారి ఇంజనీరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా దీనికి తోడ్పడనుంది. రాష్ట్రంలో మొత్తం 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. అందులో 21 కాలేజీలు మూసివే సుకుంటున్నట్లు జేఎన్టీయూహెచ్కు తెలియజేశాయి. వీటిల్లో ఒక్కో కాలేజీలో 400 నుంచి 900 వరకు సీట్లున్నాయి. సగటున 500 సీట్ల చొప్పున లెక్కించినా 10 వేలకుపైగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక 41 కాలేజీల యాజమాన్యాలు కొన్ని బ్రాంచీలను పూర్తిగా రద్దు చేయాలని, కొన్ని బ్రాంచీల్లోని సీట్లను తగ్గించాలని ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన వీటన్నింటిలో కలిపి మరో 10 వేలకుపైగా సీట్లు తగ్గనున్నాయి. మరోవైపు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్టీయూహెచ్ ప్రారంభించింది. కానీ 58 కాలేజీలు గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలుపోగా... మిగతా 37 కాలేజీల్లోని మరో 10 వే లకు పైగా సీట్లు రద్దయ్యే అవకాశముంది. అయితే ఈ 58 కాలేజీలు బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టకపోయినా... ఇప్పటికే ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసమైనా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య పేర్కొన్నారు. లేకపోతే ఆ విద్యార్థులు నష్టపోతారని, అలాంటి కాలేజీలపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈసారి కన్వీనర్ కోటా ఫుల్! 2016-17లో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లు పూర్తిగా భర్తీ కానున్నాయి. మేనేజ్మెంట్ కోటాలోనూ చాలా వరకు సీట్లు భర్తీ అయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని 249 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,23,427 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 88,527 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 37,940 సీట్లు ఉన్నాయి. గతేడాది కన్వీనర్ కోటాలో 56,017 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 30 వేల సీట్లు మిగిలిపోయాయి. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు తగ్గిపోనుండడంతో కన్వీనర్ కోటా పూర్తిగా భర్తీ కానుంది. మరోవైపు ఎంసెట్‌కు గతేడాది 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 1,43,362 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్ల భర్తీ పెరగనుంది. -
సంజీవయ్య వర్సిటీలో సగం సీట్లు రాష్ట్రానికే
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని సీట్లలో సగం ఇకనుంచి రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు సంజీవయ్య న్యాయ వర్సిటీ చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు శనివారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. వర్సిటీలో ప్రస్తుత ప్రవేశ విధానానికి బదులుగా మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ఏపీ విద్యాసంస్థల ప్రవేశ, క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయనున్నారు. 40 శాతం సీట్లను అఖిలభారత ప్రాతిపదికన, 10 శాతం ప్రవాస భారతీయులు, విదేశీ పౌరులకు కేటాయించేలా సవరణలను ప్రతిపాదించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపకులపతుల పదవీకాలాన్ని మూడు నుంచి ఐదేళ్లకు పెంచేలా బిల్లులో పొందుపరిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని వర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం దీని పరిధిలో లేనందున చట్టంలోని నిజామాబాద్ అనే పదాన్ని ఉపసంహరిస్తున్నారు. -
చివరి సీట్లలో ప్రయాణిస్తే 20 శాతం రాయితీ
విజయవాడ: బస్సులో చివరి సీట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి దూరప్రాంత సర్వీసుల్లోని చివరి రెండు వరసల్లో ఉండే తొమ్మిది సీట్లకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం బస్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు కరెంట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడూ ఇది వర్తిస్తుందన్నారు. చివరి సీట్లలో ప్రయాణించేందుకు ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల కొన్ని బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నామని, వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. 250 కిలోమీటర్లకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినవారికి ఆ తర్వాత రెండుగంటలపాటు సమీప ప్రాంతాలకు సిటీబస్సులు, జిల్లా సర్వీసుల్లో (తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు) ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 40 రూట్లలోని 453 బస్సుల్లో అడ్వాన్స్ బస్ ఎరైవల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దీని ద్వారా ఆయా స్టేషన్లకు ఎదురు చూస్తున్న బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలుస్తుందని సాంబశివరావు అన్నారు. తమ సెల్ఫోన్లో మిస్డ్ కాల్ ఇస్తే బస్సులో అమర్చిన యంత్రం ద్వారా ప్రయాణికుడు ఉన్న స్టేషన్లో ఎనౌన్స్మెంట్ వస్తుందని తెలిపారు. రూ.13.18 కోట్లతో రాష్ట్రంలోని 18 బస్స్టేషన్లను ఆధునీకరించామని రెండోదశలో అంతే మొత్తంతో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 64 బస్స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ బస్స్టేషన్లలో వంద చొప్పున మెడికల్ షాపులు, వైద్య పరీక్షలు చేసే డయాగ్నోసిస్ షాపులు, మినీ థియేటర్లు, రిటైల్ షాపులు, డెంటల్, ఐ క్లినిక్ సెంటర్లకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.108 కోట్లు వస్తున్న నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని రూ.200 నుంచి రూ.250 కోట్లకు పెంచేందుకు వీటిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, వ్యాపారవేత్తలు ఎవరైనా బస్స్టేషన్లకు తమ పేరుగానీ, తాము సూచించిన వారి పేర్లుగానీ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని ఇందుకోసం నిర్దిష్ట సొమ్మును ఐదు సంవత్సరాలు చెల్లించాల్సివుంటుందని సాంబశివరావు చెప్పారు. ఉదాహరణకు ఉయ్యూరు స్టేషన్‌కు ఎ.రాధాకృష్ణ తరఫున ఎవరైనా రూ.5లక్షలు చెల్లిస్తే ఆ స్టేషన్ పేరు ఎ.రాధాకృష్ణ ఏపీఎస్ఆర్టీసీ బస్‌స్టేషన్‌గా మారుస్తామన్నారు. దీనివల్ల ప్రకటనల ఆదాయం పెరుగుతుందన్నారు. బస్సుల సమాచారం తెలుసుకునేందుకు బస్టాండ్లలో పాసింజర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లు, పాసింజర్ మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ (వెహికల్ ట్రాకింగ్)ను సైతం ప్రవేశపెడతామని తెలిపారు. ఆర్టీసీకి ఈ సంవత్సరం రూ.4,101 కోట్ల ఆదాయం రాగా గత సంవత్సరం రూ.3,970 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సంస్థకు ఆపరేషనల్ నష్టం లేదని, గతంలో చేసిన అప్పుల వల్లే నష్టాలు వస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ రూ.411కోట్ల నష్టం రాగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి అది రూ.500 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 30 రోజుల్లో 795 బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని ఈసారి వాటిలో కొన్ని ఏసీ బస్సులు కూడా ఉన్నాయన్నారు. త్వరలో విజయవాడలో సెంట్రల్ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, సంస్థ కార్పొరేట్ కార్యాలయం విజయవాడకు తీసుకొస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఎ.వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గందరగోళంలో టీడీపీ- బీజేపీ కార్యకర్తలు
-
కొలిక్కిరాని బీజేపీ-టీడీపీ సీట్ల సర్ధుబాటు
-
కొలిక్కిరాని బీజేపీ-టీడీపీ సీట్ల సర్ధుబాటు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య సీట్ల సర్ధుబాటు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. దీంతో ఇరు పార్టీల ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. రెండు పార్టీలు ఎవ్వరికీ వారు తమకే ఎక్కువ సీట్లు కావాలంటూ పట్టుబడుతుండడంతో సీట్ల సర్ధుబాటు కొలిక్కిరావడం లేదు. మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ అంటుంటే...గ్రేటర్లో బీజేపీ కంటే తమకే ఎక్కువ బలం ఉందని టీడీపీ అంటుంది. 45 సిట్టింగ్ డివిజన్లు తమకే కావాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. నామినేషన్లకు గడువు మరో మూడు రోజుల మాత్రమే ఉండడంతో ఆశావాహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. చివరి నిమిషంలో టిక్కెట్ దక్కకపోతే రెబెల్‌గా నామినేషన్ వేసే ప్రయత్నంలో నాయకులు ఉన్నట్లు సమాచారం. -
'90 సీట్లు కావాలీ'
-
దసరాకు పదవుల పంపిణీ గ్యారెంటీ!
-
సీట్లు మురిగిపోవాల్సిందేనా?
- ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్ల భర్తీకి లేని అవకాశం - వివరాలను ప్రకటించని వర్సిటీలు, కాలేజీలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించట్లేదు. దీంతో విద్యార్థులకు రావాల్సిన సీట్లు మురిగిపోతున్నాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఏటా ఒక్కో కాలేజీలో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంతో డిమాండ్ ఉండే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఇష్టమైన బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరట్లేదు. ఈసారి కూడా వివిధ కాలేజీల్లో సీట్లు మిగిలిపోయినట్లు సమాచారం. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే 20 సీట్లు మిగిలిపోగా మిగిలిన 16 కాలేజీల్లోనూ సీట్లు మిగిలినట్లు తెలియవచ్చింది. కానీ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయన్న వివరాలను వర్సిటీలు, కాలేజీలు ప్రకటించట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలలో సీట్లు మిగిలిపోతే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) నిర్వహిస్తోంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించింది. నాలుగో దశ ముగిశాక కూడా దాదాపు 3,500 సీట్లు మిగిలిపోవడంతో మరోసారి స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. 18న సీట్ల కేటాయింపు ప్రకటిస్తామని, 18 నుంచి 26 వరకు విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీల్లో చేరాలని సూచించింది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్లలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మిగులు సీట్లను ప్రకటించి వాటిని భర్తీ చేయాలని కోరుతున్నారు. మిగులు సీట్ల విషయంపై అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ కాలేజీల్లో చివరి దశ కౌన్సెలింగ్ తరువాత విద్యార్థులు చేరని సీట్లను భర్తీ చేసే అవకాశం లేదని చె ప్పారు. -
బీహార్ సీట్ల సర్దుబాటు ఖరారు
పాట్నా: ఎట్టకేలకు బీహార్ శాసన సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 243 సీట్లలో జేడీయూకు 100 , ఆర్ జేడీకి 100, కాంగ్రెస్ 40 సీట్లు కేటాయించారు. ఈ స్థానాల్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. త్వరలో బీహార్ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు అక్కడి ప్రతిపక్షాలన్ని ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే, సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఓ రకమైన ప్రతిష్ఠంభన నెలకొంది. మిత్ర పక్షాల్లో ఎవరికి ఎన్నిసీట్లు కేటాయిస్తారో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటుండగానే సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ పోటీ పోటీ ప్రభావాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు సమానంగా సీట్లు కేటాయించి వాటికన్నా తక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. -
ఆన్లైన్ అడ్మిషన్లు..విద్యార్థులకు శాపం
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతిభ ఉన్నా, ఎక్కువ మార్కులు సాధించినా కళాశాలలో సీటు పొందలేక పోతున్నారు. - ప్రతిభ ఉన్నా టీటీడీ విద్యాసంస్థల్లో దక్కని సీట్లు - అత్తెసరు మార్కులు పొందినవారికి రాచ మార్గం యూనివర్సిటీక్యాంపస్: చిత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించాడు. టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించినందువల్ల తనకు సీటు ఖాయం అనుకున్నాడు. అయితే టీటీడీ ప్రకటించిన మెరిట్‌లిస్టులో అతనిపేరు లేదు. అతని కన్నా తక్కువ మార్కులు వచ్చిన, 50 శాతం మార్కులు సాధించిన వారికి సీట్లు వచ్చాయి. తనకు మాత్రం రాలేదు. సీటు ఎందుకు రాలేదని సంబంధిత కళాశాలకు వెళితే అంతా ఆన్లైన్ తప్పిదమే..తప్ప తమది కాదని తప్పించుకుంటున్నారు. జాబితాలో సదరు అభ్యర్థి దరఖాస్తు కూడా లేకపోవడంతో సీటు రాక నిరాశకు గురయ్యాడు. ఇదీ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. టీటీడీ విద్యాసంస్థల్లో అత్తెసరు మార్కులు పొందినవారు రాచ మార్గంలో సీట్లు పొందుతున్నారు. దీంతో వారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సీటు పొందని వారికి రెండో విడతలో అడ్మిషన్ ఇస్తామంటున్నారు. తీరా చూస్తే వారి దరఖాస్తులు కనిపించడంలేదు. దీంతో ఆ విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ విధానం అమలు కోసం టీటీడీ రూ.20 లక్షల వ్యయం చేసి, ఓ సాఫ్ట్వేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అడ్మిషన్ల వ్యవహారంపై ఈ సంస్థ ముందస్తు చర్యలు తీసుకోలేదు. అలాగే సాంకేతిక సమస్యలు తలెత్తితే సరి చేసేందుకు, ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతినిధిని నియమించలేదు. దీంతో తప్పులు దొర్లి విద్యార్థులు నష్టపోతున్నారు. 22 తర్వాత దరఖాస్తులు పరిశీలించిన అధికారులు టీటీడీ ఆన్లైన్ విధానం ప్రకారం గత జూన్ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు ఊంజల్‌పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని వేంచేపుగా ఆలయం నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. తదుపరి సర్వాంగ సుందరంగా అలంకృతుడైన స్వామివారు హనుమంతునిపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమాల్లో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు రవి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. నేడు గరుడ సేవ.. అవతారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి 7.15గంటలకు సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 2గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. -
బాసర ఆర్జీయూకేటీలో పెరగనున్న సీట్లు!
ప్రభుత్వం ఓకే చెబితేనే అమలు బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంలో (ఆర్జీయూకేటీ) సమీకత బీటెక్ (ట్రిపుల్ఐటీ) కోర్సులో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థుల వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. బాసరలోని క్యాంపస్‌లో 1,000 సీట్ల భర్తీకి విద్యార్థులను ఎంపిక చేసినట్లు మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో బాసర క్యాంపస్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. స్పెషల్ కేటగిరీ (స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగులు) వారికి 28, 29 తేదీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నిర్ణీత తేదీల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా, సీట్లు మిగిలినా 31వ తేదీన తుది దశ కౌన్సెలింగ్ నిర్విహ స్తామని పేర్కొన్నారు. తుది కౌన్సెలింగ్ తరువాత కూడా సీట్లు మిగిలితే ఆ తరువాత ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రవేశాల కోసం మొత్తంగా 10,713 మంది దరఖాస్తు చేసుకోగా జనరల్ కేటగిరీలో 936 మంది విద్యార్థులను ప్రవేశాలకు ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఓకే అంటేనే అదనం ప్రస్తుతం రాష్ట్రంలోని 202 మండలాలకు చెందిన విద్యార్థుల్లో ఒక్కరికి కూడా సీట్లు లభించలేదని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సూపర్ న్యూమరరీ సీట్లు క్రియేట్ చేయాలని తీర్మానం చేసిందని, ఈ మేరకు ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు చెప్పారు. ప్రస్తుతం బాసర క్యాంపస్‌లో 1,000 సీట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఒప్పుకుంటే 202 సీట్లు అదనంగా వస్తాయన్నారు. -
'గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలి'
వరంగల్: జిల్లాలోని రాయపర్తిలోగల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండటం, అడ్మిషన్ కోరే విద్యార్థుల విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉన్న కారణంగా సీట్ల సంఖ్య పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పెంపుపై నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
సీట్లోయ్.. సీట్లు
ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ కళాశాలల్లో సీట్లుకు, విద్యార్థుల సంఖ్యకూ భారీ వ్యత్యాసం ఉంది. సీట్ల కంటే ఎంసెట్‌లో క్యాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులను చేర్చుకునేందుకు కాలేజీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు భరించలేక ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బావురుమంటున్న దశలో సీట్లు మిగిలిపోతే కళాశాలల నిర్వహణ కష్టమేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫీజు రీయిం బర్సమెంట్ పథకంపై నమ్మకం లేకపోవటంతో యాజమాన్యాలు డైలమాలో పడ్డాయి. ఈ పథకం అమలు చేసినా ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు పెడితే ఆనక విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి వస్తే తమ వల్లకాదంటారనే భయం యాజమాన్యాలకు ఉంది. జిల్లాలో ఎంసెట్-15 రాసిన విద్యార్థుల్లో 8వేల 808 మంది అర్హులు ఉన్నా కాలేజీల్లో ఎంతమంది చేరతారనేది ప్రశ్నార్థకమే. ఈ సంకట స్థితిలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు గాలంవేసే పనిలో నిమగ్నమయ్యాయి. తగ్గుతున్న కాలేజీలు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏడేళ్ల క్రితం జిల్లాలో 32 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండేవి. ఈ ఏడాదికి 25 కళాశాలలే మిగిలాయి. గతంలో లాభసాటిగా ఉన్న కాలేజీల నిర్వహణ, ప్రస్తుతం కొన్ని పేరున్న కాలేజీలకు మినహా మిగిలిన వాటికి భారంగా మారింది. జిల్లాలో కన్వీనర్ కోటాలో 8వేల 841సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 3వేల 789 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఒక కాలేజీ మూతపడడంతో ఆ సీట్లు కొద్దిగా తగ్గినా జిల్లాలో 11 వేల సీట్లుకు పైగా ఉన్నాయి. ఎంసెట్‌ను 11,406మంది రాయగా అర్హత సాధించింది 8వేల 808 మంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు తాయిలాలు సైతం ఇచ్చేందుకు పలు కాలేజీలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఫీజులపై ఒత్తిడిలేదు ఇంజినీరింగ్‌లో పలు బ్రాంచిలకు డిమాండ్ ఉంది. పేరున్న కాలేజీ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే ఉద్యోగం పొందవచ్చని యోచించే విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. గత ఏడాది జిల్లాలోని 9 కాలేజీల్లోనే పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఆరు కాలేజీల్లో అయితే మరీ తక్కువ అడ్మిషన్లు వచ్చాయి. దీంతో ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు ఈసారైనా సీట్లు భర్తీ చేయకుంటే మూసేయటమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫీజు ఎంత కట్టినా ఫరవాలేదు, చేరితే చాలనే యోచనలో కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి. సాంకేతిక విద్యామండలి నిబంధనలు కఠినం కావటంతో నిర్వహణ ఖర్చు భారీగా పెరగనుంది. ఫీజు రీయింబర్సమెంట్ పథకంలో సొమ్ములు ఎప్పుడు మంజూరు అవుతాయో తెలియకపోయినా సీట్లు భర్తీ అయితే ముందుకు నడిపించేయాలనే ఉద్దేశంలో యాజమాన్యాలు ఉన్నాయి. ఇది ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు మాత్రం వరమే. -
నిట్‌లో 50% సీట్లు తెలంగాణ విద్యార్థులవే..
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక వరంగల్ నిట్‌లో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులవేనని, నిట్ అడ్మిషన్లకు 371డి వర్తించదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం కూడా అదే చెబుతోందని ఆయన మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నయం చూసుకోవాలని కడియం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 371-డి ఆర్టికల్ వర్తించబోదని చెప్పారు. రాష్ట్రంలోని సంస్థలకే 371-డి వర్తిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ రాష్ట్ర సంస్థలకే వర్తిస్తుందని చెప్పారు. 371-డి వర్తించే సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అమలవుతుందన్నారు. పార్లమెంటు చట్టప్రకారం, ఎన్ఐటి ప్రవేశాల మార్గదర్శకాలు, న్యాయపరంగా ఏ రకంగా చూసినా 50 శాతం సీట్లు తెలంగాణకే దక్కుతాయని అన్నారు. సీట్లు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు. కాగా స్థానిక కోటాలోని 50 శాతం సీట్లు తమవేని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి అడ్మిషన్ ద్వారా సీట్లు భర్తీ చేసి ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై చర్చించేందుకు కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లారు. -
కటాఫ్ కలవరం
- ఇంజినీరింగ్‌కు గట్టి పోటీ - ఎంబీబీఎస్‌కు కాస్త ఉపశమనం - దరఖాస్తుల కోసం పరుగులు సాక్షి, చెన్నై: ప్లస్‌టూ ఫలితాల విడుదలతో విద్యార్థుల దృష్టి ఉన్నత చదువుల మీద పడ్డాయి. అన్నావర్సిటీ నేతృత్వంలో జరిగే కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులు ఏ మేరకు ఉంటాయోనన్న కలవరం బయలుదేరింది. ఇందుకు కారణం ఈ సారి ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లకు గట్టి పోటీ ఉండడమే. ఇక, ఎంబీబీఎస్ విషయానికి వస్తే కటాఫ్ మార్కులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని విద్యా విధానం మేరకు ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలబడుతూ వస్తున్నది. ప్లస్‌టూ ముగించిన విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్య కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ప్లస్‌టూలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, వైద్య కోర్సుల సీట్లను విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ప్రధానంగా గణితం, బయాలజీ, ఫజిక్స్, కెమిస్ట్రీల్లో సాధించిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి సీట్లను అప్పగిస్తున్నారు. కటాఫ్ కలవరం : రాష్ట్రంలో ప్రభుత్వ, స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన 575 వరకు ఇంజినీరింగ్ కళాశాలు ఉన్నాయి. వీటిల్లో కళాశాలను బట్టి 50 నుంచి 65 శాతం మేరకు సీట్లను అన్నా వర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతున్నది. ఈ ఏడాది ప్లస్‌టూలో ఉత్తీర్ణత శాతం పెరగడంతో కటాఫ్ మార్కులు ఏ మేరకు నిర్ణయిస్తారోనన్న కలవరం విద్యార్థుల్లో బయలు దేరింది. ప్రభుత్వం భర్తీ చేయనున్న సీట్లకు కోసం ఎలాంటి డొనేషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ ఫీజుల్నే కళాశాలలు వసూళ్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే పనిలో పడ్డారు. అయితే, కటాఫ్ కలవరం విద్యార్థుల్ని వెంటాడుతున్నది. బీఈ, బీటెక్లలోని ప్రధాన కోర్సుల్ని చేజిక్కించుకోవాలంటే, రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించే కటాఫ్ మార్కుల మీద ఆధార పడిఉంది. ఈ ఏడాది గణితంలో మునుపెన్నడూ లేని రీతిలో 200కుగాను రెండు వందల మార్కులను 9,700 మంది, 198 మార్కులను పదిహేను వేల మంది వరకు చేజిక్కించుకుని ఉండడంతో ఇక, ప్రధాన సీట్లకు గట్టి పోటీ తప్పదన్నది స్పష్టం అవుతోన్నది. దీంతో ఈ ఏడాది కటాఫ్ మార్కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కటాఫ్ మార్కు రెండు వందలకు గాను 199.75 వరకు నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంటుండడంతో ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లకు భలే గిరాకీ తథ్యం. ఎంబీబీఎస్: ఇక, ఎంబీబీఎస్ విషయానికి వస్తే కటాఫ్మార్కు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఇందుకు కారణం గత ఏడాది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో విద్యార్థులు రికార్డులు సృష్టిస్తే, ఈ ఏడాది చతికిలబడడమే. గత ఏడాది ఈ సబ్జెక్టుల్లో రెండు వందలకు రెండు వందల మార్కులను పెద్ద సంఖ్యలో సాధించగా , ఈ సారి కేవలం ఐదుగురు మాత్రమే నిలిచారు. దీంతో ఎంబీబీఎస్ కటాఫ్ మార్కు ఈ సారి తగ్గే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.రెండు వందలకు 199.25 వరకు ఈ సారి కటాఫ్ నిర్ణయించ వచ్చన్న సంకేతాలతో ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లను ఆశిస్తున్న విద్యార్థులు, ప్రత్యామ్నాయంగా ఎంబీబీఎస్ దరఖాస్తులను సైతం కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. -
'GHMCలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం'
-
సీట్లు లేవ్
సాక్షి, కడప : పల్లె లోగిళ్లలో చేసుకునేందుకు ఇష్టపడే సంక్రాంతి పండుగ సంబరాలకు పలువురు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. సాధారణంగా దసరా తర్వాత అన్నో ఇన్నో సెలవులు వచ్చేది సంక్రాంతికే. దాదాపు వారం రోజులపాటు సెలవులు రానున్న నేపధ్యంతోపాటు పండుగ సంబరాలను సొంత ఊళ్లలో సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తరలిరావడం ఆనవాయితీ. అరుుతే ప్రయాణ టెన్షన్ తెలుగు వారిని వెంటాడుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ నిమిత్తం కౌంటర్లకు వెళ్లి సీట్లు ఫుల్ అయ్యాయనే సమాధానంతో చాలామంది వెనుతిరుగుతున్నారు. రైళ్లలో కూడా దాదాపు రిజర్వేషన్ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సొంత ఊరికి వచ్చేందుకు రద్దీ ఉంటుందని ముందే తెలుసుకున్న స్థానికులు నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవడంతో స్వస్థలాలకు ఎలా రావాలన్న ఆందోళన నెలకొంది. బాదుడుకు ప్రైవేటు సిద్ధం సంక్రాంతి రద్దీతో ఇదే అదునుగా భావించిన ప్రైవేటు యాజమాన్యాలు బాదుడుకు సిద్ధమవుతున్నాయి. ధరలు పెంచి టిక్కెట్లను విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా రవాణాశాఖ అధికారులు సైతం సాధారణ రేట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఎంతమాత్రం ప్రైవేటు దోపిడీని అడ్డుకుంటారనేది వేచి చూడాల్సిందే. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఇప్పటికే ఎవరు టిక్కెట్ అడిగినా లేదని చెబుతూ వారి డిమాండును సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలలో వైఎస్సార్ జిల్లాకు చెందిన వేలాది కుటుంబాలు ఉపాధి నిమిత్తం వెళ్లి స్థిరపడిపోయారు. పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రతిసారి స్వస్థలాలకు వస్తుంటారు. ఆర్టీసీ నడిపే స్పెషల్ బస్సుల్లో కూడా భారీ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేయనున్నారు. సాధారణంగా కడప-హైదరాబాదు మధ్య ఛార్జి రూ.500 అనుకుంటే, స్పెషల్ బస్సుల్లో రూ.750 వరకు అదనపు భారం పడనుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్‌తోపాటు ఆర్టీసీ సాధారణ సర్వీసుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి కావడంతో కొంతమంది స్వస్థలాలకు వచ్చేందుకు ప్రైవేటు వాహనాలను బాడుగకు తీసుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కడప రీజియన్‌లో 200 ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని స్వగ్రామాల్లో చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతిపండుగ సీజన్ నేపధ్యంలో విజయవాడ, చెన్నై, బెంగుళూరు,హైదరాబాదు తదితర ప్రాంతాలకు సుమారు 200 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కడప రీజియన్‌లోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం గోపినాథ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. ప్రత్యేక రైళ్లలో కూడా గగనమే దక్షిణ మధ్య రైల్వే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సాధారణంగా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అయితే ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా అప్పటికప్పుడు రిజర్వేషన్ సీట్లు లభించడం కష్టమేనని పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దూరమైనా కూడా ఇతర ప్రాంతాల చుట్టూ తిరిగి అయినా స్వగ్రామాలకు చేరుకోవాలని భావిస్తున్నారు. -
అడ్డగోలుగా బీఎడ్ సీట్ల అమ్మకం
మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే రాని సీట్లు ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన ఉన్నత విద్యామండలి కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు చర్యలకు సిద్ధమవుతున్న మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ప్రవేశాల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే సీట్లు ఇవ్వలేదని వెల్లడైంది. మేనేజ్మెంట్ కోటానే కాదు.. కన్వీనర్ కోటాలోని సీట్లను కూడా మైనారిటీయేతర విద్యార్థులకు అడ్డగోలుగా అమ్ముకున్నట్లు తేలింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన సీట్ల వివరాలను సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కో సీటును రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్వీనర్ కోటాలో తమకు సీటు వచ్చినా యాజమాన్యాలు ప్రవేశాలను నిరాకరిస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో స్పందించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశాల గడువును ఈనెల 29వ తేదీ వరకు పెంచింది. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. అయినా మండలి ఆదేశాలను యాజమాన్యాలు తుంగలో తొక్కాయి. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించి తాళాలు వేసినట్లు తెలిసింది. సగం సీట్ల అమ్మకం... రాష్ట్రంలో 29 మైనారిటీ బీఎడ్ కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో ఒక్కో కాలేజీలో 75 సీట్ల చొప్పున 2,175 సీట్లు ఉండగా, మేనేజ్మెంట్ కోటాలో ఒక్కో కాలేజీలో 25 సీట్ల చొప్పున 725 సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లను మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కేటాయించిన మైనారిటీ విద్యార్థులకే ఇవ్వాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మైనారిటీ విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లలో చేరకపోతే ఆ తరువాత నాన్ మైనారిటీ విద్యార్థులకు ఆ సీట్లను కేటాయించాలి. కాని కొన్ని యాజమాన్యాలు మినహా మిగతా కాలేజీలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా చేసి, మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నత విద్యా మండలి కాలేజీల్లో ప్రవేశాల వివరాలను సేకరించింది. పలు యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడినట్లు అందులో బయట పడ్డాయి. కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లలో సగం వరకు అమ్ముకున్నట్లు తెలిసింది. పైగా మండలి ప్రవేశాల గడువును పెంచి, సీటు వచ్చిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది. -
పాలిటెక్నిక్‌లలో మిగిలిన 80 వేల సీట్లు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పాలిటెక్నిక్‌లలో మొత్తం 80,806 సీట్లు మిగిలిపోయాయి. ఆయా పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికై నిర్వహించిన పాలీసెట్ మలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తొలిదశ కౌన్సెలింగ్‌లో 53,901మందికి సీట్లు లభించగా, మలిదశ కౌన్సెలింగ్‌లో అదనంగా మరో 10,381 మందికి సీట్ల కేటాయింపు జరిగింది. సీట్లు పొందిన అభ్యర్థులు తమ అలాట్మెంట్ లెటర్లను, ఫీజు పేమెంట్ చలాన్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మలిదశలో మొదటిసారి సీటు లభించిన అభ్యర్థులు, కళాశాలను మార్చుకున్న అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్లపై అథారిటీ సంతకం కోసం తప్పనిసరిగా సమీప హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలి. సీట్లు లభించిన అభ్యర్థులు ఈనెల 15లోగా వారికి కేటాయించిన కళాశాల్లో రిపోర్టు చేయాలి. మరోమారు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదని అధికారులు స్పష్టంచేశారు. -
సీట్ల‘పట్లు’
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కు తోంది. డీఎఫ్, మహాకూటమి దెందూ.. దెందే.. అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. ఓటమి ఒక కూటమిలో చిచ్చురేపితే, గెలుపు మరో కూటమిలో కుమ్ములాటలకు తెరతీసింది. వెరసి అన్ని పార్టీల కార్యకర్తల్లోనూ అనిశ్చితి నెలకొంది. డీఎఫ్..అధిష్టానం కోర్టులో బంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 144 సీట్లు కావాలంటూ ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా మరోవైపు దీనికి ససేమిరా అని కాంగ్రెస్ పేర్కొంటోంది. అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇరు పార్టీలూ బెదిరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాసామ్య కూటమి (డిఎఫ్) కొనసాగుతుందా.. లేదా అనే విషయంపై కాంగ్రెస్, ఎన్సీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమి గత 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అనేక అంశాలపై వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. పలుమార్లు ఆ కూటమి ముక్కలు చెక్కలయిపోతుందని పలువురు భావించారు. అయితే ఇరు పార్టీల అధిష్టానాలు సంయమనం పాటిస్తుండటంతో ఇంకా వీరి కూటమి కొనసాగుతోంది. అయితే ప్రతిసారి లోకసభ, అసెంబ్లీ, ఇత ర ఎన్నికల్లో వీరి మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తడం సర్వసాధారణమైంది. ఈసారి అవి తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కోలుకోలేని దెబ్బ తిన్నప్పటికీ.. ఒకరి ఓటమికి మరొకరు కారణమంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవలం రెండు లోక్‌సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ కన్నా నాలుగు స్థానాలు సాధించిన తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి తమకు ఎక్కువ కేటాయించాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవలే జరిగిన సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి ృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలతోపాటు ఇరు కాంగ్రెస్‌ల పదాధికారులు పాల్గొని సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఎన్సీపీ 144 స్థానాలు కావాలంటూ డిమాండ్ చేయడం, కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఈ సీట్ల పంపకాల అంశం ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్లు చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయంపై ఉత్కంఠత కన్పిస్తోంది. మహాకూటమిలోనూ లుకలుకలే.... బీజేపీ, శివసేన తదితర పార్టీల మహాకూటమిలో కూడా సీట్ల పంపకాల లొల్లి నడుస్తోంది. 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న ఈ కూటమి ఇటీవల లోక్‌సభ ఎన్నికల విజయంతో ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ కూటమిలోని బీజేపీ, శివసేన మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ఏ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పార్టీ సూచించిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి అత్యధిక స్థానాలు సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు అధికారం ఖాయమని భావిస్తున్నాయి. అయితే ఈసారి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయమై ఇంకా ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, శివసేన మధ్య సయోధ్య కుదరలేదు. మోడీ ప్రభంజనం ఉంది కాబట్టి తమకు ఎక్కువ స్థానాలు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.. అయితే మొదటి నుంచి ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు పోవాలని శివసేన స్పష్టం చేస్తోంది. శివసేన ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే పేరును సూచించగా, బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటన తదితర పార్టీలకు కూడా సీట్లను కేటాయించాల్సి రానుంది. గత ఎన్నికల్లో శివసేన 169, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. అయితే ఈసారి వీరితో జతకట్టిన ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంతోపాటు ఆ సీట్లను ఎవరి కోటా నుంచి తగ్గించాలనే దానిపై కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ నేత నారాయణ రాణే మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన బీజేపీలో చేరనున్నట్టు వార్తలు రావడంతో మహాకూటమిలో అయోమయ స్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో మహాకూటమిలో సీట్లతో పాటు ఇతర అంశాలపై సయోధ్య ఎలా కుదరనుందనే విషయంపై కార్యకర్తల్లో ఉత్కంఠత కన్పిస్తోంది. అక్టోబర్‌లోనే ఎన్నికలు ! సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆగస్టులో ఎన్నికల్ కోడ్ అమల్లోకి తీసుకువచ్చి అక్టోబర్‌లో ఎన్నికల జరపాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలో ఇటీవల పర్యటి ంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ లేదా 8వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం భావిస్తోందని సమాచారం. నక్సలైట్ల ప్రభావమున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని తెలిసింది. -
వచ్చేసారికి 15
పెరగనున్న మూడు అసెంబ్లీ స్థానాలు 2019 ఎన్నికల్లోపు కొత్తవి ఏర్పాటు ఆశల్లో ద్వితీయ శ్రేణి నేతలు మారనున్న రాజకీయ ముఖచిత్రం లోక్‌సభ నియోజకవర్గాల పరిధి కాకుండా... జిల్లాను యూనిట్‌గా తీసుకుని పునర్విభజన ప్రక్రియ చేపడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే జరిగితే గతంలో నియోజకవర్గాలు ఉన్న చేర్యాల మళ్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడే అవకాశం ఉండనుంది. తొర్రూరు, హసన్‌పర్తి, కేసముద్రం, నెక్కొండ వంటి జనాభా ఎక్కువగా ఉండే మండల కేంద్రాలను కొత్త నియోజకవర్గాల కేంద్రాలుగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులోనే ‘కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి’ అని పేర్కొనబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెట్టనుంది. వచ్చే ఎన్నికల్లోగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. గతంలో పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పార్లమెంట్ నిర్ణయం ప్రకారం సాధారణంగా ప్రతి 20 లేదా 30 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1978, 2009 ఎన్నికలకు ముందు పునర్విభజన చేశారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 153కు పెరగనుంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియలో భాగం గా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొత్తగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తగ్గించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. మన జిల్లాలో కొత్తగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పడే ఆస్కారముంది. జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈ సెగ్మెంట్ పరిధిలో అదనంగా రెండు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు అదనంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ పేరుతో ఈ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మరో నియోజకవర్గం ఏ మండలం కేంద్రంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాలుగా ఉన్న హసన్‌పర్తి, ధర్మసాగర్, శాయంపేట పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో మన జిల్లాలోని నాలుగు, ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మన జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రస్తుత పరిధిని తగ్గించి మిగిలిన భాగంతో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటు కానుంది. దీన్ని ఏ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త స్థానాలపై కోటి ఆశలు మొత్తంగా జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏ మండల కేంద్రంగా ఉంటాయి... అక్కడి రిజర్వేషన్ పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ముందుగా జరిగితే... నియోజకవర్గాల పునర్విభజన అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరగనుంది. ఇన్నాళ్లు మండల స్థాయిలో ఇప్పటికే పదవులు అనుభవించిన వారి దృష్టి ఇప్పుడు నియోజకవర్గాలపై పడింది. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నాయకులు సైతం... కొత్తగా ఏర్పడే నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందా అనే విషయంపై ఆలోచిస్తున్నారు. -
పీజీ వైద్య సీట్ల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య సీట్లు, పీజీ డెంటల్ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది సీట్ల భర్తీ కోసం ఇచ్చిన జీవో నెం.43కు కొన్ని సవరణలు చేస్తూ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషాలిటీ సీట్ల వారీగా ఈ సారి భర్తీ జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 150 జనరల్ మెడిసిన్ సీట్లు ఉన్నాయనుకుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల కేటగిరీలతో పాటు వికలాంగ అభ్యర్థులకు సైతం ముందే సీట్లు రిజర్వ్ చేస్తారు. గతంలో అయితే ప్రతి వంద పాయింట్లను లెక్కేస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించేవారు. అంతేకాదు గతంలో ఉన్న విధానం ప్రకారం మంచి ర్యాంకులు సాధించిన వారు బాగా ప్రాచుర్యం ఉన్న సీట్లను ఎంచుకునేవారు. దీంతో మెరిట్ విద్యార్థులు సీట్లను పొందేవారు. ఇప్పటి విధానం ప్రకారం ప్రతి స్పెషాలిటీలోనూ ప్రతి కేటగిరీకి చెందిన అభ్యర్థి ఉంటారు. కాగా గతంలో ఇచ్చిన జీవోకు చిన్న సవరణ చేశారు. గతేడాది ఆర్థోపెడిక్ సీట్లు మహిళలకు కేటాయించినప్పుడు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సీట్లు మిగిలిపోయేవి. ఈ సారి అలా సీట్లు మిగిలిపోతే మిగతా వారికి కేటాయించాలని నిర్ణయించారు. కేటగిరీల వారీగా ముందే సీట్లు కేటాయిస్తే రిజర్వ్డ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని భావించారు. ఈ ఏడాది సీట్ల భర్తీలో యూనివర్శిటీల వారీగా, కాలేజీల వారీగా పక్కాగా సీట్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కొత్త విధానం ప్రకారం మహిళా అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కేటగిరీల వారీగా జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు ఎస్సీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాని పక్షంలో ఆ సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు ఎస్టీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు భర్తీకాని ఎస్సీ అభ్యర్థుల సీట్లు ఓసీలకు కేటాయిస్తారు బీసీ-ఏ సీట్లు భర్తీకాకపోతే బీసీ-బీకి కేటాయిస్తారు భర్తీ కాని బీసీ-బీ సీట్లను బీసీ-సీకి ఇస్తారు భర్తీ కాని బీసీ-సీ సీట్లను బీసీ-డీకి కేటాయిస్తారు భర్తీకాని బీసీ-డీ సీట్లను బీసీ-ఇకి కేటాయిస్తారు భర్తీకాని బీసీ-ఇ సీట్లను బీసీ-ఏకు కేటాయిస్తారు భర్తీకాని బీసీ సీట్లను ఓసీలకు కేటాయిస్తారు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి ఎవరైనా సీటు పొంది ఆ తర్వాత ఆ సీటును వదులుకుంటే ఆ సీటును ఓసీకి ఇస్తారు ఓసీ రిజర్వ్డ్ (ఉమెన్) సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను ఓసీ క్యాండిడేట్లకు ఇస్తారు