శిక్షణకు హాజరైన విద్యార్థులు
అది 2002వ సంవత్సరం. బీహార్ రాష్ట్రంలో పాట్నలో ఆనంద్ కుమార్ అనే మధ్యతరగతి గణిత ఉపాధ్యాయుడు సూపర్ 30 ప్రోగ్రామ్‌కు నాంది పలికాడు. వారికి శిక్షణ ఇస్తూ ఎందరో ఐఐటీయన్లను తయారు చేశాడు. 2018వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అరుణాచలేశ్వర్ అనే కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు సూపర్ 50 ప్రోగ్రామ్‌ను తెరపైకి తెచ్చాడు. పేద విద్యార్థుల కలలను సాకారం చేస్తూ వీరు ఐఐటీకి ఉచిత తరగతులను నిర్వహిస్తున్నారు. బ్యాచ్‌కు 50 మంది మాత్రమే శిక్షణకు అర్హులు. అందుకే సూపర్ 50గా నామకరణం చేశారు.
ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు.
సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్‌సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్‌ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 29న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 30న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు.
అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు.
శ్రీ మేథ్ అరుణాచల అకాడమీ వారి ఆధ్వర్యంలో బైపీసీ విద్యార్థులకు నీట్ తరగతులను, ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ(జేఈఈ) తరగతులను ఐదు నెలల పాటు ఉచితముగా నిర్వహిస్తామని అకాడమీ డైరెక్టర్ అరుణాచలేశ్వర్ పత్రికా పకటనలో తెలిపారు. ప్రతి పేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. అర్హత గల పేద విద్యార్థులకు ఉచిత వసతి కూడా కల్పించబడును. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ మేథ్ అరుణాచల అకాడమి. నేషనల్ కాలేజ్ వెనుక, నంద్యాల. మరింత సమాచారం కోసం 70130 00437, 95819 30435 నెంబర్లను సంప్రదించగలరు.
Comments
Please login to add a commentAdd a comment