ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో రెండో దశ సీట్లకేటాయింపు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అధారిటీ (జోసా) చర్యలు తీసుకుంది.
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో రెండో దశ సీట్లకేటాయింపు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అధారిటీ (జోసా) చర్యలు తీసుకుంది. గత నెల 30వ తేదీన మొదటి రౌండ్‌లో సీట్లు కేటాయించారు. బుధవారం రెండోరౌండ్‌లోసీట్లు పొందిన వారి జాబితాను ప్రకటించనున్నది. సీట్లు పొందినవారు ఈ నెల 7వతేదీ నుంచి 9వ తేదీ మధ్య సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. మొదటి దశ యాక్సెప్టెన్సీ, ప్రవేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి.