
మైసూరు: బట్టతల అంటూ భార్య అవహేళన చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో ఆదివారం జరిగింది.
వివరాల ప్రకారం.. పరమశివమూర్తి (32)కి మమతతో రెండేళ్ల కిందట పెళ్ళి జరిగింది. లారీ డ్రైవర్ అయిన పరమశివమూర్తికి పెళ్లినాటికే కొంత బట్టతల ఉంది. పెళ్లి తరువాత ఉన్న జుట్టు కూడా రాలిపోయింది. భార్య మమత ‘నీకు జట్టు లేదు, నీతో బయటకి రావాలంటే సిగ్గుగా ఉంది’ వంటి మాటలనేది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇదే క్రమంలో భర్తపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైలులో ఉండి ఇటీవలే పరమశివమూర్తి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చిన పరమ శివమూర్తి.. భార్య సోషల్ మీడియాలోని ‘సింగిల్’ స్టేటస్ చూసి మరింత ఆవేదన చెందాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో నోట్ రాసి పెట్టి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment