
సాక్షి, ఆదిలాబాద్: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బోక్కలగూడలో భార్య వేధింపులు తట్టుకోలేక.. ఫిరోజ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి, సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని.. పైగా తరుచు వేధింపులకు పాల్పడుతుందని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
చదవండి: హయత్ నగర్‌లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com