
ఫ్లకార్డుతో శ్రీనివాస్‌చారి
కరీంనగర్ అర్బన్: పెద్దలు చెప్పిన వినకుండా ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కొద్ది రో జులకే తన భార్య మరొకరితో వివాహేతర సం బంధం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తుందని.. న్యాయం చేయండంటూ ఓ భర్త గురువారం కరీం నగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగాడు. చొప్ప దండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాస్‌చారి, రుక్మాపూర్‌కు చెందిన లావణ్య 2015లో వివా హం చేసుకున్నారు కొన్నిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రుక్మాపూర్ సర్పంచ్ కర్రె శ్రీనివాస్ వద్ద పంచాయితీ జరిగింది.
ఇదే అదునుగా సర్పంచ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్‌చారి ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చొప్పదండి పోలీసుస్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు చె ప్పారు. కేసు విత్‌డ్రా చేసుకోమని చెప్పడంతో మానవతా దృక్పథంతో విత్‌డ్రా చే సుకున్నప్పటికీ ఆమెలో ఎలాంటి మా ర్పు రాలేదన్నారు. స ర్పంచ్ శ్రీనివాస్‌తోపాటు ఆమె బావ తిరుపతి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం కేసులు పెడుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment