సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సెల్ఫీ సూసైడ్ యత్నం ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నానంటూ క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.7 లక్షల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ యత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు.
భార్యా భర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలకు తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు క్రాంతి. న్యాల్ కల్ రోడ్ఖులో ఓ పోలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ముందు.. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఎస్ఐ బాబూరావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో ఎస్‌ఐ బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరింది. బాన్సువాడకు చెందిన క్రాంతి నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో ఉంటున్నాడు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చదవండి: నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి..
Comments
Please login to add a commentAdd a comment