
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. మెడికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ రిషీభరద్వాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూలో ఆయన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.