Hostel accommodation
-
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జ్
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు. -
వద్దంటున్న ఫార్మసీ విద్యార్థులు
శాతవాహనయూనివర్సిటీ: ఎల్ఎండీ కాలనీలోని శాతవాహ న యూనివర్సిటీ ఫార్మసీ ప్రాంగణం వసతిగృహాలు సరైన సదుపాయాలు లేక అధ్వానంగా మారాయి. వీటిలో సరైన సౌకర్యాలు కల్పించాలని, హాస్టళ్లను ఇక్కడినుంచి తరలించా లని విద్యార్థులు గతంలో పలుమార్లు యూనివర్సిటీ అధికా రులను కోరారు. దీంతో యూనివర్సిటీ ఫార్మసీ హాస్టళ్లను వాటి స్థానంలో నూతనంగా నిర్మించడానికి రూ.18 కోట్లకు పైగా నిధులు సిద్ధం చేశారు. ఇప్పుడు అక్కడున్న బాలబాలికలను మెయిన్ క్యాంపస్‌కు తరలించాలనే ఆలోచనలో అధి కారులున్నారు. అయితే కొంతమంది ఫార్మసీ విద్యార్థులకు అక్కడి నుంచి మెయిన్ క్యాంపస్‌కు రావడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు మెయిన్ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు ఫార్మసీ విద్యార్థులు వస్తే ఇక్కడ వసతులు సరిపోవని అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు ముగిసేవరకూ తరలింపు అంశంపై ఎలాంటి నిర్ణ యం తీసుకోబోమని, ఆలోపు వసతిగృహాల తరలింపుపై స్ప ష్టమైన వైఖరిని వెల్లడించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో ఎన్నికలు ముగిసేవరకూ విద్యార్థులు తీసుకున్న నిర్ణయంపై తరలింపు పక్రియ ఆధారపడనుందని తెలుస్తోంది. రూ.18కోట్లతో నూతన హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీలో ఇన్ని రోజుల నుంచి రేకులషెడ్డుల్లో బాలబాలికల వసతిగృహాలు నిర్వహించబడుతున్నాయి. ఫార్మసీ హాస్టళ్లలో మొత్తం 111 మంది ఉండగా.. ఇందులో బాలురు 32 మంది, బాలికలు 79 మంది ఉన్నారు. గతంలో విద్యార్థులు వసతిగృహాలతోపాటు అంతర్గత రోడ్లు, భవనాలు వంటి వసతులను మెరుగుపర్చాలని గతంలో యూనివర్సిటీని ముట్టడించి అధి కారులను నిలదీశారు. పలు విద్యార్థిసంఘాలు సైతం సమస్యలపై పోరాటాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు స్పందించి అక్కడ నూతనంగా బాలబాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించి ప్రభుత్వానికి సూచించగా రూ.18కోట్ల నిధుల కూడా మంజూరయ్యాయి. కొద్దిరోజుల నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ముగియగానే నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని అధికా రులు సిద్ధమయ్యారు. దీనికోసం విద్యార్థులతో వసతిగృహా ల తరలింపుపై సంప్రదింపులు జరిపారు. కొంతమంది విద్యార్థులు తరలింపునకు సుముఖత చూపకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే తుది నిర్ణయం ప్రస్తుతం హాస్టళ్లు నిర్మించడం సాధ్యపడదు కాబట్టి ఎన్నికలు ముగిశాక నిర్మాణాలు ప్రారంభించడానికి వీలవుతుందని యూనివర్సిటీ అ ధికారులు భావిస్తున్నారు. మెయిన్ క్యాంపస్‌లోని హాస్టళ్ల వి ద్యార్థులు కూడా ఫార్మసీ విద్యార్థుల రాకను వ్యతిరేకిస్తున్నా రు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవులు సోమవా రం ఫార్మసీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇందులో కొంతమంది ఫార్మసీ విద్యార్థులు తరలింపుపై పెదవి విరవడంతో తరలింపుపై తుది నిర్ణయం వి ద్యార్థులకే వదిలేసినట్లు సమాచారం. విద్యార్థి సంఘాల కన్నెర్ర ఫార్మసీ హాస్టళ్ల తరలింపుపై వివిధ విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే 40 ఎకరాలు ఉన్న ఎల్ఎండీలోని శాతవాహన ఫార్మసీ క్యాంపస్ లో ఐదెకరాలు ఉర్దూ యూనివర్సిటీకి, ఐదెకరాలు ఫిషరీస్ కళాశాలకు కేటాయించారని, ఇప్పుడు అక్కడ నుంచి తరలిస్తే మిగితా 30 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సి టీ అధికారులు తరలింపును నిలిపివేసి అక్కడే తాత్కాలిక వ సతిని ఏర్పాటు చేసి వసతిగృహాల భవనాలను పూర్తిచేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టళ్ల తరలింపు ఆపాలి:కరికె మహేష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు యూనివర్సిటీ అధికారులు ఫార్మసీ వసతిగృహాల తరలింపు నిర్ణయాన్ని ఆపాలి. ఇప్పటికే 40 ఎకరాలున్న యూనివర్సిటీ భూమి 10 ఎకరాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. తరలిస్తే ప్రభుత్వం మిగితా 30 ఎకరాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. తరలింపు ప్రక్రియ ఎక్కువశాతం ఫార్మసీ విద్యార్థులకు ఇష్టం లేదు. మెయిన్ క్యాంపస్ హాస్టళ్ల విద్యార్థులకు కూడా వారు ఇక్కడికి వస్తే వసతులు సరిపోయేలా లేవు. అధికారులు తరలింపు ప్రక్రియను విరమించుకోవ్చాట. -
వారికి కూడా ప్రత్యేకంగా హాస్టల్ వసతి!
కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్స్ ఉంటాయి. అయితే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) మరో ముందడుగు వేసింది. లింగ నిర్ధారణ కాని వారు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించింది. వారి హక్కులను గౌరవించింది. ఇలా ఎల్జీబీటీక్యూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ‘వ్యక్తుల ఆత్మగౌరవాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలి. హుందాగా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది. లింగ భేదం కారణంగా వివక్ష చూపరాదు, గౌరవప్రదంగా జీవించే హక్కు వారికి ఉంది’ అని సర్వోన్నత న్యాయస్థానం ‘స్వలింగ సంపర్కం’కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. వాటిని అక్షరాలా ఆచరించి చూపించింది టిస్. ఇలా ప్రారంభమైంది.. జెండర్ న్యూట్రల్స్‌కు క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, గత సెప్టెంబర్‌లో జరిగిన విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విద్యార్థి సంఘం ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. హాస్టల్ ఏర్పాటుపై విద్యార్థులు, పాలకవర్గం, బోధనా సిబ్బంది చర్చలు జరిపారు. వారి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. ఈ హాస్టల్ అవసరాన్ని అందరం గుర్తించామని, అందుకే వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని విద్యార్థి వ్యవహారాల డీన్ ఆశా బానో అన్నారు. నిర్ధారణకు కమిటీ హాస్టల్ ఏర్పాటు నిర్ణయం అనంతరం ఓ కమిటీ నియమించారు. హాస్టల్లో ఎవరికి ప్రవేశం కల్పించాలనే అంశంపై నిబంధనలు రూపొందించారు. అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్లో చేర్చుకోవడానికి అవకాశం లేని వారికి ఇందులో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఎల్జీబీటీక్యూ విద్యార్థులను మిగతా వారి నుంచి వేరు చేయాలనేది తమ ఉద్దేశం కాదని ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఈ హాస్టల్లో ఉండాలా.. వద్దా.. అనేది విద్యార్థుల ఇష్టమ న్నారు. ఇతరులు కూడా తమకు ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చ న్నారు. రూమ్‌కు ఇద్దరు ఉండేలా పది గదులను కేటాయిం చారు. ప్రస్తుతం 17 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఎవరైనా రావొచ్చు సాధారణంగా అమ్మాయిల హాస్టల్‌కు అబ్బాయిలను రానివ్వరు..అబ్బాయిల హాస్టల్లోకి అమ్మాయిలకు ప్రవేశం ఉండదు. అయితే ఈ హాస్టల్‌కు ఎవరైనా రావొచ్చు.. రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చు. ‘నన్ను క్వీర్గా గుర్తించారు. (విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు) ప్రస్తుతం అబ్బాయిల హాస్టల్లో ఉంటున్నా.. ఎలా ఉంటుందో చూద్దామని అప్పుడప్పుడూ జెండర్ న్యూట్రల్ హాస్టల్లో ఉంటున్నా. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం, నా బాధలను చెప్పుకు నేందుకు స్నేహితులు ఇక్కడ దొరికారు’అని మిథున్ అనే వ్యక్తి తెలిపారు. -
సూపర్ 50
అది 2002వ సంవత్సరం. బీహార్ రాష్ట్రంలో పాట్నలో ఆనంద్ కుమార్ అనే మధ్యతరగతి గణిత ఉపాధ్యాయుడు సూపర్ 30 ప్రోగ్రామ్‌కు నాంది పలికాడు. వారికి శిక్షణ ఇస్తూ ఎందరో ఐఐటీయన్లను తయారు చేశాడు. 2018వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అరుణాచలేశ్వర్ అనే కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు సూపర్ 50 ప్రోగ్రామ్‌ను తెరపైకి తెచ్చాడు. పేద విద్యార్థుల కలలను సాకారం చేస్తూ వీరు ఐఐటీకి ఉచిత తరగతులను నిర్వహిస్తున్నారు. బ్యాచ్‌కు 50 మంది మాత్రమే శిక్షణకు అర్హులు. అందుకే సూపర్ 50గా నామకరణం చేశారు. ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 29న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 30న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. శ్రీ మేథ్ అరుణాచల అకాడమీ వారి ఆధ్వర్యంలో బైపీసీ విద్యార్థులకు నీట్ తరగతులను, ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ(జేఈఈ) తరగతులను ఐదు నెలల పాటు ఉచితముగా నిర్వహిస్తామని అకాడమీ డైరెక్టర్ అరుణాచలేశ్వర్ పత్రికా పకటనలో తెలిపారు. ప్రతి పేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. అర్హత గల పేద విద్యార్థులకు ఉచిత వసతి కూడా కల్పించబడును. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ మేథ్ అరుణాచల అకాడమి. నేషనల్ కాలేజ్ వెనుక, నంద్యాల. మరింత సమాచారం కోసం 70130 00437, 95819 30435 నెంబర్లను సంప్రదించగలరు. -
మోడల్ స్కూళ్లు
కర్నూలు(విద్య): కేంద్రీయ విద్యాలయాల తరహాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఈ పాఠశాలలు మంజూరై నాలుగేళ్లయినా.. పనుల ప్రారంభానికే రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాకపోవడంతో హాస్టల్ వసతి ఎండమావిగా మారింది. జిల్లాలోని 51 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ.3.02కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండల కేంద్రాల్లో నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఒక్కో పాఠశాలను నాలుగు నుంచి ఐదు ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. డే స్కాలర్, రెసిడెన్సియల్ విధానంలో పాఠశాలలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఇద్దరేసి పీజీటీలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ఒక్కో పీజీటీలను నియమించారు. మొదటి యేడాది పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీజీటీలను నియమించారు. వీరితో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డెరైక్టర్, యోగా టీచర్, ఆర్ట్ టీచర్, ఎస్యూపీడబ్ల్యు టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, క్లర్ కమ్, అకౌంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను కేటాయించారు. వీటిని అప్పటి ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని కొందరు అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. జిల్లాకు మంజూరైన 51 పాఠశాలలకు స్థలసేకరణ సమస్యగా మారడంతో 36 పాఠశాలలకు మాత్రమే అధికారులు స్థలాన్ని చూపించగలిగారు. దీంతో వీటికి మొదటి విడతగా రూ.108.72కోట్లు మంజూరయ్యాయి. 2013లో 36 భవనాలు పూర్తి కావడంతో పాఠశాలలను హడావుడిగా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 6 నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించారు. ప్రతి తరగతికి 80 మంది చొప్పున అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఈ యేడాది భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం, హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో హాస్టళ్లను ప్రారంభించలేకపోయారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.