న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment