విశాఖలో దారుణం.. అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్‌ దాడి! | Acid Attack On Anganwadi Teacher At Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్‌ దాడి!

Published Wed, Dec 4 2024 1:08 PM | Last Updated on Wed, Dec 4 2024 1:22 PM

Acid Attack On Anganwadi Teacher At Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement