wife harassment
-
పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట రోడ్డులోని సిలువెపుర గ్రామంలో చోటుచేసుకుంది. బాలరాజ్ (41) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. బాలరాజ్ 18 ఏళ్ల క్రితం కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆనాటి నుండి ఆమె భర్తను వేధింపులకు గురిచేసేదని, ఇటీవల ఆమె పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి మనస్తాపంతో బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వివరాలు డెత్‌నోట్ రాసిన బాలరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోలదేనమళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి: ‘డబ్బు కోసమే వేధించి ఉంటే.. అలా ఎందుకు చేస్తా!’: అతుల్ భార్య నిఖిత స్టేట్మెంట్ -
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య
గుంతకల్లు: భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... పాత గుంతకల్లుకు చెందిన వడ్డె రోహిత్‌కుమార్ (24) బజాజ్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి భర్తను సూటిపోటి మాటలతో లక్ష్మీదేవి మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో లక్ష్మీదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే తాను పెట్టిన కండీషన్లు ఒప్పుకుంటే కాపురానికి వస్తానని ఆ సమయంలో ఆమె చెబుతూ వచ్చింది. విషయం తెలుసుకున్న రోహిత్‌కుమార్ తల్లిదండ్రులు కోడలి కండీషన్ల మేరకు ఆమె పేరుతో కొంత, బాబు పేరుతో మరికొంత స్థలం రాసిచ్చిన తర్వాత కాపురానికి వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బాబు చనిపోయాడు. ఆ తర్వాత భర్తను వదిలి లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య వేధిస్తున్న విషయంపై ఆరు రోజుల క్రితం గుంతకల్లు రెండో పట్టణ పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ గణేష్ ఇరువురి వాదనలు విన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో తామే పంచాయితీ చేసుకుంటామని బాధితులు తెలపడంతో వారిని అక్కడి నుంచి పంపించేశారు. సమస్య మరింత జఠిలం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రోహిత్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనలక్ష్మీదేవిపై చర్య తీసుకోవడంతో పాటు సీఐ గణేష్ అక్కడకు వచ్చి సమాధానం చెప్పాలంటూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై రోహిత్ బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవి పెట్టిన కండీషన్ల మేరకు 20 సెంట్ల స్థలాన్ని బాబుతో పాటు ఆమె పేరుతో రాసిచ్చినట్లు తెలిపారు. బాబు చనిపోయినప్పుడు లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిందన్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందని, బాబు చనిపోయిన రాత్రే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు. అప్పటి నుంచి భర్తకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తూ వచ్చిందన్నారు. న్యాయం చేయాలని సీఐ గణేష్‌ను ఆశ్రయిస్తే ఆయన సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు రోహిత్‌ను దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టూటౌన్ సీఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీసీ రామసుబ్బయ్య అక్కడకు చేరుకుని బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
సుల్తాన్‌బజార్: తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పోలీసులకు కోరారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు టెమూజియన్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. తనకు లక్ష్మీ గౌతమితో వివాహం అయినప్పటి నుండి ఆమె మానసికంగా శారీరకంగా హింసిస్తుందని ఆయన తెలిపారు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నారు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమాలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. నగరంలోని మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నట్లు వివరించారు. తమకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పెళ్లి అయినప్పటి నుండి అకారణంగా హింసిస్తోందని వాపోయాడు. పలు మార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారలేదన్నారు. ఇటీవల చంపేందుకు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై స్థానిక అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నంచారు. ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. -
నా భార్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది.. భర్త సెల్ఫీ వీడియో కలకలం..
సాక్షి, ఆదిలాబాద్: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బోక్కలగూడలో భార్య వేధింపులు తట్టుకోలేక.. ఫిరోజ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి, సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని.. పైగా తరుచు వేధింపులకు పాల్పడుతుందని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్య నగ్న ఫొటోలను బంధువులకు షేర్ చేసిన భర్త.. ఆ తర్వాత..?
బనశంకరి: భార్యను అసహజ లైంగిక ప్రక్రియకు ఒత్తిడి చేయడం, ఆమెను నగ్న ఫోటోలు తీసి కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించిన సైకో భర్తపై పకడ్బంధీగా విచారణ జరపాలని మంగళవారం హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తండ్రి, బంధువులకు నగ్నఫొటోలు వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన యువతిని ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. భర్త అసహజ లైంగిక ధోరణులతో భయపడిన ఆమె పుట్టింటికి చేరుకుంది. ఉన్మాదిగా మారిన భర్త ఆమె నగ్నఫోటోలు, వీడియోలను ఆమె తండ్రి, బంధుమిత్రులకు పంపాడు. దీంతో బాధితురాలు 2019లో రాయపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నేరం జరిగిన బెంగళూరులో కాబట్టి కేసును ఇక్కడి వివేకనగర బదిలీ చేశారు. కానీ, వివేకనగర పోలీసులు కేసును ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. కనీస సాక్ష్యాధారాలను కూడా సేకరించలేదు. హైకోర్టును ఆశ్రయించిన భార్య ఫలితంగా కేసు వీగిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు హైకోర్టులో కేసు వేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆమె అర్జీని విచారించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చార్జిషీటు సాదాసీదాగా ఉందని, తీవ్రమైన నేరాలను పేర్కొనలేదని, వీటన్నింటిని గమనిస్తుంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని, రాష్ట్ర డీజీపీ లేదా నగరపోలీస్ కమిషనర్ ఇలాంటి దర్యాప్తు చేపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఇది కూడా చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని.. -
కరెంట్ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా స్టోరీ తిప్పేసి కట్టుకథ
జైపూర్: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. రోజూ ఏదో ఒక విషయంపై వివాదం. దీంతో ఆ భార్యాభర్తలు ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పడుతుండేవాడు. భర్త తీరుపై విసుగు చెందిన ఆమె ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే భోజనంలో మత్తు మందు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె శాడిజాన్ని చూపించింది. మత్తులో ఉన్న భర్త కాళ్లు కట్టేసి వరుసగా కరెంట్ షాక్ పెడుతూ వేధించింది. మత్తులో ఉన్న భర్త మెలకువ రాగానే మళ్లీ షాకిచ్చి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసింది. ఇదంతా అయిపోయాక భర్త కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కరెంట్ షాక్‌తో పడిపోయాడని చెప్పి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. సర్దార్‌షహర్ ఎస్ఐ మణక్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్‌కు చెందిన మహేంద్ర ధన్ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగొచ్చి తనను వేధిస్తున్నాడనే నెపంతో ఈనెల 17వ తేదీన మంగళవారం ఓ ప్లాన్ వేసింది. విధులు ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు ఆమె భోజనం వడ్డించింది. తిన్న తర్వాత భర్త అపస్మారక స్థితికి వెళ్లాడు. భోజనంలో మత్తుమందు కలపడంతో అపస్మారక స్థితిలోకి చేరిన భర్తను ఒకచోటకు జరిపింది. కొద్దిసేపటికి తేరుకున్న భర్త లేచేందుకు ప్రయత్నించగా భార్య చేతులకు గ్లౌస్లు కట్టుకుని నిల్చుని ఉండగా అతడి కాళ్లకు విద్యుత్ తీగలు కట్టేసింది. అనంతరం భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. వేధింపులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుసార్లు కరెంట్ షాక్ ఇవ్వడంతో భర్త మరోసారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈసారి భర్త తేరుకుని చూడగా ఆస్పత్రి బెడ్‌పై ఉంది. అయితే భర్త కుటుంబసభ్యులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడని చెప్పి వారితో కలిసి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్చింది. మేలుకున్న తర్వాత భర్త జరిగిన ఘోరాన్ని తన కుటుంబసభ్యులకు వివరించాడు. అర్ధరాత్రి 2గంటలకు లేచి కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురి చేసిందని వాపోయాడు. భార్య చేసిన పనికి కాళ్లు కోల్పోయాడు. ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్దార్ షహర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: బ్రేకింగ్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం -
భార్యాబాధితుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: భార్య, అత్తమామల వేధింపులతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..ఉప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఎల్దండ ఆనంద్, లత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు (2) ఉంది. నెలక్రితం లత తన భర్త కుటుంబసభ్యులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (ఫ్లై ఓవర్‌పై ఆత్మహత్య.. భార్యే కారణం) ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆనంద్ ఇంట్లోంచి బయటకు వెళ్లగానే కూతురును తీసుకొని లత ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయింది. ఆనంద్ మద్యం తాగి వచ్చి చూసేసరికి ఇంటికి తాళం ఉంది. చుట్టుపక్కల వెతికి పక్కనే ఉన్న అత్తగారింట్లోకి వెళ్లి ఆరాతీయగా వారు దుర్భాషలాడారు. దీంతో మనస్థాపం చెందిన ఆనంద్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లి భార్య, అత్తమామలు చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటిచుకున్నాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కన్నతండ్రే 'కర్కోటకుడు') ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చిలకలగూడ : ఆరేళ్ల క్రితం ఎంటెక్ పాసయ్యాడు. అప్పటి నుంచి చెప్పులు అరిగేలా తిరిగినా సరైన ఉద్యోగం రాలేదు. ఇంత చదువు చదివి ఇంట్లోవాళ్లకు భారం కావడం ఇష్టం లేదనుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్ వారాసిగూడకు చెందిన పల్లే సుధీర్‌రెడ్డి (29) ఎంటెక్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఎన్ని ఇంటర్వూలకు వెళ్లినా సరైన ఉద్యోగం లభించలేదు. గత నెల 29న ఉదయం 11.30 గంటలకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. సోదరుడు రణధీర్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, అదృశ్యమైన సుధీర్ ఫోటోను అన్ని పోలీస్, రైల్వేస్టేషన్లకు పంపించారు. ఈ నేపధ్యంలో ఈనెల 1వ తేదిన జామై ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కాచిగూడ రైల్వేపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు పంపిన ఫొటోతో సరిపోల్చుకుని, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా మృతుడు సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
భార్య, అత్త వేధింపులు తాళలేక
సంతోష్‌నగర్: భార్య, అత్త వేధింపులను తాళలేక ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రియాసత్‌నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ షాయోద్దీన్, షాహినాథ్ బేగంకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. గత కొన్ని రోజులుగా భార్య షాహినాథ్ బేగం, అత్త అమీనా తరచూ షాయోద్దీన్‌ను వేధిస్తున్నారు. మూడు రోజుల క్రితం షాహినాథ్ బేగం ఘాన్సీబజార్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత షాయోద్దీన్‌ను కుమార్తెను చూడాలని ఉందని కోరినా షాహినాథ్ బేగం అందుకు నిరాకరించడంతో మనస్తాపానికిలోనైన అతను శుక్రవారం తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 55 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్తపై వేడి నూనె పోసిన భార్య
భాగ్యనగర్‌కాలనీ: కుటుంబ సమస్యల కారణంగా ఓ మహిళ తన భర్తపై వేడి నూనె పోసిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ్ సింగ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భాగ్ అమీర్‌లో కుమార్ చౌదరి, ప్రేమ్‌దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. జ్యువెలరీ వ్యాపారం చేసే కుమార్ చౌదరి వ్యాపారంలో నష్టాలు రావటంతో అప్పులపాలయ్యాడు. దీంతో భార్యాబిడ్డల పోషణ భారంగా మారటంతో పిల్లలను తీసుకుని స్వగ్రామంలోని తన తల్లి వద్దకు వెళ్లాలని భార్యకు సూచించాడు. ఇందుకు ప్రేమ్‌దేవి నిరాకరించటంతో గత నెల రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కుమార్ చౌదరి ఇంట్లో నిద్రిస్తుండగా ప్రేమ్ దేవి అతడిపై వేడిగా ఉన్న వంటనూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. -
భార్య వేధింపుల నుంచి రక్షించండి
కరీంనగర్ అర్బన్: పెద్దలు చెప్పిన వినకుండా ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కొద్ది రో జులకే తన భార్య మరొకరితో వివాహేతర సం బంధం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తుందని.. న్యాయం చేయండంటూ ఓ భర్త గురువారం కరీం నగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగాడు. చొప్ప దండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాస్‌చారి, రుక్మాపూర్‌కు చెందిన లావణ్య 2015లో వివా హం చేసుకున్నారు కొన్నిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రుక్మాపూర్ సర్పంచ్ కర్రె శ్రీనివాస్ వద్ద పంచాయితీ జరిగింది. ఇదే అదునుగా సర్పంచ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్‌చారి ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చొప్పదండి పోలీసుస్టేషన్లో ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు చె ప్పారు. కేసు విత్‌డ్రా చేసుకోమని చెప్పడంతో మానవతా దృక్పథంతో విత్‌డ్రా చే సుకున్నప్పటికీ ఆమెలో ఎలాంటి మా ర్పు రాలేదన్నారు. స ర్పంచ్ శ్రీనివాస్‌తోపాటు ఆమె బావ తిరుపతి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం కేసులు పెడుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. -
మేనమామ వరుస అయిన వ్యక్తితో..
యశవంతపుర (కర్ణాటక) : పెళ్లయి మూడేళ్లయినా గర్భం దాల్చలేదని భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న నీచుడిని ఇక్కడి బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... డాక్టర్‌గా కొలువు వెలగపెడుతున్న మంజునాథ్‌కు నగరానికి చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చలేదని తరచూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో బాధితురాలు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మంజునాథ్ వికృత చేష్టలు పెరిగిపోయాయి. తన మేనమామ వరుస అయిన వ్యక్తితో గడపాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించేవాడు. అదే సమయంలో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న భవనం అమ్మి డబ్బు తీసుకురావాలని డిమాండ్ చేసేవాడు. విషయం మీడియా దృష్టికి రావటంతో స్పందించిన పోలీసులు వైద్యుడు మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు. -
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య
కట్టుకున్న భార్య, అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా విపరీతంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఓ అమాయక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నాసిక్ సమీపంలోని ఓఝార్ టౌన్‌షిప్‌కు చెందిన సంతోష్ పవార్ (32) తన భార్య చేతిలో తరచు వేధింపులకు గురయ్యేవాడని పోలీసులు తెలిపారు. సంతోష్ ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు. అయితే, ఇంటివద్ద వాతావరణం బాగోకపోవడం, ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో ఇక సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు పవార్ ఒక సూసైడ్ నోట్ రాశాడు. అందులో తనను తన భార్య, అత్తమమామలు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారని, అందుకే ఇక జీవితం చాలించాలనుకుంటున్నానని రాశాడు. బాధితుడి సోదరుడు సచిన్ ఫిర్యాదు మేరకు పవార్ భార్య ప్రియాపవార్, అత్తమామలు కృష్ణా షిండే, విష్ణు షిండే, అప్పా బోర్గుడేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు మాత్రం చేయలేదు. పోస్టుమార్టం చేసిన తర్వాత సంతోష్ పవార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భార్య వేధింపులు తాళలేక...
తుమకూరు: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కర్ణాటకలోని కుణిగల్ తాలూకాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... తాలూకాలోని భైరనాయకనహళ్లికి చెందిన లోకే శ్(32)కు సమీప గ్రామానికి చెందిన వరలక్ష్మితో కొద్ది రోజుల క్రితం వివాహమైంది. కొద్ది రోజులు సజావుగా కాపురం సాగినా ఆ తరువాత లోకేశ్ భార్య వరలక్ష్మి పల్లెలో ఉండటానికి ఆసక్తి లేకపోవడంతో కుటుంబాన్ని బెంగళూరుకు మార్చాలని భర్తతో గొడవపడేది. ఇదే విషయమై ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారు. ఇదిలా ఉంటే గురువారం మరోసారి గొడవ పడ్డారు. దీంతో లోకేశ్ గురువారం తన మృతికి భార్య వరలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులే కారణమని డెత్‌నోట్ రాసి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై వేధింపుల కేసులో ఎస్ఐ లొంగుబాటు
చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే విలన్ గా మారాడు. భార్యకు నరకయాతన చూపించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కోర్టులో లొంగిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. అనిల్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. శ్వేత అనే యువతిని పెళ్లిచేసుకున్నారు. కాగా ఏడాది నుంచి అనిల్ తనను వేధిస్తున్నాడని శ్వేత ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఈ కేసులో అనిల్ సోమవారం న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు.