
దొడ్డబళ్లాపురం: భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట రోడ్డులోని సిలువెపుర గ్రామంలో చోటుచేసుకుంది. బాలరాజ్ (41) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. బాలరాజ్ 18 ఏళ్ల క్రితం కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
ఆనాటి నుండి ఆమె భర్తను వేధింపులకు గురిచేసేదని, ఇటీవల ఆమె పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి మనస్తాపంతో బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వివరాలు డెత్‌నోట్ రాసిన బాలరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోలదేనమళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది చదవండి: ‘డబ్బు కోసమే వేధించి ఉంటే.. అలా ఎందుకు చేస్తా!’: అతుల్ భార్య నిఖిత స్టేట్‌మెంట్