నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు | Man shows black flag to Kanhaiya in Patna, beaten up | Sakshi
Sakshi News home page

నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు

Published Sun, May 1 2016 4:35 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు

నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు

పట్నాలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ ఉపన్యాస కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. కన్హయ్య ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి లేచి నల్లజెండాతో నిరసన తెలిపాడు. దీంతో కన్హయ్య మద్దతుదారులు అతనిపై విరుచుకుపడ్డారు. అతని చొక్కా చింపేసి.. చితకబాదారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసన తెలిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

'దేశద్రోహం' ఆరోపణలతో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన కన్హయ్యకుమార్ రెండురోజుల పర్యటన కోసం స్వరాష్ట్రం బిహార్‌ వచ్చిన సంగతి తెలిసిందే.  బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లను కలిశారు. ఆదివారం పట్నాలో 'ఆజాదీ' (స్వేచ్ఛ) అంశంపై ఆయన ఉపన్యాసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement