kanhaiya kumar
-
‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’
ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి? ..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.చదవండి: యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే -
కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి, కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.కన్హయ్య కుమార్ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్ ఫండింగ్ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్‌కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్ కుమార్, సినీ నిర్మాత విశాల్ భరద్వాజ్, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్, జెఎన్యూ మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్, మాజీ ప్రొఫెసర్ మోహన్‌రావు తదతరులు ఉన్నారు.కన్హయ్య కుమార్ ‘క్రౌడ్ ఫండింగ్’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్ సేకరణకు ముందు కన్హయ్య కుమార్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్ పే నంబర్ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంకా ఎన్నికల జరగని నియోజకవర్గాల్లో నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి జరిగింది.జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్లో కన్హయ్య కుమార్‌కు పూలమాల వేసే నెపంతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని చెప్పుతో కొట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై కూడా వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఆ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కన్హయ్య కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు పూలదండలతో రావడం కనిపిస్తుంది. వీరు కన్హయ్యకు పూలమాల వేయకుండా, అతనిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే ఒక యువకుడిని పట్టుకున్నారు.బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. తనకు అమితంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి, సిట్టింగ్ ఎంపీ తివారీ నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే తనపై దాడి చేసేందుకు గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా ప్రజలు దీనికి సమాధానం చెబుతారని అన్నారు.ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మే 25న ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ.. మనోజ్ తివారీని అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించింది. ఈ సీటులో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్‌యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ నటుడు, గాయకుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. -
జేఎన్‌యూ నుంచి రాజకీయాల్లోకి.. ఈ ముగ్గురూ ఎంపీలు కాగలరా?
దేశ రాజకీయాల్లో ప్రమేయం కలిగిన విశ్వవిద్యాలయాల జాబితాలో జేఎన్‌యూ అగ్రస్థానంలో ఉంది. గత 50 ఏళ్లలో జెఎన్యూ పలువురు విద్యార్థి నేతలకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా లోక్‌సభకు చేరుకోలేకపోయారు. ఇప్పుడు తొలిసారిగా ముగ్గురు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్నయ్య కుమార్, నలంద నుంచి సందీప్ సౌరభ్, సెరంపూర్ నుంచి దీప్సితా ధర్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇండియా అలయెన్స్ అభ్యర్థులే కావడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హస్తం గుర్తుపై ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కన్హయ్య ప్రస్తుతం కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి కన్హయ్యపై 2016లో దేశద్రోహం ఆరోపణలు రావడంతో అతను హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌పై కన్నయ్య ఉన్నారు. 2015-16లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన కన్హయ్య కుమార్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీ చేస్తున్నారు. తివారీ 2014 నుంచి ఈ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కన్హయ్యకు ఇక్కడ విజయం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు కేవలం 28 శాతం ఓట్లు రాగా, బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి దాదాపు 54 శాతం ఓట్లు వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్ సౌరభ్ బీహార్‌లోని నలంద సీటు నుంచి ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీహార్‌లో నలంద జేడీయూకి కంచు కోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి జేడీయూకు చెందిన కౌశలేంద్ర కుమార్ ఎంపీగా ఉన్నారు. పార్టీ ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. సందీప్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పాలిగంజ్ స్థానం నుండి పోటీ చేసి, విజయం సాధించారు. జేఎన్‌యూలో పీహెచ్డీ చేసిన సందీప్ 2013లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే నలంద సీటు నుంచి గెలవడం సందీప్‌కు అంత సులువు కాదు. 1996 నుంచి ఈ సీటు సమతా పార్టీ-జేడీయూలో గుప్పిట్లో ఉంది. 2019లో జేడీయూ ఈ స్థానాన్ని రెండు లక్షల 56 వేల ఓట్లతో గెలుచుకుంది. జేఎన్‌యూ ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షురాలు దీప్సితా ధర్ పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. కళ్యాణ్ బెనర్జీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీప్సీత పోటీ చేశారు. సీపీఎం ఆమెను బాలి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆమె అక్కడ మూడో స్థానంలో నిలిచారు... ఇలా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన ఈ ముగ్గురు పూర్వ విద్యార్థి నేతలు ఎంపీ స్థాయికి చేరుకుంటారో లేదో వేచిచూడాల్సిందే. -
ఢిల్లీలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులెవరు?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించగా, కాంగ్రెస్ కూడా త్వరలో ఈ జాబితాను విడుదల చేయనుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఢిల్లీలోని చాందినీ చౌక్, నార్త్-వెస్ట్, ఈశాన్య సీట్ల కోసం పార్టీ పలువురి పేర్లను చర్చిస్తోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదిరిన నేపధ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాలలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ సీట్లలో పోటీకి నిలబెట్టేందుకు కొన్ని కొత్త పేర్లతో పాటు పాత అభ్యర్థులు, కులాల సమీకరణకు తగిన అభ్యర్థులు ఎవరనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాందినీ చౌక్ నుంచి అభ్యర్థిత్వం కోసం భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, ఢిల్లీ సీనియర్ నేత ఛత్తర్ సింగ్ పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నార్త్-వెస్ట్ ఢిల్లీకి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, బవానా మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఈ జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ మూడు స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
కన్నయ్య కుమార్‌పై దాడికి యత్నం
లక్నో: కాంగ్రెస్ నేత కన్నయ్యకుమార్‌పై ఒకరు రసాయనాలతో దాడికి యత్నించారు. లక్నోలోని యూపీసీసీ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని పార్టీ ఆఫీసు బేరర్లు పట్టుకొన్నారని చెప్పాయి. పార్టీ నిర్వహించే యువ సంసద్‌లో ప్రసంగించేందుకు కన్నయ్య లక్నో వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని దేవాంశ్ బాజ్పాయ్గా గుర్తించారు. దాడికి కారణాలు తెలియరాలేదు. గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న కన్నయ్య తొలుత కమ్యూనిస్టు పార్టీలో చేరి అనంతరం కాంగ్రెస్‌లోకి మారారు. -
బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను
న్యూఢిల్లీ: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ తనను ముక్కలు–ముక్కలు (తుక్డే) గ్యాంగ్ అని పిలుస్తుందని, ఎందుకంటే తాను బీజేపీని తుక్డే–తుక్డే చేయగలనని వారికి తెలుసని బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ వారి దృష్టిలో జాతి పిత గాంధీ కాదని, గాడ్సే అని విమర్శించారు. కేవలం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందు మాత్రమే వారు గాంధీని పొగుడుతారని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశానని కేసులు పెట్టారని, కానీ ఇప్పటి వరకూ కోర్టులో అది రుజువు కాలేదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ‘నాథూరాం–బనాయి జోడి’ అని పేరు పెట్టారు. చదవండి: (అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీయే ఇప్పుడు తిరిగి స్వాతంత్య్రాన్ని తిరిగి కాపాడాలని అందరు యువతలాగే తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారన్నారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ తప్ప బీజేపీతో పోరాడే జాతీయ పార్టీ ఏదీ లేదని చెప్పారు. బీజేపీ తప్పక ఓడిపోతుందని, ఆలా ఓడిపోతుందని నమ్మకపోయి ఉంటే పోరాడకపోయి ఉండేవాన్నని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిజాయితీపరుడని కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన్ను కలిసినప్పుడల్లా అమ్మ ఎలా ఉందని, నాన్న ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారని చెప్పారు. రాహుల్ జాలి కలిగిన నేత అని చెప్పారు. తనలోని ఆ లక్షణాలను తనకెంతో నచ్చాయని చెప్పారు. ఆయన చేసే పోరాటంలో నిబద్ధత ఉందని, సత్యం బయటకు తేవడం కోసం భయపడకుండా పోరాడే వ్యక్తి అని కొనియాడారు. చదవండి: (అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్ !) -
కాంగ్రెస్‌లోకి కన్హయ్య
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్హయ్య వెంట గుజరాత్ దళిత యువ నేత, స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరట్లేదని జిగ్నేష్ చెప్పారు. ఇప్పుడు పార్టీలో చేరితే స్వతంత్య్ర ఎమ్మెల్యేగా కొనసాగడం కుదరదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీదనే బరిలో దిగుతానని స్పష్టంచేశారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్(ఆర్‌డీఏఎం) కన్వీనర్ అయిన జిగ్నేష్ గుజరాత్‌లోని వద్గామ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. గుజరాత్లో దళితులకు దగ్గరవుతున్న కాంగ్రెస్‌కు జిగ్నేష్ మద్దతు వచ్చే ఎన్నికల్లో లాభం చేకూర్చనుంది. 2019లో సీపీఐలో చేరిన కన్హయ్య బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. బెగుసరాయ్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌తో పోటీపడి ఓటమి పాలయ్యారు. మరోవైపు, కన్హయ్య కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ స్పందించింది. ఆయనను బెగూసరాయ్‌లో ప్రజలు తిరస్కరించారని, రాజకీయంగా ఎదిగేందుకే పార్టీ మారారని బిహార్ బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి మంగళ్ పాండే ఆరోపించారు. -
Kanhaiya Kumar: కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్
సాక్షి, ఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ రాజకీయ పార్టీనే కాదు.. అంతకంటే గొప్పదైన సిద్ధాంతం అని పేర్కొన్నారు. దేశంలో గొప్ప ప్రజాస్వామిక పార్టీ అని, కాంగ్రెస్ లేకుండా దేశంలో పరిపాలన సరైన రీతిలో సాగదని అన్నారు. చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఆశయాలను నిలబెడుతూ ఉందని తెలిపారు. మహాత్మాగాంధీలోని ఏకత్వం, భగత్సింగ్లోని ధైర్యం, బీఆర్ అంబేద్కర్‌లోని సమానత్వం అన్నింటిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని పేర్కొన్నారు. అందుకోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెప్ పార్టీతోనే భారతదేశం రక్షించబడుతుందని కోట్లాది మంది యూవత భావిస్తున్నారని అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీ తరఫున బిహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ రోజు కాంగ్రెస్ చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరలేదు. తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరలేదని జిగ్నేష్ మేవాని తెలిపారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతానని తెలిపారు. గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువతరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇద్దరు యువనాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు ముహుర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సెప్టెంబర్ 28న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొదట అక్టోబర్ 2 గాంధీ జయంతిన వీరివురు కాంగ్రెస్‌లో చేరతారని వార్తలొచ్చాయి. అయితే ఇది మరింత ముందుగా భగత్‌సింగ్ జన్మదినమైన సెప్టెంబర్ 28న ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: (తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!) గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరి బీహార్ యూనిట్‌ను బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై కన్హయ్య కుమార్ ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. బిహార్ ఎన్నికల సమయానికి కన్హయ్యను పార్టీలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: (పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి) -
జామియా కాల్పులు: నాడు గాడ్సే.. నేడు గోపాల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై గోపాల్ అనే వ్యక్తి విక్షణారహితంగా కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తీవ్రంగా స్పందించారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని నాథూరాం గాడ్సేతో పోల్చారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. (ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) ‘72 ఏళ్ల క్రితం జాతిపిత మహాత్మ గాంధీని స్వాతంత్ర్య దేశంలో తొలి ఉగ్రవాదిగా గుర్తింపుపొందిన నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఆయన్ని హత్య చేసిన చేసిన రోజునే (జనవరి 30)న గోపాల్ అనే గాడ్సే భక్తుడు విద్యార్థులకు హత మార్చాలని ప్రయత్నించాడు. రామ మందిరం నిర్మాణం పేరుతో దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దేశాన్ని కాపాడుకోడానికి మేల్కొండి’ అంటూ కన్నయ్య కుమార్ సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశారు. देखिए इन तस्वीरो को।नफरत में अंधा होकर आजाद भारत के पहले आतंकवादी नाथूराम गोडसे ने 72साल पहले इसी तरह गांधीजी की हत्या कर दी थी क्योंकि उसे लगता था कि बापू ‘देश के गद्दार’ हैं।आज राम का नाम लेकर सत्ता में आए लोग नाथूराम का देश बना रहे हैं।जागिए,इससे पहले कि पूरा देश बर्बाद हो जाए pic.twitter.com/11rk3JfUPy — Kanhaiya Kumar (@kanhaiyakumar) January 30, 2020 -
10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు...
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థినాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను ఆదివారం తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ తల పగిలి తీవ్ర రక్తస్రామమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ... జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్ సహా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.(ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది) ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ...‘ మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. కనిపించకుండా పోయిన వాళ్లను కనిపెట్టడం పోలీసులకు కుదరడంలేదు గానీ... జేఎన్‌యూ చెత్తడబ్బాల్లో 3 వేల కండోమ్‌లు దొరికాయట. అసలు వాళ్లు అంత కచ్చితంగా ఎలా లెక్కపెట్టగలిగారో’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తుక్డేగ్యాంగ్ అంటూ తమను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి... జేఎన్‌యూలో ప్రవేశం అంత సులభంగా ఏమీ లభించదని గుర్తు పెట్టుకోండని హితవు పలికారు. కాగా 2016లో బీజేపీ నేత ఙ్ఞాన్‌దేవ్ అహుజా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘ అక్కడ రోజూ 3 వేల బీరు క్యాన్లు దొరుకుతాయి. 2 వేల మద్యం బాటిళ్లు ఉంటాయి. పదివేల కాల్చేసిన సిగరెట్ పీకలు... 4 వేల బీడీలు, 50 వేల మాంసపు ఎముకలు, 2 వేల చిప్స్ కవర్లు, 3 వేల కండోమ్‌లు, 5 వందల అబార్షన్ ఇంజక్షన్లు ఉంటాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కోసం రెండేళ్లపాటు వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును విచారించిర సీబీఐ దానిని క్లోజ్ చేసింది. -
పౌరసత్వ వివాదం.. కన్నయ్య కుమార్ ఆజాద్ పాట
-
పౌరసత్వ వివాదం.. దద్దరిల్లిన నిరసన ర్యాలీ
పట్నా: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష చర్యను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలను ఖండిస్తూ.. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాసంఘాలు బిహార్‌లో భారీ ర్యాలీని నిర్వహించాయి. జామియా విద్యార్థులపై పోలీసుల దాడిని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై ప్రధాని మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ర్యాలీ సందర్భంగా ఆయన పాడిన ఆజాద్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కన్నయ్య స్లొగన్స్‌కు ర్యాలీకి హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. కాగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోనే కాక దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్టం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతోంది. శాంతిభద్రతలను పూర్తిగా అదుపులో ఉంచాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. -
కన్హయ్య.. ఆ నినాదం ఇచ్చావా.. చెప్పు?
పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు. ‘భారత్‌కే తుక్డే..తుక్డే’ అంటూ ఇచ్చిన నినాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతన్ని ఘోరవ్ చేశారు. 2016లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్య కుమార్.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో అతనిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కన్హయ్య వీటిని గట్టిగా ఖండించారు. వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి అందరి దృష్టిని ఆకర్షించిన కన్హయ్య కుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బేగూసరాయి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు కొంతమంది అడ్డుకున్నారు. ఏరకమైన స్వేచ్ఛ కావాలంటూ నిలదీశారు. రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని కన్హయ్య కుమార్.. బీజేపీ మద్దతుదారులా అంటూ ఎదురు ప్రశ్నించారని స్థానికులు మీడియాతో వాపోయారు. -
నా స్నేహితుడి గెలుపు కోసమే తొలిసారిగా..
పట్నా : తన స్నేహితుడు, బెగుసరాయ్ ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్ విజయం సాధిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టేనని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బిహార్‌లోని బెగసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయులు పొందాల్సిన రాజ్యాంగ హక్కులు, నిరుద్యోగ సమస్య, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న కన్హయ్యను గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో పెచ్చు మీరుతున్న మూకదాడులను ప్రశ్నిస్తూ, రాజ్యాంగ విలువలు పతనం కాకుండా కాపాడే అతడి సిద్ధాంతాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దేశభక్తి గల ప్రతీ భారతీయుడు కన్హయ్యకు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. నా స్నేహితుడి గెలుపు కోసమే తొలిసారిగా.. ‘నాకు తెలిసి పుట్టినరోజును ఎవరూ ఇలా సెలబ్రేట్ చేసుకోరు. వేడుకలు చేసుకోవడం కంటే కూడా మనందరి తరఫున ఎన్నికల యుద్ధంలో పోరాడుతున్న నా స్నేహితుడు కన్హయ్య విజయమే నాకు ముఖ్యం. ఇంతకుముందెన్నడూ నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్న కన్హయ్య సిద్ధాంతాలు నచ్చడం వల్లే ఇక్కడి వచ్చాను. తను ప్రజా గొంతుకై నిలుస్తాడు’ అని స్వరా పేర్కొన్నారు. కాగా బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్ జెఎన్యూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నటనతో పాటు పలు సామాజిక అంశాలపై గళమెత్తే ఆమె.. గత కొంతకాలంగా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని కన్హయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా బెగుసరాయ్ నుంచి పోటీ చేయడం ద్వారా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న జరుగనున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని భావిస్తున్నారు. తన ప్రచారం కోసం ఇటీవలే ఫండ్‌రైజ్ క్యాంపెయిన్ మొదలుపెట్టగా అన్ని వర్గాల నుంచి ఆయనకు విశేష స్పందన లభించింది. -
ఆ చట్టంలో మార్పులకు సమయం పట్టొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంలో మార్పులకు చాలా కాలం పట్టొచ్చని మాజీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ అభిప్రాయపడ్డారు. క్రూరమైన బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టంలో సవరణలు చేపడతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కన్హయ్య మాట్లాడుతూ.. ‘ఈ చట్టం తొలగింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. చట్టంలో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉండటం మన రాజ్యాంగంలో ఉన్న అతిగొప్ప విషయం. దేశద్రోహ చట్టం బీజేపీ హయాంలోని అస్సాంలో ఎలా దుర్వినియోగమైందో చూశాం. పౌరసత్వ బిల్లుపై ప్రశ్నించినందుకు, అక్కడి రైతు సంఘం నాయకుడు అఖిల్ గొగోయ్‌ను, ఈ చట్టం కింద బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింద’ని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కన్హయ్య కుమార్ బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచారు. -
ఉత్తరాది.. ఏ గాలి వీచేది?
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పన్నెండు లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు హోరాహోరీ తలపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. హిందీ ప్రాంతంలోని ఈ కీలక నియోజకవర్గాల్లో ఈ బడా నేతలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయంటే.. యూపీ: సూపర్ సిక్స్ అమేథీ: రాహుల్‌తో స్మృతి ఢీ కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిని నిలపడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆమె రాహుల్ చేతిలో ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో స్మృతి క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాడుతూ, నెహ్రూ–గాంధీ వారసుడిపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభంజనంలో సైతం బీజేపీకి చిక్కని అమేథీ.. ఈసారైనా ఆ పార్టీ వశమవుతుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానానికి మే 6న పోలింగ్ జరగనుంది. ముజఫర్‌నగర్: సీటు మారిన అజిత్ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) నేత అజిత్‌సింగ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు, జాట్ నేత అయిన ఈయన ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు సంజీవ్ బలియాన్ కూడా జాట్ కులస్తుడే కావడంతో స్థానికంగా ఉన్న పట్టుతో మరోసారి గెలవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న అజిత్‌కు జాట్లు, ముస్లింలు, దళితులు కలిసి ఇచ్చే మద్దతును బట్టి ఆయన గెలుపు ఆధారపడి ఉంది. వచ్చే నెల 11న ముజఫర్‌నగర్ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. బాగ్పత్: వారసుడొచ్చాడు అజిత్‌సింగ్ కుమారుడు, మథుర మాజీ ఎంపీ జయంత్ చౌధరీ తన కుటుంబానికి కంచుకోట అయిన బాగ్పత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానంలో ఆయన తండ్రి అజిత్‌ను బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ ఓడించారు. తన గెలుపు ద్వారా కుటుంబ గౌరవం మళ్లీ సంపాదించడానికి జయంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి మద్దతు వల్ల జాట్లతోపాటు ముస్లింలు, దళితుల ఓట్లు కూడా పడితే జయంత్ గట్టెక్కుతారు. మారిన పరిస్థితుల్లో సత్యపాల్ విజయం అంత తేలిక కాదు. ఏప్రిల్ 11న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆమ్రోహా: ముగ్గురిలో ఎవరు? ఆమ్రోహా ప్రస్తుత ఎంపీ కన్వర్‌సింగ్ తన్వర్ (బీజేపీ).. ఈసారి బీఎస్పీ అభ్యర్థి దనిష్ అలీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో జేడీఎస్ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికైన దనిష్ 20 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, ఇతర సైనీలు, జాట్లు, దళితుల మద్దతుపై ఆశ పెట్టుకున్నారు. బీఎస్పీ మాజీ ఎంపీ రషీద్ అల్వీని కాంగ్రెస్ పోటీకి దింపడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముస్లింల ఓట్లు ప్రత్యర్థుల మధ్య చీలిపోతే బీజేపీ అభ్యర్థి గెలిచే వీలుంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఫిరోజాబాద్: దాయాదుల పోరు ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులిద్దరి మధ్య పోరుకు ఫిరోజాబాద్ స్థానం వేదికైంది. ములాయం తమ్ముడు శివపాల్ కొత్తగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) స్థాపించి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరుసకు అన్న అయిన ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌యాదవ్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ అక్షయ్‌యాదవ్ (ఎస్పీ) తో ఇక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పాత తరం ఓటర్లు, ఎస్పీ కార్యకర్తలతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉన్నప్పటికీ శివపాల్ గెలవకున్నా.. అక్షయ్‌కు గట్టి పోటీ ఇవ్వగలరు. వచ్చే నెల 23న విజేతలెవరో తేలనుంది. బదాయూన్: ధర్మేంద్ర వర్సెస్ సంఘమిత్ర ఎస్పీ కంచుకోటల్లో ఒకటైన బదాయూన్ను గత ఆరుసార్లుగా ఈ పార్టీ గెలుచుకుంటూనే ఉంది. 15 శాతం ముస్లింలు, 15 శాతం యాదవులున్న ఈ స్థానం ఎస్పీకి అత్యంత అనుకూలమైనది. ములాయం అన్న కొడుకైన ధర్మేంద్ర ప్రస్తుత బదాయూన్ ఎంపీ. ఆయనపై యూపీ మంత్రి స్వామి ప్రసాద్మౌర్యా కూతురు సం ఘమిత్ర బీజేపీ అభ్యర్థిగా దిగడంతో యాదవేతర బీసీల ఓట్లు ధర్మేంద్రకు పడకపోవ చ్చు. మాజీ ఎస్పీ నేత, ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన సలీం షేర్వానీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. (పోలింగ్: ఏప్రిల్ 23). బిహార్: ‘ఫోర్’కాస్ట్ బెగూసరాయ్: తరాల అంతరాలు బిహార్‌లో హోరాహోరీ పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి బెగూసరాయ్. ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో సీపీఐ భాగస్వామి కాకపోవడంతో సీపీఐ గెలుపు అంత తేలిక కాదు. ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని భారత లెనిన్‌గ్రాడ్‌గా పిలుస్తారు. సింగ్, కుమార్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారే. ఈ అగ్రకులం ఓట్లలో చీలిక వస్తే మధ్యలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 29న ఈ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. జముయీ: బరిలో పాశ్వాన్ కుమారుడు కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్‌తో స్థానిక పార్టీ ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి భూదేవ్ చౌధరీ తలపడుతున్నారు. చౌధరీ 2009లో జేడీయూ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆయన ఈసారి విజయానికి దళితులు, బీసీ ఓట్లపై ఆధారపడుతున్నారు. అగ్రవర్ణాలు, దళితుల మద్దతుతో గెలవాలని చిరాగ్ ఆ«శిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గయ: జీతన్‌కు పరీక్ష బీజేపీ కిందటిసారి గెలిచిన గయ స్థానాన్ని ఈసారి పొత్తులో భాగంగా జేడీయూకు కేటాయించింది. హెచ్ఏఎం పార్టీ నేత, మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఈ ఎన్నికల్లో జేడీయూ నేత విజయ్ మాంఝీని ఎదుర్కొంటున్నారు. ఇదే సీటులో 2014లో జీతన్‌రాం జేడీయూ టికెట్‌పై పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. అయితే, ఆర్జేడీ కూటమిలో భాగస్వామి కావడంతో ప్రస్తుతం ఆయన బలమైన అభ్యర్థి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జేడీయూ అభ్యర్థి విజయ్ మాంఝీ 1996లో ఇక్కడి నుంచి ఎన్నికైన భగవతీ దేవి కుమారుడు. ఏప్రిల్ 11న ఎన్నిక జరగనుంది. పూర్ణియా: పప్పూతో పోటీ అంత ఈజీ కాదు కిందటి ఎన్నికల్లో బలమైన మోదీ గాలిని తట్టుకుని జేడీయూ గెలిచిన రెండు సీట్లలో ఒకటి పూర్ణియా. అప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ఉదయ్‌సింగ్ అలియాస్ పప్పూసింగ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ తరఫున రంగంలోకి దిగారు. ఈ స్థానంలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు, 30 శాతం ముస్లిం ఓట్లున్న కారణంగా జేడీయూ సిటింగ్ సభ్యుడు సంతోష్‌కుమార్ సింగ్ కుష్వాహా ఎదురీదుతున్నారు. కిందటిసారి కుష్వాహాకు పెద్దసంఖ్యలో పడిన ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు పడే అవకాశముంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఉత్తరాఖండ్: ఆ రెండూ.. గఢ్వాల్: ఇద్దరి గురి బీసీ ఖండూరీపైనే.. ఉత్తరాఖండ్‌లోని ఈ స్థానంలో బీజేపీ మాజీ మంత్రి, ఎంపీ బీసీ ఖండూరీ కొడుకు మనీష్ ఖండూరీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తుండగా, ఖండూరీ శిష్యుడు తీరథ్సింగ్ రావత్‌ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. బీజేపీ టికెట్‌పై ఐదుసార్లు గఢ్వాల్ నుంచి బీసీ ఖండూరీ గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన కొడుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు అభ్యర్థులూ తమకు బీసీ ఖండూరీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 11న భవితవ్యం తేలనుంది. నైనిటాల్–ఉధంసింగ్ నగర్: ‘రావత్’ రాజ్? ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్‌కు కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ స్థానంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2017 ఎన్నికల్లో బీజేపీ 12 గెలుచుకున్నా రాజపుత్ర ఓటర్లలో రావత్‌కు ఉన్న పలుకుబడి కారణంగా భట్ ఎదురీదుతున్నారు. ఇదే వర్గానికి చెందిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ కోషియారీకి టికెట్ ఇవ్వకపోవడంతో రాజపుత్రుల ఓట్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన భట్‌కు పడకపోవచ్చని అంచనా. వచ్చే నెల 11న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
లాల్, నీల్.. కన్హయ్య
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ప్రజా సమస్యలే పోరాట పంథాగా, జనం గొంతుక వినిపించే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడేళ్ల క్రితం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ రూపంలో ఒక నవగళం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడా గళమే మన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం నినదిస్తోంది. ఏళ్లకి ఏళ్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలకే అలవాటుపడిపోయిన ప్రజలకి వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి, అందరి దృష్టిని ఆకర్షించినవాడు కన్హయ్య కుమార్. ఇంటింటి ఉద్యమ కెరటం చిన్నతనం నుంచే వామపక్ష భావజాలం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి ఉండడంతో జేఎన్‌యూలో అంతగా పట్టులేని లెఫ్ట్ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కన్హయ్యకుమార్. విద్యార్థులకు పీహెచ్డీ భృతి తగ్గించడంతో ‘ఆక్యుపై యూజీసీ’ పేరుతో వీధులకెక్కి పోరాడినప్పుడు తొలిసారి ఆయన పేరు అందరికీ తెలిసింది. జేఎన్‌యూలో జాతివ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దేశద్రోహం నేరం కింద అరెస్టయి బయటకి వచ్చాక కన్హయ్యకుమార్ తోటి విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఆయన పేరు ఊరూవాడా మారుమోగింది. ఆ ప్రసంగమే రాజకీయ జీవితానికి పునాది వేసింది. చట్టసభల్లో కొత్త గొంతుకనవుతా.. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు సమ సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్ముతారు కన్హయ్య కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడిరోడ్డుపై నిల్చోబెట్టి ప్రశ్నించాలని అంటారు. అందుకే చట్టసభల్లో కొత్త గొంతుకనవుతానని ఎలుగెత్తి చాటుతున్నారు. 2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరారు. అప్పట్నుంచి జనసంవాద్ కార్యక్రమం ద్వారా 100కిపైగా సమావేశాలు నిర్వహించి జనంలోకి చొచ్చుకెళ్లారు. ఇప్పుడు బిహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గం నుంచి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉద్యమ నేపథ్య కుటుంబం.. బిహార్‌లోని బేగూసరాయిలో అగ్రవర్ణానికి చెందిన భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారు కన్హయ్యకుమార్. తండ్రి జయశంకర్ సింగ్ చాలా ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి అంగన్వాడీ కార్యకర్త. ఒకప్పుడు తల్లిదండ్రులిద్దరూ రైతు హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన కుటుంబం కావడంతో చిన్నప్పట్నుంచి కన్హయ్యకుమార్ ఆలోచనలన్నీ అణగారిన బతుకుల చుట్టూ తిరుగుతుండేవి. వామపక్ష భావజాలానికి ఓట్లు రాల్చే సత్తా లేదని భావించిన కన్హయ్య కుమార్ దేశంలోని దళితులు, వామపక్షాలు కలిస్తేనే సరికొత్త విప్లవం పుట్టుకొస్తుందని ప్రతిపాదిస్తున్నారు. ‘లాల్, నీల్’ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కన్హయ్యకుమార్ విజేతగా నిలుస్తారా ? ఒక ప్రశ్నించే గళం, ఆగ్రహావేశాలు రగిలించే ప్రసంగం నవయువకుల్లో స్ఫూర్తి నింపుతోంది. నేటి తరం ఆయన ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్నారు. ‘‘ కన్హయ్యకుమార్ యువతకి ఆదర్శప్రాయుడు, ఒక హీరో. మోదీనే ఎదురిస్తున్న ధీరుడు. అందులో సందేహం లేదు. కానీ నడి వయసులో వారిని,వయసు మళ్లిన వారిని కన్హయ్య కుమార్ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి‘‘అని బీహార్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి వివాదాస్పదుడైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉంటే, మహాగఠ్ బంధన్‌లో భాగస్వామి అయినప్పటికీ ఆర్జేడీ తన్వీర్ హసన్‌ను పోటీలో నిలిపింది. కన్హయ్య కుమార్ భావజాలం జనసామాన్యంలోకి వెళ్లలేదనే భావనతో ఉన్న ఆర్జేడీ ఎన్నికల గోదాలోకి దిగింది. మహాగఠ్‌బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పట్నుంచే చెప్పలేని స్థితి. కన్హయ్య కుమార్ పక్కా లోకల్ కావడం ఆయనకి కలిసొచ్చే అంశం.. కొత్త గొంతుకల మద్దతు ప్రజాస్వామ్యంలో కొత్త ఉద్యమ కెరటాలైన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటివారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజకీయం రంగు మార్చుకుంది. గత ఏడాది గుజరాత్లో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిపి, వారిని రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం తెలిసిందే. దీనినే కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. జిగ్నేష్ మేవానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెంగుసరాయిలో మీకేం పని ? బిహారీలను తరిమి కొట్టారు. అలా దాడులు చేసిన వారి వెనక ఉండి మీరే ప్రోత్సహించారు. అప్పటి ఉద్రిక్తతలకి మీదే బాధ్యత‘ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మేవానీ గట్టిగానే బదులిచ్చారు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటే, తనను నిందించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. గిరిరాజ్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒక మహా కవి చెప్పినట్టుగా కన్హయ్య కుమార్‌కు కెరటమే ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కన్హయ్య ఎన్నికల్లో గెలిచారా, ఓడారా అన్నది కాదు ముఖ్యం. ఒక కొత్త తరహా రాజకీయాలకు దారి చూపించిన యువకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. -
‘నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే!’
సాక్షి, న్యూఢిల్లీ : ‘రాజకీయాలంటే సమాజంలో అణచివేతకు, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. రాజకీయాలంటే మనల్ని విడదీసే శక్తులకు ఆవల, మనల్ని కలిపే మహత్తర సన్నివేశం కోసం భారత్‌కంటున్న కలను సాకారం చేయడం. రాజకీయాలంటే అభివృద్ధి, ప్రగతిశీల ఆలోచనలు కలిగిన నిజమైన వ్యక్తిత్వ హక్కులు కలిగిన సుందర సమాజం స్థాపించడం కోసం, రాజకీయాలంటే గడచిన ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం కాదు, రానున్న 20 ఏళ్లలో రానున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం, అందుకోసమే నాకు రాజకీయాలు కావాలి’ అని బీహార్‌లోని బేగుసరాయి లోక్‌సభ నియోజక వర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ స్వయంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసుకున్న వ్యాసంలోని ఓ భాగం సారాంశం. ‘అవును నేను ప్రమాదవశాత్తే రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయ వాదినే. కాని ఏ నాడు లోక్‌సభకు పోటీ చేయాలని అనుకోలేదు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తోటి విద్యార్థుల మధ్య లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్థావన వచ్చినప్పుడు మనమూ పోటీ చేస్తే! అనే మాట వచ్చి నవ్వుకునే వాళ్లం. కానీ పోటీ చేయాలని నిజంగా ఎన్నడూ అనుకోలేదు’ అని కుమార్ తెలిపారు. ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారంటూ ‘మార్పిడి చేసిన వీడియో’ ఆధారంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టడం, యూనివర్శిటీ అధికారులు ఆయన్ని కొన్ని రోజులు సస్పెండ్ చేయడం, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆ కేసు విచారణ ముందుకు సాగక పోవడం, ఈ లోగా కుమార్ తన పీహెచ్డీ పూర్తి చేసుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. సీపీఐకి అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) నాయకుడు అవడం వల్ల కన్హయ కుమారు సీపీఐ రాజకీయాల్లోకి వచ్చారు. ‘ నీకు రాజకీయాల పట్ల శ్రద్ధ లేనంత మాత్రాన రాజకీయాలకు నీ పట్ల శ్రద్ధలేదని అనుకోకు–అని గ్రీక్ తత్వవేత్త పెరికల్స్ అన్నట్లు రాజకీయాలే నా పట్ల శ్రద్ధ చూపాయి. అందుకే నేను రాజకీయాల్లోకి రాక తప్పలేదు. నేను ఈ పార్టీకో, ఆ పార్టీకో ప్రత్యామ్నాయమంటూ చెప్పుకోవడానికి రాలేదు.’ ‘ఇప్పుడు మనమంతా ఉచితంగా అందించాల్సిన విద్య గురించి, ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్య సేవల గురించి, వారికి కావాల్సిన సదుపాయాల గురించి ప్రశ్నించాలి. ఒక్క మైనారిటీల గురించో, అణగారిన వర్గాల గురించో మాట్లాడితే సరిపోదు. తాడిత, పీడిత అన్ని వర్గాలతోపాటు హిజ్రాల గురించి, స్వలింగ సంపర్కుల గురించి కూడా ప్రశ్నించాలి. పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష సమానత్వ వ్యవస్థ కోసం పోరాడాలి. దేశానికి ఎదురవుతున్న కొత్త సవాళ్ల గురించి మాట్లాడాలి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరంతోపాటు డిజిటల్ విప్లవం గురించి మాట్లాడాలి. వ్యక్తిగత గోప్యత అవసరం గురించి మాట్లాడాలి. సామాజిక వేదికలపై మనం ఒకటి కావాలి. అంతిమంగా ధనవంతుల జేబుల్లో చిక్కుకున్న రాజకీయ వ్యవస్థను వెలికితీసి పన్ను చెల్లించే సామాన్యుల చేతుల్లో పెట్టేవరకు పోరాడాలి. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’ అంటూ కన్హయ కుమార్ తన రాజకీయ నేపథ్యం గురించి ఆ వ్యాసంలో వివరించారు. -
ప్రచారానికో రూపాయివ్వండి!
కన్హయ్య కుమార్ గుర్తున్నాడా.. దేశ ద్రోహం నేరం కింద 1996లో అరెస్టయిన డిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఇప్పుడాయన బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇతర పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంటే మన కన్హయ్యకు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు లేవట. అందుకే ఒక్కొక్కరు కనీసం ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. ‘బొట్టుబొట్టుతో కుండ నిండినట్టు మీరిచ్చే ఒక్కొక్క రూపాయే నాకు ప్రచారానికి ఉపయోగపడుతుంది’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. తాను గెలిస్తే అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల వాణిని పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇస్తున్నాడు. నిధుల సేకరణ కోసం కన్హయ్య ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను కూడా ప్రారంభించాడు. బెగుసరాయ్ నియోజకవర్గంలో ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో తలపడుతున్నాడు. ‘ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించాలని బిహార్ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయ’మని అంటున్నాడు. విరాళాల సేకరణ ప్రారంభించిన తొలిరోజే రూ. 38 లక్షలు సమకూరాయి. -
కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన లూలూ ప్రసాద్..!
బిహార్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలన్ని కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లనున్నట్లు ఇటీవల ఆయా పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల సీట్ల పంపకాలు శుక్రవారం పూర్తయ్యాయి. ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రకటించారు. కేంద్ర మాజీమంత్రి రాం విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్‌జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. అంతేకాకుండా లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) పార్టీ నేత శరద్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ గుర్తుతో పోటీ చేస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎల్జేడీ కూటమితో కలిసి పని చేస్తుందని మనోజ్ ఝా వివరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కూటమి షాకిచ్చింది. సీట్ల కేటాయింపులో కన్హయ్య పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్జేడీ పోటీ చేసే స్థానాల్లో ఒక సీటును మాత్రమే సీపీఐ(ఎంఎల్)కి కేటాయిస్తామని మనోజ్ ఝా వెల్లడించారు. కాగా ఆయన బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కన్హయ్య అభ్యర్థిత్వానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి ఆర్డేడీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన తన్వీర్ హసన్‌ను అక్కడి నుంచి పోటీచేయించాలని లాలూ ప్రయత్నిస్తున్నారు. బెగూసరయ్‌లో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుందని, గ్రౌండ్‌లెవన్‌లో వామపక్షాలు అంత బలంగా లేరని ఆర్జేడీ భావిస్తోంది. ఇదిలావుండగా కన్హయ్య కుమార్‌ను సీపీఐ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన విషయ తెలిసిందే. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ
పాట్నా : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. అయితే దీనిపై ఆర్జేడీ ఇంకా స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. కన్హయ్య పోటీపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్), వికాస్‌షీల్ ఇసాన్ పార్టీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్ కన్హయ్య కుమార్.. సీపీఐ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య పోటీ చేస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ పాండే మంగళవారం ప్రకటించారు. బిహార్‌లో సీట్లు పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ భేటీ కానుంది. వీరి సమావేశంలో కన్హయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. చిక్కుల్లో కన్హయ్యకుమార్.. కేసు నమోదు! దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన తొలిసారి బరిలో నిలువనున్నారు. ఏప్రిల్ 29న బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. -
చిక్కుల్లో కన్హయ్యకుమార్.. కేసు నమోదు!
పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్ చిక్కుల్లో పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బిహార్‌లోని స్థానిక కోర్టులో ఆయనపై కేసు నమోదైంది. బిహార్‌లోని బెగుసరై నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున తొలిసారి లోక్‌సభకు పోటీచేసేందుకు కన్హయ్యకుమార్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్‌గంజ్‌లోని అంజుమాన్ ఇస్లామియా హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రెచ్చగొట్టే రీతిలో కన్హయ్య వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ టిటు బద్వాల్ స్థానిక కోర్టులో కేసు నమోదు చేశారు. కేసును స్వీకరించిన కోర్టు.. త్వరలోనే వాదనలు విననుంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో దేశద్రోహ నినాదాలు చేశారని అభియోగాలు ఎదుర్కోవడం ద్వారా మూడేళ్ల కిందట కన్హయ్యకుమార్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని సోమవారం దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌తో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖలీద్, అనీర్బన్ బట్టాచార్య పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ వెల్లడించారు. దేశద్రోహం(124ఎ), క్రిమినల్ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) వంటి సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. పాటియాల హౌస్ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. పార్లమెంట్‌పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన వారికి మద్దతుగా జేఎన్‌యూ సహా, దేశ రాజధానిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై మోదీ ప్రభుత్వం కక్ష్యసారింపుగా అభియోగాలు నమోదు చేసిందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా ఘటన జరిగిన మూడేళ్ల తరువాత అభియోగాలు దాఖలు చేయడం గమనార్హం. -
జిగ్నేష్, కన్హయ్యపై సిరా దాడి
గ్వాలియర్: హిందూ సేనల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హిందూ సేన కార్యకర్త ఒకరు సిరాతో దాడికి పాల్పడ్డాడు. గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ సిరా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ‘సంవిధాన్ బచావో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సెమినార్‌కు వెళుతుండగా వీరిపై సిరా చల్లినట్టు వెల్లడించారు. వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ అనే వ్యక్తి ఇంక్ చల్లాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సిరా దాడి జరిగినప్పటికీ జిగ్నేష్, కన్హయ్యకుమార్ సెమినార్లో పాల్గొన్నారని తెలిపారు. ముకేశ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఆదివారం జిగ్నేష్, కన్హయ్యకుమార్ దిష్టిబొమ్మలను తగులబెట్టిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘రాష్ట్రంలో ప్రచారం చేస్తా’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ తరపున ప్రచారం చేస్తానని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తెలిపారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కన్హయ్య కుమార్, కూటమికి సీపీఐ కట్టుబడి ఉందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో కూటమి ఏం లేకపోయినా యువత, విద్యార్థులను కలుపుకొని పోతున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అంతటా ప్రచారం చేస్తానన్నారు. తాను తెలంగాణలో కూటమి విషయాలు మాట్లాడదల్చుకోలేదని, అయితే కుల, మత రాజకీయాలను బద్దలు కొట్టడానికి కచ్చితంగా ఫ్రంట్ అవసరముందని అభిప్రాయపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కన్హయ్య కుమార్ అన్నారు. -
ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్ధితుల్లో ఉంది
-
కన్నయ్య కుమార్ వాహనం మీద దాడి
పాట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడిన వారి గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. కొన్ని రోజుల క్రితం కన్నయ్య మీద ఎయిమ్స్ డాక్టర్, సెక్యూరిటీ గార్డ్ కేసు పెట్టారు. కన్నయ్య తమతో తప్పుగా ప్రవర్తించాడని తమ ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కన్నయ్య వచ్చే ఏడాది ఎన్నికల్లో సీపీఐ తరపున పోటి చేయనున్నారు. -
మోదీని గద్దె దించే సమయమొచ్చింది
అనంతపురం సప్తగిరి సర్కిల్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానిలు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ 29వ జాతీయ మహాసభల సందర్భంగా ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం మహాసభను నిర్వహించారు. ముందుగా ఎస్ఎస్బీఎన్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ఏఐఎస్ఎఫ్ జెండాలతో నిండిపోయాయి. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ అధ్యక్షతన జరిగిన సభలో కన్హయ్య కుమార్ మాట్లాడుతూ దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడిన పౌరులపై అక్రమంగా దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లల్లో నిర్బంధిస్తోందన్నారు. ప్రశ్నించే జర్నలిస్టులు, మేధావులపై హిందుత్వ సంస్థలు దాడులు చేయడమేగాక కొన్ని చోట్ల హత్యలకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. దేశంలో దళితులు, ముస్లింలు, మహిళలు, ఆదివాసీలపై సంఘ్ పరివార్ శ్రేణులు దాడులకు దిగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. హిందుత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో విద్యార్థి నజీబ్‌పై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి వేలాదిమంది విద్యార్థుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. నజీబ్ తల్లి తన కుమారుడి ఆచూకీ తెలపాలని పోరాడుతున్నా పట్టించుకోక పోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమన్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాల్యా, నీరవ్‌మోదీ రక్షించేందుకు యత్నం జిగ్నేష్ మేవాని మాట్లాడుతూ బ్యాంకులను లూటీ చేసి వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వారిని దేశద్రోహులుగా ప్రకటించి జైళ్లల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడేవారిపై దేశద్రోహం కేసులు పెట్టి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కూడు, గూడు, నీరు, విద్య, వైద్యం, ఉపాధి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలను ఏర్పాటు చేసి దాడులు, హత్యలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సామాజిక బాధ్యతగా తీసుకుని ఇలాంటి వాటిపై పోరాటాలు సాగించాలని కోరారు. గ్రామాల్లోని దళితులు, ఆదివాసీలకు ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలియజేసి ప్రజలకు చైతన్యం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదన్నారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఈ ఒప్పందాన్ని హెచ్ఏఎల్కు కాకుండా ఎలాంటి అనుభవం లేని అంబానీ కంపెనీకి కాంట్రాక్టు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కాపలాదారుగా చెప్పుకుంటున్న మోదీ పెద్ద దొంగగా మారారని విమర్శించారు. డీజిల్, పెట్రోలు ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలపై కార్యాచరణ ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, దేశంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి కార్యచరణ రూపొందిస్తామన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బాలికల విభాగం జాతీయ కన్వీనర్ కరంబీర్‌కౌర్, జాతీయ నాయకులు విక్కీమహేసరి, పంకజ్ చౌహాన్, సుఖేష్ సుధాకర్, అమృత, మొహమ్మద్మోబీన్, స్టాలిన్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సుబ్బారావు, జీ రంగన్న, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మధు, కార్యదర్శి జాన్సన్‌బాబు, మనోహర్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఈశ్వరయ్య, లెనిన్‌బాబు, నారాయణస్వామి, వేమయ్య యాదవ్, రాజారెడ్డి, బయన్న, రమణ, సీపీఐ నాయకులు ఎంబీరమణ, జాఫర్, సంజీవప్ప, మల్లికార్జున, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని కేంద్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అరాచకాలను రూపుమాపేందుకు ఏఐఎస్ఎఫ్ బాధ్యత తీసుకోవాలన్నారు. బ్రిటీషు వారిని తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. -
ఎంపీగా కన్నయ్య కుమార్..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ఎంపీగా పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు బిహార్ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్ ప్రకటించారు. సీపీఐ నుంచి ఆయన పోటీ చేస్తారని, దీనికి వామపక్ష పార్టీల మద్దతు తెలిపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్ గతంలోనే ఆయన పేరును ప్రతిపాధించారని, ఆయన సూచన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కన్నయ్య కుమార్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఢిల్లీ పోలీసులు గతంలో దేశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కన్నయ్య కుమార్ ఇదే నియోజవర్గానికి చెందిన భీహాట్ గ్రామ పంచాయతీ చెందినవాడు. కాగా 2014 ఎన్నికల్లో బెగుసరై నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలా సింగ్ 58 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. -
జేఎన్‌యూ తీరు చట్టవిరుద్ధం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్‌యూ అతనిపై విధించిన జరిమానా అక్రమం, అహేతకమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు అతనిపై విధించిన జరిమానాను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ కుమార్‌పై పది వేలు ఫైన్‌తో పాటు, క్రమశిక్షణ ఉల్లంఘనపై జేఎన్‌యూ 2016లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ విచారణ కమిటీ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కన్నయ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్.. విచారణ సంఘం సమర్పించిన నివేదికను తప్పపడుతూ తీర్పును వెలువరించారు. అతనితో పాటు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలపై జేఎన్‌యూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. -
కన్నయ్య కుమార్ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తమపై ఆరోపణలు చేస్తూ యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను, తమకు విధించిన జరిమానాను రద్దు చేయాలని కోరుతూ కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్ విచారించనున్నారు. సీపీఐ విద్యార్థి విభాగానికి చెందిన కన్నయ్య కుమార్, యూనివర్సిటీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలు 2016లో దేశ సమగ్రత దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై యూనివర్సిటీ క్రమశిక్షణ ఉల్లంఘనపై వారికి జరిమానా విధించిన విషయం తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయట వచ్చారు. 1860లో రూపొందించిన చట్టాలతో యూనివర్సిటీ విద్యార్థులను వేధింపులకు గురి చేయడం సరికాదని, విద్యార్థి సంఘాల నేతలు కన్నయ్య కుమార్‌కు మద్దతు ప్రకటించారు. -
'మోదీ సూట్ మాత్రమే మారుతోంది'
కడప: ప్రధానమంత్రి సూట్లు మారుతున్నాయి తప్పితే దేశం స్థితిగతులు మారడం లేదని జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం కడప జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో జీవించే హక్కు ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. ప్రధానికి ఇజ్రాయిల్‌కు వెళ్లడానికి సమయం ఉంది కానీ ఢిల్లీ పక్కనే ఉన్న ఫరీదాబాదు వెళ్లి అక్కడ దళిత బాధితులను పరామర్శించే సమయం లేదు అని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.15 వేలు బ్యాంకుల్లో జమ అవుతాయని మోడీ చెప్పినా అమలులోకి రాలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఏటా 12 వేలమంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అలాంటి వాళ్లను ఆదుకునేందుకు బడ్జెట్ లేదంటారని, పెద్దలకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారని కన్హయ్య విమర్శించారు. -
ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్యకుమార్ తిరిగి ఢిల్లీ యూనివర్సిటీలో కనిపించాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. అహింస పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొల్పాలని శాంతియుత పరిస్థితులు ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క, ఏబీవీపీ విద్యార్థులు కన్నయ్య కుమార్ గోబ్యాక్ అంటూ ప్రతి నినాదాలతో హోరెత్తించారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థుల మధ్య ఈ నెల 22న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీలో వివాదం రగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఏబీవీపీకి వ్యతిరేకంగా వివిధ కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, టీచర్లు ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఏబీవీపీ తన ఆగడాల ఆపేయాలంటూ మండిపడ్డారు. ఈ ర్యాలీలోనే కన్నయ్య పాల్గొన్నాడు. -
వర్శిటీలో 3 వేల కండోమ్‌లు కనుగొన్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మరోసారి వర్శిటీ అధికారులు, బీజేపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టాడు. విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమై చాలా రోజులు కావస్తున్నా అతని ఆచూకీ కనుకోలేదని విమర్శించాడు. అయితే జేఎన్‌యూలో ఎన్ని కండోమ్‌లు ఉన్నాయో తెలుసుకోగలిగారంటూ ఎద్దేవా చేశాడు. దేశద్రోహం కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కన్హయ్య ‘ఫ్రమ్ బిహార్ టు తిహార్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కన్హయ్య వర్శిటీ అధికారులు, బీజేపీ నేతల తీరును ఎండగట్టాడు. ‘జేఎన్‌యూలో రోజుకు 3 వేల బీర్లు, 2 వేల మద్యం బాటిళ్లు, 10 వేల సిగరెట్లు, 4 వేల బీడీలు, 50 వేల లెగ్ పీసులు, 2 వేల చిప్స్ పాకెట్లు, 3 వేల కండోమ్‌లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు వాడుతారు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కన్హయ్య ప్రస్తావించాడు. అక్టోబర్ 14న వర్శిటీ హాస్టల్లో జరిగిన గొడవ తర్వాత నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడని, అధికారులు ఇప్పటి వరకూ ఆచూకీ తెలుసుకోలేకపోయారని విమర్శించాడు. నజీబ్ అదృశ్య ఘటనపై విద్యార్థులు నిరసన తెలియజేశారు. -
కన్నయ్య కుమార్‌కు చేదు అనుభవం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఓ సెమినార్లో పాల్గొన్న కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా శ్రోతలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేయడంతో కన్నయ్యపై అక్కడివారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. దేశంలో ప్రజలు వీధుల్లో, జైళ్లలో ఉంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నారంటూ కన్నయ్య విమర్శలు ఎక్కుపెట్టాడు. దేశంలో 65 శాతం యువత ఉండగా.. 65 ఏళ్ల వ్యక్తి వారికి నాయకుడిగా ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో అక్కడివారు కన్హయ్య ప్రసంగానికి అడ్డుపడటంతో 'దేశంలో స్వేచ్ఛ ఉంది. ఇలా అడ్డు తగులుతున్న మీపై ఎవరూ దేశ ద్రోహం కేసు నమోదు చేయరు' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. -
కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు. -
..అలాగైతే మేం దేశద్రోహులమే : కన్హయ్య
దేశంలో మోదీస్వామ్యం: కన్హయ్య కుమార్ * అణగారిన వర్గాల గురించి గళం విప్పుతుంటే మాపై జాతి వ్యతిరేక ముద్ర * బీఫ్ తినే వారిపై జంతు సంరక్షణ పేరుతో దాడులు, హత్యలు * వర్సిటీల్లో వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం కోసం కృషి * హైదరాబాద్‌లో ‘థీమాటిక్ సోషల్ ఫోరం’ వర్క్‌షాప్ ప్రారంభం * వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థి నేతల హాజరు సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని వ్యతిరేకించడమే దేశద్రోహమైతే తామంతా దేశద్రోహులమేనని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. ప్రధాని పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పతనమై మోదీస్వామ్యం నడుస్తోందని... మహిళలు, దళితులు, ముస్లింల అణచివేత విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో (ఆర్టీసీ కల్యాణ మండపంలో) ప్రారంభమైన రెండ్రోజుల వర్క్‌షాప్ (డిగ్నిటీ, డైవర్సిటీ, డెమోక్రసీపై)లో, విలేకరుల సమావేశంలో కన్హయ్య ఇదే అంశంపై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే ప్రయత్నం చే స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారినవర్గాల గురించి గళం విప్పే వాళ్లందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, కానీ తాము ఆ ‘బిరుదు’ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిండి విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేని పరిస్థితి దేశంలో నెలకొందని విమర్శించారు. చనిపోయిన జంతువుల కోసం కొందరు మనుషుల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తినడం ఒక ఆహారపు అలవాటు అని, ప్రపంచంలోని అనేక దేశాల్లో బీఫ్ తింటున్నా దేశంలో మాత్రం ధర్మం, జంతు సంరక్షణ పేరుతో బీఫ్ తినే వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. హెచ్‌సీయూ పరిస్థితుల్లో మార్పు రాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని కన్హయ్య పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతి వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తెచ్చేలా కృషి చే యాలన్నారు. హెచ్‌సీయూలో మీడియానూ అడ్డుకుంటున్నారని, రోహిత్ ఆత్మహత్య తరువాత కూడా వర్సిటీలోని పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. విద్యావ్యవస్థలో అవినీతి దేశవ్యాప్తంగా ఉందని, ఎంసెట్-2 పేపర్ లీకేజీ అందులో భాగమేనని కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయకపోవడం మన వ్యవస్థలోని అసమానత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎందరో వివక్ష ఎదుర్కొంటున్నారు: రాధిక వేముల అంతకుముందు థీమాటిక్ సోషల్ ఫోరం కార్యక్రమాన్ని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రారంభిస్తూ దేశంలో తన కొడుకు లాంటి బిడ్డలెందరో వివక్ష ఎదుర్కొంటున్నారని, వారందరి పక్షాన పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. కార్యక్రమానికి మోహన్ ధరావత్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే తదితరులు ప్రసంగించారు. కశ్మీర్ లోయలో ఇటీవలి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, రోహిత్ వేముల, ఇతర అమరవీరులకు సభ నివాళులర్పించి రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. హిందుత్వ శక్తుల నుంచి వివక్ష: రిచాశర్మ మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను హిందుత్వ శక్తులు వివక్షకు, అణచివేతకు గురిచేస్తున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం తొలి అధ్యక్షురాలు రిచాశర్మ విమర్శించారు. ఇదే జాతీయతైతే దాన్ని ప్రతిఘటించడానికి తామంతా సిద్ధమన్నారు. ఐశ్వర్యం, అధికారంకన్నా స్వాభిమానం కోసమే పోరాటమని చాటిన అంబేడ్కర్ ఆదర్శాల దారిలో తమ ఉద్యమ ప్రస్థానం సాగుతోందని హెచ్‌సీయూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంత ప్రశాంత్ పేర్కొన్నారు. దేశంలో వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు, వెలివాడల మధ్య సమరం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు సుధాన్యాపాల్, పుణే ఫిల్మ్ యూనివర్సిటీ విద్యార్థి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫీతో మళ్లీ హల్చల్ చేస్తోన్న మానస్ జ్యోతి
పుణె: బీజేపీ చీఫ్ అమిత్ షాతో మానస్ జ్యోతి డేకా దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాషాయ పార్టీకి వీరాభిమానినని చెప్పుకునే మానస్ జ్యోతి గతంలో విమానంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే మానస్ కు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు అప్పట్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఆదివారం పుణేకి వచ్చిన అమిత్ షాతో సెల్ఫీ దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మానస్ మరోసారి తాను బీజేపీ వీరాభిమానినని చెప్పుకున్నాడు. దీంతో కన్హయ్య అభిమానులేకాక చాలామంది నెటిజన్లు విమానంలో దాడివెనుక బీజేపీ హస్తం ఉందని నమ్ముతున్నట్లు కామెంట్లు రాశారు. (చదవండి: విమానంలో కన్హయ్యపై దాడి!) దివంగత కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ దారశనికతపై ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం పుణె వచ్చిన అమిత్ షాను మానస్ జ్యోతి బృందం కలుసుకుంది. అసోమీ యూత్ బృందానికి ప్రాతినిథ్యం వహిస్తూ షాను కలుసుకున్న మానస్.. సెల్పీ దిగి వెళ్లిపోయాడేగానీ మహాజన్ కార్యక్రమంలో పానకపోవడం గమనార్హం. -
కన్హయ్య కుమార్ కు ఊరట
న్యూఢిల్లీ: జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కన్హయ్యతో పాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఇతరులపై జేఎన్ యూ విధించిన క్రమశిక్షణ చర్యలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ మన్ మోహన్ గవే షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తమపై నమ్మకముంటే జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించింది. ఎటువంటి సమ్మెలు, ధర్నాలకు దిగొద్దని కోరింది. క్రమశిక్షణ ఉల్లఘించారనే ఆరోపణలతో కన్హయ్యకు రూ.10 వేలు, ఖలీద్, భట్టాచార్యలకు రూ. 20 వేలు చొప్పున జేఎన్ యూ అధికారులు జరిమానా విధించారు. దీంతో వీరంతా ఆందోళనకు దిగారు. -
నల్లజెండా చూపినందుకు పొట్టుపొట్టుగా కొట్టారు
పట్నాలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఉపన్యాస కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. కన్హయ్య ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి లేచి నల్లజెండాతో నిరసన తెలిపాడు. దీంతో కన్హయ్య మద్దతుదారులు అతనిపై విరుచుకుపడ్డారు. అతని చొక్కా చింపేసి.. చితకబాదారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసన తెలిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 'దేశద్రోహం' ఆరోపణలతో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన కన్హయ్యకుమార్ రెండురోజుల పర్యటన కోసం స్వరాష్ట్రం బిహార్ వచ్చిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిశారు. ఆదివారం పట్నాలో 'ఆజాదీ' (స్వేచ్ఛ) అంశంపై ఆయన ఉపన్యాసించారు. WATCH: Kanhaiya Kumar's supporters beat up man after he showed black flag to Kanhaiya during his speech in Patnahttps://t.co/2nrmG3pMHK — ANI (@ANI_news) May 1, 2016 -
తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య
పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్‌లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. -
మరో సంచలనానికి కన్హయ్య రెడీ
న్యూఢిల్లీ: జాతీయవాదం, స్వేచ్ఛవాదంపై జాతీయస్థాయిలో తీవ్రమైన చర్చకు కారకుడైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. తనకెదురైన అనుభవాలను అక్షర బద్ధం చేయనున్నాడు. తన జీవితానుభవాలను పుస్తకంగా తీసుకురానున్నాడు. స్కూల్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ దాకా సాగిన ప్రయాణం గురించి ఇందులో పొందుపరచనున్నాడు. బిహార్ నుంచి తీహార్ వరకు తన జీవితంలో జరిగిన ఘటనలను పుస్తకంలో రాయనున్నాడు. బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థి రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు. 'వ్యక్తులను చంపగలరు కానీ వాళ్ల ఆశయాలను చంపలేరని భగత్ సింగ్ అన్నారు. మేం చేస్తున్న పోరాటం మమ్మల్ని ఎక్కడివరకు తీసుకెళుతుందో తెలియదు. కానీ మా ఆశయాలు పుస్తక రూపంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నామ'ని 28 ఏళ్ల కన్హయ్య కుమార్ అన్నాడు. తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతున్న వైరుధ్యాలను, యువత ఆశ-నిరాశలు, పోరాటాల గురించి రాస్తానని చెప్పాడు. అతడి పుస్తకాన్ని జాగర్ నట్ ప్రచురించనుంది. -
ఫైన్ కట్టే ప్రసక్తేలేదు... నిరవధిక దీక్ష చేస్తాం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ విద్యార్థినేత కన్హయ్యకుమార్కు రూ.10 వేల జరిమానా విధించిన విషయంతెలిసిందే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. అయితే తాము జరిమానా కట్టే ప్రసక్తేలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ఖాళీచేసి వెళ్లనున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు రద్దుచేయాలంటూ నిరసనగా బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్ మీడియాకు వివరించారు. తమపై జరుగుతున్న విధానాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు జరిమానా విధించడంతో పాటు, ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కారణంగా ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు సోమవారం నాడు బహిష్కరించింది. -
కన్హయ్యకు జరిమానా
ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్ న్యూఢిల్లీ: ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రూ.10 వేల జరిమానా విధించింది. ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంపై దర్యాప్తు జరిపేందుకు వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగులు తదితరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఈ మేరకు ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు బహిష్కరించింది. జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కోర్సు చేయకుండా భట్టాచార్యపై నిషేధం విధించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. మొత్తంగా 14 మందిపై జరిమానా విధించింది. అయితే పరిపాలన శాఖ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాగా, క్యాంపస్‌లో నిరసన కార్యక్రమ వీడియో ఫుటేజీల్లో మార్పులు చేసి మూడు న్యూస్ చానళ్లు ప్రసారం చేశాయని, వాటిపై విచారణ జరపాలని కోర్టును ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
'మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామంటున్నారు'
'ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ చాలా హామీలే గుప్పించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, అచ్చెదిన్ (మంచిరోజులు) తీసుకొస్తానని ఇలా చాలా విషయాలే చెప్పారు. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు'.. ప్రధాని మోదీపై మిత్రపక్షం శివసేన విసిరిన వ్యంగ్యాస్త్రాలివి. శివసేన అధికార పత్రిక 'సామ్నా' ప్రధాని మోదీ టార్గెట్ గా ఓ సంపాదకీయాన్ని వెలువరించింది. మోదీ వైఫల్యం వల్లే జెఎన్ యూ విద్యార్థి నేత అయిన కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మండిపడింది. పాత వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్ లో ప్రధానిని అమ్మేస్తామని కన్హయ్య లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని, ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాకూడదని పేర్కొంది. కన్హయ్య లాంటి నేతలకు బీజేపీ ఊపిరి అందిస్తున్నదని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగాలని సూచించింది. కన్హయ్యపై జెట్ విమానంలో హత్యాయత్నం జరిగిందన్న వార్తల నేపథ్యంలో అతనిపై దేశద్రోహి ముద్ర వేసి ప్రచారం చేయడం ఎంతమాత్రం సబబు కాదని బీజేపీని ఉద్దేశించి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
'పబ్లిసిటీ కోసమే హత్యారోపణలు చేశాడు'
జెఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ పబ్లిసిటీ కోసమే హత్యాయత్నం జరిగిందంటూ ఆరోపణలు చేశాడని నిందితుడైన సహా ప్రయాణికుడు తెలిపాడు. ముంబై-పుణె జెట్ ఎయిర్వేస్ విమానంలో తనపై సహా ప్రయాణికుడు హత్యాయత్నం చేశాడని కన్హయ్యకుమార్ ట్విట్టర్లో తెలిపిన సంగతి తెలిసిందే. తనపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి తెలియజేయడంతో వారు తనని, దాడి చేసిన వ్యక్తిని కిందకు దింపేశారని వెల్లడించాడు. కన్హయ్యపై హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సహా ప్రయాణికుడిని మానస్ జ్యోతి దేక (33)గా గుర్తించారు. అతడు పుణెలోని టీసీఎస్ పనిచేస్తున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, మానస్ కన్హయ్య ఆరోపణలను తోసిపుచ్చాడు. పబ్లిసిటీ స్టంట్ కోసమే అతను చౌవుకబారు ఆరోపణలు చేస్తున్నాడని, తన కాలికి గాయం కావడంతో విమానంలో నిలబడేటప్పుడు బ్యాలెన్స్ కోసమే అతన్ని పట్టుకున్నానని, కన్హయ్య వ్యక్తిగతంగా కూడా తనకు తెలియదని చెప్పాడు. అతని ఫొటోలు మాత్రమే చూశానని, అంతేకానీ అతన్ని గుర్తుపట్టేలేనని మానస్ వివరణ ఇచ్చాడు. -
కన్హయ్య కుమార్ పై హత్యాయత్నం
ముంబై: జెట్ ఎయిర్ వేస్ విమానంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ వెల్లడించారు. తన గొంతు నులిమేందుకు దుండుగుడు ప్రయత్నించాడని అతడు ఆరోపించాడు. ముంబై-పుణే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానం దిగిపోవాలని తమపై సిబ్బంది ఒత్తిడి చేశారని కన్హయ్య కుమార్ తెలిపాడు. తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తిపై జెట్ ఎయిర్ వేస్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. కన్హయ్యపై దాడికి యత్నించిన సహ ప్రయాణికుడిని మనాస్ జ్యోతి డేకాగా గుర్తించినట్టు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. భద్రతా కారణాలతో కొంతమంది ప్రయాణికులను ముంబై ఎయిర్ పోర్టులో దించేశామని వెల్లడించింది. -
'కన్హయ్యకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత'
హైదరాబాద్ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఏదైనా జరిగితే అందుకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం- ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్‌పరివార్ దాడులు పరిపాటిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్‌లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ మొదలు పూణే వరకు అడుగడుగునా కన్హయ్య సభలకు ఆటంకాలు కల్పిస్తూ అల్లర్లు సృష్టిస్తున్న తీరును ఖండించారు. ఇపుడు ఏకంగా తుపాకులు, తూటాలతో బెదిరింపులు చేస్తున్నారని.. ఢిల్లీ జేఎన్‌యూ బస్‌లో తుపాకులు, తూటాలున్న సంచితో పాటు కన్హయ్యను హత మారుస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ పోలీసులకు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ కు భద్రత పెంపు
న్యూఢిల్లీ : నాగపూర్‌లో దాడి నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్లకు ప్రభుత్వం భద్రతను పెంచింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రసంగిస్తున్న వారిపై చెప్పులు, బూట్లతో ప్రజలు దాడిచేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్య కుమార్ కారును నాగపూర్ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దాంతో పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్హయ్య, ఉమర్ ఖలీద్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. -
కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి
నాగ్‌పూర్: నాగ్ పూర్ ర్యాలీ రసాభాసగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీలో చెప్పులు, బూట్లు గాల్లోకి లేచాయి. కుప్పలుగా కొందరు వ్యక్తులు కన్హయ్య కుమార్ పై చెప్పులు, షూలతో దాడి చేశారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు తొలుత కన్హయ్య వచ్చాడు. అలా వచ్చాడో లేదో వెంటనే ఒక్కసారిగా చెప్పులు, షూలు అతడిపైకి కొందరు వ్యక్తులు విసిరారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెప్పులు విసరడం ద్వారా ఎలాంటి దేశభక్తిని చూపించాలని అనుకుంటున్నారని కన్హయ్య కుమార్ ఈ సందర్భంగా వారిని ప్రశ్నించాడు. అంతకుముందు నాగ్ పూర్ లోకి ప్రవేశించగానే కన్హయ్య కుమార్ కారుపై బజరంగ్ దళ్ కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
కన్హయ్యను అరెస్ట్ చేయొద్దని చెప్పా: కేసీఆర్
హైదరాబాద్ : హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన బాధ కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం మధ్యాహ్నం ఆయన తెలంగాణ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రోహిత్ దళితుడా కాదా అన్నది ప్రశ్నకాదని అన్నారు. వర్శిటీలు కక్షలు, కార్పణ్యాలకు వేదిక కాకూడదని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వివక్షకు వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని ఆయన సూచించారు. హెచ్‌సీయూలో వాటర్, కరెంట్ సరఫరా నిలిపివేసి, విద్యార్థుల మెస్‌లు మూసివేయటం సరికాదన్నారు. ఇక జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పర్యటనను అడ్డుకోవద్దని తానే స్వయంగా డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని అరెస్ట్ చేయవద్దని తానే చెప్పానన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ భావాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అందుకనే హెచ్‌సీయూ వద్ద కన్నయ్యను పోలీసులు అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అయితే హెచ్‌సీయూ భద్రతా సిబ్బది కూడా ఖాకీ డ్రస్ వేసుకుంటారని చెప్పారు. కన్హయ్య కుమార్‌ను పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించినప్పటికీ వర్సిటీ సిబ్బంది అతడిని వీసీ అప్పారావు ఆదేశాల మేరకే అడ్డుకున్నారన్నారు. తర్వాత రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వాలని తాను చెప్పానని ఆ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొన్నారని, అక్కడ కూడా పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించలేదని కేసీఆర్ తెలిపారు. ఇక వీసీ అప్పారావును రీకాల్ చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదన్నారు కేసీఆర్. హెచ్‌సీయూ భౌగోళికంగా హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఆయన అన్నారు. హెచ్‌సీయూ ఘటనలపై తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు ఆయన సభలో హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే లాఠీఛార్జ్ ఘటనలో పోలీసుల అత్యుత్సహం ఉంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఇక ఓయూలో వ్యక్తి ఆత్మహత్యపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. ఈ అంశాలపై సభ్యులు ఇచ్చిన సలహాలు,సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డారయి. కాగా ఈ నెల 31న తెలంగాణ అసెంబ్లీలో ఒకపూట విద్యపై సమగ్రంగా చర్చ జరగనుంది. -
'దెబ్బలు తినటమే కాదు.. తిరిగి కొట్టడానికి సిద్ధమే'
విజయవాడ : త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయి కానుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలసి కె నారాయణ విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అక్కడ స్థానిక ప్రజలు స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ, అసోంలలో బీజేపీ పరిస్థితి పైన పటారం, లోన లొటారంలా ఉందని వ్యాఖ్యానించారు. మతోన్మాద పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఆ పార్టీ నాయకత్వం దాడులకు పూనుకుంటోందని ఆరోపించారు. వామపక్షాలు ప్రధాన శత్రువుగా తయారవుతున్నాయనే దాడులు చేయిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అయితే, దెబ్బలు తినటానికి కాదు.. తిరిగి కొట్టడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చివరికి విద్యార్థులుపైన కూడా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలపై దృష్టి పెట్టిన విద్యార్థి సంస్థ ఏబీవీపీ.... తన ప్రాబల్యం పెంచటానికి ఇతర సంఘాలపై దాడులు చేస్తోందని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ వాస్తవాలు చెబుతుంటే... ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కన్నయ్యపై దాడులకు ఢిల్లీ నుంచే పథకం రచిస్తున్నారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు నియామకం కూడా కుట్ర పూరితమేనన్నారు. అమరావతి డిజైన్ చేసిన వారికి లక్ష డాలర్లు ఇవ్వటం సమంజసం కాదని రామకృష్ణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన చేస్తున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఇసుక దందా జరుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. -
'జానెడెత్తు కన్హయ్యకు భయపడుతున్నారు'
విజయవాడ: 'జానెడెత్తు కన్హయ్యకు ఆరడుగుల ప్రధాని మోదీ భయపడుతున్నారని' సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ...దేశంలో బీజేపీ నేతలు హిట్లర్‌ను మించిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తలపెట్టిన కన్హయ్య కుమార్ సభకు అనుమతి రాకుండా వెంకయ్య శిష్యులే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. వెంకయ్య ఎక్కడా సభలు పెట్టరా..? అని ప్రశ్నించారు. ఇక నుంచి వెంకయ్య నాయుడు సభలకు ప్యాంట్ వేసుకుని రావాలని సూచించారు. కాగా విజయవాడలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేపట్టిన సభ ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ చేరుకున్న కన్హయ్యను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
దేశంలో మంచిరోజులు కనిపించడంలేదు: కన్హయ్య
విజయవాడ : వేముల రోహిత్ పోరాటాన్ని తాము కొనసాగిస్తామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో గురువారం జరిగిన యువజన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ... ఈ దేశంలో మంచిరోజులు కరువయ్యాయి. దళితులకు రక్షణ లేకుండా పోయింది. చదువు కోసం దళితుడు పోరాటం చేయాల్సి వస్తోంది. రోహిత్ చట్టం కోసం పోరాటం చేస్తాం. దేశాన్ని హిందూ రాజ్యం చేస్తామంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులో మాట చెబుతారు కానీ, ప్రజల మనసులో మాట వినరు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. నల్లధనం తెస్తామన్నారు. అది ఏమైంది? ఓ వైపు నిత్యావసర ధరలు మండిపోతుంటే...బుల్లెట్ ట్రయిన్ తెస్తామంటున్నారు. ఇప్పుడు అభివృద్ధిని వదిలేసి మందిర నిర్మాణం అంటున్నారు. పేదల సబ్సిడీలు తగ్గించి పెద్దోళ్లకు రాయితీలు ఇస్తున్నారు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను దోపిడీ చేసే యత్నం చేశారు. నేతల సొమ్ముతో కాదు.. జేఎన్‌యూ ఈ దేశ ప్రజల డబ్బుతో నడుస్తోంది' అని అన్నారు. -
కన్హయ్య రాక.. బీజేపీ కాక
కృష్ణా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రాకతో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్య అక్కడ నుంచి నేరుగా ఐవీ ప్యాలెస్ సభస్థలికి చేరుకున్నారు. అయితే దేశ ద్రోహం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కన్హయ్య రాకను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలువురు బీజేపీ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా హైదరాబాద్ లో ఈ రోజు(గురువారం) ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల్లో అలజడికి బాధ్యులెవరు?
రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిపోయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైస్ చాన్సలర్ అప్పారావు రాక ఒక్కసారిగా అలజడి రేపింది. అప్పారావుకు వ్యతిరేకంగా, అనుకూలంగా క్యాంపస్‌లో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితుల్లో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ రాక పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. రోహిత్ వేముల విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు దాఖలైన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి విముక్తం కాకముందే, కేసులో క్లీన్ చిట్ లభించక ముందే అప్పారావు మళ్లీ వీసీ కుర్చీలో కూర్చోవడంతో అలజడి చెలరేగింది. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కృషిచేయాల్సిన పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ఉద్రిక్తత తీవ్రమవుతోంది. విద్యార్థులను చితక్కొట్టారు, క్యాంపస్‌లో మెస్‌ను మూసేశారు... విద్యుత్ సరఫరా కట్ చేశారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆఖరికి మీడియాను కూడా అనుమతించడంలేదు. బుధవారం జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ను కూడా అనుమతించలేదు. అప్పారావును మళ్లీ బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతించడం అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్న మాట. పార్టీ చేపట్టిన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నదన్న విషయం స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో మోదీ ప్రభుత్వం రేపిన చిచ్చు ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకో, జేఎన్‌యూకో పరిమితం కాలేదు. పూణెలోని 'ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా', మద్రాస్ యూనివర్సిటీల్లోనూ చిచ్చు రేపింది. ఈ చిచ్చు ప్రస్తుతానికి స్థానిక పరిణామాలకే పరిమితం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి కనుక జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపనుంది. - ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
కన్హయ్యపై చెప్పులు విసిరిన యువకులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశం రసాభాసగా మారింది. కన్హయ్య తన ప్రసంగం మొదలుపెట్టబోతుండగానే అతడి వ్యతిరేకులలో 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ కన్హయ్యపై చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. వాళ్లను ఏమీ అనొద్దని, ఊరుకొమ్మని కన్హయ్య కుమార్ చెబుతున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే, కావాలనే ఈ సమావేశానని రసాభాస చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ అన్నారు. దీనిపై ఆ తర్వాత ప్రసంగించిన కన్హయ్య కూడా స్పందించాడు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారని, కానీ చెప్పులు, రాళ్లు విసిరితే ప్రయోజనం ఉండదని చెప్పాడు. ఈ రోజు తన మీద చెప్పులు విసిరిన వాళ్ల మీద గానీ, నిన్న తనను కొట్టినవాళ్ల మీద గానీ తనకు ఏమాత్రం కోపం లేదని.. వాళ్ల వల్ల తనకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. చివరకు తనను జైలుకు పంపినవారి మీద కూడా ఎలాంటి కోపం లేదని అన్నాడు. రాళ్లు, చెప్పులు మీమీదే వేసుకుంటున్నారని రేపు మీకు అర్థం అవుతుందని తెలిపాడు. -
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై దాడి: కన్హయ్య
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక సీరియస్ దాడి జరుగుతోందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నాడు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గురువారం ఉదయం కన్హయ్య మీడియాతో మాట్లాడాడు. తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు. తాను హెచ్సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. -
'కన్హయ్య యుద్ధం చేయడానికి రాలేదు'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ యుద్ధం చేయడానికి రాలేదని, రోహిత్ వేముల తల్లిని పరామర్శించడానికి వచ్చారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ అన్నారు. కన్హయ్యను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని నారాయణ విమర్శించారు. హెచ్‌సీయూలోకి వెళ్లకుండా కన్హయ్యను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. కన్హయ్యను అడ్డుకునేందుకే హెచ్‌సీయూ వీసీ అప్పారావును మళ్లీ వెనక్కి రప్పించారని ఆరోపించారు. కేంద్రానికి, సంఘ్ శక్తులకు బుద్ధి చెబుతామని నారాయణ హెచ్చరించారు. యూనివర్సిటీలను పోలీసు క్యాంపులుగా మార్చారని విమర్శించారు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రోహిత్ తల్లి రాధికతో కలసి హెచ్సీయూకు వచ్చిన కన్హయ్యను పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూలోకి వెళ్లకుండా గేటు బయటే కన్హయ్య వాహనాన్ని ఆపివేశారు. క్యాంపస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. -
ఎంతమంది రోహిత్‌లను చంపుతారు: కన్హయ్య
హైదరాబాద్ : లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్‌సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు. తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్‌లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి కన్హయ్య కుమార్ హెచ్సీయూకు వచ్చారు. కాగా తాము కన్హయ్య కుమార్ ను తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వీసీ అప్పారావు ఆదేశాల మేరకు వర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. -
వెళ్లి తీరుతా, అనుమతించే ప్రసక్తే లేదు..
హైదరాబాద్ : హెచ్ సీయూ మరోసారి అట్టుడుకుతోంది. ఓవైపు వర్సిటీలోకి వెళ్లితీరుతానంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, మరోవైపు అతడిని క్యాంపస్‌లోకి అనుమతించేది లేదని పోలీసులు ...ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా కన్హయ్య కుమార్‌ను లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. అయితే కన్హయ్యను వర్సిటీలోకి అనుమతించకుంటే తామే బయటకు వచ్చి సభ నిర్వహించుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. అంతకు ముందు హాస్టల్లో వంట చేసుకుంటున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు, ఇంటర్నెట్, వర్శిటీ క్యాంటిన్లు ఇలా అన్నింటిని మూసేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా అంతకు ముందు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.... పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కన్హయ... రోహిత్‌లా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. హెచ్సీయూకు వెళ్లి, అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు చెప్పారు. వర్సిటీలో హింసకు వీసీ అప్పారావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మరో వర్సిటీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లం కాదని, కట్టుబడి ఉండేవాళ్లమని కన్హయ్య తెలిపారు. కాగా కొండాపూర్‌లోని సీఆర్ పౌండేషన్లో ఉన్న రోహిత్ తల్లి రాధికను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు బయల్దేరారు. కాగా హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను తక్షణమే పంపించివేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత
జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకుమార్ హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతడికి పలువురు విద్యార్థులతో పాటు సీపీఐ నేత నారాయణ స్వాగతం పలికారు. తాను ముందుగా రోహిత్ తల్లిని, అతడి సోదరుడిని కలుస్తానని, సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బహిరంగ సభకు హాజరై అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తానని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కన్హయ్య చెప్పాడు. పోలీసులు అనుమతిస్తారనే నమ్మకం తనకు ఉందని, విద్యార్థులకు సమావేశం ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని తెలిపాడు. క్యాంపస్‌లో సామాజిక న్యాయం కోసం, రోహిత్ ఆత్మకు శాంతి కలగడానికి, అతడి కలను నెరవేర్చడానికి ఉద్యమం కొనసాగించడం తన లక్ష్యమని అన్నాడు. కన్హయ్య సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దాంతో అతడిని అరెస్టు చేస్తారన్న అనుమానాలు తలెత్తినా, అలాంటి ఉద్దేశం ఏదీ లేదని విమానాశ్రయంలో ఉన్న పోలీసులు చెప్పారు. అయితే, అసలు కన్హయ్యను హెచ్‌సీయూలోకి అనుమతిస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. మరోవైపు దీక్ష చేస్తానని చెబుతున్న రోహిత్ తల్లిని కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోకి రానిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు కూడా కఠినమైన చర్యల దిశగా వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనివర్సిటీకి సంబంధించినవాళ్లు తప్ప మీడియా, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మెయిన్ గేటు తప్ప అన్నింటినీ మూసేస్తామని అందులో తెలిపారు. తగిన భద్రత కల్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే హెచ్‌సీయూ ప్రాంగణం మొత్తం పోలీసు పహరాతో కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక వ్యక్తి ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని పోలీసులు భావిస్తే అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం లాంటివి ఇంతకుముందు జరిగాయి. ఇప్పుడు కూడా కన్హయ్య విషయంలో పోలీసులు అలాగే చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం గట్టి పట్టుదలతోనే కనిపిస్తున్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ ప్రాంగణంలోనే సభ నిర్వహించుకుంటామని, తమకు వేరే వేదిక ఏమీ లేదని నాయకులు బుధవారం ఉదయం కూడా స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో మళ్లీ వీసీ అప్పారావు ప్రవేశించడం వల్లే ఉద్రిక్తతలు చెలరేగాయని వాళ్లు ఆరోపించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు బుధవారం ఉదయం యూనివర్సిటీ గేటు వరకు వెళ్లి అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించారు. గతంలో ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కూడా యూనివర్సిటీ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. -
రాహుల్‌తో కన్హయ్య కుమార్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం రాహుల్ గాంధీకి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కన్హయ్య సందర్శించనున్న నేపథ్యంలో రాహుల్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హెచ్‌సీయూ, జేఎన్‌యూ విద్యార్థులకు రాహుల్ మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన కన్హయ్య.. రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లిని కన్హయ్య పరామర్శించనున్నారు. హెచ్‌సీయూలో రోహిత్ స్నేహితులను కలవనున్నారు. కాగా వర్సిటీలో ప్రవేశానికి కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు అనుమతి నిరాకరించారు. -
కృష్ణయ్య, కన్హయ్యా ఇద్దరూ అవసరమే..
న్యూఢిల్లీ: భారత్ మాతాకీ జై నినాదం ఉచ్ఛరిస్తేనే దేశభక్తి ఉన్నట్లు కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. తాను మాత్రం భారత్ మాతా కీ జై అనేందుకు సంతోషిస్తానని, ఇతరులు కూడా అనాలని కోరుకుంటానని ఆయన అన్నారు. జేఎన్ యు ఘటన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన శశిథరూర్.. రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చిందని, భారత్ అంటే.. కేవలం, హిందీ, హిందు, హిందుస్థాన్ మాత్రమే కాదన్నారు. ప్రజలు తాము నమ్మిన సిద్ధాంతాన్ని హక్కుగా భావించడంతోపాటు... ప్రజాస్వామ్యంలో ఇతరుల నమ్మకాలను గౌరవించాల్సిన సహనం అవసరం అని శశిథరూర్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన జేఎన్ యు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మన దేశం అంటే కేవలం హిందీ, హిందు, హిందుస్థాన్ మాత్రమే కాదని, మరింత వైవిధ్యాన్ని అంగీకరించడం దేశంలో చారిత్రక సంప్రదాయంగా వస్తోందని అన్నారు. మనకు కృష్ణయ్యా, కన్హయ్య ఇద్దరూ అవసరమేనన్నారు. భవిష్యత్తులో భారత భూభాగంలో నివసించే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు థరూర్ తెలిపారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారంటూ దేశద్రోహం కేసులో ముగ్గురు విద్యార్థులు అరెస్టయి, ఇటీవల నిరసనలకు కేంద్రంగా మారిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయం బయట 'జేఎన్ యు, నేషనలిజం' పై శిశిథరూర్ మాట్లాడారు. భారతదేశంలో కీలక అంశాలపై విద్యార్థులు చర్చించడాన్ని థరూర్ అభినందించారు. విద్యాభ్యాసానికి మీరంతా ఇక్కడకు వచ్చి ఉండొచ్చని, అయితే మీరు కూడ దేశాన్ని విద్యావంతంగా తీర్చి దిద్దడంలో భాగస్వాములేనని అన్నారు. సుమారు 40 నిమిషాలపాటు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన శశిథరూర్... అనేక చారిత్రక ఘటనలు, వ్యక్తిగత అనుభవాలను ప్రస్తావించారు. అంతేకాక జవహర్ లాల్ నెహ్రూతో పాటు, పలువురు ప్రముఖ వ్యక్తులను కోట్ చేస్తూ... వారి సహనం, వైవిధ్యం, భారత దేశంలో వారి ప్రాముఖ్యత వంటి ఎన్నో విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
'కన్హయ్యలాగా ఎవరూ పుట్టొద్దు'
జైపూర్: జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై రాజస్థాన్ బీజేపీ ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య కుమార్లాగా మరొకరు పుట్టకూడదని తమ పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు చేస్తున్నామని విద్యాశాఖ సహాయక మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తాము పాఠ్యపుస్తకాలను దేశభక్తితో నిండిన అంశాలను చేరుస్తున్నామని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల చరిత్రను, ఫొటోలను పుస్తకాల్లో పెడుతున్నామని తెలిపారు. జేఎన్‌యూ ఘటనను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాము రాష్ట్ర పుస్తకాల్లో దేశభక్తి అంశాలను చేరుస్తున్నట్లు చెప్పారు. -
వాళ్లను చంపడం జాతి ధర్మం
జేఎన్‌యూ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. అక్కడి విద్యార్థి సంఘ నేతలు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను చంపేస్తామంటూ ఎప్పటికప్పుడు కొత్గా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇంతకుముందు కన్హయ్యను చంపితే 11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే జైల్లో పెట్టారు. ఈ లోపు వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో మరో పోస్టర్ ప్రచారంలోకి వచ్చింది. ''జేఎన్‌యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. నేను ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని, అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని అందులో పేర్కొన్నాడు. పోస్టర్లో తన ఫోన్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. జేఎన్‌యూ విద్యార్థులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆ పోస్టర్లో ఖండించారు. ''అఫ్జల్‌గురు ఉరితీత దినం రోజున పండగ చేసుకున్నవారిని నేను కాల్చేస్తా.. ఉగ్రవాదుల కంటే వెన్నుపోటుదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు ఉంది. ఇలాంటి వాళ్లకు జీవితఖైదు విధించాలి'' అని కూడా పోస్టర్లో రాశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ ప్రారంభిచినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. పోస్టర్లో ఉన్న నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తే, తనకు యమునా బజార్లో ఓ దుకాణం ఉందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే పోస్టర్లు వేసిన విషయం గురించి మాత్రం అతడు పెద్దగా స్పందించలేదు. అతడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. -
జెఎన్యూలో కన్హయ్యపై దాడి!
న్యూఢిల్లీ: జెఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్పై ఓ వ్యక్తి గురువారం సాయంత్రం దాడి చేయడానికి ప్రయత్నించాడు. దేశాన్ని తిడుతూ.. భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న కన్హయ్యకు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే తాను అతనిపై దాడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి క్యాంపస్ ఔట్ సైడర్ అని తేలింది. భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే క్యాంపస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన కన్హయ్యకుమార్ ఇటీవల బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. జెఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. తీవ్రస్థాయిలో కొనసాగిన ఈ వివాదం కేంద్రప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. -
కన్హయ్యపై రెజ్లర్ ట్విట్టర్ దాడి
న్యూఢిల్లీ: రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత, యోగేశ్వర్ దత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గతంలో జెఎన్యూ వివాదంలో సోషల్ మీడియాలో దేశ భక్తియుత కవితను పోస్ట్ చేసిన యోగి ఇపుడు తన దాడిని కన్నయ్యపై ఎక్కుపెట్టారు. ట్విట్టర్ లో జెఎన్యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ కొంతమంది రాజకీయవేత్తలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పాములకు పాలుపోసి పెంచితే... పాలు తాగిన ఆ పాములు మన అమర జవాన్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. మన సైనిక సోదరులపై విషాన్ని వెదజల్లుతున్నారంటూ ట్విట్ చేశారు. కాగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో యోగేశ్వర్ ఫేస్ బుక్ లో స్పందించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమరవీరుడైతే, లాన్స్ నాయక్, హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. कुछ लोगों ने नाग को दुध पिलाया है जो अब हमारे फ़ौजी भाईयों पर इल्ज़ाम लगा कर उन पे ज़हर उगल रहा है. — Yogeshwar Dutt (@DuttYogi) March 9, 2016 -
మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు
కన్హయ్య తాజా ప్రసంగంపై పోలీసులకు ఏబీవీపీ ఫిర్యాదు న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ బెయిల్ షరతులను ఉల్లంఘించి మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన సైనికుల పట్ల మాకు చాలా గౌరవం ఉంది.. అయినా కశ్మీర్లో మహిళలపై మన భద్రతా సిబ్బంది అత్యాచారాలు చేశారన్న వాస్తవం గురించి మేం మాట్లాడతాం’ అని మంగళవారం జేఎన్‌యూలో జరిగిన సభలో కన్హయ్య అన్నారు. దీంతో కన్హయ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితామీనన్ పైనా బీజేవైఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని ఆమె అన్నారని ఆరోపించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లను: కన్హయ్య పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వామపక్ష పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కన్హయ్య కుమార్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని ఇదివరకే స్పష్టంచేశానన్నారు. పీహెచ్డీ పూర్తిచేశాక అధ్యాపకవృత్తి చేపట్టాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. -
యూనివర్సిటీల్లో రాజకీయాలు వద్దు: బిట్టా
తిరుచానూరు: దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్ ఎంఎస్.బిట్టా అన్నారు. వర్సిటీల్లో విద్యకు తప్ప రాజకీయాలకు తావుండరాదన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన ల వెనక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ప్రమేయం ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని పౌరులకు స్వేచ్ఛ ఉందని, అయితే దేశ వ్యతిరేక నినాదాలు చేయడం క్షమించరాని నేరమన్నారు.దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసిన విద్యార్థి నాయకుడు కన్హయ్య దేశద్రోహేనని పేర్కొన్నారు. కన్హయ్యను జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా హీరో చేయడం సముచితం కాదన్నారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం బాధాకరమన్నారు. ఏపీ, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం భారీగా ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. -
3 చానళ్లపై కేసులు
ఢిల్లీ సర్కారు నిర్ణయం జేఎన్‌యూ వివాదంపై నకిలీ వీడియోల ప్రసారం న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ వివాదాస్పద కార్యక్రమంపై నకిలీ వీడియోలను ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్లపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టీవీ చానళ్లు మార్పుచేసిన వీడియోలను ప్రసారం చేశాయంటూ మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన న్యాయబృందం సూచించిందని ఓ అధికారి ఒకరు చెప్పారు. అయితే చానళ్ల పేర్లను ఢిల్లీ మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తన నివేదికలో పొందుపరచలేదన్నారు. ఫిర్యాదు ఆధారంగా సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం మేజిస్ట్రేట్ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మెజిస్టీరియల్ బృందం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఏడు వీడియో క్లిప్పింగులను పంపగా, అందులో మూడు బూటకమని తేలింది. ఆ వీడియోలను ఎడిట్ చేసి స్వరాన్ని జతచేసినట్లు నిర్ధారణ అయింది. కన్హయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు విచారణ బృందం ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. కాగా, అంతకుముందు ఈ టీవీ చానళ్లపై చర్య తీసుకోవాలంటూ సీపీఎం నేత సీతారాంఏచూరి, జేడీయూ నేత కేసీ త్యాగి సీఎం కేజ్రీవాల్‌ను కలసి డిమాండ్ చేశారు. ఉమర్, అనిర్బన్‌ల విడుదలకు ఉద్యమిస్తా: రాజద్రోహం కేసు ఎదుర్కొం టూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల విడుదల కోసం ఉద్యమిస్తానని కన్హయ్య చెప్పారు. అదే కేసుకు సంబంధించి కన్హయ్యకు ఇటీవలే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆదర్శ్ అరెస్ట్.. కన్హయ్యను చంపినోళ్లకు రూ.11 లక్షలు రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు అతికించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా.. ఆదర్శ్ బ్యాంకు ఖాతాలో రూ.150 మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఈ ముఖం బస్తర్ పోరుకు ప్రతిబింబం: సోనీ న్యూఢిల్లీ: ‘నా ఈ ముఖం బస్తర్‌లో జరుగుతున్న పోరుకు ప్రతిబింబం’ అని గతనెలలో ఛత్తీస్‌లో యాసిడ్ తరహా రసాయనంతో దాడికి గురైన ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సొరీ అన్నారు. జేన్యూ విద్యార్థులకు ఆమె సోమవారం సంఘీభావం ప్రకటించారు. వర్సిటీలో ప్రసంగిస్తూ.. ‘నాది, కన్హయ్యది ఒకే పరిస్థితి. ఇద్దరం తప్పుడు కేసులతో జైలుకు వెళ్లాం. నన్ను నక్సలైట్ల మద్దతుదారునని ఆరోపించారు’ అని సోని పేర్కొన్నారు. కస్టడీలో ఉండగా తనను పోలీసులు లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
నిప్పురవ్వను ఊది మంటచేసి...
విశ్లేషణ రోహిత్ వేముల ఆత్మహత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మహత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మితవాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలలను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదోసింది. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపింది. కన్హయ్య కుమార్, నికార్సయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి. ఆలో చనాపరుడు, లోతైన పరిశీలన గలవాడు, ధైర్యవంతుడు, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తపరచగలవాడు. రారమ్మని పిలుస్తున్న కొత్త వృత్తి రాజ కీయాలకు బదిలీ అయితే తప్ప, ఆయనకు పీహెచ్డీ ఎలాగూ వస్తుంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన చేసిన ఉపన్యాసం ఉత్తేజకరమైనది. ఆయన తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హృదయం, మేధస్సు కూడా రాజద్రోహంపైనే లగ్నమై ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి మనం సాధించుకున్న స్వేచ్ఛలను, గౌరవాన్ని ఆయన కోరుతున్నారు. మితవాదానికి ఆయన బద్ధవ్యతిరేకి. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారీ విధానం అంటూ ఆ శక్తులనూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఆర్థికవ్యవస్థకు సెన్సెక్స్లా, సోషల్ మీడియా కూడా ఒక విధమైన ప్రతిస్పందనా సూచిక. అయితే ఇవి రెండూ కిందా మీదా చేయగలిగినవే, చేస్తు న్నారు కూడా. మొదట ఉద్దేశపూర్వకంగా ఏదైనా రెచ్చ గొట్టే వ్యాఖ్యను చేసి, ఆ తర్వాత ఏదో ఒక సాకుతో దానికి అనుకూలంగా, ప్రతికూలంగా చర్చను రేకెత్తించవచ్చు. కన్హయ్య, సాధారణంగా కంటే కొన్నేళ్లు ఎక్కువే జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నారు. కాబట్టి ఆయన విద్యార్థి మాత్రమేనా లేక ఇంకా మరేదైనా కూడా అయి ఉండి, ఆ విద్యా సంస్థలో తలదాచుకున్నారా? అనే ప్రశ్నలు రేగు తున్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. విద్య నేర్వడం ఎప్పుడూ ఒకే పద్ధతిలో నడవాలనేం లేదు. వివిధ టీవీ చానళ్లకు ఆయన తన గురించి తెలిపిన దాని ప్రకారం... అతను ‘రాజకీయ కార్యకర్త’, ‘విద్యార్థి నేత’, ఆసక్తికరంగా ‘కమ్యూనిస్టుల అధికారిక ప్రతినిధి కాదు.’ బతికి బట్టకట్టడం కోసం ఆయాసపడుతున్న వామపక్షాలకు ఆయన ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి కొన్నేళ్లపాటూ జాగ్రత్తగా గమనించాల్సిన వ్యక్తి. విస్పష్టంగా మాట్లాడటంలోనూ, భావాలలోనూ నరేంద్ర మోదీకి సరిగ్గా దీటుగా నిలవగలవాడిగా కన్హయ్యను గుర్తించిన వామపక్ష నేతలు వెంటనే ఆయన రక్షణకు రంగంలోకి దిగారు. వామపక్షాలలోని అతి కొద్దిమంది తప్ప మరెవరూ సాటిరాని విధంగా ఆయన ఆ పనిని చేశారు లేదా ఆయన అద్భుత వాగ్ధాటిని చూస్తే అలా అనిపిస్తోంది. చర్చా వేదకపై గంధకంలా ఘాటుగా అనిపించే ఆయనకు మరో పార్శం కూడా ఉంది. మార్క్ ఆంటోనీ (గొప్ప ప్రభావశీలియైన ఉపన్యాసకునిగా) కన్హయ్య కమార్ వద్ద పోస్టల్ ట్యూషన్ తీసుకోవాలని నాకు తెలిసిన కొందరు వ్యాఖ్యానించారు. వేదిక మీద లేనప్పుడు అతడు తన ఆలోచనలను సుస్పష్టంగా, ప్రశాంతంగా వ్యక్తం చేయగలిగినవారు. అందువల్ల సాధారణ టీవీ వీక్షకులకు అతను చెప్పే విషయాలు తేలికగా అర్థం అవుతాయి. వివిధ వైఖరులను మృదువుగా వ్యక్తం చేయగలిగిన ఆయన స్వరం.. సాధారణంగా ఆధిపత్యం చలాయించే టీవీ యాంకర్లను మెత్తబరచేస్తుంది. ‘చెబుతావా, లేదంటే నీ తల’ అన్నట్టు సాగే ఇంటర్వ్యూను సంప్రదాయక పద్ధతిలో ప్రశ్నలు అడగడంగా మార్చేస్తుంది. అందుకే టీవీ చానళ్లు ఆయన పట్ల చాలా గౌరవం చూపాయి. చూడండి, పరిస్థితులన్నీ మహా అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటితో పోట్లాడతానని అతను అంటున్నాడు అన్నట్టుంటాయి. టీవీల్లో ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మళ్లీ చెప్పడానికైతే ఈ కాలం అవసరం లేదు. అయితే ఆయన చెప్పినవాటినీ, చెప్పిన పద్ధతినీ చూస్తే కచ్చితంగా ఆయన రాజకీయాల్లో బాగా రాణించగల వ్యక్తి. ప్రయాణాలు చేసి, అన్ని సెక్షన్ల ప్రజలతో మాట్లాడాలని తన కోరికని ఆయన చెప్పాడు. అయినా, ఆయన ఇంకా నిజంగా రాజకీయాలకు అంకితమైన రాజకీయవేత్త కారు. ఆయన, భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, యూపీఏ నుంచి బయటకు వచ్చేసి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతుల్లో ఓడిపోయినప్పటి నుంచి... ఒక దిశంటూ లేకుండా ఉన్న వామపక్షాలకు కేంద్ర రంగ స్థలిపైకి తలుపులు కూడా తెరిచారు. జేఎన్‌యూ, జాధవ్‌పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లూ, ఇటీవల అల్హాబాద్ వారికి కొత్త వేదికను కల్పించాయి. కాకపోతే వారు దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి. విద్యార్థి సంఘాలు, వివిధ వామపక్షాలకు అను బంధ సంస్థలు మాత్రమే. అయితే రోహిత్ వేముల ఆత్మ హత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మ హత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మిత వాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలల ను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదో స్తోంది. అసలు మొదట్నించీ వారే.. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపారు. బూటకపు వీడియోలుగా ఆరోపిస్తున్న వాటిని మితవాద పక్షం సభ్యులు, మద్దతుదార్లు అందించకపోగా ఆయన్ను కొట్టారు, అది చూస్తూ పోలీసులు నిలబడ్డార నేదే లెక్కలోకి వస్తుంది. అత్యంత బలమైన ప్రభుత్వం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలిచిందనే ఆలోచనను సామాన్యునిలో కలుగజేస్తుంది. ఒక విద్యార్థి జాతి వ్యతిరేకి అని రుజువు చేయాలని వారు అంతగా తాపత్రయపడకపోతే... కన్హయ్య బహుశా ఓ కళాశాల నేతగానే మిగిలిపోయేవాడు. అతని ఉపన్యాసం కళాశాల ఉపన్యాసంగానే మిగిలేది. మితవాద పక్షం ఆయన్ను ఒక్కసారిగా ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఆదర్శ్ శర్మ అరెస్ట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ యూనివర్శిటీ(జేఎన్ యూ) విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాల్చి చంపితే రూ. 11 లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఆయనను పోలీసులు ప్రశ్నించారు. దేశద్రోహి కన్హయ్యకుమార్ ను కాల్చిచంపితే 11 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ఆదర్శ్ శర్మ కొడుకు పేరుతో ఢిల్లీ వీధుల్లో హిందీలో వెలిసిన పోస్టర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొబైల్ నెంబర్ వివరాలతో సహా ముద్రించిన ఈ తాజా పోస్టర్లు వివిధ బస్టాప్ లు, మెట్రో స్టేషన్ సెంటర్లలో సంచలనంగా మారాయి. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే.. కన్హయ్య కుమార్ నాలుక కోస్తే 5లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు. కాగా, దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్ ఈ నెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. -
'కన్హయ్యకు బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది'
ముంబయి: బీజేపీపై శివసేన మరోసారి దాడికి దిగింది. దేశ ద్రోహం ఆరోపణల కిందట అరెస్టై గత వారమే బెయిల్ పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు బీజేపీ ఉచితంగా ప్రచారం కల్పిస్తుందని శివసేన ఆరోపించింది. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో బీజేపీని దుయ్యబట్టింది. 'ఏ ఒక్కటి కూడా ఉచితంగా రాదు. కానీ, కన్హయ్యకు ఉచితంగా ప్రచారం ఎలా వచ్చింది? ఎవరూ దానికి బాధ్యత? అని ఎడిటోరియల్‌లో ప్రశ్నించింది. దీంతోపాటు గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాటం నడిపిన హార్ధిక్ పటేల్‌తో కన్హయ్య కుమార్‌ను పోలుస్తూ కన్హయ్య విడుదల కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. అంతేకాకుండా తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ప్రావిడెంట్ ఫండ్ పై ట్యాక్స్ విధించడాన్ని కూడా శివసేన ఖండించింది. -
కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంతో ఒక్కసారిగా తనవైపు దేశాన్ని తిరిగి చూసేలా చేసిన వర్సిటీ పీహెచ్డీ స్కాలర్ కన్హయ్య కుమార్‌ను హత్య చేస్తే వారికి రూ.11 లక్షలు చెల్లిస్తానంటూ ఆఫర్ చేసిన ఆదర్శ శర్మ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.150మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతడు కొద్ది నెలలుగా అతడు ఉంటున్న గదికి అద్దె కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. బిహార్‌లోని బెగుసారాయ్కు చెందిన ఆదర్శ శర్మ ది పుర్వాంచల్ సేనకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. రోహిణీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలె కన్హయ్య కుమార్‌ను చంపినవారికి రూ.11 లక్షలు చెల్లిస్తామంటూ పత్రికలు వీధివీధిన దర్శనమిచ్చాయి. వాటిపై పూర్వంచల్ సేన లోగోతోపాటు ఆదర్శ శర్మ సంతకం కూడా ఉంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఆదర్శ చీకట్లోకి వెళ్లిపోయాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకోవడమే కాకుండా దాదాపు అన్ని కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాడు. 'ఎవరూ జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చిపారేస్తారో వారికి పూర్వాంచల్ సేన రూ.11లక్షలు బహుమతిగా ఇస్తుంది' అని శనివారం పోస్టర్లు వెలుగుచూశాయి. -
ఇపుడు వీస్తున్న గాలి..?
దేశ సామాజిక, రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. అది దక్షిణాన హెచ్‌సీయూలో మొదలై.. ఉత్తరాన జేఎన్‌యూ వరకూ సుడిగాలిలా తిరుగుతోంది. ఉన్నత విద్యా సంస్థల్లో మొదలైన ఈ సుడిగాలి ఏ పరిణామాలకు సంకేతం? ‘పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ భాషా ద్వేషాలూ చెలరేగే నేడూ...’ అన్న మహాకవి మాటలు ఇప్పుడు అక్షర సత్యాలన్నదానితో విభేదించే వారు ఉండరేమో! 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు, ఐటీ రంగ వికాసం, యువత కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి, సామాజిక పరిణామాలను పట్టించుకోకపోవటం వంటి కారణాల వల్ల వారిలో సామాజిక, రాజకీయ వికాసం మందగించిపోయింది. కానీ.. పాతికేళ్ల నిర్లిప్తత తర్వాత రోహిత్ వేముల, కన్హయ్య కుమార్ రూపంలో దేశమంతటా విద్యార్థి ఉద్యమం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వివక్ష, ఆధిపత్యాలను నిరసిస్తూ రోహిత్ రాసిన ఆత్మహత్య లేఖ.. అరెస్టు, విడుదల తర్వాత కన్హయ్య ప్రసంగాలు.. దేశప్రజలనే కాదు.. రాజకీయ నాయకత్వాన్నే ప్రభావితం చేస్తున్నాయి. దేశభక్తి, జాతీయవాదాలకు కొత్త నిర్వచనాలిచ్చి, మరింత మానవీయమైన సమాజాన్ని ఆకాంక్షిస్తూ.. దూసుకొస్తున్న నేటి విద్యార్థి లోకానికి వీరిద్దరూ ప్రతీకలని మేధోవర్గం భావిస్తోంది. ఈ ప్రభంజనం దేశ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అన్న ఆసక్తికర చర్చ సర్వత్రా సాగుతోంది. విద్యార్థులకు రాజకీయాలతో పనేంటని తలపండిన రాజకీయ నేతలు చెబుతోంటే .. మున్ముందు రాజకీయాలను తామే శాసించబోతున్నామని విద్యార్థి లోకం బలంగా చాటుతోందని పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక, రాజకీయ పరిణామాల్లో విద్యార్థి ఉద్యమాల పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్... మళ్లీ ఉద్యమ పథంలోకి విద్యార్థి లోకం దేశ రాజకీయాలను కుదిపేసిన రోహిత్, కన్హయ్య దేశ ప్రజా చేతనను రగిలించిన రోహిత్ ఆత్మహత్య లేఖ ప్రజలను కట్టిపడేసిన కన్హయ్య ‘ఆజాదీ’ నినాదం వినూత్న విద్యార్థి ఉద్యమాలకు ప్రతీకలుగా తెరపైకి పాతికేళ్ల స్తబ్దత తర్వాత సుడిగాలిలా రేగిన ఉద్యమాలు మార్క్స్ - అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆలోచనల మేళవింపు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే అంతిమ లక్ష్యం అన్ని రకాల దోపిడీలు, అసమానతలపై యుద్ధం భవిష్యత్ రాజకీయాలపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్న వైనం పృథ్వీరాజ్ : అసమానతలు, అణచివేతలు సమాజంలో పెరుగుతున్నపుడు.. అసహనాలు, ఆధిపత్య భావజాలాలు రాజ్యం చేస్తున్నపుడు.. ఎక్కడో అక్కడ ఒక అలజడి చెలరేగుతుంది. ఒక కొత్త గాలి వీస్తుంది. చిరుగాలిలా మొదలై సుడిగాలిలా మారుతుంది. తిరుగుబాటు బావుటా రెపరెపలాడుతుంది. సమూల మార్పులకు దారితీస్తుంది. ఇది చరిత్ర రుజువుచేసిన సత్యం. చారిత్రక అవసరాలు మట్టిమనుషులను మన కాలం వీరులుగా మలిచే సందర్భాలను చరిత్ర పొడవునా గమనిస్తూనే వచ్చాం. రెండు వేల సంవత్సరాల కిందట బానిసత్వంపై తిరుగుబాటు చేసిన స్పార్టకస్ మొదలుకొని.. సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, వర్ణ వివక్షలపై తిరగబడి మహోద్యమాలకు పురుడుపోసిన నిన్నటి చేగువేరా, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా, భగత్‌సింగ్‌ల వరకు ఆయా కాలాల్లో వీచిన కొత్త గాలికి సంకేతాలు! మానవ జాతి జ్ఞాపకాల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయిన మాన్యులందరూ చరిత్ర సానబెట్టిన మట్టిలో మాణిక్యాలే. రాజకీయాలకు ఆలంబనగా.. ఈ చరిత్రలు.. భారతదేశంలోనూ విద్యార్థి, యువతరం స్వాతంత్య్రోద్యమ బరిలోకి ఉరికేందుకు.. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆలంబనగా నిలిచాయి. ఆ ఉద్యమాల సారథులూ వారథులూ స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో నాయకులుగా స్థిరపడ్డారు. స్వాతంత్య్రానంతరం మంచి జీవితంపై, ఉజ్వల భవిష్యత్తుపై కోట్లాది మంది భారతీయులు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు మొత్తంగా ఇరవై ఏళ్లలోనే చెదిరిపోయిన నేపధ్యంలో.. విద్యార్థి, యువజన, రైతాంగ శ్రేణుల్లో చెలరేగిన తీవ్ర అసంతృప్తి మరో ఉద్యమ రూపం తీసుకుంది. విద్యార్థులు, విద్యావంతులు, యువతరం అందులో ఉరకలెత్తింది. ఆ ఉద్యమానికి ‘ఇపుడు వీస్తున్న గాలి’ కవిత అక్షర రూపమిచ్చింది. సమాజంలో విప్లవాత్మక మార్పులకు బీజమేసింది. ఎమర్జెన్సీకి ముందు సంపూర్ణ విప్లవం పిలుపుతో జయప్రకాశ్‌నారాయణ్ మొదలెట్టిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి, యువజనులు తదుపరి తరంలో రాజకీయ నాయకులుగా పరిణమించారు. ఎమర్జెన్సీ అనంతరం 1989 మండల్, మందిర్ వివాదంలో.. రిజర్వేషన్, యాంటీ-రిజర్వేషన్ ఉద్యమాల్లోనూ యావద్దేశంలో విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆ ఉద్యమాలూ సమాజ గమనంపై బలమైన ముద్రవేశాయి. కెరీరిజం రాజ్యం ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1990ల ప్రారంభంలో ఆరంభమైన ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత ఐటీ రంగ విప్లవంతో విద్యాలయాల్లో కెరీరిజం రాజ్యమేలటం మొదలైంది. సామాజిక శాస్త్రాలు వెనుకపట్టు పట్టటం, కెరీర్‌కు ఉపకరించే విద్యకే పట్టం కట్టటం వంటి పరిణామాలతో.. గత రెండు తరాల విద్యార్థులకు సామాజిక పరిస్థితుల గురించి ఏమీ తెలియకుండా పోయింది. అప్పటివరకూ జాతి చైతన్య వాణిగా గర్జించిన విద్యార్థి, యువజనుల పాత్ర రానురాను క్షీణించిపోయింది. అంతకుముందు వరకూ ఏ ప్రధాన సంఘటన జరిగినా తామున్నామంటూ ముందుకొచ్చిన విద్యార్థి ఉద్యమాలు.. ఆర్థిక సంస్కరణలు, ఐటీ వెల్లువలో కొట్టుకుపోయాయంటే అతిశయోక్తి కాదు. క్రమేపీ.. దేశభక్తి అంటే మిలటరీ దేశభక్తి అనే భావన రెడీమేడ్ వంటకంలా సమాజంలో పాతుకుపోయింది. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్...’ అన్న మానవీయ భావన విస్మరణకు గురైపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి ఉద్యమమే చోదకశక్తిగా నిలిచి నడిపించింది. అయితే.. ఆ ఉద్యమం పరిధి పరిమితమైనది కావటంతో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం కదలగలిగే అవకాశం లేకపోయింది. ‘ఆజాదీ’ కాంక్ష అదే సమయంలో ఇటీవలి కాలంలో అటు ప్రపంచంలోనూ, ఇటు దేశంలోనూ చోటుచేసుకుంటున్న సామాజిక, ఆర్థిక పరిణామాల ఫలితంగా.. దేశంలో అసహనం, ఆధిపత్య భావజాలం పెచ్చుమీరటం ప్రస్ఫుటమైంది. దానితో పాటే.. వాటిని వ్యతిరేకిస్తూ అలజడి కూడా మొదలైంది. అది సామాజిక పరిస్థితుల పట్ల విద్యార్థి లోకాన్ని మళ్లీ మేల్కొలుపుతోంది. అయితే.. నాడు భగత్‌సింగ్ ఆదర్శంగా స్వాతంత్య్రోద్యమంలోకి.. అనంతరం చేగువేరా ప్రేరణగా సామ్యవాద ఉద్యమంలోకి ఉరికివచ్చిన విద్యార్థిలోకం.. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు.. ఇప్పుడు మార్క్స్ - అంబేద్కర్ల సైద్ధాంతిక పునాదులను మేళవిస్తూ.. సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను చాటిన మేధావులందరి ఆలోచనా రీతులను ఇముడ్చుకుంటూ.. అన్ని రకాల అణచివేతలు, ఆధిపత్యాల నుంచి ‘ఆజాదీ’ కాంక్షిస్తూ ఒక రూపం తీసుకుంటోంది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల రూపంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఆ వెనువెంటనే జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్హయ్యకుమార్ గొంతుతో పొలికేక పెట్టింది. రోహిత్.. ఆత్మహత్య లేఖ అణగారిన దళిత వర్గం నుంచి వచ్చిన రోహిత్ వేముల.. ఆరంభంలో వామపక్ష విద్యార్థి సంఘంలో, తర్వాత దానితో విభేదించి అంబేద్కర్ విద్యార్థి సంఘంతో పనిచేశాడు. సహ విద్యార్థులతో కలిసి ఉద్యమించాడు. ముందు వరుసలో ఉంటూ.. కుల, మత వివక్షలకు, పీడనలకు, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా గళమెత్తి నినదించాడు. ‘‘నా తాత్వికత చాలా సరళమైనది.. పరమ మూర్ఖమైన, అత్యంత మలినమైన వాదాలు రెండు- మతం, జాతీయవాదం (యుగయుగాల నుంచి హింస రచనకు అత్యుత్తమ మార్గాలుగా రుజువైనవి). నేను ఏవగించుకునే పెడ ధోరణులు- దురాశ, సంఘ బహిష్కారం (సామ్రాజ్యవాద, ఆధిపత్యవాదాల లక్షణాలు). నేను నా ప్రాణాలను అర్పించైనా చూడాలనుకున్నవి- కారుణ్యం, చైతన్యం! ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనవి- ప్రేమ, ప్రకృతి’’ అని తన ఫేస్బుక్లో ప్రకటించాడు. కర్ణాటకలో కలబుర్గి హత్య నుంచి.. ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్‌మెమన్‌కు మరణశిక్ష విధించటం వరకూ ఒకే తీవ్రతతో వ్యతిరేకించాడు. మరణశిక్షను విధించే దేశం ప్రజాస్వామిక దేశమే కాదన్నాడు. ఆ శిక్ష హత్యతో సమానమన్నాడు. మత మైనారిటీలపై దాడులను నిర్ద్వం ద్వంగా ఖండించాడు. కశ్మీరీల స్వయం నిర్ణయ హక్కుకు మద్దతు ఇచ్చాడు. అంతటా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలే ప్రధానంగా ముందుకు నడిచాడు. అయితే.. ఆ ఉద్యమ క్రమంలో వివక్షకు, బహిష్కరణకు గురయ్యాడు. చివరికి.. ‘మనిషి విలువ.. అతడి తక్షణ గుర్తింపు, సమీప అవకాశానికి కుచించుకుపోయింది. ఒక ఓటుకు. ఒక సంఖ్యకు. ఒక వస్తువుకు (పరిమితమైపోయింది). ఒక మనిషిని ఒక ఆలోచనగా ఎన్నడూ (ఎవరూ) చూడలేదు. నక్షత్రధూళితో నిర్మితమైన ఒక ఉజ్వలమైన జీవిగా ఎప్పుడూ (ఎవరూ) చూడలేదు. ప్రతి చోటా.. చదువుల్లో వీధుల్లో రాజకీయాల్లో చావులో బతుకులో (ఎక్కడా మనిషిని మనిషిగా చూడలేదు)’ అంటూ ప్రస్తుత సమాజానికి, ఇప్పుడు రాజ్యమేలుతున్న విలువలకు ఒక అయోగ్యతాపత్రం ప్రకటిస్తూ నీడల నుంచి నక్షత్రాలకు పయనమైపోయాడు. రోహిత్ ఆత్మహత్య దేశ సమాజ చేతనను పెను కుదుపు కుదిపింది. ఈనాటి సమాజిక వాస్తవాలను, అందులోని డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. మేధావులు, రచయితలు, ఉద్యమకారుల్లో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసింది. అందులో ఢిల్లీలోని జేఎన్‌యూ ముందు వరుసలో నిలిచింది. కన్హయ్య.. ‘ఆజాదీ’ పొలికేక చేతనత్వానికి మారు పేరుగా నిలిచే ఢిల్లీ జేఎన్‌యూ రోహిత్ ఆత్మహత్యకు ముందు నుంచే అనేకానేక అంశాలపై ఉద్యమిస్తోంది. అక్కడ కూడా.. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలు.. హేతువాదుల హత్యలు, బీఫ్ పేరుతో దాడులు, మతకలహాల సృష్టికి ప్రయత్నాలు, కీలక కేసుల్లో దోషులకు మరణశిక్షలు.. వంటి పరిణామాలనెన్నిటినో వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తోంది. రోహిత్ ఆత్మహత్యతో ఆ స్వరం మరింత తీవ్రమైంది. విద్యాలయాల్లోని పరిస్థితులపై దేశం యావత్తూ దృష్టి సారించే స్థాయికి ఉద్యమించింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునే ప్రయత్నంలో.. అఫ్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఒక కార్యక్రమానికి జేఎన్‌యూ విద్యార్థులు మద్దతివ్వటం పెను వివాదంగా మారింది. అందులో దేశవ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను అరెస్ట్ చేయటం మరోసారి దేశాన్ని, విద్యార్థి లోకాన్ని కుదిపేసింది. అరెస్ట్‌కు ముందూ, వెనుకా జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశదేశాల మేధావులు కన్హయ్య అరెస్ట్‌ను ఖండించారు. అయితే.. బెయిల్‌పై విడుదలైన తర్వాత కన్హయ్య జేఎన్‌యూలో చేసిన ప్రసంగం.. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న విద్యార్థి ఉద్యమాల ఆలోచనా రీతులను విస్పష్టంగా ఆవిష్కరించింది. ‘‘భారత్ నుంచి మేం స్వేచ్ఛ కోరటం లేదు. భారత్‌లో స్వేచ్ఛ కావాలని కోరుతున్నాం. ... సరిహద్దు వద్ద తన ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధరంగంలో పోరాడే వారైనా.. తన స్వేచ్ఛ కోసం జేఎన్‌యూలో పోరాడుతున్న వారైనా.. ఏకం కాగల గొంతులన్నిటినీ మూయించాలని మీరు కోరుకుంటున్నారు. రాజకీయ స్వేచ్ఛ మాత్రమే సరిపోదు.. సామాజిక స్వాతంత్య్రం కావాలని అంబేడ్కర్ చెప్పారు. అందుకే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. సోషలిజం కోసం ప్రజాస్వామ్యం అనివార్యమని లెనిన్ చెప్పాడు. అందుకే ప్రజాస్వామ్యం గురించి మేం మాట్లాడతాం. భావప్రకటనా స్వాతంత్య్రం గురించి మేం మాట్లాడతాం. సమానత్వం గురించి మేం మాట్లాడతాం. ఒక బంట్రోతు కొడుకు, ఒక అధ్యక్షుడి కొడుకు.. ఒకే పాఠశాలకు వెళ్లగలిగే పరిస్థితుల కోసం మేం మాట్లాడతాం. ఆకలి, దారిద్య్రం, అణచివేత, దోపిడీల నుంచి విముక్తి లభించే వరకూ.. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం మా పోరాటం’’ అంటూ కన్హయ్య చేసిన నినాదం దేశాన్ని కట్టిపడేసింది. -
కాల్చేస్తే 11 లక్షలు.. నాలుక కోస్తే 5లక్షలు
* ఢిల్లీలో కన్హయ్యపై ‘కాల్చివేత’ పోస్టర్లు.. కేసు నమోదు * నాలిక కోస్తే ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత న్యూఢిల్లీ/బదాయూ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ లక్ష్యంగా రివార్డుల ప్రకటనలు వెలువడ్డాయి. ఆయనను కాల్చేస్తే రూ. 11 లక్షలు ఇస్తామని ఢిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరుతో శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. మరోవైపు.. ఆయన నాలుక కోస్తే రూ. 5 లక్షలు ఇస్తామని యూపీ బీజేపీ నేత ప్రకటించారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్ గోడపై పూర్వాంచల్ సేన పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కేసు నమోదు చేసి, వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టర్లో పూర్వాంచల్ సేన అధ్యక్షుడిగా పేర్కొంటూ ఆదర్శ్ శర్మ పేరు, ఫోన్ నంబరు ఉన్నాయి. కాగా, కన్హయ్య విడుదలయ్యాక బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అతని నాలుక కోసిన వారికి రివార్డు ఇస్తానని బాదాయూ జిల్లా బీజేపీ యువమోర్చా చీఫ్ కులదీప్ వర్షనయ్ ప్రకటించారు. దీంతో ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బీజేపీ అధిష్టానం బహిష్కరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోనివ్వం: రాహుల్ జేఎన్‌యూలోని 8 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడానికి బీజేపీని అనుమతించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అస్సాం ఎన్నికల సభలో అన్నారు. ‘కన్హయ్య ప్రసంగాన్ని 20 నిమిషాలు విన్నాను. ఒక్క పదమూ దేశానికి వ్యతిరేకంగా లేదు’ అని చెప్పారు. * కన్హయ్యకు భద్రతలో లోపాలు తలెత్తకుండా వర్సిటీ వెలుపలికి సంబంధించి ఆయన కదలికల వివరాలను తమకు అందించాలని ఢిల్లీ పోలీసులు జేఎన్‌యూ అధికారులను కోరారు. * విడుదలైన తర్వాత కన్హయ్య ఇచ్చిన ప్రసంగం బావుందని, అది దేశానికి వ్యతిరేకంగా లేదని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కొనియాడారు. * రాహుల్ జేఎన్యూకు వెళ్లినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. * రోహిత్ వేముల.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు మద్దుతుగా సభ నిర్వహించాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. * భావప్రకటన స్వేచ్ఛపై కన్హయ్య తనతో చర్చలకు రావాలని లూధియానాకు చెందిన జాహ్నవి బెహల్ అనే 15 ఏళ్ల విద్యార్థిని సవాల్ విసిరింది. ఇక అలహాబాద్ వర్సిటీ వంతు! అలహాబాద్: తనను వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని అలహాబాద్ వర్సిటీ విద్యార్థి నాయకురాలు రిచా సింగ్ ఆరోపించారు. వర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో లక్ష్యంగా చేసుకున్నారన్నారు. వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు తనను బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు. -
'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. -
కన్హయ్య నాలుక కోస్తే..అయిదు లక్షలిస్తా..
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ వివాదం కొద్ది కొద్దిగా సద్దుమణుగుతున్న సందర్భంలో బీజీపీ యువజన విభాగం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే.. అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కులదీప్ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు పూనుకోవాలన్నారు. కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థులనుద్దేశించి రాజద్రోహానికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మధ్య తేడాను వివరిస్తూ అతడు ఉత్తేజపూరిత ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
రోహితే నా ఆదర్శం
* అఫ్జల్ గురు కాదు: విద్యార్థి నేత కన్హయ్య * నేను దేశవ్యతిరేకిని కాదు * రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి గురువారం బెయిలుపై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల నాకు ఆదర్శం. నేను ఉగ్రవాదిని కాను. నేను దేశ వ్యతిరేకిని కాదు. దేశ సరిహద్దును రక్షిస్తున్న జవాన్లు, దేశ ప్రజలందరికీ అన్నం పెట్టేందుకు శ్రమిస్తున్న రైతుల కోసం పోరాడే నిజమైన రైతు బిడ్డను. దేశంలో పేదరికం, అవినీతి నుంచి స్వేచ్ఛ లభించాలని మేం (విద్యార్థులు) కోరుకుంటున్నాం. న్యాయం కోరే వాళ్ల గొంతు నొక్కేందుకు బ్రిటిషర్లు రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించేవారు. విద్యార్థుల వాణిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజద్రోహం చట్టాన్ని వాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజ్యాంగం ప్రకారం అఫ్జల్ గురు భారతీయుడు. అతనికి జరిగినదంతా (ఉరిశిక్ష విధింపు) దేశ చట్టం ప్రకారమే జరిగింది. మీరు (ప్రభుత్వం) ఎంత మంది రోహిత్‌లను చంపితే ఇంటింటి నుంచి అంతమంది రోహిత్‌లు పుట్టుకొస్తారు’ అని అన్నారు. రాజకీయాల్లో వస్తారా అని అడగ్గా.. ‘నేను రాజకీయ నాయకుడిని కాను. పీహెచ్డీ విద్యార్థిని. రాజకీయాల్లోకి వచ్చే లేదా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. చదువే నా లక్ష్యం. చదవాలని కోరిక వున్నా చదవలేకపోతున్న వారి కోసం పోరాడ్డమే నా పని’ అని పేర్కొన్నారు. ఏబీవీపీ ప్రచారం చేస్తున్న అఖండ భారత్ విధానానికి తాను వ్యతిరేకినన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. దీనిపై ఆరెస్సెస్ ప్రభావం ఉండదని విశ్వసిస్తున్నానని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను నాగ్‌పూర్‌లో కూర్చున్న ఆరెస్సెస్ నాయకులు నిర్ణయించజాలరన్నారు. ‘మా సిద్ధాంతానికి అనుగుణంగా గొంతెత్తితే.. తరచూ జైలుకు వెళ్లి రావటం తప్పకపోవచ్చు’ అని తెలిపారు. మా తరఫున ప్రచారం చేస్తారు: లెఫ్ట్ కన్హయ్య వామపక్ష కార్యకర్త కనుక సహజంగా ఆయన వచ్చే ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తరఫున ప్రచారం చేస్తారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. కన్హయ్య ప్రచారం చేయాలని డిమాండ్ల వస్తున్నాయని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఐఐఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ.. జేఎన్‌యూ, ఎఫ్టీఐఐల్లో జరిగిన నిరసనలకు సహకరించినందుకు ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ సేన్‌గుప్తా రాజీనామా చేశారు. ‘జోక్యం’ నుంచి ఆజాదీ కావాలి: కేజ్రీవాల్ ‘లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నుంచి ఆజాదీ కావాలి, కేంద్ర జోక్యం నుంచి ఆజదీ కావాలి’ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కన్హయ్య తరహా నినాదాలతో ట్వీట్ చేశారు. -
మన స్వేచ్ఛకు రక్ష సైన్యమా?
జాతిహితం న్యాయమూర్తి కన్హయ్యకు ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం మంచిదే. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితర వ్యవస్థలే. ఈ కేసులో న్యాయమూర్తి ఉదారంగానే నిర్ణయం తీసుకున్నారు. కానీ అతనింకా దోషే కాదు. అనుమానితుడైనందుకే ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి? నిర్దోషిగా రుజువయ్య వరకు దోషే అనే సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఆమోదించదు. దారితప్పిన పిల్లలకే అయినా లేక దారితప్పి పోలీసు కస్టడీకి, కోర్టులకు, జైళ్లకు చేరిన పిల్లలకే అయినా అంకుల్‌లాగా సలహాలను గుప్పించే తరుణం ఇది (‘‘బచ్చే’’, ‘‘బత్కే హుయే’’ పదాలు పార్లమెంటులో మానవ వనరుల మంత్రి ఉపయోగించినవే). కాబట్టి ఈ అవకాశాన్ని నే ను మాత్రం ఎందుకు వదులుకోవాలి? అలా సలహాలు ఇవ్వగల ఉన్నత స్థానంలో నిలవడానికి నాకున్న అర్హత ఒక్క వయసే అయినా లెక్కచెయ్యను. అందుకు నన్ను పతాక శీర్షికలకెక్కించి అంకుల్ అని పిలిచినా అభ్యంతరం లేదు. కాబట్టి నేను కూడా కన్హయ్య కుమార్‌కు ఉపన్యాసం దంచడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పిన ఆజాదీ విషయాలన్నీ సరేగానీ, ఇంతకూ ఈ ‘‘పుంజీవాది’’ (పెట్టు బడిదారీ విధానం) గోల ఏమిటోయ్ కుర్రాడా? దారితప్పిన పిల్లాడా ఏమిటి నీ సమస్య? మనలో మరింత ఎక్కువ మంది సమానులం అయ్యే అవకాశాన్ని సృష్టించేదీ, జేఎన్‌యూ వంటి డజను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నెల కొల్పడానికి పన్నులను అందించేది ఆ పెట్టుబడిదారీ విధానమే. సోషలిజం దశాబ్దాల తరబడి మనకు ఏమిచ్చిందని? ఇంతవరకు చెప్పేశాను కాబట్టి, భావజాల సరిహద్దుకు అటైనా లేక ఇటైనా ఈ ఏడాది విద్యార్థిగా నిలిచిన ఆ కుర్రాడి కి సమర్థనగానో లేక వ్యతిరేకంగానో సలహాలిస్తున్న కొందరిలో నేనూ చేరిపోవచ్చు. కానీ నాకు ముగ్గురితో మాత్రమే పేచీ ఉంది, వారితోనే వాదించాల్సి ఉంది. దృష్టి మళ్లింపు ప్రహసనం నా సమస్యలు సుస్పష్టమైనవే. వాటిని ఇక్కడ సంక్షిప్తంగానే పేర్కొంటు న్నాను. భీమ్సేన్ బస్సీ, అత్యంత అధికంగా మాట్లాడే, అత్యధిక ఊహాత్మకత గల పోలీసు గూఢచారి. ఆయనకు ముందు వివిధ భారతిలోని ఇన్స్పెక్టర్ ఈగిల్ మాత్రమే ‘నిర్దోషిగా రుజువయ్యేంత వరకు దోషే’ అనే స్టాలినిస్ట్ న్యాయశాస్త్రంతో నన్ను చచ్చేటంతగా భయపెట్టాడు. నిష్కపటంగా చెబు తున్నా, ఆయన లాకప్‌లో పడేయగా, ఆయన చూస్తుండగానే న్యాయవా దులు చావదన్నిన ‘‘పిలగాళ్ల’’పై నాకు జాలేస్తోంది. తద్వారా బస్సీ వారికి టీ-20 తరహా పునర్విద్యను గరిపినందుకు ఒక పాత్రికేయునిగా నేనాయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన పతాక శీర్షికలకు, ప్రైమ్ టైమ్ చర్చ లకు బోలెడంత అవకాశాన్ని కల్పించారు. నేటి నిరాశాజనకమైన విచ్ఛిన్న రాజకీయాల కాలంలో ఆయన మనకు బోలెడు నవ్వులను అందించారు. అణ్వస్త్రశక్తియైన మరే దేశ రాజధాని పోలీసు అత్యున్నతాధికారైనా ఇలా తలపై 2.50 కోట్ల డాలర్ల వెల ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాది ట్విటర్ హ్యాండిల్‌కు పారడీని నిజమని నమ్మేసి మొత్తం దేశ పోలీసు వ్యవస్థకంతటికీ ఈ ఉగ్రవాద ముప్పు గురించి హెచ్చరికను జారీ చేయగలరా? ఆయనపై నమ్మకం ఉంచిన కేంద్ర హోం మంత్రి దాన్ని నమ్మేసేలా చేయగలరా? ఇక ఆ తదుపరి బస్సీ చేసిందంతా దేశ ప్రధాన భూభాగంలో వాడుకలో ఉన్నట్టు ‘ఆగ్రహించిన పిల్లి స్తంభాన్ని పట్టుకు రక్కేయడమే’. అదెలా ఉంటుందంటే, ఒక్కసారి బాలీవుడ్ సినిమా చూడండి. ఇది నిజ జీవితంలో, హాలీవుడ్ సినిమా ‘వాగ్ ద డాగ్’కు (కుక్కను ఆడించే తోక) తాత (1997 నాటి ఈ వ్యంగ్య చిత్రంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న అమెరికా అధ్యక్షుడిపై నుంచి ఓటర్ల దృష్టిని మరల్చడం కోసం కమ్యూనిస్టు అల్బేనియాపై బూట కపు యుద్ధ నాటకం ఆడతారు). జేఎన్‌యూ, ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులతో ఈ ప్రహసనం సాగడం ఆ హాలీవుడ్ సినిమా కన్నా ఇది మరింత ఎక్కువ హాస్యభరితంగా తయారైంది. బస్సీతో తలపడకపోవడానికి నాకున్న కారణాలివి. ఇక అత్యంత బలంవతురాలైన మానవ వనరుల మంత్రితో పోరాటానికి దిగకుండా ఉండ టానికి కారణం చాలా సరళమైనది. ఆమెకు దీటైన అనర్ఘళోపన్యాస శక్తి, పదజాలం లేదా మేధస్సు నాకు లేవు. కాబట్టి ఆమె గెలుపును అంగీకరించి తప్పుకోవడమే నేను చేయగలిగింది. ఈ కేసులో ఇక నాకు మిగిలే సమస్య, ఒక్క మూడవదే. అది, గౌరవ నీయులైన హైకోర్టు న్యాయమూర్తితో ఈ కేసును వాదించడమెలాగ అనేది చిత్తశుద్ధితో, విచక్షణతో కూడిన పాత్రికేయ విమర్శలను స్వీకరించడానికి తగిన విశాల దృష్టి తమకున్నదని న్యాయమూర్తులు ఎప్పుడూ చెబుతుం టారు. వారి ఆ అనుగ్రహమే ఆధారంగా నేనీ కేసును వాదిస్తాను. పైగా గౌరవనీయులైన మా న్యాయవాది, రాజ్యాంగ నిపుణులు ఫాలీ నారీమన్ ఈ ఉదయం (మార్చి 4) నాతో ఎన్డీటీవీ ‘వాక్ ద టాక్’ కార్యక్రమం షూటింగ్ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చెప్పారు: న్యాయమూర్తి ఆ విద్యార్థికి ఉపన్యాసం లేదా సలహా ఇవ్వడం బాగానే ఉంది. కానీ సరిహద్దుల్లోని సైనికులను మధ్యలోకి లాగి, వారే మన స్వేచ్ఛలన్నిటినీ పరిరక్షిస్తున్నారనడం ఏమిటి? సాహసులైన మన సైనికులు గొప్ప బాధ్యత నెరవేరుస్తున్నారు నిజమే. కానీ మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తున్నది మన రాజ్యాం గం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తదితరమైన మన సంస్థలే. ఈ వాదనను మరింత విస్తరింపజేయ సాహసించడం కంటే ఆయన వెనుక నక్కి ఈ కేసును పోరాడటమే అనువైనది. పౌర స్వేచ్ఛల పరిరక్షణ సైన్యం బాధ్యతా? కన్హయ్యపై శస్త్ర చికిత్స చేసే కత్తిని ప్రయోగించకుండా యాంటీ బయొటిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఉదారంగా ఆమె అద్భుత నిర్ణయాన్నే తీసుకున్నారు. స్వేచ్ఛకు అనుకూలంగా మన భారత న్యాయ వ్యవస్థ నెలకొల్పిన అత్యుత్తమ సంప్రదా యం ఇది. దర్యాప్తు ఇంకా శైశవ దశలోనే ఉన్నదనీ, నేరం జరిగింద ని కను గొననే లేదని ఆమె అనడం కూడా న్యాయమే. కన్హయ్య జైల్లో గడిపిన కాలం ఆత్మావలోకనానికి అతనికి అవకాశం కల్పించి ఉంటుందనడమే గందరగోళప రుస్తుంది. అతను అసలు ఏ తప్పూ చేయలేదని, ఇది కూడా సాధారణమైన పోలీసుల దుందుడుకుతనానికి మూర్ఖత్వం కూడా తోడైందని తేలితే ఏమౌ తుంది? అతను నిర్దోషి అనే సాహసం చేయడం లేదని మరోమారు తెలుపు కుంటున్నాను. అలాగే అతనింకా దోషీ కాదు. కేవలం అనుమానితులైనందుకే తీహార్ జైల్లో ఆత్మావలోకనం చేసుకోవడం ఏమిటి? అదేమైనా భారతీయ తరహా రాజకీయ నిర్బంధ గృహమా (గులగ్)? నిస్సంశయంగా కానే కాదు. అనుమానితులైనందుకే ఎవర్నీ జైలుకు పంపేయలేం. లాయర్ల గుంపు ‘‘ప్యాంటు తడుపుకునేలా’’ చావబాదేయజాలదు. ఇంకా దోషులు కాక పోయినా అనుమానితులైన కారణంగానే వారిని రోజుల తరబడి పోలీసు కస్టడీలో ఆత్మావలోకనం చేసుకునేలా చేయలేం. నిర్దోషిగా రుజువయ్యే వరకు దోషే అనే బస్సీ సూత్రీకరణను మన న్యాయవ్యవస్థ ఎంతమాత్రం ఆమోదించదు. తర్వాతిది నారీమన్ ప్రధానంగా లేననెత్తిన అంశం. ట్వీట్లను కూడా న్యాయశాస్త్రం ఇప్పుడు గంభీర చర్చలో భాగంగానే పరిగణిస్తోంది. కోర్టు ఆదేశాలను ఒక్కసారి చదివిన వెంటనే ఈ అంశాన్ని చర్చకు పెడుతు న్నానని నేను ప్రత్యేకించి చెప్పాల్సి ఉంది. రాజ్యాంగబద్ధమైన మన స్వేచ్ఛ లను పరిరక్షిస్తున్నది న్యాయవ్యవస్థ సహా మన సంస్థలా లేక సైన్యమా? అనే ఆసక్తికరమైన చర్చకు కన్హయ్య కేసులోని న్యాయమూర్తి తెరదీశారు. ఒక దశాబ్దిపాటూ మనోజ్‌కుమార్ ‘మిస్టర్ భరత్’ తరఫున మహేంద్ర కుమార్ స్వరం జాతీయవాదాన్ని నిర్వచించింది. సదరు న్యాయమూర్తి, నేనూ కూడా నాటి తరం వారిమేనని గూగుల్ చెప్పడం కూడా నేనీ సాహ సానికి దిగడానికి మరో కారణం. ప్రత్యేకించి ఆమె ‘ఉపకార్’ చూసి ఉండొచ్చు. అందులోని ‘‘మేరె దేశ్ కీ ధర్తీ ’’ అనే దేశభక్తి గేయం నుంచి ఆమె ఉటంకించారు కూడా. ‘‘ఆతీ హై ఆవాజ్ యెహీ మందిర్ మస్జిద్, గురుద్వా రోంసే సంభాల్కె రెహ్నా అప్నే ఘర్ మే చుపే హుయే గద్దారోం సే’’ (ద్రోహి మన సొంత ఇంటిలోనే ఉండవచ్చు జాగ్రత్త అని అన్ని ఆరాధనా స్థలాలు హెచ్చరిస్తున్నాయి) అనే 1960ల నాటి పాట వినిపించి దశాబ్దాలు గడిచి పోయాయి. కాబట్టి పొరుగింటివాడు కూడా ద్రోహే కావచ్చుననే అనుమా నాన్ని రేకెత్తించిన ఆనాటి ఆలోచనా విధానం నుంచి మనం చాలా దూరం వచ్చేశామనేది నా రెండో వాదన. నేడు మనం అపారమైన ఆత్మవిశ్వాసం గల దృఢమైన దేశంగా ఉన్నాం. వైవిధ్యభరితమైన ఆలోచనలు మనకు హాని కలిగించలేవు. అవి మనల్ని బలోపేతులను మాత్రమే చేస్తాయి. మనది పాక్ సైన్యం కంటే భిన్నమైనది పాకిస్తాన్ జాతీయవాదానికి, భావజాలానికి కేంద్రం సైన్యమే. బహుశా మన దేశంలో రాజ్యాంగం కంటే ఎక్కువగా అక్కడ‘‘పాకిస్తాన్ భావజాలం’’ పాఠ్యాంశం అయ్యేంతగా అక్కడి ప్రభుత్వం భావజాలమయమైంది. ఇటీవలి వరకు అక్కడ రాజ్యాంగమే లేదు. బహుశా అందువల్లే సైన్యం పాకిస్తాన్ భావజాలాన్ని పరిరక్షించే అధికార వ్యవస్థలో కేంద్ర స్థానంలో నిలిచింది. సైన్యం పరిరక్షించేది పాకిస్తాన్ భావజాల సరిహద్దులనా? లేక భౌగోళిక సరిహద్దులనా? అని బెనజీర్ భుట్టో 1990లో ప్రశ్నించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలాంటి ప్రశ్న లేవనెత్తే సాహసం అంత వరకు మరెవరూ చేయ లేదు. సైన్యాలు భావజాలాన్ని పరిరక్షించగలిగేవైతే సోవియట్ యూని యన్‌లో కమ్యూనిస్టు భావజాలం ఎందుకు విచ్ఛిన్నమైపోయింది? అని ఆమె ప్రశ్నించారు. క్వెట్టాలోని సాయుధ బలగాల స్టాఫ్ కళాశాలలో బెనజీర్ ఆ ప్రసంగం చేశారు! ప్రజలు ఎన్నుకున్న ప్రధానే అయినా అలాంటి సాహసం చేసి తప్పించుకునే అవకాశం అక్కడ లేదు. పైగా ఆమె సూటిగా తన సైనికాధిపతుల కళ్లలోకి గుచ్చి చూస్తూ, అదీ వారి సంస్థలోనే కటువుగా చెప్పారు. ఆ తర్వాత ఆమె కొన్ని వారాలకు మించి అధికారంలో ఉండలేదు. సైనికుల వ్యవస్థ ఆమెపై విద్రోహం, భారత్‌కు అనుకూలంగా ఉండటం అనే ఆరోపణలు చేసింది. భారత్‌లో అలాంటి చర్చకు ఆస్కారమే లేదు. అద్భుతమైన, సాహసో పేతమైన మన సైన్యం మన సరిహద్దులను, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై పద్ధతి ప్రకారం ఏర్పడిన పౌర అధికారాన్ని కాపాడుతోంది. స్వేచ్ఛలు, పౌరుల హక్కుల పరిరక్షణ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం బాధ్యత. ఒక సైనికుడు లేదా జనరల్ తనకు అన్యాయం జరిగిందని భావించినా అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన మన న్యాయవ్యవస్థనే ఆశ్రయిస్తారు. ఇది చెప్పాక, న్యాయస్థానాల్లోలాగా నేను కూడా... యువర్ లార్డ్‌షిప్! ఇంతటితో నేను నా వాదనను ముగిస్తున్నాను. twitter@shekargupta శేఖర్ గుప్తా -
కన్హయ్యకు వెంకయ్య రాజకీయ సలహా!
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో జైలు పాలై.. బెయిల్ పై విడుదలైన జెఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కన్హయ్యకు బాగా పబ్లిసిటీ వచ్చిందని, కాబట్టి ఆయన రాజకీయాల్లో చేరవచ్చునంటూ సలహా ఇచ్చారు. అయితే కన్హయ్య చేరే పార్టీ పార్లమెంటులో సింగిల్ డిజిట్లో ఉందంటూ ఎద్దేవా చేశారు. 'అతనికి బాగా పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి అతను రాజకీయాల్లో చేరవచ్చు. అతని ఫేవరేట్ రాజకీయ పార్టీ ప్రస్తుతం పార్లమెంటులో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది' అని వెంకయ్య అన్నారు. జెఎన్యూలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యకుమార్ అరెస్టయ్యారు. దాదాపు మూడు వారాలు జైలులో గడిపిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య గురువారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన జాతివ్యతిరేక నినాదాలు చేసినట్టు వీడియో ఆధారాలు లేవని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు స్పషం చేసింది. -
జైలు నుంచి కన్హయ్య విడుదల
జేఎన్‌యూ, స్వగ్రామంలో సంబరాలు * దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు: కన్హయ్య న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు విడుదలయ్యారు. భారీగా వచ్చిన మద్దతుదారులు నినాదాలు చేస్తూ జైలు వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి జేఎన్‌యూ చేరుకున్న కన్హయ్యకు విద్యార్థులు, అధ్యాపకులు నీరాజనాలు పట్టారు. గంగా ధాబా నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు... సత్యానిదే విజయమన్న నమ్మకముంది.. నిజాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. నేను ఇప్పుడు నా సొంత కథను రాస్తాను.. జైలులోనే రాయడం ప్రారంభించాను’ అంటూ సహచరుల్ని ఉద్దేశించి క్యాంపస్‌లో కన్హయ్య ప్రసంగించారు. ‘ప్రధానితో ఎన్ని భేదాభిప్రాయలు ఉన్నా సత్యమేవ జయతే అన్న మోదీ ట్వీట్‌తో ఏకీభవిస్తాను... భారత్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరడం లేదని, దేశంలోనే స్వేచ్ఛను కోరుతున్నా’ అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలపై నమ్మకముందని, ఏబీవీపీని శత్రువుగా కాకుండా ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పారు. కన్హయ్య గ్రామంలో సంబరాలు కన్హయ్య విడుదలతో ఆయన స్వగ్రామంలో కుటుంబీకులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బీహార్‌లోని బిహత్ గ్రామంలో సోదరులు తల్లిదండ్రులకు రంగులు పూశారు. గ్రామస్తులు ‘కన్నయ్య అరెస్టైన తర్వాత మొదటిసారి ఆందోళన నుంచి ఉపశమనం దొరికింది’ అంటూ తండ్రి జైశంకర్ సింగ్(61) సంతోషంగా చెప్పారు. వెంటనే గ్రామానికి రావాలని కుమారుడ్ని కోరలేదని, జేఎన్‌యూకి వెళ్లి మద్దతుగా నిలిచిన విద్యార్థులతో గడుపుతాడని సింగ్ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఢిల్లీ అంతటా పోలీసు భద్రతను పటిష్టం చేశారు. జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. విడుదల తర్వాత ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఏ, రాజకీయ పార్టీలతో కలిసి కన్హయ్య జంతర్‌మంతర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో పర్యటించవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. కన్హయ్యకు ఆప్ సర్కారు క్లీన్చిట్ జేఎన్‌యూ ఘటనలో కన్హయ్య ఏ తప్పు చేయలేదని ఢి ల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో నమోదుచేసిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై పోలీసులకు అనుమానాలున్నాయని తెలిపింది. కన్హయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, వీడియోలు దొరకలేదని నివేదికలో పేర్కొంది. కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేస్తుండగా చూశామంటోన్న వ్యక్తులు, వారి పాత్రపై విచారణ నిర్వహించాలని అభిప్రాయపడింది. కొన్ని వీడియోల్లో ఉమర్ ఖాలిద్ కనిపించాడని, అతని పాత్రపై మరింత విచారణ జరగాలని న్యూఢిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ తెలిపింది. ఉమర్, అనిర్బన్, అశుతోష్ లు అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా, కశ్మీర్‌పై నినాదాలు చేసినట్లు జేఎన్‌యూ భద్రతా సిబ్బంది చెప్పార ంటూ నివేదికలో వెల్లడించారు. -
'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు'
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు జాతి వ్యతిరేక నినాదాలకు ప్రత్యక్ష సంబంధంలేదని ఢిల్లీ ప్రభుత్వం తమ నివేదికలో స్పష్టం చేసింది. ఫిబ్రవరి9న జరిగిన ఘటనపై బుధవారం రాత్రి నివేదిక అందచేశామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు. ఊమర్ ఖలీద్, మరో విద్యార్థి ఆ రోజు నినాదాలు చేశారా లేదా అన్నదానిపై పూర్తిస్థాయి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లభ్యమైన చాలా వీడియోలలో ఊమర్ ఖలీద్ కనపించాడనీ, కశ్మీర్ అంశంపై, అఫ్జల్ గురు విషయాలలో అతడు మద్ధతిస్తున్నట్లు కనిపించాడని సంజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలతో పాటు ఊమర్ ఖలీద్ జాతి వ్యతిరేఖ వివాదాల కార్యక్రమాలలో పాల్గొన్నాడా, లేదా అన్నది త్వరలో తెలుతుందన్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థులను జేఎన్ యూ వర్సిటీ యాజమాన్యం గుర్తించిందని, పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. -
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు. -
నన్ను చితక్కొట్టారు.. దుస్తులు ఊడదీశారు!
పోలీసుల ఎదుటే తీవ్రంగా కొట్టారు ♦ సుప్రీం కోర్టు విచారణ కమిటీకి చెప్పిన కన్హయ్య ♦ మీరుండగా దాడెలా జరిగింది?: మందలించిన సుప్రీం కమిటీ న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 17న పోలీసుల ఎదుటే తనను విపరీతంగా కొట్టారని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్.. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విచారణ కమిటీకి తెలిపారు. ‘ఫిబ్రవరి 15న పోలీసులు నన్ను కోర్టు ఆవరణలోకి తీసుకురాగానే లాయర్ల దుస్తుల్లో ఉన్న కొందరు నాపై దాడి చేశారు. అంతే కాదు పక్కనున్నవారినీ పిలిచారు. నన్ను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులకూ దెబ్బలు తప్పలేదు’ అని చెప్పారు. తెలిపారు. తనపై దాడి పూర్తిగా రాజకీయ ప్రభావిత వ్యక్తులు చేసిన దాడేనని.. పటియాలా కోర్టులో జరిగిన ఘటనను విచారించాలంటూ సుప్రీం కోర్టు కపిల్ సిబల్‌తోపాటు ఆరుగురు లాయర్లతో ఏర్పాటు చేసిన కమిటీకి వెల్లడించారు. 17న జరిగిన ఘటనలో.. విచారణకు మరికొంత సమయం ఉన్నందున పక్కనున్న గదిలో వేచి చూస్తుండగా ఓ లాయరు వచ్చి తనను కొట్టారన్నారు. కోర్టు గది ద్వారం గుండా వచ్చిన లాయర్లు తనపై దాడిచేసి దర్జాగా వెళ్లిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదనిని చెప్పారు. ‘నేను ఈ దేశపు యువకుడిని. నాకు రాజ్యాంగంపై గౌరవం ఉంది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడను. బయట కొందరు వ్యక్తులు నన్ను దేశ ద్రోహి అంటున్నారు. మీడియాలో ఓవర్గం నన్ను ద్రోహిగా ముద్రవేసింది’ అని పేర్కొన్నారు. దీంతో డీసీపీ జతిన్ నర్వాల్‌ను పిలిపించిన సిబల్..‘ఇంతమంది పోలీసులున్నా కన్హయ్యపై దాడి ఎలా జరగనిచ్చారు’ అని అడిగారు. ‘మీరిప్పుడు ఢిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కింద పనిచేయటం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి’ అని డీసీపీకి లాయర్ల బృందం హెచ్చరించింది. తనపై దాడి చేసిన లాయర్, ఆ సమయంలో ఉన్న పోలీసులను గుర్తు పట్టగలరని కన్హయ్య తెలిపారు. జేఎన్‌యూ వివాదాన్ని ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, ఫిబ్రవరి 9 జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులు ఉమర్, అనిర్బన్ భట్టాచార్యల పోలీసు కస్టడీని మరో రెండ్రోజులపాటు పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. స్మృతిపై విపక్షాల హక్కుల తీర్మానం హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకేసుకు సంబంధించి పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీ చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విపక్షాలు మండిపడ్డాయి. ఇరానీపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ నిర్ణయించాయి. -
కన్హయ్య ఆ గ్రూపులో ఉన్నాడు
న్యూఢిల్లీ: జేఎన్ యూ వివాదంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి దర్యాప్తు బృందం మధ్యంతర నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 9న జేఎన్ యూ క్యాంపస్ లో తీవ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను నివేదికలో పొందుపరిచింది. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన గ్రూపులో కన్హయ్య కుమార్ ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్యాంపస్ లో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాల్లోనూ అతడి పాత్ర ఉందని వెల్లడించినట్టు చెప్పారు. కన్హయ్య సహా 8 మంది విద్యార్థులు జాతివ్యతిరేక నినాదాలు చేసినట్టు వర్సిటీ అంతర్గత విచారణలోనూ తేలిందని గుర్తు చేశారు. అయితే తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు కన్హయ్య కుమార్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే. కాగా, కన్హయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి(బుధవారం)కు వాయిదా వేసింది. జేఎన్ యూ వివాదంపై సీలు వేయని కవర్ లో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినా కోర్టు అంగీకరించలేదని పోలీసులు వెల్లడించారు. -
కన్హయ్య పిటిషన్ పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు తమకు భద్రత కల్పించాలని ఉమర్ ఖలీద్, మరికొందరు జేఎన్ యూ విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, ఇతర విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణకు కూడా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టానికి అడ్డుతగులుతున్న జేఎన్ యూ వీసీ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో కోరారు. -
ధిక్కారం మానవ స్వభావం
అభిప్రాయం దాదాపు 2400 ఏళ్ల క్రితం సోఫోక్లీస్ వ్రాసిన నాటకం ‘‘యాంటిగొని’’. ఈడి పస్ కుమారులిద్దరూ రాజ్యాధికారం కోసం పరస్పరం చేసుకొన్న యుద్ధంలో మరణించాక సింహాసనాన్ని అధి రోహించిన రాజు క్రియాన్, ఆ సోదరులలో ఒకరైన పోలినైసిస్ శవానికి ‘‘ఖననం చేయకూడదని, కాకులకు, గద్దలకు, పురుగులకు వదిలివేయాలనే’’ శిక్షను విధిస్తాడు. తన సోదరునికి విధించిన మరణానంతర శిక్షను పోలినైసిస్ సోదరి యాన్టిగోని తీవ్రంగా గర్హిస్తుంది. ఖనన సంస్కారం చేద్దాం రమ్మని తన సోదరి ‘‘ఇస్మీని’’ని పిలుస్తుంది, అందుకు ఇస్మీని సమ్మతించక పర్యవసానాన్ని వివరించి హెచ్చరిస్తుంది. అప్పుడు యాన్టిగొని అంటుంది ""if i have to die for this pure crime/i am content, for i shall rest beside him'' అంటుంది. ""the city is the king''s అంటూ రాజద్రోహ నేరానికి గాను గృహంలో బంధించి చనిపోయేలా చేయాలని క్రీయాన్ శిక్ష విధిస్తే దాన్ని కూడా ధిక్కరిస్తూ ఉరి వేసుకొని చచ్చిపోతుంది. క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన సోక్రటీస్‌ను ‘‘దైవ ధిక్కారము, యువతను కలుషిత పరచడం’’ అనే నేరాలను ఆరోపించి ఖైదు చేసినపుడు పారిపోయే అవకాశముండీ, తను ఏమయితే చెప్పేడో వాటి మీదే నిలబడుతున్నానని చెపుతూ విషాపానం చేసి మరణ శిక్షను స్వీకరించాడు. "my kingdom is not of this world''అని క్రీస్తు అన్నప్పటికీ ‘‘నా రాజ్యము’’ అన్న మాటే రాజధిక్కారంగా పరిగణించి సిలువనెక్కిస్తే, క్రీస్తు ‘‘బిడ్డలారా నాకోసం ఏడవకండి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి’’ అన్నాడే కానీ దేవుని రాజ్యము మిధ్య అని సిలువ శిక్షను తప్పించుకోలేదు. అన్ని వేల ఏళ్ళ క్రితం కూడా మనిషి రాజ ధిక్కార లేదా దేశ ధిక్కార నేరం విధిస్తే శిక్షను అనుభవించాడే కానీ తన భావాన్ని వ్యక్తపరచకుండా వెనుకకు తగ్గలేదు ఎందుకని? ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేది మానవ హక్కులకు పునాది వంటిది. అది మనిషి స్వభావంలో ఒక భాగం, ఆ హక్కును కాపాడు కోవడానికి మనిషి ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అది లేని నాడు జార్జ్ వాషింగ్టన్ చెప్పినట్లు ‘‘వధ్యసిల మీదకు వెళుతున్న గొర్రెల’’లాగే మనిషి తనను భావించుకుంటాడు. కన్హయ్య కుమార్ మరియు జేఎన్‌యూ విద్యార్థులు చేసింది భావ ప్రకటన మాత్రమే. ‘‘ప్రతి మనిషికి తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హోదా కల్పించినప్పుడే అది న్యాయమంటాం, మేం మీ దోపిడీ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నాం’’ అని వాళ్లు అన్నారు. అలా అనడానికి కన్హయ్యకే కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కు వుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, చర్చించుకునే హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది. భావప్రకటన ఎన్నటికీ దేశ ద్రోహం కాదు. ‘‘ఆలోచనల మీద ఆంక్షల ఆమ్ల వర్షం కురిపించే’’ రాజ్యాలు, ప్రభుత్వాలు కుప్పకూలిన దాఖలాలే చరిత్ర నిండా. అయినా అసలు దేశభక్తి అంటే ఏమిటి? పార్లమెంటులో ఇంత పెద్ద రవీంద్రుని విగ్రహం పెట్టుకున్నారు కదా. ఆయన ‘‘జాతీయత అనేది ఒక పెద్ద విపత్తు.. భారతదేశపు అన్ని సమస్యలకి ఇదే మూల కారణం అయి ఉన్నది. నా దేశ వాసులు మానవీయత కంటే దేశం గొప్పదనే భావనకు వ్యతిరేకంగా పోరాడి నిజమయిన దేశాన్ని పొందుతారని ఆశ పడుతున్నా’’ అని విశ్వ మానవతను గురించి అన్న మాట వీరికి తెలి యదా? ప్రశ్న మొలకెత్తినపుడు, నిరసన స్వరం జ్వలించినపుడు కారణాలు తెలుసుకొని పరిష్కా రం వెదకడం సముచితం కదా? అణచిన స్వరం అలాగే ఉండిపోదు. అలా ఉండిపోక పోవడానికి నాగరికత అని పేరు. ప్రశ్న లేకపోతే జ్ఞానం విస్తృతి పొందదు. నాగరికత ముందుకూ పోదు. చిన్నప్పుడు నేనో కథ విన్నాను, ఒక అడవిలో ఒక యేరు వుంది ఒకరోజు ఒక మేక పిల్ల అక్కడికి నీరు తాగడానికి వచ్చింది. అంతలోకి ఒక పులి కూడా అక్కడికి వచ్చింది. ఏటికి పైన పులి నీరు తాగుతుంది. క్రింద మేకపిల్ల తాగుతుంది. కాసేపటికి పులి ‘ఓ మేకా నిన్ను తినేస్తా’ అన్నది. మేక ఆశ్చర్యపడి ‘నేనేం తప్పు చేసానని తినేస్తావు’ అన్నది. అందుకు పులి ‘నువ్వు నా నీళ్ళు ఎంగిలి చేసావుకదా’ అని బదులిచ్చింది. ‘పులీ నువ్వు పైన తాగుతున్నావ్. నేను క్రింద తాగుతున్నా. ఎంగిలెలా చేయగలను’ అన్నది మేక పిల్ల. అప్పుడు పులి ‘ఇప్పుడు కాదు, నువ్వు కడుపులో వున్నప్పుడు మీ అమ్మ ఎంగిలి చేసింది’ అని ఆ చిన్ని మేక పిల్లను తినేస్తుంది. మొన్నటి వరకు నాకో సందేహం వుండేది ఈ కథ గురించి. పులి కదా శుభ్రంగా తినేయక సాకులు ఎందుకు వెదికింది అని. కన్హయ్య సంఘటనతో సందేహం తీరిపోయింది. ఏమంటే అప్పుడు ఆ పులి ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న ఒకానొక అడవికి ‘నాయకుడి’గా ఉండింది. - సామాన్య వ్యాసకర్త రచయిత్రి మొబైల్: 80196 00900 -
కన్హయ్య విడుదలకు డిమాండ్
జాబల్ పూర్: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కన్హయ్య అమాయకుడని, అతడిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. అతడిని అక్రమంగా కేసులో ఇరికించినట్టు కడబడుతోందని పేర్కొన్నారు. 'జేఎన్ యూను మిని ఇండియా'గా వర్ణించారు. జేఎన్ యూలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కన్హయ్య కుమార్ విడుదల చేయాల్సిందేనని చెప్పారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కశ్మీర్ లో దేశవ్యతిరేక నినాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో బీఫ్ వివాదాన్ని లేవనెత్తి ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. -
సారీ చెప్పే కాలం కాదిది
జాతిహితం జేఎన్‌యూ-కన్హయ్య-ఢిల్లీ పోలీసులు... సరిగ్గా 35 ఏళ్ల క్రితం నాటి భయా నకమైన 1981 రోజులను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో నేను, ఒకేసారి ఐదు చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్న ఈశాన్యం వార్తా కథనాలను వెలువరిస్తూ ఉండే వాడిని. అధికారిక ప్రకటనల్లో జాతి వ్యతిరేక శక్తులు(ఏఎన్ఈ) అని మాత్రమే చెబుతూ తిరుగుబాటుదార్లను లేదా అజ్ఞాతంలో ఉన్నవారిని ఎంద రినైనా బంధించేవారు, విచారించేవారు, తరచుగా ఏదో ఒక పద్ధతిలో హత మార్చే వారు. రాజద్రోహ నేరం కేసు పెట్టడం అంటే మహా జంఝాటం, అంతకంటే ఇవన్నీ చేయడమే తేలిక. అయితే అది ఒక్కోసారి నమ్మశక్యం కానంతటి మూర్ఖత్వానికీ దారి తీసేది. అమాయక ప్రాణాలకు హానిని కలుగ జేయకపోతే అలాంటి సందర్భాలు గొప్ప హాస్యస్ఫోరకంగా కూడా ఉండేవి. అలనాటి మంచిరోజుల కథ ఆనాటి పరిస్థితుల్లో సైన్యం, పోలీసు, నిఘా విభాగాలలో పనిచేసేవారికి, విలేకరులకు మధ్య ఒక్కోసారి మైత్రీపూర్వకమైన, తరచుగా వైషమ్యపూరి తమైన అసాధారణ అనుబంధం ఉండేది. అయితే అనివార్యంగానే వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించుకోవడం అనే అనుబంధం కూడా ఉండేది. ఈశాన్యంలో పనిచేసిన అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో అజిత్ దోవల్ కాక, కోషీ కోషీ కూడా నాకు మిత్రులు. తిరుగుబాటుకు వార్తల సేకరణ గురించి తెలిసిన వారెవరికైనా విలేకరులు, ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలను సరిపోల్చి చూసుకుంటారని తెలిసి ఉంటుంది. అలాగే మేమి ద్దరం తరచుగా మా నోట్స్‌ను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. మరీ ముఖ్యంగా ప్రమాదరహితమైన ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఏ బంద్ రోజునో నేను ఆయన కార్యాలయానికి వెళుతుండేవాడిని లేదా ‘‘బౌద్ధ భిక్షువు’’కు (ఓల్డ్ మాంక్ రమ్‌కు మేం పెట్టుకున్న పేరు) రోజువారీ నివాళు లర్పించడానికి కేపీఎస్ గిల్ ఇంట్లో సాయంకాలాలు కలుస్తూ ఉండేవాళ్లం. ఒక సాయంత్రం మహా ఉద్వేగంగా కోషీ, నన్ను ఉన్న పళాన తన కార్యాలయానికి రమ్మని పిలిచారు. గొప్ప కథనం ఉందని, కల్నల్ ఎక్స్‌కు (సైనిక నిఘా విభాగంలో కోషీకి సమాన స్థాయి వారు) పెద్ద తీవ్రవాది దొరి కాడని, కాకపోతే ‘‘జాతి వ్యతిరేక శక్తులలో అతని హోదా’’ ఏమిటో కనిపెట్ట డానికి నా మేధస్సును ఉపయోగించాలన్నారు. అదేదో నన్ను అడగమని ఆయనకు చెప్పారు. తామెన్నడూ విని ఉండని గ్రూపునకు చెందిన ఒక స్వయం ప్రకటిత నాగా లెఫ్టినెంట్ కల్నల్‌ను తమ కుర్రాళ్లు ‘‘పట్టుకు న్నార’’ని, కానీ తమ వద్ద ఉన్న జాబితాలో అతనెవరో గుర్తించలేకపోతు న్నామని ఆయన చెప్పారు. ఆ తీవ్రవాది మాత్రం తాను సాల్వేషన్ ఆర్మీ (పేదల సంక్షేమానికి కృషి చేసే క్రైస్తవ సంస్థ) లాంటి ఏదో గ్రూపునకు చెందినవాడినని పదేపదే చెబుతున్నాడన్నారు. దీంతో, సిరియన్ క్రిస్టియన్ ఆయిన కోషీ నిస్సహాయమైన ఓ నవ్వు నవ్వి, సదరు కల్నల్‌కు ఆ సాల్వేషన్ ఆర్మీ ఎంత నిరపాయకరమైనదో వివరించి, నిర్భాగ్యుడైన ఆ దైవ సైనికునికి క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయమని చెప్పారు. తర్వాత ఓ గంటకల్లా ఆ పని జరిగిపోయింది. జీవితాంతం ఇతరులకు చెప్పాల్సిన కథగా అది మిగిలిపోయింది. అయితే, అవి మంచిరోజులు కాబట్టి అంత సమస్యాత్మక ప్రాంతంలోనూ ఆ కథ వెంటనే మర్యాదకరమైన, తార్కికమైన ముగింపునకు వచ్చేసింది. నేటి హాస్యాస్పద గాథ కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో జరిగింది కూడా సరిగ్గా అలాం టిదే, అంతగానూ హాస్యాస్పదమైనదే. కాకపోతే ప్రభుత్వమో లేదా కోర్టులో అతనిని విడుదల చేయమని చెప్పేవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. హఫీజ్ సయీద్ పేరిట వెలువడ్డ ఒక నకిలీ ట్వీట్ , దేశంలోనే అత్యుత్తమమైన ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని చవటాయలను చేసింది. అంతకంటే మరింత నకిలీ వీడియో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నుకున్న అధ్యక్షునిపై రాజద్రోహ నేరం అభియోగాన్ని మోపేలా చేసింది. రాజద్రోహం అంటే దేశంపై యుద్ధం చేయడమని అర్థం. ఇప్పుడు, ఆయన్ను ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. సామాజిక, సంప్రదాయక మీడియాలో ఢిల్లీ పోలీసు అధినేత సహా అత్యున్నత స్థాయిలలోని వారంతా కన్హయ్య దేశద్రోహా నికి పాల్పడ్డాడని చెప్పారు. కాబట్టి, గువాహతిలో నాడు సైనిక కల్నల్ ‘సారీ’ చెప్పి ఆ అభాగ్యుడ్ని వదిలి పెట్టేసినంత తేలిక వ్యవహారం కాదిది. పైగా అది దయాదాక్షిణ్యాలున్న కాలం. కాగా, నేడు మనం దేశ మస్తిష్కాన్ని సన్నీ డియో లైజేషన్ (దేశభక్తి అంటూ రంకెలేయడం) చేస్తున్న కాలంలో ఉన్నాం. ఈ సంస్కృతి నేడు నగ్నంగా నర్తిస్తోంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యపై వచ్చిన ఒత్తిడికి గురై ఉన్నప్పుడు, మొదట అతను దళితుడు కాదంటూ దాటవేయాలని చూసి, ఆ మీదట మొత్తం చర్చనంతా కులం మీదకు మరల్చారు. తర్వాత జేఎన్‌యూపై దాడితో చర్చను జాతీయవాదం కొరవడటంపైకి తిప్పారు. వామపక్ష చింతనకు కేంద్రంగా ఉన్న జేఎన్ యూలో గత పలు సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి సంఘాలకు, అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి మితవాద విద్యార్థి సంఘాలకు మధ్య సంఘ ర్షణ పెరుగుతోంది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా విస్పష్ట రాజకీయాలు, భావజాల సంఘర్షణ దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలోకెల్లా నాకు ఇష్టమైన పెద్ద గోడ చిత్రం... అటూ ఇటూ మార్క్స్, లెనిన్‌లూ మధ్య భగత్‌సింగ్ ఉన్నది. అది ఇప్పటికీ అక్కడే ఉన్నా ఎన్నడూ హింసకు దారితీయలేదు. భావజాల ఘర్షణ ఉన్నా ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విద్వద్వంతులను తయారుచేసింది. ఈ మేధోపరమైన, భావజాలపరమైన ఘర్షణా అందుకు కారణమూ అయి ఉండవచ్చు. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడంతో ఏబీవీపీ కూడా కాంగ్రెస్ అంతగానూ అసహనంగా తయారైంది. ప్రధానంగా వామపక్ష భావాల సానుభూతిపరులపట్ల అది అసహనంతో ఉంది. ప్రియుడు కొత్వాలయితే... ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ‘‘వామపక్షీకరణ’’ చెందిన విశ్వవిద్యాలయాలపై ఏబీవీపీ ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటోంది. ‘ప్రియుడు కొత్వాలయితే (పోలీసు కమిషనర్) ఎవరైతే నాకేం లెక్క’ అన్నట్టు (హిందీ మాట్లాడే దేశ ప్రధాన భూభాగంలో ప్రాచుర్యంలో ఉన్న నానుడి) వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోనూ, జేఎన్‌యూలోనూ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ పక్షపాతియైన కొత్వాల్లా వ్యవహరిస్తోంది. ఫలితం ఒక దళిత విద్యార్థి విగత జీవి కావడం, పేద కుటుంబానికి చెందిన మరో విద్యార్థి కటకటాల పాలవడం. ఇంతా జరిగాక ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. మేం గందరగోళపడ్డామంటూ సారీ చెప్పాలి. లేదంటే ఎవరినో తప్పుపట్టి బలిపశువును చేసి, ఇతరుల సంగతి మరచిపోయి కన్హయ్యను విడుదల చేయాలి. అయితే అది హైదరాబాద్ తర్వాత వరుసగా రెండో ఓటమిని అంగీకరించినట్టవుతుంది. లేదంటే, రాజద్రోహ నేరానికి అతనిపై విచారణ జరిపించినట్టయితే ఉదారంగా పెద్ద వివాదాన్ని రాజేసినట్టవుతుంది. మొత్తా నికి కాస్త త్వరగానో లేక ఆలస్యంగానో ఏదో ఒక కోర్టు ఆయన్ను విడుదల చేయక తప్పదు. ప్రత్యేకించి రాజద్రోహ నేరం నిలిచే అవకాశం లేదు. ఏం చేసినా కన్హయ్య పొలిటికల్ స్టార్ అయిపోతాడు. కాబట్టి బీజేపీకి ఎంచుకోవ డానికి ఉన్న అవకాశాలు సరళమైనవే. ఇప్పుడిక వినమ్రంగా తప్పును అంగీకరించి నష్టాలను తగ్గించుకోవడం చేయాలి. లేదా సమర్థించుకోడానికి వీలే లేని దాని కోసం పోరాడి చివరికి అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి లెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. ఓపీ శర్మ లాంటి వాళ్లు విద్యార్థులను చితక బాదుతుంటే, పదవీ విరమణ చేయనున్న పోలీసు బాసులు వారికి రక్షణ కల్పించ నిరాకరించడాన్ని చూస్తుంటే... ఛాంద సులైన మామలు చెప్పినట్టు వినని పిల్లలపై యుద్ధం ప్రకటించినట్టుంది. పెద్దలకు, యువతరానికి మధ్య పోరాటం చివరకు అనివార్యంగా ఎలా ముగుస్తుందో మానవజాతి చరిత్ర బోధిస్తోంది. వాజపేయి అయితే ఏం చేసేవారు? ఒక మంచి ఆలోచన చెబుతా. సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సినది అది. మీరు చేస్తున్న చర్యలను వాజపేయి కొలబద్దతో పరీక్షించి చూసుకోవడం. ఈ పరిస్థితిలో అటల్ బిహారీ వాజపేయి అయితే ఎలా వ్యవహరించి ఉండేవారని యోచించండి. అప్పుడు మీ ముందు ఎంచుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అవి ఆయన వారసుల ప్రభుత్వం అనుసరిస్తున్న వాటికంటే పూర్తిగా భిన్నమైనవై ఉంటాయి. 1997 మొదట్లో, బీజేపీ-అకాలీదళ్ కూటమి అప్పుడే పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది (నేటి బీజేపీ-పీడీపీ కూటమిలాగా అందుకు కూడా నాడు అవకాశం లేదనే అనిపించింది). భింద్రన్‌వాలా అనుకూల అవాంఛ నీయ పరిణామాలు బద్దలై, స్వర్ణ దేవాలయానికీ వ్యాపించాయి. పంజాబ్ ఉగ్రవాదాన్ని సన్నిహితంగా పరిశీలించిన నేను బెంబేలెత్తిపోయాను. నేన ప్పుడు సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఆ పరిణామాలపై తీవ్ర దాడిని ప్రారంభించింది. అప్పటికింకా కేంద్రంలో ప్రతిపక్షంగానే ఉన్న బీజేపీ, అకాలీదళ్‌తో మైత్రిని పునరాలోచించాలని సైతం కోరింది. ఒకరోజు మధ్యాహ్నం, తన నివాసానికి రావాలని వాజపేయి నాకు కబురంపారు. అద్వానీ, మదన్‌లాల్ ఖురానాలు కూడా అక్కడున్నారు. తేనీరు సేవిస్తూ వాజపేయి నాకు ఉపన్యాసం ఇచ్చారు. ‘హిందువులు, సిక్కులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు’ పంజాబ్‌లో గొంతులపైకి కత్తులు దూసుకుంటు న్నారు. సిక్కు మిలిటెంట్లు బీజేపీ నేతలను హతమారుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ చేతులు కలపడం పంజాబ్‌కు, భారత్‌కు మంచిదా, కాదా? పెద్దగా లెక్కచేయాల్సిన అవసరంలేని ఈ చికాకులను మనం విస్మరించాలి. సంపాదకులవారూ, మీరు కాస్త పరిణతి సాధించాలండీ! అన్నారు. ఈ పరిణామాలు అదుపు తప్పిపోతే ఏం జరుగుతుంది? ఆ చికాకులు కలిగిస్తున్న వారు అకాలీల మీద ఆధారపడటం లేదా? అని నేనడిగాను. ఆ విషయాలన్నీ ‘‘ఖురానా జీ చూసుకుంటారు... ఈ సమస్యలను పరిష్కరించగల దృఢ సంకల్పం ఆయనకుంది’’ అని బదులిచ్చారు. ఆయనైతే హైదరాబాద్ ఉదంతంతో ఎలా వ్యవహరించేవారో ఆలోచిం చించి చూడండి. ఆ విశ్వవిద్యాలయం వ్యవహారాలలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏబీవీపీ పక్షం వహించారని గమనిస్తే ఆయన ఆగ్రహించి ఉండేవారు. వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయనే మొట్టమొదట ఆవేదనను, సహానుభూతిని వెల్లడించి ఉండేవారు. ఇక జేఎన్‌యూ విషయం లోనైతే... కుర్రాళ్లను మాట్లడనివ్వండి, వాళ్లే ఎదుగుతారు, రేపు ఐఏఎస్ క్యాడర్లో చేరుతారు అని సరిపెట్టుకునే వైఖరి చేపట్టేవారు. కశ్మీరీ సమస్యపై ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాల ప్రాతిపదికపైనే మాట్లాడుతామని పట్టు బడుతుంటే తాము ఇక చర్చలు ఎలా జరుపుతామని కశ్మీర్ వేర్పాటువాదులు ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. రాజ్యాంగం ఎందుకు, మీతో నేను మానవతావాద ప్రమాణాలతో మాట్లాడు తానని వాజపేయి అన్నారు. సంఘర్షణను పరిష్కరించే వైఖరంటే అదీ. ఇటీవల మనం చూస్తున్నది సంఘర్షణను తెచ్చిపెట్టే వ్యూహాల కోసం సాగిస్తున్న అన్వేషణగానే ఎక్కువగా కనిపిస్తోంది. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
'నా కొడుకు ఉగ్రవాది కాదు.. పాక్ వెళ్లడు'
న్యూఢిల్లీ: తన కుమారుడు ఉగ్రవాది కాదని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న ఉమర్ ఖలీద్ తండ్రి అన్నారు. జేఎన్‌యూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతోపాటు ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలతో పోలీసులు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ మరో 15మంది యువతులపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా కన్హయ్యను అరెస్టు చేయగా ఖలీద్ ఇంకా దొరకలేదు. అతడు ఉగ్రవాదేనని, పాకిస్థాన్‌కు పారిపోయి ఉంటాడని పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖలీద్ తండ్రి స్పందించాడు. 'నా కుమారుడు ఉగ్రవాది కాదు. అతడు అసలు పాకిస్థాన్ వెళ్లనే లేదు. అతడివద్ద పాస్ పోర్ట్ కూడా లేదు. నేను అతడికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడున్నా బయటకు రావాలని.. విచారణ ఎదుర్కోవాలని. నాకు ఈ భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నేను అతడి భద్రత గురించే భయపడుతున్నాను' అని చెప్పాడు. -
‘జేఎన్‌యూ’పై నిరసనల హోరు
ఢిల్లీలో భారీ ర్యాలీ; వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, జర్నలిస్టులు, పౌర సమాజం న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం తీవ్రమవుతోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య అరెస్ట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీసహా పలు నగరాలు, పట్టణాల్లో గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కన్హయ్యకుమార్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టులో నెలకొన్న పరిస్థితి అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి హింసాత్మక ఘటనలపై తమ నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల బృందం గురువారం జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనానికి అందించింది. పటియాలా కోర్టు ఘటనలో పోలీసుల వ్యవహార తీరుపై ఆ బృందంలోని సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పుందని బెయిల్ అభ్యర్థనతో కన్హయ్య సుప్రీంకోర్టు తలుపుతట్టారు. దానిపై నేడు విచారణ జరగనుంది. హెచ్‌సీయూ టు జేఎన్‌యూ రాజద్రోహం కేసులో అరెస్టైన కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా విద్యార్థులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పౌర సమాజం సభ్యులు.. ఢిల్లీలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ‘లాంగ్ లివ్ జేఎన్‌యూ’, ‘కన్హయ్య.. వి ఆర్ విత్ యూ’, ‘హెచ్‌సీయూ టు జేఎన్‌యూ’ అని నినాదాలు చేస్తూ వేలాదిగా నిరసనకారులు మండీ హౌజ్ సర్కిల్ నుంచి జంతర్‌మంతర్ వరకు కదం తొక్కారు. జేఎన్‌యూలో పోలీస్ యాక్షన్‌ను నిరసిస్తూ, మోదీ సర్కారును విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్, ఎన్ఎస్డీ మాజీ డెరైక్టర్ అనురాధా కపూర్ సహా జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, అంబేడ్కర్ వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో పలు వర్సిటీల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతిగా ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఎబీవీపీ కార్యకర్తలు జాతివ్యతిరేకులను శిక్షించాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. చెన్నైలో కన్హయ్యకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన తమిళ జానపద గాయకుడు కోవన్ సహా 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్నాలో బీజేపీ కార్యకర్తలకు, సీపీఐ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, ఆర్జేడీ యువజన విభాగం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ‘పటియాలా’ హింస అసాధారణం పటియాలా హౌజ్ కోర్టులో బుధవారం చోటు చేసుకున్న హింస అసాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై తాము దృష్టి పెట్టామంది. పటియాలా కోర్టులో బుధవారం లాయర్ల రౌడీయిజంపై తాము రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ల కమిటీ సీల్డ్ కవర్లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల ధర్మాసనానికి అందించింది. అయితే, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, హరేన్ రావల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆ నివేదికపై సంతకం చేయగా..నివేదికను చదివిన తరువాతే సంతకం చేస్తానని కమిటీలో సభ్యుడైన ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది అజిత్ కే సిన్హా చెప్పారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కన్హయ్య కేసును కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనుంది. ‘తమ కళ్లముందే దాడి చేసిన వ్యక్తి కనిపిస్తుంటే అరెస్ట్ చేయకుండా వదిలేయడం కుమ్మక్కు కావడం కాదా?’ అని రాజీవ్ ధావన్ మీడియాతో అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైళ్లో ఉన్న కన్హయ్య కుమార్. కాగా, హింసకు పాల్పడిన లాయర్లను గుర్తించి, వారి లెసైన్సులను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే శర్మ అరెస్ట్.. పటియాలా కోర్టులో హింసలో పాలుపంచుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 8 గంటల పాటు ప్రశ్నించి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టులో దాడులకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ సహా ముగ్గురు లాయర్లకు పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ.. వారు గురువారం వరకు పోలీసుల ముందు హాజరుకాలేదు. కాగా, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక హిందీ వార్తాచానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగానే పోలీసులు కన్హయ్యపై కేసు నమోదు చేశారని సమాచారం. రౌడీ లాయర్‌కు సన్మానం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పటియాలా హౌజ్ కోర్టులో విచ్చలవిడి దాడులకు పాల్పడి, స్వేచ్ఛగా తిరుగుతున్న న్యాయవాది విక్రమ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం గురువారం సన్మానించింది. విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రతినిధిగా ఉన్న కర్కర్దూమా కోర్టు బార్ అసోసియేషన్ ఆయనను పూలమాలతో సత్కరించింది. పటియాలా కోర్టులో హింసకు పాల్పడింది తమవారు కాదని, నల్ల కోట్లు వేసుకుని వచ్చిన బయటివ్యక్తులని పేర్కొంది. కొడుకుపై కక్షగట్టారు బిహార్‌లోని బిహత్ గ్రామంలో నివసిస్తున్న కన్హయ్య కుమార్ కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించారు. అయితే, తమకు కల్పించిన భద్రతను కన్హయ్య కుమార్ తండ్రి జైశంకర్ సింగ్ తిరస్కరించారు. జేఎన్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థిని ఓడించినందుకే తన కుమారుడిపై బీజేపీ, ఆరెస్సెస్‌లు కక్షకట్టాయని ఆయన ఆరోపించారు. కన్హయ్యకుమార్ టైస్ట్ కాదని తేలుతుందని, అయితే ఈ లోపే కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కన్హయ్య తల్లి మీనాదేవి ప్రశ్నించారు. కన్హయ్యకు చరిత్రకారుల మద్దతు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరుగుతున్న ఆందోళనలకు చరిత్రకారులు, రచయితలు, కళాకారులు మద్దతు ప్రకటించారు. వర్సిటీ విద్యార్థి నేత కన్హయ్యపై రాజద్రోహం కేసు పెట్టడం అన్యాయమని రోమిలా థాపర్, జీత్ థాయిల్ వంటి ప్రముఖులు విమర్శించారు. విద్యాసంస్థల్లో వివాదాలను చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. కన్హయ్య విడుదలకు డిమాండ్ చేస్తూ.. దాదాపు 9వేల మంది కళాకారులు, చరిత్రకారులు, రచయితలు ఓ పిటిషన్‌పై సంతకం చేశారు. మరోవైపు జేఎన్‌యూలో పోలీసు చర్యను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జితోపాటు యూకేలోని 8 ప్రముఖ వర్సిటీలు ఖండించాయి. జేఎన్‌యూలో ర్యాలీకి పలువురు కన్హయ్య చిత్రం ఉన్న టీ-షర్టులను వేసుకుని వచ్చారు. అటు పటియాలా కోర్టులో ఘర్షణకు దిగిన విక్రమ్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాదిని కొందరు లాయర్లు సన్మానించటాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. కాగాయూట్యూబ్లో జర్మనీకి చెందిన జేఎన్‌యూ విద్యార్థి సిల్వీ గిటారు వాయిస్తూ.. ‘మమ్మల్ని ఎంతగా అణిచేయాలని చూస్తే.. మా గొంతులు అంతలా నినదిస్తాయి. విఆర్ జేఎన్‌యూ’ అని ఆలపించిన గీతం వైరల్‌లా విస్తరించింది. అటు, భారతదేశంలో విషం చిమ్ముతున్న లష్కర్ చీఫ్ హఫీజ్ తోపాటు లష్కరే, జమాత్-ఉద్-దవాకు సంబంధించిన ట్విటర్ అకౌంట్‌ను ఆపేయాలని నిఘా వర్గాలు.. ట్విటర్ ఇండియాను కోరనున్నాయి. -
కన్హయ్య కుమార్ ను రక్షించనున్న అసలు వీడియో
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన వీడియోను ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగానే ఎడిట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆజాది (స్వేచ్ఛ), లేకే రహెంగే ఆజాది’ కుమార్ అన్న పదాలను ఈ ఛానళ్లు వక్రీకరించాయని ఏబీపి న్యూస్ ఛానెల్ వెల్లడించి, అసలు వీడియోను ప్రసారం చేసింది. ‘ఆకలి నుంచి స్వేచ్ఛ (ఆజాది) కావాలి. సంఘ్వాది (ఆరెస్సెస్) నుంచి స్వేచ్ఛ కావాలి. భూస్వామం, పెట్టుబడిదారి విధానం, బ్రాహ్మణిజం, మనుయిజం నుంచి స్వేచ్ఛ కావాలి’ అని కన్హయ్య కుమార్ నినదించినట్లు అసలు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. తొందరపడి ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేసిన నెటిజన్లు కొందరు ఆ వీడియోను తొలగించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన వారిలో స్వరాజ్య కాలమిస్ట్ రూపా సుబ్రమణ్యం కూడా ఉన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులు కన్హయ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇక కుమార్ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తారని మరో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం గురువారం సమర్పించిన నివేదికలో అసలు కన్హయ్య కుమార్ పేరే లేదని తెల్సింది. అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్త ఉమర్ ఖలీద్, మరికొంత మంది సహచరులు కలిసి అఫ్జల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 18 విశ్వ విద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని, కన్హయ్య కుమార్ పేరును మాట మాత్రంగా కూడా ఎక్కడ ప్రస్తావించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కన్హయ్య
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కన్హయ్య కుమార్ తరపున వృందా గ్రోవర్ ఈ పిటిషన్ సమర్పించారు. పటియాలా కోర్టులో పిటిషన్ వేసే పరిస్థితులు లేనందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. ఆర్టికల్ 32 కింద బెయిల్ కోసం కన్హయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. దీనిపై రేపు(శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. కాగా, కన్హయ్య కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే తాము అడ్డుకోబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న ప్రకటించారు. మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కన్హయ్య కుమార్ ను నిన్న తీహార్ జైలుకు తరలించారు. -
కన్హయ్య కుమార్‌పై 'దేశద్రోహం' ఎత్తివేత!
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్పై మోపిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయనపై విధించిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
కోర్టులో లాయర్ల రౌడీయిజం
రణరంగంగా పటియాలా కోర్టు ♦ జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ విచారణ సందర్భంగా విధ్వంసం ♦ విద్యార్థులు, జర్నలిస్టులను వెంటాడి కొట్టిన లాయర్లు ♦ కన్హయ్య కుమార్‌పైనా దాడి ♦ సుప్రీంకోర్టు ప్రతినిధులపైనా దాడి ♦ కన్హయ్యకు మార్చి 2దాకా రిమాండ్ న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో లాయర్లు మరోసారి రెచ్చిపోయారు. నల్లకోట్లు ధరించి మరీ గూండాల్లా వ్యవహరించారు. కోర్టు ప్రాంగణంలోనే గుంపులుగా తిరగుతూ జేఎన్‌యూ విద్యార్థులు, లెక్చరర్లు, జర్నలిస్టులు, ప్రత్యర్థి లాయర్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రాజద్రోహం కేసులో విచారణకు హాజరవుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌పైనా చేయి చేసుకున్నారు. దాంతో, ఆయన ముఖం, కాళ్లపై చిన్న గాయాలయ్యాయి. కోర్టు ఆవరణలో శాంతిభద్రతలు నెలకొల్పాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. బుధవారం పటియాలా కోర్టును రణరంగంగా మార్చారు. సుప్రీం కోర్టు పంపించిన సీనియర్ లాయర్లపై పూల కుండీలు, నీళ్ల సీసాలు విసిరారు. పోలీసులు మళ్లీ ప్రేక్షక పాత్రే పోషించారు. విచారణ అనంతరం కన్హయ్యకుమార్‌ను మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ తీర్పునిచ్చారు. సోమవారం దాడి చేసిన వారే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కోర్టు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో విచారణ నిమిత్తం పటియాలా కోర్టులో బుధవారం ఆయనను హాజరు పర్చారు. రెండు రోజుల క్రితం పటియాలా కోర్టులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, కోర్టు ప్రాంగణంలో శాంతి నెలకొనేలా చూడాలంటూ బుధవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దాంతో పెద్ద ఎత్తున కోర్టు వద్ద పోలీసులను మోహరించారు. అయినా, కొందరు లాయర్లు ర్యాలీగా కోర్టు వద్దకు వచ్చి, కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకురాగలిగారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, వందేమాతరం, జై భారతమాత అని నినాదాలు చేస్తూ.. దాడులకు దిగారు. సోమవారం నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన లాయర్ విక్రమ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని లాయర్ల బృందం బుధవారం నాటి దాడుల్లో కూడా క్రియాశీలంగా కనిపించింది. కన్హయ్యకు అనుకూలంగా తమతో వాదనకు దిగిన లాయర్లపైనా వీరు దాడి చేశారు. జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ దాడులను చిత్రిస్తున్న మీడియా ప్రతినిధులనూ వదల్లేదు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను లాక్కొని, అందులోని వీడియోలను తొలగించి, ఆ ఫోన్లను నాశనం చేశారు. కెమెరామెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఇంతలో, కన్హయ్యకుమార్‌ను తీసుకువస్తున్న పోలీసు వాహనం కోర్టు ప్రాంగణంలోకి రావడంతో, అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న లాయర్ల బృందం కన్హయ్య కుమార్‌పై దాడికి తెగబడింది. కోర్టు ప్రాంగణంలో, కోర్టు హాలు వెలుపల రెండుసార్లు ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ సమక్షంలో కన్హయ్యకుమార్పై విచారణ జరి గింది. కోర్టుహాల్లోకి కేవలం ఆరుగురు లాయర్లు, ఒక జేఎన్‌యూ ప్రొఫెసర్, ఐదుగురు జర్నలిస్టులను మాత్రం అనుమతించారు. ఈ సందర్భంగా, తాను నూరుశాతం భారతీయుడినని, రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై తనకు గౌరవముందని కన్హయ్య కోర్టుకు తెలిపాడు. ‘నాపై మీడియా చేస్తున్న విచారణ బాధాకరం. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. లేదంటే, ఈ మీడియా విచారణను ఆపేయండి’ అన్నారు. కోర్టులో తనపై జరిగిన దాడిని కన్హయ్యకుమార్ మెజిస్ట్రేట్‌కు వివరించారు. దాంతో, పటిష్ట భద్రత మధ్య ఆయనను తీహార్ జైలుకు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించా రు. వెలుపల లాయర్లు పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో.. విచారణ తర్వాతమరో 3 గంటల పాటు కన్హయ్యకుమార్ కోర్టుహాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ పోలీసుల వైఫల్యం పటియాలా కోర్టు ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది. దీనికి కేవలం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీనే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కఠినంగా వ్యాఖ్యానించింది. బుధవారం ఉదయమే పటియాలా కోర్టులో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలంటూ సుప్రీం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు సరిగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు పటియాలా కోర్టుకు వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కొద్ది గంటల తరువాత, ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ పటియాలా కోర్టులో చోటు చేసుకున్న దాడులను తమ దృష్టికి తీసుకురాగా వెంటనే కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే తదితర ఆరుగురు సీనియర్ లాయర్ల బృందాన్ని సుప్రీంకోర్టు పటియాలా కోర్టుకు పంపించింది. వారికీ స్థానిక లాయర్లు దూషణలతో స్వాగతం పలికారు. వారిపైకి నీళ్ల సీసాలను, పూల కుండీలను విసిరారు. అనంతరం, ఆ బృందం తమ నివేదికను సుప్రీంకోర్టుకు మౌఖికంగా అందించింది. కోర్టుహాల్లో కూడా ఒక వ్యక్తి కన్హయ్యకుమార్పై దాడి చేశాడని, కన్హయ్య ఆ వ్యక్తిని గుర్తించినప్పటికీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదన్నారు. ఈ వివరాలను గురువారం మధ్యాహ్నం లిఖితపూర్వకంగా అందించాలని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం వారిని కోరింది. ఢిల్లీ పోలీసుల తరఫు వివరణను గురువారం ఉదయం అందించాలని ఢిల్లీ పోలీస్‌లను ఆదేశించింది. కాగా, కన్హయ్యకు అనుకూలంగా జేఎన్‌యూ లోని ముగ్గురు ఏబీవీపీ సభ్యులు సంస్థకు రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ వర్సిటీలో అఫ్జల్ అనుకూల, వ్యతిరేక (ఏబీవీపీ) వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది వలస పాలన చీకటి యుగానికి నకలు చామ్స్కీ, పాముక్ సహా మేధావుల ఖండన న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ అరెస్ట్‌పై వెల్లువెత్తిన నిరసనతో.. విఖ్యాత మేధావి నోమ్ చామ్స్కీ, నోబెల్ బహుమతి గ్రహీత ఓర్హాన్ పాముక్ సహా ప్రపంచ వ్యాప్తం గా శాస్త్రవేత్తలు, రచయితలు గళం కలిపారు. విదేశాల్లోని ప్రముఖ వర్సిటీలకు చెందిన 86 మంది విద్యావేత్తలు.. ‘భారత్‌లో ప్రస్తుత ప్రభుత్వం సృష్టించిన అధికార దురహంకార సంస్కృతి’ని ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. అధికారంలో ఉన్నవారు అణచివేతపూరిత వలసరాజ్య కాలం నాటి, 70ల మధ్యలోని అత్యవసర పరిస్థితి కాలం నాటి చీకటి యుగానికి నకలును తీసుకొస్తున్నారని తప్పుపట్టారు. ‘భారతదేశ వలస పాలకులు రూపొందించిన దేశద్రోహ చట్టాలను విధించి.. జేఎన్ యూ క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించాలని ఆదేశించి, విద్యార్థి నేతను..హింసను ప్రేరేపించారన్న అభియోగంపై ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన సిగ్గుచేటయిన చర్య గురించి తెలుసుకున్నాం’ అని ధ్వజమెత్తారు. కన్హయ్యపై దాడి జరగలేదు కన్హయ్యకుమార్పై దాడి జరగనేలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ‘ఆయనపై దాడి జరగలేదు. కాస్త తోపులాట జరిగింది. అంతే. పరిస్థితిని పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. లాయర్లకు వ్యతిరేకంగా బలగాలను మోహరిస్తే పరిస్థితి మరింత దారుణమయ్యేది’అన్నారు. కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలున్నాయన్నారు. ఆయనకు క్లీన్ చిట్ లభించే ప్రశ్నేలేదన్నారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలోకి ఇతరులూ ప్రవేశించారని, మొత్తం ఘటనకు బాధ్యుడిని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ‘దేవుడా.. నీ ప్రపంచం ఎలా అయిపోయిందో చూడు.. మనిషిఎంతగా మారి పోయాడో చూడు’ అనే కవిత గుర్తొస్తోందని బస్సీ వ్యాఖ్యానించారు. కన్హయ్యకు కోర్టు బెయి ల్ ఇవ్వాలనుకుంటే అభ్యంతరం తెలపబోమన్నారు. కాగా, పటియాలాకోర్టు ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీ పోలీసులను నివేదిక కోరింది. జేఎన్‌యూలో పోలీసు చర్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు, జేఎన్‌యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
'నా ప్రాణానికి ముప్పు.. జైల్లో పెట్టండి'
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు పొంచివుందని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన కుమార్ పై న్యాయవాదులు దాడి చేశారు. తనపై దాడి చేసిన లాయర్లను న్యాయస్థానంలో అతడు గుర్తించాడు. దేశ సమగ్రతపై తనకు నమ్మకం ఉందని కుమార్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశాడు. అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కుమార్ కు కోర్టు మార్చి 2 వరకు కస్టడీ విధించడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. పటియాలా కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాత్రి 7 గంటలకు అతడిని జైలుకు తీసుకెళ్లారు. తీహార్ జైల్లో అతడికి 3వ నంబర్ సెల్ కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరామని ట్విటర్ ద్వారా తెలిపారు. పటియాలా కోర్టులో చోటుచేసుకున్న ఘటనలపై మరోసారి నివేదిక కోరానని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. -
'షూట్ చేయండి... ఉరి తీయండి'
న్యూఢిల్లీ: 'అతడిపై మేము దాడికి పాల్పడ్డాం' అని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై దాడిని చేసిన లాయర్లు గర్వంగా ప్రకటించుకున్నారు. రాజద్రోహం కేసు విచారణ కోసం బుధవారం పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చిన కన్హయ్యపై న్యాయవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మంది లాయర్లు అతడిని చుట్టుముట్టి నినాదాలు చేశారు. 'అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అక్కడితో ఆగకుండా అతడిపై దాడికి ప్రయత్నించారు. 'మా పని పూర్తయింది' అంటూ దాడి చేసిన లాయర్లు వ్యాఖ్యానించారు. న్యాయవాదుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులపై సోమవారం దాడి చేసిన న్యాయవాదుల్లో చాలా మంది ఈ రోజు దాడి చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. లాయర్ల దాడిలో కన్హయ్య కుమార్(28)కు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో శాంతి భద్రతలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆరుగురు ప్రముఖ లాయర్లతో కూడిన బృందాన్ని పటియాలా కోర్టుకు పంపించింది. -
కన్హయ్యకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : జెఎన్యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ జ్యూడీషియల్ కస్టడీ మార్చి 2వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. కాగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన కన్హయ్య కుమార్ రిమాండ్ నేటితో ముగియటంతో అతడిని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు న్యాయవాదులు అతడిపై దాడికి దిగారు. అతన్ని చుట్టుముట్టిన పలువురు న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించారు. లాయర్ల బారి నుంచి అతడిని తప్పించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. పాటియాల హౌస్ కోర్టులో తాజా ఘటనలపై విచారణ పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా అంతకు ముందు జెఎన్యూ విద్యార్థులకు, న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి దాడికి దిగారు. ఈ ఘటనలో విద్యార్థులతో పాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డాడు. -
కొత్త వివాదంలోకి జేఎన్‌యూ వీసీ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయగా.. అసలు పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. వైస్ ఛాన్సలర్ ఎం జగదీశ్ కుమారే స్వయంగా పోలీసులను ఆహ్వానించాడని, వారిని క్యాంపస్ లోకి అనుమతించాడని తాజాగా ఓ లేఖ బయటపడింది. అయితే, అంతకుముందు వీసీ కుమార్ మాట్లాడుతూ అసలు తాను పోలీసులకు అనుమతి ఇవ్వనే లేదని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ స్వయంగా ఆయనే పోలీసులకు రాసినట్లు తాజాగా బయటపడటం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. వీసీ ఏవో నిజాలు దాచిపెడుతున్నారని యూనివర్సిటీలోని పలువురు విద్యార్థినాయకులు, నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్‌లలో కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నెల 9న క్యాంపస్‌లోకి పోలీసులకు అనుమతిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖ ఒకటి తాజాగా బయటపడింది. ఆరోజే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
విద్యార్థికి దేశద్రోహం కింద శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ : దేశద్రోహం అభియోగంపై భారతీయ శిక్షాస్మృతిలోని 124 ఏ సెక్షన్ కింద జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్, మరి కొందరిపై దాఖలు చేసిన కేసు న్యాయస్థానం ముందు నిలబడుతుందా? నిజంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లయితే ఈ కేసులో వారికి శిక్ష పడుతుందా? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నినాదాలు చేసినంత మాత్రాన ఏ వ్యక్తిని దేశద్రోహిగా శిక్షించలేమని, సదరు వ్యక్తి ఉద్రోకపూరిత లేదా కవ్వింపు ప్రసంగాల పర్యవసానంగా దేశంలో తీవ్ర స్థాయిలో అలజడి రేగినా, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నా దేశ ద్రోహం నేరం కింద శిక్షించవచ్చని భారత సుప్రీం కోర్టు పలు కేసుల్లో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌యూలో అఫ్జల్ గురు పేరిట జరిగిన కార్యక్రమంలో కొంత మంది విద్యార్థులు భారతకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, ప్రసంగించినా పర్యవసానంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు జరిగాయే తప్ప, హింసాత్మక సంఘటనలు ఏమీ జరగలేదు. పాటియాల కోర్టులో జరిగిన దాడి సంఘటన కూడా కన్హయ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిందే తప్ప ఆయన అనుకూలురుగానీ మద్దతుదారులుగానీ దాడికి పాల్పడలేదు. ‘ఖలిస్తాన్ జిందాబాద్, రాజ్ కరేగా ఖల్సా’ నినాదాలు ఇచ్చారంటూ బల్వంత్ సింగ్‌పై 124 ఏ సెక్షన్ కింద పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేదార్నాథ్ సింగ్ కేసులో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. దేశానికి వ్యతిరేకంగా కేదార్నాథ్ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఎలాంటి కల్లోల పరిస్థితులు ఏర్పడలేదని, అందుకని ఆయన్ని ఈ నేరం కింద శిక్షించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ‘ఇంద్రదాస్ వర్సెస్ అస్సాం, అరూప్ భుయాన్ వర్సెస్ అస్సాం’....‘శ్రేయ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’...మధ్య నడిచిన దేశద్రోహం కేసుల్లో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ భావాజాలాన్ని ప్రచారం చేయడం నేరంకాదని, ఆ ప్రచారం పర్యవసానంగా దేశంలో తిరుగుబాటు తలెత్తి. అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే దేశద్రోహం కింద శిక్షించవచ్చని సుప్రీం కోర్టు నక్సల్స్‌పై దాఖలైన దేశద్రోహం కేసుల్లో తీర్పు చెప్పింది. కొంత మంది నక్సల్స్‌గా భావిస్తున్న వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నితే ప్రభుత్వం కూలిపోతుందా ? అలాంటి బలహీన ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విరసం సభ్యులపై దాఖలైన దేశద్రోహం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జేఎన్‌యూ క్యాంపస్ లోపల దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే దేశద్రోహం కింద కేసు దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమో! ఆలోచించాలి. దేశద్రోహం పేరిట భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించాలనుకోవడం సమంజసం కాదు. ఈ విషయంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌కన్నా అమెరికానే బెటర్. కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1940 దశకంలో అమెరికా దేశద్రోహం చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ప్రయోగించడంతో గొడవలు పెరుగుతుండడంతో 1963 నుంచి ఇంతవరకు ఒక్క కేసును కూడా ఆ చట్టం కింద నమోదు చేయలేదు. -
విజయవాడలో విద్యార్థుల ధర్నా
కృష్ణాజిల్లా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో మంగళవారం విద్యార్ధులు ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, బీజేపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మతోన్మాదుల అరాచకాలు అరికట్టాలని, రోహిత్ చట్టాన్ని చేయాలనీ, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్ధి నాయకులు కోరారు. -
'విద్యార్థి సంఘం నేతను విడుదల చేయండి'
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఏఐఎస్ఎఫ్ నాయకుడు కన్హయ్యకుమార్పై పెట్టిన కేసులు ఉపసంహరించి, అతణ్ని వెంటనే విడుదల చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతో పాటు జేడీయూ నేత త్యాగి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై జేఎన్‌యూ వివాదంపై చర్చించారు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కన్హయ్యకుమార్‌ను విడుదల చేయాలని రాజ్‌నాథ్‌ను కోరారు. అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఏఐఎస్ఎఫ్ నేతను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డవారిని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరితీతను తప్పుబడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారనే ఫిర్యాదు మేరకు కన్హయ్యకుమార్పై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో 8 మంది విద్యార్థులను జేఎన్‌యూ బహిష్కరించింది.