
లక్నో: కాంగ్రెస్ నేత కన్నయ్యకుమార్‌పై ఒకరు రసాయనాలతో దాడికి యత్నించారు. లక్నోలోని యూపీసీసీ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని పార్టీ ఆఫీసు బేరర్లు పట్టుకొన్నారని చెప్పాయి. పార్టీ నిర్వహించే యువ సంసద్‌లో ప్రసంగించేందుకు కన్నయ్య లక్నో వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని దేవాంశ్ బాజ్‌పాయ్‌గా గుర్తించారు. దాడికి కారణాలు తెలియరాలేదు. గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న కన్నయ్య తొలుత కమ్యూనిస్టు పార్టీలో చేరి అనంతరం కాంగ్రెస్‌లోకి మారారు.
Comments
Please login to add a commentAdd a comment