Real Estate Agent Molestation On Girl At Peddapalli - Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో దారుణం.. మైనర్‌ బాలికపై హత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

Published Thu, Aug 17 2023 8:50 AM | Last Updated on Thu, Aug 17 2023 9:13 AM

Realstate Worker Molestation On Minor Girl At Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై నలుగురు యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు... తీవ్ర గాయాలైన బాలికను.. చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మూడు రోజుల క్రితం (ఆగస్టు 14) అప్పన్నపేట శివారులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రియల్ ఎస్టేట్ వెంచర్ పనులు పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ ఫయాజ్.. బాలికను మాయమాటలు చెప్పి శివార్లలోకి తీసుకెళ్లాడు. అతడితోపాటు మరో ముగ్గురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ గోపాల్‌కు తెలియడంతో.. ఈ సమస్య తనమెడకెక్కడ చుట్టుకుంటుందోనని బాలికను, ఆమె కుటుంబ సభ్యులను తిరిగి మధ్యప్రదేశ్‌కు పంపించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో మార్గమధ్యలో బాధితురాలు మృతిచెందింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని కజరీకి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు పూర్తి చేయాలని బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆమె కుటుంబీకులను బలవంత పెట్టాడు. అయితే హైదరాబాద్‌లో పనిచేస్తున్న బాలిక సోదరుడి రాక కోసం కుటుంబీకులు అంత్యక్రియలు ఆపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రధాన నిందితుడు ఫయాజ్‌తోపాటు మరో నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపెల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం. అప్పన్నపేటలో పనిచేస్తున్న తోటివారిని విచారించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.  సామూహిక అత్యాచారం తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే బెదిరించినట్లు బాలిక చివరి మాటలను బంధువులు ఆడియో రికార్డు చేశారు. 
చదవండి: మొదటి భార్యను ఒప్పించి, యువతితో యూట్యూబర్‌ రెండో పెళ్లి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement