భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య | Harassed by wife, man commits suicide | Sakshi
Sakshi News home page

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

Published Wed, May 17 2017 2:51 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య - Sakshi

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

కట్టుకున్న భార్య, అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా విపరీతంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఓ అమాయక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నాసిక్ సమీపంలోని ఓఝార్ టౌన్‌షిప్‌కు చెందిన సంతోష్ పవార్ (32) తన భార్య చేతిలో తరచు వేధింపులకు గురయ్యేవాడని పోలీసులు తెలిపారు. సంతోష్ ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు. అయితే, ఇంటివద్ద వాతావరణం బాగోకపోవడం, ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో ఇక సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయేముందు పవార్ ఒక సూసైడ్ నోట్ రాశాడు. అందులో తనను తన భార్య, అత్తమమామలు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారని, అందుకే ఇక జీవితం చాలించాలనుకుంటున్నానని రాశాడు. బాధితుడి సోదరుడు సచిన్ ఫిర్యాదు మేరకు పవార్ భార్య ప్రియాపవార్, అత్తమామలు కృష్ణా షిండే, విష్ణు షిండే, అప్పా బోర్గుడేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు మాత్రం చేయలేదు. పోస్టుమార్టం చేసిన తర్వాత సంతోష్ పవార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement