బనశంకరి: భార్యను అసహజ లైంగిక ప్రక్రియకు ఒత్తిడి చేయడం, ఆమెను నగ్న ఫోటోలు తీసి కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించిన సైకో భర్తపై పకడ్బంధీగా విచారణ జరపాలని మంగళవారం హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
తండ్రి, బంధువులకు నగ్నఫొటోలు
వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన యువతిని ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. భర్త అసహజ లైంగిక ధోరణులతో భయపడిన ఆమె పుట్టింటికి చేరుకుంది. ఉన్మాదిగా మారిన భర్త ఆమె నగ్నఫోటోలు, వీడియోలను ఆమె తండ్రి, బంధుమిత్రులకు పంపాడు. దీంతో బాధితురాలు 2019లో రాయపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నేరం జరిగిన బెంగళూరులో కాబట్టి కేసును ఇక్కడి వివేకనగర బదిలీ చేశారు. కానీ, వివేకనగర పోలీసులు కేసును ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. కనీస సాక్ష్యాధారాలను కూడా సేకరించలేదు.
హైకోర్టును ఆశ్రయించిన భార్య
ఫలితంగా కేసు వీగిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు హైకోర్టులో కేసు వేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆమె అర్జీని విచారించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చార్జిషీటు సాదాసీదాగా ఉందని, తీవ్రమైన నేరాలను పేర్కొనలేదని, వీటన్నింటిని గమనిస్తుంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని, రాష్ట్ర డీజీపీ లేదా నగరపోలీస్ కమిషనర్ ఇలాంటి దర్యాప్తు చేపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
ఇది కూడా చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని..
Comments
Please login to add a commentAdd a comment