ఢిల్లీలో విద్యార్థి సంఘాల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరెస్టు చేసిన 25 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ప్రొఫెసర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.
వర్శిటీలోకి పోలీసులు ప్రవేశించడం అమానుషమన్నారు. హెచ్‌సీయూ వ్యవహారంలో సీఎం కేసీఆర్ మౌనం వీడాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జేఎన్‌యూ విద్యార్థి నేత సృజన మాట్లాడుతూ హెచ్‌సీయూలో విద్యార్థులకు ఆహారం, నీళ్లు, విద్యుత్తు నిలిపివేయడం అమానుషమన్నారు. రోహిత్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హెచ్‌సీయూ వీసీ రాజీనారామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ, బిర్సా అంబేడ్కర్ పూలే విద్యార్థి సమాఖ్య, జేఎన్‌యూ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
Published Sun, Mar 27 2016 4:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement