JNU Students
-
కామ్రేడ్.. రెడ్ సెల్యూట్
సాక్షి, న్యూఢిల్లీ: ‘జోహార్ కామ్రేడ్ ఏచూరి, వుయ్ సెల్యూట్, ఉద్యమాల రహదారి ఏచూరి, మీ మరణంతో మా గుండెలు ఆగాయి, రెడ్ సెల్యూట్ కామ్రే డ్, కామ్రేడ్ ఏచూరి మమ్మల్ని విడిచి వెళ్లావా, తూ ర్పున ఎర్రని సూర్యుడా.. మా సీతారాం ఏచూరి..’అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) దద్దరిల్లింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పారి్థవ దేహాన్ని శుక్రవారం సాయంత్రం విద్యార్థుల సందర్శనార్థం జేఏన్యూకి తరలించా రు. ఏచూరి భౌతిక కాయాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భావోద్వేగంతో నినాదాలు చేస్తూ ఘన నివాళులరి్పంచారు. అనంతరం 6 గంటల సమయంలో జోరువానలో జేఎన్‌యూ నుంచి వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర ప్రముఖులు నివాళులరి్పంచారు. భార్య సీమ ఛిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను ఓదార్చారు. బీజీపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి (ఎన్ఎస్యూఐ) కన్హయ్య కుమార్ తదితరులు ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం ఎయిమ్స్‌కు పారి్థవ దేహం శనివారం ఉదయం 8 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం, అనంతరం ఓ గంట పాటు విదేశాల నుంచి వచి్చన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులరి్పంచేందుకు వీలుగా అక్కడ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు. -
విద్యార్ధులపై విరిగిన లాఠీలు
-
ఛపాక్
జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు దీపికా పడుకోన్ ఆ యూనివర్శిటీని సందర్శించడం వివాదం అయింది. ఆ ప్రభావం ఆమె నటించిన ‘ఛపాక్’ చిత్రంపై పడటం కూడా మొదలైంది. ఈ నెల 10 న ఛపాక్ విడుదల అవుతుండగా.. సినిమా చూసేందుకు ముందుగా టిక్కెట్లు రిజర్వే చేయించుకున్నవారు ఆ టిక్కెట్లను తాము క్యాన్సిల్ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో వరుసపెట్టి పోస్టులు పెడుతున్నారు. ‘బాయ్‌కాట్ ఛపాక్’ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా వెలసింది. గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వెళ్లి విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనను అనేక రంగాలలో ప్రముఖులు ఖండిస్తూ బాధితుల వైపు నిలబడుతున్నారు. దీపిక కూడా తన సంఘీభావాన్ని తెలిపేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే అది నచ్చని వారు తమ అసహనాన్ని ఆమె సినిమాపై చూపిస్తున్నారని దీపికను సమర్థిస్తున్న వారు అంటున్నారు. స్టార్టప్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు ఓ అలవాటు ఉంది. ఎక్కడైనా ఓ మంచి విషయం కనిపిస్తే అభినందించి గానీ అడుగు ముందుకేయరు. చండీగఢ్‌కు చెందిన హర్బజన్ కౌర్ అనే 94 ఏళ్ల మహిళ ఈ వయసులో కూడా తన కాళ్ల మీద తను నిలబడడం కోసం.. తయారీలో తనకెంతో ప్రావీణ్యం ఉన్న.. ‘బేసన్ కి బర్ఫీ’ స్వీట్‌ను ఇంట్లోనే పెద్ద మొత్తంలో చేసి మార్కెట్‌కి సరఫరా చేస్తున్న విషయాన్ని ట్విట్టర్లో తెలుసుకున్న మహీంద్రా ముగ్ధులైపోయి.. ‘మై ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అని ప్రశంసలు కురిపించారు. ‘స్టార్టప్‌ల గురించి మాట్లాడేటప్పుడు మనకు యంగ్ జనరేషన్, సిలికాన్ వ్యాలీ, బెంగళూరు సాఫ్ట్వేర్.. ఇవన్నీ స్ఫురిస్తాయి. కౌర్ ఈ ఆలోచనను మార్చివేశారు. బిజినెస్ ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు’’ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. -
హంతకదాడులు
విద్యాబోధనలో, పరిశోధనల్లో ప్రపంచ ఖ్యాతి పొంది, దేశంలోని ఉన్నతశ్రేణి విద్యాసంస్థల జాబితాలో మూడో ర్యాంకుతోవున్న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఆదివారం నెత్తురోడింది. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లు, కర్రలు పట్టుకుని చీకటిచాటున దాదాపు రెండున్నర గంటలపాటు విశ్వవిద్యాలయం ఆవరణలో స్వైర విహారం చేసిన తీరు చూసి దేశం మొత్తం విస్తుపోయింది. వారి చేతుల్లో యాసిడ్ బాటిళ్లు కూడా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారంటే ఆ గూండాలు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఆఖరికి ఆడపిల్లల హాస్టల్లో సైతం వారి దౌర్జన్యం యధేచ్ఛగా కొనసాగింది. విద్యార్థినులు నిరాయు ధంగావున్నా, దుండగుల చేతుల్లో గాయాలపాలవుతున్నా అందరూ ఏకమై బిగ్గరగా అరుస్తూ ప్రతి ఘటించడానికి చేసిన ప్రయత్నాలు, వారిలో కొందరు వీడియో తీసిన తీరు ఆ పిల్లల మనోస్థైర్యానికి అద్దం పడతాయి. ఏడేళ్లక్రితం ఇదే ఢిల్లీలో నడుస్తున్న బస్సులో కొందరు దుండగులు నిర్భయపై పాశవికంగా దాడి చేసి, చెప్పనలవికాని హింసకు పాల్పడి, చివరకు ఆమె ప్రాణాలు తీశారు. ఆ సమయంలో ఆమె ఫలానా విధంగా చేసివుండాల్సిందని చెప్పినవారు మొదలుకొని ఆడపిల్ల రాత్రివేళ మరో వ్యక్తితో కలిసి ఎందుకెళ్లిందని ప్రశ్నించినవారి వరకూ అనేకులున్నారు. కానీ శాంతిభద్రతల యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నచోట ఉన్నతశ్రేణి విద్యాసంస్థలోని ఆడపిల్లల హాస్టల్ సైతం గూండాల దౌర్జన్యానికి నిస్సహాయంగా తలవంచాల్సిందేనని ఆదివారంనాటి ఉదంతం రుజువు చేసింది. దాడి సమయంలో ఎంతమంది విద్యార్థినులు పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసివుంటారో ఊహకందని విషయ మేమీ కాదు. నిజానికి ఆ దుండగుల జాడను గుర్తించాక చాలా ముందే పోలీసు అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశానని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ చెబుతున్నారు. ఫలానా పోలీస్ అధికారి తన వద్ద చదువుకుని వెళ్లాడని, అందువల్ల అతనికి సమాచారం అందించానని మరో అధ్యాపకుడు వెల్లడించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపత్కాలంలో ఆదుకున్నవారు లేరు. విశ్వవిద్యాలయం పాలకవర్గం నుంచి అనుమతి లేనందువల్ల వెంటనే రాలేకపోయామని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ సమర్థనీయం కాదు. విపత్కర పరిస్థితులున్నాయని చానెళ్లన్నీ చెబుతున్నా మౌనంగావుండటం దిగ్భ్రాంతికరం. ఆ దాడుల్లో ఎవరి ప్రాణాలైనా పోయివుంటే జవాబుదారీ ఎవరు? దేశ రాజధాని నగరంలోని ప్రఖ్యాత యూనివర్సిటీయే ఈ దుస్థితిలోవుంటే ప్రపంచ దేశాల దృష్టిలో మన ప్రతిష్ట మసకబారదా? దుండగులు తనను గుర్తించి మరీ తల బద్దలు కొట్టారని, చేయి విరగ్గొట్టారని అయిషీ ఘోష్ అంటున్నారు. విద్యార్థినీవిద్యార్థులు మాత్రమే కాదు...అధ్యాపకులు సైతం దుండగుల దౌర్జన్యాన్ని చవిచూడటం ఊహకందనిది. భిన్న విశ్వాసాలున్నవారు అక్కడ చదువుకుంటున్నా, ఆ విశ్వాసాల మధ్య నిత్యం ఘర్షణాత్మక వాతావరణం ఉంటున్నా అర్ధ శతాబ్ది దాటిన ఆ విశ్వవిద్యాలయం చరిత్రలో ఇంతవరకూ అధ్యాపకులపై భౌతికదాడి చేసిన ఉదంతం ఎప్పుడూ లేదు. తమపై దాడి చేసింది ఏబీవీపీకి చెందినవారేనని గాయపడినవారు చెబుతుంటే, తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఖండిస్తోంది. పైగా అయిషీ ఘోష్ దుండగులతో కలిసి లోనికి వస్తున్న దృశ్యమని చెబుతూ విశ్వవిద్యాలయం, పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. అందులో కనిపిస్తున్నామె వారు ఆరోపిస్తున్నట్టు నిజంగా అయిషీ ఘోష్ అయితే ఆమెతోసహా వామపక్ష విద్యార్థులంతా ఆ దుండగులకు ఎందుకు లక్ష్యంగా మారతారన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోపక్క కొన్ని చానెళ్లు వీడియోల ఆధారంగా దుండగులకు ఏబీవీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నాయి. అంతే కాదు... ఒకపక్క ఈ దాడి సమాచారం అందుకుని మెయిన్ గేట్ వద్దకొచ్చిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి, స్వరాజ్ అభియాన్ పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్‌ను కిందకు తోసి దౌర్జన్యం చేసినవారు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పని చేశారన్నది కూడా తేలవలసివుంది. అసలు దౌర్జన్యం కొనసాగినంతసేపూ వీధి దీపాలు స్విచాఫ్ చేసిందెవరో కూడా తేలాలి. ఆ దీపాల వెలుతురుంటే దుండగులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రావడం, పోవడం అంత సులభమయ్యేది కాదు. రెండురోజులుగా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలున్నా, విద్యార్థి సంఘాల మధ్య అడపా దడపా ఘర్షణలు చోటు చేసుకున్నా విశ్వవిద్యాలయం బాధ్యులు తమకు సంబంధం లేనట్టు చోద్యం చూశారు. వాస్తవానికి గత రెండున్నర నెలలుగా విశ్వవిద్యాలయం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఫీజులు, మెస్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వవిద్యాయలం వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌కూ, పాలకవర్గానికీ దీన్నిమించి పరిష్కరించ వలసిన సమస్య ఏం ఉంటుంది? ఇంతకు ముందు మాటెలావున్నా విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద ఘటన చోటుచేసుకున్న తర్వాతకూడా ఆయనగానీ, రెక్టార్గానీ, మరొకరుగానీ పత్తా లేకుండా పోవడంలోని ఆంతర్యమేమిటి? దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోకాక, దీన్ని విభిన్నంగా తీర్చి దిద్దాలని దీన్ని స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించినవారు భావించారు. దానికి తగినట్టే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన మెరికల్లాంటివారెందరో ఇక్కడ ఉన్నత చదువులు చదువుకుని భిన్న రంగాలకు వన్నె తెస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నా అవి హంతకదాడుల వరకూ వెళ్లకపోవడం, ఇక్కడివారు చదువుల్లో ఎప్పుడూ మేటిగా ఉండటం ఈ విశ్వవిద్యాలయం విశిష్టత. ఈ ఉన్నత సంప్రదాయం చెదిరిపోనీయకూడదు. ఆదివారంనాటి ఉదంతం ఒక కొత్త సంప్రదాయంగా మారకుండా, చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగ లాలి. అది సాధ్యం కావాలంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి, దుండగులు ఏ పార్టీకి, సంస్థకు చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి. ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్టను నిలబెట్టాలి. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జ్
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు. -
ఆ రూట్లో మెట్రో స్టేషన్ల మూసివేత..
సాక్షి, న్యూఢిల్లీ : హాస్టల్ ఫీజుల పెంపుదలను పూర్తిగా వెనక్కితీసుకోవాలని కోరుతూ జేఎన్‌యూ విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. జేఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల సూచనతో ఢిల్లీ మెట్రో ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ స్టేషన్లో మెట్రో రైళ్లు ఆగవని ఢిల్లీ మెట్రో తెలిపింది. ఢిల్లీ పోలీసుల సూచనల మేరకు ఆయా మెట్రో స్టేషన్లలో మెట్రో ట్రైన్లు ఆగవని వాటి వద్ద ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. మరోవైపు ఆందోళన బాట పట్టిన విద్యార్ధులు, జేఎన్‌యూ అధికార యంత్రాంగం మధ్య సయోధ్య సాధించేందుకు మాజీ యూజీసీ చీఫ్ డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించింది. -
కేంద్ర మంత్రిని నిర్బంధించిన విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. హాస్టల్ ఫీజులు పెంచడం, నిబంధనలు కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జేఎన్‌యూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ స్నాతకోత్సవానికి కేంద్ర మానవవరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ హాజరవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ గేట్‌ను నిర్బంధించి.. కేంద్ర మంత్రి రమేశ్‌ను యూనివర్సిటీ ప్రాంగణ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు మంత్రిని బయటకు వెళ్లనివ్వమని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థులు జేఎన్‌యూ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో స్నాతకోత్సవ ప్రాంగణంలోనే మంత్రిని నిర్బంధించినట్టు అయింది. హాస్టల్ మ్యానువల్ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోందని, దీనిని మార్చాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉమర్ ఖలీద్‌పై కాల్పులు..!
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై సోమవారం దేశ రాజధానిలో కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ ఉండే సెంట్రల్ ఢిల్లీలో సోమవారం పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల నుంచి ఉమర్ ఖలీద్ సురక్షితంగా తప్పించుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్యంగా ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులతో అప్రమత్తమైన ఖలీద్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ‘ఓ కార్యక్రమం కోసం మేం వచ్చాం. మాతోపాటు ఉమర్ ఖలీద్ కూడా ఉన్నారు. మేం టీ స్టాల్ వద్ద ఉన్న సమయంలో తెల్లచొక్కా ధరించిన వ్యక్తి మా వద్దకు వచ్చాడు. మమల్ని తోసేస్తూ ఖలీద్ లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ గందరగోళంలో అదుపుతప్పి కిందపడిపోయిన ఖలీద్.. బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు. మేం కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ అతడు గాలిలో కాల్పులు జరుపుతూ పారిపోయాడు. ఈ క్రమంలో అతని చేతిలోంచి పిస్టోల్ జారిపడిపోయింది. అతను పారిపోయాడు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు. Delhi: An unidentified man opened fire at JNU student Umar Khalid outside Constitution Club of India. He is unhurt. More details awaited. pic.twitter.com/ubNh4g4D80 — ANI (@ANI) 13 August 2018 -
నా దుస్తులు చింపాలని ఆదేశించారు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులు మార్చి 23న చేపట్టిన ర్యాలీలో ఢిల్లీ పోలీసులు విద్యార్థినులతో వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 8 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెల్సిందే. ర్యాలీలో పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జేఎన్‌యూ సోషియాలజీ విభాగానికి చెందిన షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆందోళన చేస్తున్న తన దుస్తుల్ని చించేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించిందన్నారు. దీంతో వెంటనే కొందరు తనపై పిడిగుద్దులు కురిపించారని, లోదుస్తుల్ని లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తమపై వాటర్ కేనన్లను ప్రయోగించారన్నారు. -
జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్న అతుల్ జోహ్రి అనే అధ్యాపకుడిని పోలీసులు రక్షిస్తున్నారంటూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. జోహ్రి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎనిమిది మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల అనంతరం కూడా పోలీసులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారనీ, కనీసం ఆయనను విచారించలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థినుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని 54 మంది అధ్యాపకులు కూడా పోలీసులను డిమాండ్ చేశారు. -
నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు
పట్నాలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఉపన్యాస కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. కన్హయ్య ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి లేచి నల్లజెండాతో నిరసన తెలిపాడు. దీంతో కన్హయ్య మద్దతుదారులు అతనిపై విరుచుకుపడ్డారు. అతని చొక్కా చింపేసి.. చితకబాదారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసన తెలిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 'దేశద్రోహం' ఆరోపణలతో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన కన్హయ్యకుమార్ రెండురోజుల పర్యటన కోసం స్వరాష్ట్రం బిహార్ వచ్చిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిశారు. ఆదివారం పట్నాలో 'ఆజాదీ' (స్వేచ్ఛ) అంశంపై ఆయన ఉపన్యాసించారు. WATCH: Kanhaiya Kumar's supporters beat up man after he showed black flag to Kanhaiya during his speech in Patnahttps://t.co/2nrmG3pMHK — ANI (@ANI_news) May 1, 2016 -
అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
ఢిల్లీలో విద్యార్థి సంఘాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరెస్టు చేసిన 25 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ప్రొఫెసర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. వర్శిటీలోకి పోలీసులు ప్రవేశించడం అమానుషమన్నారు. హెచ్‌సీయూ వ్యవహారంలో సీఎం కేసీఆర్ మౌనం వీడాలన్నారు. ఎస్ఎఫ్ఐ జేఎన్‌యూ విద్యార్థి నేత సృజన మాట్లాడుతూ హెచ్‌సీయూలో విద్యార్థులకు ఆహారం, నీళ్లు, విద్యుత్తు నిలిపివేయడం అమానుషమన్నారు. రోహిత్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హెచ్‌సీయూ వీసీ రాజీనారామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ, బిర్సా అంబేడ్కర్ పూలే విద్యార్థి సమాఖ్య, జేఎన్‌యూ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
పోరుకు సిద్ధమంటున్న ఉమర్ సోదరి
న్యూఢిల్లీ: గిలానీ, నక్సల్స్లతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని రాజద్రోహంలో కేసులో నిందితుడైన జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ సోదరి 11 ఏళ్ల సారా ఫాతిమా తెలిపింది. బెయిల్‌పై విడుదలైన తన సోదరుడు ఉమర్, అనిర్బన్లకు శనివారం జేఎన్ యూ వర్సిటీలో మిగతా విద్యార్థులతో కలిసి ఆమె స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సారా ఫాతిమా మాట్లాడుతూ తన సోదరుడు విడుదల కావటం శుభపరిణామం అంటూ, అన్యాయంపై పోరాడతాం... ‘లాల్ సలామ్’, ‘ఆజాదీ‘ అంటూ నినాదాలు చేసింది. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీ కి కూడా ఢిల్లీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. -
ఉమర్, అనిర్బన్ విడుదల
జేఎన్‌యూ విద్యార్థులకు 6 నెలల బెయిల్ ♦ ఢిల్లీ విడిచి వెళ్లరాదని షరతు న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని 12 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. తమ అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్లరాదని, కేసు దర్యాప్తు అధికారి పిలిచినప్పుడల్లా హాజరుకావాలని షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఉమర్, అనిర్బన్లకు జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యాపకులు సంగీతాదాస్ గుప్తా, రజత్ దత్తాలు ష్యూరిటీలు సమర్పించారు. ‘నిందితులపై మోపిన అభియోగాలు తీవ్రమైనవే. వారు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ పరిశీలనలో ఉంది. నిందితులు పారిపోయే అవకాశం ఉందనేందుకు పోలీసులు ఎటువంటి కారణాలు చూపలేదు. ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి విభాగం నేత కన్హయ్య కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిందితులకు 6 నెలలు బెయిల్ మంజూరు చేయడం సరైనదేనని భావిస్తున్నా’ అని జడ్జి రీతేష్‌సింగ్ పేర్కొన్నారు. అంతకుముందు .. నిందితులకు బెయిల్ మంజూరును పోలీసులు వ్యతిరేకించారు. పోలీసుల వాదనలతో కోర్టు విభేదించింది. అయితే ఒకవేళ ఈ కేసులో వారు దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు సహా 3 రకాల శిక్షలు విధించే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఇద్దరు విద్యార్థులకు బెయిలు రావడంతో జేఎన్‌యూ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.‘ఆజాదీ’(స్వాతంత్య్రం) కావాలంటూ నినాదాలు చేశారు. కాగా దేశం గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి బెయిలుపై వచ్చినందుకు ఎలా వేడుకలు చేసుకుంటారని, అతడు ఒలింపిక్ పతకం ఏమైనా తీసుకొచ్చాడా అని కన్హయ్యను ఉద్దేశించి నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన చిత్రం ‘బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్’ ముందస్తుగా శుక్రవారం వర్సిటీలో ప్రదర్శించగా లెఫ్ట్ విద్యార్థులు నిరసన తెలిపారు. నామమాత్రపు జవాబు.. ఫిబ్రవరి 9నాటి ఘటనపై షోకాజ్ నోటీసులు అందుకున్న విద్యార్థులు వరిసటీ క్రమశిక్షణ కమిటీకి నామమాత్రపు జవాబులు పంపించారు. నేరమేమిటో తెలియకుండా సంజాయిషీ ఏమని ఇస్తామని వారు పేర్నొన్నారు. -
స్మృతి లాంటి తల్లి అవసరం లేదు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులు స్మృతి పిల్లలు కాదన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలని, ఆమె లాంటి తల్లి అవసరంలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అనంత్ ప్రకాశ్ నారాయణ్ విమర్శించాడు. గురువారం లోక్‌సభలో స్మృతి చేసిన ప్రసంగంపై అనంత్ మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా రాజకీయ అంశం. మేం ఆమెకు రాజకీయ ప్రత్యర్థులం' అని అన్నాడు. స్మృతి పార్లమెంట్‌ను తప్పుదోవపట్టించారని విమర్శించాడు. ఈ నెల 9 ఘటనకు సంబంధించి అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. -
జ్ఞానదీపాలను ఆర్పకండి!
‘జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీ) ప్రాంగణం అన్ని రకాల రాజకీయ అభిప్రాయాల వ్యక్తీకరణకీ అవకాశం కల్పించే వేదిక. న్యాయ సమ్మతమైన భిన్నాభిప్రాయాలకు కేంద్ర బిందువు. జాతీయత/ జాతీయవాదం గురించి పాలకవర్గాల అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాలు ఇత రులకు ఉన్నంత మాత్రాన అది దేశద్రోహ నేరంగా పరిగణించడానికి వీలులేదు. బహుశా కొంతమంది దృష్టిలో - భిన్నాభిప్రాయానికీ, రాజద్రోహ నేరానికీ మధ్య భేదం స్వల్పాతిస్వల్పంగా కనిపించవచ్చు. కానీ ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అనేది ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అనేది మరచిపోరాదు. ఈ సందర్భంగా సీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్కుమార్ను రాజకీయంగా, సిద్ధాంత రీత్యా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ విధానాలకు వ్యతిరేకం అయినందున దేశద్రోహ నేరాన్ని ఆపాదించడం సమర్థనీయం కాదు. వలస పాలనలో అవతరించిన భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్ దుర్వినియోగమైన చరిత్ర తీరును గమనిస్తే అది ఆధునిక రాజ్యాంగ లక్ష్యాలకు పొసగదని గ్రహించాలి. ఆ సెక్షన్‌ను మొత్తంగానే తొలగించాలి.’ - ది హిందూ (15-2-2016) తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంటారు. అలాంటి ప్రవర్తనకే బీజేపీ పాలకవర్గాలు అలవాటు పడుతుండడం విచారకరం. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది మాసాలకే ఆ పార్టీ అగ్రనేత, మాజీ హోంమంత్రి లాల్ కిషన్ అద్వానీ రాబోయే పరిణామాల గురించి దేశాన్నీ, పాలకులనూ హెచ్చరించారు. ‘మరోసారి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే దిశగా పాలనా వ్యవహారాలు సాగుతున్నా’యని ఆయన చెప్పడం గమనార్హం. తాజాగా జరుగుతున్న ప్రభుత్వ నిర్ణయాలు, విద్యాసంస్థలలో, చరిత్ర పరిశోధన, అధ్యయన కేంద్రాలలో, విశ్వవిద్యాలయాలలో, పాఠ్య ప్రణాళికలలో ప్రవేశపెడుతున్న మార్పులే ఆ ప్రకటన ఆంతర్యం కొంతైనా అర్థమయ్యేటట్టు చేస్తున్నాయి. విద్వత్ సంబంధమైన గోష్టులలోనే కాదు, ఏకత్వంలో భిన్నత్వ భావనను సహించలేని ధోరణి కూడా వ్యక్తమవుతోంది. భిన్నాభిప్రాయానికీ, రాజ్యాంగం గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛకూ సంకెళ్లు తొడిగే ప్రయత్నం జేఎన్‌యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఘటనల ద్వారా అనుభవంలోకి వస్తోంది. ఈ రెండు పరిణామాలను బట్టి ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో తలెత్తిన అలజడికి కారణాలను అన్వేషించకుండా, పాలక వర్గాలు విద్వల్లోకాన్ని కల్లోల పరిచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. గతంలోకి వెళితే... ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని లోకమాన్య తిలక్, గాంధీజీ, మదన్మోహన్ మాలవీయ వంటి స్వాతంత్య్రోద్యమ నేతల సంప్రదాయంలో ఎదిగిన జాతీయత, జాతీయవాదం వేరు. నేడు మనం వింటున్న వాదం వేరు. నాడు విద్యా కేంద్రాలన్నీ విద్యార్థి ఉద్యమాలకూ, స్వాత ంత్య్ర పిపాస రగుల్కొల్పడానికి జాతీయ నాయకుల స్థాయిలోనే కాకుండా, విద్యార్థి స్థాయిలో కూడా ఉద్యమించడం జరిగింది. ఆనాటి చర్చలు, విరుద్ధ భావాల సంఘర్షణ, మితవాద, అతివాద భావాల సంఘర్షణ విద్యా సంస్థలకే కాకుండా అన్ని స్థాయిలలోనూ స్వేచ్ఛగా సాగిన వాతావరణం, పాత తరాలన్నింటికీ గుర్తున్న సన్నివేశాలేనని కలలో కూడా మరచిపోరాదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోనూ, జేఎన్‌యూలోనూ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ సంస్థల మధ్య సిద్ధాంతపరమైన సంఘర్షణలకు ఉప్పందించినవి జాతీయోద్యమ సంప్రదాయాలే. ఆ భావ సంఘర్షణ వెలుగులు ప్రసరించకుండా విద్యాలయాలకే కాదు; రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకీ ప్రగతీ లేదు. ఇది పాలకులు గుర్తించాలి. ఇప్పుడు రాజకీయ స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ త్యాగాలతో, రక్తతర్పణలతో సాధించిన స్వాతంత్య్ర ప్రకటనను నిరంతరం జాగరూకతతో కాపాడుకోవాలి. నిత్యం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాన్ని చూడడంలో పలాయనం చిత్తగించినంతవరకు, దేశ సంపద మీద కొద్దిమంది గుత్తాధిపత్యానికి చరమగీతం పాడి, రాజ్యాంగం ఇచ్చిన సప్త స్వాతంత్య్రాల పరిరక్షణ కోసం సంఘర్షించక తప్పదు. ఒక్క విద్యాకేంద్రాలలోనే కాదు, అన్ని స్థాయిలలోనూ చర్చలు, ఆందోళనలు, దగాపడిన వారి నిరసనలు, బడుగు బలహీన వర్గాల, కార్మిక కర్షక మహిళాశక్తులలో అసంతృప్తి జ్వాలలు అనివార్యం. నిజానికి నిరసనలూ, అలజడులూ పరిస్థితుల ప్రభావంతో పుట్టుకొస్తాయి గానీ, రెచ్చగొట్టడం ద్వారా వచ్చేవి కావు. ఇది ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలలో నిరూపణైంది. సంఘర్షణ అనివార్యం సమకాలీన రాజకీయ, భావ సంఘర్షణలకు మన దేశంలోనే కాదు; ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు కేంద్ర బిందువులయ్యాయి. ఇందుకు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లుముంబా, బీజింగ్, నాన్తెరే వంటి విశ్వ విఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా మినహాయింపు కావు. 1980లలో ఫ్రెంచ్ పాలకులు ఇంటాబయటా చేపట్టిన పోలీస్ చర్యలకు నిరసనగా, నాటి అధ్యక్షుడు చార్లెస్ డీగోల్కు వ్యతిరేకంగా నాన్తెరే విశ్వవిద్యాలయ విద్యార్థులు మహోద్యమం నడిపారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలం నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి వెన్నెముకగా నిలిచినది విద్యార్థి, యువతేనని మరచిపోరాదు. భారత రైతాంగ పోరాటాలు, సత్యాగ్రహాలకు గాంధీజీ, పటేల్ అండగా నిలిచారు. వీరి స్ఫూర్తి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన ఇవాళ్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేతలు చేస్తున్నదేమిటి? ప్రజల సాగుభూములను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు వ్యాపార ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడానికి తహతహలాడుతున్నారు. ఆ క్రమంలో పంట భూములను చట్టాలు, ఆర్డినెన్స్‌ల ద్వారా బలవంతంగా ‘స్వాధీనం లేదా సమీకరణ’ మంత్రాలతో రైతాంగాన్ని మభ్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించిన, వేషధారణలో కూడా బ్రిటిష్ కాలం నాటి పోలీసులనే అనుకరించిన వారు జాతీయవాదులేనా? జాతీయవాదులు, సెక్యులరిస్టులు, హేతువాదులైన ప్రసిద్ధ ఆచార్యులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నవారిని ఏమనాలి? హిందువు ముద్ర లేని అన్య మతస్తులను పౌరహక్కులకు అనర్హులనుచే యాలని చూస్తున్నవారు ధర్మశాస్త్రాలను వల్లె వేయడానికి అర్హులు కాగలరా? నన్ను ముట్టుకోకు అనే వేర్పాటు ధోరణికి మూలం స్వప్రయోజనాలు. ఈ ధోరణికి తెలుపు, నలుపు వర్ణాలతో గానీ, హిందూ ముస్లిం విభజనతో గానీ అసలు మతంతోగానీ సంబంధం లేదు. ‘అణచివేత లేదా నిర్బంధ విధానం సమాజంలో ఆగ్రహజ్వాలలనూ, తిరుగుబాట్లనూ రెచ్చగొడతాయన్న లోకమాన్యుడి బోధనలను మన పాలకులు ఎక్కడ పాతారు? తిలక్ మీద మోపిన దేశద్రోహ నేర విచారణలో ఆయన తరఫున విచారించిన న్యాయవాదుల బృందానికి నాయకుడు మహ్మదాలీ జిన్నా అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే మనలో ప్రకంపనలు ఎలా ఉంటాయి? నిర్బంధం, దాని ఫలితాల గురించి నాడు తిలక్ రాసిన వ్యాసాల కారణంగానే దేశద్రోహ అభియోగానికి ఆయన గురైనారు. అప్పుడు ఆయన అన్న మాటలేమిటి? ‘ప్రభుత్వ యావత్తు దేశాన్నీ జైలు కింద మార్చే పక్షంలో మనమంతా ఖైదీలమే. వీరంతా జైలుకు వెళ్లడం అంటే- ఓ పెద్ద సెల్ నుంచి చిన్న సెల్‌కు బదలీ కావడమనే అర్థం’ అని తిలక్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేగాదు, నాడు నిద్రాణమై ఉన్న భారత జాతిని చైతన్యవంతం చేయడానికి గణపతి, శివాజీ ఉత్సవాలను ప్రారంభిస్తే తరువాతి కాలాలలో వాటిని మతోద్రిక్తతలను రెచ్చగొట్టడానికి కొందరు వినియోగిస్తారని గుర్తించలేకపోయానని కూడా ఆయన ఒక సభలో బాధ పడిన సంగతిని ప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్‌చంద్ర నమోదు చేశారు. ఇంకా బ్రిటిష్ చట్టాలేనా? హింసకు పురిగొల్పే ప్రసంగాలు చేస్తే తప్ప, కేవల విమర్శకూ, ప్రసంగానికీ పరిమితమైన ఉపన్యాసాలకు దేశద్రోహ నేరం వర్తించదని భారత న్యాయస్థానాలు పలుసార్లు తీర్పులు ఇచ్చాయని మరచిపోరాదు. స్వతంత్ర భారతదేశంలో సొంత రాజ్యాంగ వ్యవస్థ, స్వపరిపాలన, న్యాయ వ్యవస్థ ఏర్పడి; మనదీ ప్రజాస్వామ్యమేనని చాటుకుంటున్నాం. అయినప్పటికీ ఈ ఆధునిక ప్రజాస్వామ్య చట్రంలో కూడా ప్రజలు నోరెత్తకుండా చేయడం కోసం బ్రిటిష్‌వాడు ప్రవేశపెట్టిన చట్టాలనే మన పాలకులు కూడా ఔదల దాల్చారు. అభ్యుదయకర భావనా స్రవంతిని అడ్డుకొని మనసులను మరుభూములుగా మార్చేయడమే యాంటీ రాడికలైజేషన్ పథకం లక్ష్యం. దాని ప్రతిరూపమే జాతి వ్యతిరేక కార్యకలాపాల ముద్ర. నిజమైన ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజద్రోహ/దేశద్రోహ నేరారోపణలకు తావులేదు. ఉండరాదు. భావ సంఘర్షణనూ, విభేదించే ప్రయత్నాన్నీ క్రిమినల్ నేరంగా పరిగణించి మేధావుల, ప్రజల నోళ్లకు ప్లాస్టర్ అంటించే విధానం ఒక చేదు అనుభవంగానే మిగులుతుంది. దీనిని గుర్తించి సకాలంలో జ్ఞానోదయం పొందాలి. తలపండిన కొందరు నాయకుల మాదిరిగానే విద్యార్థి యువతలోనూ వెనుక చూపు ఉన్న వారు, సంకుచిత దృష్టి ఉన్న వారు ఉంటారు. విశాలమైన చింతనాపరులు ఉంటారు. అభ్యుదయ కాముకులు ఉంటారు. ఈ లక్షణాలన్నింటినీ సమన్వయ పూర్వకంగా దర్శించగలిగిన శ్రీశ్రీ అన్నాడు- కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు పేర్లకీ పకీర్లకీ పుకార్లకీ నిబద్ధులు... abkprasad2006@yahoo.co.in -
యూపీఎస్సీ సిలబస్‌పై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ నుంచి ఇంగ్లిష్‌ను తప్పించాలని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ను తొలగించాలని, లేకపోతే ఇతర విదేశీ లాంగ్వేజ్‌లను చేర్చాలని కోరారు. జేఎన్‌యూ ఉపాధ్యాయులు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల యూనియన్ యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రపంచీకరణ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, అధికారులు యూపీఎస్సీ సిలబస్‌లో విదేశీ లాంగ్వేజీలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం విదేశీ లాంగ్వేజీని చదువుతున్న అనేక మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని జేఎన్యూఎస్ యూ అధ్యక్షుడు అక్బర్ ఆందోళన వ్యక్తం చేశారు.