రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది | Temujin Filed Police Complaint Against His Wife For Mental Harassment | Sakshi
Sakshi News home page

రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది

Published Mon, May 20 2024 6:57 AM | Last Updated on Mon, May 20 2024 1:22 PM

Police Complaint Against Wife for Mental Harassment

సుల్తాన్‌బజార్‌:  తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పోలీసులకు కోరారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు టెమూజియన్‌  తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. తనకు లక్ష్మీ గౌతమితో వివాహం అయినప్పటి నుండి ఆమె మానసికంగా శారీరకంగా హింసిస్తుందని ఆయన తెలిపారు.  ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నారు. 

ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమాలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. నగరంలోని మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నట్లు వివరించారు. తమకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పెళ్లి అయినప్పటి నుండి అకారణంగా  హింసిస్తోందని వాపోయాడు.

 పలు మార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారలేదన్నారు. ఇటీవల  చంపేందుకు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై స్థానిక అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నంచారు.  ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement